క్యాన్సర్ బీమా
 • అగ్ర బీమా సంస్థల నుండి ఉత్తమ ప్రణాళికలు
 • పోల్చండి & తక్షణమే కొనండి
 • 80 డి కింద పన్ను ప్రయోజనాలు
PX step

ఆరోగ్య బీమా కొటేషన్లను ఆన్లైన్లో పోల్చుకోండి

1

2

పేరు
కవరేజీ
పుట్టినరోజు (పెద్ద సభ్యుడి)

1

2

ఫోన్ నం.
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మరణాలకు ప్రధాన కారణం క్యాన్సర్. ఇది మానసికంగానే కాకుండా ఆర్థికంగా కూడా దెబ్బతీస్తుంది. క్యాన్సర్ రోగులకు పూర్తి సహకారం అందించడానికి భారతదేశంలో ఆరోగ్య బీమా సంస్థలు క్యాన్సర్ బీమా పథకాలను అందిస్తున్నాయి. క్యాన్సర్ బీమా పథకం ఆసుపత్రిలో చేరడం, కిమోథెరప్పీ, శస్త్రచికిత్స, రేడియోషన్ వంటి క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన అనేక రకాల ఖర్చులకు కవరేజీ అందిస్తుంది. పాలసీదారునికి రోగ నిర్థారణ యొక్క వివిధ దశలలో (మైనర్, మేజర్ మరియు క్రిటికల్) కవరేజీని అందిస్తుంది.

క్యాన్సర్ బీమా పాలసీ యొక్క ప్రాముఖ్యత

క్యాన్సర్ వ్యాధికి నిరంతర పర్యవేక్షణ అవసరం. దీనికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ఈ బిల్లులు చెల్లించడానికి మీకు ఒక క్యాన్సర్ బీమా పథకం అవసరం ఎంతైనా ఉంది. ఈ బీమా పథకం వలన ఆర్థిక పరిపుష్టి అందించడమే కాకుండా రేడియోథెరప్పీ మరియు అన్ని శస్త్రచికిత్సల బిల్లులకు కవరేజీ అందిస్తుంది. క్యాన్సర్ బీమా పథకాలు విస్తృతమైన వైద్య సదుపాయాలతో సహా సమగ్ర కవరేజీని అందిస్తాయి.

మీకు క్యాన్సర్ బీమా పథకం ఎందుకు అవసరం?

కింది అంశాలలో క్యాన్సర్ బీమా మీకు చాలా అవసరం-

 • కుటుంబ క్యాన్సర్ వ్యాధి చరిత్రను కలిగి ఉంటే.
 • ఊహించని వైద్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి మీ వద్ద తగినన్ని నిధులు లేనప్పుడు.
 • కుటుంబంలో మీరు మాత్రమే సంపాదించే సభ్యులు అయిన సందర్భంలో
 • మీ సాధారణ ఆరోగ్య బీమా పథకం అవసరమైన కవరేజీని అందించడానికి సరిపోని సందర్భంలో.

క్యాన్సర్ బీమా కోసం మీకు ఎంత కవర్ అవసరం?

రికవరీ, మందులు, ఆసుపత్రిలో చేరడం, అదనపు జీవన వ్యయాలు, మరియు రోగనిర్థారణ పరీక్షలు కలిగి ఉన్న చికిత్సల యొక్క భవిష్యత్ ఖర్చులకు కవరేజీ అందించేలా క్యాన్సర్ బీమా పథకం ఉండాలి. మీ అవసరాలకు అనుగుణంగా ఒక అంచనాను లెక్కించండి మరియు తదనుగుణంగా పెట్టుబడి పెట్టండి.

నాకు ఇప్పటికే ఆరోగ్య బీమా ఉంటే, నిర్దిష్ట క్యాన్సర్ బీమా పథకం అవసరమా?

ఒక వ్యక్తికి ఇప్పటికే ఆరోగ్య బీమా ప్లాన్ ఉంటే, క్యాన్సర్ బీమా లో కూడా కొనుగోలు చేస్తే మంచిది. దీనికి కారణం సాధారణ ఆరోగ్య బీమా పథకం క్యాన్సర్ చికిత్సకు పరిమిత కవరేజీని మాత్రమే అందిస్తుంది. ఎందుకంటే ఇది యాంటికల్ అనారోగ్యం పరిధిలోకి వస్తుంది.

తీవ్రమైన అనారోగ్య పథకం ఒకే మొత్తంలో ప్రయోజనం అందిస్తుంది మరియు భవిష్యత్ ప్రీమియంలను రద్దు చేయదు. ప్రత్యేకమైన క్యాన్సర్ బీమా పథకం చికిత్సకు సమగ్ర కవరేజీ అందించడమే కాకుండా, భవిష్యత్ ప్రీమియం మాఫీ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా సాధారణ ఆరోగ్య బీమా పథకం క్యాన్సర్ యొక్క అన్ని దశలలో అవసరమైన కవరేజీని అందించదు.

వివిధ రకాల క్యాన్సర్ బీమా పథకాలు ఏమిటి?

అనేక సంస్థలు క్యాన్సర్ బీమా పథకాలను అందిస్తున్నాయి. ఇవి మీ క్యాన్సర్ చికిత్స ఖర్చులకు కవరేజీ అందిస్తుంది. వివిధ రకాల క్యాన్సర్ బీమా పథకాల గురించి కింద వివరించడం జరిగింది.

కడుపు క్యాన్సర్

 • ఊపిరితిత్తుల క్యాన్సర్
 • రొమ్ము క్యాన్సర్
 • హైపో సర్వపేటిక క్యాన్సర్
 • అండాశయ క్యాన్సర్

క్యాన్సర్ బీమా యొక్క ప్రయోజనాలు ఏమిటి?

పన్ను ప్రయోజనాలు

ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80 డి కింద రూ. 25 వేల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందవచ్చు.

నగదు రహిత చికిత్స

క్యాన్సర్ బీమా కింద పాలసీదారు నెట్ వర్క్ ఆసుపత్రిలో నగదు రహిత చికిత్సను పొందవచ్చు. ఇందుకోసం నాణ్యమైన చికిత్స కోసం మీరు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

రాయితీ

 వినియోగదారులకు సౌలభ్యం కల్పించడానికి అనేక రాయితీలు మరియు అదనపు ప్రయోజనాలను క్యాన్సర్ బీమా పథకాలు అందిస్తున్నాయి.

ఆరోగ్య పరీక్షలు

మీరు ఎంచుకున్న క్యాన్సర్ బీమా కవరేజీని బట్టి మీరు ప్రీమియం ఫెసిలిటీగా వార్షిక మాస్టర్ చెక్ అప్ పొందవచ్చు.

ఒకే మొత్తం

ఇది క్యాన్సర్ యొక్క వివిధ దశలకు కవరేజీని అందిస్తుంది. రోగ నిర్థారణ నివేదిక ఆధారంగా పాలసీదారుడు ఒకే మొత్తాన్ని పొందవచ్చు. పాలసీదారుడు సంవత్సరంలోపు ఎలాంటి క్లెయిమ్ సద్వినియోగం చేసుకోకపోతే బీమా మొత్తం పేర్కొన్న శాతం పెరుగుతుంది.

ఆటో రెన్యూవల్

క్యాన్సర్ పథకాలు ఎక్కువగా ఆటో-పునరుద్దరణకు లోబడి ఉంటాయి. ఈ పథకాలు దీర్ఘకాల కవరేజీ అందిస్తాయి.

ఆన్ లైన్ అప్లికేషన్

మీరు క్యాన్సర్ బీమా పథకంలో సాధారణ ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఆన్ లైన్ ద్వారా బీమా కొనుగోలు చేయడానికి మీకు 5 నిమిషాల సమయం కూడా పట్టదు

భారతదేశంలో ఉత్తమ క్యాన్సర్ ఇన్సూరెన్స్ ప్లాన్స్

సంస్థ

ప్లాన్

ప్రవేశ వయసు

మెచ్యూరిటీ వయసు

బీమా మొత్తం

ఎల్ఐసి ఆఫ్ ఇండియా

ఎల్ఐసి క్యాన్సర్ కవర్

20-65 సంవత్సరాలు

50-75 సంవత్సరాలు

10 నుంచి 50 లక్షలు

మాక్స్ లైఫ్

మాక్స్ లైఫ్ క్యాన్సర్ ఇన్సూరెన్స్

25-65 సంవత్సరాలు

75 సంవత్సరాలు(గరిష్టంగా)

10 నుంచి 50 లక్షలు

హెచ్ డి ఎఫ్ సి లైఫ్ ఇన్సూరెన్స్

హెచ్ డి ఎఫ్ సి క్యాన్సర్ కేర్

5-65 సంవత్సరాలు

లభ్యత లేదు

10 నుంచి 50 లక్షలు

ఎస్‌బీఐ లైఫ్

ఎస్‌బీఐ సంపూర్ణ సురక్షా

6-65 సంవత్సరాలు

75 సంవత్సరాలు(గరిష్టంగా)

10 నుంచి 50 లక్షలు

ఐసిఐసిఐ లైఫ్ ప్రుడెన్షియల్

ఐసిఐసిఐ ప్రు హార్ట్ క్యాన్సర్ ఇన్సూరెన్స్

18-65 సంవత్సరాలు

23-75 సంవత్సరాలు

2 నుంచి 50 లక్షలు

క్యాన్సర్ బీమా కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

క్యాన్సర్ బీమా పాలసీ కొనుగోలు చేసేటప్పుడు మీరు పరిగణించాల్సిన కొన్ని విషయాలు కింద ఉన్నాయి-

 1. మీ బీమా పథకం క్యాన్సర్ యొక్క అన్ని దశలకు కవరేజీ అందిస్తుందని నిర్ధారించుకోండి. క్యాన్సర్ బీమా పథకంలో ఎక్కువ భాగం క్యాన్సర్ ప్రారంభ దశలో 30 శాతం చెల్లింపు మరియు 70 శాతం చెల్లింపును ప్రధాన దశలో అందిస్తుంది.
 2. క్యాన్సర్ చికిత్స ఖర్చులు రోజు రోజుకు పెరుగుతునందున అధిక మొత్తంలో బీమా ఎంపికను ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల చికిత్స సమయంలో మీకు తగినంత కవరేజీ అందిస్తుంది.
 3. ఎక్కువ కాలం కవరేజీని కలిగి ఉన్న క్యాన్సర్ పథకాన్ని ఎంచుకునేలా చూసుకోండి.
 4. మీ సౌలభ్యం ప్రకారం ప్రీమియం చెల్లింపు ఎంపికను అందించే పథకాన్ని ఎంచుకోండి.
 5. అందుబాటులో ఉన్న క్యాన్సర్ బీమా పథకాలను సరిపోల్చండి మరియు ఉత్తమమైన పథకాన్ని ఎంచుకోండి.

ఆన్ లైన్ లో క్యాన్సర్ బీమాను ఎలా కొనుగోలు చేయాలి?

క్యాన్సర్ బీమా పథకంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ PolicyX.com వంటి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ద్వారా పెట్టుబడి పెట్టడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. వివిధ బీమా సంస్థల నుంచి బహుళ క్యాన్సర్ బీమా పథకాలను ఒకే పేజీలో పోల్చడానికి పోర్టల్ మిమ్మల్ని అనుమతిస్తుంది.

 • క్యాన్సర్ బీమా పథకాన్ని కొనడానికి సాధారణ ప్రక్రియ క్రింద పేర్కొనబడింది.
 • ఈ పేజీ యొక్క కుడి-ఎగువ మూలలో ఇవ్వబడిన అగ్ర శ్రేణి సంస్థల నుంచి ఉచిత కోట్స్ పొందండి అనే విభాగానికి స్క్రోల్ చేయండి.
 • పుట్టిన తేదీ, వార్షిక ఆదాయం, లింగం వంటి ప్రాథమిక వివరాలు అందించండి.
 • కొనసాగించు ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • భారతదేశంలోని అగ్ర బీమా సంస్థల నుంచి అందుబాటులో ఉన్న కోట్లను తనిఖీ చేయండి.
 • కావాల్సిన ప్లాన్ ను ఎంచుకున్న తర్వాత ఈ ప్లాన్ కొనుగోలు చేయండి అనే ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • తర్వాత కొనసాగండి ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సమర్పించు ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • ఇది సంస్థ యొక్క అధికారిక పేజీలోకి తీసుకెళుతుంది.
 • అందుబాటులో ఉన్న చెల్లింపు ఎంపికలను ఉపయోగించి చెల్లింపు చేయండి.
 • మీ రిజిస్ట్రర్డ్ ఈ-మెయిల్ కు పాలసీ పత్రాలు పంపబడతాయి.

క్యాన్సర్ బీమా క్లెయిమ్ ను ఎలా దాఖలు చేయాలి?

క్లెయిమ్ దాఖలు చేయడానికి దశ వారీ ప్రక్రియ కింద వివరించబడింది.

క్లెయిమ్ సమాచారం తెలియజేయాలి

క్లెయిమ్ సమాచారాన్ని మీరు ముందుగా బీమా సంస్థకు తెలియజేయాలి. మెయిల్, కాల్, సందేశం వంటి విధానాల ద్వారా క్లెయిమ్ గురించి సంస్థకు తెలియజేయవచ్చు. హక్కుదారు బీమా సంస్థ శాఖను కూడా వ్యక్తిగతంగా సందర్శించవచ్చు.

క్లెయిమ్ ప్రాసెసింగ్

మీ నుంచి క్లెయిమ్ ఫారం మరియు సంబంధిత పత్రాలు పొందిన తరువాత, బీమా సంస్థ అన్ని వివరాలను ధృవీకరిస్తుంది మరియు క్లెయిమ్ చేయడానికి అర్హత ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తుంది. క్లెయిమ్ దాఖలు చేయడానికి అవసరమైన పత్రాల జాబితా కింద ఇవ్వబడింది.

సెటిల్‌మెంట్

అన్ని పత్రాల పరిశీలన తరువాత బీమా సంస్థ క్లెయిమ్ దరఖాస్తును అంగీకరిస్తుంది లేదా తిరస్కరిస్తుంది. నెట్ వర్క్ ఆసుపత్రిలో నగదు రహిత చికిత్స పొందవచ్చు లేదా రీయింబర్స్ మెంట్ విధానంలో సంస్థకు క్లెయిమ్ దాఖలు చేయవచ్చు.

అవసరమైన పత్రాలు

 • గుర్తింపు రుజువు
 • వయసు ధృవీకరణ పత్రం
 • వ్యాధి మరియు చికిత్స యొక్క దశను సూచించే వైద్య మరియు విశ్లేషణ పరీక్షల నివేదికలు
 • క్లెయిమ్ ప్రాసెస్ చేసేటప్పుడు బీమా సంస్థ కోరిన ఇతర పత్రాలు.