కారు బీమా
 • చౌకైన కారు బీమా కొనండి
 • కారు భీమాను ఆన్‌లైన్‌లో పునరుద్ధరించండి
 • మూడవ పార్టీ మరియు యాడ్-ఆన్ కవర్
PX step

కారు బీమా కొటేషన్లను ఆన్లైన్లో పోల్చుకోండి

లేదా

కారు బీమా అనేది, బీమా చేయబడిన వాహనానికి అవసరమైన సమయంలో ఆర్థిక సహాయాన్ని అందించే బీమా పాలసీ. కారు బీమా పాలసీ సహాయంతో మీ కారుకు ఏదైనా ప్రమాదం, దొంగతనం, అగ్ని, పేలుడు, ప్రమాదవశాత్తు కాలిపోవడం, పిడుగుపాటుకు గురికావడం, అల్లర్లు, సమ్మెలు, ఉగ్రవాద చర్యలు, ప్రకృతి వైపరీత్యాలు (భూకంపాలు, వరదలు మొదలైనవి) వల్ల నష్టం కలిగితే అందుకు సంబంధించిన ఆర్థిక సహాయం లభిస్తుంది. అలాగే రైలు/రహదారి/వాయు మార్గాలు లేదా ఎలివేటర్ల ద్వారా మీ వాహనాన్ని రవాణా చేసినప్పుడు వాహనానికి ఏదైనా నష్టం కలిగితే అందుకు సంబంధించిన ఆర్థిక సహాయం కూడా పాలసీదారునికి లభిస్తుంది.

కారు బీమా యొక్క ప్రాముఖ్యత

భారతదేశంలో ప్రతి గంటకు సుమారు 55 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక వేళ మీ కారు ప్రమాదానికి గురై పాడై మరమ్మత్తు చేయించాల్సి రావచ్చు. ఖర్చు ఎక్కువగా ఉండటం వలన, మీరు కారు మరమ్మత్తును సకాలంలో చేయించుకోలేకపోతే ఎలా? ఆ నష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇక్కడే ఒక సమర్థవంతమైన కారు బీమా పాలసీ ఉపయోగపడుతుంది. కారు బీమా పాలసీ కింద అప్పటికే బీమా చేయించుకున్న వారు, సహాయం కోసం తమ బీమా సంస్థ వద్దకు వెళ్లి, మరమ్మతులను సకాలంలో పూర్తి చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ బాధ్యత విషయంలో కూడా మీకు కారు బీమా పాలసీ ఉంటే, ఎటువంటి ఇబ్బందులు లేకుండా బీమా సంస్థ థర్డ్ పార్టీ బాధ్యత చూసుకుంటుంది. అయితే, మీ వాహనానికి బీమా చేయకపోతే, మీ వాహన మరమ్మత్తుతో పాటు థర్డ్ పార్టీ నష్టాలకు మీరే సొంతంగా సొమ్ము చెల్లించుకోవాల్సి ఉంటుంది. 

ప్రమాదం వలన జరిగిన నష్టానికి మరియు ప్రమాదంలో గాయపడితే వైద్య చికిత్సలకు ఖర్చు మాత్రమే కాక, వాహనాన్ని నడుపుతున్నవారు కొన్ని తీవ్రమైన చట్టపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకోసమే, భారత చట్టాల ప్రకారం చెల్లుబాటు అయ్యే ఒక కారు బీమాను తప్పనిసరిగా తీసుకోవాలి. భారతదేశంలో, మోటారు వాహనాల చట్టం, 1988 లోని చాప్టర్ 11 (సెక్షన్ 145 నుండి 164) ప్రకారం, కనీసం ఒక థర్డ్ పార్టీ బీమాను తప్పనిసరిగా తీసుకొని ఉండాలి.

ఇటీవల, భారత ప్రభుత్వం సురక్షితమైన ప్రయాణానికి సంబంధించిన ఉల్లంఘనలను అరికట్టడానికి అనేక నిబంధనలను రూపొందించి ఈ నిబంధనల ప్రకారం ఉలంఘనలకు పాల్పడితే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. జరిమానాలు మాత్రమే కాకుండా, జైలుశిక్ష కూడా విధించే అవకాశముంది. ఇటీవల, కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మోటారు వాహనాల చట్ట సవరణ 2019 లో ప్రభుత్వం ఈ మార్పులను చేసింది.

భారతదేశంలోని కార్ల బీమా పథకాలు

భారతదేశంలో కారు బీమా స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. రహదారులపై అనుకోకుండా జరిగే ప్రమాదాల ఖర్చుల విషయంలో, బీమా చేయించుకున్నవారికి సహాయపడటానికి ఈ రెండు విధానాలూ సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ రెండు రకాల కారు బీమాలు క్రింద పేర్కొనబడ్డాయి: -

 థర్డ్ పార్టీ బీమా పథకాలు

థర్డ్ పార్టీ బీమా సహాయం ప్రకారం, థర్డ్ పార్టీకి కలిగే నష్టాలను బీమా సంస్థ భరించవలసి ఉంటుంది. పాలసీదారునికి కలిగే ఎటువంటి హాని/నష్టాలకు థర్డ్ పార్టీ బీమా సహాయం బాధ్యత వహించదు. ఈ బీమా పథకం ప్రాథమికంగా వాహనాల చట్టం 1938 పరిధిలోకి వచ్చే కనీస ప్రమాదాల నుంచి జాగ్రత్త వహించడానికి రూపొందించబడింది.

థర్డ్ పార్టీ బీమా ఖరీదు అంచనా క్రింది అంశాలను కలిగి ఉంటుంది :-

 • థర్డ్ పార్టీ ప్రీమియం.
 • డ్రైవర్ లేదా యజమాని వ్యక్తిగత ప్రమాద సహాయం.
 • వస్తువులు మరియు సేవా పన్ను (GST).

సమగ్రమైన పథకాలు

సమగ్రమైన సహాయం, కారు బీమా యొక్క అత్యంత ప్రభావవంతమైన విధానం. ఈ బీమా పథకం బీమా చేసినవారికి మరియు థర్డ్ పార్టీకి కూడా పూర్తి సహాయాన్ని అందించే విధంగా రూపొందించబడింది. దీని క్రింద, మీరు థర్డ్ పార్టీ బీమా సహాయాన్ని మాత్రమే కాకుండా, మీ వాహనానికి పూర్తి సహాయాన్ని కూడా పొందుతారు. ఈ బీమా పాలసీ బీమా చేసిన కారు మరియు థర్డ్ పార్టీ సహాయానికి అయ్యే ఖర్చులకు గరిష్ట ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

సమగ్ర సహాయం ఖరీదు అంచనా క్రింది అంశాలను కలిగి ఉంటుంది : -

 • థర్డ్ పార్టీ ప్రీమియం & సొంత వాహన నష్టం ప్రీమియం.
 • డ్రైవర్ లేదా యజమాని వ్యక్తిగత ప్రమాద ప్రీమియం.
 • వస్తువులు మరియు సేవా పన్ను (GST) తో సహా యాడ్-ఆన్స్.

కారు భీమా

కారు భీమా

కారు బీమా ప్రయోజనాలు

భారతీయ చట్టాల ప్రకారం, కారు నడపడానికి ఏదైనా ఒక కారు బీమా పథకాన్ని కలిగి ఉండటం తప్పనిసరి. కానీ బీమా మాత్రమే సరిపోదు. కారు బీమా మీరు చట్టాన్ని అనుసరించేలా చేయడమే కాదు, కారు యజమానులను సంతోషపరిచే అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి: -

నష్టం లేదా హాని సహాయం

కారు బీమా చేయించుకున్న వారికి, ఏవైనా ప్రమాదాలు, అగ్ని, దొంగతనం, పేలుడు, ప్రమాదవశాత్తు కారు కాలిపోవడం మరియు ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే నష్టం లేదా హానికి సంబంధించి అవసరమైన ఆర్థిక సహాయం లభిస్తుంది.

వ్యక్తిగత ప్రమాద సహాయం

ప్రమాదం జరిగినపుడు, పాలసీదారు గాయపడినట్లయితే అందుకు సంబంధించిన ఆసుపత్రి ఛార్జీలను బీమా సంస్థ చూసుకుంటుంది.

ఇన్ వాయిస్ సహాయం 

ఇది ప్రమాదం కారణంగా కారు పూర్తిగా ధ్వంసమైపోయినప్పుడు పాలసీదారునికి అందే ఒక అదనపు సహాయం.

నో క్లెయిమ్ బోనస్

మీరు పాలసీ కాలంలో ఎటువంటి ఆర్థిక సహాయాన్నీ తీసుకోనప్పుడు, తర్వాతి కాలపరిమితికి పునరుద్ధరణ సమయంలో 5% నుండి 50% తగ్గింపును పొందగలుగుతారు.

రహదారి సహాయం

రహదారి సహాయం అత్యవసర రవాణా, రోజువారీ భత్యాలు, టాక్సీ ప్రయోజనాలు వంటి మరెన్నో బహుళ ప్రయోజనాలను కారు బీమా పాలసీ అందిస్తుంది.

అదనపు సహాయాలు

ప్రాథమిక సహాయం కాకుండా, మీరు పూర్తి సహాయాన్ని ఎంచుకోగలిగే అనేక అదనపు సహాయ పథకాలు కూడా ఉన్నాయి, కానీ అవి బీమా సంస్థ నుండి బీమా సంస్థకు మారుతూ ఉంటాయి.

తరుగుదల సహాయం

తరుగుదల సహాయం కింద బీమా సంస్థ, వాహన భాగం యొక్క తగ్గిన విలువకు బదులుగా అసలు ధరను అందిస్తుంది.

మార్చిన భాగానికి సహాయం

మీరు మీ కారు తాళాన్ని కోల్పోతే, ఈ సహాయం కొత్త తాళం యొక్క ఖర్చులను భరిస్తుంది.

కారు బీమా పథకం చేరికలు మరియు మినహాయింపులు

బీమా కిందకి వచ్చేవి

 • ప్రమాదాల కారణంగా మీ కారుకు జరిగే అన్ని నష్టాలకు ఇది వర్తిస్తుంది.
 • మరణం లేదా శాశ్వత వైకల్యం విషయంలో వ్యక్తిగత ప్రమాద సహాయం ఉంటుంది.
 • వరదలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి ఆర్థిక రక్షణ.
 • దొంగతనం జరిగితే, మీ బీమా నిర్ణయ విలువ (IDV) కి సమానమైన మొత్తాన్ని మీ బీమా సంస్థ చెల్లిస్తుంది.
 • అల్లర్లు, సమ్మెలు, అగ్నిప్రమాదం, ఉగ్రవాదం వంటి మానవ తప్పిదాల కారణంగా జరిగే విపత్తులకు కూడా బీమా పాలసీ వర్తిస్తుంది.

బీమా కిందకి రానివి

 • మద్యం తాగి వాహనం నడుపుతున్నప్పుడు వాహనానికి కలిగే నష్టాలు.
 • యుద్ధం లేదా అణు ప్రమాదం కారణంగా జరిగే హాని లేదా నష్టాలు.
 • చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం మీ కారును ఉపయోగిస్తున్నప్పుడు జరిగే ప్రమాద నష్టాలు.
 • సరైన లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినప్పుడు జరిగే నష్టాలు.
 • నిరంతర వాడకం కారణంగా అయ్యే మెకానికల్ ఖర్చులు.

ఆన్ లైన్లో ఎందుకు పోల్చుకోవాలి?

మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం భారతదేశంలో చెల్లుబాటు అయ్యే కారు బీమా కలిగి ఉండటం తప్పనిసరి. భారతదేశంలో, అనేక బీమా సంస్థలు వివిధ రకాల కారు బీమా పాలసీలను అందిస్తున్నాయి. అన్నిటిలోకి ఉత్తమ బీమా పాలసీని ఎంచుకోవడం చాలా కష్టం అవుతుంది. PolicyX.com లో, ఉచిత అంచనా వివరాల సహాయంతో, మీ కారు బీమా ప్రీమియంలో 60 శాతం వరకు ఆదా చేసుకునేలా ఉత్తమ బీమాను ఎంచుకోవడంలో మేము మీకు సహాయం చేస్తాము.

అనేక పాలసీలు: అనేకమైన బీమా పాలసీల జాబితాలో, మీరు మీ కారు కోసం ఉత్తమ బీమా పాలసీని ఎంచుకోవచ్చు. సరిపోల్చడం ద్వారా, మెరుగైన బీామా పాలసీను ఎంచుకోవచ్చు.

అనుకూలత: అగ్రగామి బీమా సంస్థల అంచనా వివరాలను తక్షణమే సరిపోల్చడానికి ఇది మీకు అనుమతినిస్తుంది. ఇది ఎటువంటి ఇబ్బందులు లేని, సులభమైన పద్దతి.

పారదర్శకత: బీమాకి సంబంధించిన ప్రతి వివరాన్నీ స్పష్టంగా తెలుసుకోవడానికి, వివిధ కారు బీమాలను ఆన్‌లైన్‌లో పోల్చడం, ఒక మంచి ఆలోచన. ఇది పాలసీ యొక్క ప్రీమియం మరియు చేరికలు/మినహాయింపుల గురించిన వివరాలను పూర్తి పారదర్శకతతో చూపుతుంది, సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది.

తక్కువ డాక్యుమెంటేషన్: ఆన్‌లైన్ బీమా కొనుగోలులో, డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఇబ్బందికరంగా ఉంటుందనేది వాస్తవం కాదు. మీరు ఎక్కువ డాక్యుమెంటేషన్ లేకుండానే కారు బీమాను కొనుగోలు చేసుకుని, వెంటనే మీ ఇ-మెయిల్ కి మీ పాలసీ పత్రాల సాఫ్ట్ కాపీని పొందేలా మేము చూస్తాము.

కారు బీమా సంస్థలు అనుమతించిన చెల్లింపు శాతం

అవసరమైన ఆర్థిక సహాయాన్ని సులభంగా పొందేలా ఉంటేనే, ఒక వ్యక్తి కారు బీమాపై పెట్టుబడి పెడతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, మీరు ఆ ఆర్ధిక సహాయాన్ని సులభంగా పొందలేకపోతే ఎలా? అందుకే అధిక చెల్లింపు శాతంతో ఉన్న సరైన బీమా సంస్థను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

అయితే, చెల్లింపు అభ్యర్థనను ఎలా దాఖలు చేయాలి మరియు మొత్తం చెల్లింపు ప్రక్రియ ఎలా పని చేస్తుందో కూడా మీరు అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.

ఉత్తమ చెల్లింపు శాతం ఉన్న కారు బీమా పథకాలను అందించే సంస్థల సమగ్ర జాబితా - చెల్లింపు శాతం 2016-18*

వరుస సంఖ్య

బీమా సంస్థ

చెల్లింపు శాతం

(2016-2017)

చెల్లింపు శాతం

(2017-2018)

1

బజాజ్ అలియన్స్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్

78.50%

77.61%

2

భారతి ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

76.88%

98.50%

3

చోలమండలం ఇన్సూరెన్స్ కంపెనీ

40.07%

39.96%

4

ఫ్యూచర్ జెనరేలీ ఇన్సూరెన్స్ కంపెనీ

78.93%

87.42%

5

హెచ్డీఎఫ్సీ ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ

50.76%

52.58%

6

ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

104.30%

90.69%

7

లిబర్టీ వీడియోకాన్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

74.37%

74.58%

8

మాగ్మా HDI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

181.20%

34.93%

9

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ

126.98%

115.55%

10

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ

102.94%

103.19%

11

ఓరియంటల్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

118.23%

113.86%

12

రహేజా QBE జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

126.70%

18.19%

13

రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

91.39%

106.54%

14

రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

62.09%

61.41%

15

ఎస్బిఐ జనరల్ ఇన్యూరెన్స్ కంపెనీ

53.43%

52.93%

16

శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

38.57%

50.83%

17

స్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ

60.51%

61.76%

18

టాటా ఏఐజీ  జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

57.20%

60.68%

19

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ

138.51%

110.95%

20

యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

86.14%

104.17%

మూలం: ఐఆర్డీఏ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా)

కారు బీమా పునరుద్ధరణ

కారు బీమా పునరుద్ధరణ కోసం, మీరు ఈ పేజీ పైన ఉన్న మా అంచనా విభాగానికి వెళ్లవచ్చు. మా పునరుద్ధరణ ప్రక్రియ సులభంగా, ఏ ఇబ్బందీ లేకుండా ఉంటుంది. పాలసీలను పునరుద్ధరించుకునే సమయంలో మీకు మా నిరంతర సహాయం ఉంటుంది. అలా కాకుండా మీరు వేరే బీమా సంస్థకు మారవచ్చు లేదా పూర్తి ఆర్ధిక సహాయం ఉన్న బీమాను కూడా ఎంచుకోవచ్చు.

కారు బీమా పునరుద్ధరణ సమయంలో సరిచూసుకోవాల్సిన అంశాలు

 • సరైన ఆర్ధిక సహాయం: థర్డ్ పార్టీ సహాయాన్ని మాత్రమే కలిగి ఉన్నవారు పూర్తి ఆర్ధిక సహాయాన్ని గురించి ఆలోచించాలి. అటువంటి సరైన మరియు సమర్థవంతమైన బీమా పథకాలతో, మీరు కోరుకున్న సహాయాన్ని సులభంగా పొందవచ్చు.
 • ఐడీవీ ని చూసుకోండి : దొంగతనం లేదా నష్టం జరిగినప్పుడు మీకు పరిహారం లభిస్తుంది. ప్రీమియంలతో కారు బీమా నిర్ణయ విలువ (ఐడీవీ) ని తిరిగి అంచనా వేయడం ద్వారా, మీకు ఉత్తమమైన ధర తెలుస్తుంది.
 • చెల్లింపు శాతాన్ని చూడండి: ఇది చాలా పెద్ద తేడాని చూపుతుంది. మీరు మీ మునుపటి బీమా సంస్థ యొక్క చెల్లింపు శాతాన్ని చూడకపోతే, ఇప్పుడయినా చూసుకోండి.
 • బీమా సంస్థ పరిథిలో ఉన్న గ్యారేజీలు: మీ ప్రాంతానికి సమీపంలో ఉన్న బీమా సంస్థ పరిథిలో ఉన్న గ్యారేజీలను చూసుకోండి. అక్కడ మాత్రమే, మీరు డబ్బు పెట్టకుండానే కారుకు మరమ్మతులు చేయించవచ్చు. లేనిచో, మీ సొంత డబ్బు ఖర్చు చేసి, తిరిగి బీమా సంస్థ నుండి దానిని పొందవలసి ఉంటుంది. 
 • యాడ్-ఆన్స్: మీకు బాగా సరిపోయే అదనపు సౌకర్యాలను పొందడానికి అందుబాటులో ఉన్న అన్ని యాడ్-ఆన్స్ (add-ons) ను తనిఖీ చేయండి.
 • మినహాయింపులు మరియు రాయితీలు: అందుబాటులో ఉన్న అన్ని రాయితీల ప్రయోజనాన్నీ పొందండి. మినహాయింపు అనేది మీరు చెల్లింపునకు ముందు ప్రతిసారీ చెల్లించాల్సిన మొత్తం.

మీరు ఆన్ లైన్లో ఏవిధంగా పునరుద్ధరించుకోవచ్చు?

 • మా కారు బీమా పేజీకి వెళ్ళి మీ కారు గురించిన కొన్ని ప్రాథమిక వివరాలను ఇవ్వండి.
 • మా అంచనాల వివరాలను చూసి, మీ అవసరాలకు సౌలభ్యంగా ఉందని మీకు అనిపించిన బీమాను ఎంచుకోండి.
 • నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్ వంటి వివిధ రకాల చెల్లింపు పద్ధతులను ఉపయోగించి చెల్లింపు చేయండి.
 • మీరు మా నిపుణుల బృందం నుండి వ్యక్తిగత సహాయం కూడా కోరవచ్చు.

కారు భీమాను పునరుద్ధరించండి

కారు భీమాను పునరుద్ధరించండి

కారు బీమా ప్రీమియంను లెక్కించడం

కారు బీమా ప్రీమియం అనేది, మీ పాలసీని అమలులో ఉంచడానికి మీరు చెల్లించాల్సిన మొత్తం. ఇది సాధారణంగా బీమా సంస్థను బట్టి మరియు కారు మోడల్ ను బట్టి మారుతుంది. కారు బీమా ప్రీమియంను లెక్కించడానికి, మీరు క్రింద పేర్కొన్న సూత్రాన్ని ఉపయోగించవచ్చు మరియు ప్రీమియం మొత్తాన్ని ప్రభావితం చేసే వివిధ అంశాలను కూడా చూడవచ్చు.

ప్రీమియం = సొంత హాని ప్రీమియం - (నో క్లెయిమ్ బోనస్ + రాయితీలు) + ఐఆర్డీఏఐ నిర్ణయించిన సహాయ ప్రీమియం + యాడ్-ఆన్స్ ఖర్చు.

కారు బీమా కంపెనీ, క్రింద పేర్కొన్న అంశాల ఆధారంగా ప్రీమియంను నిర్ణయిస్తుంది

వాహన తయారీ సంవత్సరం: ఇది కారు వయస్సును నిర్ణయిస్తుంది. కొత్త వాహనాల కన్నా పాత వాహనాలకు తక్కువ బీమా రేట్లు ఉంటాయి.

ఆటోమొబైల్ రిజిస్ట్రేషన్ చేసిన ప్రదేశం : మీ నివాస స్థలం మరియు మీ వాహనాన్ని రిజిస్టర్ చేయించిన ప్రదేశం కూడా కారు బీమా ప్రీమియంపై ప్రభావం చూపుతాయి.

వాహన మోడల్: ఒక ఆటోమొబైల్ బాగా ఖరీదైన విడి భాగాలను కలిగి ఉంటే, ఆ కారు ప్రీమియం కూడా ఎక్కువగా ఉండవచ్చు.

వాహన ఉపయోగ ఉద్దేశ్యం: ఆటోమొబైల్ భీమా సంస్థలు వ్యక్తిగత మరియు వ్యాపార బీమా పాలసీలను అందిస్తాయి. వాహనాన్ని వ్యాపార పనుల కోసం ఉపయోగిస్తే, అది అధిక ప్రీమియం రేట్లను కలిగి ఉంటుంది.

భద్రతా పరికరాలు: ప్రస్తుత వాహనాలు భద్రతా సామర్థ్యం మరియు దొంగతనాన్ని ఆపే పరికరాలతో వస్తున్నాయి. మీ వాహన రక్షణా సామర్థ్యానికి గాను మీకు ప్రీమియంపై 2.5% వరకు తగ్గింపు లభించవచ్చు.

చెల్లింపు రికార్డులు: మీరు మీ వాహన బీమాపై చెల్లింపుకు అభ్యర్థిస్తే, ప్రీమియం పెరిగే అవకాశం ఉంది. మీరు చెల్లింపు తీసుకోకుండా ఉంటే, బహుమతులు, నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) లభించవచ్చు.

చెల్లింపు కోసం అభ్యర్థించడం ఎలా?

ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితిలో, వీలైనంత త్వరగా మీరు బీమా సంస్థకు మీ స్థితిని తెలియజేయడం చాలా ముఖ్యం. దీనికి రెండు మార్గాలు ఉన్నాయి - నగదు రహితంగా (మీ డబ్బు వాడకుండా) వెళ్లడం లేదా మొదట మీ డబ్బు వాడి తరువాత ఆ ఖర్చుల మొత్తానికి పరిహారాన్ని తిరిగి పొందడం.

నగదు రహితంగా వెళ్లడం

చెల్లింపు పొందడానికి ఇది ఎక్కువమంది ఎంచుకునే మార్గం. బీమా సంస్థతో సంబంధం కలిగి ఉన్న నెట్‌వర్క్ గ్యారేజీల వద్ద, మరమ్మతుల కోసం మీరు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా, కంపెనీ నగదు రహిత చెల్లింపు సదుపాయాన్ని అందిస్తుంది. మీరు చేయాల్సిందల్లా క్రింద పేర్కొన్న విషయాలను అనుసరించడమే.

 • వీలైనంత త్వరగా బీమా సంస్థకు తెలియజేయడం.
 • మీ వాహనాన్ని మరియు మొత్తం పరిస్థితిని విశ్లేషించడానికి సర్వేయర్‌ను అనుమతించడం.
 • అన్ని పత్రాలను సమర్పించడం.
 • అనుమతి పొందిన వెంటనే, సర్వేయర్ నేరుగా గ్యారేజీతో మాట్లాడి, మీ తరపున చెల్లింపు చేస్తారు.

పరిహారాన్ని పొందడం

 • టోల్ ఫ్రీ నంబర్ లేదా మెయిల్ ద్వారా బీమా సంస్థకు తెలియజేయండి.
 • చెల్లింపు అభ్యర్థన పత్రం నింపండి.
 • డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సి పుస్తకం, పాలసీ పత్రాల కాపీలను అందించండి.
 • అవసరమైతే, FIR కూడా సమర్పించండి.
 • అభ్యర్థన పత్రంతో పాటు అంచనా బిల్లు, ఇన్ వాయిస్ మరియు చెల్లింపు రశీదును అందించండి.
 • బీమా సంస్థ మీ కేసును విశ్లేషించి తదనుగుణంగా మిమ్మల్ని తిరిగి సంప్రదిస్తుంది.
 • ఆమోదం పొందిన తరువాత, సంబంధిత విభాగం మీకు నేరుగా తిరిగి చెల్లింపు చేస్తుంది.

చెల్లింపు అభ్యర్థన తిరస్కరించబడడానికి కారణాలు

 • చెల్లని లైసెన్స్ ఉండడం.
 • బీమా లేని సెకండ్ హ్యాండ్ కారు అవ్వడం.
 • బీమా సంస్థకు ఆలస్యంగా తెలియజేయడం.
 • మద్యం లేదా మాదకద్రవ్యాల ప్రభావం ఉండడం.
 • అధిక వాడకం లేదా కాలంతో పాటు వచ్చే నష్టాలు.
 • మీ కారు మరమ్మతు చేయటానికి వీలులేకపోవడం. అంటే చాలా పాతది అవ్వడం.
 • మీ బీమా సంస్థకు తెలియజేయకుండా కారు మరమ్మతు చేయించి ఉండడం.
 • రిజిస్టర్ చేయించని CNG కిట్‌ ను ఇన్‌స్టాల్ చేసి ఉండడం.
 • ఉపయోగ పరిమితిని దాటిపోయి ఉండడం.