న్యూ ఇండియా కార్ ఇన్సూరెన్స్
 • చౌకైన కారు బీమా కొనండి
 • కారు భీమాను ఆన్‌లైన్‌లో పునరుద్ధరించండి
 • మూడవ పార్టీ మరియు యాడ్-ఆన్ కవర్
PX step

కారు బీమా కొటేషన్లను ఆన్లైన్లో పోల్చుకోండి

లేదా

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ప్రపంచవ్యాప్తంగా 28 దేశాలలో వ్యాపారాన్ని నిర్వహిస్తూ, భారతదేశంలో అతి ఎక్కువ కాలం నుంచి ఉన్న బీమా సంస్థలలో ఒకటి. ఈ కంపెనీ భారత ప్రభుత్వ ఆధీనంలో సర్ దొరాబ్జి టాటా గారిచే 1919 వ సంవత్సరంలో స్థాపించబడింది. భారతదేశంలో ‘ఆమ్ బెస్ట్ కంపెనీ’ చేత 2007 నుంచి ఏ-(అత్యుత్తమ) రేటింగ్ అందుకున్న ఏకైక ప్రత్యక్ష బీమా సంస్థ ఇది మాత్రమే. తమ పాలసీదారుల అవసరాలను గౌరవించే, ఉన్నత ఆర్థిక దృఢత్వాన్ని ఈ సంస్థ కలిగి ఉంది. వినియోగదారుల విభిన్న అవసరాల కోసం, సరసమైన ధరలలో అనేక పథకాలను ఈ సంస్థ అందిస్తోంది.

న్యూ ఇండియా కారు బీమా, ప్రమాదం, అగ్ని ప్రమాదం, దొంగతనం, దాడులు, వరదలు మొదలైన వాటికి సంబంధించిన ఆపదలు మరియు నష్టాల నుంచి మీ కారును సంరక్షిస్తుంది. వ్యక్తిగత కార్లకు మాత్రమే కాకుండా వ్యాపార లేదా వాణిజ్య సంబంధ కమర్షియల్ కార్లకు కూడా అవసరమైన కవరేజీ ఇది అందిస్తుంది. న్యూ ఇండియా కార్ ఇన్సూరెన్స్ పాలసీ కింద పనిలో పెట్టుకున్న డ్రైవరుకు అలాగే ఇతర ప్రయాణదారులకు కూడా కవరేజీ ఇవ్వవచ్చు. న్యూ ఇండియా కార్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం.

ప్రధానాంశాలు 

ప్రధాన కార్యాలయం

ముంబై, మహారాష్ట్ర

బీమా ఉత్పత్తుల సంఖ్య

250 కు పైగా

భారతదేశంలో ఉన్న కార్యాలయాలు

2,395

ఉద్యోగుల సంఖ్య

17,615

క్రిసిల్ రేటింగ్

‘ఏఏఏ’/ 2014 నుంచి ప్రతీ సంవత్సరం

న్యూ ఇండియా కారు బీమా పాలసీని పునరుద్ధరించుకోవడం ఎలా?

1. న్యూ ఇండియా అస్యూరెన్స్ బీమా సంస్థతో పునరుద్ధరించుకోవడం

సులభమైన ఆన్లైన్ పునరుద్ధరణ ప్రక్రియ ఈ సంస్థ యొక్క అత్యంత పేరెన్నిక గన్న ఫీచర్లలో ఒకటి. మీరు కేవలం ఈ క్రింద పద్దతిని అనుసరిస్తే చాలు:

 • న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థ యొక్క అధికారిక వెబ్ సైటుకు వెళ్ళండి.
 • ‘క్విక్ హెల్ప్’ ను ఎంచుకుని ‘క్విక్ రెన్యువల్’ ని ఎంచుకోండి. 
 • కస్టమర్ ఐడీ, పాలసీ నంబర్ లేదా తాజా/పునరుద్ధరణ కొటేషన్ నంబర్ వంటి వివరాలను నింపండి.
 • ‘ప్రొసీడ్’ పై క్లిక్ చేసి అవసరమైన చెల్లింపును చేయండి. 
 • చెల్లింపును విజయవంతంగా చేయగానే, మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి పాలసీ సాఫ్ట్ కాపీని పొందుతారు. 
 • ఆ ప్రీమియం చెల్లింపు రశీదును భవిష్యత్ అవసరాల కోసం దాచి ఉంచుకోండి. 

2. PolicyX.com తో పునరుద్ధరించుకోవడం

PolicyX.com మీ కారు బీమా పాలసీని సులభమైన పద్దతితో పునరుద్ధరించుకునే అవకాశాన్ని మీకు అందిస్తుంది.

 • పేజీ పై భాగంలో ఉన్న ‘కారు బీమా కొటేషన్లను ఆన్లైన్లో సరిపోల్చుకోండి’ విభాగానికి వెళ్ళండి. 
 • మీరు రెండు విధాలుగా దీనిని చేయవచ్చు- మీ కారు గురించిన వివరాలను నింపి ‘కొటేషన్లు పొందండి’ పై క్లిక్ చేయడం ద్వారా లేదా ‘కారు నంబర్ ఇవ్వకుండానే చూసుకోండి’ పై క్లిక్ చేసి మిగిలిన అవసరమైన వివరాలను ఇవ్వడం ద్వారా.
 • ఇప్పుడు మీరు ఇప్పటికే తీసుకుని ఉన్న బీమా సంస్థను ఎంచుకోవచ్చు లేదా మీ అవసరాలకు తగినట్లుగా కొత్త పాలసీని అయినా ఎంచుకోవచ్చు. 
 • పాలసీకి అవసరమైన ప్రీమియం చెల్లింపును చేయండి.
 • చెల్లింపు విజయవంతం కాగానే, మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ లో దాని ధ్రువీకరణను పొందుతారు. 

న్యూ ఇండియా కార్ ఇన్సూరెన్స్ ప్రధాన ఫీచర్లు మరియు ప్రయోజనాలు

రాయితీలు

ఆటోమొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సభ్యులు అలాగే కార్లలో దొంగతనాన్ని అరికట్టే (ఆంటీ-తెఫ్ట్) పరికరాలను కలిగి ఉన్నవారు, ప్రత్యేక రాయితీలకు అర్హులు. ఇదే కాకుండా, వినియోగదారులు నో క్లెయిమ్ బోనస్ రాయితీని కూడా పొందవచ్చు.

24*7 వినియోగదారుల సహాయం

అత్యుత్తమ శిక్షణను పొంది మీ సందేహాలు మరియు ప్రశ్నలకు ఎల్లప్పుడూ సమాధానాలను అందించే ప్రభావవంతులైన ఉద్యోగ సిబ్బంది, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ యొక్క ఉత్తమ ఫీచర్లలో ఒకటి. వీరు వినియోగదారులకు చెల్లింపులు పొందడంలో, పాలసీని తీసుకోవడంలో అలాగే పునరుద్ధరించుకోవడంలో కూడా మీకు సహాయపడతారు.

నగదురహిత గ్యారేజీలు

ఖర్చుల భారం మీపై పడడం మీకు కష్టం కలిగించవచ్చు. అందుకే ఈ సంస్థ 3000 కు పైగా నగదు రహిత గ్యారేజీలను దేశవ్యాప్తంగా కలిగి ఉంది. ఇక్కడ మీ కారు మరమ్మత్తు ఖర్చులకు సంస్థే నేరుగా చెల్లింపు చేస్తుంది.

సులభమైన చెల్లింపు ప్రక్రియ

చెల్లింపులు సులువుగా, ఏ ఇబ్బందులూ లేకుండా చేయబడతాయి. అత్యవసర సమయాలలో చెల్లింపును కోరే ప్రక్రియ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఇచ్చిన చెల్లింపు శాతం

ఈ సంస్థ ఇచ్చిన చెల్లింపు శాతం 103.19%. అన్ని సరియైన చెల్లింపు అభ్యర్థనలకు చెల్లింపు చేసేట్లుగా ఈ సంస్థ చూసుకుంటుంది.

న్యూ ఇండియా కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడం

PolicyX.com ప్రీమియం లెక్కింపు సహాయంతో మీరు తీసుకోవాలనుకుంటున్న కారు బీమా పాలసీకి కట్టాల్సి వచ్చే ప్రీమియం మొత్తాన్ని ముందే చూసుకోవచ్చు. ఇది కారు రిజిస్ట్రేషన్ చేసి ఉన్న ప్రదేశం, ఇంజిన్ సామర్థ్యం, కారు వయసు వంటి వివిధ అంశాలపై ఆధారపడి ప్రీమియంను అంచనా వేస్తుంది.

కింద పట్టికలో వివిధ కారు మోడళ్ల రకాలను మరియు వాటికి సంబంధించిన ప్రీమియం లెక్కింపు అంచనాల వివరాలను మీరు చూడవచ్చు.

కారు రకం 

కారు ధర 

ఐడీవీ*

జీరో డిప్రీసియేషన్

(అదనం)*

ప్రీమియం అంచనా*

రినాల్ట్ క్విడ్ ఎస్టీడీ (799 సీసీ)

రూ. 3,02,000

రూ. 2,19,708

రూ. 879

రూ. 7,004

మారుతి సుజికీ వాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ 1.0 (998 సీసీ)

రూ. 4,51,000

రూ. 3,91,324

రూ. 1,312

రూ. 1,312

ఫియట్ పుంటో ఎవో ప్యూర్ (1172 సీసీ)

రూ. 4,88,000

రూ. 3,03,392

రూ. 996

రూ. 13,020

హోండా సిటీ ఎస్వీ పెట్రోల్ (1497 సీసీ)

రూ. 10,13,000

రూ. 9,80,115

రూ. 4,901

రూ. 17,578

**ఈ విలువలు 2020 రిజిస్ట్రేషన్ సంవత్సరంలో (ఢిల్లీ) నగరం ఆధారంగా లెక్కించబడ్డాయి. 

న్యూ ఇండియా కార్ ఇన్సూరెన్స్ అందించే అదనపు కవరేజీలు ఏమిటి?

జీరో డిప్రీసియేషన్ కవర్: ఏదైనా ప్రమాదం లేదా అనుకోని సంఘటన జరిగిన సందర్భంలో, మరమ్మత్తు చేయబడిన లేదా మార్చబడిన ప్లాస్టిక్, రబ్బర్ లేదా లోహపు విలువ తగ్గిన కారు భాగాలకు అయ్యే ఖర్చులను పాలసీ దారు ఈ అదనపు కవరేజీ సహాయం ద్వారా సంస్థ నుండి పొందవచ్చు.

రోడ్ టాక్స్ కవరేజీ: ఒకవేళ ఏదైనా పెద్ద ప్రమాదం లేదా దొంగతనం వలన, మీ కారు పూర్తిగా ద్వంసమైనా లేదా దొంగిలించబడినా, బీమా చేయబడిన కారు యొక్క భర్తీపై ఉండే రోడ్డు పన్ను చార్జీలకు అవసరమైన కవరేజీని పాలసీదారు దీని ద్వారా పొందవచ్చు.

నో క్లెయిమ్ బోనస్ రక్షణ కవరేజీ: ఎటువంటి చెల్లింపూ క్లెయిమ్ చేయని ప్రతీ సంవత్సరానికీ, మీరు ఒక నిర్దిష్టమైన నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాన్ని పొందుతారు. అయితే ఈ అదనపు కవరేజీ మీరు చెల్లింపు క్లెయిమ్ చేసుకున్నా కూడా ఆ సౌలభ్యాన్ని పొందేలా మీకు అనుమతిస్తుంది. ఒక పాలసీ కాలవ్యవథిలో గరిష్టంగా 2 క్లెయిమ్ లకు పాలసీదారు ఈ మినహాయింపును పొందవచ్చు.

టోయింగ్ సహాయం: మీకు, ఏదైనా అత్యవసర పరిస్థితిలో, మీ వాహనాన్ని లాక్కుని వెళ్లాల్సిన అవసరం వచ్చినపుడు, దానికి అయ్యే ఖర్చులను బీమా సంస్థనే భరిస్తుంది. ఈ అదనపు కవరేజీని మీరు తీసుకుంటే, ఒక పాలసీ సంవత్సరంలో గరిష్టంగా రూ. 10,000 వరకు మీరు చెల్లింపును కోరవచ్చు.

వ్యక్తిగత వస్తువుల రక్షణ కవరేజీ: సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్లు, దుస్తులు, ఆభరణాలు మొదలనటువంటి ఏవైనా వ్యక్తిగత వస్తువులు కారులోనుండి పోయినపుడు, ఈ కవరేజీ కింద వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ కవరేజీ రూ. 20,000 వరకు ఉండి, భరోసా మొత్తంలో 20% విలువను కూడా, అంటే ఏదైనా పోయిన వస్తువుకు, దాని నిజమైన ధర లేక రూ.4,000 (ఏది తక్కువ ఉంటే అది) ను అదనంగా కలిగి ఉంటుంది.

ఇంజిన్ రక్షణ కవరేజీ: నీరు ప్రవేశించడం లేదా లూబ్రికేటింగ్ ఆయిల్ లీక్ అవ్వడం ద్వారా కారు యొక్క ఇంజిన్ లేదా గేర్ బాక్స్ కు సంబంధించిన భాగాలకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటి మరమ్మత్తులకు ఈ అదనపు ప్రయోజనం కవరేజీని అందిస్తుంది.

ఇన్ వాయిస్ పై తిరుగు చెల్లింపు: ఈ కవరేజీ సహాయంతో, మీ కారు పూర్తిగా ధ్వంసమైన లేదా దొంగిలించబడిన సందర్భంలో, బీమా చేయబడిన కారు యొక్క అసలు ఇన్ వాయిస్ ధరకు, రోడ్డు పన్ను మరియు రిజిస్ట్రేషన్ చార్జీలతో కలిపి మీరు తిరుగు చెల్లింపు కోరవచ్చు. వ్యక్తిగత కార్లకు (3 సంవత్సరాల లోపు) రూ. 20 లక్షల వరకు ఇన్ వాయిస్ ధర కవర్ చేయబడుతుంది.

న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ నుండి కారు బీమా చెల్లింపు కోరే పద్దతి ఏమిటి?

నగదురహిత చెల్లింపు ప్రక్రియ

బీమా సంస్థ యొక్క అధికారిక నెట్వర్క్ గ్యారేజీలో మీ నష్టం జరిగిన కారు మరమ్మత్తులు చేయించినపుడు, మీరు మీ సొంత జేబు నుంచి చిల్లిగవ్వ కూడా చెల్లించక్కరలేదు. ఈ నగదు రహిత చెల్లింపు ప్రక్రియను చూద్దాం:

 • న్యూ ఇండియా ఇన్సూరెన్స్ టోల్-ఫ్రీ నెంబర్ 1800-568-9999 పై కాల్ చేసి బీమా సంస్థకు తెలపాలి.
 • కారును నడుపుకుంటూ లేదా లాక్కుంటూ దగ్గరిలో ఉన్న నెట్వర్క్ గ్యారేజీకి తీసుకెళ్లాలి. 
 • మీ పాలసీ వివరాలను, పూర్తిగా నింపబడిన చెల్లింపు అభ్యర్థన పత్రంతో పాటుగా అందచేయాలి. 
 • కారు మరమ్మత్తు సేవలకు అయిన ఖర్చులను న్యూ ఇండియా నేరుగా గ్యారేజీకి చెల్లిస్తుంది. 
 • మీరు ఇచ్చి ఉన్న ఇంటి చిరునామాలో మరమ్మత్తు చేయబడిన కారును సంస్థ మీకు అందచేస్తుంది. 

తిరుగు చెల్లింపు ప్రక్రియ 

ఒకవేళ మీరు నగదురహిత చెల్లింపు కిందకు రాని గ్యారేజీలో కారు మరమ్మత్తు చేయించుకుని, దానికి తిరుగు చెల్లింపు పొందాలనుకుంటే, కింద ఇచ్చిన పద్దతిని అనుసరించండి:

 • బీమా సంస్థకు జరిగిన సంఘటన గురించి తెలియజేయండి.
 • జరిగిన నష్టం మరియు ఖర్చుల అంచనా నివేదిక కోసం ఒక సర్వే చేయబడుతుంది. 
 • ధ్రువీకరణ కోసం అన్ని మరమ్మత్తు బిల్లులు, ఇన్ వాయిస్లు మరియు రసీదులను తప్పనిసరిగా దాచి ఉంచండి.
 • చెల్లింపు అభ్యర్థన పత్రంతో పాటుగా, బిల్లులు మరియు అవసరమైన ఇతర పత్రాలను సర్వేయరుకు అందచేయండి. 
 • అన్ని వివరాలు సరిగ్గా ఉన్న సందర్భంలో, 7 పనిదినాలలోపు మీకు తిరుగు చెల్లింపు చేయబడుతుంది.

న్యూ ఇండియా కారు బీమా చెల్లింపును కోరడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

మీరు చెల్లింపు వేగవంతంగా పొందటానికి విభిన్నమైన పత్రాలు అవసరమవుతాయి . 

 • పాలసీ పత్రాలు
 • డ్రైవింగ్ లైసెన్స్
 • వాహనం యొక్క ఆర్‌సి పుస్తకం
 • పోలీస్ ఎఫ్ఐఆర్ నకలు, ప్రమాదం జరిగిన సందర్భంలో
 • అసలు మరమ్మత్తు బిల్లులు మరియు రసీదులు
 • సంతకం చేయబడిన చెల్లింపు అభ్యర్థన పత్రం

**దొంగతనం లేదా మూడవ వ్యక్తి బీమా చెల్లింపుల విషయంలో కొన్ని ఇతర డాక్యుమెంట్లను కూడా బీమా సంస్థ కోరవచ్చు.

సంప్రదించాల్సిన చిరునామా:

న్యూ ఇండియా అస్యూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ

అధికారిక కార్యాలయ చిరునామా:

న్యూ ఇండియా అస్యూరెన్స్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్, నం. 21, పటుల్లోస్ రోడ్, చెన్నై - 600 002

కార్పొరేట్ కార్యాలయ చిరునామా:

న్యూ ఇండియా అస్యూరెన్స్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్, విశ్రాంతి మేళారం టవర్స్, నం.2/139, రాజీవ్ గాంధీ సలాయ్ (ఓఎమ్ఆర్), కారపాక్కం, చెన్నై - 600097

టెలిఫోన్: 1860 425 0000 (టోల్-ఫ్రీ), +91-44-71177117

వాహన బీమా చెల్లింపు అభ్యర్థన తెలపాల్సిన నంబర్: 1800 568 9999

ఫ్యాక్స్: +91-44-71177117

ఇమెయిల్: customer[dot]services[at]royalsundaram[dot]in (ఏవైనా కారు బీమా పాలసీ సంబంధిత అంశాలు లేదా ఫిర్యాదుల కొరకు)