కరోనా వైరస్ (కోవిడ్-19) బీమా
  • అగ్ర బీమా సంస్థల నుండి ఉత్తమ ప్రణాళికలు
  • పోల్చండి & తక్షణమే కొనండి
  • 80 డి కింద పన్ను ప్రయోజనాలు
PX step

ఆరోగ్య బీమా కొటేషన్లను ఆన్లైన్లో పోల్చుకోండి

1

2

పేరు
కవరేజీ
పుట్టినరోజు (పెద్ద సభ్యుడి)

1

2

ఫోన్ నం.
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

నావల్ కరోనా వైరస్, ప్రపంచ వ్యాప్తంగా, లక్షల మందిని ప్రభావితం చేస్తోంది. భారతదేశంలో ఈ వైరస్ బారిన పడి పాజిటివ్ గా నమోదైన వారి సంఖ్య 14 లక్షలు దాటి ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ వైరస్ అధికంగా సంక్రమిస్తూ, శ్వాస సమస్యలు, గొంతు నొప్పి, కిడ్నీలను బలహీనపరచడంలతో పాటు పలు అవయవాలను పూర్తిగా దెబ్బతీసే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ప్రస్తుత సమయానికి, ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా కోటి ఆరవై లక్షల మంది ప్రజలకు సోకి, ఆరు లక్షల మందికి పైగా ప్రాణాలను కూడా బలిగొంది.

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన నియమావళి ప్రకారం, భారతదేశంలోని బీమా సంస్థలు తప్పనిసరిగా, ఈ వైరస్ సంక్రమణకు సంబంధించిన ప్రత్యేక భద్రతా కవరేజీ పథకాలతో ముందుకు రావలసి ఉంది. మార్కెట్లో ఉన్న ఐసీఐసీఐ లొంబార్డ్ మరియు డిజిట్ ఇన్సూరెన్స్ వంటి వివిధ ఆరోగ్య బీమా సంస్థలు, కరోనా వైరస్ చికిత్సకు మరియు ఆసుపత్రి ఖర్చులకు కవరేజీని అందిస్తున్నాయి.

కరోనా వైరస్ ఆరోగ్య బీమా గురించి మరియు దాని సంబంధిత పథకాలను తీసుకోవాలా, వద్దా అనే దానిపై మరి కొంచెం ఇప్పుడు తెలుసుకుందాం.

కరోనా బీమా అంటే ఏమిటి?

ప్రస్తుత దృష్టాంతాన్ని పరిశీలిస్తే, కరోనా వైరస్ బీమా కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది మరియు 2020-21 సంవత్సరానికి మీ ఆర్థిక ప్రణాళికలో ఒక భాగంగా ఉండాలి. కరోనా వైరస్ హెల్త్ ఇన్సూరెన్స్ తో కొవిడ్-19 కు చికిత్సకు వైద్య ఖర్చులకు సమగ్ర కవరేజీ లభిస్తుంది. అయితే వైరస్ కారణంగా పాలసీదారుడు మరణిస్తే, అతను/ఆమె కుటుంబం ఎలా కొనసాగిస్తుంది? ఈ సందర్భంలో కరోనా వైరస్ బీమా కీలక పాత్ర పోషిస్తుంది మరియు పాలసీదారు కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.

జీవిత బీమా కరోనా వైరస్ కు కవరేజీ అందిస్తుంది?

కరోనా వైరస్ కారణంగా పాలసీదారుడు మరణించిన సందర్భంలో(పాలసీ కాల వ్యవధిలో) బీమా సంస్థ లబ్ధిదారునికి మరణ ప్రయోజనాన్ని చెల్లిస్తుంది.

ఏదేమైనా, కొత్త జీవిత బీమాను కొనుగోలు చేసేటప్పుడు పాలసీ అంగీకార ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. కరోనా వైరస్ బారిన పడలేదని పేర్కొంటూ అవసరమైన అన్ని వైద్య పత్రాలను సమర్పించాలి. ఇది పాలసీ అంగీకార ప్రక్రియలో సహాయపడుతుంది మరియు బీమా కంపెనీ పాలసీ యొక్క నామినీకి కవరేజీ అందిస్తుంది. అదేవిధంగా పాలసీ కొనుగోలుదారు యొక్క ఆరోగ్యం మరియు వైద్య చరిత్ర ఆధారంగా బీమా సంస్థ ప్రీమియంలను కూడా నిర్ణయిస్తుంది.

ఆరోగ్య బీమా కరోనా వైరస్ కు కవరేజీ అందిస్తుందా?

ప్రామాణిక ఆరోగ్య బీమా కొవిడ్-19 కు కూడా కవరేజీ అందిస్తుంది. కొవిడ్-19 చికిత్స సమయంలో పెషేంట్ ఖర్చులను బీమా సంస్థ చెల్లిస్తుంది. కొద్ది నెలల క్రితం ఐఆర్డీఏఐ కరోనా రక్షణ్ మరియు కరోనా కవచ్ వంటి కొవిడ్-19 నిర్దిష్ట పథకాలను ప్రారంభించింది. 

ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమాను కొవిడ్-19 కు కవరేజీ అందించినప్పటికీ, అదనపు ప్రయోజనాలు కోసం మీరు కొవిడ్-19 నిర్దిష్ట పథకాలను కొనుగోలు చేయవచ్చు. ఈ పథకాల గురించి మరింత తెలుసుకుందాం. 

భారతదేశంలో కొవిడ్-19 బీమా పథకాలు

ప్రస్తుతం కరోనా వైరస్ బీమా పథకాలను బీమా సంస్థలు అందిస్తున్నాయి. వీటి గురించి కింద వివరించడం జరిగింది.

1. కరోనా కవచ్ పాలసీ

కరోనా కవచ్ పాలసీ అనేది సింగిల్ ప్రీమియం మరియు పరిమిత పిరియడ్ పాలసీ. ఇది జీవిత కాల పునర్దురణ అందించదు. అయితే ఈ పథకాన్ని ఫ్యామిలీ ఫ్లోటర్ విధానంలో కూడా తీసుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్లోటర్ కింద తల్లిదండ్రులు, అత్తమామలు, అధారపడ్డ పిల్లల(25 సంవత్సరాల వయసు వరకు) కవరేజీ అందించవచ్చు.

అర్హత

18-65 సంవత్సరాలు

బీమా మొత్తం

50,000- 5 లక్షలు

2. కరోనా రక్షక్ పాలసీ

కరోనా రక్షక్ పాలసీ అనేది సింగిల్ ప్రీమియం పాలసీ, ఇది 100 శాతం బీమా మొత్తాన్ని అందిస్తుంది. పాలసీదారుడు కొవిడ్-19 పాజిటివ్ గా నిర్థారించబడి 3 రోజుల పాటు హాస్పిటలైజేషన్ అయితే బీమా మొత్తం 100 శాతం అందించబడుతుంది.

అర్హత

18-65 సంవత్సరాలు

బీమా మొత్తం

50,000- 2.5 లక్షలు

3. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కరోనా వైరస్ ఇన్సూరెన్స్ 

బీమా చేసుకున్న వ్యక్తి, ఆ వైరస్ కు పాజిటివ్ అని నిర్ధారించబడి, ఆసుపత్రిలో చేరినపుడు, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కరోనా వైరస్ ఇన్సూరెన్స్, ఒక పెద్దమొత్తం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ భరోసామొత్తాన్ని పొందటానికి, అభ్యర్థులు మరే వైద్య పరీక్షకు లేదా సంప్రదింపుకు కూడా హాజరు కావాల్సిన అవసరం లేదు. ఈ పాలసీ కొనుగోలుదారులకు ఒక 15 రోజుల ఉచిత వెసులుబాటు సమయాన్ని కూడా అందిస్తుంది.

అర్హత

18-65 సంవత్సరాలు

వెయిటింగ్ పిరియడ్

16 రోజులు

భరోసా మొత్తం

రెండు ఎంపికలు - రూ. 21,000 మరియు రూ. 42,000

4. ఐసీఐసీఐ లొంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ 

ఈ ఆరోగ్య బీమా, కరోనా వైరస్ కు పాజిటివ్ అని నిర్ధారించబడిన వారికి ఒక పెద్దమొత్తం యొక్క భరోసాని అందించే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా రూపొందించబడింది.

అర్హత

18-75 సంవత్సరాలు

వెయిటింగ్ పిరియడ్

14 రోజులు

భరోసా మొత్తం

రూ. 25,000

5. డిజిట్ ఇన్సూరెన్స్ 

డిజిట్ ఇన్సూరెన్స్ కూడా ఈ కరోనా వైరస్ బారిన పడిన వారికి సహాయం అందించడం కోసం ప్రత్యేకంగా ఒక బీమాను అందిస్తోంది. బీమా చేసుకున్న వ్యక్తి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారించబడి, క్లెయిమ్ కోరినపుడు, 100% చెల్లింపును పొందటానికి అవకాశం ఉంటుంది. వైద్య పరీక్ష నెగటివ్ వచ్చినప్పుడు కూడా, భరోసా మొత్తంలో 50% బీమా చేసుకున్న వ్యక్తి పొందవచ్చు.

అర్హత

75 సంవత్సరాల వరకు

వెయిటింగ్ కాలం

15 రోజులు

భరోసా మొత్తం

రూ. 25,000 - 2 లక్షలు

కరోనా వైరస్ బీమా పథకాల చేర్పులు

ఈ వైరస్ బారిన పడే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకాలలో చేర్చబడి ఉండే సాధారణ అంశాలు క్రింద ఇవ్వబడ్డాయి:

ఆసుపత్రి ఖర్చులు

కరోనా వైరస్-సంబంధిత పథకాలు చికిత్స మరియు ఆసుపత్రి ఖర్చులను కూడా భరిస్తాయి. అలాగే, 24 గంటలు దాటిన ఆసుపత్రి ఖర్చులను కూడా ఈ బీమా సంస్థలు కవర్ చేస్తాయి.

క్వారెంటీన్ కవర్

కరోనా వైరస్-సంబంధిత ఆరోగ్య బీమా, వ్యాధి నిర్ధారణ తర్వాత ఆసుపత్రి ఖర్చులనే కాకుండా, ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థలలో క్వారెంటీన్ చేయబడిన బీమా తీసుకున్న వ్యక్తుల క్వారెంటీన్ ఖర్చులకు కూడా కవరేజీని అందిస్తాయి.

అదనపు కవరేజీ

డిజిట్ ఇన్సూరెన్స్ అందిస్తున్న కరోనా వైరస్-సంబంధిత ఆరోగ్య బీమా వంటి పథకాలు, జన్మించిన శిశువు కవరేజీతో పాటుగా మెటర్నిటీ ప్రయోజనం, హోమియోపతి, ఆయుర్వేదం లేదా యునాని వంటి ఇతర చికిత్సల ఖర్చులు వంటి అదనపు కవరేజీలను కూడా అందిస్తున్నాయి.

కరోనా వైరస్ బీమా పథకాల మినహాయింపులు

కరోనా వైరస్ చికిత్సకు సంబంధించిన ఖర్చులను కవర్ చేసే ఆరోగ్య బీమా పథకాలలో మినహాయించబడిన అంశాల జాబితా క్రింద ఇవ్వబడింది: 

ప్రసవం ముందు మరియు తర్వాతి ఖర్చులు

ప్రసవానికి ముందు మరియు తర్వాత అయ్యే ఖర్చులు ఈ అవసర-ఆధారిత బీమా కవరేజీ కిందకి రావు. ఒకవేళ, మీరు ప్రసవానికి ముందు మరియు ప్రసవానంతర ఖర్చులకు కూడా కవరేజీ కావాలనుకుంటే, మీ బీమా సంస్థతో లేదా బీమా ఏజెంటుతో ఒక అదనపు కవరేజీ గురించి అడగండి.

ముందు నుంచీ ఉన్న అనారోగ్యాలు

కరోనా వైరస్ ఆరోగ్య బీమా, ముందు నుంచీ ఉన్న వ్యాధులకు కవరేజీ అందించదు. అలాగే, కరోనా వైరస్ కు సంబంధించిన లక్షణాలను పాలసీని తీసుకోవడానికి ఆరు వారాలకు ముందు నుంచే కలిగి ఉన్న వారు, క్లెయిమ్ ను పొందటానికి అనర్హులు. 

డాక్టర్ సిఫారసు లేని ఆసుపత్రి వైద్యానికి కవరేజీ

బీమా చేసుకున్న వ్యక్తి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదా సిఫారసు లేకుండా ఏదైనా పరిస్థితికి సంబంధించి ఆసుపత్రిలో చేరినపుడు కూడా, వారు ఆ ఆసుపత్రి ఖర్చులకు కవరేజీ పొందటానికి అనర్హులు.

కొవిడ్-19 పాలసీని ఎందుకు కొనుగోలు చేయాలి?

మార్కెట్లో ప్రఖ్యాత బీమా సంస్థల నుంచి మీ కరోనా వైరస్ నిర్దిష్ట బీమా పొందడానికి మీరు కింది పేర్కొన్న దశలను అనుసరించాల్సి ఉంటుంది.

స్టెప్ 1- ఈ పేజీ దిగువన ఇప్పుడే కొనండి ట్యాబ్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 2- తర్వాత మీరు మీరు అనేక ఆరోగ్య& జీవి బీమా విధానాల నుంచి ఎంచుకోగల పేజీకి రీడైరెక్ట్ చేయబడతారు.

స్టెప్ 3-పథకం ఎంచుకుని ఈ ప్రణాళిక కొనండి ట్యాబ్ పై క్లిక్ చేయండి.

స్టెప్4- అవసరమైన వివరాలను పూరించండి.

స్టెప్ 5- మొదట ప్రీమియం చెల్లించండి మరియ మీ పాలసీ మీ మెయిల్ ఐడీకి పంపబడుతుంది.

కొవిడ్-19 బీమా పాలసీ యొక్క క్లెయిమ్ ప్రక్రియ ఏమిటి?

పాలసీదారుడు కొవిడ్-19 పాజిటివ్ గా నిర్థారించబడితే చికిత్సకు మరియు ఆసుపత్రి అనుబంధ ఖర్చులకు క్లెయిమ్ చేయవచ్చు.

రీయింబర్స్ మెంట్ క్లెయిమ్- మీరు రీయింబర్స్ మెంట్ క్లెయిమ్ ఎంచుకుంటే చికిత్స మరియు ఆసుపత్రికి సంబంధించిన ఖర్చులను మీరు స్వంతంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆసుపత్రి బిల్లులు, చెల్లింపు రశీదులు, కొవిడ్-19 పరీక్ష నివేదికతో సహా డయాగ్నోస్టిక్ నివేదికలు మరియు క్లెయిమ్ ఫారం వంటి అవసరమైన పత్రాలు సమర్పించడం ద్వారా బీమా చేసినవారు తరువాత రీయింబర్స్ మెంట్ క్లెయిమ్ ను సమర్పించవచ్చు.

నగదు రహిత క్లెయిమ్- ఈ విధానం కింద నగదు రహిత చికిత్స పొందవచ్చు. మీరు హెల్త్ కార్డును ఆసుపత్రిలో సమర్పించాల్సి ఉంటుంది. మీ ఖర్చులను నేరుగా ఆసుపత్రిలో పరిష్కరించడానికి మీ బీమా సంస్థకు సంబంధించిన వివరాలతో నగదు రహిత అభ్యర్థన ఫారం సమర్పించాల్సి ఉంటుంది.

బీమా పథకం యొక్క ప్రయోజనాలను పొందగలిగేలా, పాలసీదారుడు క్లెయిమ్ దాఖలు చేసే సమయంలో క్రింది పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

  • కొవిడ్-19 చికిత్స ప్రారంభించే ప్రభుత్వ వైద్య అధికారి చేత నిర్థారించబడిన సర్టిఫికేట్
  • పాలసీదారుడు కొవిడ్-19 పాజిటివ్ గా పరీక్షించబడితే వైరాలజీ నివేదిక సమర్పించాలి.

కరోనా వైరస్ కారణంగా పాలసీదారుడు మరణిస్తే, నామినీ సంబంధిత బీమా సంస్థకు తెలియజేయాలి మరియు క్లెయిమ్ ఫారంతో పాటు అవసరమైన అన్ని పత్రాలు సమర్పించాలి. మరణ ధృవీకరణ పత్రం, ఒరిజినల్ పాలసీ పత్రాలు, లబ్దిదారుడ ఐడి మొదలైనవి.

అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత క్లెయిమ్ ఆమోదం పొందితే, బీమా మొత్తం నామినీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది.

ఆరోగ్య బీమాపై ఐఆర్డీఏఐ తాజా ఉత్తర్వులు

ఐఆర్డీఏఐ కొరోనావైరస్ కు సంబంధించిన చెల్లింపు ప్రక్రియలకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ ఐఆర్డీఏఐ ప్రకటించిన మార్గదర్శకాల జాబితా క్రింద ఇవ్వబడింది:

  • అన్ని బీమా సంస్థలు కోవిడ్-19 కి సంబంధించిన బీమా చెల్లింపులను అత్యంత వేగవంతంగా ప్రాసెస్ చేయాలి.
  • చికిత్స జరుగుతున్న సందర్భంలో అనుమతించబడే ఖర్చుల విషయాలపై ఈ నియంత్రణా సంస్థ యొక్క నియమ నిబంధనలకు లోబడి వ్యవహరించాలి.
  • చెల్లింపు అభ్యర్థనల రివ్యూ కమిటీ, కోవిడ్-19 కుసంబంధించిన ప్రతీ చెల్లింపునూ నిశితంగా పరిశీలించాలి.
  • ఐఆర్డీఏఐ చట్టంలోని సెక్షన్ 14 (2) (ఈ) కింద ఇవ్వబడిన ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయి.