ఆరోగ్య బీమా
 • అగ్ర బీమా సంస్థల నుండి ఉత్తమ ప్రణాళికలు
 • పోల్చండి & తక్షణమే కొనండి
 • 80 డి కింద పన్ను ప్రయోజనాలు
PX step

ఆరోగ్య బీమా కొటేషన్లను ఆన్లైన్లో పోల్చుకోండి

1

2

పేరు
కవరేజీ
పుట్టినరోజు (పెద్ద సభ్యుడి)

1

2

ఫోన్ నం.
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

ఆరోగ్య బీమా అనేది పాలసీదారుని, వారి కుటుంబాన్ని, అనుకోని ప్రమాదాలు, అనారోగ్యం లేదా ఏదైనా తీవ్రమైన వ్యాధి నిర్ధారణ తర్వాత ఎదురయ్యే వైద్య ఖర్చుల నుండి రక్షించే ఒక బీమా పాలసీ. ఈ రోజుల్లో, అనేక సంస్థలు, నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం, పన్ను మినహాయింపులు వంటి పలు ప్రయోజనాలను అందించే ఆరోగ్య బీమా పథకాలను వినియోగదారులకు అందిస్తున్నాయి. 

ఆరోగ్య బీమా ఎందుకు ముఖ్యమైనది?

ఈ రోజుల్లో, మెరుగైన వైద్య చికిత్స పొందడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చికిత్స కోసం ఒక మంచి ఆసుపత్రిలో చేరితే కొద్ది రోజుల్లోనే మీ పొదుపు ఖాతాను ఖాళీ అవ్వడం ఖాయం. చికిత్స సమయంలో మీరు హాస్పిటల్ బిల్లుల గురించి చింతించటానికి బదులుగా, మీరు తిరిగి కోలుకోవడంపై దృష్టి కేంద్రీకరించాలి. ఆ దిశగా, ఆరోగ్య బీమా పాలసీ మీకు సహాయపడుతుంది. మీరు ఆరోగ్య బీమా కలిగి ఉన్నట్లయితే చికిత్స కోసం బీమా సంస్థతో ఒప్పందం ఉన్న ఏ నెట్‌వర్క్ ఆస్పత్రిలోనైనా చేరి నిబ్బరంగా కోలుకోవచ్చు.

భారతదేశంలో ఉత్తమ ఆరోగ్య బీమా పథకాలు

పథకం పేరు 

ప్రవేశ వయసు 

పునరుద్ధరణ 

భరోసా ఇచ్చే మొత్తం 

నెట్వర్క్ ఆసుపత్రులు 

రెలిగేర్ కేర్

కనీసం - 91 రోజులు 

పరిమితి - లేదు

జీవితకాలం 

రూ. 6 కోట్ల వరకు 

5420 కు పైగా 

స్టార్ ఫామిలీ హెల్త్ ఆప్టిమా 

కనీసం - 16 రోజులు 

పరిమితి - 65 సం.

జీవితకాలం 

రూ. 12 లక్షలు - రూ. 25 లక్షలు 

9800 కు పైగా 

మై హెల్త్ సురక్షా సిల్వర్ స్మార్ట్

కనీసం - లేదు

పరిమితి - లేదు

రూ. 3 లక్షలు - రూ. 1 కోటి 

10000 కు పైగా 

ఆదిత్య బిర్లా యాక్టీవ్ అస్యూర్ డైమండ్ 

కనీసం - 91 రోజులు 

పరిమితి - లేదు

జీవితకాలం 

రూ. 3 లక్షలు - రూ. 50 లక్షలు 

5700 కు పైగా 

HDFC ఎర్గో హెల్త్ ఆప్టిమా రిస్టోర్ (ఇంతకు ముందు అపోలో మ్యూనిచ్ ఆప్టిమా రిస్టోర్ )

కనీసం - 91 రోజులు 

పరిమితి - 65 సం.

జీవితకాలం 

రూ. 3 లక్షలు - రూ. 50 లక్షలు 

5000 కు పైగా 

 

ఆరోగ్య బీమా పాలసీ

ఆరోగ్య బీమా పాలసీ

ఆరోగ్య బీమా పాలసీ ప్రయోజనాలు

నగదు రహిత వైద్యం

మీరు నెట్ వర్క్ ఆసుపత్రిలో చికిత్స కోసం చెరితే మీ తరపున బీమా సంస్థ వైద్య ఖర్చులను చెల్లిస్తుంది. దీంతో మీరు మీ ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టవచ్చు. 

ఆసుపత్రిలో చేరక ముందటి మరియు చేరిన తర్వాతి ఖర్చులు

మీరు ఆసుపత్రిలో చేరడానికి ముందు, మరియు డిశ్చార్జి తర్వాత కూడా ఒక నిర్దిష్ట కాల పరిమితిలో అయిన ఖర్చులను బీమా సంస్థ నిబంధనలకు మరియు నియమాలకు లోబడి ఉన్నట్లయితే, ఈ ఖర్చులు ఆరోగ్య బీమా పాలసీ పరిథిలోనికి వస్తాయి.

పన్ను ప్రయోజనాలు

మీరు ఆరోగ్య బీమా పాలసీని తీసుకోగానే, మీరు కట్టే ప్రీమియంలపై, ఆదాయపుపన్ను చట్టం, 1961, సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను పొందడానికి అర్హులు. పాలసీదారుని వయసు మరియు వారి తల్లిదండ్రుల వయసు ఆధారంగా, ఒక నిర్ధిష్ట పరిమితి వరకు, పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.

రోజువారీ ఆసుపత్రి నగదు

మీరు ఆసుపత్రిలో చేరి ఉన్న సమయంలో, అక్కడ అవసరమయ్యే భోజనం, ప్రయాణం వంటి ఇతర ఖర్చుల కోసం, ఒక నిర్దిష్ట పరిమితి వరకు మీకు నేరుగా రోజువారీ నగదును బీమా సంస్థలు అందిస్తాయి. సాధారణంగా, ఇది రోజుకు రూ. 2000 వరకు ఉంటుంది. అయితే ఇది ఐసీయూ(ICU) కేసుల్లో చికిత్స ఖర్చు అంచనా ప్రకారం మారుతూ ఉంటుంది.

అవయవ మార్పిడి ఖర్చులు

అవయవ మార్పిడికి అయ్యే ఖర్చులను, బీమా సంస్థ భరించవచ్చు. అవయవ మార్పిడి చికిత్సకు అయ్యే ఖర్చులు ఆరోగ్య బీమా కిందకి వస్తాయి. అయితే, ఆ అవయవ మార్పిడి చికిత్స అనంతరం వచ్చే ఏదైనా వైద్య సమస్యలకు, అవయవ దాత ఖర్చులు మరియు వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చులకు బీమా సంస్థ బాధ్యత వహించదు.

నో క్లెయిమ్ బోనస్

ఇది మీరు బీమా సహాయాన్ని వాడుకోని ప్రతీ సంవత్సరానికి పొందే ఒక రాయితీ. మీరు పాలసీని పునరుద్ధరించుకునే సమయంలో లేదా పాలసీ మొత్తాన్ని పెంచుకోవాలని అనుకున్న సమయంలో, మీరు కట్టాల్సిన ప్రీమియంపై, NCB ద్వారా రాయితీ లభిస్తుంది. మీ పాలసీ పునరుద్ధరణ సమయంలో, మీరు తప్పకుండా నో క్లెయిమ్ బోనస్ కోసం చూడాలి.

ఉచిత వైద్య పరీక్షలు

పాలసీదారులను ఆరోగ్యకరమైన జీవితం వైపు ప్రోత్సహిస్తూ, బీమా సంస్థలు కొన్ని ఉచిత ఆరోగ్య పరీక్షలను అందిస్తాయి. ఇది మీరు తీసుకున్న పాలసీ మరియు సంస్థపై ఆధారపడి ఉంటుంది. మీరు బీమా తీసుకున్న సంస్థ నిబంధనల మేర మీరు ఒక మాస్టర్ హెల్త్ చెక్ అప్ కు అర్హులయ్యే అవకాశముంది. 

జీవితకాల పునరుద్ధరణ

ఈ విధానం మిమ్మల్ని సుదీర్ఘ కాలం పాటు బీమా పరిథిలో ఉంచుతుంది. మనలో చాలామంది ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనే అనుకుంటారు కానీ అనుకోని విధంగా అనారోగ్య సమస్యలు లేదా ప్రమాదాలు మనల్ని ఎదురుదెబ్బ తీస్తాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఆరోగ్య బీమా పాలసీని కలిగి ఉంటే మనకు కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆరోగ్య బీమా అనేది ఒక వరంలా అనిపిస్తుంది.

రిస్టోరేషన్ ప్రయోజనం

ఈ ప్రయోజనం కింద, ఒకవేళ పాలసీ అందచేసే మొత్తాన్ని మీరు పూర్తిగా వాడేసుకున్నా కూడా, బీమా సంస్థ ఆ మొత్తాన్ని తనంతట తానుగా రిస్టోర్ చేస్తుంది, మరియు దానికి మీరు అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ రిస్టోరేషన్ ప్రయోజనంతో ఉండే పాలసీలు సాధారణ ఆరోగ్య/వైద్య బీమా పాలసీల కన్నా ఖరీదైనవిగా ఉంటాయి మరియు పాలసీ షరతులను బట్టి వర్తించబడతాయి.

ఆరోగ్య బీమా పథకాల రకాలు

వినియోగదారుల అవసరాల మేర, పలు రకాల ఆరోగ్య బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి.

1. తీవ్ర అనారోగ్య పథకం

ఈ బీమా పథకం కింద ఏదైనా తీవ్ర అనారోగ్యం వచ్చిన సందర్భంలో, ఒక నిర్దిష్ట మొత్తాన్ని/చెల్లింపును అందించేలా ఉంటుంది. ఈ నగదు ప్రయోజనంతో, మీరు ఖరీదైన ఆసుపత్రి ఖర్చులను మరియు సమయానికి కావలసిన వైద్యాన్ని పొందగలరు.

2. సీనియర్ సిటిజెన్ ఆరోగ్య పథకం

సీనియర్ సిటిజెన్ ఆరోగ్య పథకం 60 సంవత్సరాల పైబడిన వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. ఇది వృద్ధాప్యంలో వచ్చే అన్ని రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొనడానికి సహాయపడుతుంది. ఐర్డీఏఐ(IRDAI) నియమాల ప్రకారం, ప్రతీ బీమా సంస్థ తప్పకుండా 65 సంవత్సరాల వరకు ప్రజలకు బీమా సౌకర్యం కల్పించాలి.

3. మాతృత్వ ఆరోగ్య బీమా

దాదాపు ప్రతీ ఆరోగ్య బీమా సంస్థ, పూర్వ మరియు ప్రసవానంతర సంరక్షణ, ప్రసవాలు ఖర్చులకు కవరేజ్ ఇస్తున్నాయి. కొన్నిసార్లు నవ జాత శిశువు టీకా మందుల ఖర్చులను కూడా కవర్ చేసే విధంగా మాతృత్వ ఆరోగ్య బీమాను బీమా సంస్థలు అందిస్తున్నాయి.

4. వ్యక్తిగత ఆరోగ్య బీమా

వ్యక్తిగత ఆరోగ్య బీమా ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య ఖర్చులను కవర్ చేస్తుంది, అయితే బీమా యొక్క పూర్తి మొత్తాన్ని పొందే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. వార్షికంగా మనం కట్టవలసిన ప్రీమియం, బీమా భరోసా ఇచ్చే మొత్తం మీద ఆధారపడి ఉంటుంది.

5. ఫామిలీ ఫ్లోటర్ ఆరోగ్య బీమా

ఫామిలీ ఫ్లోటర్ ఆరోగ్య బీమా ఒక కుటుంబంలోని అందరు వ్యక్తులకు ఒకే పాలసీ కింద బీమా చేయడానికి అనుమతిస్తుంది. అందరు కుటుంబ సభ్యులు, భరోసా ఇవ్వబడిన బీమా మొత్తం యొక్క ప్రయోజనాన్ని పొందుతారు. వ్యక్తిగత పాలసీలతో పోలిస్తే, కట్టవలసిన ప్రీమియం తక్కువగా ఉంటుంది. పాలసీదారుతో పాటుగా జీవిత భాగస్వామి, తనపై ఆధారపడి ఉన్న పిల్లలు, మరియు తల్లిదండ్రులను కూడా ఈ పాలసీలో జోడించవచ్చు. 

6. యూనిట్ లింక్డ్ ఆరోగ్య పథకం

యూనిట్ లింక్డ్ ఆరోగ్య పథకం, ఆరోగ్య బీమాను మరియు పొదుపును రెంటినీ కలిపే పథకం. ఆరోగ్య రక్షణతో పాటుగా, వైద్య బీమా పథకాలు కవర్ చేయని ఖర్చులను కూడా మీరు అందుకోగలిగేలా, ఒక పెట్టుబడి నిధిని మీరు ఏర్పాటుచేసుకునేలా ULHPs మీకు సహాయం చేస్తాయి.

ఆరోగ్య బీమా కొవిడ్-19 కు కవరేజీ అందిస్తుందా?

ప్రామాణిక ఆరోగ్య బీమా కొవిడ్-19 కు కూడా కవరేజీ అందిస్తుంది. కొవిడ్-19 చికిత్స సమయంలో పెషేంట్ ఖర్చులను బీమా సంస్థ చెల్లిస్తుంది. కొద్ది నెలల క్రితం ఐఆర్డీఏఐ కరోనా రక్షణ్ మరియు కరోనా కవచ్ వంటి కొవిడ్-19 నిర్దిష్ట పథకాలను ప్రారంభించింది. ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమాను కొవిడ్-19 కు కవరేజీ అందించినప్పటికీ, అదనపు ప్రయోజనాలు కోసం మీరు కొవిడ్-19 నిర్దిష్ట పథకాలను కొనుగోలు చేయవచ్చు. ఈ పథకాల గురించి మరించ తెలుసుకుందాం.

1. కరోనా రక్షక్

కరోనా రక్షక్ పాలసీ అనేది తక్కువ ధరలో లభించే ఆరోగ్య బీమా పాలసీ, ఇది కొవిడ్-19 నిర్థారణ అయితే, పాలసీదారునికి ఒకే మొత్తంలో ప్రయోజనాన్ని అందిస్తుంది. కొవిడ్-19 నిర్థారణ అయి, 72 గంటలపాటు ఆసుపత్రిలో చేరాల్సిన సందర్భంలో ఈ పథకం 100 శాతం బీమా మొత్తాన్ని అందిస్తుంది.

అర్హత

ఉత్పత్తి రకం

వ్యక్తిగతం

వెయిటింగ్ పిరియడ్

15 రోజులు

బీమా మొత్తం

రూ. 50 వేలు, 1.5 లక్షలు, 2 లక్షలు, 2.5 లక్షలు

పాలసీ కాల వ్యవధి

105 రోజులు, 195 రోజులు మరియు 285 రోజులు

ప్రవేశ వయసు

18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు

2. కరోనా కవచ్

కరోనా కవచ్ సరసమైన ధరలో లభించే ఆరోగ్య బీమా పథకం.ఈ పథకం మీకు మరియు మీ ప్రియమైన వారికి కొవిడ్-19 చికిత్సకు సమగ్ర కవరేజీ అందిస్తుంది. కొవిడ్-19 నిర్థారణ అయితే, ఆసుపత్రిలో చేరడం, ప్రీ హాస్పిటలైజేషన్ మరియు ఇంట్లో చికిత్స ఖర్చులు, ఆయుష్ చికిత్స విధానానికి కవరేజీ వంటి వాటికి కవరేజీ అందిస్తుంది.

అర్హత

ఉత్పత్తి రకం

వ్యక్తిగతం

వెయిటింగ్ పిరియడ్

15 రోజులు

ఇంట్లోని చికిత్స

బీమా మొత్తం

బీమా మొత్తం

రూ. 50 వేలు- రూ. 5 లక్షలు

పాలసీ కాల వ్వవధి

15 రోజులు, 195 రోజులు మరియు 285 రోజులు

ప్రవేశ వయసు

18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు

ఆరోగ్య సంజీవని పథకం

ఈ ప్రామాణిక ఆరోగ్య బీమా పథకాన్ని ఐఆర్డీఏఐ 2020 సంవత్సరం, ఏప్రిల్ 1 వ తేదీని ప్రారంభించింది. ఆరోగ్య బీమాను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం మరియు తక్కువ ధరలో అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టబడింది.

ఐఆర్డీఏఐ ప్రస్తుతం అన్ని సాధారణ మరియు స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థలకు ఆరోగ్య సంజీవని పాలసీని గ్రూప్ బీమా ఉత్పత్తిగా అందించడానికి అనుమతించింది.

ముఖ్యమైన ఫీచర్లు మరియు ప్రయోజనాలు

ప్రీ& పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్: అనారోగ్యం లేదా గాయం వల్ల కలిగే వైద్య చికిత్సతో అనుబంధించినబడిన ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు ఈ పథకం కవరేజీ అందిస్తుంది.

ఆరోగ్య పరీక్షల అవసరం లేదు: ఈ పథకాన్ని కొనుగోలు చేయడానికి, 45 సంవత్సరాల వయసు వరకు ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేదు.

కొవిడ్-19 కవర్: ఇది కరోనా వైరస్ చికిత్సకు కూడా కవరేజీ అందిస్తుంది.

ఆయుష్ చికిత్సకు కవరేజీ: ఈ పథకం ఆయుర్వేదం, హోమియోపతి, సిద్ధ వంటి ప్రత్యామ్నాయ చికిత్స పొందడానికి కవరేజీ అందిస్తుంది.

ఫ్రీ లుక్ పిరియడ్: 15 రోజు ఫ్రీ లుక్ పిరియడ్ పాలసీ ప్రారంభ దశలో అందించబడుతుంది. పునరుద్దరణ పై అందించబడదు.

జీవితకాల పునరుద్దరణ: జీవిత కాల పునరుద్దరణ ఎంపికతో ఈ పథకం వస్తుంది.

ఐసీయూ ఛార్జీలు: ఐసియూ చికిత్స కోసం ఈ పథకం బీమా మొత్తంలో 5 శాతాన్ని(రోజుకు రూ. 10,000) అందిస్తుంది. కవరేజీ మొత్తం బీమా మొత్తంపై ఆధారపడి ఉంటుంది.

ఇతర కవరేజీలు: ఈ పథకం అంబులెన్స్, డేకేర్ చికిత్స, కంటి శుక్లం,శస్త్రచికిత్స, ప్లాస్టిక్ సర్జరీ, దంత చికిత్స వంటి వాటికి కవరేజీ అందిస్తుంది.

అర్హత

ఉత్పత్తి రకం

వ్యక్తిగతంగా

బీమా మొత్తం

రూ. 1 లక్ష, 1.5 లక్షలు, 2 లక్షలు. 2.5 లక్షలు, 3 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు, 4.5 లక్షలు మరియు 5 లక్షలు

పాలసీ కాల వ్యవధి

1 సంవత్సరం

ప్రవేవ వయసు

18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు

ఆరోగ్య భీమా తీసుకునేటప్పుడు చూసుకోవలసిన విషయాలు

ఉత్తమమైన ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకోవడంలో నిర్ణయం తీసుకునే ముందు మీరు క్రింద ఇవ్వబడిన కొన్ని అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి.. 

అందించే కవరేజ్

వివిధ బీమాసంస్థలు పాలసీదారుకు వేర్వేరు రకాల సౌలభ్యాలను మరియు కవరేజీలను అందిస్తాయి. చికిత్సకు అవసరమయ్యేలా అన్ని సౌలభ్యాలను మరియు కవరేజీని సరిచేసుకోవడం చాలా ముఖ్యం. పాలసీలను పోల్చి, మీ అవసరాల జాబితాను తయారుచేసుకుని, దానికి సరిపోయే ఉత్తమమైన పాలసీని ఎంచుకోండి.

సంస్థ విశ్వసనీయత

ఒక వైద్య బీమా పథకాన్ని ఎంచుకునే ముందు, పాలసీదారు బీమా సంస్థ వెబ్ సైట్ ను పూర్తిగా పరిశీలించి, దాని వివరాలను తెలుసుకోవాలి. ఒక సంస్థ యొక్క ప్రొఫైల్ మరియు చరిత్రతో పాటుగా, ఆ సంస్థ వినియోగదారుల అభిప్రాయాలను కూడా తెలుసుకుని, సరైన ఎంపిక చేసుకోవాలి.

భరోసా ఇవ్వబడే మొత్తం

వైద్య బీమా పథకాన్ని ఎంచుకోవడంలో ముఖ్యమైన అంశం, బీమా సంస్థ పాలసీదారుకి భరోసా ఇచ్చే పాలసీ మొత్తం. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే, దానికి సంబంధించి భవిష్యత్తులో అయ్యే వైద్య ఖర్చులకు ఎంత డబ్బు అవసరం అనేదానిపై మీకు ఒక అవగాహన ఉండవచ్చు. కాబట్టి, సరైన పాలసీ మొత్తాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

కో-పే మరియు మినహాయింపు

బీమా సంస్థలు కొన్ని పాలసీలతో జత చేసే కో-పే మరియు మినహాయింపు షరతు కోసం తప్పుకుండా చూడండి. చెప్పాలంటే, ఇది బీమా తీసుకున్న వ్యక్తి వైద్య సేవలకు ఖర్చు చేసేందుకు అంగీకరించే ముందే నిర్ధారించిన మొత్తం (% లో). ఉదాహరణకు, కో-పే 10% మరియు పాలసీ చెల్లింపు మొత్తం 2 లక్షలయితే, బీమా తీసుకున్న వ్యక్తి 20,000 చెల్లిస్తే, బీమా సంస్థ మిగతా సొమ్మును భరిస్తుంది.

మరో వైపు, మినహాయింపు అనేది, బీమా సంస్థ పాలసీ కింద కవర్ అయ్యే ఖర్చులకు చెల్లింపు ఇచ్చే ముందు, పాలసీదారు ప్రతీ సంవత్సరం చెల్లించాల్సిన ఒక నిర్ధారిత మొత్తం. ఉదాహరణకు, ఒక వ్యక్తి మినహాయింపు రూ. 1,00,000. మార్చి నెలలో తనకి వైరల్ ఇన్ఫెక్షన్ సోకి, రూ.10,000 వైద్య ఖర్చయితే, అది ఆ సంవత్సరంలో మొదటి చెల్లింపు కాబట్టి, మొత్తం సొమ్ము బీమా చేయించుకున్న వ్యక్తే చెల్లించాలి. జూన్ నెలలో తను ప్రమాదానికి గురై చిన్న శస్త్రచికిత్సకు రూ.1,50,000 ఖర్చయితే, అందులో రూ.90,000 (10,000 పోగా లక్షలోమిగిలినది) ఆ వ్యక్తే చెల్లించుకుంటే, మిగిలిన సొమ్మును బీమా సంస్థ చెల్లిస్తుంది. తర్వాత, అక్టోబర్ నెలలో, రెండు చోట్ల ఎముకలు విరిగి అయిన రూ.40,000 ఆసుపత్రి బిల్లును, ఆ వ్యక్తి అప్పటికే మినహాయింపు మొత్తాన్ని (1,00,000) చెల్లించేశాడు కాబట్టి, బీమా సంస్థే పూర్తిగా చెల్లిస్తుంది.

అదనపు ప్రయోజనాలు మరియు పథకాలు

బీమా సంస్థలు, వినియోగదారునికి, ఒక సంపూర్ణ ఆరోగ్య రక్షణా కవచం అందేలా, పాలసీ యొక్క కవరేజీని, పరిథిని మరియు అనుకూలతలను పెంచుతూ అనేక రైడర్లను అందిస్తాయి. మీరు కొంత అదనపు ప్రీమియం చెల్లించి ఒక టాప్-అప్ పథకాన్ని మీ పాలసీకి జోడించవచ్చు.

నగదురహిత చెల్లింపు అవకాశం

నగదు రహిత చెల్లింపు అనేది, అత్యవసర వైద్య సహాయం కావలసిన పరిస్థితిల్లో చాలా ముఖ్యమయ్యే అంశం. కాబట్టి, బీమా సంస్థ ఈ సౌలభ్యాన్ని కల్పిస్తోందో లేదో ఒకసారి సరిచూసుకోండి.

సరైన ఆరోగ్య బీమా కంపెనీని ఎలా ఎంచుకోవాలి?

ప్రస్తుతం మార్కెట్ లో అనేక బీమా సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల్లో ఉత్తమమైన దానిని ఎంచుకోవడానికి చాలా పరిశోధన అవసరం. ఆ పరిశోధన దాదాపు క్రింద ఇవ్వబడిన అంశాలపైనే ఆధారపడి ఉంటుంది.

సంస్థపై ఉన్న నమ్మకం:

బీమా సంస్థపై ఉన్న అభిప్రాయం చాలా ముఖ్యమైనది. ప్రజల్లో మంచి అభిప్రాయం ఉన్న సంస్థతో వెళ్లడం మంచిది. సరైన ఆరోగ్య బీమాను ఎంచుకోవడంలో మీకు సహాయపడడానికి, మంచి పరిశోధన అవసరం.

ఆర్థిక సుస్థిరత:

బీమా సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని మీరు పరిశీలించాలి. మీరు దానిని క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CRISIL ) లో చూడవచ్చు. ఒక సంస్థ తన బాధ్యతలను నిర్వహించగల ఉత్తమ ఆర్థిక సుస్థిరతతో ఉన్నట్లు సూచించే AAA రేటింగ్ ఉన్న ఏదైనా సంస్థను మీరు ఎంచుకోవచ్చు.

పథకాల జాబితా:

బీమా రంగం అనేది సమయంతో పాటు మారుతూ ఉండే ఒక పెద్ద ఇండస్ట్రీ అని మర్చిపోవద్దు. మీ అవసరాల లాగే, అది కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాబట్టి, వినియోగదారుల వివిధ రకాల అవసరాలకు పనికొచ్చే విస్తృతమైన బీమా పాలసీలను అందించే ఒక సంస్థను ఎంచుకోవడం ముఖ్యం.

సులభమైన మరియు త్వరిత చెల్లింపు ప్రక్రియ:

పాలసీ చెల్లింపును సులభంగా మరియు త్వరితంగా చేసే పద్దతిని కలిగి ఉన్న ఒక బీమా సంస్థ కోసం చూడండి. అత్యవసర సమయాలలో, సరైన వైద్య సదుపాయాలను పొందటానికి, సమయానికి పాలసీ చెల్లింపు అందడం అత్యంత కీలకంగా ఉంటుంది.

వినియోగదారుల సేవా కేంద్రం:

బీమా సంస్థ అందించే వినియోగదారుల సేవల నాణ్యతపై కూడా దృష్టి పెట్టండి.ఇందుకోసం మీరు ఆ సేవలను పొందిన వినియోగదారుల రేటింగులు మరియు రివ్యూలను చూడవచ్చు. ఆన్ లైన్ చాట్, ఇమెయిల్ సహాయం మరియు ఫోన్ సహాయాన్ని అందించే సంస్థను ఎంచుకోండి.

బీమా సలహాదారు:

ఒక సాధారణ వ్యక్తి బీమా గురించి అర్థం చేసుకోవడం కొంచం కష్టం. కానీ ఇప్పుడు చాలా బీమా సంస్థలు, మీ అవసరాలను అనుసరించి, బీమా పాలసీని ఎంచుకోవడంలో సహాయం చేసే, బీమా సలహాదారులను నియమిస్తున్నాయి.

అభిప్రాయాలు మరియు రివ్యూలు:

 ఒక బీమా సంస్థ పొందే వినియోగదారుల రేటింగులను మరియు రివ్యూలను చూసుకోవడం, సాధారణంగా అనుసరించే ఒక ముఖ్యమైన అంశం. మీరు ఐఆర్డీఏఐ(IRDAI) వారి వెబ్ సైట్లో, ఒక బీమా సంస్థపై ఇవ్వబడిన ఫిర్యాదులు మరియు వాటి పర్యవసానాలను చూడవచ్చు.

కుటుంబ ఆరోగ్య బీమా పాలసీ

కుటుంబ ఆరోగ్య బీమా పాలసీ

PolicyX.com లో ఆరోగ్య బీమా ఎందుకు సరిపోల్చాలి?

PolicyX.com మీ బీమా సంబంధిత అవసరాలకు వన్ స్టాప్. ఇది ఐఆర్డీఏఐ చేత గుర్తించబడి సర్టిఫైడ్ వెబ్ ఇన్సూరెన్స్ అగ్రిగేటర్.(లైసెన్స్ నెంబర్ ఐఆర్డీఏఐ/WBA 17/14).

మీరు PolicyX.com ద్వారా అగ్ర బీమా సంస్థల నుంచి ఆరోగ్య బీమా పథకాలను పోల్చవచ్చు మరియు మీ అవసరాలకు అనుగుణంగా ఉత్తమమైన పథకాన్ని కొనుగోలు చేయవచ్చు. మా బృందం మీ బడ్జెట్ లో ఉత్తమమైన పాలసీని ఎంచుకునేందుకు మద్దతు అందిస్తుంది. PolicyX.com గురించి ఈ కింది ముఖ్యమైన ఫీచర్లు తెలుసుకుందాం.

 • PolicyX.com నిష్పాక్షికమైన కోట్స్ తో, పథకాలను సరిపోల్చుకునే సేవలు ఉచితంగా అందిస్తుంది.
 • 30 సెకన్లలోపు 10 కంపెనీలకు పైగా అందించే ఆరోగ్య బీమా పథకాలను ఒక వ్యక్తి పోల్చుకోవచ్చు.
 • మీరు 5 నిమిషాల్లో మీ అవసరాలకు అనుగుణంగా ఉత్తమ వైద్య బీమా పాలసీని కొనుగోలు చేయవచ్చు.
 • కేవలం ప్రాథమిక సమాచారాన్ని అందజేసి, మీకు సరియైన ఆరోగ్య బీమా పథకాలు ఎంచుకునే అవకాశం మరియు ఆన్లైన్ ప్రతిపాదన ఫారం నింపడం ద్వారా ఫీచర్లు, ఖర్చు, రైడర్స్, మినహాయింపులు, ప్రయోజనాలు వంటి విషయాలను కొన్ని నిమిషాల వ్యవధిలోనే తెలుసుకోవచ్చు.
 • వినియోగదారుని సౌలభ్యం మేరకు పాలసీని కొనుగోలు చేసే విధానాన్ని అందిస్తుంది. ప్రస్తుతం అన్ని ఆరోగ్య బీమా పథకాలు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి మరియు ఆన్లైన్ లో చెల్లింపు చేయడం ద్వార మీరు మీ పాలసీని తక్షణమే పొందవచ్చు.
 • PolicyX.com ప్రముఖ బ్రాండ్లైన కేర్ హెల్త్ మాక్స్ బుపా, భారతి ఆక్సా, టాటా ఏఐఏ, అపోలో మ్యూనిచ్, స్టార్ హెల్త్ పథకాల మరియు సరిపోలికలను అందిస్తుంది.

PolicyX.com ద్వారా ఆరోగ్య బీమాను పథకాన్ని ఎలా కొనుగోలు ప్రక్రియ

 • స్టెప్1: ఈ పేజీ పై భాగానికి వెళ్లి ఆన్లైన్ లో ఆరోగ్య బీమా కోట్స్ ను సరిపోల్చండి విభాగాన్ని ఎంచుకోండి మరియు ఫారంను పూరించండి.
 • స్టెప్2: డ్రాప్ డౌన్ ట్యాబ్ నుంచి పేరు, పుట్టిన తేదీ మరియు కవరేజీ ఎంచుకోండి వంటి ప్రాథమిక వివరాలు అందించండి. 1. వయోజనులకు, 2. పెద్దలు మరియు పిల్లల కోస. తర్వాత కొనసాగండి ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • స్టెప్ 3: మీ మొబైల్ నంబర్, ఊరు ఎంటర్ చేసి కొనసాగండి ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • స్టెప్4: వేర్వేరు బీమా సంస్థల కోట్స్ ను సరిపోల్చండి మరియు మీ అవసరాలకు అనుగుణంగా సరైన పథకాన్ని ఎంపిక చేసుకోండి.
 • స్టెప్5: ఈ పథకాన్ని కొనుగోలు చేయండి ట్యాబ్ పై క్లిక్ చేయండి, మీ వైద్య చరిత్ర, గుర్తింపు రుజువు మరియు అవసరమైన పత్రాలతో ఫారంను నింపండి. సేవ్& కొనసాగించు ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • స్టెప్ 6: అందుబాటులో ఉన్న వివిధ ఆన్లైన్ చెల్లింపు పద్ధతుల ద్వారా చెల్లింపు జరపండి.
 • స్టెప్7: పూర్తయింది! మీరు ఇప్పుడు పాలసీని కలిగి ఉన్నారు.

PolicyX.com బృందం పాలసీ పత్రాలను తక్షణమే మీ రిజిస్ట్రర్డ్ మెయిల్ కు పంపుతుంది.

(గమనిక: ప్లాన్ ఫీచర్లు మరియు ఇన్సూరెన్స్ మొత్తాన్ని బట్టి , పాలసీ నిబంధనలు మరియు షరతుల ఆధారంగా వైద్య పరీక్షలు అవసరమయ్యే అవకాశం ఉంది.)

ఆరోగ్య బీమా సంస్థల యొక్క క్లైయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి

క్లైయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి అంటే బీమా సంస్థ అందుకున్న మొత్తం డెత్ క్లైయిమ్ ల సంఖ్య మరియు క్లైయిమ్ ల నిష్పత్తి. ఇది ఒక ముఖ్యమైన కారంకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది బీమా సంస్థ తిరస్కరించిన వాటికి స్థిరపడిన క్లైయిమ్ ల సంఖ్యను చూపుతుంది. ఈ నిష్పత్తితో మీ ఆరోగ్య బీమా పాలసీ కోసం సరైన బీమా సంస్థను ఎన్నుకోవడంలో మీకు స్పష్టత ఉంటుంది. మీరు అధిక క్లైయిమ్ నిష్పత్తి అందిస్తున్న బీమా సంస్థను ఎంచుకోవాల్సి ఉంటుంది.

క్లైయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 2018-19*


హెచ్ డిఎఫ్ సి ఎర్గొ ఆరోగ్య బీమా సంస్థ

63%

బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్

85%

భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెనస్ సంస్థ

89%

చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ

35%

మణిపాల్ సిగ్నా ఆరోగ్య బీమా సంస్థ

62%

ఫ్యూచర్ జనరలీ ఆరోగ్య బీమా సంస్థ

73%

హెచ్ డిఎఫ్ సి ఎర్గొ జనరల్ ఇన్సూరెన్స సంస్థ

62%

ఇఫ్కో టోకియో ఇన్సూరెన్స్ సంస్థ

102%

లిబార్టీ విడియోకాన్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ

82%

మాగ్మా హెచ్ డిఐ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ

90%

మాక్స్ బుపా ఆరోగ్య బీమా

54%

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ

107.64%

ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ

103.74%

ది ఒరియంటల్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

108.80%

రేహజా క్యుబిఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

33%

రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

94%

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ

55%

రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

61%

ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

52%

శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

53%

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ

63%

టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

78%

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ

110.51%

యూనివర్సిల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్

92%

ఆరోగ్యం / వైద్య బీమా చెల్లింపు ప్రక్రియ

ఒక బీమా పాలసీలో ముఖ్యమైన అంశం, చెల్లింపు ప్రక్రియ. పాలసీ చెల్లింపుల గురించి ప్రతీ ఒక్కరు భయపడుతూ ఉంటారు. చెల్లింపు కోసం కొన్ని బీమా సంస్థలు నేరుగా చెల్లించే పద్దతిని అనుసరిస్తే, కొన్ని TPA (థర్డ్ పార్టీ నిర్వహణ) ల సహాయాన్ని తీసుకుంటాయి. ఈ చెల్లింపు పద్దతి, కింద ఇవ్వబడిన రెండు రకాలుగా ఉంటుంది:

1. నగదురహిత చెల్లింపు


పాలసీదారుకు కావలసిన వైద్య సదుపాయాన్ని, పాలసీ సంస్థ యొక్క నెట్వర్క్ ఆసుపత్రులలో మాత్రమే నగదు రహితంగా పొందవచ్చు. ఆసుపత్రిలో చేరడానికి కొంచెం ముందు, అత్యవసర వైద్య సమయాలలో అయితే, కొంత కాలవ్యవథి లోపు, TPA కు తప్పనిసరిగా దానిగురించి తెలియజేయాలి. ఆసుపత్రిలో ఉన్న బీమా విభాగం డాక్యుమెంట్ల విషయంలో మీకు సహాయపడుతుంది. ఈ వైద్య చెల్లింపును TPA ఆమోదించిన తర్వాత మాత్రమే, ఆసుపత్రి బీమా సంస్థ నుంచి సొమ్ము పొందుతుంది. అయితే, TPA ఆమోదించని కొన్ని ఇతర ఖర్చులు ఉండవచ్చు. అటువంటి వాటిని మీరే ఆసుపత్రి క్యాష్ కౌంటర్ వద్ద చెల్లించాలి. 

అనుసరించాల్సిన పద్దతి:-

 • బీమా సంస్థకు ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా తెలియజేయడం
 • ఒకవేళ బీమా సంస్థ ఏ విధంగానూ స్పందించక పొతే, policyX ను, టోల్ ఫ్రీ నెంబర్ 1800-4200-269 ద్వారా సంప్రదించండి లేదా This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. కు ఇమెయిల్ పంపండి.
 • PolicyX మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, మీ చెల్లింపు పొందేలా మీకు సహాయం చేస్తుంది.
 • మీ ఆరోగ్య బీమా సంస్థ ఇచ్చిన ఆరోగ్య కార్డును, మీ సాధారణ గుర్తింపు కార్డును చూపించండి.
 • ఆసుపత్రి, పాలసీదారు గుర్తింపు ఆధారాలను పరిశీలించి, ఆరోగ్య బీమా సంస్థకు ప్రీ-అథారైజేషన్ పత్రాన్ని పంపిస్తుంది.
 • ఆరోగ్య బీమా సంస్థ అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి, అంతా వారి నియమాల ప్రకారం సరిచూసుకున్నాక, చెల్లింపు ప్రక్రియను మొదలుపెడతారు. 
 • కొన్ని ఆరోగ్య బీమా సంస్థలు మీకు ఈ ప్రక్రియలో సహాయపడటానికి ఒక ఫీల్డ్ డాక్టర్ ని నియమిస్తాయి.
 • అన్ని ప్రక్రియలూ పూర్తయ్యాక, బీమా సంస్థ నియమాల ప్రకారం చెల్లింపు చేయబడుతుంది.

2. ఖర్చుల తర్వాత చెల్లింపు


పాలసీదారు ఖర్చుల తర్వాత చెల్లింపును, పాలసీ సంస్థ యొక్క నెట్వర్క్ ఆసుపత్రులలోనే కాక, ఇతర ఆసుపత్రులలో కూడా పొందవచ్చు. ఇందులో మీరు వైద్య సౌకర్యాలను పొందడం, మరియు బిల్లును చెల్లించడం ఆసుపత్రితో నేరుగా చేయాలి. ఆ తర్వాత మీరు ఆ ఖర్చులకు సంబంధించిన పత్రాలను మరియు రసీదులను పంపి, TPA ద్వారా ఖర్చుల తర్వాత చెల్లింపు కోరవచ్చు. 

అనుసరించాల్సిన పద్దతి:- ఖర్చుల తర్వాత చెల్లింపు

 • బీమా సంస్థకు ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా వీలైనంత త్వరగా తెలియజేయడం
 • ఒకవేళ బీమా సంస్థ ఏ విధంగానూ స్పందించక పొతే, policyX ను, టోల్ ఫ్రీ నెంబర్ 1800-4200-269 ద్వారా సంప్రదించండి లేదా This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. కు ఇమెయిల్ పంపండి.
 • PolicyX మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, మీ చెల్లింపు పొందేలా మీకు సహాయం చేస్తుంది.
 • మీ అన్ని డాక్యుమెంట్లను, ఆసుపత్రి రసీదులను దగ్గర పెట్టుకోండి
 • చెల్లింపు అభ్యర్థన పత్రాలతో సహా డాక్యుమెంట్లను, ఆసుపత్రి రసీదులను అందించడం,
 • ఆరోగ్య బీమా సంస్థ అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి, అంతా వారి నియమాల ప్రకారం సరిచూసుకున్నాక, చెల్లింపు ప్రక్రియను మొదలుపెడతారు. 
 • అన్ని ప్రక్రియలూ పూర్తయ్యాక, పాలసీ నియమాల ప్రకారం చెల్లింపు చేయబడుతుంది.

ఖర్చుల తర్వాత చెల్లింపుకు కావలసిన డాక్యుమెంట్లు

 • వయస్సు ధృవీకరణ పత్రం : పాన్ కార్డు, స్కూలు లేదా కాలేజీ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాసుపోర్టు, ఓటర్ ఐడీ, మొదలైనవి
 • ఫోటో ధృవీకరణ పత్రం : ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాసుపోర్టు, ఓటర్ ఐడీ, మొదలైనవి
 • చిరునామా ధృవీకరణ పత్రం : రేషన్ కార్డు, బ్యాంకు అకౌంట్ స్టేట్మెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, పాసుపోర్టు, ఓటర్ ఐడీ, టెలిఫోన్ బిల్లులు మొదలైనవి
 • ఆదాయ ధృవీకరణ పత్రం : ఉద్యోగ సర్టిఫికెట్, శాలరీ స్లిప్, ఫారం16 మొదలైనవి
 • వైద్య ధృవీకరణ పత్రం : బీమా సంస్థ అడిగిన పక్షంలో అందించాల్సి ఉంటుంది.