ఆరోగ్య సంజీవని అనేది ఒక సాండర్డ్ ఆరోగ్య బీమా పాలసీ, ఇది పాలసీదారులకు ప్రాథమిక ఆరోగ్య రక్షణను అందిస్తుంది. వివిధ రకాల పాలసీ ప్రయోజనాలు, నిబంధనలు గురించి గందరగోళానికి గురయ్యే సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకుని సులభంగా మరియు సరళంగా ఉండేలా ఈ పాలసీని రూపొందించారు. 2020వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ఈ పాలసీని ప్రారంభించారు. సంస్థ పేరుతో సంబంధం లేకుండా ప్రతి సంస్థ ఆరోగ్య సంజీవని పేరుతోనే ఈ బీమా పథకాన్ని అందిస్తున్నాయి.
ఐఆర్డీఏఐ నిర్దేశించిన ప్రకారం ఈ బీమా పథకంతో పాటు బీమా సంస్థలు ఎటువంటి యాడ్-ఆన్స్, రైడర్లు జత చేయడం లేదా పాలసీలో మార్పులు వంటివి చేయకూడదు. ఈ కారణాలతో ఆరోగ్య సంజీవని బీమా పథకం సామాన్య మానవులకు తక్కువ ధరలో లభిస్తుంది.
ప్రధానాంశాలు
ప్రవేశ వయసు |
18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు |
బీమా మొత్తం |
రూ. 1,00,000 నుంచి రూ. 5,00,000 |
పునరుద్దరణ |
జీవిత కాలం |
పన్ను ప్రయోజనాలు |
ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్ 80D కింద |
ఆరోగ్య సంజీవని పథకం యొక్క ముఖ్యమైన ఫీచర్లు ఏమిటి?
- 45 సంవత్సరాల్లోపు వినియోగదారులందరూ మెడికల్ టెస్టులు లేకుండా పాలసీ పొందవచ్చు. అయితే పాలసీ పొందే నాటికి ఎలాంటి మెడికల్ హిస్టరీ ఉండకూడదు.
- గుర్తింపు పొందిన ఆసుపత్రిలో ఆయుష్ చికిత్సకు కూడా పాలసీదారుడు కవరేజీ పొందవచ్చు.
- ఒకే ఇన్సూరెన్స్ పథకం కింద మొత్తం కుటుంబం కవరేజీ పొందవచ్చు.
- ఐఆర్డీఏఐ మార్గదర్శకాల ప్రకారం ప్రతి క్లైయిమ్ ఫ్రీ సంవత్సరానికి పాలసీదారుడు నో క్లైయిన్ బోనస్ పొందవచ్చు. ఈ నో క్లైయిమ్ బోనస్ కనిష్టంగా 5 శాతం, గరిష్టంగా 50 శాతం వరకు లభిస్తుంది.
- పాలసీ కాల వ్యవధిలో మీ పాలసీని ఒక బీమా సంస్థ నుండి మరో బీమా సంస్థకు మార్చుకోవచ్చు.
- కుటుంబంలో ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది సింగిల్ ప్రపోజల్ మరియు వ్యక్తిగత జీవిత కవరేజీ కలిగి ఉంటే మొత్తం కుటుంబానికి డిస్కౌంట్ లభిస్తుంది.
ఆరోగ్య సంజీవని బీమా పథకం ఎవరికి మరియు వేటికి వర్తిస్తుంది?
పాలసీలో ఈ క్రింది కుటుంబసభ్యులను చేర్చవచ్చు….
- చట్ట బద్ధంగా వివాహం చేసుకున్న జీవిత భాగస్వామి
- 3 నుంచి 25 సంవత్సరాల వయసు గల, మీ పై ఆధారపడ్డ పిల్లలు(సొంత లేదా దత్తత)
3. తల్లిదండ్రులు మరియు అత్త మామలు
- ఆసుపత్రి ఖర్చులు, అంటే ఆసుపత్రి గది అద్దె, నర్సింగ్, బోర్డింగ్, మొదలైన ఖర్చులు.
- ఇంటెన్సివ్ కేర్ యూనిట్( ICU) లేదా ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్(ICCU) ఖర్చులు.
- సర్జన్, మెడికల్ ప్రాక్టీషనర్, కన్సల్టెంట్ లేదా స్పెషలిస్ట్ ఫీజులు కవర్ చేయబడతాయి. ఈ బిల్లులు నేరుగా ప్రాక్టీషనర్ కి లేదా ఆసుపత్రికి చెల్లించబడతాయి.
- ఆసుపత్రిలో చేరే ముందు 30 రోజుల వరకు ప్రీ హాస్పిటలైజేషన్ మెడికల్ ఖర్చులను ఈ పాలసీ అందిస్తుంది.
- ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత 60 రోజుల పాటు పోస్ట్ హాస్పిటలైజేషన్ మెడికల్ ఖర్చులను అందిస్తుంది.
- కరోనా చికిత్సకు అయ్యే ఖర్చులకు కవరేజీ అందిస్తుంది.
- డే కేర్ చికిత్స ఖర్చులు.
- కంటి శుక్లాల చికిత్స ఖర్చులు.
- ఆధునిక చికిత్సా పద్ధతులకు అయ్యే ఖర్చులు.
- అంబులెన్స్ కవరేజీ.
- దంత చికిత్స మరియు గాయం లేదా వ్యాధి కారణంగా ప్లాస్టిక్ సర్జరీకి అయ్యే ఖర్చులు.
ఆరోగ్య సంజీవని పథకం వీటికి వర్తించదు
- 18 సంవత్సరాలు వయసు నిండిన పిల్లలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటే వారికి ఈ పాలసీ వర్తించదు.
- రోగ నిర్థారణ పరీక్షలకు వర్తించదు.
- మాదక ద్రవ్యాలు మరియు మద్యపానం మత్తులో కలిగే గాయాలు లేదా వ్యాధుల చికిత్సకు వర్తించదు.
- ప్రమాదకర సంఘటనలు లేదా సాహస క్రీడల్లో పాల్గొనడం వల్ల అయ్యే గాయాలకు చికిత్స.
- తమకు తాముగా చేసుకున్న గాయాలకు అయ్యే చికిత్స.
- యుద్ధంలో పాల్గొనడం ద్వారా అయ్యే గాయాల చికిత్స.
- చట్ట వ్యతిరేక మరియు నేరాలు చేసేటప్పుడు అయ్యే గాయాల చికిత్సకు.
- రక్షణ కార్యకలాపాల్లో( ఆర్మీ/ నేవీ/ వైమానిక దళం) పాల్గొనడం వల్ల కలిగే గాయాల చికిత్స.
- లైంగిక సంక్రమణ వ్యాధుల చికిత్సకు.
- ఊబకాయం లేదా వెయిట్ మేనేజ్ మెంట్ చికిత్సకు అయ్యే ఖర్చు.
- గర్భం మరియు ప్రసవానికి అయ్యే ఖర్చులు.
- స్టెనిలిటీ మరియు వంధ్యత్వానికయ్యే చికిత్స ఖర్చులు.
- ప్రిస్కిప్షిన్ లేకుండా కొనుగోలు చేసే విటమిన్, మినరల్ ట్యాబ్లెట్స్ ఖర్చులు.
- చికిత్సకు సంబంధించి ఆసుపత్రి బిల్లులు సమర్పించకపోతే ఈ పథకం వర్తించదు.
- చికిత్స అవసరం లేకుండా కేవలం విశ్రాంతి ద్వారా తగ్గే వ్యాధులకు అయ్యే ఖర్చులు.
- విదేశాల్లో చికిత్సకు అయ్యే ఖర్చులు.
ఆరోగ్య సంజీవని పథకం రద్దు మరియు రీఫండ్ షరతులు ఏంటీ?
పాలసీదారుడు వారి వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్య సంజీవని బీమా పథకాన్ని రద్దు చేసుకోవచ్చు. పాలసీ 15 రోజుల ఫ్రీ-లుక్ పిరియడ్ తో వస్తుంది. ఈ ఫ్రీ-లుక్ పిరియడ్ అంటే మొదటి 15 రోజుల్లో ఎటువంటి క్యాన్షిలేషన్ ఫీజు చెల్లించకుండానే పాలసీదారుడు బీమా పథకాన్ని రద్దు చేసుకోవచ్చు. అంతేకాకుండా పాలసీదారుడు చెల్లించిన ప్రీమియం వెనక్కి ఇవ్వబడుతుంది. అయితే ఈ సమయంలో ఎటువంటి క్లైయిమ్స్ చేసి ఉండకూడదు.
ఈ ఫ్రీ-లుక్ సౌలభ్యం పాలసీ పునరుద్దరణ సమయంలో అందుబాటులో ఉండదు. అయితే మీ ఫ్రీ-లుక్ పిరియడ్ ముగిసిన తర్వాత కూడా మీరు బీమా పాలసీని రద్దు చేసుకునే అవకాశముంది. అయితే పాలసీని రద్దు చేసే ముందు మీరు మీ బీమా సంస్థకు 15 రోజుల నోటీస్ లెటర్ అందించాల్సి ఉంటుంది. మీరు చెల్లించబడిన ప్రీమియం తిరిగి చెల్లించబడుతుంది.
ప్రీమియం వాపసు రేట్లను క్రింది పట్టికలో చూడవచ్చు…..
పాలసీ రద్దు చేసిన సమయం |
వాపసు ఇవ్వబడే ప్రీమియం శాతం |
30 రోజుల్లోపు |
75% |
31 రోజుల నుంచి- 90 రోజులు |
50% |
3 నెలలు నుంచి - 6 నెలలు |
25% |
6 నెలలు నుంచి- 12 నెలలు |
0 % |
PolicyX.com ద్వారానే ఎందుకు ఆరోగ్య సంజీవని పథకాన్ని కొనుగోలు చేయాలి?
మీ ఆరోగ్య బీమా అవసరాలకు PolicyX.com ని వన్-స్టాప్ షాప్ గా చేసుకోవచ్చు. అంతేగాక బీమా కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతుంది. కొన్ని ఇతర అంశాలను పరిశీలిద్దాం...
- PolicyX.com ఐఆర్డీఏఐ చేత గుర్తింపు పొందింది. లైసెన్స్ నెంబర్: IRDA/WB17/14.
- వివిధ బీమా సంస్థలు అందిస్తున్న పథకాలను ఎటువంటి ఖర్చు లేకుండా సులభంగా సరి పోల్చుకునే అవకాశం.
- డిజిటల్ విధానం ద్వారా క్లిష్టమైన పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు.
- policyX కస్టమర్ సర్వీస్ నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.
- యూజర్- ఫ్రెండ్లీ వెబ్ సైట్ ద్వారా బీమా కొనుగోలు ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది.
- కొనుగోలు ప్రక్రియ చాలా వేగంగా పూర్తవుతుంది. దీని వల్ల మీ విలువైన సమయం ఆదా అవుతుంది.
క్లైయిమ్ సెటిల్మెంట్ విషయంలో PolicyX.com ఎలా సహాయం చేస్తుంది?
క్లైయిమ్ సెటిల్మెంట్ కు ఒక్కోసారి చాలా సమయం పట్టవచ్చు లేదా ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోవచ్చు. అయితే క్లైయిమ్ సెటిల్మెంట్ విషయంలో policyX కస్టమర్ సర్వీస్ విభాగం మీకు సహాయపడుతుంది.
మద్దతు కోసం ఈ ఛానళ్ల ద్వారా సంప్రదించవచ్చు..
ఈ-మెయిల్ - This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
Toll-free Number: 1800-4200-269
ఆరోగ్య సంజీవని పథకం పునరుద్దరణ ఏలా?
ఆరోగ్య సంజీవని బీమా పథకం జీవిత కాల పునరుద్దరణకు అర్హమైన పథకం. కాబట్టి, మీరు బ్రతికి ఉన్నంత కాలం పాలసీ పునరుద్దరణ చేసుకోవచ్చు. పాలసీ ప్రయోజనాలను పొందాలంటే పునరుద్దరణ గడువు తేదీ లోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక వేళ గడువులోపు పునరుద్దరణ చేయలేకపోతే, రెన్యువల్ చేసుకోవడానికి మీకు అదనంగా 30 రోజుల గ్రేస్ పిరియడ్ ఉంటుంది. ఈ గ్రేస్ పిరియడ్ లో కూడా పునరుద్దరణ చేసుకోకపోతే పాలసీ రద్దు చేయబడుతుంది.
PolicyX.com వైబ్ సైట్ ద్వారా మీరు ఆన్ లైన్ లో మీ వివరాలు ఎంటర్ చేసి సులభంగా మీ పాలసీ రెన్యువల్ చేసుకోవచ్చు.