చోళమండలం ఆరోగ్య బీమా
 • అగ్ర బీమా సంస్థల నుండి ఉత్తమ ప్రణాళికలు
 • పోల్చండి & తక్షణమే కొనండి
 • 80 డి కింద పన్ను ప్రయోజనాలు
PX step

ఆరోగ్య బీమా కొటేషన్లను ఆన్లైన్లో పోల్చుకోండి

1

2

పేరు
కవరేజీ
పుట్టినరోజు (పెద్ద సభ్యుడి)

1

2

ఫోన్ నం.
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మునగప్ప మరియు మిత్సుయ్ సుమిటోమో ఇన్సూరెన్స్ కంపెనీ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబడింది. బీమా పరిశ్రమలో ఈ సంస్థ అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం మరియు అనేక అంతర్జాతీయ సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు అవార్డులతో సత్కరించాయి. ఈ సంస్థ దేశ వ్యాప్తంగా 109 శాఖలను మరియు 9000 మంది ఏజెంట్లను కలిగి ఉంది. చోళమండలం ఆరోగ్య బీమా పథకాలు ఇన్- పెషెంట్, ఆసుపత్రి ఖర్చులు, ఆసుపత్రి గది అద్దె ఖర్చులు మరియ 20 తీవ్ర అనారోగ్యాల నుండి రక్షణకు కవరేజీ వంటి విస్తృతమైన ఫీచర్లను మరియు ప్రయోజనాలను అందిస్తుంది.

చోళమండలం జనరల్ ఇన్సూరెన్స్ ప్రధానాంశాలు

దేశ వ్యాప్తంగా ఉన్న శాఖలు

136

వినియోగదారులు

89,00,000

సంవత్సరానికి సెటిల్ అవుతున్న క్లెయిమ్స్

2,20,000

చోళమండలం ఆరోగ్య బీమా పథకంలో రకాలు

1. చోళ హెల్త్ లైన్ ఇన్సూరెన్స్

చోళ ఎంఎస్ హెల్త్ లైన్ అనేది హస్పిటలైజేషన్ సమయంలో అన్ని రకాల ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ బీమా పథకాన్ని అతను/ ఆమె వ్యక్తిగతంగా లేదా ఫ్లోటర్ విధానంలో మొత్తం కుటుంబానికి పొందవచ్చు.

A. వ్యాల్యూ హెల్త్ లైన్ ఇన్సూరెన్స్

 • ఈ పథకం రూ. 10 లక్షల వరకు కవరేజీని అందిస్తుంది
 • ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ సదుపాయం( 30 రోజులు మరియు 60 రోజులు)
 •  ఆయుర్వేదం, యూనాని, సిద్ధ మరియు హోమియోపతి చికిత్సా విధానాలకు కవరేజీ అందించబడుతుంది.

B. ఫ్రీడమ్ హెల్త్ లైన్ ఇన్సూరెన్స్

 • ఈ పథకం రూ. 15 లక్షల వరకు కవరేజీ అందిస్తుంది.
 • ప్రీ-హాస్పిటలైజేషన్ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు (60 మరియు 90 రోజులు) కవరేజీ అందించబడుతుంది.
 • పాలసీ ప్రకారం అత్యవసర అంబులెన్స్ ఛార్జీలు (రూ. 2000) వరకు కవరేజీ అందించబడుతుంది.

C. ఎన్రిచ్ హెల్త్ లైన్ ఇన్సూరెన్స్

 • ఈ పథకం రూ. 25 లక్షల వరకు కవరేజీని అందిస్తుంది.
 • అవయవ దాత ఆసుపత్రి ఖర్చులకు ఈ పథకం కవరేజీ అందిస్తుంది.
 • ఇన్-పెషేంట్ హాస్పిటలైజేషన్ మరియు డేకేర్ చికిత్సా విధానాలకు కూడా ఈ పథకం కవరేజీ అందిస్తుంది.

D. ప్రివిలేజ్ హెల్త్ ఇన్సూరెన్స్

 • ఈ పథకం కింద రూ. 25 లక్షల వరకు కవరేజీ లభిస్తుంది.
 • పథకం ద్వారా అంబులెన్స్ కవర్ (రూ. 5000 వరకు) మంజూరు చేయబడుతుంది.
 • ప్రసూతి ఖర్చులు(డెలివరికి రూ. లక్ష వరకు) పథకం కింద అందించబడుతుంది.

2. చోళ ఎంఎస్ క్రిటికల్ హెల్త్ లైన్ బీమా

చోళ ఎంఎస్ క్రిటికల్ హెల్త్ లైన్ బీమా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి అంటే సెలరోసిస్, అవయవమార్పిడి, బోన్ మారో ట్రాన్స్ ఫర్, పక్షవాతం, మూత్ర పిండాల వైఫల్యం

వంటి వ్యాధులకు కవరేజీ ఇవ్వబడుతుంది.

ఫీచర్లు 

 • ఈ పాలసీ మీకు, మీ భాగస్వామికి, పిల్లలకు(ముగ్గురు పిల్లలకు) కవరేజీ అదిస్తుంది.
 • 55 సంవత్సరాలోపు వయసున్న వారు పాలసీ తీసుకోవాలంటే ఎటువంటి మెడికల్ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు.
 • తీవ్రమైన వ్యాధులకు చికిత్స పొందితే క్లైయిమ్ సెటిల్మెంట్ కోసం ఎటువంటి బిల్లులను సమర్పించాల్సిన అవసరం లేదు.
 •  ఈ బీమా పథకం కింద గరిష్టంగా రూ. 10 లక్షల వరకు కవరేజీ పొందవచ్చు. 
 • ఈ పాలసీకి ప్రీమియం చెల్లించడం ద్వారా పన్ను ప్రయోజనం(రూ. 25,000 వరకు) లభిస్తుంది.

అర్హత

ప్రవేశ వయసు

స్వీయ/ జీవిత భాగస్వామి 18-65 సంవత్సరాలు

ముగ్గురు పిల్లల వరకు- 5-65 సంవత్సరాలు

బీమా మొత్తం

రూ. 3 లక్షలు/ రూ. 5 లక్షలు/ రూ. 10 లక్షలు

3. చోళ సూపర్ టాప్ -అప్ బీమా

చోళ సూపర్ టాప్ అప్ బీమా పుర్తి వ్యక్తిగత ఆసుపత్రి ఖర్చులకు లేదా కుటుంబ ఆసుపత్రి ఖర్చులకు(ఫ్లోటింగ్) పూర్తి కవరేజీ అందిస్తుంది.

ఫీచర్లు

 • మీరు ప్రిమియర్ మరియు సుప్రీం అనే రెండు వేరియంట్ల మధ్య ఎంచుకోవచ్చు.
 • ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు(60 మరియు 90 రోజులు) ఈ పథకం కవరేజీ అందిస్తుంది.
 • 55 సంవత్సరాల వయసు వరకు ప్రీ-మెడికల్ చెక్-అప్ అవసరం లేదు.

అర్హత

ప్రవేశ వయసు

3 నెలల నుంచి 70 సంవత్సరాలు

దీర్ఘకాలిక పాలసీ

3 నెలల వరకు

4. చోళ హస్పిటల్ క్యాష్ హెల్త్ లైన్

హస్పిటలైజేషన్ సమయంలో అయ్యే వివిధ రకాల ఖర్చులను ఈ పథకం కింద కవర్ అవుతాయి.

ఫీచర్లు

 • ఇది 6 ఫ్లెక్సిబుల్ వేరియంట్ల కింద లభిస్తుంది. అవి ప్లాన్ A,B,C,D,E మరియు F. తమ అవసరాలకు అనుగుణంగా పాలసీదారుడు తమకు నచ్చిన ప్లాన్ ను ఎంచుకోవచ్చు.
 • ప్లాన్ A,B,C ఒక పాలసీ సంవత్సరంలో 20 రోజుల పాటు పాలసీదారునికి ఆసుపత్రి ఖర్చులు అందిస్తాయి. ప్లాన్ D,E,F పాలసీ సంవత్సరంలో 25 రోజుల పాటు క్యాష్ ను అందిస్తాయి.
 • ఒకేసారి పెద్ద మొత్తం ఆసుపత్రి ఖర్చులు లభిస్తాయి. అంటే, ప్లాన్ A మరియు D కి రూ. 10,000, ప్లాన్ B మరియు Eకి రూ. 15,000, ప్లాన్ C మరియు Eకి రూ. 20,000 వరకు డబ్బు లభిస్తుంది.
 • పాలసీ సంవత్సరంలో మొత్తం ప్రీమియం క్రమబద్ధంగా చెల్లించినట్లుయితే కుటుంబం మొత్తానికి 5 శాతం, పాలసీదారునికి 10 శాతం వరకు రాయితీ లభిస్తుంది.
 • పాలసీదారుడు ఐసియూ చికిత్స పొందాల్సి వస్తే రెట్టింపు కవరేజీ లభిస్తుంది.

అర్హత

ప్రవేశ వయసు

పెద్దలకు- 18 నుంచి 65 సంవత్సరాలు

పాలసీ కాల వ్యవధి

1,2 లేదా 3 సంవత్సరాలు

5. చోళ వ్యక్తిగత ప్రమాద బీమా

చోళ వ్యక్తిగత ప్రమాద బీమా కొత్తగా ప్రారంభించబడిన పథకం. దురదృష్టకర సంఘటనల కారణంగా మీరు ప్రమాదానికి గురై మరణం, గాయాలు, అంగవైకల్యం, ఏదైనా తీవ్ర గాయాలు కలిగితే ఈ బీమా పథకం కింద మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆర్థిక రక్షణ అందిస్తుంది.

ఫీచర్లు

 • ప్రమాదం కారణంగా అంగవైకల్యం కలిగితే వారం వారీగా డబ్బు చెల్లింపు ఉంటుంది.
 • పాలసీదారునికి ప్రమాదం కారణంగా పూర్తి అంగవైకల్యం కలిగితే ఇళ్లు బాగుచేయడానికి లేదా పాడైన వాహనం మరమ్మత్తులకు ఈ బీమా పథకం కింద డబ్బు లభిస్తుంది.
 • ఒక వేళ పిల్లలు ప్రమాదానికి గురై పాఠశాలకు వెళ్లకపోతే ట్యూషన్ ఫీజు లభిస్తుంది.
 • ఒక వేళ పాలసీదారుడు ప్రమాదానికి గురై మరణించిన లేదా అంగవైకల్యానికి గురైనా కుటుంబంలోని వ్యక్తి ఆ ప్రదేశాకి వెళ్లడానికి డబ్బు లభిస్తుంది.
 • ప్రమాదం కారణంగా అంగవైకల్యం కలిగితే వారం వారీగా డబ్బు చెల్లింపు ఉంటుంది.
 • పాలసీదారునికి ప్రమాదం కారణంగా పూర్తి అంగవైకల్యం కలిగితే ఇళ్లు బాగుచేయడానికి లేదా పాడైన వాహనం మరమ్మత్తులకు ఈ బీమా పథకం కింద డబ్బు లభిస్తుంది.
 • ఒక వేళ పిల్లలు ప్రమాదానికి గురై పాఠశాలకు వెళ్లకపోతే ట్యూషన్ ఫీజు లభిస్తుంది.
 • ఒక వేళ పాలసీదారుడు ప్రమాదానికి గురై మరణించిన లేదా అంగవైకల్యానికి గురైనా కుటుంబంలోని వ్యక్తి ఆ ప్రదేశాకి వెళ్లడానికి డబ్బు లభిస్తుంది.

6. చోళ ఫ్లెక్సీ హెల్త్ లైన్ ఇన్సూరెన్స్

చోళ ఫ్లెక్సీ హెల్త్ లైన్ ఇన్సూరెన్స్ ఖర్చుతో కూడుకున్న ఆరోగ్య చికిత్సలకు కవరేజీ అందిస్తుంది. ఇది మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఊహించని ఆరోగ్య సమస్యల నుంచి ఆర్థికంగా రక్షిస్తుంది. మీ ఆరోగ్య చికిత్స చింతలకు మీరు బై-బై చెప్పవచ్చు.

ఫీచర్లు

 • స్పెషలిస్టు వైద్య అభిప్రాయం పొందడానికి పాలసీదారులు రీయింబర్స్ మెంట్ పొందవచ్చు(రూ. 2500 వరకు)
 • ముందుగా ఉన్న వ్యాధుల కోసం ఈ పథకం 36 నెలల వెయిటింగ్ పిరియడ్ అందిస్తుంది.
 • ప్రీ-హాస్పిటలైజేషన్ మరియు పోస్ట్-హాస్పిటలైజేషన్( 30 మరియు 60 రోజుల వరకు) పాలసీ ద్వారా చెల్లించబడతాయి.
 • ప్రతి క్లెయిమ్ రహిత సంవత్సరానికి ఒకసారి మీరు ఉచిత ఆరోగ్య పరీక్షలు పొందవచ్చు.

అర్హత

బీమా మొత్తం

రూ. 1, 2, 3, 5, 7.5, 10,15, 20, 25 లక్షలు

జీవితకాలం పునరుద్దరణ

లభ్యత ఉంది

7. చోళ ఆరోగ్య సంజీవని

ఇది ఊహించని వైద్య పరిస్థితులకు, ప్రమాదాలకు వ్యతిరేకంగా ఆర్థిక రక్షణ అందించే ప్రామాణిక ఆరోగ్య బీమా. పాలసీదారుడి అవసరాలకు అనుగుణంగా బీమా మరియు ప్రీమియం చెల్లింపు ఎంపికలు ఎంచుకోవడానికి ఈ పథకం అనుమతిస్తుంది.

ఫీచర్లు

 • ఈ పథకం వ్యక్తిగత మరియు కుటుంబ ఫ్లోటర్ ప్రాతిపదికన లభిస్తుంది.
 • పాలసీ ద్వారా అంబులెన్స్ ఖర్చులు(హాస్పిటలైజేషన్ కు రూ. 2000 వరకు) అందించబడతాయి.
 • ఏడుగురు కంటే ఎక్కువ కుటుంబ సభ్యులకు పథకం కింద కవరేజీ అందిస్తే, 10 శాతం తగ్గింపు లభిస్తుంది.
 • ఈ పథకం అన్ని డేకేర్ చికిత్సా విధానాలకు కవరేజీ అందిస్తుంది.

8. చోళ ఎంఎస్ కొవిడ్-19 ఆరోగ్య బీమా

చోళ ఎంఎస్ కొవిడ్-19 ఆరోగ్య బీమా అనేది పాలసీదారునికి వైరస్ సోకినట్లు నిర్థారణ అయితే ఆర్థిక రక్షణ అందించే ప్రత్యేకమైన కవర్.

ఫీచర్లు

 • ఈ పథకం కింద మీరు కుటుంబానికి(జీవిత భాగస్వామి, ఇద్దరు ఆధారపడిన పిల్లలకు మరియు తల్లిదండ్రులకు) కవరేజీ అందించవచ్చు.
 • ప్రతి 24 గంటల క్వారంటైన్/ హాస్పిటలైజేషన్ కు ఈ పథకం రోజువారీ నగదు ప్రయోజనాన్ని అందిస్తుంది.
 • ఇది ఒకే మొత్తంలో ప్రయోజనాన్ని అందిస్తుంది.
 • ఈ పాలసీ కొనుగోలు చేయడానికి ఆరోగ్య పరీక్షలు అవసరం లేదు.

అర్హత

ప్రవేశ వయసు

పెద్దలకు- 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు

పాలసీ కాల వ్యవధి

1 సంవత్సరం

చోళమండలం ఆరోగ్య బీమా పథకాలను ఎలా కొనుగోలు చేయాలి?

 • చోళ ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ వెబ్ సైట్ ఓపెన్ చేసి ‘హెల్త్’ అనే ఐకాన్ పై క్లిక్ చేయండి
 • అక్కడ ‘బై’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి కొనసాగండి
 • మీ పేరు , మొబైల్ నెంబర్, ఈ మెల్ ఐడి ఎంటర్ చేయండి.
 • ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
 • ఈ ప్రక్రియ తర్వాత సంస్థ మీ దరఖాస్తును పరిశీలించి, బీమా పథకాన్ని అందిస్తుంది.
 • ఈ కొనుగోలు ప్రక్రియకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే లేదా ఏదైనా సమాచారం కావాలన్న కస్టమర్ సర్వీస్ ను సంప్రదించవచ్చు.

చోళమండల ఆరోగ్య బీమా పథకం క్లైయిమ్ విధానం ఏంటి?

చోళ ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా పథకాలకు సంబంధించి రెండు రకాల క్లైయిమ్ విధానాలను అందిస్తుంది.

నగదు రహిత క్లైయిమ్

 • పాలసీ దారుడు నెట్ వర్క్ ఆసుపత్రిలో చికిత్స పొందితే ఎటువంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. వైద్య చికిత్స మొత్తంనగదు రహితంగా లభిస్తుంది.
 • ఇందుకోసం పాలసీదారుడు సదరు ఆసుపత్రిలో ఉన్న చోళ ఎంఎస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించి, ఫోటో గుర్తింపు ధృవీకరణ మరియు ఇతర రిపోర్టులు సమర్పించాలి.
 • ఈ దరఖాస్తు క్లైయిమ్ మెనేజ్ మెంట్ విభాగానికి పంపబడుతుంది, సంస్థ ప్రతినిధులు పరిశీలన జరుపుతారు.
 • వెరిఫికేషన్ విజయవంతమైతే, క్లైయిమ్ మొత్తం పంపబడుతుంది. ఇందుకు సంబంధించి మీ మెయిల్ కి సందేశం కూడా వస్తుంది.

రియింబర్స్ మెంట్ క్లైయిమ్

 • ఈ విధానం కింద పాలసీదారుడు బిల్లులు చెల్లించాలి అటు తర్వాత బీమా సంస్థను సంప్రదించాలి.
 • బీమా సంస్థ మీకు దరఖాస్తును అందిస్తుంది. దానిని పూర్తి చేసి ఇతర అవసరమైన పత్రాలను జత చేసి సమర్పించాలి
 • డిశ్చార్జి సమ్మరి, ఆసుత్రి బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది.
 • సంస్థ నిబంధనల ప్రకారం వెరిఫికేషన్ చేయబడుతుంది.
 • అన్ని పూర్తయిన తర్వాత మీ అప్రూవ్డ్ లెటర్ మీ మెయిల్ కి లభిస్తుంది. మీ రియింబర్స్ మెంట్ విజయవంతంగా చేయబడుతుంది.

చోళమండలం ఆరోగ్య బీమాను ఎలా పునరుద్దరణ చేసుకోవాలి?

 • చోళ ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి
 • ఎడమవైపు పై భాగంలో ‘హెల్త్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
 • అక్కడ ‘రెన్యూ’ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కొనసాగించండి.
 • అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేయండి
 •  చెల్లింపు జరపండి
 • మీ పాలసీ విజయవంతంగా పునరుద్దరణ చేయబడింది.

చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ ఎలా సంప్రదించాలి?

సంప్రదింపు చిరునామా

న్యూ నంబర్ 2, ఓల్డ్ నంబర్ 234, డేర్ హౌస్, ఫ్లోర్ 2, ఎన్ సిఎస్ బోస్ రోడ్, చెన్న, 600001, ఇండియా

కస్టమర్ సర్వీస్

1800-208-5544(ఇండియా), +91-44-6166-3400(ఇండియా బయట).

ఈమెయిల్ : atcustomercare[at]cholams[dot]murugappa[dot]com.

SMS"CHOLA" TO 56677 కి సందేశం పంపవచ్చు.