కుటుంబ ఆరోగ్య బీమా
 • అగ్ర బీమా సంస్థల నుండి ఉత్తమ ప్రణాళికలు
 • పోల్చండి & తక్షణమే కొనండి
 • 80 డి కింద పన్ను ప్రయోజనాలు
PX step

ఆరోగ్య బీమా కొటేషన్లను ఆన్లైన్లో పోల్చుకోండి

1

2

పేరు
కవరేజీ
పుట్టినరోజు (పెద్ద సభ్యుడి)

1

2

ఫోన్ నం.
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

కుటుంబ ఆరోగ్య బీమా పథకం కింద మొత్తం కుటుంబానికి ఒకే పథకం కింద కవరేజీ లభిస్తుంది. భారతీయ బీమా మార్కెట్లో లభించే అత్యంత సాధారణ సంరక్షణ పథకాల్లో ఇది ఒకటి. మీ కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఈ పథకాన్ని మరింతగా అనుకూలీకరించవచ్చు. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కింద ఒకరు అతను/ఆమె, జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు, ఆధారపడిన తల్లిదండ్రులు, అత్తమామలు కూడా కవరేజీ కల్పించవచ్చు.

కుటుంబ ఆరోగ్య బీమా యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

ఈ కింది కారణాల పరిశీలిస్తే కుటుంబ ఆరోగ్య బీమా ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. వీటి గురించి తెలుసుకుందాం..

 • మొత్తం కుటుంబానికి కవరేజీ: కుటుంబ ఆరోగ్య బీమా అనేది మీ కుటుంబ సభ్యులందరికీ ఒక స్టాప్ ఆరోగ్య బీమా పరిష్కారం
 • తక్కువ ప్రీమియం: ఆరోగ్య బీమా కోసం చెల్లించాల్సిన ప్రీమియం వ్యక్తిగత బీమా పథకాలకు చెల్లించాల్సిన ప్రీమియం కంటే తక్కువ.
 • అదనపు ప్రయోజనాలు: మీరు ఈ పథకం కింద ప్రసూతి ప్రయోజనం, కొత్తగా పుట్టిన శిశువు కవర్, తీవ్రమైన అనారోగ్య కవర్ వంటి అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.
 • ఇబ్బంది లేని ప్రక్రియ: ఈ ఆరోగ్య బీమా పథకం ద్వారా వ్యక్తిగత బీమా పథకాలు నిర్వహించే క్లిష్టమైన ప్రక్రియ తగ్గుతుంది.
 • పన్ను ప్రయోజనాలు: కుటుంబ ఆరోగ్య బీమా పథకాలకు చెల్లించే ప్రీమియంపై ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80డి కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి.

టాప్ 5 కుటుంబ ఆరోగ్య బీమా పథకాలు

అందించే కవరేజీ ఆధారంగా టాప్ 5 కుటుంబ ఆరోగ్య బీమా పథకాలు కింద ఇవ్వబడ్డాయి..

కంపెనీ పేరు

పథకం పేరు

క్లెయిమ్ సెటిల్‌మెంట్ శాతం

మాక్స్ బుపా

హెల్త్ పరిమా- కుటుంబ ఆరోగ్య బీమా పథకం

54%

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

కేర్ హెల్త్ ప్లాన్

55%

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్

స్టార్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా ప్లాన్

63%

హెచ్ డి ఎఫ్ సి ఎర్గో

ఆప్టిమా రిస్టోర్ ఫ్యామిలీ ప్లాన్

62%

ఎస్‌బీఐ జనరల్

ఆరోగ్య ప్రీమియర్ ప్లాన్

52%

1. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

కేర్ ప్లాన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ వైద్య అత్యవసర పరిస్థితి వల్ల తలెత్తే ఆర్థిక నష్టాలకు వ్యతిరేకంగా పాలసీదారునికి మరియు అతను/ఆమె కుటుంబానికి కవరేజీ అందిస్తుంది. అలాగే పాలసీదారుని కుటుంబానికి ఆర్థిక కవరేజీ అందిస్తుంది.

ప్రధాన ఫీచర్లు

 • 11,000 కంటే ఎక్కువ నెట్ వర్క్ ఆసుపత్రులలో పాలసీదారు నగదు రహిత వైద్య సదుపాయం పొందడానికి ఈ పథకం సౌలభ్యం కల్పిస్తుంది.
 • రోబోటిక్ సర్జరీ, హెచ్ఐవి/ఎయిడ్స్ వంటి ఆధునిక చికిత్సలకు ఈ పథకం కవరేజీ అందిస్తుంది.
 • ఈ పథకం కింద పాలసీదారు వార్షిక ఆరోగ్య పరీక్షల తనిఖీ సౌకర్యాన్ని పొందవచ్చు.

అర్హత

ప్రవేశ వయసు

91 రోజులు ఆ పైన; గరిష్ట వయోపరిమితి లేదు

గరిష్ట బీమా మొత్తం

రూ. 6 కోట్లు

2. మాక్స్ బుపా హెల్త్ ప్రీమియా: ప్లాటినం- కుటుంబ ఆరోగ్య బీమా పథకం

హెల్త్ ప్రీమియా అనేది మీ కుటుంబ వైద్య అవసరాలకు సమగ్ర కవరేజీని అందించే ఆరోగ్య బీమా పథకం.

ప్రధాన ఫీచర్లు

 • 4800+ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సదుపాయాన్ని పొందే సౌలభ్యం.
 • ఈ పథకం 20 లిస్టెడ్ తీవ్రమైన అనారోగ్యాలకు( క్లిష్టమైన అనారోగ్య కవర్ కింద) కవరేజీని అందిస్తుంది.
 • ఈ ప్లాన్ రెండు డెలివరీల వరకు ప్రసూతి ప్రయోజనాలను అందిస్తుంది.

అర్హత

ప్రవేశ వయసు

లభ్యత లేదు

గరిష్ట బీమా మొత్తం

రూ. 3 కోట్లు

3. హెచ్ డి ఎఫ్ సి ఎర్గో ఆప్టిమా రిస్టోర్ ఫ్యామిలీ ప్లాన్

హెచ్ డి ఎఫ్ సి ఎర్గో ఆప్టిమా రిస్టోర్ ఫ్యామిలీ ప్లాన్ అనేది మీకు మరియు మీ కుటుంబానికి పూర్తి వైద్య చికిత్సను అందించే సమగ్ర కుటుంబ ఫ్లోటర్ పథకం.

ప్రధాన ఫీచర్లు

 • 10,000 పైగా నెట్ వర్క్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స పొందడానికి పాలసీదారునికి ఈ పథకం సౌలభ్యం కల్పిస్తుంది.
 • ఆరోగ్యకరమైన జీవన శైలి అనుసరించే పాలసీదారునికి సంస్థ రివార్డులు అందిస్తుంది మరియు అంబులెన్స్ కోసం రూ. 2000 వరకు కవరేజీ లభిస్తుంది.
 • ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు( 60 మరియు 180 రోజులు) ఈ పాలసీ కింద కవరేజీ లభిస్తుంది.

అర్హత

ప్రవేశ వయసు

91 రోజుల నుంచి 65 సంవత్సరాలు

గరిష్ట బీమా మొత్తం

రూ. 50 లక్షలు

4. ఎస్‌బీఐ ఆరోగ్య ప్రీమియర్ పాలసీ

ఎస్‌బీఐ ఆరోగ్య ప్రీమియర్ పాలసీ ఒక కుటుంబం యొక్క వైద్య అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది. విస్తృత వైద్య కవరేజీతో పాటు కుటుంబ సభ్యులకు ఉత్తమ ఆరోగ్య సంరక్షణను ఎంచుకోవచ్చు మరియు వైద్య ఖర్చుల గురించి చింతించకుండా ఉన్న వైద్య నిపుణులను సంప్రదించవచ్చు.

ప్రధాన ఫీచర్లు

 • పాలసీదారుడు 6000+ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సదుపాయాన్ని పొందవచ్చు.
 • 55 సంవత్సరాల వయసు వరకు వైద్య పరీక్షలు అవసరం లేదు.
 • పాలసీ ప్రారంభం అయిన తేదీ నుంచి మొదటి 9 నెలలు పూర్తయిన తర్వాత ప్రసూతి ఖర్చులకు ఈ పథకం కవరేజీ అందిస్తుంది.

అర్హత

ప్రవేశ వయసు

3 నెలలు నుంచి 65 సంవత్సరాలు

గరిష్ట బీమా మొత్తం

రూ. 3 లక్షలు

5. స్టార్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా ప్లాన్

స్టార్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా ప్లాన్ తో బీమా చేసిన మొత్తాన్ని కుటుంబ వైద్య అవసరాల కోసం వినియోగించుకోవచ్చు.

ప్రధాన ఫీచర్లు

 • 9900+ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో నగదు రహిత సదుపాయాన్ని ఈ పథకం అందిస్తుంది.
 • అవయవదాత ఖర్చులు రూ. 1 లక్ష లేదా ఎస్ఐలో 10 శాతం వరకు(ఏది తక్కువ అయితే అది) అందించబడుతుంది.
 • ఈ పథకం ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్(60 మరియు 90 రోజులు) వరకు కవరేజీ అందిస్తుంది.

అర్హత

ప్రవేశ వయసు

18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు

గరిష్ట బీమా మొత్తం

రూ. 25 లక్షలు

కుటుంబ ఆరోగ్య బీమా పథకం కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

కుటుంబ ఆరోగ్య బీమా కొనుగోలు చేసే ముందు పరిగణించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు కింద ఇవ్వబడ్డాయి. వాటి గురించి తెలుసుకుందాం...

పథకం అందించే కవరేజీ

మీ కుటుంబానికి ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసే ముందు, బీమా సంస్థ అందించే ప్రయోజనాలను తనిఖీ చేయాలి. ఇది ఏ రకమైన ఖర్చులకు కవరేజీ అందిస్తుంది మరియు పథకం యొక్క ప్రీమియం మీ ఆదాయానికి సరిపోతుందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి.

అవసరాలు

అందుబాటులో ఉన్న అనేక ఆరోగ్య బీమా పథకాల నుంచి మీ అవసరాలకు సరితూగే పథకాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీకు, మీ జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు మరియు మీ తల్లిదండ్రులకు ఒకే పథకం కింద కవరేజీ అందించవచ్చు. అయితే మీరు పెద్ద కుటుంబాన్ని కలిగి ఉండి మరియు మీ సోదరుడు లేదా తల్లిదండ్రులకు కవరేజీ అందించాలనుకుంటే, కొన్ని కుటుంబ ఆరోగ్య బీమా పథకాలు మీ అవసరాన్ని తీర్చగలవు.

సులభమైన క్లెయిమ్ ప్రక్రియ

అవసరమైన సమయంలో ప్రతి ఒక్కరూ తమ క్లెయిమ్ ను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరించుకోవాలని భావిస్తారు. అందువల్ల వైద్య అత్యవసర పరిస్థితుల సమయంలో ఎటువంటి గందరగోళం లేకుండా క్లెయిమ్ ను త్వరితగతిన పరిష్కరించే బీమా సంస్థను ఎంచుకోండి.

సౌలభ్యం

బీమా చేసిన మొత్తం గురించి ఖచ్చితంగా తెలియకపోవచ్చు మరియు భవిష్యత్తులో పెంచాలని లేదా తగ్గించాలని కోరుకుంటే, మీకు అలాంటి సౌలభ్యాన్ని అందించే కుటుంబ ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకోండి.

కుటుంబ ఆరోగ్య బీమా లేదా వ్యక్తిగత ఆరోగ్య బీమా దేనిని కొనుగోలు చేయాలి?

ప్రతి వ్యక్తికి అవసరాలు వేర్వేరు విధంగా ఉంటాయి, కాబట్టి వీటికి సమాధానం ఇవ్వడం చాలా కష్టం. కుటుంబ ఆరోగ్య బీమా కింద కుటుంబం మొత్తానికి కవరేజీ కల్పించవచ్చు.

అయితే, ఒక వ్యక్తి ఆరోగ్య బీమా పథకం ప్రకారం, ప్రతి వ్యక్తికి లభించే కవరేజీ వేర్వేరుగా ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే కుటుంబంలో 5గురు సభ్యులు ఉంటే, ప్రతి ఒక్కరూ వారి పాలసీలను కలిగి ఉంటారు మరియు ప్రతి పాలసీకి చెల్లించవలసిన ప్రీమియం కూడా భిన్నంగా ఉంటుంది.

ప్రీమియం మొత్తాన్ని పరిశీలిస్తే, కుటుంబ ఆరోగ్య బీమా కింద చెల్లించవలసిన ప్రీమియం, వ్యక్తిగత పాలసీలకు చెల్లించవలసిన ప్రీమియం కంటే తక్కువ. ఏదేమైనా కుటుంబ ఆరోగ్య బీమా పథకాలు, మీకు వ్యక్తిగత ఆరోగ్య బీమా పథకాల కింద పొందే కొన్ని ప్రయోజనాలు అందించలేని సందర్భాలు కూడా ఉండవచ్చు.

అందువల్ల ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడానికి ముందు, మీ కుటుంబ అవసరాలను తనిఖీ చేసి ఆపై వ్యక్తిగత లేదా కుటుంబ ఆరోగ్య బీమాను ఎంచుకోవాలో నిర్ణయించుకోండి.

కుటుంబ ఆరోగ్య బీమా పథకాన్ని ఎలా కొనుగోలు చేయాలి?

సాంకేతిక పరిజ్ఞానం యొక్క అభివృద్ధితో, చాలా బీమా సంస్థలు వినియోగదారులకు వెబ్ సైటు ద్వారా ఉత్పత్తులను అందిస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియ సంస్థ నుంచి సంస్థకు మారుతూ ఉంటుంది.

 • సంబంధిత బీమా సంస్థ యొక్క అధికారిక వెబ్ సైటును సందర్శించండి.
 • మీకు నచ్చిన కుటుంబ ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకోండి మరియు వివరాలను పూరించండి.
 • ఆన్ లైన్ లో ప్రీమియంలో చెల్లించండి. పాలసీ పత్రం మీ రిజిస్ట్రర్డ్ మెయిల్ ఐడీకి పంపబడుతుంది.

మీరు ఈ బీమాను సమీప ప్రొవైడర్ బ్రాంచ్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. ఏదైనా కారణం చేత మీరు బీమా సంస్థ నుంచి కుటుంబ ఆరోగ్య బీమాను కొనుగోలు చేయలేకపోతే, మీకు PolicyX.com సహాయం చేస్తుంది. దీనిని కొనుగోలు చేయడానికి కింది ప్రక్రియను చూద్దాం....

 • ఈ పేజీ ఎగువ భాగానికి వెళ్లి, టాప్ ఇన్సూరెన్స్ నుంచి కోట్స్ పొందండి ట్యాబ్ లో వివరాలు పూరించండి.
 • తర్వాతి పేజీలో వివిధ సంస్థల నుంచి అన్ని కోట్లను మీకు చూపుతుంది.
 • మీకు కావాల్సిన కుటుంబ ఆరోగ్య పథకాన్ని ఎంచుకోండి.
 • ప్రీమియాన్ని ఆన్ లైన్ లో చెల్లించండి మరియు మీ పాలసీ పత్రం రిజిస్ట్రర్డ్ మెయిల్ ఐడీకి పంపబడుతుంది.

కుటుంబ ఆరోగ్య బీమా పథకం క్లెయిమ్ ను ఎలా దాఖలు చేయాలి?

ప్రతి బీమా సంస్థ క్లెయిమ్ పరిష్కరించడానికి రెండు మార్గాలను అందిస్తుంది-

1. నగదు రహిత విధానం

2. రీయింబర్స్ మెంట్ దావా

నగదు రహిత క్లెయిమ్ కోసం పాలసీదారుడు ఏదైనా నెట్ వర్క్ ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి ఉంటుంది. ( బీమా సంస్థ యొక్క నెట్ వర్క్ ఆసుపత్రుల జాబితాను సంస్థ యొక్క వెబ్ సైటులో చూడవచ్చు). ఆపై కింది పేర్కొన్న దశలను అనుసరించండి. ఇవి ప్రామాణిక దశలు, ఇవి ఎంచుకున్న బీమా సంస్థ బట్టి మారవచ్చు.

 • సంబంధిత బీమా సంస్థ అందించిన ఆరోగ్య కార్డును, ఒక గుర్తింపు రుజువుతో కలిపి చూపించాలి.
 • మీ గుర్తింపు రుజువును ధృవీకరించిన తర్వాత నెట్ వర్క్ ఆసుపత్రి మీ బీమా సంస్థ ప్రీ-ఆథరైజేషన్ రిక్వెస్ట్ ఫారంను సమర్పిస్తుంది.
 • సంస్థ అభ్యర్థనను సమీక్షించి నెట్ వర్క్ ఆసుపత్రికి నిర్థారణను సమర్పిస్తుంది మరియు టెక్ట్స్ లేదా ఈ మెయిల్ ద్వారా మీతో సమాచారాన్ని పంచుకుంటుంది.
 • చికిత్స తర్వాత సంస్థ ఆసుపత్రిలో క్లెయిమ్ ను పరిష్కరిస్తుంది.

మీరు నెట్ వర్క్ కాని ఆసుపత్రిలో చేరినట్లయితే, మీరు సంబంధిత సంస్థకు వీలైనంత త్వరగా తెలియజేయాలి(కాలపరిమితి ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు మారవచ్చు). చికిత్స పూర్తయిన తర్వాత, మీరు బిల్లులు చెల్లించాలి, ఆపై రీయింబర్స్ మెంట్ కోసం క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. బీమా సంస్థ అన్ని పత్రాలను పరిశీలిస్తుంది మరియు దాని తరువాత నిర్ణయాన్ని(ఆమోదం/ తిరస్కరణ) తెలియజేస్తుంది.

కుటుంబ ఆరోగ్య బీమా కింద ఉండే మినహాయింపులు ఏమిటి?

కుటుంబ ఆరోగ్య బీమా పథకం యొక్క మినహాయింపులు సంస్థ నుంచి సంస్థకు మారుతూ ఉంటాయి. సాధారణంగా ఈ కింది వైద్య ఖర్చులు ప్రణాళిక పరిధిలో ఉండవు.

 • సాధారణ ఆరోగ్య తనిఖీ పరీక్షలు
 • ప్లాస్టిక్ సర్జరీలకు అయ్యే ఖర్చులు
 • విదేశీ చికిత్సలు(పథకం కింద కవరేజీ లేకపోతే)
 • యుద్ధం కారణంగా కలిగే గాయాలు, అనారోగ్యం.
 • అనైతిక కార్యకలాపాలు లేదా సాహసోపేత క్రీడలలో పాల్గొనడం వల్ల కలిగే గాయాలు.
 • గర్భం లేదు ప్రసవ సమయంలో కలిగే సమస్యలు(పథకంలో పేర్కొనకపోతే)