న్యూ ఇండియా హెల్త్ ఇన్సూరెన్స్
 • అగ్ర బీమా సంస్థల నుండి ఉత్తమ ప్రణాళికలు
 • పోల్చండి & తక్షణమే కొనండి
 • 80 డి కింద పన్ను ప్రయోజనాలు
PX step

ఆరోగ్య బీమా కొటేషన్లను ఆన్లైన్లో పోల్చుకోండి

1

2

పేరు
కవరేజీ
పుట్టినరోజు (పెద్ద సభ్యుడి)

1

2

ఫోన్ నం.
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

న్యూ ఇండియా హెల్త్ అస్యూరెన్స్ కొ. లిమిటెడ్ ముంబైలో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక బహుళజాతి జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ. 1919 లో విలీనంతో ఇది భారతదేశంలోని పురాతన బీమా సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఇది బీమా పథకాల యొక్క విస్తారమైన పోర్ట్ ఫోలియోను తన వినియోగదారులకు అందిస్తుంది. సంస్థ అందించే పథకాల్లో ఆరోగ్య బీమా పథకాలు కూడా ఒకటి. పాలసీదారుల యొక్క మొత్తం వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది మరియు వారి రికవరీలపై దృష్టి పెట్టడానికి వారికి సులభమైన మార్గాన్ని అందిస్తుంది.

ప్రధానాంశాలు

భారతదేశంలో కార్యాలయాల సంఖ్య

2395

మొత్తం ఏజెంట్ల సంఖ్య

68389

మొత్తం ఉత్పత్తుల సంఖ్య

250

న్యూ ఇండియా అస్యూరెన్స్ ఆరోగ్య బీమా పథకాలు

వివిధ రకాల న్యూ ఇండియా ఆరోగ్య బీమా పథకాల గురించి తెలుసుకుందాం..

1. న్యూ ఇండియా అస్యూరెన్స్ ఆరోగ్య సంజీవని పాలసీ

న్యూ ఇండియా అస్యూరెన్స్ ఆరోగ్య సంజీవని పాలసీ వైద్య ఖర్చులకు సంబంధించి సమగ్ర కవరేజని అందిస్తుంది మరియు ముందస్తు అంగీకార వైద్య తనిఖీ లేకుండా కొనుగోలు చేయవచ్చు. ఈ పథకం కింద స్వీయ, జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులకు సమగ్ర కవరేజీ కల్పించవచ్చు.

అర్హత

ప్రవేశ వయసు

పెద్దలు- 18 నుంచి 65 సంవత్సరాలు

పిల్లలు- 3 నెలల నుంచి 18 సంవత్సరాలు

బీమా మొత్తం

రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలు

ఫీచర్లు

 • 2 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులను కవర్ చేయడానికి ఫ్లోటర్ సమ్ ఇన్సూరెన్స్ కింద పాలసీదారు 5 శాతం కుటుంబ తగ్గింపు పొందడానికి అర్హులు
 • బీమా చేసిన మొత్తంలో 25 శాతం వరకు కంటి శుక్లం శస్త్రచికిత్సలకు ఈ పథకం కవరేజీ అందిస్తుంది. (గరిష్టంగా రూ. 40,000 వరకు)
 • జన్యుపరమైన రుగ్మతలు, మానసిక అనారోగ్యం లేదా హెచ్ఐవికి చికిత్సకు కూడా ఈ పథకం కింద కవరేజీ లభిస్తుంది.

2. న్యూ ఇండియా గ్రూప్ క్యాన్సర్ మెడికల్ పాలసీ

న్యూ ఇండియా గ్రూప్ క్యాన్సర్ మెడికల్ పాలసీ ఇన్-పెషేంట్, ఔట్-పెషేంట్ లేదా డేకేర్ క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులకు కవరేజీని అందిస్తుంది. ఇండియన్ క్యాన్సర్ సొసైటీలో సభ్యుడైన తేదీ నుంచి ఒక సంవత్సరం వరకు పాలసీ చెల్లుబాటులో ఉంటుంది. మరియు ఆ తేదీ నుంచి కవరేజీ ప్రారంభమవుతుంది.

ఫీచర్లు

 • పాలసీ పూర్తయిన ప్రతి సంవత్సరానికి సంబంధించి బీమా మొత్తాన్ని 5 శాతం పెంచుకునే అవకాశం ఈ పథకం అందిస్తుంది.
 • పథకం ప్రారంభించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు క్లెయిమ్ దాఖలు చేస్తే కంపెనీ అనుమతించదు.

3. న్యూ ఇండియా ఫ్యామిలీ ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ

న్యూ ఇండియా ఫ్యామిలీ ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ ఒక బీమా పథకంతో కుటుంబ సభ్యులకు కవరేజీని అందిస్తుంది. ఈ పాలసీ ద్వారా(60 సంవత్సరాల వయసు వరకు) ఈ కింది కుటుంబ సభ్యులకు కవరేజీ అందించవచ్చు.

 • స్వీయ
 • జీవిత భాగస్వామి
 • ఆధారపడ్డ ఇద్దరు పిల్లలకు

అర్హత

ప్రవేశ వయసు

18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు

బీమా మొత్తం

రూ. 2 నుంచి రూ. 5 లక్షలు

ఫీచర్లు

 • ప్రభుత్వ రిజిస్ట్రర్డ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే ఆయుర్వేద హోమియోపతి మరియు యూనాని వైద్య చికిత్సలకు ఈ పథకం కవరేజీని అందిస్తుంది.(ఎస్ఐలో 25 శాతం వరకు)
 • ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు( 30 మరియు 60 రోజులు) పథకం ద్వారా చెల్లించబడతాయి.
 • ముందుగా ఉన్న వ్యాధులకు 4 నిరంతర మరియు క్లెయిమ్ రహిత పాలసీ సంవత్సరాల తర్వాత మాత్రమే బయటపడతాయి.

4. న్యూ ఇండియా ఫ్యామిలీ మెడిక్లెయిమ్ 2012

న్యూ ఇండియా ఫ్యామిలీ మెడిక్లెయిమ్ 2012 పాలసీ 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఊహించని ఆసుపత్రి ఖర్చులకు వ్యతిరేకంగా కవరేజీని అందిస్తుంది. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఎటువంటి విరామం లేకుండా పాలసీ కింద బీమా చేయబడితే వారు బీమాను కొనసాగించవచ్చు. మొత్తం కుటుంబానికి పాలసీ తీసుకోవడం వల్ల 10 శాతం రాయితీ పొందవచ్చు.

5. న్యూ ఇండియా జన ఆరోగ్య బీమా పాలసీ

అర్హత

ప్రవేశ వయసు

పెద్దలకు 5-70 సంవత్సరాలు

బీమా మొత్తం

ఒక వ్యక్తికి రూ. 5000

ఫీచర్లు

 • పాలసీ గది, బోర్డింగ్, నర్సింగ్ మరియు అన్ని రకాల ఆసుపత్రి ఖర్చులకు కవరేజీ లభిస్తుంది.
 • రక్తం, ఆక్సిజన్ మరియు సర్జన్, మత్తు మందు లేదా నిపుణుల ఫీజు.
 • ప్రీ-హాస్పిటలైజేషన్ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్(30 మరియు 60 రోజులు) ఖర్చులకు పాలసీ కవరేజీ అందిస్తుంది.

6. న్యూ ఇండియా జనతా మెడిక్లెయిమ్ పాలసీ( వ్యక్తిగత ప్రాతిపదికన)

న్యూ ఇండియా జనతా మెడిక్లెయిమ్ పాలసీ మొత్తం కుటుంబం(స్వీయ, జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు మరియు తల్లిదండ్రులు) ఒకే పాలసీ కింద కవరేజీ కల్పించవచ్చు.

ఫీచర్లు

 • పాలసీ ప్రీ-హాస్పిటలైజేషన్(30 రోజుల వరకు) మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్(60 రోజుల వరకు) ఆసుపత్రిలో బిల్లులో గరిష్టంగా 10 శాతం ఖర్చులకు కవరేజీ అందిస్తుంది.
 • ఆయుష్ చికిత్సల సమయంలో అయ్యే ఖర్చులకు బీమా చేసిన మొత్తంలో 25 శాతం వరకు అందించబడతాయి.
 • ఇంటెన్సివ్ కేర్ యూనిట్ , ఇంటెన్సివ్ కార్డియాక్ యూనిట్ ఖర్చులు కూడా ఈ పాలసీ పరిధిలో ఉంటాయి.

7. న్యూ ఇండియా ఆశా కిరణ్ పాలసీ

న్యూ ఇండియా ఆశా కిరణ్ పాలసీ ఒంటరి ఆడపిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు కోసం రూపొందించబడింది. ఇది మీ కుటుంబం యొక్క అన్ని వైద్య అవసరాలను పరిష్కరించడానికి సహాయపడుతుంది.

అర్హత

ప్రవేశ వయసు

పెద్దలు- 18- 65 సంవత్సరాలు

ఆడపిల్లలకు- 3 నెలల నుంచి 25 సంవత్సరాలు

హాస్పిటల్ నగదు ప్రయోజనం

రోజుకు ఎస్ఐ లో 0.1 శాతం

ఫీచర్లు

 • ఈ పాలసీ గది అద్దె ఖర్చులు(రోజుకు బీమా చేసిన మొత్తంలో 1 శాతం వరకు) మరియు ఐసియూ ఛార్జీలు(రోజుకు బీమా చేసిన మొత్తంలో 2 శాతం వరకు) వర్తిస్తుంది.
 • కంటిశుక్లం చికిత్స కోసం పథకం కవరేజీని అందిస్తుంది.( రూ. 50,000 లేదా ఎస్ఐలో 10 శాతం ఏది తక్కువ అయితే అది)
 • ఈ పథకం వ్యక్తిగతంగా కూడా కవరేజీ అందిస్తుంది. ఇందులో ప్రమాదవశాత్తు మరణ మరియు వైకల్యానికి కవరేజీ అందించబడుతుంది.

8. న్యూ ఇండియా ఫ్లెక్సీ ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ

 • న్యూ ఇండియా ఫ్లెక్సీ ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ ఏదైనా అస్వస్థత లేదా గాయం కోసం ఆసుపత్రి ఖర్చులకు కవరేజీ అందిస్తుంది.
 • ప్రభుత్వ రిజిస్ట్రర్డ్ ఆసుపత్రిలో తీసుకున్న ఆయుష్ చికిత్సల కోసం కవరేజీ(బీమా చేసిన మొత్తంలో 25 శాతం వరకు) ఈ పథకం అందిస్తుంది.
 • అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ ఖర్చు(ఎస్ఐ లో 1 శాతం లేదా వాస్తవ ఖర్చు ఏది తక్కువ అయితే అది, గరిష్టంగా రూ.2500) నివాసం నుంచి ఆసుపత్రికి లేదా ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి

9. న్యూ ఇండియా ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ

న్యూ ఇండియా ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ బీమా చేసిన మొత్తం కింద మొత్తం కుటుంబానికి ఊహించని ఆసుపత్రి ఖర్చులకు వ్యతిరేకంగా కవరేజీ అందిస్తుంది. పాలసీ కింద గరిష్టంగా 6 గురు సభ్యులకు కవరేజీ కల్పించవచ్చు.

అర్హత

అర్హత

పెద్దలు- 18-65 సంవత్సరాలు

బీమా మొత్తం

రూ. 2,3,5,8,10, 12 మరియు 15 లక్షలు

ఫీచర్లు

 • కొత్తగా పుట్టిన శిశువుకు ఈ పతకం కవరేజీ అందించబడుతుంది.
 • 139 డేకేర్ చికిత్సలకు అయ్యే ఖర్చులకు ఈ పథకం కవరేజీ అందిస్తుంది.
 • కంటి శుక్లం చికిత్సలకు(రూ. 50,000 లేదా ఎస్ఐలో 10 శాతం ఏది తక్కువ అయితే అది) ఈ పథకం కవరేజీ అందిస్తుంది.

10. న్యూ ఇండియా క్యాన్సర్ గార్డ్ పాలసీ

న్యూ ఇండియా క్యాన్సర్ గార్డ్ పాలసీ క్యాన్సర్ చికిత్సకు సంబంధించి అన్ని ఖర్చులకు కవరేజీని అందిస్తుంది.

అర్హత

ప్రవేశ వయసు

3 నెలలు- 65 సంవత్సరాలు

బీమా మొత్తం

రూ. 5, 10, 15, 25 మరియు 50 లక్షలు

ఫీచర్లు

 • ఈ కింది సాంప్రదాయక మరియు అధునాతన చికిత్సకు ఈ పథకం కవరేజీని అందిస్తుంది.
 • కెమోథెరపీ
 • రేడియో థెరపీ, క్యాన్సర్ చికిత్సలో భాగంగా
 • క్యాన్సర్ చికిత్సలో భాగంగా అవయవ మార్పిడి
 • ఓంకో సర్జరీ
 • ప్రోటాన్ చికిత్స
 • హార్మోన్ల చికిత్స లేదా ఎండోక్రైన్ మానిప్యులేషన్
 • ఇమ్యునోలజీ ఏజెంట్లతో సహా ఇమ్యునోథెరపీ
 • స్టెమ్ సెల్ మార్పిడి
 • ఎముక మజ్జ మార్పిడి
 • 58 డేకేర్ చికిత్సా విధానాలు ఈ పథకం కింద కవరేజీ లభిస్తుంది.
 • మీ శస్త్ర చికిత్స కోసం మీరు మరొక వైద్య నిపుణుడితో రెండవ అభిప్రాయం తీసుకోవాలంటే ఈ పథకం అందుకు సంబంధించిన ఖర్చులకు(రూ. 5000 వరకు) కవరేజీ అందిస్తుంది.

11. న్యూ ఇండియా గ్లోబల్ మెడిక్లెయిమ్ పాలసీ

న్యూ ఇండియా గ్లోబల్ మెడిక్లెయిమ్ పాలసీ ఇప్పటికే ఆరోగ్య బీమా కలిగి ఉన్న ఒక వ్యక్తి యొక్క ప్రపంచ ఆసుపత్రి ఖర్చులకు సంబంధించి రూ. 8 లక్షలు మరియు అంతకంటే ఎక్కువ మొత్తానికి కవరేజీ అందిస్తుంది. పాలసీదారుడు 18-65 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి.

ఫీచర్లు

 • ఈ పథకం ప్రకారం క్యాన్సర్ శస్త్రచికిత్స, న్యూరో సర్జరీ, కొరోనరీ ఆర్టరీ బైపాస గ్రాఫ్ట్ సర్జరీ, హార్ట్ వాల్వ్ సర్జరీ, లివింగ్ ఆర్గాన్ మరియు ఎముక మజ్జ మార్పిడి ఉన్నాయి.
 •  రెండవ వైద్య అభిప్రాయానికి ఈ పథకం కవరేజీ అందిస్తుంది.
 • పథకం కొనుగోలు చేయడానికి ప్రీ మెడికల్ పరీక్షలు తప్పనిసరి.

12. న్యూ ఇండియా ప్రీమియర్ మెడిక్లెయిమ్ పాలసీ

న్యూ ఇండియా ప్రీమియర్ మెడిక్లెయిమ్ పాలసీ బీమా పాలసీదారుని ఆసుపత్రి ఖర్చులకు కవరేజీ అందిస్తుంది. ఖర్చులు గురించి చింతించకుండా అతను, ఆమె పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి అనుమతిస్తుంది.

అర్హత

ప్రవేశ వయసు

18-65 సంవత్సరాలు

గరిష్ట సభ్యులకు కవరేజీ

6

ఫీచర్లు

 • పాలసీ రెండు వేరియంట్లను అందిస్తుంది.
 • ప్లాన్ఎ- రూ. 15,00,000 మరియు 25,00,000
 • ప్లాన్ బి- 50,00,000 మరియు 100,00,000
 • 50 సంవత్సరాల వయసు వరకు ప్రీ-అంగీకార వైద్య తనిఖీ అవసరం లేదు.
 • ఈ పథకం ఆసుపత్రి నగదు ప్రయోజనాన్ని రోజుకు రూ. 2000( ప్లాన్ ఎ) మరియు రూ. 4000( ప్లాన్ బి) అందిస్తుంది.

13. న్యూ ఇండియా సిక్ట్సి ప్లస్ మెడిక్లెయిమ్ పాలసీ

న్యూ ఇండియా సిక్ట్సి ప్లస్ మెడిక్లెయిమ్ పాలసీ సీనియర్ సిటిజెన్ల కోసం రూపొందించబడింది. ఈ పాలసీ వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వారి వైద్య ఖర్చులను నిర్వహిస్తుంది.

అర్హత

ప్రవేశ వయసు

60 సంవత్సరాలు-80 సంవత్సరాలు

బీమా మొత్తం

రూ. 2, 3 మరియు 5 లక్షలు

ఫీచర్లు

 • బీమా మొత్తంలో 10 శాతం పరిమితి వరకు ప్రీ హాస్పిటలైజేషన్ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్( వరుసగా 30 రోజులు మరియు 60 రోజులు) ఈ పథకం కవరేజీ అందిస్తుంది.
 • ఆదాయపు పన్ను చట్టం 1961, 80డి కింద పన్ను ప్రయోజనాలను అందిస్తుంది.
 • ఒక సీనియర్ సిటిజన్ మహిళ ఈ పథకం పరిధిలోకి వస్తే, ప్రాథమిక సభ్యుడి ప్రీమియంపై 5 శాతం తగ్గింపు ఇవ్వబడుతుంది.

14. న్యూ ఇండియా టాప్-అప్ మెడిక్లెయిమ్ పాలసీ

న్యూ ఇండియా టాప్-అప్ మెడిక్లెయిమ్ పాలసీ ఆసుపత్రిలో చేరే ఖర్చులకు బీమా పరిమితి దాటిన తరువాత కవరేజీ అందిస్తుంది మరియు పాలసీదారుడు తమను మరియు వారి కుటుంబ సభ్యులను అనిశ్చిత వైద్య అత్యవసర సమయాల్లో కవరేజీ అందిస్తుంది. ఈ పథకంలో 6 కుటుంబ సభ్యులకు(స్వీయ, చట్టపరమైన, జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు మరియు తల్లిదండ్రులు) కవరేజీ అందించవచ్చు.

అర్హత

ప్రవేశ వయసు

18-65 సంవత్సరాలు

బీమా మొత్తం

రూ. 5- 22 లక్షలు

ఫీచర్లు

 • ఆయుష్ చికిత్స ఖర్చులకు ఈ పథకం కవరేజీ అందిస్తుంది.
 • కంటి శుక్లం చికిత్సకు రూ.50,000 అందించబడుతుంది.
 • ముందుగా ఉన్న వ్యాధుల కోసం 48 నెలల నిరీక్షణ కాలం ఉంటుంది.

15. న్యూ ఇండియా సీనియర్ సిటిజెన్ మెడిక్లెయిమ్ పాలసీ

సీనియర్ సిటిజన్ మెడిక్లెయిమ్ పాలసీ 60-80 సంవత్సరాల మధ్య ఉన్న సీనియర్ సిటిజెన్లకు సరసమైన ప్రీమియంతో వైద్య కవరేజీని అందించడానికి రూపొందించబడింది.

ఫీచర్స్

 • పాలసీకి గరిష్ట వయసు పరిమితి 80 సంవత్సరాలు, అయితే పాలసీ విరామం లేకుండా పునరుద్దరించబడితే పాలసీని మించి పొడిగించవచ్చు.
 • పాలసీ ప్రవేశానికి 30 రోజుల ముందు అన్ని ఆసుపత్రి ఖర్చులకు(5 శాతం వరకు) ఈ పథకం కవరేజీ అందిస్తుంది మరియు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత(ఆసుపత్రి బిల్లులకు 10 శాతం) ఈ పథకం కవరేజీ అందిస్తుంది.
 • ఇది అంబులెన్స్ ఛార్జీలు(గరిష్టంగా రూ. 1000) మరియు ప్రభుత్వ రిజిస్ట్రర్డ్ ఆసుపత్రుల్లో ఆయుర్వేద మరియు యునానీ వంటి ప్రత్యామ్నాయ చికిత్సలకు కూడా ఈ పథకం కవరేజీ అందిస్తుంది.
 • సర్జన్లు, మెడికల్ ప్రాక్టీషనర్లు, మత్తుమందు నిపుణులు, నిపుణులు ఫీజులు మరియు నర్సింగ్ ఖర్చులకు కూడా కవరేజీ లభిస్తుంది.

16. న్యూ ఇండియా టెరటరీ కేర్ ఇన్సూరెన్స్

న్యూ ఇండియా టెరటరీ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ తొమ్మిది ప్రధాన వ్యాధుల కోసం ఆసుపత్రి చికిత్స ఖర్చులకు మరియు డొమిసిలియరీ హాస్పిటలైజేషన్ ఖర్చులకు సంబంధించి వ్యక్తులు మరియు సమూహాలకు కవరేజీ కోసం రూపొందించబడింది.

ఫీచర్స్

 • ప్రతి క్లెయిమ్ రహిత సంవత్సరానికి ఈ పథకం సంచిత బోనస్ ను అందిస్తుంది.
 • ఈ పాలసీ కింద కవరేజీ అందించబడే 9 వ్యాధులు
 • మూత్రపిండాలు లేదా డయాలసిస్ కు అవసమరయ్యే ఏటియాలజీ యొక్క నెఫ్రిటెస్ మరియు బ్యాక్టీరియా మూత్రపిండాల వైఫల్యం
 • సెరెబ్రల్ లేదా వాస్క్లార్ స్ట్రోక్స్
 • ఓపెన్ అండ్ క్లోజ్ హార్ట్ సర్జరీ
 • ప్రాణాంతక వ్యాధి( క్యాబ్ జీ తో సహా)
 • (హిస్టోపాథాలాజికల్ రిపోర్టులో ధృవీకరించబడింది)
 • ఎన్సెఫాలిటిస్(వైరల్)
 • న్యూరో సర్జరీ కీళ్ల మొత్తం పునఃస్థాపన
 • కాలేయ సిర్రోసిస్ వంటి కాలేయ రుగ్మత(హైపటైటిస్ బి& సి)
 • పొడవైన ఎముకల యొక్క పగుళ్లతో సహా తీవ్రమైన గాయం, తల గాయం తీవ్ర అపస్మారక స్థితికి దారితీస్తుంది.
 • ఈ పథకం ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు కవరేజీ అందిస్తుంది.

17. న్యూ ఇండియా యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎపిఎల్

న్యూ ఇండియా యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎపిఎల్ పాలసీదారుడికి సమగ్ర కవరేజీని అందిస్తుంది మరియు అనారోగ్యం లేదా గాయం సంభవించినప్పుడు ఆసుపత్రి ఖర్చులకు కవరేజీ అందిస్తుంది.

ఫీచర్లు

 • 3 నెలల నుంచి 65 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు ఈ పథకం వర్తిస్తుంది.
 • ఈ పథకం గది మరియు బోర్డింగ్ ఖర్చులు, అనస్థీషియా, రక్తం, ఆక్సిజన్, శస్త్రచికిత్సా ఉపకరణాలు, ఓటి ఛార్జీలు, డయాగ్నస్టిక్ ఉపకరణాలు. ఎక్స్ రే కోసం కవరేజీ అందించబడుతుంది.
 • మందులు, కృత్రిమ అవయవాలు, అనారోగ్యం, గాయానికి ఎస్ఐలో 15 శాతం వరకు ఉంటాయి.

18. న్యూ ఇండియా మెడిక్లెయిమ్ పాలసీ

న్యూ ఇండియా మెడిక్లెయిమ్ పాలసీ ఊహించని హాస్పిటలైజేషన్ కారణంగా అయ్యే ఖర్చులకు వ్యతిరేకంగా కవరేజీ అందిస్తుంది. పాలసీ సకాలంలో పునరుద్దరించబడితే పాలసీ జీవిత కాల పునరుద్దరణ అందిస్తుంది. పాలసీ సకాలంలో పునరుద్దరించబడితే పాలసీ జీవిత కాల పునరుద్దరణ అందిస్తుంది.

అర్హత

ప్రవేశ వయసు

పెద్దలు 18- 65 సంవత్సరాలు

బీమా మొత్తం

రూ. 1,2,3,5,8,10, 12 మరియు 15 లక్షలు

ఫీచర్లు

 • పాలసీదారుడు ప్రతి 3 క్లెయిమ్ ఫ్రీ సంవత్సరాల తర్వాత ఆరోగ్య పరీక్షలకు అర్హులు
 • పాలసీ అంబులెన్స్ ఛార్జీలను( ఎస్ఐలో 1 శాతం) తిరిగి చెల్లిస్తుంది.
 • ఆయుష్ చికిత్స ఖర్చులు కూడా ( ఎస్ఐ లో 25 శాతం వరకు) కవరేజీ అందించబడుతుంది.
 • పాలసీ 139 డేకేర్ చికిత్సా విధానాలకు కవరేజీ అందిస్తుంది.

19. న్యూ ఇండియా గ్రూప్ మెడిక్లెయిమ్ 2007

న్యూ ఇండియా గ్రూప్ మెడిక్లెయిమ్ 2007 అనారోగ్యం, గాయం వల్ల అయ్యే అన్ని ఆసుపత్రి ఖర్చులకు కవరేజీ అందిస్తుంది.

ఫీచర్లు

 • ఈ పథకం గది, బోర్డింగ్ మరియు నర్సింగ్ ఖర్చులకు( రోజుకు ఎస్ఐ లో 10 శాతం) కవరేజీ అందిస్తుంది.
 • సర్జన్లు మెడికల్ ప్రాక్టీషనర్లు, మత్తుమందు నిపుణులు మరియు నిపుణుల ఫీజులు ఈ పథకం కింద కవరేజీ అందించబడుతుది.
 • ఈ పథకం వరుసగా 30 మరియు 60 రోజులు ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు కవరేజీ అందిస్తుంది.
 • ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆసుపత్రిలో ఆయుష్ చికిత్సకు కూడా ఈ పథకం కవరేజీ అందిస్తుంది.(ఎస్ఐ లో 25 శాతం వరకు).

20. న్యూ ఇండియా కరోనా కవచ్ పాలసీ

న్యూ ఇండియా కరోనా కవచ్ పాలసీ అనేది ప్రీమియం పాలసీ ఒకే ప్రీమియం పాలసీ, ఇది కొవిడ్-19 చికిత్స సమయంలో అయ్యే ఖర్చుల నుంచి తమను తాము కవర్ చేసుకోవడానికి వ్యక్తులు కొనుగోలు చేయవచ్చు. ఈ పాలసీని వ్యక్తిగత లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్రాతిపదికన కొనుగోలు చేయవచ్చు.

అర్హత

ప్రవేశ వయసు

పెద్దలు- 18-65 సంవత్సరాలు

బీమా మొత్తం

రూ. 50,000- రూ. 5 లక్షలు

పాలసీ కాల వ్యవధి

3.5 నెలలు, 6.5 నెలలు మరియు 9.5 నెలలు

న్యూ ఇండియా ఆరోగ్య బీమా పథకాలను ఎలా కొనుగోలు చేయాలి?

న్యూ ఇండియా ఆరోగ్య బీమా పథకాలను కొనుగోలు చేయడానికి సరళమైన ప్రక్రియను రూపొందించింది. ఈ ప్రక్రియ గురించి కింద వివరించడం జరిగింది.

 •  న్యూ ఇండియా అస్యూరెన్స్ యొక్క అధికారిక వెబ్ సైటుకు వెళ్లండి. గెట్ కోట్ క్లిక్ చేయండి.
 • ఆరోగ్య బీమా టాబ్ ను ఎంచుకోండి పథకాన్ని ఎంచుకోండి మరియు ఆన్ లైన్ లో కొనుగోలు చేయండి పై క్లిక్ చేయండి.
 • మీ అన్ని వివరాలను పూరించండి మరియు ఆన్ లైన్ లో చెల్లింపు చేయండి.
 • పూర్తయింది, పాలసీ పత్రాలు మీ రిజిస్ట్రర్డ్ మెయిల్ ఐడీకి పంపబడతాయి.
 • ఆరోగ్య బీమా ను కొనుగోలు చేయడానికి మీరు సమీప శాఖను కూడా సంప్రదించవచ్చు.

న్యూ ఇండియా ఆరోగ్య బీమాను ఎలా పునరుద్దరించాలి?

న్యూ ఇండియా ఆరోగ్య బీమాను పునరుద్ధరించడానికి ఒక సాధారణ ప్రక్రియ ఉంది. దీని గురించి తెలుసుకుందాం..

 • న్యూ ఇండియా అస్యూరెన్స్ యొక్క అధికారిక వెబ్ సైటుకు వెళ్లండి. పైన శీఘ్ర సహాయం ట్యాబ్ పై క్లిక్ చేసి ఆపై శీఘ్ర పునరుద్దరణ ఎంపికను ఎంచుకోండి.
 • పాలసీ నంబర్ మరియు కస్టమర్ ఐడిని నమోదు చేయండి.
 • ప్రీమియం చెల్లింపు చేయండి, పాలసీ పత్రాలు మీ రిజిస్ట్రర్డ్ మెయిల్ ఐడీకి పంపబడతాయి.

న్యూ ఇండియా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా దాఖలు చేయాలి?

దిగువ జాబితా చేయబడిన దశలను అనుసరించండి-

సంస్థకు తెలియజేయండి..

 • ప్రణాళికాబద్ధంగా ఆసుపత్రిలో చేరితే, మీరు ఆసుపత్రిలో చేరడానికి 48 గంటల ముందు లేదా గాయం, అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరితే సంస్థకు వెంటనే తెలియజేయాలి
 • అత్యవసర సమయంలో ఆసుపత్రిలో చేరితే సంస్థకు సంస్థకు 24 గంటల్లో తెలియజేయాలి.

పత్రాల సమర్పణ

 • ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత కింది పత్రాలను 7 రోజుల్లో సమర్పించాల్సిన అవసరం ఉంది.
 • బిల్లు, రశీదు మరియు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి పత్రం
 • ఆసుపత్రి నగదు బిల్లులు, రిపోర్టులు, ప్రిస్కిప్షన్లు
 • మెడికల్ ప్రాక్టీషనర్, సర్జన్ రిపోర్టులు, పాథాలజిస్ట్ రిపోర్టు మరియు పాథాలాజికల్ పరీక్ష నివేదికలు, రోగలక్షణ పరీక్ష నివేదికలు
 • ఆపరేషన్ యొక్క స్వభావాన్ని పేర్కొంటూ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ మరియు సర్జన్ బిల్లు.
 • డాక్టర్, కన్సల్టెట్, స్పెషలిస్ట్, అనస్థీటిస్ట్ బిల్ల మరియు రోగ నిర్థారణకు సంబంధించి రశీదు మరియు సర్టిఫికెట్.
 • పోస్ట్ హాస్పిటలైజేషన్ విషయంలో చికిత్స తేదీ నుంచి 7 రోజుల్లోపు పత్రాలు సమర్పించాలి. అన్ని ధృవీకరణ పూర్తయిన తరువాత సంస్థ క్లెయిమ్ పరిష్కరిస్తుంది.