రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ 2000 లో స్థాపించబడింది మరియు అప్పటి నుండి, భారత మార్కెట్లో అత్యంత విశ్వసనీయ బీమా ప్రొవైడర్లలో ఒకటిగా నిరూపించబడింది. సంస్థ విస్తృతమైన బీమా ఉత్పత్తులను అందిస్తుంది. ఇవి తమ వినియోగదారుల యొక్క ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలకు తగ్గట్లుగా బీమా పథకాలను అందిస్తాయి.
రిలయన్స్ ఆరోగ్య బీమా పథకాలు విస్తృత ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి ప్రత్యేకంగా వినియోగదారుల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. నెట్ వర్క్ ఆసుపత్రులు మరియు పాకెట్- స్నేహపూర్వక ప్రీమియంల యొక్క బలమైన మద్దతుతో ఈ పథకాలు మార్కెట్లో తమకంటూ ఒక పేరు సంపాదించుకున్నాయి.
ప్రధానాంశాలు
నెట్ వర్క్ ఆసుపత్రులు |
7000+ |
మొత్తం శాఖల సంఖ్య |
139 |
మధ్యవర్తుల సంఖ్య |
28,900 + |
రిలయన్స్ ఆరోగ్య బీమా పథకాల రకాలు
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ కొన్ని రకాల ఆరోగ్య బీమా పథకాలను అందిస్తుంది. ఈ పథకాలు వైద్య అత్యవసర సమయంలో ప్రజల ఆర్థిక అవసరాలను కచ్చితంగా తీరుస్తుంది. వీటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది.
1. రిలయన్స్ హెల్త్ గెయిన్ ఇన్సూరెన్స్ పాలసీ
రిలయన్స్ హెల్త్ గెయిన్ పాలసీ, పాలసీదారులకు వైద్య ఖర్చులకు వ్యతిరేకంగా కవరేజీని అందిస్తుంది. ఈ పథకం వ్యక్తిగత మరియు కుటుంబ ఫ్లోటర్ ప్రాతిపదికన అందుబాటులో ఉంది మరియు ఈ పథకం విస్తృతమైన ప్రయోజనాలను అందిస్తుంది.
ఫీచర్లు&ప్రయోజనాలు
- ఇది 60 రోజుల వరకు ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ కు కవరేజీ అందిస్తుంది.
- డొమిసిలియరీ హాస్పిటలైజేషన్ కోసం ఎస్ఐలో 10 శాతం వరకు కవరేజీ అందించబడుతుంది.(గరిష్టంగా రూ. 50 వేల వరకు)
- అత్యవసర పరిస్థితుల్లో దేశీయ అంబులెన్స్ సేవల( రూ. 1500 వరకు) ప్రయోజనాన్ని పొందవచ్చు.
- మీ మొత్తం బీమా మరియు సంచిత బోనస్ ను మీరు ఖాళీ చేస్తే అదనపు ఖర్చు లేకుండా బీమా చేసిన పూర్తి మొత్తాన్ని స్వయంచాలకంగా రీఫిల్ చేస్తుంది.
2. రిలయన్స్ హెల్త్ ఇన్ఫినిటీ ప్లాన్
రిలయన్స్ హెల్త్ ఇన్ఫినిటీ ప్లాన్ అనేది సమగ్ర ఆరోగ్య బీమా పథకం. ఇది వైద్య కవరేజీని అందిస్తుంది మరియు పాలసీదారు ఆందోళన లేకుండా వేగంగా రికవరీ అయ్యేలా ఈ పథకం అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ఫీచర్లు
- ఈ పథకం 90 రోజుల వరకు ప్రీ హాస్పిటలైజేషన్ మరియు 180 రోజుల వరకు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు కవరేజీని అందిస్తుంది.
- క్యాబ్ ద్వారా ఆసుపత్రికి పాలసీదారుని రవాణా చేయడానికి ఖర్చులను(రూ. 500 వరకు) ఈ పథకం అందిస్తుంది.
- పాలసీదారు ఆన్ లైన్ లో పాలసీ కొనుగోలు చేస్తే లేదా పునరుద్దరిస్తే 10 శాతం తగ్గింపును పొందవచ్చు.
అర్హత
ప్రవేశ వయసు |
పిల్లలు 91 రోజుల నుంచి 25 రోజుల వరకు పెద్దలకు- 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు |
పాలసీ కాల వ్యవధి |
1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు |
బీమా మొత్తం |
3/5/10/15/50 లక్షలు మరియు 1 కోటి |
3. రిలయన్స్ వ్యక్తిగత ఇన్సూరెన్స్ పాలసీ
ప్రమాదాలు మన రోజువారీ జీవనోపాధిని దెబ్బతీస్తాయి. ఆర్థిక నష్టం మరియు పొదుపులు ఖాళీ అయిన తర్వాత దాని ప్రభావం మన పై ఆధారపడిన వారిపై కూడా పడుతుంది. రిలయన్స్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తో కంపెనీ మీ ఖర్చులకు సంబంధించిన కవరేజీని అందిస్తుంది. అలాగే పాలసీదారుడు రికవరీపై పూర్తిగా దృష్టి పెట్టవచ్చు.
ఫీచర్లు
- మీరు ఒక కన్ను/ అంగం కోల్పోతే బీమా చేసిన మొత్తంలో 50 శాతం అందిస్తుంది.
- మీరు రెండు కళ్లు, అవయవవాలు లేదా ఒక కన్ను మరియు ఒక అవయవాన్ని కోల్పోతే మీరు బీమా చేసిన మొత్తంలో 100 శాతం పొందుతారు.
- బీమా చేసిన వ్యక్తి తన నివాసం వెలుపల ప్రమాదవశాత్తు మరణించినట్లుయితే ఈ పథకం కవరేజీని అందిస్తుంది. ఇది బీమా చేసిన మొత్తంలో 2 శాతం(గరిష్టంగా రూ. 2500) . దీని కింద ట్రాన్స్ పోర్టేషన్ ప్రయోజనం కూడా అందించబడుతుంది.
- మీరు శాశ్వత వైకల్యానికి గురైనట్లయితే, పాలసీ 100 శాతం ఎస్ఐ ని అందిస్తుంది.
4. రిలయన్స్ హెల్త్ వైజ్ ఇన్సూరెన్స్ పాలసీ
రిలయన్స్ హెల్త్ వైజ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీ ఆరోగ్య సంరక్షణ ఖర్చులకు సమగ్ర కవరేజీ అందించే సరసమైన ఆరోగ్య బీమా పథకం.
ఫీచర్లు
పాలసీదారు మొత్తం బీమా ఎంపికలు రూ. 3 లక్షలు, రూ. 6 లక్షలు మరియు రూ. 8 లక్షలు, రూ. 9 లక్షలు ఎంచుకోవచ్చు.
ఈ ప్లాన్ పాలసీదారులకు మూడు వేరియంట్లను అందిస్తుంది మరియు వారి అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.
మూడు రకాలు
- గోల్డ్ ప్లాన్
- సిల్వర్ ప్లాన్
- స్టాండర్డ్ ప్లాన్
ఈ పథకం ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు(60 మరియు 90 రోజుల వరకు) కవరేజీని అందిస్తుంది.
పాలసీదారుడు బీమా చేసిన మొత్తంలో 1 శాతం వరకు వైద్య పరీక్షల ఖర్చును తిరిగి పొందుతారు.
5. రిలయన్స్ క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ పాలసీ
తీవ్రమైన వ్యాధులు ఎటువంటి ఆహ్వానం లేకుండానే మన శరీరంపై దాడి చేస్తాయి. ఇలా తీవ్రమైన వ్యాధి బారిన పడినప్పుడు మీకు మద్దతు అందించే విశ్వసనీయమైన స్నేహితుడు అవసరం. రిలయన్స్ క్రిటికల్ ఇల్నెస్ పాలసీ ఈ పాత్రను పోషించగలదు. ఈ పథకం వల్ల మీరు ఆసుపత్రి ఖర్చుల కోసం చింతించకుండా మీరు చికిత్సపై దృష్టి సారించవచ్చు.
ఫీచర్లు
- క్యాన్సర్, హార్ట్ వాల్వ్, రీప్లెస్ మెంట్, థర్డ్-డిగ్రీ కాలిన గాయాలు వంటి జాబితా చేయబడిన తీవ్రమైన అనారోగ్యాలు ఈ పాలసీ కవరేజీ అందిస్తుంది.
- 45 సంవత్సరాల వయసు వరకు ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేదు.
అర్హత
ప్రవేశ వయసు |
18-65 సంవత్సరాలు |
పాలసీ కాల వ్యవధి |
1&3 సంవత్సరాలు |
బీమా మొత్తం |
5/7/10 లక్షలు |
6. రిలయన్స్ ఆరోగ్య సంజీవని
రిలయన్స్ ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ అత్యవసర సమయంలో వ్యక్తులు మరియు వారి కుటుంబాలకు వైద్య కవరేజీని అందిస్తుంది. అత్యవసర సమయంలో ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఫీచర్లు
దిగువ జాబితా చేయబడిన ప్రత్యేక చికిత్సల కోసం బీమా చేసిన మొత్తంలో 50 శాతం వరకు పథకం అందిస్తుంది.
- గర్భాశయ ధమని ఎంబోలైజేషన్ మరియు హెచ్ఐఎఫ్ యు(హై ఇంటిన్సిటీ ఫోకస్డ్ అల్ట్రా సౌండ్)
- బెలూన్ సినుప్లాస్టీ
- డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఓరల్ కెమోథెరపీ
- ఇమ్యునోథెరపీ- మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్ గా ఇవ్వబడుతుంది.
- ఇంట్రా విట్రియల్ ఇంజెక్షన్లు రోబోటిక్ శస్త్రచికిత్సలు
- స్టీరియోటిక్టిక్ రేడియో శస్త్రచికిత్సలు
- శ్వాసనాళ థర్మో ప్లాస్టీ (గ్రీన్ లేజర్ చికిత్స లేదా హాల్మియం లేజర్ చికిత్స)
- ఐఓఎన్ఎమ్(ఇంట్రా ఒబరేటివ్ న్యూరో మానిటరింగ్)
- స్టెమ్ సెల్ థెరపీ- ఎముక మజ్జ మార్పిడి కోసం హెమటోపోటిక్ మూల కణాలు కవర్ చేయాలి.
ఆయుర్వేద, యునాని, సిద్ధ మరియు హోమియోపతి చికిత్సల కోసం కవరేజీ అందిస్తుంది.
ఈ పథకం ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఆసుపత్రి ఖర్చులకు(వరుసుగా 30 మరియు 60 రోజులు) కవరేజీ అందిస్తుంది.
కంటి శుక్లం శస్త్ర చికిత్స కోసం మీరు కవరేజీ(రూ. 40000 లేదా ఎస్ఐలో 25 శాతం) పొందవచ్చు.
అర్హత
ప్రవేశ వయసు |
పిల్లలకు- 91 రోజుల నుంచి 25 సంవత్సరాల వరకు పెద్దలకు-18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు |
పాలసీ రకం |
వ్యక్తిగత మరియు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్రాతిపదికన |
పాలసీ కాల వ్యవధి |
1 సంవత్సరం |
బీమా మొత్తం |
1-5 లక్షలు |
7. రిలయన్స్ గ్రూప్ మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ పాలసీ
రిలయన్స్ గ్రూప్ మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది సమగ్ర ఆరోగ్య బీమా పథకం. ఇది ఒక సంస్థలో పనిచేసే వ్యక్తుల సమూహానికి కవరేజీ అందిస్తుంది. ఈ పథకం ఊహించని వైద్య ఖర్చులు మరియు సమూహ సభ్యుల అత్యవసర పరిస్థితులకు కవరేజీ అందిస్తుంది.
ఫీచర్లు
- ఈ పథకం ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు(వరుసుగా 30 మరియు 60 రోజుల వరకు) కవరేజీ అందిస్తుంది.
- అంబులెన్స్ ఛార్జీలకు ఈ పథకం కవరేజీ అందిస్తుంది.
- 7-1000 మంది కార్మికుల బృందాలకు ఈ పథకం కవరేజీ అందిస్తుంది.
అర్హత
ప్రవేశ వయసు |
18-60 సంవత్సరాలు |
బీమా మొత్తం |
50,000- 1,00,000 |
8. కరోనా కవచ్ పాలసీ
కరోనా కవచ్ పాలసీ అనేది సరసమైన ఆరోగ్య బీమా పాలసీ. ఇది కొవిడ్-19 కారణంగా సంభవించే ఆసుపత్రి ఖర్చులకు వ్యతిరేకంగా మీకు మరియు మీ కుటుంబానికి సమగ్ర కవరేజీ అందిస్తుంది.
ఫీచర్లు
- కొవిడ్-19 కోసం ఇంటి చికిత్స సమయంలో(పాలసీ వ్యవధిలో గరిష్టంగా 14 రోజులు) జరిగే వైద్య ఖర్చులకు వ్యతిరేకంగా ఈ పథకం కవరేజీని అందిస్తుంది.
- రహదారి అంబులెన్స్ కు అయ్యే ఖర్చులకు ఈ పథకం కవరేజీ(ఆసుపత్రిలో గరిష్టంగా 2000 వేల రూపాయాలు) అందిస్తుంది.
- ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు(15 మరియు 30 రోజులు వరకు) ఈ పథకం కవరేజీ అందిస్తుంది.
అర్హత
ప్రవేశ వయసు |
పిల్లలకు- 1 రోజు నుంచి 25 సంవత్సరాలు పెద్దలకు- 18 నుంచి 65 సంవత్సరాలు |
3.5 నెలలు, 6.5 నెలలు మరియు 9.5 నెలలు |
|
50,000- 5,00,000 |
9. కరోనా రక్షక్ పాలసీ
కరోనా రక్షక్ అనేది సరసమైన ఆరోగ్య బీమా పాలసీ, ఇది కొవిడ్-19 నిర్థారణ అయితే పాలసీదారుని బీమా ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఇందుకోసం పాలసీదారు కనీసం 72 గంటలు ఆసుపత్రిలో ఉండాలి.
అర్హత
ప్రవేశ వయసు |
18-65 సంవత్సరాలు |
పాలసీ కాల వ్యవధి |
3.5 నెలలు(105 రోజులు), 6.5 నెలలు(195 రోజులు) మరియు 9.5 నెలలు(285 రోజులు) |
బీమా మొత్తం |
50,000-2,50,000 |
వెయిటింగ్ పిరియడ్ |
15 రోజులు |
రిలయన్స్ ఆరోగ్య బీమా ఎందుకు ‘మ్యాన్ ఆఫ్ ది అవర్’?
- క్లైయిమ్ నిష్పత్తి: 2018-19 సంవత్సరానికి ఐఆర్డీఏఐ నివేదిక ప్రకారం సంస్థ యొక్క క్లైయిమ్ నిప్షత్తి 94 శాతం, అంటే సంస్థ మంచి క్లైయిమ్నిష్పత్తి రికార్డు కలిగి ఉంది. అలాగే వినియోగదారుల సంతృప్తిని మరియు సంస్థ పట్ల వారికున్న విశ్వాశాన్ని ఇదిసూచిస్తుంది.
- పెట్టుబడి: రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ పాలసీదారునికి ఉత్తమమైన భద్రతా కవరేజీని అందిస్తుంది. న్యాయమైన పెట్టుబడి(ప్రీమియం మాధ్యమం ద్వారా) వద్ద గరిష్ట రాబడి(గరిష్ట కవరేజీ) అందిస్తుంది.
- పన్ను మినహాయింపు ప్రయోజనాలు: ప్రీమియం చెల్లింపులపై, పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి.(ఆదాయపు పన్ను చట్టం, 1961 కింద)
- వెల్నెస్ ప్రోగ్రామ్స్- సంస్థ తన వినియోగదారులను ఆరోగ్యంగా ఉండడానికి ప్రోత్సహించడానికి ఆరోగ్య సంరక్షణ సేవలను మరియు సంరక్షణ కార్యక్రమాలను అందిస్తుంది.
- సులువుగా నెలవారీ పెట్టుబడి ఎంపికలు- సంస్థ ఈఎంఐల ప్రాతిపదికన ఆరోగ్య బీమా ను అందిస్తుంది. ఇది ఒక-సమయం వార్షిక ప్రీమియ చెల్లింపునకు సంబంధించిన ఇబ్బందులను తగ్గిస్తుంది.
రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా కొనుగోలు చేయాలి?
రిలయన్స్ ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం సులభమైన మరియు అనుకూలమైన ప్రక్రియ. మీ ఇంటి నుంచే పాలసీ సులభంగా కొనుగోలు చేయడానికి జాబితాలోని కింది దశలను అనుసరించండి.
- రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ యొక్క అధికారిక వెబ్ సైటును సందర్శించండి.
- హెల్త్ ట్యాబ్ పై క్లిక్ చేసి ఫారంను నింపండి.
- ధరలను తనిఖీ చేయు ట్యాబ్ పై క్లిక్ చేయండి మరియు తరువాతి పేజీ మీకు సరి అయిన ప్లాన్, ప్రీమియం వివరాలను చూపుతుంది.
- పథకం కొనడానికి కొనసాగించు ట్యాబ్ పై క్లిక్ చేయండి.
- ఆన్ లైన్ లో చెల్లింపు చేయండి, పూర్తయిన తర్వాత పాలసీ పత్రం మీ రిజిస్ట్రర్డ్ మెయిల్ ఐడీకి పంపబడుతుంది.
రిలయన్స్ ఆరోగ్య బీమాను క్లెయిమ్ ప్రక్రియ ఏమిటి?
రిలయన్స్ ఆరోగ్య బీమా అవసరమైన సమయంలో ఆరోగ్య బీమా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయడానికి చాలా పారదర్శకమైన మరియు సులభమైన పద్ధతిని అందిస్తుంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం..
నగదు రహిత క్లెయిమ్
మీరు రిలయన్స్ భాగస్వామ్య నెట్ వర్క్ ఆసుపత్రులలో ఒకదానిలో చేరినట్లయితే మీరు కింది దశలను అనుసరించాల్సి-
- వీలైనంత త్వరగా మీరు ఆసుపత్రిలో చేరిన విషయాన్ని బీమా సంస్థకు తెలియజేయండి.
- టిపిఎ హాస్పిటల్ డెస్క్ వద్ద ఫోటో ఐడెంటిటీ మరియు హెల్త్ కార్డు కాపీలతో పాటు ఆథరైజేషన్ ఫారం సమర్పించండి.
- చికిత్స ఆమోదం కోసం ఆసుపత్రి రిలయన్స్ జనరల్ ను సంప్రదిస్తుంది.
- ప్రతిదీ పరిష్కరించబడిన తరువాత సంస్థ చికిత్స బిల్లులను క్లియర్ చేస్తుంది.
రీయింబర్స్ మెంట్ క్లెయిమ్
మీరు నెట్ వర్క్ ఆసుపత్రిలో కాకుండా మరేదైనా ఆసుపత్రిలో చేరితే, రీయింబర్స్ క్లెయిమ్ దాఖలు చేయడానికి ఈ కింది దశలను అనుసరించాల్సి ఉంటుంది.
- ఆసుపత్రిలో చేరడం గురించి బీమా సంస్థకు తెలియజేయాలి.
- చికిత్స కోసం చెల్లించండి మరియు మీరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో అవసరమైన అన్ని పత్రాలను సేకరించండి.
- రీయింబర్స్ మెంట్ పొందడానికి పోస్ట్ హాస్పిటలైజేషన్ చికిత్స పొందిన 15 రోజుల్లోపు అన్ని అసలు పత్రాలు సమర్పించాలి.
- కంపెనీ క్లెయిమ్ అభ్యర్థనను ధృవీకరిస్తుంది మరియు క్లెయిమ్ ఆమోదం పొందినప్పుడు చెల్లింపును బదిలీ చేస్తుంది.
రిలయన్స ఆరోగ్య బీమా సంస్థను ఎలా సంప్రదించాలి?
కాంటాక్ట్ నంబర్- +91 2248903099
వాట్సాప్ నంబర్- 7400422200
ఈ-మెయిల్- rgid[dot]services[at]relianceada[dot]com