ఎస్‌బీఐ ఆరోగ్య బీమా
 • అగ్ర బీమా సంస్థల నుండి ఉత్తమ ప్రణాళికలు
 • పోల్చండి & తక్షణమే కొనండి
 • 80 డి కింద పన్ను ప్రయోజనాలు
PX step

ఆరోగ్య బీమా కొటేషన్లను ఆన్లైన్లో పోల్చుకోండి

1

2

పేరు
కవరేజీ
పుట్టినరోజు (పెద్ద సభ్యుడి)

1

2

ఫోన్ నం.
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్) మరియు ఇన్సూరెన్స్ ఆస్ట్రేలియా గ్రూప్( అంతర్జాతీయ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ) అనే రెండు ప్రధాన సంస్థల భాగస్వామ్యంతో ఏర్పడింది. ఈ సంస్థ 2010 లో స్థాపించబడింది మరియు అప్పటి నుంచి ఇది చిన్న-పరిమాణ మరియు పెద్ద-పరిమాణ సంస్థల వ్యక్తులు, చిల్లర వ్యాపారులు మరియు కుటుంబాలకు సరసమైన ప్రీమియం రేటుతో బీమా పథకాలను అందిస్తుంది.

పెరుగుతున్న జనాభా యొక్క విస్తరిస్తున్న ఆరోగ్య అవసరాలకు సేవలను అందించే ఉద్దేశ్యంతో ఎస్‌బీఐ ఆరోగ్య బీమా పథకాలు రూపొందించబడ్డాయి. ఎస్‌బీఐ అందించే ఉత్పత్తులు భవిష్యత్తులో ఊహించని వైద్య పరిస్థితులలో మీకు రక్షణను అందిస్తాయి. తీవ్ర అనారోగ్యాలకు ఓపీడీ కవరేజీతో పాటు అదనంగా సంపూర్ణ కవర్ ని కూడా ఇవి ఇస్తాయి.

ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ యొక్క ప్రధానాంశాలు

నెట్ వర్క్ ఆసుపత్రుల సంఖ్య

6000+

భారత దేశ వ్యాప్తంగా లోకేషన్ల సంఖ్య

125

మొత్తం శాఖల సంఖ్య

22,000+

ఎస్‌బీఐ ఆరోగ్య బీమా పథకాల రకాలేమిటి?

1. ఎస్‌బీఐ ఆరోగ్య ప్రీమియర్ పాలసీ

ఎస్‌బీఐ ఆరోగ్య ప్రీమియర్ పాలసీ అనేది ఆసుపత్రి/వైద్య సంప్రదింపులు/అవయవ మార్పిడి వంటి వాటికి అయిన అన్ని వైద్య ఖర్చులను బీమా సంస్థ/కంపెనీ భరించేలా ఎస్‌బీఐ అందించే ఒక ఆరోగ్య బీమా పథకం.

ఫీచర్లు

 • ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు (60 మరియు 90 రోజులు) కవరేజీ అందించబడుతుంది. వీటిలో డయాగ్నొస్టిక్ రిపోర్టులు, డాక్టర్ కన్సల్టేషన్, మందులు మొదలైనవి కవర్ చేయబడతాయి.
 • ఈ పథకం 142 డేకేర్ చికిత్సా విధానాలకు కవరేజీ అందిస్తుంది, ఇందుకోసం 24 గంటలు కంటే తక్కువ ఆసుపత్రిలో చేరి ఉండాలి.
 • ప్రసూతి ఖర్చులకు(మొదటి 9 నెలలు తరువాత) కూడా ఈ పాలసీ పరిధిలో కవరేజీ అందించబడుతుంది.

అర్హత

కనిష్ట ప్రవేశ వయసు

3 నెలలు

గరిష్ట ప్రవేశ వయసు

65 సంవత్సరాలు

బీమా మొత్తం

రూ. 10 లక్షల నుంచి రూ. 3 లక్షలు

పాలసీ కాల వ్యవధి

1,2 లేదా 3 సంవత్సరాలు

2. ఎస్‌బీఐ ఆరోగ్య ప్లస్ పాలసీ 

ఎస్‌బీఐ ఆరోగ్య ప్లస్ పాలసీ అనేది తీవ్ర అనారోగ్య చికిత్సలకు అయ్యే ఖర్చులు మరియు ఇతర సాధారణ వైద్య ఖర్చులను భరించడంలో బీమా చేసుకున్న వ్యక్తికి సహాయపడే పథకం.

ఫీచర్లు

 • ఈ పథకం ప్రకారం 55 సంవత్సరాల వయసు వరకు ప్రీ పాలసీ వైద్య పరీక్షలు అవసరం లేదు.
 • ఈ పథకం ప్రసూతి కవరేజీ అందిస్తుంది.
 • అత్యవసర సమయంలో సంస్థ అంబులెన్స్ సదుపాయాన్ని అందిస్తుంది మరియు పాలసీ వ్యవధిలో గరిష్టంగా రూ. 1500 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.
 • ఆయుర్వేదం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి వంటి పద్ధతులు ప్రత్యామ్నాయ చికిత్స ఖర్చులకు పథకం కవరేజీ అందిస్తుంది.

అర్హత

కనిష్ట ప్రవేశ వయసు

3 నెలలు

గరిష్ట ప్రవేశ వయసు

65 సంవత్సరాలు

బీమా మొత్తం

రూ. 1 లక్ష, రూ. 2లక్షలు, రూ. 3 లక్షలు

పాలసీ కాల వ్యవధి

1,2 లేదా 3 సంవత్సరాలు

3. ఎస్‌బీఐ ఆరోగ్య టాప్ అప్ పాలసీ 

ఎస్‌బీఐ ఆరోగ్య టాప్ అప్ పాలసీ అనేది, ఆసుపత్రిలో చేరినపుడు బీమా మొత్తాన్ని బీమా చేసుకున్న వ్యక్తి పొందేలా భరోసా ఇస్తూ, ముందుగా అనుకుని చేరే ఆసుపత్రి ఖర్చులు అలాగే అత్యవసర ఆసుపత్రి ఖర్చులను భరించడంలో సహాయపడే పథకం.

ఫీచర్లు

 • ఈ పాలసీ కింద 142 మెడికల్ డేకేర్ చికిత్సా విధానాలకు కవరేజీ అందించబడుతుంది.
 • ఇది మొదటి 9 నెలలు పూర్తయిన తర్వాత ప్రసూతి ఖర్చులకు కవరేజీ అందిస్తుంది.
 •  అనారోగ్యం, గాయం, ప్రమాదం కారణంగా అత్యవసర ఆసుపత్రిలో చేరినప్పుడు అంబులెన్స్ సౌకర్యం(రూ. 5000 వరకు) అందించబడుతుంది.
 • బీమా మొత్తాన్ని తిరిగి స్థాపించుకునే సౌలభ్యాన్ని ఈ పథకం కల్పిస్తుంది.

అర్హత

కనిష్ట ప్రవేశ వయసు

3 నెలలు

గరిష్ట ప్రవేశ వయసు

65 సంవత్సరాలు

బీమా మొత్తం

రూ. 1 లక్ష నుంచి రూ. 50 లక్షలు

పాలసీ కాల వ్యవధి

1, 2 లేదా 3 సంవత్సరాలు

4. ఎస్‌బీఐ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ 

ఇది అన్ని రకాల వైద్య ప్రయోజనాలను, అదనపు ప్రయోజనాలతో సహా మంచి ప్రీమియం ధరకే అందించే ఎస్‌బీఐ వారి అత్యంత సంపూర్ణ ఆరోగ్య బీమా పథకం.

ఫీచర్లు

 • ఈ పథకం 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సంరక్షణ సౌకర్యాలను అందిస్తుంది.
 • ఆయుష్ వంటి ప్రత్యామ్నాయ చికిత్సల కోసం కవరేజీ పొందడానికి పాలసీదారులు అర్హులు
 • ప్రతి క్లెయిమ్ ఫ్రీ సంవత్సరానికి పాలసీదారుడు 5 శాతం ఎస్ఐ కు సమానమైన బోనస్ ను పొందుతారు.
 • పాలసీ అంబులెన్స్ ఖర్చులను( రూ. 1500 లేదా ఎస్ లో 1 శాతం) అందిస్తుంది.

అర్హత

కనిష్ట ప్రవేశ వయసు

18 సంవత్సరాలు

గరిష్ట ప్రవేశ వయసు

65 సంవత్సరాలు

బీమా మొత్తం

రూ. 50,000 నుంచి రూ. 5 లక్షలు

పాలసీ కాల వ్యవధి

1 సంవత్సరం

5. ఎస్‌బీఐ క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ పాలసీ

ఎస్‌బీఐ క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ 13 తీవ్రమైన అనారోగ్యాలకు వ్యతిరేకంగా కవరేజీ అందిస్తుంది. ఈ పథకం వాస్తవ వైద్య ఖర్చులతో సంబంధం లేకుండా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది మరియు మీ ఆర్థిక విషయాల గురించి చింతించకుండా మీ చికిత్సపై పూర్తిగా దృష్టి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

ఫీచర్లు

 • ఈ పథకం కింది పేర్కొన్న అనారోగ్యాలకు కవరేజీ అందిస్తుంది-
 • నిర్దిష్ట తీవ్రత కలిగిన క్యాన్సర్
 • ఓపెన్ హార్ట్
 • బృహద్ధమని శస్త్రచికిత్స
 • ఓపెన్ హార్ట్ రీప్లేస్ మెంట్ లేదా హార్ట్ వాల్వ్ చికిత్స
 • శాశ్వత లక్షణాలు కలిగిన స్ట్రోక్
 • నిర్దిష్ట తీవ్రత కలిగిన గుండెపోటు
 • రెగ్యులర్ డయాలసిస్ అవసరం అయిన కిడ్నీ వైఫల్యం
 • ప్రైమరీ పల్మనరీ ఆర్టరీ
 • హైపర్ టెన్షన్
 • ప్రధాన అవయవం లేదా ఎముక మజ్జ మార్పిడి
 • స్టెరోసిస్
 • కోమా
 • పూర్తి అంధత్వం
 • అవయవాల శాశ్వత పక్షవాతం

ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80 డి కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.

ఈ పాలసీకి 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది.

అర్హత

కనిష్ట ప్రవేశ వయసు

18 సంవత్సరాలు

గరిష్ట ప్రవేశ వయసు

65 సంవత్సరాలు

బీమా మొత్తం

రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలు

పాలసీ కాల వ్యవధి

1 మరియు 3 సంవత్సరాలు

6. ఎస్‌బీఐ హాస్పిటల్ డైలీ క్యాష్ ఇన్సూరెన్స్ పాలసీ

ఎస్‌బీఐ హాస్పిటల్ డైలీ క్యాష్ బీమా పథకం పాలసీదారు ఆసుపత్రిలో చేరినప్పుడు రోజూ వారీ విధానంలో పాలసీదారునికి నిర్ణీత మొత్తాన్ని అందిస్తుంద మరియు ప్రయాణం, ఆహారం వంటి ఇతర ఖర్చులకు కవరేజీ అందిస్తుంది.

ఫీచర్లు

 • పాలసీదారునికి 10 రోజులు మించి ఆసుపత్రిలో ఉంటే రోజూ వారీ నగదు పరిమితి 3 రెట్లు లేదా రూ. 5000 (ఏది తక్కువ అయితే) అది అందించబడుతుంది.
 • ఐసియూ, హాస్పిటలైజేషన్ ఖర్చులను రోజువారీ ప్రయోజనానికి రెండు రెట్లు వరకు ఈ పథకం వర్తిస్తుంది.
 • ఈ ప్లాన్ 4 రోజు వారీ నగదు ప్రయోజనాల ఎంపికను అందిస్తుంది- రూ. 500, రూ. 1000, రూ. 1500 మరియు రూ. 2000.
 • స్వస్థత ఖర్చుల కోసం ఈ పథకం నిర్ణీత మొత్తాన్ని అందిస్తుంది.

అర్హత

కనిష్ట ప్రవేశ వయసు

18 సంవత్సరాలు

గరిష్ట ప్రవేశ వయుసు

65 సంవత్సరాలు

7. ఎస్‌బీఐ లోన్ ఇన్సూరెన్స్ పాలసీ

మీరు తీవ్ర అనారోగ్యం/ప్రమాదం/నిరుద్యోగత కు గురైనప్పుడు మీరు హోమ్ లోన్ ని కట్టాల్సిన పరిస్థితి ఉంటే, దాని ఖర్చులను ఈ పాలసీ మీ తరపున భరిస్తుంది.

ఫీచర్లు

 • ఈ పథకం 13 తీవ్రమైన అనారోగ్యాలకు వ్యతిరేకంగా కవరేజీని అందిస్తుంది.
 • ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు ఎంచుకున్న ఎంపిక ఆధారంగా పాలసీదారునికి చెల్లించవలసిన రుణం మొత్తం లేదా బీమా మొత్తం అందుతుంది.
 • ఒక వ్యక్తి తాత్కాలికంగా నిరుద్యోగిగా లేదా పాలసీ వ్యవధిలో ఉపసంహరణ చేసుకున్నప్పుడు, తీసుకున్న రుణ మొత్తానికి అనుకూలంగా గరిష్టంగా 3 ఈఎంఐలు చెల్లించబడతాయి.
 • ఈ ప్లాన్ రెండు ఇన్స్యూర్డ్ ఎంపికలను అందిస్తుంది- స్థిర మరియు తగ్గింపు ఎంపికలు

అర్హత

కనిష్ట ప్రవేశ వయసు

18 సంవత్సరాలు

గరిష్ట ప్రవేశ వయసు

65 సంవత్సరాలు

గరిష్ట పాలసీ కాల వ్యవధి

3 సంవత్సరాలు

8. ఎస్‌బీఐ ఆరోగ్య సంజీవని పాలసీ

ఆరోగ్య సంజీవని అనేది సమగ్ర ఆరోగ్య బీమా పథకం, ఇది ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగితే ఆసుపత్రిలో చేరినప్పుడు ఆర్థిక రక్షణ అందిస్తుంది.

ఫీచర్లు

 • ఈ పథకం ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ వరుసుగా 30 మరియు 60 రోజులు ఖర్చులకు కవరేజీ అందిస్తుంది.
 • యునాని, సిద్ధ మరియు హోమియోపతి ఇన్-పెషేంట్ చికిత్స విధాలకు ఆరోగ్య సంజీవని పథకం కవరేజీ అందిస్తుంది.
 • పాలసీదారులు కాటారాక్ట్ చికిత్సకు( బీమా మొత్తంలో 25 శాతం లేదా రూ. 4000 ఏది తక్కువ అయితే అది) కవరేజీ లభిస్తుంది.
 • నర్సింగ్, గది అద్దె మరియు బోర్డింగ్ ఖర్చులకు ( ఎస్ఐ లో 2 శాతం, గరిష్టంగా రూ. 5000) కవరేజీ లభిస్తుంది.

అర్హత

కనిష్ట ప్రవేశ వయసు

18 సంవత్సరాలు

గరిష్ట ప్రవేశ వయసు

65 సంవత్సరాలు

బీమా మొత్తం

రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలు

9. ఎస్‌బీఐ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్

ఎస్‌బీఐ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వ్యక్తులు మరియు కుటుంబాలకు అనువైన బీమా పాలసీ. ఈ పథకం మీ వైద్య ఖర్చులకు వ్యతిరేకంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది మరియు త్వరగా కొలుకోవడానికి మీకు సాధ్యమైనంత ఉత్తమమైన ఆరోగ్య చికిత్సలు పొందేలా చూస్తుంది.

ఫీచర్లు

 • 65 సంవత్సరాల వయసు వరకు(మెడికల్ హీస్టరీ లేని) ప్రజలకు ప్రీ పాలసీ వైద్య పరీక్షలు అవసరం లేదు.
 • ఈ పథకం ప్రీ-హాస్పిటలైజేషన్ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్( 30 మరియు 60 రోజులు) ఖర్చులకు కవరేజీ అందిస్తుంది.
 • డొమిసిలియరీ హాస్పిటలైజేషన్( ఎస్ఐలో రూ. 2000 లేదా 20 శాతం ఏది తక్కువ అయితే అది) అందిస్తుంది.
 • మెడికల్ ప్రాక్టీషనర్ మరియు స్పెషలిస్ట్ ఫీజులకు కూడా ఈ పాలసీ కవరేజీ అందిస్తుంది.

అర్హత

కనిష్ట ప్రవేశ వయసు

18 సంవత్సరాలు

గరిష్ట ప్రవేశ వయసు

65 సంవత్సరాలు

బీమా మొత్తం

రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలు

ఎస్‌బీఐ ఆరోగ్య బీమా పథకాలను ఎలా కొనుగోలు చేయాలి?

కొన్ని సందర్భాల్లో బీమా పథకాలను కొనుగోలు చేసే ప్రక్రియ ఇబ్బందికరంగా ఉంటుంది. అదృష్టవశాత్తూ, ఎస్‌బీఐ ఈ సమస్యను అర్థం చేసుకుంది మరియు వినియోగదారుల కోసం సరళమైన కొనుగోలు ప్రక్రియను రూపొందించింది. మీరు ఏదైనా కారణం చేత సంస్థ వెబ్ సైటు నుంచి పాలసీ కొనుగోలు చేయలేకపోతే, మీరు సులువుగా PolicyX.com ద్వారా పాలసీని కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు ప్రక్రియ గురించి వివరంగా తెలుసుకుందాం..

సంస్థ వెబ్ సైటు ద్వారా

 • ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ యొక్క అధికారిక వెబ్ సైటును సందర్శించండి.
 • హెల్త్ ట్యాబ్ కింద కొనండి ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • వివరాలతో ఫారం నింపి గో ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • తదుపరి పేజీలో మీ సంప్రదింపు నంబర్ మరియు చిరునామా పూరించండి.
 • పూర్తయిన తర్వాత మీరు చిన్న ప్రశ్న పత్రంతో పేజీకి మళ్లించబడతారు.
 • అన్నింటికి సమాధానం ఇచ్చిన తర్వాత కొనసాగించండి ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • ప్రీమియం వివరాలతో పాటు, మీ అవసరాలకు అనుగుణంగా పథకాన్ని చూపుతుంది.
 • పాలసీని ఎంచుకుని ఆన్ లైన్ చెల్లింపు చేయండి.
 • మీ పాలసీ పత్రం మీ రిజిస్ట్రర్డ్ మెయిల్ ఐడికి పంపబడుతుంది.

గమనిక- మీరు సమీప ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ శాఖను సందర్శించడం ద్వారా ఆరోగ్య బీమా పథకాన్ని కొనుగోలు చేయవచ్చు.

PolicyX.com ద్వారా

 • ఈ పేజీ ఎగువకు వెళ్లి వివరాలను ఎస్‌బీఐ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కించు ట్యాబ్ లో వివరాలను పూరించండి.
 • తరువాత పేజీ మీకు వివిధ సంస్థల నుంచి వచ్చిన అన్ని కోట్లను చూపుతుంది. మీకు కావాల్సిన ఎస్‌బీఐ హెల్త్ ప్లాన్ ఎంచుకోండి
 • ఆన్ లైన్ లో ప్రీమియం చెల్లించండి మరియు మీ పాలసీ పత్రాలు రిజిస్ట్రర్డ్ మెయిల్ ఐడీకి పంపబడతాయి.

ఎస్‌బీఐ ఆరోగ్య బీమా పథకాల యొక్క క్లెయిమ్ ప్రక్రియ ఏమిటి?

ఎస్‌బీఐ ఆరోగ్య బీమా పథకాల యొక్క క్లెయిమ్ ప్రక్రియ గురించి వివరంగా తెలుసుకుందాం..

 • టోల్ ఫ్రీ నంబర్(1800 22 111) లేదా CLAIM అని టైప్ చేసి 561612 కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా సంస్థ కు క్లెయిమ్ గురించి తెలియజేయండి.
 • ఎస్‌బీఐ కస్టమర్ ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు. అవసరమైన పత్రాలు సమర్పించాలి.
 • క్లెయిమ్ దాఖలు చేసిన 24 గంటల్లోపు ఎస్‌బీఐ ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.
 • అవసరమైన అన్ని పత్రాలు అందించిన తర్వాత సంస్థ క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభిస్తుంది మరియు తుది సర్వే నివేదిక వచ్చిన 30 రోజుల్లోపు క్లెయిమ్ పరిష్కరించబడుతుంది.

ఎస్‌బీఐ ఆరోగ్య బీమా యొక్క పునరుద్దరణ ప్రక్రియ ఏమిటి?

క్రింది పేర్కొన్న దశలను అనుసరించడం ద్వారా మీరు మీ పాలసీని నేరుగా పునరుద్దరించవచ్చు.

 1. ఎస్‌బీఐ జనరల్ యొక్క అధికారిక వెబ్ సైటుకి వెళ్లి హెల్త్ ట్యాబ్ కింద రెన్యూవల్ పై క్లిక్ చేయండి.
 2. అవసరమైన వివరాలను నమోదు చేసి కొనసాగండి ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 3. తరువాతి పేజీ మీ పాలసీ యొక్క వివరాలను చూపుతుంది, దానిని తనిఖీ చేసి చెల్లింపు చేయండి.
 4. మీ పాలసీ పునరుద్దరించబడుతుంది మరియు నోటిఫికేషన్ మీ రిజిస్ట్రర్డ్ మొబైల్ కు పంపంబడుతుంది.

ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ యొక్క సంప్రదింపు వివరాలు

కాంటాక్ట్ నంబర్- 1800 102 111

ఈ-మెయిల్- coustome[dot]care[at]sbigeneral[dot]in