సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా
 • అగ్ర బీమా సంస్థల నుండి ఉత్తమ ప్రణాళికలు
 • పోల్చండి & తక్షణమే కొనండి
 • 80 డి కింద పన్ను ప్రయోజనాలు
PX step

ఆరోగ్య బీమా కొటేషన్లను ఆన్లైన్లో పోల్చుకోండి

1

2

పేరు
కవరేజీ
పుట్టినరోజు (పెద్ద సభ్యుడి)

1

2

ఫోన్ నం.
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ 60 నుండి 75 సంవత్సరాల వయస్సులో ఉన్న వ్యక్తుల అవసరాలను తీర్చడం కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా విషయానికి వస్తే, మీరు ఆసుపత్రులలో నగదు రహిత వైద్యం వంటి అనేక ప్రయోజనాలను పొందుతారు, అంబులెన్స్ సేవలు మరియు క్లిష్టమైన అనారోగ్యాలకు కవరేజ్, మొదలైన ఎన్నో ప్రయోజనాలను ఈ పథకం అందిస్తుంది.

సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా పథకం చాలా అవసరం, ముఖ్యంగా ఒక వ్యక్తి రిటైర్ అయిన తర్వాత, తాను కోరుకునే సందర్భాలలో పెన్షన్ మొత్తన్ని వడ్డీతో కలిపి అందుకుంటాడు. పదవీ విరమణ అనంతరం జీవితాన్ని ఆస్వాదించడానికి అతను / ఆమెకు ఈ డబ్బు సహాయపడుతుంది. వివిధ జనరల్ భీమా సంస్థలు సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా పథకాలను అందిస్తున్నాయి. అయితే అనేక పథకాల నుండి మీకు అవసరానికి సరిపోయే పథకాన్ని సులభంగా ఎంచుకోవడం అత్యవసరం. ఈ బీమా పథకం మీ అన్ని అవసరాలను తీర్చడంతో పాటు సమర్థవంతమైన ఆరోగ్య కవరేజీని అందించగలదు.

సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా: ఫీచర్లు

సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా పథకాల యొక్క కొన్ని ముఖ్యమైన ఫీచర్లు:

 • ఇది సీనియర్ సిటిజన్లకు అధిక మొత్తంలో హామీ ఇవ్వబడిన ఎంపికను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఈ కవరేజీ అన్ని రకాల వైద్య అవసరాలను తీర్చడానికి సరిపోతుంది.
 • అనేక సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా పథకాలు జీవితకాలం కవరేజీ అందిస్తున్నాయి.
 • అనేక వైద్య సంబంధిత సౌకర్యాలు, ఉదా. అత్యవసర అంబులెన్స్ సేవలు మరియు కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కవరేజీ, దాదాపు సీనియర్ సిటిజన్లకు అవసరమైన అన్ని వైద్య సేవలను ఆరోగ్య బీమా పాలసీలు కవర్ చేస్తున్నాయి.
 • ముందుగా ఉన్న వ్యాధులకు నిర్ణీత కాలం తర్వాత కవర్ పొందే అవకాశం.
 • ఆసుపత్రిలో చేరిన తరువాత పాలసీదారుల నగదు రహిత చికిత్స మరియు అన్ని వైద్య-సంబంధిత ఖర్చులు రియింబర్స్ పొందవచ్చు.
 • సీనియర్ సిటిజన్ల కోసం కొన్ని ఆరోగ్య బీమా పథకాలు వారితో పాటు జీవిత భాగస్వామి కూడా కవరేజీ అందిస్తాయి.
 • దాదాపు అన్ని సీనియర్ సిటిజన్ ఇన్సూరెన్స్ పాలసీలు కో-పే ఎంపికను అందిస్తాయి. దీనిని ఎంచుకోవడం వలన తక్కువ ప్రీమియంలు చెల్లించవచ్చు. కొన్ని సందర్భాల్లో, ఇది డిస్కౌంట్లను స్వీకరించడానికి మీకు భరోసా ఇస్తుంది. 

సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా: ప్రయోజనాలు

సీనియర్ సిటిజన్ హెల్త్ కేర్ ప్లాన్‌ను వినియోగదారుల బహుళ అవసరాలు తీర్చే విధంగా బీమా సంస్థలు రూపొందిస్తాయి. ఈ పథకాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి..

ప్రీ-పాలసీ మెడికల్ స్క్రీనింగ్ లేదు:

దాదాపు అన్ని బీమా సంస్థలు సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా పాలసీల కొనుగోలు చేసే ముందు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించవు.

ఓడీపీ కవర్:

సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు OPD కవరేజీ అందిస్తున్నాయి, విజిటింగ్ డాక్టర్ చికిత్స చేసినప్పుడు లేదా వైద్యనిపుణుడి సలహా మేరకు చికిత్స చేసినప్పుడు అయ్యే ఖర్చులకు ఇది ఆర్థిక కవరేజీని అందిస్తుంది.

ప్రత్యేక తగ్గింపు :

మీరు సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా పాలసీని మీ భాగస్వామితో కలిపి తీసుకోవచ్చు పలు బీమా సంస్థలు ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి, ఇలా ఇద్దరికి కలిపి తీసుకుంటే ప్రీమియంలో 5% తగ్గింపు లభిస్తుంది.

రెండవ అభిప్రాయం:

 మొదటి అభిప్రాయం ఎల్లప్పుడూ ప్రభావవంతంగా ఉండదు మరియు మీరు ఈ అభిప్రాయంపై మీకు సంసిద్ధత కూడా ఉడందు. ఒక వ్యాధి యొక్క సరైన చికిత్స కోసం రెండవ అభిప్రాయం కోసం తప్పనిసరిగా వెళ్లాలి. సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా పథకాలు రెండవ అభిప్రాయాన్ని తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. వైద్య నిపుణుడి ఈ- అభిప్రాయం కూడా తీసుకోవచ్చు.

డొమిసిలియరీ చికిత్స ఖర్చులు:

అనేక సీనియర్ సిటిజన్ పథకాలు ఇంట్లో ఉండి పొందే చికిత్సకు కవరేజీని అందిస్తాయి. అంటే, ఇంట్లోనే చికిత్స పొందాలని డాక్టర్ సూచించినప్పుడు ఈ బీమా పథకాలు అందుకు సంబంధించిన కవరేజీ అందిస్తాయి.

ఆరోగ్య పరీక్షలు మరియు పునరుద్ధరణ:

జీవితకాలం పునరుద్ధరణ సౌకర్యంతో పాటు ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షల ప్రయోజనాన్ని ఈ బీమా పథకాల అందిస్తున్నాయి.

పన్ను ప్రయోజనాలు:

సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమాలో పెట్టుబడులు పెట్టడం మంచిది, పాలసీదారు చెల్లించే అన్ని ప్రీమియంలకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80 డి కింద రూ. 25,000 వరకు రూ. 75,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది.

ప్రసిద్ధ సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా పథకాలు

సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా

సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా పథకం పేరు

మొత్తం బీమా హామీ

వయసు (సంవత్సరములు)

ముందుగా ఉన్న వ్యాధుల కొరకు వేచి ఉన్న కాలం

ఆసుపత్రిలో చేరక ముందు చేరిన తరువాత(రోజుల్లో)

మెడికల్ స్క్రీనింగ్ టెస్ట్

నేషనల్ ఇన్సూరెన్స్ 

సీనియర్ సిటిజన్లకు వరిస్తా మెడిక్లైమ్ పాలసీ 

ఆరోగ్య కవరేజ్: రూ. 1 లక్షలు;

తీవ్రమైన అనారోగ్యం: రూ. 2 లక్షలు

60-80

1 సంవత్సరం తరువాత

30 & 60

అవసరం లేదు (పాలసీదారుడు ఇప్పటికే కనీసం 3 సంవత్సరాలు ఆరోగ్య ప్రణాళిక కలిగి ఉన్నట్లయితే)

న్యూ ఇండియా

సీనియర్ సిటిజన్ మెడిక్లైమె పాలసీ 

రూ. 1-1.5 లక్షలు

60-80 

1.5 సంవత్సరం తరువాత

30 & 60

50 సంవత్సరం తరువాత

స్టార్ హెల్త్

సీనియర్ సిటిజన్ రెడ్ కార్పెట్ ఆరోగ్య ప్రణాళిక 

రూ. 1-10 లక్షలు

60-75

1 సంవత్సరం తరువాత

హాస్పిటల్ లో చేరిన 60 రోజుల తరువాత పెట్టిన ఖర్చులో రూ. 5000/- వరకు పొందగలరు

అవసరం లేదు 

బజాజ్ అలియాన్జ్ 

సిల్వర్ హెల్త్ సీనియర్ సిటిజన్ హెల్త్ ప్లాన్

రూ. 50000-5 లక్షలు

46-70

1 సంవత్సరం తరువాత

30 & 60

1 సంవత్సరం తరువాత

రెలిగేర్ 

కేర్ సీనియర్

రూ. 3-10 లక్షలు

61 మరియు అంతకంటే ఎక్కువ

4 సంవత్సరాల తరువాత 

30 & 60

అవసరం లేదు 

యునైటెడ్ ఇండియా 

సీనియర్ సిటిజన్ మెడిక్లైమె పాలసీ 

రూ. 1-3 లక్షలు

61-80

4 సంవత్సరాల తరువాత

30 & 60

1 సంవత్సరం తరువాత

హెచ్డీఫ్సీ ఎర్గో హెల్త్ 

హెల్త్ అప్టిమా

రూ. 2-5 లక్షలు

61 మరియు అంతకంటే ఎక్కువ

3 సంవత్సరాల తరువాత

30 & 60

1 సంవత్సరం తరువాత

సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమాను కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు

సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా పథకంలో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. బీమా కొనుగోలు అనేది కీలక నిర్ణయం. ఒక ఆరోగ్య బీమా పథకాన్ని కొనుగోలు చేయడానికి ముందు ఈ కింద పాయింట్ల ఆధారంగా ప్రణాళికను సిద్ధం చేసుకోండి.

ఉప పరిమితుల కోసం తనిఖీ చేయండి:

ఆసుపత్రి గది అద్దె, డాక్టర్ ఫీజు మొదలైన వివిధ ఆసుపత్రి ఖర్చులపై క్యాప్ లేదా ఉప పరిమితి ఉంటుంది మరియు క్లైయిమ్ సమయంలో బీమా సంస్థ హామీ ఇచ్చిన ప్రాథమిక మొత్తంలో ఒక శాతం చెల్లింపు చెల్లిస్తుంది. మీ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని పాలసీ కొనుగోలు చేసేముందు ఉప-పరిమితుల కోసం తనిఖీ చేయండి.

నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఖ్య:

నగదు రహిత సౌకర్యం యొక్క ప్రయోజనాలు చాలా ముఖ్యం. అయితే ఇందుకోసం నెట్ వర్క్ ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సి ఉంటుంది. ఏదైనా సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా పథకాన్ని కొనుగోలు చేసే ముందు మీ నివాస ప్రాంతం చుట్టూ ఉన్న అన్ని నెట్‌వర్క్ ఆస్పత్రుల గురించి తెలుసుకోండి.

వెయిటింగ్ పిరియడ్:

బీమా పథకాలకు వివిధ రకాల వెయిటింగ్ పీరియడ్ విధానాలు ఉంటాయి (ముందుగా ఉన్న వ్యాధి,ENT రుగ్మతలు, బోలు ఎముకల వ్యాధి మొదలైనవి, ప్రసూతి) పథకాన్ని ఎంచుకునేటప్పుడు వెయిటింగ్ పిరియడ్ ని పరిశీలించి, జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చేరితే చేరిన రోజు నుంచి 30 రోజులలోపు మరొక వ్యాధి కి కవర్ చేయబడదు. సాధారణంగా, ముందుగా ఉన్న వ్యాధుల కవరేజీ కోసం 4 సంవత్సరాల వరకు నిరీక్షణ కాలం ఉంటుంది. అటు తర్వాతే ఈ వ్యాధులకు కవరేజీ లభిస్తుంది.

న్ని అవసరాలు తీర్చేలా:

సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా పథకాల్లో ఇది ఒక ముఖ్యమైన అంశం. ఒక పాలసీని కొనడానికి ముందు కవరేజ్ గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. కొన్ని సంస్థలు 2 నుండి 3 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్‌ను అందిస్తాయి, కాని ప్రీమియం చెల్లించాల్సిన ఉంటుంది. ముందుస్తు మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలున్నా కవరేజీ వర్తిస్తుంది. అయితే ఈ ఆరోగ్య సమస్యలకు 18 నెలల వెయిటింగ్ పిరయడ్ ఉంది. దీని కోసం అదనపు ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది.

వైద్య పరీక్షల ఖర్చు:

సీనియర్ సిటిజన్‌ ఆరోగ్య బీమా పథకాలను కొనుగోలు చేయడానికి ముందు వైద్య పరీక్షలు చెయించుకోవాల్సిన అవసరం లేదు. బీమా సంస్థలు కూడా ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేకుండానే పాలసీని మంజూరు చేస్తాయి. అయుతే పాలసీ తీసుకున్న తర్వాత మీరు వైద్య పరీక్షలు చేయించుకుని ఫీజు చెల్లిస్తే మీకు బీమా సంస్థలు తిరిగి చెల్లింపును(రియంబర్స్) చేస్తాయి. 

ప్రణాళిక కింద కవర్ చేయబడిన వ్యక్తులు:

మీతో పాటు మీ జీవిత భాగస్వామిని ఒకే పథకంలో చేర్చవచ్చు. అయితే మీ, మీ జీవిత భాగస్వామి ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది. మీరు ఒక పథకాన్ని ఎంచుకునే ముందు అన్ని అవసరాలను దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.

క్లైయిమ్ పరిష్కార ప్రక్రియ :

అనవసరమైన సమయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా మరియు క్లైయిమ్ ప్రక్రియ సులభంగా ఉండాలంటే పాలసీ కొనుగోలు చేసే ముందు క్లైయిమ్ నిష్పత్తిని నిర్ధారించుకోవాలి. అలాగే క్లైయిమ్ పరిష్కరించడానికి సంస్థ తీసుకున్న సమయాన్ని తనిఖీ చేయండి. అధిక క్లైయిమ్ పరిష్కార నిష్పత్తి భీమా సంస్థ యొక్క విశ్వసనీయతను తెలియజేస్తుంది.

అవసరమైన పత్రాలు

సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా పథకాల కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, మీరు కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుది. వాటిని క్రింద ఇవ్వడం జరిగింది.

 • ముందుగా చేయించుకున్న వైద్యపరీక్షా పత్రాలు.
 • పూర్తిగా నింపబడిన ప్రతిపాదన పత్రము.
 • ముందుగా ఉన్న ఏదైనా వ్యాధికి సంబంధించిన వైద్య పత్రములు.
 • వయస్సు నిర్ధారణ పత్రము.

మినహాయింపులు

పాలసీ పరిధిలోకి రాని కొన్ని ప్రాథమిక మినహాయింపులు.

 • పాలసీ ప్రారంభానికి 4 సంవత్సరాలలోపు ముందుగా ఉన్న వ్యాధులు లేదా గాయాల చికిత్సకు ఎటువంటి కవరేజీ ఉండదు.
 • పాలసీ ప్రారంభించిన తేదీ యొక్క మొదటి 30 రోజులలో ఏదైనా వ్యాధులు నిర్ధారణ అయితే కవరేజీ వర్తించదు. కేవలం ప్రమాదం కారణంగా అయ్యే గాయాల చికిత్సకు కవరేజీ లభిస్తుంది.
 • స్వతహాగా జరిగిన గాయాల ఖర్చులు(ఆత్మహత్య ఫలితంగా మరియు ఆత్మహత్యాయత్నం).
 • మద్యం లేదా మాదకద్రవ్యాల దుర్వినియోగం లేదా ఏదైనా సంబంధిత వ్యాధుల ఫలితంగా అయ్యే ఖర్చులు.
 • దంత చికిత్స, కళ్ళజోడు లేదా కాంటాక్ట్ లెన్సులు మరియు ఏదైనా కాస్మెటిక్ సర్జరీ ఖర్చులు.
 • ఎయిడ్స్ చికిత్సకు అయ్యే వైద్య ఖర్చులు.
 • యుద్ధం, అణు దాడులు, అల్లర్లు, సమ్మెలు మొదలైన వాటి వల్ల గాయాలు లేదా వ్యాధుల చికిత్సతకు అయ్యే ఖర్చులు.