హోమ్ ఇన్సూరెన్స్
PX step

హోమ్ ఇన్సూరెన్స్ భవనం యొక్క నిర్మాణానికి సహజ మరియు మానవ నిర్మిత విపత్తుల వలన కలిగే నష్టాలకు వ్యతిరేకంగా కవరేజీ అందిస్తుంది. మీ ఇల్లు దొంగల చేత దోచుకోబడినా లేదా భూకంపం కారణంగా ధ్వంసమైనా హోమ్ ఇన్సూరెన్స్ ఈ నష్టాలకు కవరేజీ అందిస్తుంది.

హోమ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత

 మీ ఇల్లు, ఇంట్లోని సామాన్లు మరియు కుటుంబ సభ్యుల భద్రతను నిర్థారించడానికి హోమ్ ఇన్సూరెన్స్ అనేది తప్పని సరి. దీని గురించి మరింత తెలుసుకుందాం..

 • ఇది మానవ నిర్మిత లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇంటికి నష్టం జరిగితే అందుకు సంబంధించిన కవరేజీ అందిస్తుంది.
 • ఫర్నీచర్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, హోమ్ ఇన్సూరెన్స్ అగ్ని, దోపిడి వంటి వాటి వల్ల కలిగే నష్టాలకు సమగ్ర కవరేజీ అందిస్తుంది.
 •  మీ కారణంగా థర్డ్ పార్టీకి గాయపడటం లేదా ఇతర నష్టం కలిగితే, హోమ్ ఇన్సూరెన్స్ చట్టబద్ధమైన బాధ్యతలను చూసుకుంటుంది.
 •  ఒక వేళ మీరు మీ ఆస్తిని ఉపయోగించి ఇల్లు నిర్మించాలనుకుంటే, మీరు ఆస్తి బీమా చేయిస్తే బ్యాంకు రుణం త్వరగా మంజూరు చేయబడుతుంది.

హోమ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాలు

ప్రతి ఇతర పాలసీల మాదిరిగానే హోమ్ ఇన్సూరెన్స్ వినియోగదారులకు వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ముఖ్యమైన వాటి గురించి కింద ఇవ్వడం జరిగింది-

 • సహజమైన మరియు మానవ నిర్మిత చర్యల కారణంగా ఇల్లు మరియు ఇంటిలోని సామాన్లు, ఇతర భాగాలకు ఏదైనా నష్టం జరిగితే అందుకు అయ్యే ఖర్చులకు సమగ్ర కవరేజీ అందించబడుతుంది.
 • హోమ్ ఇన్సూరెన్స్ తక్కువ ప్రీమియంతో లభిస్తుంది. అదనపు కవరేజీ కోసం బీమా సంస్థలు డాగ్ ఇన్సూరెన్స్ మరియు ఇంటి అద్దె కోల్పోవడం కవర్ వంటి రైడర్ లను అందిస్తున్నాయి.
 • పాలసీ కింద మీ ఇల్లు బీమా చేయబడిన తర్వాత మీరు ప్రశాంతంగా ఉండవచ్చు మరియు థర్డ్ పార్టీ ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు.
 • హోమ్ ఇన్సూరెన్స్ యొక్క కొనుగోలు మరియు క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ అనేక సందర్భాల్లో వేగంగా త్వరగా జరుగుతుంది.

హోమ్ ఇన్సూరెన్స్ రకాలు

వినియోగదారుని యొక్క ప్రతి అవసరాన్ని తీర్చడానికి బీమా సంస్థలు అనేక రకాల హోమ్ ఇన్సూరెన్స్ పథకాలను అందిస్తున్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..

1. సమగ్ర హోమ్ ఇన్సూరెన్స్

ఇది ప్రధాన పతకం. ఇది ఇంటికి కవరేజీ అందించడమే కాకుండా, ఇంటిలోని సామానులకు కూడా సమగ్ర కవరేజీ అందిస్తుంది. ఒకే పథకం కింద ఇంటిని మరియు అందులోని సామానులకు కవరేజీ అందించాలనుకునేవారికి ఈ పథకం సరిగ్గా సరిపోతుంది.

2. సామానులకు కవరేజీ

గృహోపకరణాలు, ఫర్నీచర్, నగలు, వార్డ్‌రోబ్ మరియు ఇతర అవసరమైన వస్తువులకు ఈ పథకం కవరేజీ అందిస్తుంది. మానవ నిర్మిత, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏమైనా వస్తువులు దెబ్బతిన్నా/పోగొట్టుకున్నా పథకం దాని ఖర్చులను చెల్లిస్తుంది. మార్కెట్ విలువ ఆధారంగా వస్తువులకు కవరేజీ లభిస్తుంది. అనగా కొత్త వస్తువు విలువ నుంచి తరుగుదల తీసివేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు.

3. అగ్ని మరియు ఊహించని ప్రమాదాలకు ప్రత్యేక కవరేజీ

భూకంపాలు లేదా వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు మరియు అగ్ని వంటి మానవ నిర్మిత విపత్తుల వల్ల కలిగే నష్టాలకు ఈ పథకం కవరేజీ అందిస్తుంది. దుకాణదారులు, గోడౌన్ యజమానులు, పరిశ్రమలు, కార్యాలయాలు మొదలైన విభాగాల వారు తమ భవనాల భద్రత కోసం ఈ పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

4. భవనం ఇన్సూరెన్స్

పేరు సూచించినట్లుగానే ఈ పథకం ఇంటి, ప్లాట్ లేదా అపార్ట్ మెంట్ నిర్మాణానికి జరిగిన నష్టానికి కవరేజీ అందిస్తుంది. గ్యారేజీలు లేదా షెడ్ల వంటి ప్రదేశాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.

5. పబ్లిక్ లయబిలిటీ కవరేజీ

మీ ఇంటి లోపల లేదా వెలుపల థర్డ్ పార్టీ వ్యక్తి లేదా అతను/ఆమె ఆస్తి దెబ్బతిన్నప్పుడు ఆ పతకం అందుకు సంబంధించి చట్ట పరమైన ఖర్చులకు కవరేజీ అందిస్తుంది.

6. యజమాని బీమా

ఇంటి యొక్క యజమానిగా మీరు ఇంటిని మంచి స్థితిలో నిర్వహించాల్సి ఉంటుంది. ప్రామాణిక హోమ్ ఇన్సూరెన్స్ యజమానికి ఏ విధంగానూ సహాయం చేయదు. ఈ బీమా పథకం ఏదైనా నష్టం జరిగితే యజమానికి సహాయపడటానికి రూపొందించబడింది.

7. అద్దె బీమా

అద్దె దారుగా మీరు అద్దె ప్లాట్ లేదా భవనంలో నివసిస్తారు. ఈ బీమా భవనం లోపల మీ సామానులకు కలిగే నష్టాలకు కవరేజీ అందిస్తుంది.

8. వ్యక్తిగత ప్రమాద బీమా

ఇది హోమ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రత్యేక రకం. ఒక వేళ మీరు గాయపడితే(వికలాంగులు) లేదా ప్రపంచవ్యాప్తంగా ఎక్క డైనా ప్రమాదంలో మరణిస్తే ఈ బీమా మీ కుటుంబానికి పరిహారం అందిస్తుంది.

ఉత్తమ హోమ్ ఇన్సూరెన్స్ పథకాలు- 2020

బీమా ప్రొవైడర్

అర్హత

ప్రధాన ఫీచర్లు

ఇఫ్కో టోకియో హోమ్ ఇన్సూరెన్స్

ఇంటి యజమానులకు/ అద్దెకు ఉన్న వారికి/ హౌసింగ్ సొసైటీలకు

 • ప్రకృతి వైపరీత్యాలు(అగ్ని , భూకంపం, వరదలు మొదలైనవి) మరియు మానవ నిర్మిత విపత్తులకు(దోపిడి, అల్లర్లు మొదలైనవి) సమగ్ర కవరేజీ లభిస్తుంది.
 • పెంపుడు జంతువులకు కవరేజీ కల్పించే సౌలభ్యం
 • మీ ఇంటిలోని గ్యారేజులకు, టెర్రస్, స్విమ్మింగ్ పూల్స్ కు కవరేజీ లభిస్తుంది.

హెచ్ డి ఎఫ్ సి ఎర్గో హోమ్ ఇన్సూరెన్స్

ఇంటి యజమానులకు/ అద్దెకు ఉన్న వారికి/ హౌసింగ్ సొసైటీలకు

 • థర్డ్ పార్టీ బాధ్యతల కోసం రూ. 50 లక్షల వరకు కవరేజీ పొందండి.
 • ఇంటిలోని సామానులకు రూ. 25 లక్షల వరకు కవరేజీ పొందండి.
 • ఇద ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా ఐచ్ఛిక కవరేజీని అందిస్తుంది.

నేషనల్ హోమ్ ఇన్సూరెన్స్

ఇంటి యజమానులకు/ అద్దెకు ఉన్న వారికి

 • ఇది అగ్ని లేదా ప్రత్యేక ప్రమాదాల వల్ల భవనాలకు మరియు అందులోని సామానులకు కలిగే నష్టానికి కవరేజీ అందిస్తుంది.
 • పెడల్ సైకిల్స్ కోసం మీరు(రూ. 10,000) వరకు కవరేజీ పొందవచ్చు.
 • దొంగతనం ద్వారా ఆస్తి నష్టం జరిగితే అందుకు సంబంధించిన కవరేజీ లభిస్తుంది.

చోళమండలం ఎంఎస్ హోమ్ ఇన్సూరెన్స్

ఇంటి యజమానులకు/ అద్దెకు ఉన్న వారికి

 • భారతదేశంలో ఎక్కడైనా మీ సామానులకు నష్టం కలిగితే అందుకు సంబంధించిన కవరేజీ లభిస్తుంది.
 • మీరు మరియు మీ కుటుంబం వ్యక్తిగత ప్రమాద కవరేజీని శాశ్వత వైకల్యం విషయంలో మాత్రమే పొందగలరు.
 • అగ్ని మరియు ప్రత్యేక ప్రమాదాలకు సంబంధించి సమగ్ర రక్షణ పొందవచ్చు.

ఇఫ్కో టోకియో హోమ్ ఇన్సూరెన్స్

ఇంటి యజమానులకు/ అద్దెకున్న వారికి

 • అదనపు ప్రీమియం మొత్తాన్ని చెల్లించడం ద్వారా అదనపు కవరేజీ లభిస్తుంది( ఉగ్ర చర్యలు, అద్దె కోల్పోవడం మొదలైనవి).
 • పెడల్ సైకిల్స్, ఎటిఎం నగదు ఉపసంహరణ, క్రెడిట్ కార్డుల దుర్వినియోగం మరియు వెటర్నరీ ఖర్చుల కోసం కవరేజీ పొందండి.
 •  ఎలక్ట్రానిక్ ఉపకరణాలు మరియు పోర్టబుల్ పరికరాల నష్టానికి సంబంధించి కవరేజీ

హోమ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ముందు మీరు ఏ అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి?

హోమ్ ఇన్సూరెన్స్ మీ ఇంటి ఆర్థిక భద్రతకు హామీ ఇస్తుంది. సరైన బీమా ప్రొవైడర్ ను ఎంచుకోకపోతే, మీ ఇంటికి మరియు అందులోని సామానులకు సమగ్ర రక్ష కలగకపోవచ్చు. పథకాన్ని కొనుగోలు చేసే ముందు సదరు బీమా ప్రొవైడర్ గురించి పరిశీలన చేయడం చాలా ముఖ్యం. ఉత్తమ హోమ్ ఇన్సూరెన్స్ పథకాన్ని కొనుగోలు చేసే ముందు ఈ కింది అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి

కవరేజీ మరియు ప్రీమియం

మీ ఇంటికి అవసరమైన కవరేజీ మొత్తం సంబంధిత రిస్క్ లపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు కొండచరియలు విరిగి పడే ప్రాంతంలో నివసిస్తుంటే ఈ రకమైన ప్రమాదానికి కవరేజీ అందించే బీమా ప్రొవైడర్ ను ఎంచుకోవాలి. అలాగే కవరేజీ నేరుగా ప్రీమియం మొత్తానికి అనులోమానుపాతంలో ఉంటుంది. పాలసీదారులు ప్రీమియం కోట్స్ ను పోల్చి ఇంటి బీమా పాలసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి

క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు పరిష్కరించడానికి బీమా సంస్థ తీసుకునే సమయం. అధిక క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి బీమా సంస్థ తీసుకునే సమయం తక్కువుగా ఉంటుందని సూచిస్తుంది. హోమ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ముందు పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులతో పాటు బీమా సంస్థ యొక్క క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని జాగ్రత్తగా పరిశీలించండి.

సంస్థ యొక్క పలుకుబడి

మంచి సంస్థ తన వినియోగదారులను ఎప్పుడూ నిరాశపరచదు. ఈ విషయం నేరుగా సంస్థ ప్రతిష్టకు సంబంధించినది. సంస్థ వినియోగదారుల యొక్క రివ్యూలను పరిశీలించండి. మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అవి అందిస్తాయి.

హోం ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఎలా తగ్గించుకోవాలి?

హోం ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని తగ్గించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దీని కారణంగా ఎక్కువ డబ్బులు ప్రీమియానికి చెల్లించాల్సిన అవసరం లేదు. వాటి గురించి తెలుసుకుందాం.

 • మరమ్మతుల భారాన్ని పంచుకోవడం ద్వారా మీ బాధ్యతను తగ్గించండి, ఇది ప్రీమియంను గణనీయమైన మొత్తంలో తగ్గిస్తుంది.
 • చాలా పాత వస్తువులను ఎప్పుడూ బీమా చేయవద్దు. ఉదాహరణకు, మీరు 10 సంవత్సరాల వయసు గల వాషింగ్ మెషిన్ కలిగి ఉంటే ఉత్పత్తి విలువ తగ్గిన విలువకు బీమా చేయడంలో అర్థం లేదు.
 • ప్రీమియం పై రాయితీ పొందడానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బీమా పథకాలు పొందడానికి ప్రయత్నించండి.
 • మీరు భద్రతా పరికరాలు అమర్చినట్లయితే(ఫైర్ సేఫ్టీ అలారం) తక్కువ ప్రీమియం విధించబడుతుంది. అలాగే మీ ఇంటికి సెక్యూరిటీ గార్డులను నియమించుకుంటే బీమా సంస్థ ప్రీమియంపై తగ్గింపును అందిస్తుంది.

భారతదేశంలో హోమ్ ఇన్సూరెన్స్ అవసరమా?

అవును, అవసరమే. వరదలు, కొండచరియలు, భూకంపాలు మరియు దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. హోమ్ ఇన్సూరెన్స్ వీటికి కవరేజీ అందిస్తుంది. ఇల్లు కొనడం అనేది ఒక వ్యక్తికి చాలా ప్రత్యేకతతో కూడి ఉన్నది. కాబట్టి ప్రమాదాల నుంచి ఇంటిని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకు మీరు వరదలు ఎక్కువగా సంభవించే ప్రదేశంలో నివసిస్తుంటే బీమా తప్పక అవసరం అవుతుంది. ఇది మీకు ఇబ్బంది కలిగించకుండా మీ ఇంటికి మరియు అందులోని సామానులకు ఆర్థిక రక్షణను అందిస్తుంది.

PolicyX.com నుంచి హోమ్ ఇన్సూరెన్స్ ఎలా కొనుగోలు చేయాలి?

PolicyX.com ఐఆర్డీఏఐ చేత ఆమోదం పొందిన విశ్వసనీయమైన ఆన్ లైన్ వెబ్ అగ్రిగేటర్. ఇది భారతదేశంలో 2 లక్షల మందికి పైగా బీమా అవసరాలను తీర్చింది. వినియోగదారుల సౌకర్యం మేరకు హోమ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి సులభమైన ప్రక్రియను PolicyX.com రూపొందించింది. పథకాన్ని కొనుగోలు చేయడానికి కింద పేర్కొన్న దశలను అనుసరించండి.

 • ఈ పేజీ ఎగువకు వెళ్లి హోమ్ ఇన్సూరెన్స్ ను ఆన్ లైన్ లో పోల్చండి అనే ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 •  వివరాలను పూర్తి చేసి కొనసాగించు ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • కోట్స్ జాబితా మీ ముందు కనిపిస్తుంది. మీకు కావాల్సిన పథకాన్ని ఎంచుకోండి మరియు బీమా వివరాలను తనిఖీ చేయండి.
 • ప్రీమియం చెల్లింపు చేయండి మరియు పాలసీ పత్రాలు మెయిల్ ఐడీకి పంపబడతాయి.

హోమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా దాఖలు చేయాలి?

 • మార్కెట్లో అనేక బీమా సంస్థలు హోమ్ ఇన్సూరెన్స్ పథకాన్ని అందిస్తున్నాయి. వీటిలో ప్రతి దానికి స్వంత క్లెయిమ్ ప్రక్రియ ఉంటుంది. అయితే పాలసీదారులు క్లెయిమ్ దాఖలు చేయడానికి కొన్ని సాధారణ దశలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..
 • టోల్ ఫ్రీ నంబర్ డయల్ చేయడం ద్వారా లేదా మెయిల్ ఎస్ఎంఎస్ పంపడం ద్వారా క్లెయిమ్ గురించి సంబంధిత విభాగానికి తెలియజేయండి.
 • దొంగతనం, దోపిడీ లేదా అగ్ని ప్రమాదం విషయంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి.
 • క్లెయిమ్ ఫారంను పూర్తిగా నింపండి.
 • క్లెయిమ్ ఫారం తో పాటు అవసరమైన పత్రాలను సంస్థకు సమర్పించండి.
 • బీమా సంస్థ ఒక సర్వేయర్ ను నియమిస్తుంది.(అవసరం అయితే)
 • ధృవీకరణ పూర్తయిన తర్వాత మరియు క్లెయిమ్ దరఖాస్తు, ఇతర పత్రాలు సరిగ్గా ఉంటే క్లెయిమ్ పరిష్కరించబడుతుంది.

అవసరమైన పత్రాలు

 • హోమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ దాఖలుకు అవసరమైన పత్రాలు కింద ఇవ్వడం జరిగింది. అవి:
 • ఫైర్ బ్రిగేడ్ నివేదిక
 • మరణం మరియు వైకల్యం విషయంలో వైద్యుని యొక్క నివేదిక
 • వస్తువులు యొక్క ఇన్ వాయిస్(అవసరం అయితే)
 • మరమ్మతు అంచనాలు
 • కోర్టు సమన్లు
 • పోలీసులు దర్యాప్తు నివేదిక
 • వస్తువుల రీప్లేస్ మెంట్ కోసం పంపిణీ దారు జారీ చేసిన ఇన్ వాయిస్
 • ఒరిజినల్ పాలసీ పత్రాలు
 • క్లెయిమ్ దరఖాస్తు
 • సంస్థ కోరిన ఇతర పత్రాలు

హోమ్ ఇన్సూరెన్స్ కింద ఇన్న మినహాయింపు ఏంటి?

హోమ్ ఇన్సూరెన్స్ కొన్ని సందర్భాల్లో కవరేజీ అందించదు. వాటిలో కొన్నింటిని గురించి కింద ఇవ్వడం జరిగింది.

 • యుద్ధం వలన కలిగే నష్టం, విదేశీ శత్రువు దాడి కారణంగా జరిగే నష్టం.
 • చట్టబద్ధమైన జప్తు వలన కలిగే నష్టం.
 • అణు దాడులు, రేడియోధార్మికత మొదలైన వాటి ద్వారా కలిగే నష్టం.
 • ఉగ్రవాద చర్యల కారణంగా జరిగే నష్టం(హోమ్ ఇన్సూరెన్స్ కింద పేర్కొనబడింది).
 • ముందుగా ఉన్న వ్యాధులు లేదా అనారోగ్యం కారణంగా కలిగే నష్టం.
 • సాధారణ తరుగుదల కారణంగా సంభవించే నష్టం.