జీవిత బీమా అనేది పాలసీదారు మరియు బీమా సంస్థ మధ్య పరస్పర ఒప్పందం. ఇక్కడ చెల్లించిన ప్రీమియంలకు బదులుగా నామినీకి(పాలసీదారునికి ఏదైనా జరిగితే) ముందుగా పేర్కొన్న మొత్తాన్ని చెల్లిస్తామని సంస్థ హామీ ఇస్తుంది. ఆర్థిక రక్షణతో పాటు, ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 10(10డి) మరియు సెక్షన్ 80 సి కింద ప్రజలు పన్ను మినహాయింపులు పొందుతారు.
జీవిత బీమా యొక్క ప్రాముఖ్యత
మన జీవితం ప్రమాదాలతో నిండి ఉంది మరియు అనారోగ్యం, ప్రమాదాల కారణంగా మరణం యొక్క అనిశ్చితి ఎల్లప్పుడూ ఉంటుంది. ఒక వేళ అలాంటిదే జరిగితే, కుటుంబం మొత్తం బాధపడవలసి ఉంటుంది. పాలసీదారు జీవితాన్ని కొలవ లేనప్పటికీ, అతను/ ఆమె కుటుంబానికి జీవిత బీమా పథకాల కింద ఆర్థిక సహాయం అందించబడుతుంది. అలాగే పాలసీదారు కుటుంబానికి సమగ్ర ఆర్థిక రక్షణ అందిస్తుంది.
జీవిత బీమా ప్రాముఖ్యతను ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం..
వరుణ్ మరియు సునీల్ చిన్న నాటి స్నేహితులు. జీవిత బీమా పాలసీ కొనాలని సునీల్ నిర్ణయించుకున్నాడు మరియు వరుణ్ కు కూడా పెట్టుబడి పెట్టమని చెప్పాడు. అయితే వరుణ్ ఈ ఆలోచనను తిరస్కరించాడు మరియు ఇది డబ్బు వృధా అని చెప్పాడు.
ఒక నెల తరువాత వరుణ్ మరియు సునీల్ ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. సునీల్ అక్కడికక్కడే మరణించాడు మరియు వరుణ్ ఆసుపత్రిలో మరణించాడు. జీవిత బీమా కలిగి ఉండటం ద్వారా బీమా సంస్థ సునీల్ కుటుంబానికి పూర్తి ఆర్థిక సహాయం అందించింది. అయితే వరుణ్ కుటుంబం వారి ఆర్థిక అవసరాలకు చాలా కష్టపడాల్సి వచ్చింది. వరుణ్ ఇంతకు ముందు జీవిత బీమాను కొనుగోలు చేసి ఉంటే, అతను కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురి అయి ఉండేది కాదు.
భారతదేశంలో ఉత్తమ జీవిత బీమా పథకాలు
PolicyX.com ప్రకారం, భారతదేశంలో 2020 లో మీరు కొనుగోలు చేయగల ఉత్తమ జీవిత బీమా పాలసీలు క్రింద ఇవ్వడం జరిగింది...
ప్లాన్స్ |
ప్లాన్ రకం |
కనిష్ట/గరిష్ట ప్రవేశ వయసు |
గరిష్ట మెచ్యూరిటీ వయసు |
కనిష్ట బీమా మొత్తం |
||
సేవింగ్స్ ప్లాన్ |
5 సంవత్సరాలు/65 సంవత్సరాలు |
80 సంవత్సరాలు |
ప్రీమియం పై ఆధారపడి ఉంటుంది |
|||
ప్రొటెక్షన్ ప్లాన్ |
18 సంవత్సరాలు/65 సంవత్సరాలు |
75 సంవత్సరాలు |
రూ. 25 లక్షలు |
|||
ప్రొటెక్షన్ ప్లాన్ |
18 సంవత్సరాలు/ 60 సంవత్సరాలు |
85 సంవత్సరాలు |
రూ. 50 లక్షలు |
|||
టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ |
18 సంవత్సరాలు/ 65 సంవత్సరాలు |
80 సంవత్సరాలు |
రూ. 35 లక్షలు |
|||
ప్రొటెక్షన్ ప్లాన్ |
18 సంవత్సరాలు/ 65 సంవత్సరాలు |
80 సంవత్సరాలు |
రూ. 75,000 |
|||
సేవింగ్స్ ప్లాన్ |
18 సంవత్సరాలు/ 60 సంవత్సరాలు |
65 సంవత్సరాలు |
రూ. 25 లక్షలు |
|||
కోటక్ లైఫ్ ప్రిఫర్డ్ ఈ- టర్మ్ |
ప్రొటెక్షన్ ప్లాన్ |
18 సంవత్సరాలు/ 65 సంవత్సరాలు |
75 సంవత్సరాలు |
రూ. 25 లక్షలు |
||
ప్రొటెక్షన్ ప్లాన్ |
18 సంవత్సరాలు/ 65 సంవత్సరాలు |
85 సంవత్సరాలు |
రూ. 25 లక్షలు |
|||
ఏగన్ ఐ టర్మ్ ప్లాన్ |
ప్రొటెక్షన్ ప్లాన్ |
18 సంవత్సరాలు/ 65 సంవత్సరాలు |
100 సంవత్సరాలు |
రూ. 25 లక్షలు |
||
బజాజ్ అలియాంజ్ ఐ స్క్వేర్ టర్మ్ ప్లాన్ |
ప్రొటెక్షన్ ప్లాన్ |
18 సంవత్సరాలు/65 సంవత్సరాలు |
70 సంవత్సరాలు |
రూ. 25 లక్షలు |
*ఈ విలువలు వేర్వేరు ప్రణాళిక ఎంపికల ప్రకారం మారవచ్చు.
జీవిత బీమా ప్రయోజనాలు
జీవిత బీమా పాలసీదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం..
గ్యారెంటీడ్ యాన్యూటీ
పదవీ విరమణ కోసం పథకం అనే అంశంపై, జీవిత బీమా ఉపయోగకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది. ఎందుకంటే మీరు కొంత కాలం డబ్బు ఆదా చేస్తారు. స్థిరమైన ఆదాయ వనరులు సరఫరా చేయడంలో జీవిత బీమా పథకం ఉపయోగపడుతుంది.
లోన్ సౌలభ్యం
జీవిత బీమా తీసుకున్న వారికి, వారు తీసుకున్న పాలసీ ద్వారా పొందే ప్రయోజనాలకు భంగం కలగకుండా, వారి అత్యవసర డబ్బు అవసరాలకు, వారి బీమా కవరేజీపై లోన్ పొందే అవకాశం ఉంటుంది.
సంపూర్ణ పథకాలు
ఆర్థిక రక్షణతో పాటు, ఇది ఒక దీర్ఘకాలిక పొదుపు మార్గంగా కూడా పనిచేస్తుంది. ఎండోమెంట్ పథకాల వంటి అనేక సంప్రదాయక జీవిత బీమా పథకాలు, మెచ్యూరిటీ విలువ, క్యాష్ విలువ మరియు మనీ-బ్యాక్ వంటి పలు ఎంపికల ద్వారా మెచ్యూరిటీ ప్రయోజనాలను అందిస్తాయి.
ఆదాయ పన్ను ప్రయోజనాలు
జీవిత బీమా ఆకర్షనీయమైన పన్ను ప్రయోజనాలను కలిగి, మీరు పెద్ద మొత్తంలో డబ్బును ఆదా చేసుకోవడంలో సహాయపడుతుంది. దాదాపు అన్ని జీవిత బీమా పాలసీలు, ఆదాయ పన్ను చట్టం, 1961 లోని సెక్షన్లు 80సి మరియు 10(10డి) కింద వరుసగా, ప్రీమియం మొత్తానికి మరియు చెల్లింపు మొత్తాలకు, ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని అందిస్తాయి.
లోన్ పునఃచెల్లింపు
జీవిత బీమా పాలసీలు, పాలసీదారుకి అవసరమయ్యే లోన్లు మరియు తనఖాలను పొందడంలో, ఒక మంచి సాధనంగా పనికొస్తాయి. ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితిలో పాలసీదారు లోన్ కట్టలేకపోతే, బంధువులకు లోన్ కట్టవలసిన అవసరం లేదు మరియు ఆ పాలసీ మొత్తం లోన్ ని కట్టడానికి సరిపోతుంది.
పొదుపుతో కూడిన బీమా
జీవిత బీమాల పాలసీదారుడు నిర్ణీత కాలానుగుణ చెల్లింపు చేయవలసి ఉంటుంది. ఇది పాలసీదారునికి ఆర్థిక పొదుపు అలవాటు పొందడానికి అనుమతిస్తుంది. సుదీర్ఘ కాల వ్యవధిలో నగదును ఆదా చేయడం వలన మీ ఆర్థిక తీర్చే విధంగా మంచి కార్పస్ నిర్మించగలుగుతారు.
జీవిత బీమా రకాలు
టర్మ్ బీమా
ఇది జీవిత బీమా యొక్క అత్యంత ప్రాథమిక రూపం. సరళంగా చెప్పాలంటే పాలసీ కాల వ్యవధిలో పాలసీదారు మరణించినట్లయితే, పాలసీ పత్రంలో పేర్కొన్న విధంగా టర్మ్ ఇన్సూరెన్స్ నామినీకి మరణ ప్రయోజనాన్ని(ఒకే మొత్తంలో) అందిస్తుంది. చెల్లింపు నెలలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన ఉంటుంది.
సంపూర్ణ జీవిత బీమా
పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం ఈ పథకం జీవిత కవరేజీని అందిస్తుంది. పాలసీదారుడి మరణంపై మొత్తం జీవిత బీమా నామినీకి అందించబడుతుంది. అలాగే ఏదైనా బోనస్ ఉంటే అది కూడా అందించబడుతుంది.
ఎండోమెంట్ ప్లాన్
ఒక టర్మ్ ప్లాన్ కాకుండా, మరణం మరియు మనుగడ విషయంలో లాభాలతో పాటు హామీ మొత్తాన్ని ఎండోమెంట్ ప్లాన్ చెల్లిస్తుంది. ఈ ప్లాన్ అధిక ప్రీమియం వసూలు చేస్తుంది. ఇది నిధులను మార్కెట్(ఈక్విటీ మరియు డెట్) లో పెట్టుబడి పెడుతుంది.
చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్
ఇది అధిక ప్రీమియం వసూలు చేస్తుంది. ఇది మీ పిల్లల బహు దశలను భద్రపరిచే బీమా కవర్ మరియు పెట్టుబడుల కలయిక. మరో మాటలో చెప్పాలంటే, ఇది మీ పిల్లల భవిష్యత్తు అవసరాలకు ఆర్థిక కవరేజీని అందిస్తుంది మరియు అతను/ఆమె భవిష్యత్తును మెరుగైన మరియు స్థిరమైన మార్గంలో ప్లాన్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
పెన్షన్ ప్లాన్
మీ రిటైర్మెంట్ అనంతర జీవితాన్ని ఆర్థికంగా భద్రపరచడంలో ఈ పథకం మీకు సహాయం చేస్తుంది. ప్రయోజనాలు ప్రతి సంవత్సరం లేదా 60 సంవత్సరాల వయసుకు చేరుకున్న తర్వాత ఒకసారి ఇవ్వబడతాయి.(బీమా/ పాలసీదారు ఎంపికను బట్టి) పాలసీదారుడు పాలసీ కాల వ్యవధిని మించిపోతే ఈ పథకం వెస్టింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది.
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యూలిప్స్)
పై అన్ని పథకాలలో మీరు మీ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఎంచుకోవడానికి మీకు అవకాశం లేదు. యూనిట్- లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్, మీ డబ్బును( డెబిట్ / ఈక్విటీ)లలో పెట్టుబడి పెట్టడానికి ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకునే అధికారాన్ని ఇస్తుంది. మీరు ప్రస్తుత పెట్టుబడి పద్ధతిని మార్చాలనుకుంటే మీరు దీన్ని సులభంగా చేయవచ్చు.
పెట్టుబడి పథకాలు
ఇది ఆర్థిక ప్రణాళిక యొక్క ముఖ్య భాగాలలో ఒకటి. పెట్టుబడి పథకం పాలసీదారుడు చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది. పెట్టుబడి యొక్క విధానం మారవచ్చు- వారం, నెలలవారీ మరియు త్రైమాసిక. ఈ పథకం ద్వారా పొదుపుతో పాటు మీకు బీమా సౌకర్యం లభిస్తుంది.
మనీ-బ్యాక్ ప్లాన్
మనీ బ్యాక్ పథకాలు కూడా ఎండోమెంట్ పథకాల్లానే ఉంటాయి, అయితే ఇందులో ఒకే తేడా, చెల్లింపు పాలసీ వ్యవథి కాలంలో విస్తరించి ఉండడం. ఇందులో, పాలసీ కాలాన్ని బట్టి, కొంత మొత్తం, సమయానుసారం క్రమంగా బీమా చేసుకున్న వ్యక్తికి తిరిగి ఇవ్వబడుతుంది. మరణం సంభవించిన పక్షంలో, పూర్తి భరోసా మొత్తం చెల్లించబడుతుంది. ఇందులో బోనస్ కూడా కలపబడుతుంది. ఈ అదనపు ఫీచర్ల కారణంగా, ఆన్లైన్లో మిగతా జీవిత బీమా పథకాల కన్నా ఈ పథకం యొక్క ప్రీమియంలు అధికంగా ఉంటాయి.
జీవిత బీమా రైడర్లు
పాలసీదారునికి అదనపు ఆర్థిక కవరేజీ అందించేవి యాడ్-అన్ రైడర్స్. ఎక్కువగా రైడర్స్ బేస్ ఇన్సూరెన్స్ ప్లాన్ తో కొనుగోలు చేయబడతాయి మరియు తరువాత జోడించబడవు.
ప్రముఖ జీవిత బీమా రైడర్లు:-
- క్రిటికల్ ఇల్నెస్ రైడర్:- క్యాన్సర్, కిడ్నీల సమస్య, గుండెపోటు, కోమా, పక్షవాతం, వంటి అనేక తీవ్ర అనారోగ్యాలు దీని కిందకి వస్తాయి. వేర్వేరు కంపెనీలు వేర్వేరు వ్యాధుల జాబితాను కలిగి ఉంటాయి కాబట్టి తీసుకునే ముందు మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
- యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ :- పాలసీదారు ప్రమాద కారణంగా మరణిస్తే, సాధారణ భరోసా మొత్తంతో పాటుగా, ఈ రైడర్ ప్రయోజనాన్ని కూడా కలిపి బీమా సంస్థ లబ్దిదారులకు చెల్లిస్తుంది.
- యాక్సిడెంటల్ అండ్ శాశ్వత డిసెబిలిటీ రైడర్ :- పాలసీదారు ప్రమాద కారణంగా పూర్తి లేదా కొంత భాగం వరకు శాశ్వత వైకల్యాన్ని పొంది పని చేయలేని స్థితికి వెళ్తే, ఈ రైడర్ ప్రయోజనాన్ని పాలసీదారు పొందవచ్చు.
- యాక్సిలరేటెడ్ డెత్ బెనిఫిట్ రైడర్ :- పాలసీదారు లుకేమియా, క్యాన్సర్, ఎయిడ్స్ వంటి ఏదైనా ప్రాణాంతక అనారోగ్యానికి గురైనట్లు నిర్ధారణ అయితే, దాని వైద్య ఖర్చుల కోసం ఈ రైడర్ ఒక పెద్ద మొత్తాన్ని పాలసీదారుకు అందిస్తుంది.
- ప్రీమియం మాఫీ రైడర్:- పాలసీదారు వైకల్యానికి గురై, దాని కారణంగా జీవిత బీమా పథకాల ప్రీమియంలను కట్టలేని స్థితికి నెట్టబడిన సందర్భంలో, ఆ పాలసీ ఆగిపోవచ్చు. కానీ పాలసీదారు ఈ రైడర్ ని కనుక తీసుకున్నట్లయితే, అన్ని ప్రీమియంలను రద్దయి, ఎటువంటి ఆంక్షలూ లేకుండా పాలసీ కొనసాగుతుంది.
- టర్మ్ రైడర్ :- టర్మ్ రైడర్ పాలసీదారు మరణించినపక్షంలో, లబ్ధిదారుకు, ఒక స్థిరమైన లేదా నెలవారీ ఆదాయాన్ని అందచేస్తుంది. ఇది ప్రధాన ప్లాన్ కవరేజీ లేదా పాలసీలో పేర్కొనబడీన నిర్దిష్ట విలువకు సమానంగా ఉంటుంది.
- సర్జికల్ రైడర్ :- ఇది 43 రకాల శస్త్ర చికిత్స అవసరమయ్యే పరిస్థితులలో, బీమా చేయించుకున్న వ్యక్తికి వైద్య చికిత్సకు ఆర్థిక కవరేజీని అందించి సహాయపడే ఒక సహాయక రైడర్. ఈ కవరేజీ చిన్న మరియు పెద్ద శస్త్ర చికిత్సలకు వేర్వేరుగా ఉంటుంది.
జీవిత బీమా ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి?
బీమా ప్రీమియంను లెక్కించేటప్పుడు బీమా సంస్థలు అనేక అంశాలను పరిగణలోనికి తీసుకుంటాయి. వాటిలో కొన్ని కింద ఇవ్వడం జరిగింది-
- పాలసీదారుడి వయసు- ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని లెక్కించేటప్పుడు వయసు ఒక ముఖ్యమైన అంశం. మీ వయసుతో పాటు ప్రీమియం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వయసుతో పాటు అనారోగ్యాలు గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా పెరుగుతాయి.
- జీవన శైలి- ఒక వ్యక్తి ధూమపానం, పానీయాలు, ఒత్తిడితో కూడిన జీవనశైలిని కలిగి ఉంటే అధిక ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి అలవాట్లు ప్రాణాంతక అనారోగ్యాలకు దారి తీస్తాయి. ఇది మీ ఆయుర్దాయం తగ్గిస్తుంది.
- వైద్య చరిత్ర- ఒక వ్యక్తికి క్యాన్సర్, రక్తపోటు వంటి మొదలైన వ్యాధుల వైద్య చరిత్ర ఉంటే, బీమా కంపెనీల పాలసీకి బదులుగా అధిక ప్రీమియాన్ని వసూలు చేస్తాయి.
ఉత్తమమైన జీవిత బీమా పాలసీని ఎంచుకోవడం ఎలా?
మార్కెట్ లో అనేక జీవిత బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఉత్తమమైన దానిని ఎంచుకోవడంలో చాలా గందరగోళం నెలకొని ఉంటుంది. అయితే ఉత్తమ బీమా పథకాన్ని ఎంచుకోవడంలో కింది పేర్కొన్న పాయింట్లు మీకు సహాయపడతాయి.
క్లెయిమ్ శాతంను పరిశీలించండి
మీరు అవసరమైన సమయంలో, చెల్లింపు పొందటానికే జీవిత బీమాను తీసుకుంటారు. కానీ ఒకవేళ ఆ చెల్లింపే ఎప్పటికీ అసలు జరగకపోతే? చింతించకండి, దీనిని తప్పించుకోవడానికి సులభమైన మార్గం ఉంది. మీరు బీమా సంస్థని ఎంచుకోవడానికి ముందే, వారి చెల్లింపు శాతాన్ని తెలుసుకోవాలి. ఇది మీకు వారు ఒక సంవత్సరంలో పొందిన చెల్లింపు అభ్యర్థనలలో ఎలన్నింటినీ అంగీకరించాలో సుమారుగా చెబుతోంది. ఎక్కువ చెల్లింపు శాతం ఉన్న సంస్థను ఎంచుకోవడం మీకు సాధారణంగా మంచిది.
స్థితిగతులు పరిశీలించడం
అధిక పోటీ వలన, ఇప్పుడు ఈ మార్కెట్లోకి చాలా జీవిత బీమా సంస్థలు వచ్చాయి. దీనివలన, మెరుగైన సేవలను అందించే సంస్థలు తక్కువయ్యాయి. కాబట్టి, ప్రతీ కంపెనీ స్థితిగతులను పరిశీలించడం ఉత్తమం. ఎవరి పరిస్థితులు మీకు బాగున్నాయని అనిపిస్తే ఆ సంస్థను మీరు ఎంచుకోవచ్చు.
భరోసా మొత్తం యొక్క లెక్కింపు
మీరు బీమా సంస్థల దగ్గరికి వెళ్లే ముందే, మీరు అనుకునే భరోసా మొత్తాన్ని లెక్కించుకోవడం మంచిది. దీనితో పాటుగా, కంపెనీలు చేసే ప్రీమియం లెక్కింపు వివరాలను కూడా మీరు పొందవచ్చు. ఈ రెండు అంశాలను కలిపి చూసుకుని, ఏ కంపెనీలో మీ కష్టార్జితాన్ని పెట్టాలో మీరు నిర్ణయించుకోవచ్చు.
వినియోగదారుల రివ్యూలు
కొన్నిసార్లు, ఏదైనా కంపెనీ బయటి నుంచి బాగా కనిపిస్తూ లోపల అనేక నష్టాలతో నడుస్తూ ఉండవచ్చు. అటువంటి అంశాలు వినియోగదారుల రివ్యూల ద్వారానే బయటికి వస్తుంటాయి. అటువంటి కంపెనీల పనితీరును, కంపెనీ తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తిస్తుందా లేదా అనే విషయాలను (నేరుగా) చూసిన వారు ఉంటారు. అటువంటి వారి రివ్యూలను చదవడం మీ నిర్ణయాన్ని బాగా ప్రభావితం చేయవచ్చు.
మీరు జీవిత బీమాను PolicyX.com తో సరిపోల్చాలా?
ఖచ్చితంగా, ఇది సర్టిఫైడ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్, ఇది ఐఆర్డీఏఐ యొక్క పూర్తి మద్దతును కలిగి ఉంది. (లైసెన్స్ సంఖ్య IRDAWBA17/14). మీరు PolicyX.com పై మీ విశ్వాసాన్ని ఉంచడానికి ఇది మాత్రమే కారణం కాదు. ఇతర కారణాల ఉన్నాయి-
- ఒక్క పైసా చెల్లించకుండా వివిధ కంపెనీల నుంచి ఆన్ లైన్ కోట్లను పొందడానికి మేము మీకు అందిస్తాము.
- పథకాలు లేదా ప్రీమియం గణన గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు మా నిపుణులతో స్వేచ్ఛగా సంప్రదించవచ్చు. మా కస్టమర్ సర్వీస్ విభాగం 24*7 అందుబాటులో ఉంటుంది.
జీవిత బీమాను ఆన్ లైన్ లో ఎలా కొనుగోలు చేయాలి?
- జీవిత బీమా పాలసీని ఆఫ్ లైన్ లో కొనడం సుదీర్ఘమైన మరియు తీవ్రమైన ప్రక్రియ. కాబట్టి సమయం మరియు డబ్బు ఆదా చేయడానికి ఆన్ లైన్ కొనుగోలు ను ఎంచుకోవడం మంచిది. మీరు విశ్వసించదగిన అటువంటి వేదిక PolicyX.com. దీని నుంచి జీవిత బీమా పాలసీని కొనుగోలు చేయడానికి ఈ కింది దశలను అనుసరించండి.
- ఈ పేజీ యొక్క కుడి ఎగువ మూలకు వెళ్లండి, జీవిత బీమా కోట్లను ఆన్ లైన్ లో పొందండి అనే ట్యాబ్ కనపడుతుంది.
- అవసరమైన వివరాలను అందించండి. మరియు కొనసాగించు ట్యాబ్ పై క్లిక్ చేయండి.
- ముందుకు వెళ్లడానికి మీ నంబర్ మరియు నగరం వంటి వివరాలను పూరించండి.
- అందుబాటులో ఉన్న ఎంపికల జాబితాలో పథకాన్ని ఎంచుకోండి.
- చెల్లింపు చేయండి, మీ పాలసీ పత్రాలను మీ రిజిస్ట్రర్డ్ మెయిల్ కు పంపబడతాయి.
జీవిత బీమా పాలసీ కొనుగోలు చేయడానికి ఏ పత్రాలు అవసరం?
మీరు జీవిత బీమా పాలసీని కొనుగోలు చేయడానికి నిర్ణయించుకుంటే, మీరు కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది..
వయసు రుజువు: వీటిలో ఏవైనా - డ్రైవింగ్ లైసెన్స్, 10 లేదా 12వ తరగతి మార్కుల పత్రం, జనన ధృవీకరణ పత్రం, పాసుపోర్టు, ఓటరు కార్డు మొదలైనవి.
గుర్తింపు రుజువు: మీ పౌరసత్వాన్ని నిర్ధారించే పాన్ కార్డు, పాసుపోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు లేదా ఆధార్ కార్డు
చిరునామా రుజువు: కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా
పాసుపోర్టు, మీ శాశ్వత చిరునామాను స్పష్టంగా కలిగి ఉండాలి.
ఆదాయ రుజువు: ఫారం 16, గత 3-6 నెలల శాలరీ స్లిప్స్, ఐటీఆర్(2-3 సంవత్సరాలు), మొదలైనవి.
కొన్ని పథకాలకు పాలసీదారులు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడట్లేదు అనేందుకు రుజువుగా వైద్య పరీక్షలు సమర్పించాల్సిన అవసరం ఉంది. సంస్థ అవసరమైన ఇతర పత్రాలను కోరవచ్చు.
జీవిత బీమా క్లెయిమ్ ను ఎలా దాఖలు చేయాలి?
ఒక క్లెయిమ్ దాఖలు చేయడానికి అవసరమైన అన్ని దశలను అనుసరిస్తే, అప్పుడు క్లెయిమ్ దాఖలు చేయడానికి మరియు మొత్తం హామీ పొందడం చాలా సౌకర్యవంతంగా మరియు ఇబ్బంది లేని పనిగా మారుతుంది. కింది పరిస్థితుల్లో హక్కుదారు క్లెయిమ్ ఎలా దాఖలు చేయాలో వివరించడం జరిగింది.
పాలసీదారుడు మరణించిన సందర్భంలో, నామినీ ఈ కింది విధంగా క్లెయిమ్ చేసుకోవచ్చు..
- పాలసీదారుడి మరణం గురించి వెంటనే బీమా సంస్థకు తెలియజేయండి. సమయం, ప్రదేశం, మరణానికి గల కారణ వంటి ముఖ్యమైన వివరాలతో వీలైనంత త్వరగా బీమా సంస్థకు తెలియజేయండి.
- అవసరమైన పత్రాలు మరియు రుజువులను బీమా సంస్థకు తెలియజేయండి. బీమా సంస్థ అందించిన క్లెయిమ్ ఫారంను పూరించి, మరణ ధృవీకరణ పత్రాన్ని అవసరమైన ఇతర పత్రాలను దానికి జోడించండి.
- నామినీ కాకుండా మరొకరు క్లెయిమ్ దాఖలు చేస్తే బీమా చేసిన వ్యక్తితో అతను లేదా ఆమె సంబంధానికి సంబంధించి చట్టపరమైన రుజువులు అందించాలి.
- అవసరం అయితే పోస్ట్ మార్టరం, ఆసుపత్రి మరియు వైద్య నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది.
- పోలీసు విచారణకు సంబంధించిన కేసులలో దర్యాప్తు, సర్వే నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.
- దర్యాప్తు ముగిసిన తరువాత బీమా సంస్థ క్లెయిమ్ ఆమోదిస్తుంది లేదా నిరాకరిస్తుంది. ఈ పూర్తి వివరాలు హక్కుదారుతో పంచుకోబతాయి.
పాలసీ మెచ్యూరిటీ అయిన సందర్భంలో
పాలసీదారుడు పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు మనుగడలో ఉంటే, అన్ని ప్రీమియంలు సక్రమంగా చెల్లించబడితే, సంబంధత బీమా ప్రొవైడర్ మెచ్యూరిటీ ప్రయోజనాలను చెల్లించాల్సి ఉంటుంది. క్లెయిమ్ ను దాఖలు చేసే విధానం కింది విధంగా ఉంటుంది.
- పాలసీ మెచ్యూరిటీ దగ్గర్లో ఉన్నప్పుడు బీమా ప్రొవైడర్ పాలసీదారునికి డిశ్చార్జి ఓచర్(మెచ్యూరిటీ తేదీకి కనీసం 2-3 నెలల ముందు) ఒక సమాచారం పంపుతుంది.
- పాలసీదారు వోచర్ పై సంతకం చేసి అసలు పాలసీ బాండ్ తో ప్రొవైడర్ కు తిరిగి పంపాలి.
పాలసీ వేరొకరికి కేటాయించినట్లయితే(వ్యక్తి లేదా సంస్థ) డిశ్చార్జి ఓచర్ ఇచ్చే అసైన్ కి మాత్రమే ఈ మొత్తం చెల్లించబడుతుంది.