చైల్డ్ ప్లాన్స్
 • పిల్లల భవిష్యత్తుకు భద్రత
 • తల్లిదండ్రులకు జీవిత కవరేజీ
 • ప్రీమియం మాఫీ ప్రయోజనాలు
PX step

అగ్ర శ్రేణి సంస్థల నుంచి ఉచిత కోట్స్

1

2

పుట్టిన తేదీ (తల్లిదండ్రులు)
ఆదాయం
| లింగ

1

2

ఫోన్ నం.
పేరు
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

చైల్డ్ ప్లాన్స్ అనేవి మీ పిల్లల సురక్షితమైన భవిష్యత్తును రూపొందించడానికి సహాయపడే పొదుపు మరియు బీమా కలయిక. విద్య, వివాహం మొదలైన మీ పిల్లల అవసరాలను తీర్చడానికి అవసరమయ్యే ఆర్థిక కార్పస్ నిర్మించడానికి ఈ పథకం మద్దతు అందిస్తుంది.

చైల్డ్ ప్లాన్స్ యొక్క ప్రాముఖ్యత

పిల్లల యొక్క ముఖ్యమైన లక్ష్యాలు మరియు సురక్షిత భవిష్యత్ అందించడంలో తల్లిదండ్రుల జీవితం నిండి ఉంటుంది. చిన్నప్పటి నుండి పిల్లవాడిని పెంచడం నుండి అతని / ఆమె భవిష్యత్తులో స్థిరపడే వరకు ప్రతి దశ కూడా కీలకం. తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే పిల్లల ప్రతి కోరికను రాజీ పడకుండా నెరవేర్చాల్సి ఉంటుంది.

రాబోయే కాలంలో మీ శిశువు యొక్క విద్య లేదా వివాహ ఖర్చులకు ఆర్థిక సాయాన్ని అందించడానికి చైల్డ్ ప్లాన్స్ సహాయపడతాయి. మీరు చేయాల్సిందల్లా మీ ఆదాయంలో కొంత భాగాన్ని పిల్లల ప్రణాళికలో పెట్టుబడి పెట్టాలి. దీని ద్వారా మీరు భవిష్యత్తులో మీ పిల్లల అవసరాలకు తగినంత నిధులు ఏర్పరచుకోగలరు.

బీమా తీసుకున్న తర్వాత ఐదేళ్ల తర్వాత మీరు చనిపోతే? టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మీ కుటుంబ యొక్క తక్షణ ఆర్థిక అవసరాల కోసం పెద్ద మొత్తంలో సొమ్మును అందిస్తుంది మరియు అదనంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఆగిపోతాయి. అదే చైల్డ్ ప్లాన్ అయితే , వెంటనే చెల్లింపులు జరగవు. అయితే పాలసీదారుడి తరఫున ప్లాన్ లో పెట్టుబడి పెడుతుంది. అలాగే ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పాలసీదారుడి పిల్లల భవిష్యత్తుకు చైల్డ్ ప్లాన్స్ అత్యధిక ప్రాధాన్యతను ఇస్తాయి.

చైల్డ్ ప్లాన్స్ యొక్క వివిధ రకాలు ఏమిటి?

చైల్డ్ ప్లాన్స్ అనేవి బీమా సంస్థ నుంచి బీమా సంస్థకు మారుతూ ఉంటాయి. మీ అవగాహన కొన్ని పథకాల గురించి కింద వివరించడం జరిగింది..

సింగిల్ ప్రీమియ ఇన్సూరెన్స్ ప్లాన్- సింగిల్ ప్రీమియం చైల్డ్ ప్లాన్ కు ఒకే సారి పెట్టుబడి అవసరం, ఇది రాయితీలు మరియు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

రెగ్యులర్ ప్రీమియం ఇన్సూరెన్స్ ప్రీమియం- క్రమ పద్ధతిలో ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం చెల్లింపు విధానం వార్షికంగా, అర్థ వార్షికంగా, త్రైమాసిక, నెలవారీ విధానాల్లో చెల్లింపు చేయవచ్చు.

చైల్డ్ ఎండోమెంట్ ప్లాన్-  చైల్డ్ ఎండోమెంట్ ప్లాన్ ఎంచుకోవడం ద్వారా మీరు మీ బీమా సంస్థకు పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టడానికి అధికారం ఇస్తారు. ఎండోమెంట్ పథకాలు మూలధన నిధులను అందిస్తాయి, అదే విధంగా పెట్టుబడులు నుండి వచ్చే రాబడితో ఫండ్ వృద్ధికి క్రమంగా తోడ్పడతాయి.

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యూలిప్)- యూలిప్ ప్లాన్ పెట్టుబడి ప్రణాళికలు మరియు జీవిత కవరేజీ కలయిక. మీరు చెల్లించిన ప్రీమియాన్ని ఈక్విటీ సాధన మరియు రుణ సాధనాల్లో పెట్టుబడులు పెడతారు. పథకం కొంత మొత్తంలో నష్టాలను కలిగి ఉన్నప్పటికీ, ఇది దీర్ఘకాలిక ఎండోమెంట్ పథకం కంటే ఎక్కువ రాబడులను అందిస్తుంది. పాలసీదారునికి నిర్దిష్ట నిరీక్షణ కాలం తర్వాత నిధుల మధ్య మారే అవకాశం ఉంటుంది.

చైల్డ్ ప్లాన్స్ ముఖ్య ఫీచర్లు

చైల్డ్ ప్లాన్స్ ఉత్తమ పెట్టుబడి ఎంపికలలో ఒకటి, ఎందుకంటే ఇవి అదనపు సంపదను అందిస్తాయి. పన్ను ప్రయోజనాలు, పొదుపు మరిన్ని వంటి బహుళ ఫీచర్లను చైల్డ్ ప్లాన్స్ అందిస్తాయి. చైల్డ్ ప్లాన్స్ యొక్క కొన్ని ముఖ్యమైన ఫీచర్ల గురించి కింద వివరించడం జరిగింది.

ప్రీమియం మినహాయింపు- చైల్డ్ ప్లాన్స్ ప్రీమియం మినహాయింపు ప్రయోజనాన్ని అందిస్తాయి. ఇది తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వర్తిస్తుంది. ఈ ఫీచర్ బీమా సంస్థ నుంచి బీమా సంస్థ కు మారుతూ ఉంటుంది.

హామీ ఇవ్వబడిన మొత్తం- చైల్డ్ ప్లాన్స్ కింద హామీ ఇవ్వబడిన మొత్తం సాధారణంగా పాలసీదారు యొక్క స్థూల ఆదాయానికి 10 రెట్లు ఉంటుంది. ఇది తల్లిదండ్రులు మరణం లేదా మెచ్యూరిటీ సమయంలో చెల్లించబడుతుంది.

పాక్షిక ఉపసంహరణలు- వివిధ బీమా సంస్థలు అందించే పథకాలు పాక్షిక ఉపసంహరణ ఎంపికతో వస్తాయి(పిల్లల వయసు 18 సంవత్సరాలు నిండినప్పుడు)

నిధుల ఎంపిక- ఈక్విటీ,డెట్ మరియు మనీ-మార్కెట్, హైబ్రిడ్ వంటి వివిధ ఫండ్ ఎంపికల మధ్య ఎంచుకోవడానికి చైల్డ్ ప్లాన్స్ మీకు అనుమతిస్తాయి. మీరు కొంత కాలం తర్వాత నిధుల మధ్య కూడా మారవచ్చు.

అధిక రాబడి- చైల్డ్ ప్లాన్స్ 12 శాతం వరకు రాబడిని అందిస్తాయి. ఇది దీర్ఘ కాలిక ద్రవ్యోల్బణ రేటు కంటే అధిక రాబడిని అందిస్తుంది. ఇది మీ పెట్టుబడులు తగ్గకుండా(ద్రవ్యోల్బణం ఫలితంగా) రక్షించడమే కాక, ఫండ్ యొక్క స్థిరమైన వృద్ధికి దోహదం చేస్తుంది.

పన్ను ప్రయోజనాలు- చైల్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు పన్ను ప్రయోజనాలు కూడా అందిస్తాయి. మెచ్యూరిటీ/ డెత్ క్లైయిమ్ సందర్భంలో సెక్షన్ 10(10డి) క్రింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే ప్రీమియంపై సెక్షన్ 80(సి) క్రింద పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది.

భారతదేశంలో ఉత్తమ చైల్డ్ ప్లాన్స్

ప్లాన్

ప్రవేశ వయసు

మెచ్యూరిటీ వయసు

కనీస వార్షిక ప్రీమియం

బీమా మొత్తం

అవివా యంగ్ స్కాలర్ అడ్వాంటేజ్ ప్లాన్

21-45 సంవత్సరాలు

60 సంవత్సరాలు

రూ. 50000

బీమా మొత్తం వార్షిక ప్రీమియానికి 10 రెట్లు ఉంటుంది.

బజాజ్ అలియాంజ్ యంగ్ అస్యూర్

18-50 సంవత్సరాలు

60 సంవత్సరాలు

లభ్యత లేదు

వార్షిక ప్రీమియానికి 10 రెట్లు

హెచ్ డి ఎఫ్ సి యంగ్ స్టార్ సూపర్ ప్రీమియం

18-65 సంవత్సరాలు

75 సంవత్సరాలు

రూ. 15000

వార్షిక ప్రీమియానికి 10 రెట్లు

బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ విజన్ స్టార్

18-55 సంవత్సరాలు

75 సంవత్సరాలు

లభ్యత లేదు

కనిష్టంగా – రూ. 1,00,000

చైల్డ్ ఎడ్యుకేషన్ పథకం అంటే ఏమిటి?

చైల్డ్ ఎడ్యుకేషన్ పథకాలు మీ పిల్లల భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి మెచ్యూరిటీ ప్రయోజనాలతో పాటు సమగ్ర జీవిత బీమా కవరేజీని అందిస్తుంది. సంక్షిప్తంగా, తగినంత మూల ధనాన్ని నిర్మించడం ద్వారా విద్య యొక్క పెరుగుతున్న వ్యయాన్ని ఎదుర్కోవడానికి పథకం మీకు సహాయపడుతుంది.

చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ప్రయోజనాలు

చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఈ కింది పేర్కొన్న ప్రయోజనాలను అందిస్తాయి.

కార్పస్ నిర్మాణం

మీ పిల్లల విద్య అవసరాల కోసం ఆర్థిక కార్పస్ ను నిర్మించడంలో మీకు ఈ పథకం సహాయపడుతుంది మరియు రాబోయే భవిష్యత్ కోసం తగినంత పొదుపు అదా చేయడానికి సహాయపడుతుంది. ఎప్పటికప్పుడు ప్రీమియం చెల్లించేటప్పుడు, ఈ పథకం పెద్ద మొత్తాన్ని అందిస్తుంది. ఇది పిల్లలకి ఎటువంటి ఆర్థిక భారం లేకుండా విద్య ఖర్చులను తీర్చడానికి సహాయపడుతుంది.

వైద్య చికిత్స

ఈ పథకం పాలసీ కాల వ్యవధిలో ఉపసంహరణ సౌలభ్యాన్ని అందిస్తుంది. మీ పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు మీరు ఈ డబ్బును వైద్య చికిత్స కోసం ఉపయోగించవచ్చు.

తల్లిదండ్రులు లేనప్పుడు పిల్లలకు మద్దతు

తల్లిదండ్రుల మరణం పిల్లలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుంది మరి భవిష్యత్తును దెబ్బతీస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ పథకం కింద ఒకే మొత్తం అందించబడుతుంది. అదే విధంగా పాలసీదారుడు ప్రీమియ మినహాయింపు రైడర్ ను ఎంచుకుంటే, పాలసీ కాల వ్యవధిలో తల్లిదండ్రులు మరణిస్తే ప్రీమియం మినహాయింపు ప్రయోజనం పొందవచ్చు.

ఆదాయ ప్రయోజనం

కొన్ని చైల్డ్ ప్లాన్స్ పిల్లలకు రెగ్యులర్ ఆదాయాన్ని అందిస్తాయి, ఇది మొత్తం హామీలో 1 శాతానికి సమానంగా ఉంటుంది.

చైల్డ్ ప్లాన్స్ కొనుగోలు చేసే ముందు పరిగణించాల్సిన అంశాలు

అవసరమైన ఫీచర్లు

మీ పిల్లల ఆర్థిక భవిష్యత్తును భద్రపరచడానికి అవసరమైన అన్ని ఫీచర్లు మరియు రైడర్ ప్రయోజనాలను పరిశీలించండి.

క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి

బీమా సంస్థ యొక్క క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని పాలసీ కొనుగోలు చేసే ముందు తప్పక పరిశీలించాలి. అధిక క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి కలిగిన బీమా సంస్థను ఎంచుకోవాలి.

పాలసీ కాల వ్యవధి

పాలసీ కొనుగోలు చేసే ముందు పరిశీలించాల్సిన మరో అంశం పాలసీ కాల వ్యవధి. పాలసీ కాల వ్యవధి, మీ పిల్లలకి సరైన వయసులో అన్ని ప్రయోజనాలు లభిస్తాయని నిర్దారిస్తుంది. ఉదాహరణకు మీ బిడ్డ 10 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే అతను/ ఆమె విద్య మరియు వృత్తి లక్ష్యాలను నిర్ణయించడానికి చాలా సమయం ఉంది. కాబట్టి పాలసీ కాల వ్యవధి సుమారు 10-15 సంవత్సరాలు ఉండాలి.

ఫండ్ కేటాయింపు

 మీ పిల్లల వయసు మరియు ఆరోగ్య సంరక్షణ, విద్య, వివాహం మరియు అవసరాలను బట్టి ఫండ్ కేటాయింపును తెలివిగా ఎంచుకోండి. అనేక విధానాలు విభిన్న ప్రమాద కారకాలతో వేర్వేరు ఫండ్ ఎంపికలను అందిస్తాయి. మీ పిల్లలకి మంచి రాబడిని పొందడానికి ఈక్విటీ మరియు డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి.

ఉత్తమ చైల్డ్ ప్లాన్ రైడర్స్

ప్రీమియం మినహాయింపు రైడర్ ప్రయోజనం

ఇది అదనపు ప్రీమియంతో వస్తుంది మరియు పాలసీదారుడు మరణిస్తే బ్యాలెన్స్ ప్రీమియంల భారం పిల్లలపై పడకుండా ప్రీమియం మినహాయించబడుతుంది.

ప్రమాదవశాత్తు డెత్ బెనిఫిట్

ఈ రైడర్ ను కొనుగోలు చేయడానికి అదనపు ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. దీని కింద,

తల్లిదండ్రులు మరణిస్తే పిల్లవాడు అదనపు రైడర్ మొత్తాన్ని పొందుతాడు.

ప్రమాదవశాత్తు శాశ్వత లేదా పాక్షిక అంగవైకల్యం బెనిఫిట్

ప్రమాదం కారణంగా తల్లిదండ్రులు శాశ్వత లేదా పాక్షిక వైకల్యంతో బాధపడుతుంటే, పిల్లలకు

ఒకేసారి పెద్ద మొత్తంలో సొమ్ము లభిస్తుంది. ఈ సొమ్ము రైడర్ మొత్తానికి సమానంగా ఉంటుంది. ఈ అదనపు ప్రయోజనం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

తీవ్రమైన వ్యాధి బెనిఫిట్

తల్లిదండ్రులు హార్ట్ ఎటాక్, క్యాన్సర్, కొరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ సర్జరీ, స్ట్రోక్ మరియు కిడ్నీ వైఫల్యం వంటి క్లిష్టమైన వ్యాధితో బాధపడుతుంటే , పిల్లలకు అదనపు రైడర్ హామీ మొత్తం లభిస్తుంది. తల్లిదండ్రుల వయసు ఆధారంగా ప్రీమియం నిర్ణయించబడుతుంది.

ఆదాయ బెనిఫిట్ రైడర్

 ఈ క్రింది సంఘటనలలో ఈ రైడర్ పిల్లలకు ప్రతి నెల 1% భరోసా పొందడానికి అర్హత ఇస్తుంది…

 1. తల్లిదండ్రుల మరణం
 2. ప్రమాదం కారణంగా తల్లిదండ్రుల శాశ్వత వైకల్యం
 3. పాలసీలో పేర్కొన్న ఏదైనా తీవ్రమైన అనారోగ్యానికి తల్లిదండ్రులు గురైతే 

ఈ ప్రయోజనాలు పొందడానికి ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.

ఉత్తమ చైల్డ్ ప్లాన్ ఎందుకు ఎలా ఎంచుకోవాలి?

చైల్డ్ ప్లాన్ కొనడానికి మీరు PolicyX.com లో లాగిన్ కావాలి. ఈ కింది పేర్కొన్న దశలు అనుసరించండి.

 • ఈ పేజీ యొక్క కుడి ఎగువ మూలలో ఇవ్వబడిన అగ్ర కంపెనీల నుంచి ఉచిత కోట్స్ పొందండి ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • మీ జనన తేదీ, వార్షిక ఆదాయం, లింగం వంటి అవసరమైన ప్రాథమిక వివరాలను సమర్పించండి.
 • కొనసాగించు ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • మీ ఫోన్ నంబర్, పేరు మరియు ఊరు వివరాలను పూరించి కొనసాగండి ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • భారతదేశంలో ఉన్న అగ్ర శ్రేణి బీమా సంస్థల నుంచి అందుబాటులో ఉన్న ఉత్తమ పథకాన్ని ఎంచుకోండి.
 • మీకు కావాల్సిన పథకాన్ని ఎంచుకోండి మరియు పెట్టుబడి ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • కొనుగోలు చేయండి ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • మీ ఈ-మెయిల్ ఐడిని ఎంటర్ చేసి సబ్మిట్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • అటు తర్వాత మీర అధికారిక వెబ్ సైటుకు రీడైరెక్ట్ చేయబడతారు.
 • అందుబాటులో ఉన్న చెల్లింపు ఎంపికలను ఉపయోగించి చెల్లింపు చేయండి.
 • మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ కు పాలసీ పత్రాలతో పాటు మీరు నిర్థారణ పంపబడుతుంది.
 • గమనిక- ఏదైనా ప్రశ్న ఉంటే, మా టోల్ ఫ్రీ నంబర్ (1800-4200-269) ను సంప్రదించండి. మీరు helpdesk[at]policyx[dot]com లో కూడా సంప్రదించవచ్చు

చైల్డ్ ప్లాన్స్ లో ఎంతవరకు పెట్టుబడి పెట్టాలి?

ఇది తెలుసుకోవాలంటే, విద్య పరిశ్రమలో పెరుగుతున్న అనుభవాలను అర్థం చేసుకోవడం చాలా అవసర. సంవత్సరానికి 10-12 శాతం రేటుతో విద్య ఖర్చులు పెరుగుతున్నాయి. సాధారణంగా నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ విద్యకు 7-8 లక్షల ఖర్చు అవుతుంది. రాబోయే సంవత్సరాల్లో ఖర్చు 14 నుంచి 25 లక్షలకు పెరిగే అవకాశముంది. 2027 నాటికి సుమారు 28 లక్షలు ఖర్చు అవుతుంది.

ఆ మొత్తం ఖర్చులను ఎదుర్కోవడానికి పెట్టుబడి అవసరం. సాధారణంగా రూ. 1 కోటి కార్పస్ నిర్మించడం కష్టంగా అనిపించవచ్చు. కానీ ఈ మొత్తాన్ని ఆదా చేయడం అసాధ్యం కాదు. మీరు ఈక్విటీ ఫండ్ లో 15 శాతం రేటుతో 18 సంవత్సరాల పాటు రూ. 9000 రూపాయల సిప్ సహాయంతో పెట్టుబడి పెట్టండి. విద్యా పరిశ్రమల ద్రవ్యోల్బణం రేటు అధికం కాబట్టి, మీరు ఎక్కువ కాలవ్యవధి కలిగిన పాలసీని ఎంచుకోవాలి.

చైల్డ్ ప్లాన్ ఎలా పనిచేస్తుంది..?

చైల్డ్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది..? ఇది చాలా మంది అడిగే ప్రశ్న? అవసరమైన సమయంలో వారు మద్దతు అందిస్తారు..? భవిష్యత్ లో రాబోయే అన్ని ఖర్చులకు ఆర్థిక సహాయం పాలసీ అందిస్తుందా..? ఇది మరికొందరు సందేహం. ప్రాథమిక దశ ఏమిటంటే , మీరు నెలవారీ ప్రాతిపదికన గరిష్టంగా 25 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. మంచి రాబడితో మీ పిల్లల కోసం చాలా డబ్బు ఆదా చేయడంలో ఇది మీకు సహాయం చేస్తుంది. ఈ పాలసీ మీ పిల్లల విద్యకు మరియు వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

యూలిప్స్ ముడిపడి ఉన్న చైల్డ్ ఇన్సూరెన్స్ పథకాలు గరిష్ట రాబడిని అందిస్తాయి. యూనిట్ లింక్డ్ పథకాలు అధిక ధరలను కలిగి ఉండటం వలన పాలసీదారుల్లో వీటిపై అపోహ ఏర్పడింది. యూలిప్స్ దీర్ఘకాల ప్రయోజనాలు అందిస్తాయి, అయితే పాలసీ కాల వ్యవధి వరకు మీరు యూలిప్ తో కొనసాగాలి. మీకు మంచి రాబడి మరియు వృద్ధి అవసరమైతే , మీరు మార్కెట్ రిస్క్ కు సిద్ధంగా ఉండాలి.

చైల్డ్ ఇన్సూరెన్స్ పథకాలకు అవసరమైన పత్రాలు

వయసు ధృవీకరణ- జనన ధృవీకరణ పత్రం, 10 లేదా 12వ తరగతి మార్క్ షీట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, ఓటర్ ఐడి, మొదలైనవి.

గుర్తింపు ధృవీకరణ- డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పౌరసత్వాన్ని నిరూపించే ఏ పత్రమైనా.

ఆదాయ ధృవీకరణ- పాలసీ తీసుకునే వ్యక్తి ఆదాయానికి సంబంధించిన ధృవీకరణ పత్రం

చిరునామా ధృవీకరణ- విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, శాశ్వత చిరునామా సూచించే ఏ పత్రమైనా.

ప్రతిపాదన ఫారం- దరఖాస్తు మొత్తం పూరించి సంతకం చేయాలి.

చైల్డ్ ప్లాన్ క్లెయిమ్ ఎలా దాఖలు చేయాలి?

 • క్లెయిమ్ దాఖలు చేయడానికి మీరు వీలైనంత త్వరగా సంఘటన గురించి బీమా సంస్థకు తెలియజేయాలి. సంస్థ యొక్క అధికారిక వెబ్ సైటును సందర్శించడం ద్వారా, సమీప కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా, టొల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయడం ద్వారా లేదా ఈ మెయిల్ పంపడం ద్వారా మీరు సంఘటన గురించి సంస్థకు తెలియజేయవచ్చు.
 • మీరు క్లెయిమ్ ఫారం మరియు పాలసీ యొక్క ఇతర వివరాలైన సంఘటన యొక్క తేదీ, కారణం,నామినీ పేరు సమర్పించాలి.
 • మీరు క్లెయిమ్ దాఖలు చేసిన తర్వాత అవసరమైన ఇతర పత్రాలు మరియు నివేదికలు సమర్పించండి.
 • సంస్థ మీ పత్రాల పరిశీలించడానికి సంస్థ నిపుణుడిని నియమిస్తుంది.
 • క్లెయిమ్ ఆమోదించబడితే, తదుపరి దర్యాప్తు అవసరం లేదు.
 • క్లెయిమ్ ప్రయోజనం 30 రోజుల్లో రిజిస్ట్రర్డ్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది.
 • తిరస్కరణ విషయంలో కాల్, ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ లేదా పోస్ట్ ద్వారా తిరస్కరణ గల కారణాన్ని సంస్థ తెలుపుతుంది.