పెట్టుబడి పథకాలు
 • హామీ మనీ బ్యాక్ ప్లాన్
 • అధిక రాబడి పెట్టుబడి ఎంపికలు
 • పన్ను ప్రయోజనాలు
PX step

ప్రీమియం పోల్చండి

1

2

పుట్టినరోజు
ఆదాయం
| లింగ

1

2

ఫోన్ నం.
పేరు
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

పెట్టుబడి పథకాలు, పెట్టుబడి మరియు బీమా రెండిటి కలయిక. మీరు చెల్లించే ప్రీమియంలో కొంత భాగం మీకు బీమా కవరేజీ అందించడానికి ఉపయోగపడుతుంది మరియు మిగిలిన భాగం మీరు రిస్క్ తీసుకునే సామర్థ్యం ప్రకారం ఆర్థిక సంస్థల్లో పెట్టుబడి పెట్టబడుతుంది. ఈ పథకాలు మీ స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నేరవేర్చడంలో మీకు సహాయపడతాయి. మీరు సంపదను పెంచుకోవడానికి మరియు పన్నులను ఆదా చేయాలనుకుంటే పెట్టుబడి పథకాలు మంచి ఎంపిక.

జీవిత బీమా క్రమం తప్పకుండా నిధుల రూపంలో ఉపయోగించబడుతుంది. అందువల్ల వీటిని ఉత్తమ పెట్టుబడి ప్రణాళికలుగా కూడా పేర్కొంటారు. అన్నింటిలో మొదటిది, ఈ పథకాలు రక్షణను అందిస్తాయి. పాలసీదారుడు లేదా అతని కుటుంబానకి అనుకోని ప్రమాదాల నుండి రక్షణ కల్పిస్తుంది మరియు రెండోది పాలసీదారుడు స్వల్పకాలిక లక్ష్యాలు లేదా దీర్ఘకాలిక లక్ష్యాలను నేరవేర్చుకునే విధంగా నిధులను పొందుతారు.

 పెట్టుబడి ప్రణాళికలు రెండు రకాలు అవి, ఒకటి యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లేదా యూలిప్స్ .. మార్కెట్ పనితీరు ఆధారంగా రాబడిని ఇస్తాయి మరియు రెండోది జీవిత బీమా కవరేజీ ఫండింగ్ మెచ్యూరిటీ పొందినప్పుడు ఒకే మొత్తాన్ని లేదా యాన్యూటీ చెల్లింపును అందించే సాంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్స్. ఈ రెండు రకాలు కూడా పాలసీదారునికి జీవిత బీమా కవరేజీతో పాటు పొదుపును అందిస్తాయి.

 •  మీ సంపదను పెంచే పెట్టుబడి పథకాన్ని ఎంచుకోవాలని చూస్తున్నారా?
 • మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి గందరగోళానికి గురవుతున్నారా?
 • మీ వద్ద అదనపు డబ్బు ఉందా, భవిష్యత్ మరియు పదివీ విరమణ పథకాల్లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా?
 • మీ పిల్లల విద్య మరియు వివాహం గురించి ప్రణాళిక ఏంటి?
 • మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు?
 • మీకు ఎంత వరకు అవగాహన ఉంది?

ఇవి ప్రశ్నలన్ని మీకు సంక్లిష్టంగా అనిపిస్తే, మీరు సరైన పేజీకి వచ్చినట్లే.

పెట్టుబడి పథకాలు మీ ఆదాయాన్ని వృద్ధి చేసుకునేందుకు ఉపయోగపడతాయి. ఇది మీ ఆదాయాన్ని కూడబెట్టడంలో సహయపడటమే కాకుండా, మీరు కోరుకునే భద్రతా కవర్ ని సైతం అందిస్తుంది. సాధారణ జీవిత బీమా పథకం లేదా ప్రావిడెంట్ ఫండ్, యూలిప్స్ లేదా సాధారణ మరియు క్రమబద్ధమైన.. ఇలా పెట్టుబడి పథకం ఏదైనా, పెట్టుబడి పెట్టడం అనేది అలవాటుగా మారాలి.

ప్రతి వ్యక్తి తన ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేయడం కోసం ప్రణాళిక రూపొందించుకోవాలి. తమ అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకుని పెట్టుబడులు చేస్తే భవిష్యత్తులో అత్యవసర పరిస్థితి ఎదురైన సందర్భంలో ఆ నిధులు అక్కరకు వస్తాయి.

లగ్జరీ వస్తువులపై ఖర్చు చేయడం తగ్గించుకోవాలి, ఎందుకంటే వీటిపై పెట్టిన ఖర్చు తిరిగి రాదు, దీనికి బదులుగా మీరు పొదుపు చేస్తే భవిష్యత్ అవసరాలకు సహాయపడుతుంది. ఇది కొంచెం కష్టమైన పనే అయినా, లగ్జరీ వస్తువులకు నో చెప్పడం నేర్చుకోవాలి.

మనందరికీ ఖచ్చితమైన పెట్టుబడి ప్రణాళిక అవసరం, ఈ నెల నుంచే డబ్బు ఆదా చేయడం ప్రారంభించండి. దీని వల్ల కొద్ది కాలంలోనే మీ సంపద వృద్ధి చెందుతుంది.

ఇంటర్నెట్ లో వివిధ పెట్టుబడి పథకాల గురించిన సమాచారం అందుబాటులో ఉంది. మిడ్ క్యాప్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ ఫండ్స్, గ్రోత్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్, మీరు ఇందులో దేనిని ఎంచుకోవాలి? మరో విషయం ఏమిటంటే సరైన పెట్టుబడి పథకంలో పెట్టుబడి పెడితే పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మీరు 30 శాతం పన్ను పరిధిలో ఉంటే, పన్ను తగ్గించుకోవడం అవసరం. అందుకోసం మీరు పెట్టుబడి పథకంలో పెట్టుబడి పెడితే అటు పొదుపుతో పాటు పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

యూలిప్ ప్లాన్స్ ఒక అద్భుతమైన పెట్టుబడి ఎంపిక, ఎందుకంటే అవి మీ డబ్బులో కొంత భాగాన్ని మార్కెట్లలో పెట్టుబడి పెడతాయి. డెబిట్ లేదా ఈక్వీటి ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక రాబడిని అందిస్తాయి. ఎండోమెంట్ ప్లాన్స్ తక్కువ రాబడిని అందిస్తాయి. అయితే ఇవి సురక్షితమైనవి. అయితే ఎండోమెంట్ పథకం కింద డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టబడుతుంది అనే విషయం పాలసీదారునికి తెలియదు. అయితే యూలిప్స్ లో మాత్రం డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టబడుతుంది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. యూలిప్స్ పెట్టుబడులు అధిక నాణ్యత కలిగిన పెట్టుబడి పథకాలుగా చెప్పుకోవచ్చు.

ఎండోమెంట్ పథకాలు కూడా ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. యూలిప్స్ పథకాలు పారదర్శకత మరియు ఫ్లెక్సిబిలిటిని అందిస్తే, ఎండోమెంట్ పథకాలు ఖచ్చితమైన హామీ ఇచ్చిన రాబడిని అందిస్తాయి.

1. మీ రిస్క్ ఫ్రొఫైల్ ను విశ్లేషించండి

మీరు ఎంత మొత్తాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారో అనే విషయాన్ని ముందుగా అంచనా వేయాలి. మీకు స్టాక్ మార్కెట్ పై అవగాహన ఉందా?, మీర కోరుకున్న పెట్టుబడి రాకపోతే అది మిమ్మల్ని భాదిస్తుందా?, మీ నిధులు మెరుగైన ప్రదర్శన కోసం మీరు ఎక్కువ కాలం వేచి ఉండడానికి సిద్ధంగా ఉన్నారా?

మీ అర్థిక సలహాదారు సలహా మేరకు పెట్టుబడి పథకాన్ని ఎంచుకునే ముందు ఈ ప్రశ్నలకు అన్నింటికి మీరు సమాధానాలు వెతకాలి.

2.బడ్జెట్

మీ డబ్బు మొత్తాన్ని ఫండ్ లలో పెట్టడం మంచిది కాదు. మీరు నెలఖారకు అద్దెలు మరియు యుటిలిటి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలనే విషయాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలి.

మంచి బడ్జెట్ ఎంపిక చేసుకున్న తర్వాత మీరు పెట్టుబడికి సిద్ధం కావచ్చు. చిన్న చిన్న మొత్తాలతో పెట్టుబడి పథకాలను ప్రారంభించండి, దీని వల్ల నష్టాలు వచ్చినా మీరు భరించగలుగుతారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన తర్వాత నష్టాలు ఎదురైతే మీరు ఆర్థిక సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉంది.

3.పెట్టుబడి పథకాలు

మీరు పెట్టుబడి పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? రిటైర్మెంట్ ఫండ్ లేదా స్వల్పకాలిక లక్ష్య కోసం? పెళ్లి కోసమా లేదా పిల్లల భవిష్యత్ కోసమా? ఇలా మీ ఆర్థిక లక్ష్యాలను గుర్తించడం ద్వారా మీరు ఏ రకమైన పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టాలనే దానిపై స్పష్టత వస్తుంది. మీరు సురక్షిత పెట్టుబడిని ఆశిస్తున్నారా లేదా రిస్క్ చేసి పెద్ద రాబడిని ఆశిస్తున్నారా వంటి అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి. భారతదేశంలో ఉత్తమ పెట్టుబడి పథకాలు గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

మొత్తం పెట్టుబడిని 9 ప్రధాన వర్గాలుగా విభజించవచ్చు

1. ఫిక్సిడ్ డిపాజిట్


పేరు సూచించినట్లుగా ఇది ఒక ఫండ్. స్థిరమైన వడ్డీ రేట్లను అందిస్తుంది. మెచ్యూరిటీ వ్యవధి వరకు ఉపసంహరణకు అవకాశం ఉండదు. భారతదేశంలో పురాతన పెట్టుబడి పథకంగా దీనిని చెప్పుకోవచ్చు. ఫిక్సిడ్ డిపాజిట్ సులభమైన పెట్టుబడి ప్రణాళికల్లో ఒకటి. ఇది కనీసం 5 సంవత్సరాల కాల వ్యవధిని కలిగి ఉంటుంది మరియు 7.5 % వరకు వడ్డీని అందిస్తుంది. ఫిక్సిడ్ డిపాజిట్ పై పన్నులు కూడా విధించబడతాయి. ఆన్లైన్ కాలిక్యులేటర్ ద్వారా వడ్డీ మరియు పన్నును లెక్కించి దానికి అనుగుణంగా ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతా తెరవండి.

టిడిఎస్ సమస్యల కారణంగా రాబడి తగ్గడంతో దీనికి ప్రజాదారణ కొంత మేర తగ్గింది. కానీ మీరు డిపాజిట్ చేసే ప్రిన్సిపల్ మొత్తంపై ఎలాంటి పన్నులు ఉండవు. అంతేగాక ఇది ఒక క్లాసిక్ ఇన్వ్ స్ట్మెంట్ ఎంపిక, దీనిని అందరూ సిఫార్సు చేస్తారు.

ఏదేమైనా ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గుతుండటంతో ఫిక్సిడ్ డిపాజిట్ పై వచ్చే వడ్డీలు తగ్గాయి. ఉహించినంత రాబడి రాకపోవడంతో పెట్టుబడిదారులు ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు.

వినియోగదారులు ఫిక్సిడ్ డిపాజిట్లపై రుణాలను పొందే సౌకర్యం కూడా ఉంది. మీ బ్యాంకు నిబంధనల ఆధారంగా ఎఫ్ డి ఖాతాపై సుమారు 90 శాతం వరకు రుణం పొందే అవకాశం ఉంది. అయితే రుణ వ్యవధి మీ ఫిక్సిడ్ డిపాజిట్ కాల వ్యవధి ఒకేలా ఉంటుంది. అదేవిధంగా వడ్డీ రేట్లు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎఫ్ డి ఖాతాకు సైతం మీరు బీమా చేయవచ్చు. దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ఉన్న ఎఫ్ డి ఖాతాలకు బీమా సౌకర్యాన్ని తప్పని సరిగా అందించాలని ఆర్బీఐ మార్గనిర్దేశకాలు పేర్కొంటున్నాయి.

2. బాండ్స్


మీరు ఎప్పుడైనా మీ స్నేహితులకు వడ్డీకి డబ్బులు ఇచ్చారా, బాండ్లు కూడా ఇంచుమించు ఇలానే ఉంటాయి. ఇక్కడ మీ స్నేహితుడు బ్యాంకు. గవర్నమెంట్ బాండ్ల రూపంలో మీరు పెట్టుబడి పెట్టే మొత్తాన్ని బ్యాంకులు వడ్డీతో కలిపి చెల్లిస్తాయి. ఇది అరువు తీసుకున్న డబ్బును వడ్డీ రేటుతో తిరిగి చెల్లించే లక్ష్యంతో ఏర్పడిన ఒక ఒప్పందంగా చెప్పుకోవచ్చు. ఇది నిర్ణీత వ్యవధిలో చెల్లించబడుతుంది. దీనిని దీర్ఘకాలిక పెట్టుబడిగా చెప్పుకోవచ్చు. ఇది స్టాక్ మార్కెట్ నుండి ఎలా భిన్నంగా ఉంటుందని ఆలోచిస్తున్నారు. స్టాక్ హోల్డర్స్ కు ఒక సంస్థలో ఈక్వీటీ వాటా ఉంటుంది. మీరు బోర్డు రూమ్ లో ఉండరు, కానీ మీరు టీమ్ లో ఒక భాగమే. అయితే బాండ్ల విషయంలో మీరు ప్రత్యేకమైన బాస్.

బాండ్స్ ఒక అత్యుత్తమమైన ప్రతిపాదన, ఇది మెచ్యూరిటీ తేదీతో వస్తుంది. వ్యవధి తర్వాత పొడిగించబడదు. పెట్టుబడి పెట్టడానికి అనువుగా వివిధ రకాల బాండ్లు ఉన్నాయి. ఉదాహరణకు క్యాపిటల్ గెయిన్ బాండ్స్ మీకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను అందిస్తాయి. సెక్షన్ 54EC కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందాలంటే బాండ్లను క్యాపిటల్ లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మీరు కనిష్టంగా రూ. 10,000 గరిష్టంగా రూ. 50,00,000 పెట్టుబడితో మెచ్యూరిటీ ముందు మూడేళ్ల పాటు బాండ్లను తీసుకోవచ్చు. ఈ బాండ్లు NAHI(నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా0 మరియు RECL(రూరల్ ఎలక్ట్రీఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్) కు చెందినవి.

అదనంగా వ్యక్తులు, హిందూ యునైటెడ్ కుటుంబాలు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర పాలన సంస్థల బాండ్లు ఉన్నాయి. పెట్టుబడి మొత్తానికి గరిష్ట పరిమితి లేకపోయినా, కనీస డిపాజిట్ రూ. 10,000 చేయాలి.

బాండ్లపై వచ్చే వడ్డీ పై పన్ను విధించబడుతుంది. అయితే బాండ్ మొత్తంపై ఎటువంటి పన్ను ఉండదు. నగదు, రాతపత్రులు, చెక్కుల రూపంలో బాండ్లకు సభ్యత్వాన్ని పొందవచ్చు. మీరు బాండ్లలలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే బాండ్ లెడ్జర్ ఖాతాని ఎంచుకోవచ్చు. ఇది క్రెడిటర్ చే మ్యానువల్ గా ట్రాక్ చేయబడుతుంది. ఏదైనా జాతీయం చేయబడిన బ్యాంకుకు వెళ్లి బాండ్ పొందవచ్చు. బ్యాంకు వారు ఆర్బీఐ తరఫును బాండ్లను జారీ చేస్తారు. మైనర్లకు కూడా బాండ్లను జారీ చేయవచ్చు. కానీ ఇది నామినేషన్ సదుపాయలను అనుమతించదు. ప్రతి నామినేషన్ నిధుల మెరుగైన నిర్వహణ కోసం సంభదిత బాండ్లు జారీ చేసే కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలి.

బాండ్లతో వర్తకం చేయలేము, రుణాలకు హామీగా ఉపయోగించలేము, బాండ్లపై 8 శాతం వరకు వడ్డీ పొందవచ్చు. ఒక వేళ మధ్యవర్తుల ద్వారా బాండ్లలను ఎంచుకోవాలనుకుంటే పెట్టుబడి పెట్టిన ప్రతి రూ. 100 కి రు.1 వారికి చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటీకి మధ్యవర్తి రిజస్టర్ అయి ఉండాలి లేకపోతే వారు జారీ చేసే బాండ్లు చెల్లవు.

3. ఎండోమెంట్ పథకాలు


జీవిత బీమా పథకాల గురించి మనందరికి తెలుసు మరియు ఇవి ఉత్తమ పెట్టుబడి ఎంపికలలో ఒకటి. కానీ మీరు ఎండోమెంట్ పథకాలను తీసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారా..? ఎండోమెంట్ ప్లాన్ అందించే ప్రయోజనాల గురించి మీకు తెలుసా? వీటి గురించి తెలుసుకుందా రండి..

ఎండోమెంట్ పథకం బీమా పథకానికి సమానంగా ఉంటుంది. బీమా పథకం పాలసీదారుని మరణం తర్వాత పెద్ద మొత్తంలో చెల్లింపు చేస్తుంది. అయితే ఎండోమెంట్ పథకం కొంచెం భిన్నంగా ఉంటుంది. పాలసీ మెచ్యురీటి గడువు తీరిన తర్వాత పాలసీదారుడు బ్రతికి ఉంటే వారికి చెల్లింపు జరుగుతుంది. దీనిని వివిధ సంస్థలలో భిన్నమైన పేర్లతో పిలుస్తారు. కొందరు దీనిని ఎండోమెంట్ టర్మ్ ప్లాన్ అని, మరికొందరు మెచ్యూరిటీ టర్మ్ అని పిలుస్తారు. మెచ్యూరిటీ లోపు మీరు ఒక వేళ తీవ్రమైన వ్యాధికి గురైతే దానికి చికిత్సకు సంబంధించిన చెల్లింపు జరుగుతుంది.

ఎడోమెంట్ పథకం యొక్క ప్రయోజనాలు ఏమిటి? రండి తెలుసుకుందాం...

 • ఎండోమెంట్ ప్లాన్ మీకు అవసరమైన బీమా అందస్తుంది.
 • మెచ్యూరిటీ గడువు ముగిసిన తర్వాత ఇది మీకు భారీ మొత్తాన్ని అందిస్తుంది.
 • దీర్ఘకాలిక పెట్టుబడి మరియు బీమా ఈ రెండూ ఒకే చోట లభించే అవకాశం.
 • పన్ను మినహాయింపు ప్రయోజనాలు.
 • మీరు మీ వయసుకు అనుగుణంగా కవరేజీ కూడా పెంచుకోవచ్చు.

ఇది మీరు బ్రతికి ఉన్నప్పుడు కూడా చెల్లింపులను చేసే బీమా పథకం లాంటిది. అంతేకాదు కేవలం సంస్థ మాత్రమే కాకుండా పెట్టుబడి దారు కూడా యూలిప్ ఎంపికల నుండి ఎంచుకోవచ్చు. ఒక వేళ మీరు అధిక రాబడి కోసం ఎదురు చూస్తున్నట్లయితే, మీరు పిపిఎఫ్ లేదా మ్యూచవల్ ఫండ్స్ వంటి ఇతర పెట్టుబడి ఎంపికల కోసం వెళ్లవచ్చు. ఎండోమెంట్ పాలసీలు బీమా పథకాలు లాంటివేనని అర్థం చేసుకోవాలి. ఈ పథకంలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తాని అదనపు రాబడిన పొందే అవకాశం ఉంది.

యూనిట్ లింక్డ్ ఎండోమెంట్, ఫుల్ ఎండోమెంట్ లేదా తక్కువ ధర ఎండోమెంట్ నుంచి ఎంపికలు చేసుకోండి. కాలిక్యులేటర్ కోసం సైన్ అప్ చేయండి, మీ కోసం చాలా డేటా అందుబాటులో ఉంది. పెట్టుబడి మొత్తం, వయసు, పాలసీ వ్యవధి, ప్రీమియం మొత్తం, మెచ్యూరిటీ విలువ, రాబడి అంశాలను పరిగణలోనికి తీసుకుని పథకంపో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిపుణులు మరియు వినియోగదారుల అవసరాల మేరకు వివిధ రకాల పాలసీలను రూపొందిస్తాయి. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఈ పాలసీల రూపకల్పన అనేది జరుగుతుంది. మీరు చేయాల్సిందిల్లా ఈ పలు రకాల పాలసీల నుంచి మీకు సరిగా సరిపోయే పాలసీని ఎంచుకోవడమే. మీరు చేయాల్సిందల్లా ఫోటో, చిరునామా ధృవీకరణ మరియు ఇతర వైద్య నివేదికలు, కేవైసీ సమాచార వివరాలతో దరఖాస్తును పూరించడమే. ఈ పథకాలు సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయుంపు ప్రయోజనాలు అందించడమ కాకుండా, టర్మ్ ఇన్సురెన్స్ మగిసిన తర్వాత ఖచ్చితమైన చెల్లింపులు చేస్తాయి.

4. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్


ఆకర్షణీయమైన వడ్డీ రేటు మరియు పన్ను ఆదా పథకం. జీతం పొందే వారిలో దాదాపు 50 శాతం కంటే ఎక్కువ మంది ఈ పథకాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఒక సురక్షితమైన మరియు నెమ్మది, స్థిరమైన పథకం కోసం మీరు ఎదుచూస్తున్నట్లుయితే... ఇది మీకు సరిగ్గా సరిపోతుంది.

మీ పిపిఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తం ఆదాయపున్ను చట్టంలోని సెక్షన్ 80 కింద అదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి.

ఇది 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి కలిగి ఉన్నప్పటికీ, మెజార్టీ వినియోగదారులు పెట్టుబడి కోసం ఈ పథకాన్ని ఎంచుకుంటున్నారు. పిపిఎఫ్ పెట్టుబడి యొక్క 6 సంవత్సరం నుండి ఉపసంహరణ సదుపాయాలను అనుమతిస్తుంది మరియు ముడు సంవత్సరం నుంచి ఐదవ సంవత్సరం వరకు పెట్టుబడి పై 2 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేటు అందించబడుతుంది. మీ పిపిఎఫ్ ఖాతా చురుకుగా ఉండడానికి సంవత్సరానికి కనీసం రూ. 500 చెల్లించాలి. గరిష్ట పరిమితి రూ. 1.5 లక్షలు. పిపిఎఫ్ సురక్షితమైన పెట్టుబడి మరియు చాలా మంది భారతీయులు ఈ పథకాన్ని పదవీ విరమణ ఎంపికగా భావిస్తారు.

జులై 2017 లో అన్ని పిపిఎఫ్ ఖాతాలపై 7.8 శాతం వడ్డీ రేటు అందించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ప్రతి ఏడాది వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇది 7.10 శాతంగా ఉంది. వడ్డీ రేట్లు తగ్గుతున్నా వినియోగాదారు ఈ పథకాన్ని ఎంచుకోవడానికి కారణం.. దీనిలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం మరియు సురక్షితం మరియు ఈ ఖాతాను తెరవడం చాలా సులభం.

మీరు చేయాల్సిందల్లా మీ బ్యాంకు సమీప శాఖకు వెళ్లి.. మీ పాన్ కార్డ్ యొక్క కాపీ మరియు ఏదైనా చిరుమానా ధృవీకరణ మరియు ఫోటోను జతచేసి దరఖాస్తును పూరించండి. దరఖాస్తులోని సూచనలు ఆధారంగా మీ బ్యాంకు ఖాతాను అనుసంధానించండి. దీని కారణంగా నేరుగా మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతుంది. దరఖాస్తు చేసిన 24 గంటల్లో పిపిఎఫ్ ఖాతా యాక్టివేట్ అవుతుంది.

సాధారణ, సులభమైన, ఇబ్బంది లేని మంచి వడ్డీ రేట్లు, రుణ సదుపాయాలు, మెరుగైన పదవీకాలం పెట్టుబడి ఎంపికలు చేసుకునేటప్పుడు చాలా మంది సురక్షితమైన మరియు ఖచ్చితమైన రాబడి ఇచ్చే పథకాలను ఎంచుకుంటారు. పిపిఎఫ్ ఈ వర్గం కిందకే వస్తుంది.

5. యూనిట్ లింక్డ్ పెట్టుబడి పథకాలు


యూనిట్ లింక్డ్ పథకాలు మెరుగైన పన్ను మినహాయింపు ప్రయోజనాలు అందిస్తాయని చాలా మంది ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అసలు యూలిప్స్ అంటే ఏమిటి ? తెలుసుకుందా రండి..

యూలిప్ ఎలా పని చేస్తుంది? పాలసీదారుగా మీరు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన మీరు ప్రీమియం చెల్లించవచ్చు. ఈ ప్రీమియంలో కొంత భాగాన్ని పాక్షికంగా మీకు కావాలసినంత కాలం బీమా స్వేఛ్చను పొందడానికి ఉపయోగించబడుతుంది. ఇది 5 సంవత్సరాలు కావచ్చు లేదా దశాబ్ద కాలం పాటు కావచ్చు. అలాగే ప్రీమియంలో మిగిలిన భాగాన్ని మ్యూచవల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగిస్తారు. అలాగే పాలసీ కాల వ్యవధిని ఎన్నుకునే పూర్తి హక్కు పాలసీదారునికి ఉంది.

పెట్టుబడి యొక్క భద్రత మరియు రాబడి గురించి మీకు ప్రశ్నలు ఉండవచ్చు. యూలిప్ కోసం సైనప్ చేసేటప్పుడు పెట్టుబడిదారులు మ్యూచవల్ ఫండ్స్ ఎంపిక చేసుకోవచ్చు. మీకు తక్కువ ఫ్రొఫైల్ రిస్క్ కావాలంటే డెట్ ఫండ్ ను ఎంచుకోండి లేదా మార్కెట్ ప్రమాణాలతో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈక్వీటీ ఫండ్స్ ఎంచుకోండి. ఈక్వీటీ ఫండ్స్ అత్యధిక రాబడిని అందిస్తాయనడంలో సందేహం లేదు అయితే ఇందులో రిస్క్ కూడా అత్యధికంగానే ఉంటుంది.

పన్ను పొదుపు విధానాల విషయానికి వస్తే, పెట్టుబడి మొత్తంలో 10 శాతం మొత్తానికి పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. కాబట్టి మీరు రూ. 10,000 పెట్టుబడి పెట్టాలనుకుంటే, సెక్షన్ 80 సి కింద రూ. 1000 పన్ను మినహాయింపు లభిస్తుంది.

6. జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం


పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు చాలా కాలం క్రితం మరుగున పడిపోయాయి. అయితే ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ పథకాలపై పెట్టుబడిదారుల్లో ఆసక్తి పెరుగుతుంది. మీరు పోస్ట్ ఆఫీస్ అందించే పథకాల్లో పెట్టుబడులు పెట్టినప్పుడు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ పేపర్ ఆధారిత డిపాజిట్ పోస్ట్ ఆఫీసులచే ఇవ్వబడుతుంది. ఇది పెట్టుబడి ఎంపిక మాత్రమే కాదు, ట్యాక్స్ సేవింగ్ పత్రం కూడా.

భారత ప్రభుత్వం జారీ చేసిన డినామినేషన్లలో లభ్యమయ్యే వివిధ దృవపత్రాలు ఉన్నాయి. కాబట్టి వినియోగదారుడు తన అవసరాలకు అనుగుణంగా డిమానినేషన్ ను ఎంచుకోవచ్చు. 8 శాతం అధిక వడ్డీ రేటు వద్ద ఎన్ NCS రెండు వేర్వేరు రూపాల్లో వస్తుంది. NCS ఇష్యూ VII మరియు X వేటి ప్రయోజనాలు అవి కలిగి ఉన్నాయి.

ఇష్యూ VII ను HUF మరియు ట్రస్ట్ లు మినహా అందరూ పొందవచ్చు. 100 నుండి 10000 వరకు ఉన్న తెగలలో లభిస్తుంది. ఇవి 5 సంవత్సరాల కాల వ్యవధి చివరిల పరిపక్వం చెందుతాయి. మరో వైపు ఇష్యూ IX కు 10 సంవత్సరాల మెచ్యూరిటీ టర్మ్ ఉంది. రూ. 100 కనీస పెట్టుబడితో, పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు.

భారతీయులు, హిందూ యునైటెడ్ కుటుంబాలు మరియు ట్రస్టులు ప్రజాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా ఎన్ఎస్పిఎస్ కొనడానికి అర్హత లేదు. మైనర్ల పేరిట ఎన్ఎస్ సిఎస్ కొనుగోలు చేయవచ్చు. ఈ పెట్టుబడికి ముందస్తు ఉపసంహరణ అనుమతించబడదు, కానీ నామినీని ఎంచుకునే సౌలభ్యం ఉంది.

ఎన్ఎస్ సి అనేది లాభదాయకమైన ఒక ఒప్పందంగా చెప్పుకోవచ్చు. పాలసీ చివరి సంవత్సరం పన్ను రహితంగా ఉంటుంది. గరిష్ట పెట్టుబడి మొత్తానికి ఎటువంటి పరిమితి లేదు మరియు పెట్టుబడి పై రుణాల పొందే సౌలభ్యం ఉంది.

7. జాతీయ పెన్షన్ పథకం


సంవత్సరానికి రూ. 6000 రూపాయలు నామమాత్రపు పెట్టుబడితో మీరు చక్కటి రిటైర్మెంట్ ప్లాన్ ను పొందవచ్చు. జాతీయ పెన్షన్ పథకం ఈ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇది దేశంలో తక్కువ అంచనా కలిగిన పెట్టుబడి ఎంపికలలో ఒకటి.

 ఇది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని ప్రారంభంలో నిర్ణయించినప్పటికీ, తర్వాత పౌరులందరికీ వర్తింపజేశారు. అటు తర్వాత ఇది ప్రజాదరణ పొందింది.

ఇది రెండు రకాల ఖాతాలలో లభిస్తుందని మీకు తెలుసా..?

టైర్ 1 ఖాతా

ఇది సాధారణ పెన్షన్ ఖాతా. ఇది పాలసీ హోల్డర్ ఖాత నుంచి ఉపసంహరణనను పరిమితం చేసినప్పటికీ, వివిధ నిబంధనలు మరియు షరతుల క్రింద 20 శాతం మొత్తాన్ని డ్రా చేసుకోవడానికి అనుమతినిస్తాయి. మిగిలిన మొత్తం జీవిత బీమా సంస్థ నుండి యాన్యూటీని కొనుగోలు చేయవచ్చు.

పాలసీదారుడు మరణించే లేదా మెచ్యూరిటీ గడువు ముగిసిన తర్వాత హామీ ఇచ్చిన మొత్తం లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, పాలసీదారుడుకి అరవై ఏళ్ల వయసు వచ్చిన తర్వాత పెట్టుబడి మొత్తంలో 60 శాతం వరకు ఉపసంహరించుకునే అధికారం పాలసీదారుని ఉంది. మిగిలిన మొత్తం బీమా సంస్థ వద్ద ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ మొత్తం పదవీవిరమణ కోసం ఉద్దేశించబడినది. ఇది ఉపసంహరణకు అనుమతించబడదు.

టైర్ 2 ఖాతా

లావా దేవీలను సులభతరం చేయడానికి టైర్ 2 ఖాతాలు ప్రవేశపెట్టడం జరిగింది. స్వచ్ఛంజ పొదుపు ఖాతా నుంచి అపరిమితంగా ఉపసంహరించుకోవడానికి ఇది అనుమతిస్తుంది, ఇది ఏమైనా పన్ను మినహాయింపుకు అర్హత లేకపోయినా, ఈ ఖాతా ప్రతి సంవత్సరం చివరిలో నిర్వహించడానికి కనీసం రూ. 2000 బ్యాలెన్స్ అవసరం. అంతేకాకుండా, మీరు ఎన్ పిఎస్ నుంచి చాలా అదనపు ప్రయోజనాలు పొందుతారు. ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

పన్ను ప్రయోజనాలు పొందండి

పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఎన్ పిఎస్ అందుబాటులో ఉంది. సెక్షన్ 80 సి కింద రూ. 1,50,000 వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఇటీవల చాలా మంది ఎంక్వైరీ చేసిన పథకాల్లో ఎన్ పిఎస్ మొదటి స్థానంలో నిలిచింది.

సరళమైన మధ్యవర్తిత్వ రుసములు

మీ ఎన్ పిఎస్ ను నిర్వహించే ఫండ్ నిర్వహకులు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీజును 0.25 శాతానికి పెంచారు. ప్రారంభంలో ఇది 0.10 శాతంగా ఉండేది. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 100 గా ఉంది. మీ పెట్టుబడి మొత్తం ఆధారంగా రూ. 20 నుంచి, రూ. 25,000 వరకు అప్ లోడ్ ఫీజు అప్ లోడ్ సహకరించవచ్చు. అదనంగా రూ. 20 సేవా ఛార్జీ వసూలు చేయబడుతుంది.

మెచ్యూరిటీపై పన్ను

ఎన్ పిఎస్ నిధులను డైరెక్ట్ ట్యాక్స్ కోడ్స్ ద్వారా ఉపసంహరణపై పన్ను నుండి మినహాయించారు. అయినప్పటికీ పన్ను నిర్వహణకు సంబంధించి అస్పష్టత ఇప్పటికీ ఉంది. ఈక్విటీల మార్కెట్ లో ఎన్ పిఎస్ దీర్ఘకాలంలో ఇతర పెట్టుబడి ఎంపికల కంటే మెరుగైన పనితీరు కనబరిచింది.

8. పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్స్


అన్ని కఠినమైన సమయాల్లో అత్యుత్తమ రాబడిని అందించి, ఉత్తమ పెట్టుబడి పథకంగా వినియోగదారుల విశ్వాశాన్ని చూరగొన్న సంస్థ ఈఎస్ఎస్ఎల్ లేదా ఈక్వీటి లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ లు. వీటిని ఉత్తమ పన్ను ఆదా మ్యూచవల్ ఫండ్ లు గా చెప్పుకోవచ్చు. అంతే కాకుండా అధిక వడ్డీ రేటుతో చెల్లింపు చేస్తుంది మరియు అదనపు పన్నును ఆదా చేయడానికి మీకు సహాయపడుతుంది.

 రాబడిలో హెచ్చు తగ్గులు ఉన్నా, రాబడి గురించి ఖచ్చితమైన హామీ ఇవ్వకపోయినా మీరు కొంచెం రిస్క్ తీసుకుని పెట్టుబడి చేయవచ్చు. అతి తక్కువ లాక్- ఇన్ పిరియడ్, కేవలం మూడ సంవత్సరాలు మాత్రమే లాక్ ఇన్ పిరియడ్. ఈఎస్ఎస్ఎల్ కింద పెట్టుబడి పెట్టబడిన మొత్తం పన్ను రహితమైనది. వన్ టైమ్ పెట్టుబడి పథకానికి బదులుగా ఈ ప్రత్యేక పెట్టుబడి ప్రణాళిక నుండి గరిష్ట ప్రయోజనాలు పొందడానికి సిప్ ని అనుమతించే పథకాన్ని కొనుగోలు చేయండి.

ఏదేమైనా మీ పిల్లల వివాహం వంటి దీర్ఘకాలిక ప్రణాళికల కోసం, వారి విద్యకు నిధులు సమకూర్చడం వంటి వాటికి తక్కువ వ్యవధిలో భారీ మొత్తంలో అవసరం ఏర్పడుతుంది. అధిక రాబడికి హామీ ఇచ్చే డైవర్సిఫైడ్ పోర్ట్ ఫోలియో ద్వారా ఈ అవసరాలకు సరిపడా సొమ్ము తగిన సమయంలో మీ చేతికి అందే అవకాశముంది.

పన్ను అధారిత ప్రణాళికలతో వ్యవహరించేటప్పుడు మ్యూచల్ ఫండ్లను దీర్ఘకాలిక భద్రతా వలయంగా పరిగణించవచ్చు. ఈక్వీటి లింక్డ్ సేవింగ్స్ ఫండ్స్ ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 80 సి కింద పన్ను ప్రయోజనాలు అందిస్తాయి. ఈ కారణంగానే చాలా మంది వినియోగదారులు దీనిని ఎంచుకుంటున్నారు.

9. మ్యూచువల్ ఫండ్స్


మ్యూచవల్ ఫండ్స్ నిస్సందేహంగా ఇటీవల కాలంలో ఎక్కువ ప్రచారం జరిగిన పెట్టుబడి పథకాలు. కారు కొనాలనుకుంటున్నారా? అయితే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టండి అని నవ్వుతూ అంకుల్ చెప్పే సమాధానం . ఈ ప్రకటన తరచూ మనం టెలివిజన్ లో చూస్తూనే ఉంటాం. విదేశాల్లో టూర్ కి ప్లాన్ చేస్తున్నారా? మీ స్నేహితుల్లాగా సాహస యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? వీటన్నంటికి మ్యూచువల్ ఫండ్స్ మీకు ప్రస్తుతం ఉన్న ఉత్తమ పరిష్కారంగా చెప్పుకోవచ్చు.

అన్ని రకాల పెట్టుబడుల కంటే సురక్షితమైన మరియు ఖచ్చితమైన నిర్దేశిత రాబడి, బహుళ ప్రణాళికసు మరియు పథకాలను మ్యూచువల్ ఫండ్స్ అందిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఇది అంతగా ప్రాచుర్యం పొందకపోయినా, చాలా మంది నవతరం పెట్టుబడిదారులు వేర్వేరు పెట్టుబడి పథకాలు మరియు వాటి రాబడుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం గమనార్హం. రిస్క్ మరియు డబ్బు పోతుందనే భయం ఈ పెట్టుబడి పథకంలో ఉండదు. మీరు పెట్టుబడి ప్రారంభించిన తర్వాత ఇది నిజంగా సరదాగా మరియు ఉల్లాసంగా ఉంటుంది.

ఈక్వీటిలు

రిస్క్ పరంగా అగ్ర స్థానంలో ఉన్నప్పటికీ, మ్యూచువల్ ఫండ్ కాలిక్యూలేటర్లు ఇప్పటికీ ఈక్వీటీలను సిఫార్సు చేస్తాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఈక్వీటీల క్రింద జాబిచా చేయబడ్డాయి మరియు ఇవి ఒపెన్ ఎండ్ స్కీమ్స్.

బ్యాలెన్స్డ్ ఫండ్స్

ఈక్వీటీలు మరియు డెబిట్ కలయికే సమతుల్య నిధులు. ఒక పెట్టుబడిదారుడు ఒక నిర్దిష్ట ఫండ్ తో సాహోసోపేతంగా పెట్టుబడులు పెడుతూ అధిక రాబడులు పొందాలని చూస్తాడు. కానీ ఈ పెట్టుబడి సురక్షితంగా ఉండాలంటే సమత్యుల ఎంపికలను ఎంచుకోవచ్చు. 

ఇది నిధులను హెడ్జింగ్ చేయడం వల్ల లాభాలు మరియు నష్టాలను సమతుల్యం చేస్తుంది మరియు పెట్టుబడిదారులకు అధిక రాబడిని అందిస్తుంది. స్మార్ట్ గా ఉండండి, సరైన ఎంపికలను చేసుకోండి.

డెబిట్ ఫండ్స్

ఫిక్సిడ్ డిపాజిట్ల కోసం ఒక ప్రత్యామ్నాయ ఎంపిక, తక్కువ రిస్క్ ప్రొఫైల్ నిర్వహించాలనుకుంటే మ్యూచవల్ ఫండ్స్ లో డెబిట్ ఫండ్స్ చక్కని ఎంపిక. ఇది చాలా సురక్షితమైనది మరియు ఖచ్చితమైన పెట్టుబడి అందిస్తుంది. మీ సంపదను ఇది వృద్ధి చేస్తుంది.

బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్వీటీ ఫండ్

పెట్టుబడిదారుల్లో ఇది ప్రాచుర్యం పొందిన పథకం. పెద్ద క్యాప్ ఓపెన్- ఎండ్ గ్రోత్ ఫండ్ తో పోర్ట్ ఫోలియో చాలా వైవిధ్యమైనది. రూ. 1000 తో పెట్టుబడి ప్రారంభించవచ్చు. అగ్రశ్రేణి మార్కెట్ పనితీరు మరియు దీర్ఘకాలిక మెరుగైన రాబడి ఆధారంగా మరింత లాభదాయకమైన నిధిగా మారుతుంది. ఒకేసారి పెట్టుబడి పెట్టడం లేదా సిప్ మోడల్ లో పెట్టుబడి పెట్టవచ్చు. నిర్ణయం మీదే.

అవకాశాల నిధి

పెట్టుబడి పెట్టడానికి అనేక అవకాశాలున్నాయి. కనీస పెట్టుబడి రూ. 5000 తో ప్రారంభించండి. పెద్ద క్యాప్ ఫండ్లలో, మీరు కోరుకున్న ఫండ్లలలో పెట్టుబడి పెట్టండి.

మీ లక్ష్యం సంపందను కూడబెట్టడం అయితే ముందుకు సాగండి మరియు డెబిట్ మ్యూచువల్ ఫండ్స్ వంటి సంపద వృద్ధి ప్రణాళికలో పెట్టుబడి పెట్టండి. వాణిజ్య బాండ్లు, సెక్యూరిటీలు మరియు పేపర్లు యొక్క వైవిధ్య భరితమైన పోర్ట్ ఫోలియోను కలిగి ఉన్నట్లు చెప్పబడింది. ఇక్కడ రాబడి మార్కెట్ పనితీరు ఆధారంగా నిర్వహించబడుతుంది. మెరిగైన ఫలితాల కోసం పెట్టుబడి పెట్టడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక, హైబ్రిడ్ నిధుల కలయికను ఎంచుకోండి.

వినియోగదారుల యొక్క ఆర్థిక లక్ష్యాలను పరిగణలోనికి తీసుకుని అనేక ఆర్థిక సంస్థలు వినియోగదారుల అవసరాల మేరకు పథకాలను అందిస్తున్నాయి. వినియోగదారు కేందీకృత వైఖరిని కలిగి ఉండటంతో పాటు నమ్మదగిన సంస్థను, పథకాన్ని ఎంచుకోవడం ముఖ్యం.

ఫండ్ నిర్వహణకు అనుభవం మరియు నైపుణ్యం అవసరం. మీ డబ్బును జాగ్రత్తగా చూసుకోగల తెలివైన మరియు ప్రతిభావంతులైన ఆర్థిక నిర్వహకులను ఎంచుకోండి.

పెట్టుబడి పథకాలను ఎందుకు సరిపోల్చాలి?

మార్కెట్ అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీ అవసరానికి తగిన విధంగా మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.  ఇన్ని ఆఫర్లు మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తాయి. ఈ కారణంగా ఏది ఉత్తమ పెట్టుబడి పథకం మరి మీరు ఎంచుకున్న దాన్ని అర్థం చేసుకోవడం మీకు కష్టమవుతుంది. పెట్టుబడి అనేది ఒక వ్యక్తి యొక్క నిధులతో మరిన్ని నిధులను సంపాదించే మార్గం. తప్పుడు ఎంపిక మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. అందుకే పథకాన్ని ఎంచుకునే ముందు సరిపోల్చడం తప్పని సరి. దీని వల్ల మీరు అన్నిటికన్నా ఉత్తమమైన ప్రణాళికలను పొందగలుగుతారు.

ఆన్ లైన్ లో పెట్టుబడి పథకాలను సరిపోల్చడం వల్ల మీ పెట్టుబడి అవసరాలకు సంబంధించిన సందేహాలు మరియు గందరగోళాలు పరిష్కారం అవుతాయి. అలాగే ఉత్తమ ప్రణాళికలు ఎంచుకోవడం మీకు సులభం అవుతుంది. ఒకే పేజీలో అనేక ఎంపికలను పొందుతారు. ఇక్కడ మీరు థీ పెస్టివల్స్, బెర్ ఫిట్స్, డైట్రాట్రేజ్ మరియు ఇతర ధరలను పోల్చవచ్చు. సమయానికి రాబడిని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ఉత్తమ ప్రణాళిక ఎంచుకని మంచి రాబడిని పొందండి.

పెట్టుబడి పథకాల ప్రాముఖ్యత

ఆర్థిక రక్షణ

 పిల్లల వివాహం, విద్య మొదలైన మీ స్వల్ప మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను ప్రణాళిక బద్ధంగా నేరవేర్చవచ్చు.

మంచి రాబడి

ఇతర పథకాలతో పోల్చితే, పెట్టుబడి ప్రణాళిక పై రాబడి అధికంగా ఉంటుంది.

పన్ను ప్రయోజనాలు

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద మీ పెట్టుబడి మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే మెచ్యూరిటీ మొత్తంపై సెక్షన్ 10(10)డి కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

రైడర్స్ ప్రయోజనాలు

క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్, ప్రీమియం మినహాయింపు మొదలైన రైడర్స్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు.

లోన్

మీకు తర్వాతి దశలో డబ్బు అవసరమైతే మీరు పెట్టుబడులపై రుణం పొందవచ్చు. వడ్డీ రేటు సంస్థ నుండి సంస్థ కు భిన్నంగా ఉంటుంది.

ద్వంద్వ ప్రయోజనాలు

భవిష్యత్ అవసరాలకు మీ డబ్బును ఆదా చేయడం మరియు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీ సంపదను పెంచుకోవడం వంటి ప్రయోజనాలు పొందుతారు.

భారతదేశంలో పెట్టుబడి పథకాలు

స్వల్పకాలిక పథకాలు

సాధారణంగా 1 సంవత్సరానికి పెట్టుబడి పెడితే దానిని స్వల్పకాలిక పెట్టుబడి పథకంగా పరిగణిస్తారు. ఒక సంవత్సరం కంటే ఎక్కువుగా పెట్టుబడి పెడితే దానిని దీర్ఘకాలిక ప్రణాళికగా పరిగణిస్తారు. ఉదాహరణ – టర్మ్ ప్లాన్. పొదుపు ఖాతాలు, బంగారం, బ్యాంకు డిపాజిట్లు, ట్రైజరీ, లార్డ్ కాప్ మ్యూచవల్ ఫండ్స్, స్టార్ మార్కెట్లు డెరివేటివ్స్, మనీ మార్కెట్ అంకౌంట్, ఫెడ్ మెచ్యూరిటీ వంటి వాటిని స్వల్పకాలిక పెట్టుబడి పథకాలుగా చెప్పుకోవచ్చు. మీ అవసరాలకు తగిన విధంగా ఈ స్వల్ప కాలిక పథకాలను ఎంచుకోవచ్చు.

దీర్ఘకాలిక పథకాలు

1 లేదా 2 సంవత్సరాలకు మించి ఉన్న పెట్టుబడి పథకాలను దీర్ఘకాలిక పథకాలుగా పరిగణిస్తారు. నిర్ణీత కాల వ్యవధి కలిగి ఉన్న పెట్టుబడులు అన్ని దీర్ఘకాలిక పెట్టుబడులుగా పరిగణించబడతాయి. ఈ రకమైన పెట్టుబడి పథకాలు అధిక వడ్డీ రేటుతో అధిక రాబడిని అందిస్తాయి. స్వల్పకాలిక పెట్టుబడుల ప్రణాళికల మాదిరిగానే, ఈ వర్గంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా పిపిఎఫ్, మ్యూచవల్ ఫండ్, ఈక్వీటి లేదా షేర్ పర్చేజ్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్, కంపెనీ ఫిక్సిడ్ డిపాజిట్లు, ఇన్వెస్ట్ మెంట్ వంటి అనేక ప్రణాళికలు ఉన్నాయి. ఆకర్షణీయమైన ఐపీఓ మరియు యూలిప్స్ లలో పెట్టుబడులు పెట్టవచ్చు.

చైల్డ్ పెట్టుబడి పథకాలు

చైల్డ్ పెట్టుబడి ప్రణాళికలు కూడా చాలా ప్రాచుర్యం పొందాయి. మీ పిల్లల భవిష్యత్తుకు అవసరమైన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో ఈ పథకాలు మీకు సహాయపడే గొప్ప ఆర్థిక కవరేజీని అందిస్తాయి. దీంతో మీరు మీ పిల్లల విద్యా, వివాహ ఖర్చులు మరియు ఆరోగ్య ఖర్చులను కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఇది మీ పిల్లల జీవితంలోని వివిధ దశలలో అవసరమయ్యే ఖర్చులకు డబ్బు అందించే గొప్ప పెట్టుబడి.

పదవీ విరమణ పెట్టుబడి

ప్రణాళిక మీకు గొప్ప కవరేజీ అందించే పెట్టుబడి. ఇది మీ పదవీ విరమణ అనంతర జీవితాన్ని ఆస్వాదించడంలో మీకు సహాయపడుతుంది. పదవీ విరమణ పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు మీ భవిష్యత్తుకు బీమాతో పాటు ధీమా ఇస్తున్నట్లే. ఇది వృద్ధాప్యంలో మీకు అవసరమైనప్పుడు గొప్ప కవరేజీని అందించే పెట్టుబడి. ఈ కారణంగా మీ ఖర్చులన్నింటి కోసం మీరు ఎవరి పై ఆధారపడాల్సిన అవసరం లేదు.

పెట్టుబడి ప్లానింగ్ చేసేముందు పరిగణించాల్సిన అంశాలు

పెట్టుబడి ఉద్దేశం

సాధరణంగా ప్రజలు ఏదో ఒక ఉద్దేశంతో పెట్టుబడి పెడతారు. మీరు ఎందుకోసం పెట్టుబడి పెడుతున్నారు అనేది దానిపై స్పష్టత కలిగి ఉండాలి. మీ ఉద్దేశం స్పష్టంగా ఉంటే అందుకు తగిన పెట్టుబడి ప్రణాళికను మీరు ఎంచుకునే అవకాశం ఉంది.

ఫండ్ హౌస్ కు వివరాలు సమర్పించండి

ఫండ్ హౌస్ మీ పెట్టుబడుల నిర్వహణను చూసుకుంటుంది. కాబట్టి అవసమైన అన్ని వివరాలను ఫండ్ హౌస్ కు సమర్పించండి.

పనితీరును గమనిచండి

పెట్టుబడి అంతిమ ప్రయోజనం రాబడి. అధిక రాబడి పొందాలంటే మీ ఫండ్ పని తీరును ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అవసరం ఉంది. పెట్టుబడిదారులు కొంత దశలో ఫండ్ ద్వారా వచ్చిన రాబడిని చూడాలి మరియు వాటిని బెంచ్ మార్క్ తో పోల్చాలి. ఈక్వీటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే, దీర్ఘకాలిక పనితీరు పరిశీలించండి, అదే సమయంలో డెబిట్ ఫండ్స్ కోసం స్వల్ప కాలం నుంచి మధ్యస్థ కాలం వచ్చిన రాబడిని పరిశీలించవచ్చు.

ఛార్జీలు

చిన్న ఛార్డీలు దీర్ఘకాలంలో రాబడిపై పెద్ద ప్రభావాన్ని చూపవచ్చు. 10 సంవత్సరాల పొడిగింపు వ్యవధిలో సాధారణ ధరలో 0.50 శాతం వ్యత్యాసం భారీ వత్యాసాన్ని కలిగిస్తుంది.

అయినప్పటికీ, పెట్టుబడి పెట్టడానికి ముందు చాలా మంది ఫండ్ హౌస్ పెట్టుబడి నిష్పత్తి గురించి చూడరు. పెట్టుబడి పెట్టే ముందు ఈ నిష్పత్తి చూడాలి.

ఫండ్ మేనేజర్ గురించి పరిశోధన చేయండి

సరైన ఫండ్ మేనేజర్ ని గుర్తించడం చాలా అవసరం. అతను నిర్వహించే ధరల శ్రేణి యొక్క మొత్తం పనితీరును విశ్లేషించండి. ప్రత్యేకించి మార్కెట్ కష్ట సమయాల్లో మీ ఫండ్ మేనేజర్ పనితీరు ఎలా ఉంది అనేది తెలుసుకోవడం అత్యవసరం.

ఉత్తమ పెట్టుబడి పథకాన్ని ఎలా ఎంచుకోవాలి & ఆన్లైన్ లో ఎలా కొనుగోలు చేయాలి?

ఈ రోజుల్లో మీకు మంచి రాబడిని హామీ ఇచ్చే అనేక సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు అనేక ప్రయోజనాలు కలిగిన ప్రణాళికలను సైతం అందిస్తున్నాయి. వీటిలో మీ అవసరాలకు అనుగుణంగా ఉత్తమ పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అయితే పథకాన్ని ఎంచుకునే ముందు ఆన్లైన్ లో సరిపోల్చడం మంచిది. సరిపోల్చడం వల్ల వివిధ పకథాల నుంచి మీరు ఉత్తమ పథకాన్ని ఎంచుకునే అవకాశం కలుగుతుంది. అటు తర్వాత అధిక రాబడిని పొందుతారు. మీ ఇంటి నుంచే సులభంగా ఆన్లైన్ లో ఉత్తమ పెట్టుబడి ఎంపికను చేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ ఆన్లైన్ పోర్టల్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఆన్లైన్ పోర్టల్ లో కోటేషన్లను పోల్చడం ద్వారా మీ అవసరాలకు తగిన పథకాన్ని సులభంగా పొందుతారు. మీరు అధిక రాబడి పొందాలంటే సరైన పథకంలో పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. ఆన్లైన్ కొనుగోలు చేయడం ద్వారా మీ డబ్బుతో పాటు టైమ్ కూడా సేవ్ అవుతుంది.

ఉత్తమ పెట్టుబడి పథకాన్ని ఎంచుకునేందుకు చిట్కాలు

ఉత్తమ పెట్టుబడి పథకాన్ని ఎంచుకోవడం ఒక ముఖ్యమైన అంశం. ఇది మీ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఒక పెట్టుబడిదారుడిగా, మీరు పెట్టుబడి పథకంలో ముడిపడి ఉన్న అన్ని నష్టాలను భరించాలి. అందువల్ల మీరు సరైన మరియు తెలివైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడి కాకుండా మీరు తగినన్ని నిధులు విడిగా కలిగి ఉండి మరియు అధిక రాబడిని కలిగి ఉంటాయి. క్రమబద్ధ ఆదాయం లేకపోతే మీరు రిస్క్ ఉన్న పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టకపోవడమే మంచింది. ఇవి మీకు సమస్యలు కలిగిస్తాయి.

పెట్టుబడి పథకాలతో ముడిపడి ఉన్న అన్ని నిబంధనలు, నియమాలను ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలి. పూర్తిగా సురక్షితమైన పెట్టుబడి ప్రణాళిక ఏదీ లేదు. ప్రమాదస్థాయి అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.

రాబడి మరియు రిస్క్ ఎల్లప్పుడూ సమాంతర స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి. రిస్క్ ఎంత ఎక్కువగా ఉంటే రాబడి కూడా అంతే అధికంగా ఉంటుంది.

మీరు ముందు పథకాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి, తరువాత పథకాన్ని కొనుగోలు చేయాలి.

మీరు చేయాలనుకుంటున్న అత్యంత ప్రభావవంతమైన అంశం నిధుల ముందు ఒక లక్ష్యాన్ని ఉంచడం. ఇది ఖచ్చితంగా ఏమిటి మరియు మీ పెట్టుబడి ద్వారా మీరు ఏమీ పొందాలనుకుంటున్నారు? ఏదైనా పెట్టుబడి ఎంపిక చేయడానికి ముందు సమాధానం ఇవ్వవలసిన ప్రశ్న. దీనికి సమాధానం దొరికితే మీకు పరిష్కారం దొరికినట్లే. కొంత మంది ప్రయోజనాలు కోసం, మరికొంత మంద తమ లక్ష్యాల చేరుకోవడం కోసం పెట్టుబడి పథకాలను ఎంచుకుంటారు. ఏ ప్రయోజనం కోసం పెట్టుబడి పథకాన్ని ఎంచుకోవచ్చు అనే అంశాన్ని క్రింద ఇవ్వడం జరిగింది పరిశీలించండి.

రక్షణ

పెట్టుబడి పథకాన్ని ఎంచుకున్నప్పుడు ప్రామాణికమైన నిధులతో సంబంధం ఉన్న ముప్పు కనిష్టంగా ఉండాలని అతను/ ఆమె కోరుకుంటారు. మంచి రాబడి లేకపోయినా పెట్టుబడి రక్షణ అనేది గరిష్టంగా ఉంటుంది.

ఆదాయం

ఈ రకమైన నిధులపై, కొంత సాధారణ చెల్లింపు ద్వారా వ్యక్తి తన పెట్టుబడి ద్వారా ఆదాయ ప్రవాహంతో స్థిరంగా వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈ సందర్భంలో పెట్టుబడిలో తగ్గుదల ఉండవచ్చు లేదా లేకపోవచ్చు.

పెరుగుదల

ఇక్కడ దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే ఇక్కడ రిస్క్ కూడా అధికంగానే ఉంటుంది. పెట్టుబడి పెట్టిన మొత్తానికి డివిడెండ్ పొందవచ్చు.

మీరు రాబడి మరియు రిస్క్ రెండిటిని సమతుల్యం చేసుకోవాలి. అంటే మీ వద్ద రూ. 100 ఉంటే, పెట్టుబడుల రక్షణకు రూ. 60, ఆదాయానికి రూ. 20, వృద్ధికి రూ. 10, మార్కెట్ అటుపోట్లు రూ. 10 గా నిర్ణయించుకోండి.

గుర్తుచుకోవాల్సిన అంశాలు

 • మీ వద్ద మొత్తం డబ్బుని పెట్టుబడి పెట్టవద్దు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఎదుర్కోవడానికి కొంత మొత్తాన్ని చేతిలో ఎంచుకోవాలి. 
 • ఫండ్ ఎంపికలను ఎన్నుకోవడంలో మిమ్మల్ని మీరు తుది ఎంపికదారుగా విశ్వసించుకోండి.
 • ప్రొఫెషనల్ మరియు ధృవీకరించబడిన సలహాదారు నుంచి సలహా తీసుకోండి.
 • ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందు దాని ట్రాక్ రికార్డ్ చూడండి.
 • అధిక రాబడులను చూసి పెట్టుబడి పెట్టవద్దు, పెట్టుబడి పెట్టడానికి ముందు దాని కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి.
 • ఎక్కడినుంచో సేకరించిన సమాచారంతో పెట్టుబడిని ఎంచుకోవద్దు, తెలియని వ్యక్తులను సూచనల మేరకు పెట్టుబడి పథకాలను ఎంచుకోవద్దు.

ఆన్లైన్ లో పెట్టుబడి పథకాలు కొనుగోలు చేయడానికి అవసరమైన పత్రాలు

వయసు ధృవీకరణ: జనన ధృవీకరణ పత్రం, 10 లేదా 12 వ తరగతి మార్క్ షీట్ , డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, ఓటర్ ఐడి, మొదలైనవి

గుర్తింపు ధృవీకరణ: డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్. ఆధార్ కార్డ్, పౌరసత్వాన్ని రుజువు చేసే ఏదైనా పత్రం

ఆదాయ ధృవీకరణ: బీమా కొనుగోలు చేసే వ్యక్తి యొక్క ఆదాయాన్ని తెలియజేసేలా ఆదాయ ధృవీకరణ పత్రం

చిరునామా ధృవీకరణ: విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, శాశ్వత చిరుమానా స్పష్టంగా ఉండాలి

కొనుగోలు ప్రక్రియ

 • కొనుగోలు చేయడంలో మీకు ఇబ్బంది లేని ప్రక్రియ.
 • ఇది మీ సమయాన్ని మరియు డబ్బును కూడా ఆదా చేస్తుంది.
 • సులభమైన ప్రక్రియ, ఉత్తమ బీమా పథకాలను ఎంచుకోవడానికి కొన్ని ప్రాథమిక వివరాలు నమోదు చేయండి.
 • అగ్ర బీమా సంస్థలు అందించే ప్రణాళికలను పోల్చండి policy.com ద్వారా మీ అవసరాలకు తగిన పథకాన్ని ఎంచుకోండి.
 • ప్రపోజల్ ఫారంలో ప్రాథమిక వివరాలను పూరించండి.
 • మీ పత్రాలను ఆన్లైన్ అప్ లోడ్ చేయండి. ఎంచుకున్న మోడ్ ద్వారా చెల్లింపు చేయండి.