లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)
 • అధిక జీవిత బీమా కవర్
 • తక్కువ ప్రీమియం ప్రణాళికలు
 • పన్ను ప్రయోజనాలు
PX step

ప్రీమియం పోల్చండి

1

2

ఫోన్ నం.
పేరు
పుట్టినరోజు

1

2

ఆదాయం
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ of India), 245 బీమా కంపెనీలు మరియు ప్రావిడెంట్ సొసైటీలతో, భారతదేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ. ఇది 1956 లో స్థాపించబడి, ముంబై ప్రధానకేంద్రంగా పనిచేస్తోంది. ఇప్పుడు ఈ సంస్థ 63 సంవత్సరాలు పూర్తి చేసుకొని, ఎటువంటి ఆకాంక్షలతో స్థాపించబడిందో, వాటిని అందుకొని సగర్వంగా నిలబడి ఉంది. ఎల్ఐసీ ఆఫ్ ఇండియా సంస్థ, 8 జోనల్ కార్యాలయాలను, 113 డివిజనల్ కార్యాలయాలను, 2000 కు పైగా బ్రాంచీలను, 15,37,064 సాధారణ ఏజెంట్లను, 342 కార్పోరేట్ ఏజెంట్లను, 109 రెఫరల్ ఏజెంట్లను, 114 బ్రోకర్లను మరియు 42 బ్యాంకులను కలిగి ఉంది.

ఎల్ఐసీ : పథకాల రకాలు

ఎల్ఐసీ వివిధ రకాల వ్యక్తుల అవసరాలకు సరిపడేలా విస్తృతమైన మరియు లోతైన పథకాల జాబితాను కలిగి ఉంది. ఈ పథకాలు వ్యక్తుల పలు రకాల ప్రయోజనాలను, ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని తయారు చేయబడిన ఫీచర్లను కలిగి ఉంటాయి. ఈ పథకాలను వివరంగా పరిశీలిద్దాం -

1. ఎల్ఐసీ ఎండోమెంట్ పథకాలు


ఒక ఎండోమెంట్ పాలసీ అనేది, మెచ్యూరిటీ కాలవ్యవధి తర్వాత లేదా మరణం తర్వాత పెద్ద మొత్తాన్ని అందించే ఒక జీవిత బీమా ఒప్పందం. ఈ మెచ్యూరిటీ సంవత్సరాలు, ఒక నిర్దిష్ట వయసు పరిమితి వరకు పది, పదిహేను లేదా ఇరవై సంవత్సరాలుగా ఉంటాయి. కొన్ని పాలసీలు తీవ్ర అనారోగ్య సమయంలో కూడా చెల్లింపు చేస్తాయి.

 1. ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ (ప్లాన్ నం: 915, UIN: 512N279V02)

ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్, పొదుపును మరియు రక్షణను కలిగి ఉండే ఒక పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ పథకం. బీమా చేయించుకున్న వ్యక్తి మెచ్యూరిటీ లోపు మరణించిన పక్షంలో, తన కుటుంబానికి ఆర్థిక సహాయాన్నీ, లేదా మెచ్యూరిటీ సమయం తర్వాత కూడా తను జీవించి ఉంటే, తనకి పెద్ద మొత్తాన్నీ, ఈ పథకం అందిస్తుంది. అత్యవసర సమయాలలో సహాయానికి, లోన్ సదుపాయాన్ని కూడా ఈ పథకం అందిస్తుంది.

ప్రవేశ వయసు

18 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

75 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

15-35 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 1,00,000

 1. ఎల్ఐసీ జీవన్ లాభ్ (ప్లాన్ నం: 936, UIN: 512N304V02)

ఎల్ఐసీ జీవన్ లాభ్, పొదుపును మరియు రక్షణను కలిగి ఉండే ఒక ప్రీమియం కట్టాల్సిన, లాభాలతో కూడిన నాన్-లింక్డ్ ఎండోమెంట్ పథకం. బీమా చేయించుకున్న వ్యక్తి మెచ్యూరిటీ లోపు మరణించిన పక్షంలో, తన కుటుంబానికి ఆర్థిక సహాయాన్నీ, లేదా మెచ్యూరిటీ సమయం తర్వాత కూడా తను జీవించి ఉంటే, తనకి పెద్ద మొత్తాన్నీ, ఈ పథకం కూడా అందిస్తుంది. 

ప్రవేశ వయసు

8 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

75 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

16 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 25 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 2,00,000

 1. ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్ (ప్లాన్ నం: 914, UIN: 512N277V02)

ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్, పొదుపు మరియు రక్షణ ఫీచర్ల ఒక ప్రత్యేకమైన మిశ్రమాన్ని కలిగి ఉండే ఒక పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ పథకం. మీరు మరణించిన పక్షంలో, మీ కుటుంబం స్థిరమైన జీవితాన్ని గడపడానికి ఆర్థిక సహాయాన్ని ఈ పథకం అందిస్తుంది. మెచ్యూరిటీ సమయం తర్వాత మీరు పెద్ద మొత్తాన్ని పొందవచ్చు.

ప్రవేశ వయసు

8 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

75 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

12-35 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 1,00,000

 1. ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ (ప్లాన్ నం: 917, UIN: 512N283V02)

ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్, పొదుపు మరియు రక్షణలను కలిగి ఉండి, పాలసీ మొదటిలోనే పెద్ద మొత్తాన్ని ప్రీమియంగా కట్టించుకునే ఒక పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ పథకం. పాలసీ వ్యవధి కాలంలో మరణించిన పక్షంలో, ఆర్థిక సహాయంగా, లేదా మెచ్యూరిటీ సమయం తర్వాత, పెద్ద మొత్తాన్ని పొందవచ్చు.

ప్రవేశ వయసు

90 రోజులు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

75 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

10-25 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 50,000

 1. ఎల్ఐసీ న్యూ బీమా బచత్ ప్లాన్ (ప్లాన్ నం: 916, UIN: 512N284V02)

ఎల్ఐసీ న్యూ బీమా బచత్ ప్లాన్, పొదుపు మరియు రక్షణలను కలిగి ఉండి, పథకం మొదటిలోనే పెద్ద మొత్తాన్ని ప్రీమియంగా కట్టించుకునే ఒక పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ పథకం. పాలసీ వ్యవధి కాలంలో మరణించిన పక్షంలో ఆర్థిక సహాయాన్నీ, సర్వైవల్ ప్రయోజనాలనూ ఆందిస్తుంది. లోన్ సౌలభ్యం ద్వారా వినియోగదారులకు అవసరమయ్యే నగదు సహాయాన్ని కూడా ఈ పథకం అందిస్తుంది.

ప్రవేశ వయసు

15-66 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 35,000

ప్రీమియం చెల్లింపు విధానం

ఒక ప్రీమియం మాత్రమే

పాలసీ కాలవ్యవధి

9, 12 లేదా 15 సంవత్సరాలు

 1. ఎల్ఐసీ జీవన్ లక్ష్యా (ప్లాన్ నం: 916, UIN: 512N284V02)

ఎల్ఐసీ జీవన్ లక్ష్యా, పొదుపు మరియు రక్షణలను కలిగి ఉండే ఒక పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ పథకం. బీమా చేయించుకున్న వ్యక్తి, మెచ్యురిటీకి ముందే మరణించిన పక్షంలో, తన కుటుంబ అవసరాల కోసం, ముఖ్యంగా పిల్లల కోసం, వార్షిక ఆదాయ సహాయాన్నీ, లేదా మెచ్యూరిటీ వరకు తను జీవించి ఉంటే పెద్ద మొత్తాన్నీ ఆందిస్తుంది. అత్యవసర సమయంలో లోన్ సౌలభ్యాన్ని కూడా ఈ పథకం అందిస్తుంది.

ప్రవేశ వయసు

18 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

65 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

13-25 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 1,00,000

 1. ఎల్ఐసీ వారి ఆధార్ శీలా ప్లాన్ (ప్లాన్ నం: 944, UIN: 512N309V02)

ఎల్ఐసీ వారి ఆధార్ శీలా ప్లాన్, పొదుపు మరియు రక్షణల ఒక ప్రత్యేక మిశ్రమాన్ని అందిస్తుంది. ఈ పథకం, UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) వారు మంజూరు చేసిన ఆధార్ కార్డు కలిగి ఉన్న మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. దీని కింద, మీరు మరణించిన పక్షంలో, మీ కుటుంబం, అన్ని అవసరాలు మరియు బాధ్యతల నిమిత్తం ప్రయోజనాలను పొందుతుంది.

ప్రవేశ వయసు

8 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

55 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

10-20 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 75,000

 1. ఎల్ఐసీ ఆధార్ స్తంభ్ ప్లాన్ (ప్లాన్ నం: 944, UIN: 512N309V02)

ఎల్ఐసీ ఆధార్ స్తంభ్ ప్లాన్, పొదుపు మరియు రక్షణల ఒక మిశ్రమాన్ని అందిస్తుంది. ఈ పథకం, UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) వారు మంజూరు చేసిన ఆధార్ కార్డు కలిగి ఉన్న పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. బీమా చేయించుకున్న వ్యక్తి మరణించిన పక్షంలో కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మీ మరణం తర్వాత కూడా మీ కుటుంబం స్వతంత్రంగా జీవించేలా సహాయపడుతుంది.

ప్రవేశ వయసు

8 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

55 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

10-20 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 75,000

2. ఎల్ఐసీ సంపూర్ణ జీవిత పథకాలు


సంపూర్ణ జీవిత బీమా లేదా భరోసా అనేది, పాలసీ దారుడు, మెచ్యూరిటీ వరకూ అన్ని ప్రీమియంలను కట్టిన పక్షంలో, తన పూర్తి జీవిత కాలం పాటు అందుబాటులో ఉండే ఒక జీవిత బీమా పథకం

 1. ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ ప్లాన్ (ప్లాన్ నం: 945, UIN: 512N312V02)

ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ ప్లాన్, లాభాలతో కూడిన నాన్-లింక్డ్ సంపూర్ణ జీవిత భరోసా పథకం. ఇది పాలసీదారుకి మరియు తన కుటుంబానికి, ఆదాయం మరియు రక్షణల మిశ్రమ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పథకం, ప్రీమియం చెల్లింపు కాలం ముగిసినప్పటి నుండి, పాలసీదారుకు వార్షిక సర్వైవల్ ప్రయోజనాలను అందిస్తూ, పాలసీ వ్యవధి కాలంలో బీమా చేయించుకున్న వ్యక్తి మరణించిన పక్షంలో, తన కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

ప్రవేశ వయసు

90 రోజులు-55 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

100 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

100 - (ప్రవేశ సమయంలో వయసు)

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 2,00,000

3. ఎల్ఐసీ మనీ బ్యాక్ పథకాలు


ఒక మనీ బ్యాక్ పాలసీ, మెచ్యూరిటీ తర్వాత, భరోసా ఇవ్వబడిన మొత్తాన్ని పాలసీదారుకు అందించే ఒక ప్రామాణిక జీవిత బీమా సహాయం. సర్వైవల్ ప్రయోజనాలతో పాటు, భరోసా ఇవ్వబడిన మొత్తాన్ని మరియు సంస్థ పనితీరును బట్టి బోనస్ లను కూడా బీమా సంస్థ అందిస్తుంది.

 1. ఎల్ఐసీ బీమా శ్రీ ప్లాన్ (ప్లాన్ నం: 948, UIN: 512N316V02)

ఎల్ఐసీ బీమా శ్రీ అనేది, గ్యారెంటీ ఇవ్వబడిన మరియు లాయల్టీ అదనాలను అందించే ఒక మనీ బ్యాక్ పథకం. ఈ ఎల్ఐసీ బీమా శ్రీ పథకం, అధిక నికర ఆదాయం కలిగి ఉండే వ్యక్తుల కోసం రూపొందించబడిన ఒక సంప్రదాయంగా వస్తున్న పథకం.

ప్రవేశ వయసు

8 - 55 సంవత్సరాలు

మెచ్యూరిటీ వయసు

69 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

14, 16, 18 మరియు 20 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 10,00,000

 1. ఎల్ఐసీ జీవన్ శిరోమణి ప్లాన్ (ప్లాన్ నం: 947, UIN: 512N315V02)

ఎల్ఐసీ జీవన్ శిరోమణి ప్లాన్ అనేది, పొదుపు మరియు రక్షణల ఒక మిశ్రమాన్ని అందిస్తుంది ఇది అధిక నికర ఆదాయం కలిగి ఉండే వ్యక్తుల కోసం రూపొందించబడింది. పాలసీ వ్యవధి కాలంలో మీకు మరణం సంభవించిన పక్షంలో, మీ కుటుంబానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

ప్రవేశ వయసు

18 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

65 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 1,00,000

 1. ఎల్ఐసీ న్యూ మనీ బ్యాక్ ప్లాన్ - 20 సంవత్సరాలు (ప్లాన్ నం: 920, UIN: 512N280V02)

‘ఎల్ఐసీ న్యూ మనీ బ్యాక్ ప్లాన్ - 20 సంవత్సరాలు’ అనేది, పూర్తి పాలసీ వ్యవధి కాలంలో, మరణానికి ఆర్థిక సహాయాన్నీ, నిర్దిష్ట సమయాలలో, సర్వైవల్ ప్రయోజనాలనూ అందించే, ఒక పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ పథకం.

ప్రవేశ వయసు

13-50 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

70 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

20 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 1,00,000

 1. ఎల్ఐసీ న్యూ మనీ బ్యాక్ ప్లాన్ - 25 సంవత్సరాలు (ప్లాన్ నం: 921, UIN: 512N278V02)

‘ఎల్ఐసీ న్యూ మనీ బ్యాక్ ప్లాన్ - 25 సంవత్సరాలు’ అనేది, పూర్తి పాలసీ వ్యవధి కాలంలో, మరణానికి ఆర్థిక సహాయాన్ని అందించే, ఒక పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ పథకం. దీని కింద, బీమా చేయించుకున్న వ్యక్తి, నిర్దిష్ట సమయాలలో, సర్వైవల్ ప్రయోజనాలను పొందుతాడు. ఈ ప్రత్యేక ఫీచర్ల మిశ్రమం, పాలసీదారునికి అకాల మరణం సంభవించిన పక్షంలో, తన కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. 

ప్రవేశ వయసు

13-45 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

70 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

25 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 1,00,000

 1. ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ (ప్లాన్ నం: 932, UIN: 512N296V02)

ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ అనేది, ఒక పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ మనీ బ్యాక్ పథకం. ఈ పథకం ఎదిగే పిల్లల యొక్క విద్య, వివాహం మరియు ఇతర అవసరాలకు ఆర్థిక సహాయాన్నీ, మరియు సర్వైవల్ ప్రయోజనాలను అందిస్తుంది.

ప్రవేశ వయసు

0 సంవత్సరాలు (పుట్టుకతోనే)

గరిష్ట మెచ్యూరిటీ వయసు

25 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

25 సంవత్సరాలు - ప్రవేశించిన వయసు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 1 లక్ష

 1. ఎల్ఐసీ జీవన్ తరుణ్ ప్లాన్ (ప్లాన్ నం: 934, UIN: 512N299V02)

ఎల్ఐసీ జీవన్ తరుణ్ అనేది, తక్కువ ప్రీమియంతో, పొదుపు మరియు రక్షణల ఒక మిశ్రమాన్ని, ప్రత్యేకించి పిల్లల కోసం అందించే ఒక పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ పథకం. ఈ పథకం, మీ ఎదిగే పిల్లల యొక్క విద్య మరియు సంబంధిత అవసరాలకు సహాయపడటానికి రూపొందించబడింది. ఇది సర్వైవల్ మరియు మెచ్యూరిటీ ప్రయోజనాలను అందిస్తుంది.

ప్రవేశ వయసు

90 రోజులు - 12 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

25 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

25 సంవత్సరాలు - ప్రవేశించిన వయసు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 75,000

4. ఎల్ఐసీ టర్మ్ పాలసీ పథకాలు


టర్మ్ పాలసీ అనేది, ఒక నిర్దిష్ట కాల పరిమితిలో, బీమా చేయించుకున్న వ్యక్తి యొక్క లబ్ధిదారునికి ఆర్థిక సహాయాన్ని అందించే ఒక జీవిత బీమా పథకం. పాలసీ కాలవ్యవధిలో, పాలసీదారుని మరణం సంభవించిన పక్షంలో, లబ్ధిదారు సంబంధిత ప్రయోజనాలను పొందవచ్చు.

 1. ఎల్ఐసీ టెక్ టర్మ్ (ప్లాన్ నం: 854, UIN: 512N333V01)

ఎల్ఐసీ టెక్ టర్మ్ అనేది, మీకు అకాల మరణం సంభవించిన పక్షంలో, మీ కుటుంబానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించే, లాభాలు లేని, కేవలం రక్షణని అందించే, నాన్-లింక్డ్ “ఆన్ లైన్ టర్మ్ అస్యూరెన్సు పాలసీ.’ మీరు ఈ పథకాన్ని, ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ద్వారానే పొందగలరు.

ప్రవేశ వయసు

18 - 65 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

80 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

10-40 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 50 లక్షలు

 1. ఎల్ఐసీ వారి జీవన్ అమర్ ప్లాన్ (ప్లాన్ నం: 855, UIN: 512N332V01)

ఎల్ఐసీ జీవన్ అమర్ ప్లాన్ అనేది, కేవలం రక్షణని అందించే, నాన్-లింక్డ్ పథకం. ఈ పథకం కూడా మీకు అకాల మరణం సంభవించిన పక్షంలో, మీ కుటుంబానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది, ఇందులో మీరు, మరణం తర్వాతి ప్రయోజనాల కోసం, రెండు ఎంపికలైన, స్థిరమైన మొత్తం లేదా పెరుగుతూ ఉండే మొత్తాలలో, ఏదో ఒక దానిని ఎంచుకోవచ్చు.

ప్రవేశ వయసు

18 - 65 సంవత్సరాలు

మెచ్యూరిటీ వయసు

80 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 25,00,000

పాలసీ కాలవ్యవధి

10-40 సంవత్సరాలు

5. ఎల్ఐసీ ఫించను పథకాలు


ఫించను పథకాలు, మీ పదవీ విరమణ తర్వాతి సమయంలో కూడా, మీరు క్రమమైన ప్రయోజనాలను మరియు ఆదాయాన్ని పొందుతూ ఉండేలా రూపొందించబడ్డాయి. మీ పదవీ విరమణ తర్వాతి అవసరాలను మరియు ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి, ఒక పెద్దమొత్తాన్ని లేదా క్రమమైన ఆదాయాన్ని మీకు ఈ పథకాలు అందిస్తాయి.

 1. ప్రధాన మంత్రి వయ వందన యోజన (UIN: 512G311V02)

ప్రధాన మంత్రి వయ వందన యోజన అనేది, ఒక పెద్ద మొత్తాన్ని చెల్లించి తీసుకోదగిన ఒక ఫించను పథకం. పాలసీదారు లేక ఫించను ప్రయోజనాన్ని పొందే వ్యక్తి, తనకు కావాల్సిన ఫించను మొత్తాన్నీ లేదా పాలసీకి కట్టే మొత్తాన్నీ ఎంచుకోవచ్చు.

ప్రవేశ వయసు

60 సంవత్సరాలు - ఎప్పుడైనా

పాలసీ కాలవ్యవధి

10 సంవత్సరాలు

కనీస ఫించను

నెలకి రూ. 1,000

ఫించను పద్దతి

వార్షిక, అర్థ-వార్షిక, త్రైమాసిక మరియు నెలవారీ

 1. ఎల్ఐసీ జీవన్ శాంతి (ప్లాన్ నం: 850, UIN: 512N328V02)

ఎల్ఐసీ జీవన్ శాంతి అనేది, బీమా చేయించుకున్న వ్యక్తి ఇప్పటినుంచే లేదా కొంత కాలం తర్వాతి నుండి (వాయిదా) వార్షిక ఆదాయాన్ని పొందే ఒకే సారి ప్రీమియం కట్టాల్సిన పథకం. మీ అవసరాలకు సరిపడేలా ఇందులో 9 రకాల వార్షిక ఆదాయ ఎంపికల నుంచి మీరు ఏదో ఒక దానిని ఎంచుకోవచ్చు.

వాయిదా తర్వాత వార్షిక ఆదాయ ఎంపికకు

 

కనీసం 

గరిష్టం 

ఖరీదు ధర 

రూ. 1,50,000

ఎంతైనా 

ప్రవేశ వయసు (పూర్తయినది)

30 సంవత్సరాలు

79 సంవత్సరాలు

వాయిదా కాలం

1 సంవత్సరం

20 సంవత్సరాలు (గరిష్ట వెస్టింగ్ వయసుపై ఆధారపడి)

వెస్టింగ్ వయసు (పూర్తయినది)

31 సంవత్సరాలు

80 సంవత్సరాలు

6. ఎల్ఐసీ యూలిప్ ప్లాన్


యూలిప్ ప్లాన్లు, ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకోవడానికి ఉన్న పెట్టుబడి పథకాలు. ఈ పథకాలు మీ పొదుపు, మంచి ప్రయోజనాలు అందిస్తూ, మీకు స్థిరమైన ఆదాయం లేకున్నా పన్ను ఆదా చేసుకోవడంలో సహాయపడతాయి.

 1. ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లస్ (ప్లాన్ నం: 935, UIN: 512N301V02)

ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లస్ అనేది, పాలసీ సమయంలో, పొదుపు మరియు బీమా సహాయాన్ని అందించే ఒక యూనిట్-లింక్డ్ నాన్-పార్టిసిపేటింగ్ ఎండోమెంట్ భరోసా పథకం. ఈ పథకం, మీకు రక్షణ, దీర్ఘకాలిక పొదుపులతో పాటు, ఆరోగ్యకరమైన స్వతంత్రతతో కూడిన అనుకూలతల మిశ్రమ ప్రయోజనాలను అందించడానికి రూపొందించబడింది.

ప్రవేశ వయసు

90 రోజులు - 50 సంవత్సరాలు

మెచ్యూరిటీ వయసు

60 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

10 - 20 సంవత్సరాలు

ప్రీమియం చెల్లించాల్సిన కాలం

పాలసీ కాలవ్యవథి అంతా

7. ఎల్ఐసీ ఆరోగ్య పథకాలు


ఆరోగ్య బీమా పథకాలూ మరియు ఆన్లైన్ మెడీక్లైయిం పాలసీలు, అత్యవసర ఆరోగ్య పరిస్థితులలో వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి.

 1. ఎల్ఐసీ జీవన్ ఆరోగ్య (UIN: 512N266V02)

ఎల్ఐసీ జీవన్ ఆరోగ్య అనేది, కొన్ని అనారోగ్య సమస్యలకు మరియు అత్యవసర వైద్య పరిస్థితులలో, ఆర్థిక సహాయాన్నీ అందించే ఒక నాన్-లింక్డ్ నాన్-పార్టిసిపేటింగ్ పథకం. 

ప్రవేశ వయసు

18 - 65 సంవత్సరాలు

ప్రీమియం చెల్లింపు

క్రమంగా, వార్షికంగా లేదా అర్థ-వార్షికంగా

మోడ్ రిబేట్

వార్షిక మోడ్: టాబ్యులార్ ప్రీమియంలో 2%

అర్థ-వార్షిక మోడ్: టాబ్యులార్ ప్రీమియంలో 1%

త్వరిత నగదు సౌలభ్యం

ఉంది

 1. ఎల్ఐసీ క్యాన్సర్ కవర్ (UIN: 512N314V01)

ఎల్ఐసీ క్యాన్సర్ కవర్ అనేది, పాలసీ కాలవ్యవధిలో పాలసీదారు, అందులో చెప్పబడిన ఏదైనా మొదటిస్థాయి లేదా తీవ్రస్థాయి క్యాన్సర్ తో గుర్తించబడితే, దానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్నిఅందించే ఒక ప్రీమియం చెల్లించాల్సిన సంప్రదాయక ఆరోగ్య బీమా పథకం

ప్రవేశ వయసు

20 - 65 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

10 - 30 సంవత్సరాలు

మెచ్యూరిటీ వయసు

75 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 10,00,000

8. ఉపసంహరించబడిన పథకాలు (ఇటీవల)


 1. ఎల్ఐసీ జీవన్ ప్రగతి 

ఎల్ఐసీ జీవన్ ప్రగతి పథకం, పొదుపు మరియు రక్షణలను, లాభాన్ని అందించే నాన్-లింక్డ్ పథకం. ఈ పథకం, పాలసీ కాలవ్యవధిలో, ప్రతీ 5 సంవత్సరాలకు ప్రమాద ఆర్థిక సహాయాన్ని ఆటోమేటిక్ గా పెంచేలా రూపొందించబడింది. అత్యవసర కాలంలో లోన్ సౌలభ్యాన్ని కూడా ఈ పథకం అందిస్తుంది.

ప్రవేశ వయసు

12 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

65 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

12-20 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 1.5 లక్షలు

 1. ఎల్ఐసీ జీవన్ రక్షక్ ప్లాన్

ఎల్ఐసీ జీవన్ రక్షక్ పథకం, పొదుపు మరియు రక్షణల మిశ్రమాన్ని అందించే, పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ పథకం. మెచ్యూరిటీకి ముందే, బీమా చేయించుకున్న వ్యక్తి మరణించిన సందర్భంలో ఈ పథకం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అత్యవసర కాలంలో లోన్ సౌలభ్యాన్ని కూడా ఈ పథకం అందిస్తుంది.

ప్రవేశ వయసు

12 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

65 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

12-20 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 1.5 లక్షలు

 1. ఎల్ఐసీ లిమిటెడ్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్

ఎల్ఐసీ లిమిటెడ్ ప్రీమియం ఎండోమెంట్ పథకం, ఆకర్షణీయమైన పొదుపు మరియు రక్షణల మిశ్రమాన్ని అందించే, పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ పథకం. అత్యవసర కాలంలో మీ కుటుంబానికి అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని ఈ పథకం అందిస్తుంది.

ప్రవేశ వయసు

18 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

69 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

12-21 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 3,00,000

 1. ఎల్ఐసీ జీవన్ ఉత్కర్ష్

ఎల్ఐసీ వారి జీవన్ ఉత్కర్ష్, కట్టాల్సిన ఒకే ప్రీమియం మొత్తానికి 10 రెట్ల ప్రమాద సహాయం ఉండే పొదుపు మరియు రక్షణలను అందిస్తుంది. పాలసీదారు పాలసీ భరోసా మొత్తాన్ని ఎంచుకోవచ్చు. కట్టవలసిన ఒకే ప్రీమియం మొత్తం, ఎంచుకున్న సాధారణ భరోసా మొత్తం మరియు పాలసీదారు ప్రవేశ వయసుపై ఆధారపడి ఉంటుంది.

ప్రవేశ వయసు

6 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

47 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

12 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 75,000

 1. ఎల్ఐసీ బీమా డైమండ్ ప్లాన్

బీమా డైమండ్ జీవిత బీమా పథకం, బీమా చేయించుకున్న వ్యక్తి కుటుంబానికి పొదుపు, రక్షణ మరియు ఆర్థిక సహాయ ప్రయోజనాలను అందించే నాన్-లింక్డ్ పథకం. 

ప్రవేశ వయసు

14 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

16 సంవత్సరాల పాలసీ టర్మ్ కి 66 సంవత్సరాలు, 20 మరియు 24 సంవత్సరాల పాలసీ టర్మ్ కి 65 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

16 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 24 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 1 లక్ష

 1. ఎల్ఐసీ న్యూ బీమా బచత్

ఎల్ఐసీ న్యూ బీమా బచత్ అనేది, పాలసీ మొదటిలోనే పెద్దమొత్తంలో ప్రీమియం చెల్లించాల్సిన ఒక పొదుపు మరియు రక్షణలతో కూడిన, పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ పథకం. ఇది అకాల మరణ సందర్భంలో ఆర్థిక సహాయాన్ని, పాలసీ కాలంలోని నిర్దిష్ట కాలవ్యవధులలో సర్వైవల్ ప్రయోజనాలనూ అందించే ఒక మనీ బ్యాక్ పథకం.

ప్రవేశ వయసు

15-65 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

75 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

9 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 20,000

 1. ఎల్ఐసీ అన్మోల్ జీవన్-II

ఎల్ఐసీ అన్మోల్ జీవన్-II, పాలసీదారు మరణించిన సందర్భంలో, వారి కుటుంబానికి ఆర్థిక రక్షణను అందించే ఒక రక్షణ పథకం. 

ప్రవేశ వయసు

18-55 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

65 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

5-25 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 6 లక్షలు

 1. ఎల్ఐసీ అమూల్య జీవన్-II

ఎల్ఐసీ అమూల్య జీవన్-II, మీకు అకాల మరణం సంభవించిన పక్షంలో, మీ కుటుంబానికి రక్షణను అందించే ఒక పూర్తి రక్షణ పథకం. 

ప్రవేశ వయసు

18-60 సంవత్సరాలు

గరిష్ట మెచ్యూరిటీ వయసు

70 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

5-35 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 25,00,000

 1. ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి

ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి, పొదుపు, రక్షణ ఫీచర్లు మరియు లాభాలతో కూడిన సంప్రదాయక ఫించను పథకం. ఈ పథకం, గ్రేస్ పీరియడ్ లో మరణానికి సంబంధించిన ఆర్థిక సహాయాన్నీ, ప్రారంభ సమయం నుండి జీవించి ఉన్న కాలంలో వార్షిక ఫింఛనును పొందుతారు. 

ప్రవేశ వయసు

20-60 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

5-35 సంవత్సరాలు

భరోసా ఇచ్చే కనీస మొత్తం

రూ. 1,00,000

భరోసా ఇచ్చే గరిష్ట మొత్తం

పరిమితి లేదు

 1. ఎల్ఐసీ జీవన్ అక్షయ్-VI

ఎల్ఐసీ జీవన్ అక్షయ్-VI, ఒక పెద్ద మొత్తాన్ని చెల్లించి, వెంటనే వార్షిక ఫింఛనును పొందగలిగే పథకం. పదవీ విరమణ చేసిన వ్యక్తులకు, ఒక నిర్దిష్ట వార్షిక ఫించను మొత్తాన్ని ఈ పథకం అందిస్తుంది. చెల్లింపు రకాన్ని మరియు పద్దతిని ఎంచుకోవడానికి మీకు పలు ఆప్షన్లు ఉంటాయి. 

ప్రవేశ వయసు

30-65 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

5-35 సంవత్సరాలు

వార్షిక ఫించను ఖరీదు

రూ. 1 లక్ష - అపరిమితంగా

ఫించను పద్దతి

నెలవారీ, త్రైమాసిక, అర్థ-వార్షిక, వార్షిక

మీ జీవిత బీమా కు ఎల్ఐసీ నే ఎందుకు ఎంచుకోవాలి?

ఎల్ఐసీ ఆఫ్ ఇండియా, మన దేశ పౌరుల సంక్షేమ సంరక్షణ కోసం, విభిన్న తరగతుల మన దేశంలో కనీస జీవిత రక్షణను, అత్యవసర సమయంలో, పౌరులకూ, వారి కుటుంబ సభ్యులకూ ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం మొదలైన ఉద్యమ ఫలితంగా స్థాపించబడిన సంస్థ.

కేవలం ఒక సాధారణ నెలవారీ ప్రీమియంతో, పౌరులు, తమ అకాల మరణ సమయంలో కూడా, వారిపై ఆధారపడి ఉన్నవారు, స్థిరమైన జీవితంగడిపేలా, జీవిత సహాయాన్ని పొందగలిగారు.

ఎల్ఐసీ నిర్ధారించుకునే విషయాలు

 • జీవిత బీమా పాలసీలు భారతదేశమంతా విస్తృతంగా, ప్రత్యేకించి గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలో, సాంఘికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన వారికి అందుబాటులో ఉండేలా చేయడం
 • వైవిధ్యమైన మన దేశంలోని విభిన్న అవసరాలకు సరిపడేలా మరియు, పాలసీదారుల యొక్క పొదుపు మొత్తాలు అధికంగా ఆర్థిక వ్యవస్థను చైతన్య పరిచేలా, సాధారణ, మెరుగైన మరియు ఉచిత జీవిత రక్షణ ఎంపికలను అందించడం
 • పాలసీదారుల యొక్క ప్రయోజనాలను రక్షించడానికే, అత్యథిక ప్రాధాన్యత ఇవ్వడం
 • పాలసీదారుల డబ్బును పెట్టుబడి పెట్టేముందు, అది పాలసీదారుల డబ్బు అని గుర్తుంచుకుని, దానిని అత్యంత ప్రయోజనకరమైన పద్దతిలో పెట్టుబడి పెట్టడం
 • దేశ ప్రజలకు, తమ ఉద్యోగులు మరియు ఏజెంట్లు ఉత్తమమైన సేవను అందించేలా, వారిని సంస్థ కార్యకలాపాలలో భాగస్వామ్యులుగా చేయడం

ఇప్పుడు తెలుగులో ఎల్ఐసీ పాలసీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసుకోండి.

ఎల్ఐసీ చెల్లింపు ప్రక్రియ

ఏదైనా క్లిష్ట పరిస్థితిలో, పాలసీదారులకు లేదా వారి లబ్దిదారులకు, ఎల్ఐసీ పూర్తి సహాయాన్ని అందిస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, చెల్లింపును పూర్తి చేసే, ఖచ్చితమైన చెల్లింపు ప్రక్రియను ఇది కలిగి ఉంటుంది.

ఇది ఎక్కువ శాతం చెల్లింపులను, నిర్ధారిత గడువులోపు చేయడానికి ప్రయత్నిస్తుంది మరియు IRDA వార్షిక రిపోర్టు వివరాల ప్రకారం, 2018-19 సంవత్సరంలో బీమా రంగంలోనే అత్యధిక చెల్లింపు శాతం, 97.79% ను కలిగి ఉంది. గతంలో కూడా, ఎల్ఐసీ యొక్క చెల్లింపు శాతం అలాగే ఉంటూ వచ్చింది మరియు ఆర్థిక నిపుణుల చేత ఉత్తమ బీమా కంపెనీగా నిలకడగా కొనియాడబడుతూ వచ్చింది. 

ఈ కంపెనీ సాధారణంగా, మా మినహాయింపుల జాబితా కింద పేర్కొన్న విధంగా, పాలసీ చేసిన సంవత్సరం లోపు పాలసీదారు ఆత్మహత్య, స్వీయ హాని, నేరపూరిత లేదా చట్ట వ్యతిరేక చర్యలతో కూడిన పరిస్థితులు ఉండడం, వంటి వాటికి తప్ప, అన్ని చట్టబద్ధమైన అభ్యర్థనలకూ చెల్లింపు చేస్తుంది.

ఇప్పుడు తెలుగులో ఎల్ఐసీ సేవలను ఎలా పొందాలో తెలుసుకోండి.

ఎల్ఐసీ లాగిన్ ప్రక్రియ

ఎల్ఐసీ వారి వెబ్ సైట్, ఒక్క క్లిక్కు తోనే, ఎప్పుడు కావాలన్నా సేవలను అందిస్తుంది. ఈ ఆన్లైన్ సేవలతో, మీరు ఏ బ్రాంచ్ కార్యాలయానికీ వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీ పని చేయించుకోవడానికి క్యూలలో నిలబడాల్సిన పని లేదు.

సాధారణ సేవలనే కాకుండా, ఎల్ఐసీ అదనపు రాయితీలను, ప్రయోజనాలనూ కూడా అందిస్తుంది. కానీ అటువంటి రాయితీలు మరియు ఆన్లైన్ సేవల కోసం మీరు ఎల్ఐసీ వారి ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి. ఆన్లైన్ సేవలను పొందటానికి, రిజిస్ట్రేషన్ ప్రక్రియే సులభమైన మార్గం.

వీటితోపాటుగా, సంస్థ గురించి, పాలసీల గురించి, మరింత అదనపు తాజా సమాచారం మరియు మరిన్ని అదనపు ప్రయోజనాలను మీకు అందించడం జరుగుతుంది. మీ ఇంటి నుంచి ఈ సేవలను సాలభ్యకరంగా పొందడానికి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

కొత్త వినియోగదారుల ఎల్ఐసీ లాగిన్ రిజిస్ట్రేషన్

కొత్త వినియోగదారుడిగా రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవడానికి ఈ క్రింది క్రమ పద్దతిని అనుసరించండి:

 • ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ (www.licindia.in) ను తెరిచి, అందులో ‘ఆన్లైన్ సర్వీసెస్’ కింద ఉన్న ‘కస్టమర్ పోర్టల్’ ట్యాబ్ ను ఎంచుకోండి. 
 • ఎల్ఐసీ ‘ఈ-సర్వీసెస్’ అధికారిక పేజీలో, ‘న్యూ యూజర్’ పై నొక్కండి
 • మీ పాలసీ నెంబర్, ప్రీమియం మొత్తం, పుట్టిన తేదీ, మొదలైన పాలసీ సంబంధిత వివరాలను, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ‘ ప్రొసీడ్’ ను నొక్కండి. 
 • ఒక ‘యూజర్ పేరు’ మరియు ‘పాస్వర్డ్’ ను ఇచ్చి నమోదు ప్రక్రియను పూర్తి చేయండి.
 • ఇప్పుడు మీరు ఈ కొత్త యూజర్ పేరు మరియు పాస్వర్డ్ లతో లాగిన్ అవ్వవచ్చు. సబ్మిట్ ను నొక్కండి.
 • మీ పాలసీని నమోదు చేసి, మీకు కావలసిన వివరాలను, స్క్రీన్లో ఎడమవైపు ఉన్న ‘ఎన్రోల్ పాలసీస్’ ట్యాబ్ నుంచి పొందండి.
 • ‘వ్యూ ఎన్రోల్డ్ పాలసీస్’ ని నొక్కి, మీ నమోదైన పాలసీల స్థితిని చూడటానికి, సరైన ‘క్యాప్చర్ కోడ్’ ను ఇవ్వండి.

ఎల్ఐసీ పాలసీ ప్రీమియంను ఎలా కట్టాలి?

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఎల్ఐసీ) ప్రీమియంను ఆన్లైన్లో లేదా ఆఫ్ లైన్లో కూడా కట్టడం చాలా సులభం:

ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా ప్రీమియం ఆఫ్‌లైన్ చెల్లింపు

ఎల్ఐసీ పాలసీ ప్రీమియంను, ఆఫ్ లైన్లో, క్యాష్ కౌంటర్ వద్ద ఈ క్రింది విధాలుగా మీరు కట్టవచ్చు

 • ఎల్ఐసీ పాలసీ యొక్క ప్రీమియంను, ఆఫ్ లైన్లో, దగ్గరలో ఉన్న ఏదైనా ఎల్ఐసీ బ్రాంచ్ ఆఫీస్ లోని క్యాష్ కౌంటర్ వద్ద కట్టవచ్చు.
 • ప్రీమియంను క్యాష్ తో, చెక్ తో లేదా డిమాండ్ డ్రాఫ్ట్ తో కూడా కట్టవచ్చు.

ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రీమియం ఆన్లైన్ లో కట్టడం

తమ అశేషమైన వినియోగదారులందరికీ, ఉత్తమమైన సేవలను అందించడానికి, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎల్ఐసీ ‘ఈ-సర్వీసుల’ను ప్రారంభించింది. ఈ ఈ-సర్వీస్ పోర్టల్ లో మీరు ఎల్ఐసీ ప్రీమియంలను కట్టడంతో పాటు, ఇతర సేవలను కూడా పొందవచ్చు.

అధికారిక వెబ్ సైట్ కు వెళ్ళండి: www.licindia.in/Home/Pay-Premium-Online

ప్రీమియంను, ఆన్లైన్లో, లాగిన్ కాకుండానే నేరుగా కట్టవచ్చు లేదా ఎల్ఐసీ ఆఫ్ ఇండియా యూజర్ గా లాగిన్ అయి, ‘ఈ-సర్వీసెస్’ పోర్టల్లో కట్టవచ్చు.

ఎల్ఐసీ ఆఫ్ ఇండియా లో లాగిన్ కాకుండా నేరుగా కట్టడం

 • ప్రీమియం రెన్యువల్ ను ఎంచుకోండి
 • ప్రొసీడ్ ను నొక్కండి
 • మీ పాలసీ నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ప్రీమియం మొత్తం మరియు ఇమెయిల్ ఐడీ వివరాలను నమోదు చేయండి
 • ఇప్పుడు పాలసీ చెల్లింపును చేయవచ్చు
 • ఈ చెల్లింపును, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ (వీసా, మాస్టర్ మరియు రూపే), క్రెడిట్ కార్డ్ (వీసా, మాస్టర్ మరియు ఏమెక్స్), BHIM లేదా UPI ల ద్వారా చేయవచ్చు.
 • చెల్లింపు తర్వాత, మీ ఇమెయిల్ ఐడీకి రసీదు పంపబడుతుంది.

ఎల్ఐసీ ఆఫ్ ఇండియా యూజర్ పోర్టల్ ద్వారా కట్టడం

మీరు ebiz.licindia.in/D2CPM/#Login

 • రోల్ ను ఎంచుకోండి
 • మీ ఎల్ఐసీ లాగిన్ వివరాలు, అంటే యూజర్ ఐడీ/మొబైల్ లేదా ఇమెయిల్ ఐడీ ఇవ్వండి
 • పాస్వర్డ్
 • మరియు పుట్టిన తేదీ
 • ముందుకు వెళ్లి పాలసీ చెల్లింపును చేయండి

ఎల్ఐసీ ఆఫ్ ఇండియా యూజర్ పోర్టల్ నుంచి కట్టడానికి, మీరు ‘ఈ-సర్వీసెస్’ కి నమోదు చేసుకుని, ఎల్ఐసీ లాగిన్ ను తయారుచేసుకుని ఉండాలి.

ఎల్ఐసీ ఈ-సర్వీసెస్ కి నమోదు చేసుకోవడం ఎలా?

‘ఈ-సర్వీసెస్ కి ఆన్లైన్లో నమోదు చేసుకోవడం చాలా సులభం. కానీ, మొదటిసారి ఉపయోగించే వినియోగదారులకు కొంచెం కష్టంగా అనిపించొచ్చు. క్రింది అంశాలు మీకు దానిని సులభం చేస్తాయి.

 • లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ కు వెళ్ళండి: www.licindia.in
 • ఎల్ఐసీ ‘ఈ-సర్వీసెస్’ ను నొక్కండి.
 • ఇది మిమ్మల్ని ఒక కొత్త పేజీకి తీసుకెళుతుంది.మీకు అక్కడ రెండు ఎంపికలు కనిపిస్తాయి: 1) రిజిస్టర్డ్ యూజర్ మరియు 2) కొత్త యూజర్
 • నమోదు కోసం, మీరు రెండవ ఎంపిక, ‘కొత్త యూజర్’ ను ఎంచుకోండి
 • ఇప్పుడు మీరు మీ వ్యక్తిగత వివరాలను అడిగే ఒక కొత్త పేజీకి వెళ్తారు. ఇక్కడ మీరు మీ పాలసీ నెంబర్, ప్రీమియం ఇన్స్టాల్మెంట్స్, పుట్టినతేదీ వివరాలు మరియు ఇమెయిల్ లను నమోదు చేయాలి. వివరాలను నింపిన తర్వాత, ముందుకు వెళ్ళడానికి ‘ప్రొసీడ్’ ను నొక్కండి.
 • ఈ రెండవ పేజీ మిమ్మల్ని ఎల్ఐసీ వెబ్ సైట్ కు, మీ సొంత ‘యూజర్ పేరు’ మరియు ‘పాస్వర్డ్’ లను పెట్టుకోవడానికి అనుమతిస్తుంది. మీరు మీ యూజర్ పేరు, పాస్వర్డ్ లతో వెబ్ సైట్లో లాగిన్ అవ్వడంతో, మీ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.
 • వెబ్ సైట్ యొక్క మొదటి పేజీలో, మీ ఖాతాకు సంబంధించిన అన్ని అవసరమైన ఎంపికలనూ మీరు పొందుతారు. మీకు ఎల్ఐసీ లో ఉన్న అన్ని పాలసీలు మరియు పొదుపులనన్నింటినీ కూడా నమోదు చేసుకుని మీరు ముందుకు వెళ్ళవచ్చు. దీనితో పాటే, మీరు ఇక్కడ మీ పాలసీలన్నింటి యొక్క స్థితిని చూడవచ్చు, సంబంధిత చెల్లింపులను కూడా చేయవచ్చని మర్చిపోకండి.
 • పాలసీలకు సంబంధించిన అన్ని వివరాలనూ నమోదు చేసిన తర్వాత, మీరు ప్రీమియం చెల్లింపును ఆన్లైన్లో చేయవచ్చు. మీ పాలసీలు వెబ్ సైట్ లో ఎన్రోల్ కాకపోతే, మీరు ప్రీమియంలను నమోదు చేసుకోని యూజర్ లాగానే చెల్లించవలసి ఉంటుంది.

గడువు దాటిపోయిన బీమా పాలసీని పునరిద్దురించుకోడం ఎలా?

ఇప్పుడు తెలుగులో ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణ గురించి తెలుసుకోండి.

 1. సాధారణ పునరుద్ధరణ: పాలసీదారు తన గడువు దాటిపోయిన కవరేజీని ఎటువంటి సమస్యా లేకుండా పునరుద్ధరించుకోవచ్చు. తను చేయాల్సిందల్లా, కట్టకుండా వదిలేసిన ప్రీమియంలన్నిటినీ వడ్డీతో పాటు చెల్లించడమే. అంతేకాకుండా, కవరేజీ ఇచ్చే సంస్థ, డాక్యుమెంట్లు, ఏవైనా వైద్య పరీక్షల కోసం అడిగితే, దానికి కూడా సిద్ధంగా ఉండండి.
 2. ప్రత్యేక పునరుద్ధరణ: పునరుద్ధరణ ఫీచర్ కింద, బీమా చేయించుకున్న వ్యక్తి యొక్క పాలసీ జారీ తేదీని వాయిదా వేయించుకోవచ్చు మరియు పునరుద్ధరణ సమయంలో వయసుపై ఆధారపడి, వారు ఒక ప్రీమియంను కట్టడం కుదరవచ్చు. ప్రీమియంను పెద్దమొత్తంలో కట్టలేని పక్షంలో, ఎవరైనా ఈ ప్రత్యేక పునరుద్ధరణ పథకం యొక్క ప్రయోజనాన్ని ఉపయోగించవచ్చు. దీని కింద, బీమా సంస్థ మీ ఆరోగ్య రిపోర్టును కోరవచ్చు. ఈ ప్రత్యేక ప్రయోజనం కింద, ఎవరైనా తమ కవరేజీని పునరుద్ధరించుకోవాలంటే, దానికి ఇలాంటి కొన్ని పరిస్థితులు ఉండాలి:
 • పాలసీ పూర్తి కాలానికి, మీరు తప్పనిసరిగా ఒక ప్రత్యేక పునరుద్ధరణ పథకాన్నే ఉపయోగించాలి.
 • కవరేజీ గడువు ముగియడానికి ముందున్న 3 ప్రిలిమినరీ సంవత్సరాలలో కూడా, పాలసీదారు ప్రత్యేక పునరుద్ధరణకు వెళ్ళవచ్చు.
 1. వాయిదాల పునరుద్ధరణ: పాలసీ చెల్లింపుదారు సులభ సేవల కోసం అనేక పథకాలు ఉన్నాయి. వాయిదాల పునరుద్ధరణ వాటిలో ఒకటి. మిగిలి ఉన్న ప్రీమియంను పెద్దమొత్తంలో కట్టలేని పక్షంలో, ఈ పునరుద్ధరణ పద్దతి కింద, వాయిదాలను మీరు ఎంచుకోవచ్చు. మీరు ఈ వాయిదాలను ఎంచుకున్న పక్షంలో, మీరు మీ పాలసీని కాపాడుకోవడానికి మీకు కొన్ని మార్గాలు ఉన్నాయి. వార్షిక ప్రీమియం అయితే, పాలసీదారు ప్రతీ సంవత్సర మొత్తంలో సగాన్ని చెల్లించాలి. అర్థ వార్షిక పద్దతిలో, పాలసీదారు ప్రతీ ప్రీమియం మొత్తంలో సగాన్ని చెల్లించాలి.
 2. సర్వైవల్ ప్రయోజనాలతో కూడిన పునరుద్ధరణ: పాలసీదారు ఈ పద్దతి కింద సులభంగా మనీ బ్యాక్ పాలసీని పునరుద్ధరించుకోవచ్చు. పునరుద్ధరణ ఉన్న తేది కన్నా, ఈ ప్రయోజనం యొక్క గడువు తేది ముందు వచ్చిన పక్షంలో, పాలసీదారు ఏ సమస్యా లేకుండా సర్వైవల్ ప్రయోజనాలతో చెల్లింపు చేయవచ్చు. ఒకవేళ పునరుద్ధరణకు అయ్యే మొత్తం, సర్వైవల్ ప్రయోజనం కన్నా అధికంగా ఉంటే, ఆ అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తక్కువగా ఉంటే, అది తగ్గుతుంది.
 3. లోన్ తో కూడిన పునరుద్ధరణ: పాలసీదారు తనఖాతో కూడిన పునరుద్ధరణను కూడా ఎంచుకోవచ్చు. దీని కింద, సరెండర్ విలువను పొందిన కవరేజీ యొక్క పునరుద్ధరణ తేదీ నాడే, కవరేజీ లోన్ ను తీసుకుని, పాలసీదారు దీనిని ప్రయోజనకరంగా ఉపయోగించుకోవచ్చు. పునరుద్ధరణ మొత్తం సరిపోనప్పుడు, పాలసీదారు అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తనఖా మొత్తం, పునరుద్ధరణ మొత్తం కన్నా ఎక్కువ ఉంటే, ఆ మొత్తం పాలసీదారుకు ఇవ్వబడుతుంది. మరింత చదవండి…

ఎల్ఐసీ యొక్క పాలసీ స్థితిని చూసుకోవడం ఎలా?

ఎల్ఐసీ ఆఫ్ ఇండియా వెబ్ సైట్లో విజయవంతంగా నమోదు చేసుకున్నాక, వినియోగదారులు తమ పాలసీల స్థితిని చూసుకోవచ్చు మరియు ఇతర సేవలను కూడా పొందడం మొదలుపెట్టవచ్చు. 

ఈ ప్రక్రియని ఈ క్రింది విధంగా పూర్తి చేయవచ్చు:

ఎల్ఐసీ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ను తెరవండి

మీ ఎల్ఐసీ పాలసీ స్థితిని రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే చూడటానికి, మీరు ‘56767877’ నంబరుకు SMS పంపవచ్చు.

ఎంక్వయిరీ SMS కోడ్ రకాలు

 • ప్రీమియం వాయిదా మొత్తం కోసం: ASKLIC PREMIUM
 • పునరుద్ధరణ మొత్తం కోసం: ASKLIC REVIVAL
 • అదనపు బోనస్ ల గురించి తెలుసుకోవడం కోసం: ASKLIC BONUS
 • అందుబాటులో ఉన్న లోన్ మొత్తాల గురించి తెలుసుకోవడం కోసం: ASKLIC LOAN
 • నామినేషన్ వివరాల కోసం: ASKLIC NOM

కస్టమర్ కేర్ కి కాల్ చేసి ఎల్ఐసీ ఆఫ్ ఇండియా పాలసీ స్థితిని తెలుసుకోవడం:

ఒక్క చిన్న కాల్ తో మీ ఎల్ఐసీ పాలసీ స్థితిని తెలుసుకొనగలిగేలా, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా, 24 గంటల కస్టమర్ కేర్ సేవలను అందిస్తుంది.

MTNL మరియు BSNL వినియోగదారులకు హెల్ప్ లైన్ నెంబర్ 12151. 

ఇతర ల్యాండ్ లైన్ మరియు మొబైల్ ఫోన్ వినియోగదారులు, వారి సిటీ కోడ్ తర్వాత 12151 ను జత చేసి డయల్ చేయాలి.