భారతదేశంలో 2020 లో ఉత్తమమైన ఎల్ఐసీ పథకాలు
 • హామీ మనీ బ్యాక్ ప్లాన్
 • అధిక రాబడి పెట్టుబడి ఎంపికలు
 • పన్ను ప్రయోజనాలు
PX step

ప్రీమియం పోల్చండి

1

2

పుట్టినరోజు
ఆదాయం
| లింగ

1

2

ఫోన్ నం.
పేరు
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

జీవిత బీమా అనేది ఖచ్చితంగా మీ పెట్టుబడులలో చోటివ్వాల్సిన ఒక అంశం. మీరు సురక్షితమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఇది తప్పనిసరి. జీవిత బీమాని కలిగి ఉండడం ఎంత ముఖ్యమైనదనే విషయంపై ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. మీరు దురదృష్టవశాత్తూ మరణించిన పక్షంలో, మీ కుటుంబానికి లేదా మీ ప్రియమైన వారికీ అవసరమైన ఆర్థిక భారాన్ని ఇది అందిస్తుంది. భారతదేశంలో, చాలామంది దీనిని మరొక అదనపు ఖర్చు లాగా చూడవచ్చు. కానీ వారు తమని తాము రెండు ప్రశ్నలు వేసుకోవాలి: తాను అనుకోకుండా మరణించిన పక్షంలో, తన కుటుంబం లేదా దగ్గరివారు ఏం చేయగలరు? కుటుంబంలో తను ఒక్కరే ఉద్యోగం చేస్తూ ఉండినపుడు ఆలా జరిగితే, వారు ఆ తర్వాత తమ జీవితాలను ఎలా నెగ్గుకురాగలరు.

మీరు ఒకవేళ గందరగోళంలో ఉంటే, జీవిత బీమానే దీనికి పరిష్కారం. భారతదేశంలో, జీవిత బీమా దగ్గరికొచ్చేసరికి, అందరూ మొదట చెప్పే పేరు వేరేదీ కాదు, “జిందగీ కే సాథ్ భీ, జిందగీ కే బాద్ భీ (జీవితంతో పాటుగా, జీవితం తర్వాత కూడా),” అనే శీర్షికను తనదిగా చేసుకున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ). ఇది జీవిత బీమా రంగంలో విస్తృతమైన ఉత్పత్తులను అందించే అత్యంత పేరెన్నికగన్న బ్రాండ్. ఈ పథకాలన్నింటిలో ఉత్తమమైన దానిని ఎంచుకోవడం అంత సులభం కాదు. కాబట్టి మీకు సహాయపడడానికి ఇక్కడ 6 ఉత్తమమైన ఎల్ఐసీ పథకాల జాబితాను, సులభమైన మరియు సమగ్రమైన సమాచారంతో ఇచ్చాము.

భారతదేశంలో 2020 లో 6 ప్రధాన ఎల్ఐసీ పథకాలు

ఎల్ఐసీ పథకాలు 

పథకం రకం

ప్రవేశ వయసు (సంవత్సరాలలో )

పాలసీ కాలవ్యవథి (సంవత్సరాలలో )

మెచ్యూరిటీ వయసు (గరిష్టం)(సంవత్సరాలలో )

భరోసా మొత్తం (కనీసం - గరిష్టం )

ఎల్ఐసీ జీవన్ అమర్ 

సంపూర్ణ టర్మ్ బీమా పథకం

18 - 65

10 - 40

80 సంవత్సరాలు 

రూ. 25 లక్షలు - అపరిమితంగా 

ఎల్ఐసీ టెక్ టర్మ్ ప్లాన్

సంపూర్ణ టర్మ్ బీమా పథకం

18 - 65

10 - 40

80 సంవత్సరాలు 

రూ. 50 లక్షలు - అపరిమితంగా 

ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ 

సంప్రదాయక మనీ బ్యాక్ పిల్లల పథకం

0 - 12

25 సంవత్సరాలు-ప్రవేశ వయసు

25 సంవత్సరాలు 

రూ. 1 లక్ష - అపరిమితంగా 

ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ 

ఎండోమెంట్ పథకం

18 - 50

15 - 35

75 సంవత్సరాలు 

రూ. 1 లక్ష - అపరిమితంగా 

ఎల్ఐసీ జీవన్ ఉమంగ్

సంపూర్ణ జీవిత + ఎండోమెంట్ పథకం

90 రోజులు - 65 సంవత్సరాలు

100-ప్రవేశ వయసు

100 సంవత్సరాలు 

రూ. 2 లక్షలు - అపరిమితంగా 

ఎల్ఐసీ జీవన్ ప్రగతి 

ఎండోమెంట్ పథకం

12 - 45 సంవత్సరాలు

12 - 20

65 సంవత్సరాలు 

రూ. 1.5 లక్షలు - అపరిమితంగా 

 

నిపుణుల సలహా: ఉన్న అన్ని పథకాలలో నుంచి ఉత్తమమైన ఎల్ఐసీ పథకాన్ని ఎంచుకోవడానికి, మీరు పాలసీ తీసుకోవడానికి గల ప్రధాన కారణాలు, అంచనా వేసుకోవాలి అంటే, మీ కుటుంబానికి ఆర్ధిక రక్షణ కోసం, మీ మరణం తర్వాత స్థిరమైన ఆదాయం కోసం, అని మొదట అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. 

1. ఎల్ఐసీ జీవన్ అమర్


ఎల్ఐసీ జీవన్ అమర్ ను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా 2019 ఆగస్టులో ప్రారంభించింది. ఇది పూర్తి టర్మ్ బీమా పథకం. ఇది బీమా చేసుకున్న వ్యక్తికి ఎలాంటి తిరుగు చెల్లింపులనూ అందించదు. అయితే, బీమా చేసుకున్న వ్యక్తి మరణించిన పక్షంలో, వారి కుటుంబానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. వారు ఒక స్థిరమైన మరియు సురక్షితమైన జీవితాన్ని గడపడంలో సహాయపడుతుంది. మిగతా బీమా కంపెనీలతో పోలిస్తే, ఇది వినియోగదారులకు పలు రకాల ఎంపికల అవకాశాన్ని కల్పించే ఒక నాన్-పార్టిసిపేటింగ్ మరియు నాన్-లింక్డ్ జీవిత బీమా టర్మ్ పథకం.

ఎల్ఐసీ జీవన్ అమర్

పూర్తి టర్మ్ బీమా పథకం

ప్రవేశ వయసు

18-65 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవథి

కనీస పాలసీ వ్యవథి 10 సంవత్సరాలు కాగా, గరిష్టంగా 40 సంవత్సరాలు

చెల్లింపు విధానం

ప్రీమియంలు రెగ్యులర్, లిమిటెడ్ లేదా సింగల్ బేసిస్ మీద

భరోసా మొత్తం

కనీసం -- రూ. 25 లక్షలు (రూ. 25 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు రూ. 1 లక్ష గుణిజాలలో) మరియు (రూ. 40 లక్షల పైన రూ. 10 లక్ష గుణిజాలలో) -- అపరిమితంగా

వైద్య పరీక్ష

మూత్ర కోటినిన్ పరీక్ష అవసరం, పొగ త్రాగని వారి కేటగిరీ కోసం (తప్పనిసరి)

 

ప్రధాన ఫీచర్లు:

 • ఎల్ఐసీ జీవన్ అమర్ ఒక నాన్-మార్కెట్ లింక్డ్ పథకం.
 • భరోసా మొత్తం పెంచుకోవచ్చు మరియు లెవల్ భరోసా మొత్తం ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది.
 • ఈ పథకం కింద ఏ మెచ్యూరిటీ మొత్తమూ ఉండదు. 
 • ప్రీమియం ధరలు రెండు రకాలుగా ఉంటాయి: 1) పొగ తాగే వారు 2) పొగ తాగని వారు
 • పాలసీదారు పాలసీ వ్యవథి కాలంలో మరణిస్తే, లబ్ధిదారునికి మరణ చెల్లింపు మొత్తం అందించబడుతుంది.
 • ఈ మరణ ప్రయోజనం ఒకేసారి పెద్దమొత్తంగా చెల్లించవచ్చు లేదా వాయిదాలుగా (5, 10 లేదా15) సంవత్సరాలలో చెల్లించవచ్చు.
 • పాలసీదారులు ప్రీమియం చెల్లించే కాలాన్ని మరియు పాలసీ వ్యవథినీ ఎంచుకోవచ్చు.
 • ప్రీమియం చెల్లింపులు క్రమ సమయాలలో లేదా పెద్దమొత్తంగా, అలాగే లిమిటెడ్ గా కూడా చెల్లించవచ్చు.
 • పొగ త్రాగని వారి కేటగిరి కోసం మూత్ర కోటినిన్ వైద్య పరీక్ష తప్పకుండా చేయించుకోవాలి.

ఈ పథకం యొక్క ప్రయోజనాలు:

 • రెండు రకాల మరణ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి, పెరుగుతూ ఉండే భరోసా మొత్తం(*), మరియు లెవల్ భరోసా మొత్తం*.
 • అధిక ప్రమాదస్థాయికి కూడా కవరేజీ, 80 సంవత్సరాల గరిష్ట మెచ్యూరిటీ వయసుతో
 • మహిళలకు మరియు పొగ తాగని వారికి గణనీయమైన స్థాయిలో తక్కువ ప్రీమియం ధరలు
 • పొగ తాగే వారికీ మరియు తాగని వారికీ వేర్వేరు కేటగిరీలు
 • భరోసామొత్తంపై అధిక రాయితీలు
 • అదనపు ప్రీమియం చెల్లింపుతో ప్రమాద ప్రయోజన రైడర్ల అదనపు కవరేజీ ఎంచుకునే అవకాశం
 • అపరిమితంగా ఎంచుకోగల భరోసా మొత్తం

*లెవల్ భరోసా మొత్తం: మొదట పాలసీ తీసుకున్న సమయంలో ఎంచుకున్న ఖచ్చితమైన భరోసా మొత్తాన్ని లబ్ధిదారు పొందుతాడు, పాలసీ వ్యవథిలో దీనిని మార్చడం కుదరదు

పెరుగుతూ ఉండే భరోసా మొత్తం(*): మొదటి ఐదు సంవత్సరాలు, మరణ ప్రయోజన మొత్తం, మొదట పాలసీ తీసుకున్న సమయంలో బీమా చేసుకున్న వ్యక్తి ఎంచుకున్న సాధారణ భరోసా మొత్తానికి సమానంగా ఉంటుంది. ఆ తర్వాత, 6 వ సంవత్సరం నుండి ఇన్-ఫోర్స్ పాలసీ ప్రకారం 15 సంవత్సరాలకు 10% వృధ్దిరేటుతో పెరుగుతూ, పాలసీ వ్యవథి ముగిసే వరకు లేదా పాలసీ దారుని మరణం వరకు,సాధారణ భరోసా మొత్తానికి రెండింతలు అయితే తప్ప, ఏది మొదట జరిగితే అది ఉంటుంది.

2. ఎల్ఐసీ టెక్ టర్మ్ పథకం


ఎల్ఐసీ టెక్ టర్మ్ అనేది, బీమా చేసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణించిన పక్షంలో, వారి కుటుంబానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించే ఒక నాన్-లింక్డ్ పూర్తి సంరక్షణ “ఆన్లైన్ టర్మ్ భరోసా పాలసీ.” ఈ పథకం పూర్తిగా ఆన్లైన్ అప్లికేషన్ల పద్దతి ద్వారానే, మధ్యవర్తులెవరి ప్రమేయం లేకుండా అందుబాటులో ఉంటుంది.

ఎల్ఐసీ టెక్ టర్మ్

పూర్తి టర్మ్ బీమా 

ప్రవేశ వయసు

18-65 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవథి

కనీస పాలసీ వ్యవథి 10 సంవత్సరాలు కాగా, గరిష్టంగా 40 సంవత్సరాలు

చెల్లింపు విధానం

ప్రీమియంలు సంవత్సరానికొకసారి చెల్లించాలి

భరోసా మొత్తం

కనీసం -- రూ. 50 లక్షలు గరిష్టం -- అపరిమితంగా

వైద్య పరీక్ష

అవసరం

 

ప్రధాన ఫీచర్లు:

 • ఈ పథకాన్ని మధ్యవర్తులెవరి ప్రమేయం లేకుండా ఆన్లైన్ విధానంలో మాత్రమే తీసుకోగలరు.
 • మహిళలకు మరియు పొగ త్రాగని వారికి ప్రీమియంలపై రాయితీ అందుబాటులో ఉంటుంది.
 • ఇది ఒక సంప్రదాయక నాన్-పార్టిసిపేటింగ్ పథకం.
 • ఏ మెచ్యూరిటీ మొత్తమూ చెల్లించబడదు మరియు పూర్తి టర్మ్ ప్లాన్ కాబట్టి కేవలం ప్రమాద పరిస్థితులకు మాత్రమే కవరేజీ ఉంటుంది.
 • ఈ పథకం అధిక భరోసా మొత్తం ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.
 • మరణ ప్రయోజనం మరియు ఆదాయ పన్ను ప్రయోజనాలు ఈ పథకం క్రింద ఉంటాయి.

ఈ పథకం యొక్క ప్రయోజనాలు:

 • పాలసీదారు 40 సంవత్సరాల పాలసీ వ్యవథి వరకు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు.
 • ఈ పథకం అధిక భరోసా మొత్తం ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.
 • పాలసీదారు అనుకోకుండా పాలసీ వ్యవథిలో మరణించిన పక్షంలో, భరోసా మొత్తాన్ని మరణ ప్రయోజనంగా అందచేస్తుంది.
 • ప్రీమియం చెల్లింపు మొత్తాలకు ఆదాయ పన్ను ప్రయోజనాలు ఉంటాయి.

3. ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్స్ మనీ-బ్యాక్ పథకం


ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్స్ మనీ-బ్యాక్ పథకం అనేది ఒక పార్టిసిపేటింగ్ నాన్-లింక్డ్ మనీ-బ్యాక్ పథకం. ఇది సర్వైవల్ ప్రయోజనాల ద్వారా మీ బిడ్డ విద్య, పెళ్లి లేదా వారిని పెంచడంలో అయ్యే ఏవైనా ఇతర ఖర్చుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. అదనంగా, మీరు ముందు ఎంచుకున్న వ్యవథి ముగిసే వరకు, మీ పిల్లవాడికి ప్రమాద కవరేజీ మరియు అనేక సర్వైవల్ ప్రయోజనాలను కూడా పొందుతారు. రెగ్యులర్ ప్రీమియంలను, వార్షికంగా, అర్ధవార్షికంగా, త్రైమాసికంగా లేదా నెలవారీగా, ఈసీఎస్ లేదా ఎసెసెస్ విధానాల ద్వారా చెల్లించవచ్చు. మీరు మొదటి మూడు సంవత్సరాల ప్రీమియం మొత్తాలను చెల్లించిన తర్వాత, పాలసీ వ్యవథిలోపు ఎప్పుడైనా మీరు పాలసీని సరెండర్ చేయవచ్చు.

ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్స్ మనీ-బ్యాక్ పథకం

సంప్రదాయక మరియు మనీ-బ్యాక్ పిల్లల పథకం

ప్రవేశ వయసు

0-12 సంవత్సరాలు

ప్రీమియం చెల్లించే పద్దతి

వార్షికంగా, అర్థ-వార్షికంగా, త్రైమాసికంగా లేదా నెలవారీగా, ఈసీఎస్ లేదా ఎసెసెస్ విధానాల ద్వారా మాత్రమే 

పాలసీ కాలవ్యవథి

25 సంవత్సరాలు - ప్రవేశ వయసు

వైద్య పరీక్ష

అవసరం లేదు

కనీస భరోసా మొత్తం

రూ. 100,000/-

 

ప్రధాన ఫీచర్లు:

 • గరిష్ట భరోసా మొత్తానికి ఏ విధమైన పరిమితీ లేదు.
 • మొదటి మూడు సంవత్సరాల ప్రీమియం మొత్తాలను చెల్లించిన తర్వాత, లోన్ తీసుకునే సౌలభ్యం మీకు అందుబాటులో ఉంటుంది.
 • ఒక సర్వైవల్ ప్రయోజనంగా, క్రమ కాల వ్యవథుల తర్వాత, డబ్బు వెనక్కి చెల్లించడానికి ఈ పథకం బాధ్యత వహిస్తుంది.

ఈ పథకం యొక్క ప్రయోజనాలు:

మరణ ప్రయోజనం: రిస్క్ వ్యవథి ప్రారంభమవటానికి ముందే పాలసీదారు మరణిస్తే, సాధారణ మరణ ప్రయోజన మొత్తం చెల్లించబడుతుంది. రిస్క్ వ్యవథి ప్రారంభమయ్యాక పాలసీదారు మరణిస్తే, మరణ ప్రయోజన మొత్తం సాధారణ భరోసా మొత్తం + సమకూరిన బోనస్ + చివరి అదనపు బోనస్ గా చెల్లించబడుతుంది.

సర్వైవల్ ప్రయోజనం: భరోసా మొత్తంలో 20% తిరుగు నగదు చెల్లింపుగా, 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతీ 2 సంవత్సరాల కాలానికీ చెల్లించబడుతుంది.

4. ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పథకం


ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పథకం, ఆకర్షణీయమైన పొదుపు మరియు ఆర్థిక రక్షణల ప్రత్యేక మిశ్రమాన్ని అందించే ఒక నాన్-లింక్డ్ పార్టిసిపేటింగ్ పథకం. మీరు గణాంకాలను చూసినట్లయితే, ఇది ఎల్ఐసీ వారి అత్యంత ఎక్కువగా కొనుగోలు చేయబడే పథకం అని మీకు అర్థమవుతుంది. అనేక ప్రయోజనాలు (మెచ్యూరిటీ తర్వాత కూడా ప్రమాద కవరేజీతో పాటుగా) కలిగి ఉండడం మూలంగా, సంస్థ దీనిని ప్రముఖంగా ప్రత్యేకమైన పథకంగా చూపించుకుంటుంది. ఎల్ఐసీ జీవన్ ఆనంద్, బోనస్ సౌలభ్యంతో కలిపి వచ్చే ఒక పూర్తి ఎండోమెంట్ మరియు సంపూర్ణ జీవిత బీమా పాలసీ.

ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పథకం

సంప్రదాయక పార్టిసిపేటింగ్ ఎండోమెంట్ పథకం

ప్రవేశ వయసు

18-50 సంవత్సరాలు

భరోసా మొత్తం (కనీసం-గరిష్టం)

రూ. 1 లక్ష - అపరిమితంగా

లోన్ సౌలభ్యం 

అందుబాటులో ఉంటుంది

ఎంచుకోదగిన ప్రయోజనాలు

ఎల్ఐసీ ప్రమాద మరణ ప్రయోజనం లేదా వైకల్య ప్రయోజనం.

ఎల్ఐసీ వారి న్యూ టర్మ్ అస్యూరెన్స్ రైడర్

పన్ను ప్రయోజనం

ఆదాయ పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80సి కింద అందుబాటులో ఉంటుంది

 

ప్రధాన ఫీచర్లు:

 • ఈ పథకం కుటుంబానికి ఆర్థిక కవరేజీని అందిస్తుంది. 
 • లోన్ సౌలభ్యం అందించడం ద్వారా డబ్బు అవసరాలకు పనికొచ్చే విధంగా ఉంటుంది. 
 • ప్రీమియం చెల్లింపు రాయితీలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. 
 • ప్రీమియం చెల్లింపుపై రిబేట్లు కూడా అనుమతించబడతాయి.
 • అదనపు ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తే, ప్రమాద మరణ మరియు వైకల్య ప్రయోజన రైడర్లు కూడా ఈ పథకం కింద అందుబాటులో ఉంటాయి.
 • ప్రీమియం చెల్లింపు మొత్తాలకు ఆదాయ పన్ను ప్రయోజనం బీమా చేసుకున్న వ్యక్తికి ఉంటుంది.

ఈ పథకం యొక్క ప్రయోజనాలు:

 • ఈ పథకం కింద, పాలసీ వ్యవథి తర్వాత జీవించి ఉన్న పక్షంలో, రెండింతల మరణ ప్రయోజనం.
 • ఒక సాధారణ ప్రీమియం, అధిక బోనస్ రేటు మరియు అద్భుతమైన లిక్విడిటీ ఫీచర్లను ఈ పథకం కలిగి ఉంది.
 • మెచ్యూరిటీ సమయంలో, పాలసీదారు ఒక పెద్ద మొత్తం చెల్లింపు పొందుతారు.
 • పాలసీదారు, పాలసీ వ్యవథిలోపే మరణించిన పక్షంలో, మరణ భరోసా మొత్తం + చివరి అదనపు బోనస్ + సులభ తిరుగు బోనస్ చెల్లించబడుతుంది.
 • పాలసీదారు, పాలసీ వ్యవథిని దాటి జీవించిన పక్షంలో, సాధారణ భరోసా మొత్తం + చివరి అదనపు బోనస్ + సులభ తిరుగు బోనస్ సర్వైవల్ ప్రయోజనంగా చెల్లించబడుతుంది.

ఈ పాలసీ యొక్క అత్యుత్తమ విషయం ఏమిటంటే, పాలసీదారు పాలసీ వ్యవథి తర్వాత జీవించి, మెచ్యూరిటీ మొత్తం చెల్లించబడినా కూడా, ప్రీమియం మొత్తాల చెల్లింపుతో బీమా కవరేజీ కొనసాగుతుంది. పథకం యొక్క మెచ్యూరిటీ తర్వాత కూడా ఇది ప్రయోజనాలను అందించే విధంగా ఉండడం వలన, జీవితంలో ఎప్పటికీ బాధ్యతలను కలిగి ఉండే మహిళలకు ఇది చాలా ఉత్తమమైనది.

5. ఎల్ఐసీ జీవన్ ఉమంగ్


ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ అనేది మీ కుటుంబ సురక్షిత భవిష్యత్తు కోసం పొదుపు మరియు ఆదాయాల మిశ్రమ ప్రయోజనాలను అందించే పథకం. ఇది ఎల్ఐసీ అందించే ఉత్తమ లాభాలతో కూడిన నాన్-లింక్డ్ పూర్తి జీవిత బీమా పథకాలలో ఒకటి. ఈ పథకం 100 సంవత్సరాల వయసు వరకు కవరేజీ అందించే బీమా పాలసీలలోనే ఒక అద్భుతమైన పథకం. పాలసీ వ్యవథి తర్వాత పాలసీదారుకు ఒక నిర్దిష్టమైన భరోసా మొత్తం చెల్లించబడుతుంది. 

ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ పథకం

ఎండోమెంట్ మరియు సంపూర్ణ జీవిత బీమా పథకం

ప్రవేశ వయసు

90 రోజులు

భరోసా మొత్తం

(కనీసం-గరిష్టం) రూ. 2 లక్షలు - అపరిమితంగా

లోన్

అందుబాటులో ఉంటుంది

ప్రీమియం చెల్లించే పద్దతి

వార్షికంగా, అర్థ-వార్షికంగా, త్రైమాసికంగా మరియు నెలవారీగా (ఎసెసెస్ మరియు ఎన్ఏసీహెచ్ మాత్రమే)

పన్ను ప్రయోజనం

ఆదాయ పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80సి కింద అందుబాటులో ఉంటుంది

 

ప్రధాన ఫీచర్లు:

 • ఈ పథకం, పాలసీ వ్యవథి తర్వాత జీవించి ఉంటే, ప్రతీ సంవత్సరం భరోసా మొత్తంలో 8% ను సర్వైవల్ ప్రయోజనంగా చెల్లిస్తుంది.
 • 100 సంవత్సరాల వయసు వరకు రక్షణనిచ్చే సంపూర్ణ కవరేజీ
 • అదనపు ప్రీమియం చెల్లింపుపై, ఈ పథకంతో ప్రమాద మరణ, టర్మ్ మరియు వైకల్య రైడర్లు అందుబాటులో ఉంటాయి.
 • మీ డబ్బు అవసరాల కోసం లోన్ సౌలభ్యం అందుబాటులో ఉంటుంది.
 • రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పథకం లాగా పనిచేస్తుంది. 
 • ఈ పథకం కింద ప్రీమియంను చెల్లించడానికి అనేక చెల్లింపు కాలాలు అందుబాటులో ఉంటాయి.

ఈ పథకం యొక్క ప్రయోజనాలు:

మరణ ప్రయోజనం: రిస్క్ వ్యవథి ప్రారంభమవటానికి ముందే పాలసీదారు మరణిస్తే, అప్పటివరకు చెల్లించిన పూర్తి ప్రీమియంల మొత్తం, ఏవైనా వడ్డీలను మినహాయించి, చెల్లించబడుతుంది. రిస్క్ వ్యవథి ప్రారంభమయ్యాక పాలసీదారు మరణిస్తే, చివరి అదనపు బోనస్, సమకూరిన బోనస్‌లు మరియు సాధారణ భరోసా మొత్తం కలిపి నామినీ(ల)కి చెల్లించబడుతుంది.

మెచ్యూరిటీ ప్రయోజనం: పాలసీ మెచ్యురిటీకి వచ్చాక, ‘మెచ్యూరిటీ భరోసా మొత్తం,’ చివరి బోనస్ తో పాటుగా సంక్రమిత తిరుగు బోనస్‌లను కలిపి మెచ్యూరిటీ ప్రయోజనంగా చెల్లించబడుతుంది.

సర్వైవల్ ప్రయోజనం: పాలసీ మెచ్యూరిటీ ముగిసిన తర్వాత జీవించి ఉన్న పాలసీదారుకు, ప్రతీ సంవత్సరం, సాధారణ భరోసా మొత్తంలో 8% సర్వైవల్ ప్రయోజనం చెల్లించబడుతుంది.

6. ఎల్ఐసీ జీవన్ ప్రగతి


ఎల్ఐసీ జీవన్ ప్రగతి అనేది లాభాలతో కూడిన నాన్-లింక్డ్ పార్టిసిపేటింగ్ ఎండోమెంట్ పథకం. పాలసీ కాలవ్యవథిలో ప్రతీ 5 సంవత్సరాలకు ప్రమాద కవరేజీ ఆటోమాటిక్ గా పెంచబడడం ఈ పథకం యొక్క ప్రత్యేక లక్షణం. ఇది ఒకే పథకంలో నగదు సంరక్షణ మరియు పొదుపుల మిశ్రమం.

ఎల్ఐసీ జీవన్ ప్రగతి

ఎండోమెంట్ పథకం

ప్రవేశ వయసు

12-45 సంవత్సరాలు

భరోసా మొత్తం (కనీసం-గరిష్టం) 

రూ. 1.5 లక్షలు - అపరిమితంగా

లోన్ సౌలభ్యం

అందుబాటులో ఉంటుంది

ప్రీమియం చెల్లించే పద్దతి

వార్షికంగా, అర్థ-వార్షికంగా, త్రైమాసికంగా మరియు నెలవారీగా

పన్ను ప్రయోజనం

ఆదాయ పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80సి మరియు 10(10డీ) కింద అందుబాటులో ఉంటుంది

 

ప్రధాన ఫీచర్లు:

 • ప్రతీ 5 సంవత్సరాల సమయానికి జీవిత కవరేజీ ఆటోమాటిక్ గా పెంచబడడం
 • కనీసం మూడు సంవత్సరాలకు ప్రీమియం చెల్లిస్తే, లోన్ సౌలభ్యం అందుబాటులో ఉంటుంది.
 • ప్రమాద మరణ మరియు వైకల్య రైడర్ల వంటి పలు రైడర్లు అందుబాటులో ఉంటాయి.
 • వార్షిక మరియు అర్థ-వార్షిక పాలసీలను ఎంచుకున్న పక్షంలో, ప్రీమియం చెల్లింపుపై రిబేట్లు
 • మొదటి 3 పాలసీ సంవత్సరాల పూర్తి ప్రీమియం చెల్లింపు తర్వాత పాలసీని సరెండర్ చేసే అవకాశం

ఈ పథకం యొక్క ప్రయోజనాలు:

మరణ ప్రయోజనం: పాలసీ వ్యవథికి ముందే పాలసీదారు మరణిస్తే, భరోసా మొత్తం, దానితోపాటుగా వచ్చే సులభ తిరుగు బోనస్ మరియు చివరి అదనపు బోనస్ వంటి బోనస్‌లతో కలిపి మరణ ప్రయోజనంగా నామినీ(ల)కి చెల్లించబడుతుంది.

మెచ్యూరిటీ ప్రయోజనం: పాలసీ వ్యవథి ముగిసిన తర్వాత జీవించి ఉన్న పాలసీదారుకు, మెచ్యూరిటీ భరోసా మొత్తంతో పాటుగా, సులభ తిరుగు బోనస్ మరియు చివరి అదనపు బోనస్ వంటి బోనస్‌లతో కలిపి మెచ్యూరిటీ ప్రయోజనంగా చెల్లించబడుతుంది.

సారాంశం

ఎల్ఐసీ ఆఫ్ ఇండియా మార్చ్ 2 2020 న ఎల్ఐసీ ఎస్ఐఐపీ (సింగల్ ప్రీమియం) మరియు ఎల్ఐసీ నివేశ్ ప్లస్ (రెగ్యులర్ ప్రీమియం) అనే 2 కొత్త యూనిట్-లింక్డ్ పథకాలను ప్రారంభించింది.

ఎల్ఐసీ భారతదేశంలోనే అత్యంత నమ్మకమైన మరియు అత్యుత్తమ ర్యాంకింగ్ కలిగిన బీమా సంస్థ. వివిధ వ్యక్తుల విభిన్న అవసరాల కోసం, ఈ సంస్థ 20 కి పైగా పథకాల సమూహాన్ని అందిస్తోంది. 2019 లో కూడా వారు అనేక పాలసీలను ప్రారంభించారు, రానున్న కాలంలో మరిన్ని పాలసీలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో మంచి గౌరవం మరియు అద్భుతమైన ప్రయోజనాలతో, మీరు నిశ్చింతగా మీ డబ్బును ఎల్ఐసీకి కట్టవచ్చు.