ఎల్ఐసీ జీవన్ లాభ్ పథకం
 • హామీ మనీ బ్యాక్ ప్లాన్
 • అధిక రాబడి పెట్టుబడి ఎంపికలు
 • పన్ను ప్రయోజనాలు
PX step

ప్రీమియం పోల్చండి

1

2

పుట్టినరోజు
ఆదాయం
| లింగ

1

2

ఫోన్ నం.
పేరు
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

ఎల్ఐసీ జీవన్ లాభ్ (ప్లాన్ నం. 936) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా వారు అందించే అత్యంత ప్రభావవంతమైన పథకాలలో ఒకటి. ఇది వినియోగదారులకు అనేక ప్రయోజనాల సేవలను అందించే ఒక పరిమిత ప్రీమియం చెల్లింపు ఉండే, లాభాలతో కూడిన నాన్-లింక్డ్ (నగదు/షేర్ మార్కెట్ మరియు ఈక్విటీ ఆధారిత నిధులపై ఆధారపడని) ఎండోమెంట్ పథకం.

ఈ పథకం, మీకు రక్షణ ఉండేలా మరియు మీరు డబ్బును మెరుగ్గా ఆదా చేసుకునేలా, రక్షణ మరియు పొదుపుల మిశ్రమాన్ని మీకు అందిస్తుంది. బీమా చేయబడిన వ్యక్తి ఒకవేళ అకాల మరణానికి గురైతే, వారి కుటుంబానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. 8-59 సంవత్సరాల వయసు పరిథిలో ఉన్న వారు ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఇది, మీరు పరిమిత కాలానికి ప్రీమియంలు చెల్లించి, పాలసీ వ్యవథి ముగిసినప్పటి నుంచి, మెచ్యూరిటీ ప్రయోజనాలను పొందగలిగే ఒక ప్రాథమిక ఎండోమెంట్ పథకం. పాలసీ వ్యవథిలో ఎప్పుడైనా, పాలసీదారు మరణిస్తే, ఎంచుకోబడిన నామినీ, మరణ ప్రయోజన భరోసా మొత్తాన్ని మరియు బోనస్ లను పొందుతాడు.

ఎల్ఐసీ జీవన్ లాభ్ ముఖ్య ఫీచర్లు

పథకం రకం

పరిమిత ప్రీమియం చెల్లింపు కాలంతో కూడిన నాన్-లింక్డ్ ఎండోమెంట్ పథకం

పథకం ఆధారం

వ్యక్తిగతమైన

పాలసీ కవరేజీ

మెచ్యూరిటీ ప్రయోజనం, మరణ ప్రయోజనం, సులభ తిరుగు బోనస్ మరియు చివరి (అదనపు) బోనస్ (ఏదైనా ఉంటే)

పాలసీ కాలవ్యవథి

16 సంవత్సరాలు (10 సంవత్సరాల పీపీటీ)

21 సంవత్సరాలు (15 సంవత్సరాల పీపీటీ)

25 సంవత్సరాలు (16 సంవత్సరాల పీపీటీ)

ప్రీమియం చెల్లింపు కాలం (పీపీటీ)

10 సంవత్సరాలు

15 సంవత్సరాలు

16 సంవత్సరాలు

లోన్

ఈ పాలసీపై లోన్లు పొందవచ్చు. ప్రీమియంలు 3 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా చెల్లించబడి ఉండి, మీ ప్లాన్ సరెండర్ విలువని పొందితే, లోన్లు పొందవచ్చు.

ఉచిత పరిశీలన సమయం

పాలసీ పత్రాలుపొందిన పదిహేను రోజుల వరకు. చెల్లించబడిన ప్రీమియం మొత్తం, ఆ కొంత సమయంలో కవరేజీ రిస్క్ ప్రీమియం, వైద్య పరీక్షల ఖర్చులు, స్టాంప్ డ్యూటీ, ఇతరాలను మినహాయించి, తిరిగి చెల్లించబడుతుంది.

నామినేషన్లు

నామినేషన్ సౌలభ్యం బీమా చట్ట ప్రకారం అందించబడుతుంది

సాధారణ భరోసా మొత్తం

కనీసం - రూ. 2 లక్షలు

గరిష్టం - పరిమితి లేదు

సాధారణ భరోసా మొత్తం (రూ.10,000 గుణిజాలలో మాత్రమే)

ప్రీమియం చెల్లించే పద్దతి

వార్షికంగా, అర్ధవార్షికంగా, త్రైమాసికంగా, నెలవారీగా (చెల్లింపు ఈసీఎస్ మోడ్ ద్వారా మాత్రమే), ఎసెసెస్ (సాలరీ సేవింగ్ స్కీమ్) మోడ్

రివైవల్

మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుంచి 5 సంవత్సరాల వరకు, మిగిలి ఉన్న ప్రీమియంలను, వడ్డీ మరియు ఇతరులతో సహా చెల్లించి, పథకాన్ని రివైవ్ చేసుకునే అవకాశం పాలసీదారుకు ఉంటుంది.

ఎల్ఐసీ జీవన్ లాభ్ ప్రయోజనాలు

ఇప్పుడు తెలుగులో న్యూ జీవన్ లాభ్ పాలసీ ప్రయోజనాల గురించి తెలుసుకోండి.

ఎల్ఐసీ జీవన్ లాభ్ పథకం కింద పేర్కొన్న విధంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది:

మరణ ప్రయోజనం: బీమా చేయబడిన వ్యక్తి మరణించిన పక్షంలో, లబ్ధిదారులు కింది ప్రయోజనాలను పొందుతారు:

 • భరోసా మొత్తం (కట్టిన ప్రీమియం మొత్తాల 105% కి తక్కువ కాకుండా) 
 • ఏవైనా సులభ తిరుగు బోనస్లు (వార్షిక ప్రీమియంకు 10 రెట్లు లేదా సాధారణ భరోసా మొత్తాలలో ఏది అధిక మొత్తంగా ఉంటే అది)
 • చివరి అదనపు బోనస్లు ఏవైనా ఉంటే

మెచ్యూరిటీ ప్రయోజనం: పాలసీదారు పాలసీ వ్యవథి వరకు జీవించి ఉంటే, ఈ కింది ప్రయోజాలను పొందుతారు:

 • మెచ్యూరిటీ భరోసా మొత్తం
 • ఏవైనా సులభ తిరుగు బోనస్లు (ఎల్ఐసీ పనితీరుపై ఆధారపడి ప్రకటించబడుతుంది)
 • చివరి అదనపు బోనస్లు (ఏవైనా ఉంటే)

రాయితీ: ఎల్ఐసీ తన వినియోగదారులకు అనేక ప్రోత్సాహకాలు అందించడంలో ప్రఖ్యాతి గాంచింది.

ప్రీమియం చెల్లించే పద్దతిపై ఆధారపడే రాయితీ:

 • వార్షిక ప్రీమియంకు: టేబుల్ లో ఉంచిన ప్రీమియంపై 2%
 • అర్థ వార్షిక ప్రీమియంకు: టేబుల్ లో ఉంచిన ప్రీమియంపై 1%
 • ఎంచుకున్న అధిక భరోసా మొత్తంపై ఆధారపడిన రాయితీ
 • రూ. 5 లక్షల నుంచి రూ. 9.9 లక్షల వరకు: రూ.10,000 సాధారణ భరోసా మొత్తానికి, అందులో 1.25%
 • రూ. 10 లక్షల నుంచి రూ. 14.9 లక్షల వరకు: రూ.10,000 సాధారణ భరోసా మొత్తానికి, అందులో 1.50%
 • రూ. 15 లక్షల నుంచి రూ. 14.9 లక్షల వరకు: రూ.10,000 సాధారణ భరోసా మొత్తానికి, అందులో 1.75%

లోన్లు: ఎల్ఐసీ జీవన్ లాభ్ పథకం, లోన్ సౌలభ్యంతో వస్తుంది.

 • మొదటి 3 సంవత్సరాల పాటు పూర్తిగా క్రమం తప్పకుండా ప్రీమియంలను చెల్లించి, మీ పాలసీపై లోన్ తీసుకోవచ్చు.
 • కొనసాగుతున్న పాలసీలకు, గరిష్టంగా సరెండర్ విలువలో 90% వరకు లోన్ పొందవచ్చు
 • పెయిడ్ అప్ పాలసీలకు, గరిష్టంగా సరెండర్ విలువలో 80% వరకు లోన్ పొందవచ్చు
 • ఈ లోన్లపై వడ్డీ రేటును, ఎల్ఐసీ, ప్రతీ కేసును బట్టి విడిగా నిర్ణయిస్తుంది.

లాభాలలో భాగస్వామ్యం: పాలసీ కొనసాగుతూ ఉంటే, ఒక సులభ తిరుగు బోనస్ బీమా చేసుకున్న వ్యక్తికి ఇవ్వబడుతుంది. ఎందుకంటే, ఇది ఒక పార్టిసిపేటింగ్ పాలసీ కాబట్టి. మరణం లేదా మెచ్యూరిటీ సందర్భంలో పాలసీ చెల్లింపు సంవత్సరంలో కూడా, ఈ పాలసీ కింద అదనపు బోనస్ ను ఇవ్వవచ్చు. 

బాగా అనుకూలమైన పథకం: తమ పిల్లల చదువు లేదా పెళ్ళి కోసం ఆలోచన చేసే వారికి ఈ పాలసీ బాగా అనుకూలమైనది.

ఆదాయ పన్ను ప్రయోజనం: ఈ పాలసీ కింద కట్టిన ప్రీమియం మొత్తాలకు, ఆదాయ పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80సి కింద ఆదాయ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అలాగే మెచ్యూరిటీ మొత్తానికి కూడా, సెక్షన్ 10(10డి) కింద ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది.

జీవిత కవరేజీ (మరణ సమయంలో చెల్లింపు): పాలసీ వ్యవథిలోనే, మరణం సంభవించిన పక్షంలో, మరణ తేదీ వరకు పాలసీ అమలులో ఉన్న కాలానికి సంబంధించిన అన్ని ప్రీమియంలను కట్టి ఉన్నప్పుడు, మరణ సమయ చెల్లింపు, సాధారణ భరోసా మొత్తం+సంక్రమించిన సులభ తిరుగు బోనస్+చివరి అదనపు బోనస్ గా ఉంటుంది. సంవత్సరాల వారీగా జీవన్ లాభ్ యొక్క వార్షిక బోనస్ కింద ఇవ్వబడింది:

న్యూ జీవన్ లాభ్ బోనస్ వివరాలు (భరోసా మొత్తం 1000 కి)

పాలసీ సంవత్సరం 

16 సంవత్సరాల పాలసీ 

21 సంవత్సరాల పాలసీ 

25 సంవత్సరాల పాలసీ 

2018-19 43 47 50
2017-18 43 47 50
2016-17 43 47 50

ఎల్ఐసీ జీవన్ లాభ్ తీసుకోవటానికి కావలసిన అర్హత ప్రమాణాలు

 

కనీసం 

గరిష్టం 

భరోసా మొత్తం 

రూ. 2 లక్షలు 

పరిమితి లేదు

పాలసీ వ్యవథి (సంవత్సరాలలో)

16, 21, 25

ప్రీమియం చెల్లించే కాలం (పీపీటీ)(సంవత్సరాలలో)

10, 16 సంవత్సరాల పాలసీకి 

15, 21 సంవత్సరాల పాలసీకి

16, 25 సంవత్సరాల పాలసీకి

ప్రవేశ వయసు 

8 సంవత్సరాలు (పూర్తిగా నిండినవి)

59 సంవత్సరాలు, 16 సంవత్సరాల పాలసీకి

54 సంవత్సరాలు, 21 సంవత్సరాల పాలసీకి

50 సంవత్సరాలు, 25 సంవత్సరాల పాలసీకి

గరిష్ట మెచ్యూరిటీ వయసు

75 సంవత్సరాలు

ప్రీమియం చెల్లించే పద్దతి

వార్షికంగా, అర్ధవార్షికంగా, త్రైమాసికంగా, నెలవారీగా

ఎల్ఐసీ జీవన్ లాభ్ ఎలా పనిచేస్తుంది?

మీరు ఎల్ఐసీ జీవన్ లాభ్ ని తీసుకునే సమయంలో, కింది వాటిని ఎంచుకోవాలి:

 • భరోసా మొత్తం (మీకు కావాలనుకునే కవరేజీ విలువ)
 • పాలసీ వ్యవధి (ఆ కవరేజీని పొందాలనుకుంటున్న కాల వ్యవథి)

ప్రీమియం చెల్లించాల్సిన కాలం పాలసీ వ్యవధిని బట్టి నేరుగా కింది విధంగా నిర్ణయించబడుతుంది

 • 16 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంచుకుంటే, ప్రీమియం చెల్లింపు 10 సంవత్సరాలకు ఉంటుంది.
 • 21 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంచుకుంటే, ప్రీమియం చెల్లింపు 15 సంవత్సరాలకు ఉంటుంది.
 • 25 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంచుకుంటే, ప్రీమియం చెల్లింపు 16 సంవత్సరాలకు ఉంటుంది.

ఈ పథకంలో మీ వార్షిక ప్రీమియం, పైన పేర్కొన్న రెండు అంశాలపై, అలాగే పాలసీ తీసుకుంటున్నప్పుడు మీ వయసుపై ఆధారపడి ఉంటుంది.

ఇది ఒక పార్టిసిపేటింగ్ పథకం కాబట్టి, మీరు పాలసీ కాలమంతా కింది అంశాలను పొందుతారు:

 • సులభ తిరుగు బోనస్లు
 • చివరి అదనపు బోనస్

ఈ విలువలు ఖచితమైనవి కావు మరియు ఎల్ఐసీ చెప్పినప్పుడు మాత్రమే మీకు ఇవి తెలుస్తాయి.

ఇప్పుడు తెలుగులో న్యూ జీవన్ లాభ్ పాలసీ రైడర్ల గురించి తెలుసుకోండి.

ఎల్ఐసీ జీవన్ లాభ్ రైడర్లు

ఎల్ఐసీ ప్రమాద మరణ మరియు వైకల్య రైడర్

బీమా చేయబడిన వ్యక్తి, పాలసీ వ్యవథిలో, ఏదైనా ప్రమాదానికి గురై, దానివలన మరణించిన పక్షంలో, ఈ ప్రమాద భరోసా మొత్తం ఎంచుకోబడిన నామినీకి చెల్లించబడుతుంది.

అలాగే, బీమా చేయబడిన వ్యక్తి, పాలసీ వ్యవథిలో, ఏదైనా ప్రమాదం వలన, వైకల్యానికి గురైతే, అప్పుడు ప్రమాద భరోసా మొత్తం, 10 సమాన వాయిదాలలో, 10 సంవత్సరాల పాటు చెల్లించబడుతుంది. 

అదనపు ప్రీమియం చెల్లించి మీరు ఈ రైడర్ ను పొందవచ్చు.

 • ప్రవేశ వయసు:
  • కనీసం: 18 సంవత్సరాలు 
  • గరిష్టం : 65 సంవత్సరాలు
 • కవరేజీ 70 సంవత్సరాల వయసుకు ముగుస్తుంది.
 • కనీస ప్రమాద ప్రయోజన భరోసా మొత్తం: రూ. 10,000
 • గరిష్ట ప్రమాద ప్రయోజన భరోసా మొత్తం, సాధారణ పాలసీ యొక్క భరోసా మొత్తం (రూ, 100 లక్షల పరిమితికి లోబడి)
 • ఈ ప్రయోజనం, రూ. 10,000 గుణిజాలలోనే చెల్లించబడుతుంది.

ఎల్ఐసీ న్యూ టర్మ్ భరోసా రైడర్

మరణం సంభవించిన పక్షంలో, మరణ ప్రయోజనం ఈ రైడర్ తో పెంచి ఇవ్వబడుతుంది. పాలసీ తీసుకునే సమయంలో అదనపు ప్రీమియం చెల్లించి మీరు ఈ రైడర్ ను ఎంచుకోవచ్చు.

 • ప్రవేశ వయసు:
  • కనీసం: 18 సంవత్సరాలు 
  • గరిష్టం : 
   • 59 సంవత్సరాలు, 16 సంవత్సరాల పాలసీకి
   • 54 సంవత్సరాలు, 21 సంవత్సరాల పాలసీకి
   • 50 సంవత్సరాలు, 25 సంవత్సరాల పాలసీకి
 • ఈ పాలసీ రైడర్ వ్యవథి ప్రధాన పాలసీ వ్యవథికి సమానంగా ఉంటుంది.
 • ప్రీమియం చెల్లింపు కాలం కూడా ప్రధాన పాలసీకి సమానంగా ఉంటుంది.
 • ఈ రైడర్ కింద కనీస భరోసా మొత్తం: రూ. 1 లక్ష.

జీవన్ లాభ్ సులభ ప్రీమియం ఉదాహరణలు

ఒక ఆరోగ్యవంతమైన, పొగాకు అలవాటు లేని పురుషునికి, వివిధ వయసు, భరోసా మొత్తం మరియు పాలసీ కాలాల ఎంపికలకు, కట్టవలసిన ప్రీమియం రేట్ల (పన్నులతో కలిపి) పట్టికను కింద చూడండి. ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రేటు 4.5%.

భరోసా మొత్తం: రూ. 2 లక్షలు

పాలసీ కాలవ్యవథి: 16, 21, 25 (సంవత్సరాలలో)

ప్రీమియం చెల్లింపు కాలం: 10, 15, 16 (సంవత్సరాలలో)

వయసు: 20, 30, 40 (సంవత్సరాలలో)

వయసు 

20 సంవత్సరాలు

30 సంవత్సరాలు

40 సంవత్సరాలు

వార్షిక ప్రీమియం

రూ. 17450

రూ. 17,512

రూ. 17,779

వార్షిక ప్రీమియం

రూ. 11,163

రూ. 11,255

రూ. 11634

వార్షిక ప్రీమియం

రూ. 9411

రూ. 9545

రూ. 10015

జీవన్ లాభ్ సరెండర్ విలువ 

ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ, మీరు 3 సంవత్సరాలు వరుసగా ప్రీమియంలు కట్టిన తర్వాత, ఏ సమయంలో అయినా సరెండర్ చేసే అనుమతినిస్తుంది. భరోసా ఇవ్వబడే సరెండర్ విలువ, కట్టిన అన్ని ప్రీమియంల మొత్తాన్ని (ఏవైనా అండర్ రైటింగ్ లేదా రైడర్ ప్రీమియంల అదనపు ఖర్చులను తగ్గించి) భరోసా సరెండర్ విలువ కారణాంకం చేత గుణించి లెక్కించబడుతుంది.

పాలసీ వ్యవథిలోని వివిధ సమయాలలో భరోసా సరెండర్ విలువ ఈ కింది విధంగా ఉంటుంది:

భరోసా సరెండర్ విలువ కారణాంకం

పాలసీ సంవత్సరం 

పీపీటీ 16 సంవత్సరాలు

పీపీటీ 21 సంవత్సరాలు

పీపీటీ 25 సంవత్సరాలు

3 30% 30% 30%
4 50% 50% 50%
5 50% 50% 50%
6 50% 50% 50%
7 50% 50% 50%
8 53.75% 52.30% 51.80%
9 57.50% 54.60% 53.50%
10 61.25% 56.90% 55.30%
11 66.00% 59.20% 57.10%
12 68.75% 61.50% 58.80%
13 72.50% 63.80% 60.60%
14 76.25% 66.20% 62.40%
15 80.00% 68.50% 64.10%
16 80.00% 70.80% 65.90%
17   73.10% 67.60%
18   75.40% 69.40%
19   77.70% 71.20%
20   80.00% 72.90%
21   80.00% 74.70%
22     76.50%
23     78.20%
24     80.00%
25     80.00%

ఎల్ఐసీ జీవన్ లాభ్ అదనపు వివరాలు

ఇప్పుడు తెలుగులో న్యూ జీవన్ లాభ్ పాలసీ ఇతర వివరాల గురించి తెలుసుకోండి.

ఉచిత పరిశీలన సమయం 

కొన్ని సందర్భాలలో, పాలసీదారు పథకంతో సంతోషంగా ఉండకపోవచ్చు. అటువంటప్పుడు, పాలసీ మొదలైన 15 రోజుల లోపు, దానిని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. దీనినే ఫ్రీ-లుక్ పీరియడ్ అంటారు. పాలసీని రద్దు చేసుకున్నాక, చెల్లించబడిన ప్రీమియం, ఏవైనా ఖర్చులను మినహాయించి, తిరిగి చెల్లించబడుతుంది.

పెయిడ్ అప్ విలువ

పాలసీదారు కనీసం 3 సంవత్సరాల పాటు ప్రీమియంలు చెల్లించి, అప్పుడు ప్రీమియంలు కట్టడం ఆపివేస్తే, అది నేరుగా పెయిడ్-అప్ అవకాశానికి అర్హత పొందుతుంది. పెయిడ్-అప్ అయిన పక్షంలో, పాలసీ ప్రయోజనాలు (మెచ్యూరిటీ మరియు మరణ చెల్లింపులు), చెల్లించబడిన మొత్తం ప్రీమియంల సంఖ్య/ చెల్లించవలసిన మొత్తం ప్రీమియంల సంఖ్య యొక్క కారణాంకంపై ఆధారపడి ఉంటాయి.

వెసులుబాటు సమయం

ఒకవేళ మీరు ప్రీమియంను గడువులోపు చెల్లించలేకపోతే, వార్షిక, అర్ధవార్షిక, త్రైమాసిక పాలసీలలో, ఒక 30 రోజుల వెసులుబాటు సమయాన్ని ఎల్ఐసీ మీకు ఇస్తుంది. నెలవారీ పాలసీలో, వెసులుబాటు సమయం 15 రోజులుగా ఉంటుంది.

మినహాయింపులు

ఆత్మహత్య: పాలసీ తీసుకున్న మొదటి సంవత్సర కాలంలోనే, పాలసీదారు ఆత్మహత్యకు పాల్పడితే, అప్పటికి కట్టిన ప్రీమియంల మొత్తంలో 80% తప్ప మరే చెల్లింపులను ఎల్ఐసీ అనుమతించదు.

జీఎస్టీ

అన్ని జీవిత బీమా పాలసీలపై 18% జీఎస్టీ (వస్తు మరియు సేవల పన్ను) విధించబడుతుంది. ఈ పన్ను భారత ప్రభుత్వం చేత విధించబడి జులై 1, 2017 నుంచి అమలులో ఉంది. ఇది పాలసీదారు కట్టే మొత్తం ప్రీమియంకు కూడా విధించబడుతుంది. ఇన్పుట్ పన్ను క్రెడిట్ ప్రయోజనాన్ని బీమా సంస్థలు అనుసరిస్తే మాత్రమే, దీనినుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.