ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ ప్లాన్
 • హామీ మనీ బ్యాక్ ప్లాన్
 • అధిక రాబడి పెట్టుబడి ఎంపికలు
 • పన్ను ప్రయోజనాలు
PX step

ప్రీమియం పోల్చండి

1

2

పుట్టినరోజు
ఆదాయం
| లింగ

1

2

ఫోన్ నం.
పేరు
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ ప్లాన్ (ప్లాన్ నం: 945) పూర్తి జీవిత బీమా కవరేజీతో వచ్చే, లాభాలతో కూడిన ఒక సంప్రదాయక, నాన్-లింక్డ్ ఎండోమెంట్ పథకం. ఈ పథకం, ప్రీమియం చెల్లింపు కాలం ముగిసినప్పటి నుండి, మీరు జీవించి ఉన్నంత వరకు, అవసరమైన కవరేజీని క్రమ చెల్లింపు ద్వారా అందిస్తుంది. పాలసీ వ్యవథి ముగిసాక లేదా పాలసీదారు పాలసీ కాలంలోనే మరణించినా, ఒక స్థిరమైన నగదు మొత్తం చెల్లించబడుతుంది. ఇది సులభ తిరుగు బోనస్లు మరియు చివరి అదనపు బోనస్ లకు అర్హత పొందే ఒక పార్టిసిపేటింగ్ పథకం.

ప్రారంభించిన తేదీ 

టేబుల్ సంఖ్య 

ఉత్పత్తి రకం 

బోనస్ 

యూఐఎన్

20 ఏప్రిల్ 2017

945

ఎండోమెంట్ + సంపూర్ణ జీవిత

ఉంది

512N312V01

ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ ప్లాన్ లోని ముఖ్యాంశాలు

 • ఇది పూర్తి జీవితానికి, అంటే, 100 సంవత్సరాల వరకు కవరేజీని అందించే ఒక వరం లాంటి బీమా పథకం
 • పాలసీ వ్యవథి ముగిసిన తర్వాత జీవించి ఉన్న పాలసీదారుకు, ప్రతీ సంవత్సరం, భరోసా మొత్తంలో 8% మనీ బ్యాక్ చెల్లించబడుతుంది.
 • ఈ పథకం కింద అధిక భరోసా మొత్తం అందుబాటులో ఉంటుంది.
 • ప్రమాద కారణంగా అంగవైకల్యం లేదా మరణ సందర్భంలో ఎల్ఐసీ వారు అందించే ప్రయోజనాల రైడర్లు మరియు టర్మ్ రైడర్ల వంటివి ఈ పథకం కింద అందుబాటులో ఉంటాయి.
 • అత్యవసర సమయాల్లో లోన్ సదుపాయం.
 • పలు ప్రీమియం చెల్లింపు వ్యవధులు అందుబాటులో ఉంటాయి.
 • ఈ పథకం యొక్క మరొక అదనపు సౌలాభ్యం, ఇది స్థిరమైన వేతనం మరియు తరచూ వచ్చే ఆదాయాలను, రెండిటి మిశ్రమాన్ని కలిగి ఉండడం
 • మెచ్యూరిటీ లేదా ముందస్తు మరణాలకు, సులభ తిరుగు బోనస్ చెల్లించబడుతుంది
 • ఎల్ఐసీ వారు ఆమోదిస్తే, చివరి అదనపు బోనస్ చెల్లించబడుతుంది
 • రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ సౌలభ్యం కోసం ఇది ఒక బాగా సరిపోయే పథకం.
 • ఆదాయ పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80సి కింద కట్టిన ప్రీమియం మొత్తానికి ఆదాయ పన్ను మినహాయింపు
 • ఆదాయ పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 10(10డి) కింద మరణ ప్రయోజనాలు లేదా మెచ్యూరిటీ మొత్తానికి ఆదాయ పన్ను మినహాయింపు

ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ ప్లాన్ ప్రోత్సాహకాలు

రిస్క్ యొక్క ప్రారంభ తేదీ

బీమా చేయబడే వ్యక్తి యొక్క వయసు 8 సంవత్సరాల కన్నా తక్కువ అయినప్పుడు, ఈ పథకం కింద రిస్క్, తనకి 8 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, ప్రవేశ తేదీ నుంచి రెండు సంవత్సరాలకు ఒక రోజు ముందు, లేదా పాలసీ వార్షిక దినానికి ఒక రోజు ముందు నుంచి ప్రారంభమౌతుంది. 8 సంవత్సరాలు లేదా ఆపైన వయసు వారికి, రిస్క్ వెంటనే ప్రారంభమౌతుంది.

మరణ ప్రయోజనం

రిస్క్ ప్రారంభమవక ముందే మరణం సంభవించిన పక్షంలో, కట్టిన ప్రీమియంకు సమానమైన మొత్తం, ఎటువంటి వడ్డీ లేకుండా ఇచ్చివేయబడుతుంది.

రిస్క్ ప్రారంభమయిన తర్వాత మరణం సంభవించిన పక్షంలో, ఒక నిర్దిష్ట ‘మరణ భరోసా మొత్తం’ మరియు సంక్రమించే సులభ తిరుగు బోనస్లు, వర్తించగల చివరి అదనపు బోనస్ ఇవ్వబడతాయి.

‘మరణ భరోసా మొత్తం’ గా, వార్షిక ప్రీమియం కు 10 రెట్లు; 

లేదా‘మెచ్యూరిటీ భరోసా మొత్తం’; 

లేదా ’భరోసా ఇవ్వబడిన సంపూర్ణ మొత్తం’ లలో అధికంగా ఉన్న మొత్తం, అంటే ‘సాధారణ భరోసా మొత్తం’ మరణ సమయంలో ఇవ్వబడుతుంది. ఈ మరణ ప్రయోజనం, మరణించిన రోజు వరకు కట్టిన ప్రీమియంల మొత్తానికి 105% కన్నా తక్కువ ఉండదు.

సర్వైవల్ జోడింపు

ప్రీమియం చెల్లింపు కాలం (పీపీటీ) పూర్తయిన తర్వాత, అన్ని ప్రీమియంలు ఖచ్చితంగా చెల్లించి ఉంటే, అప్పటినుంచి మెచ్యూరిటీ వరకు, ప్రతీ సంవత్సరం, భరోసా మొత్తంలో 8% కు సమానమైన మొత్తం, పాలసీదారుకు చెల్లించబడుతుంది. ప్రీమియం చెల్లింపు కాలం ముగియగానే, ఈ సర్వైవల్ ప్రయోజనం యొక్క మొదటి చెల్లింపు చేయబడుతుంది. అప్పటినుంచి ప్రతీ సంవత్సరం చివరిలో, పాలసీదారు జీవించి ఉన్నంత వరకు, లేదా మెచ్యూరిటీ తేదీకి ముందటి పాలసీ సంవత్సరం వరకు, ఏది ముందు తేదీ అయితే దాని ప్రకారం, ఈ ప్రయోజనం యొక్క చెల్లింపు చేయబడుతుంది.

మెచ్యూరిటీ ప్రయోజనం

పాలసీ వ్యవధి విజయవంతంగా పూర్తయి, పాలసీదారు అన్ని ప్రీమియంలు ఖచ్చితంగా చెల్లించి ఉంటే, ‘మెచ్యూరిటీ భరోసా మొత్తం’ మరియు సంక్రమించే సులభ తిరుగు బోనస్లు, వర్తించగల చివరి అదనపు బోనస్ ఇవ్వబడతాయి. ఇక్కడ ‘మెచ్యూరిటీ భరోసా మొత్తం,’ ‘సాధారణ భరోసా మొత్తం’ కి సమానం.

ఆదాయ పన్ను ప్రయోజనం

ఈ పాలసీ కింద కట్టిన ప్రీమియం మొత్తాలకు, ఆదాయ పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80సి కింద మరియు మరణ లేదా మెచ్యూరిటీ ప్రయోజనాల మొత్తాలకు, సెక్షన్ 10(10డి) కింద ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది.

లాభాలలో భాగస్వామ్యం

పాలసీ కింద తీసుకోబడిన చర్యలు మరియు ఎల్ఐసీ యొక్క నిర్ణయం మీద కూడా ఆధార పడి, పాలసీ వ్యవథి సమయంలోని లాభాలలో జీవన్ ఉమంగ్ ప్లాన్ భాగస్వామి కావచ్చు.

ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ ఎంచుకోగల రైడర్ల ప్రయోజనం

 • ప్రమాద మరణ మరియు వైకల్య ప్రయోజన రైడర్: పాలసీ వ్యవథిలోనే ఒక అదనపు ప్రీమియం (సాధారణ ప్రీమియం కన్నా ఎక్కువ) చెల్లిస్తే, పాలసీదారు ఏదైనా ప్రమాద కారణంగా మరణించినా లేదా ఏదైనా వైకల్యం పొందినా, ఆ సమయంలో అందుబాటులో ఉండేలా, ఒక అదనపు మొత్తాన్ని లబ్దిదారుకు ఈ రైడర్ అందిస్తుంది.
 • ప్రమాద ప్రయోజన రైడర్: ఏదైనా ప్రమాదం జరిగిన 180 రోజుల లోపు పాలసీదారు దాని కారణంగా మరణిస్తే, లబ్ధిదారు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ రైడర్ ని కూడా పాలసీ వ్యవథిలో ఒక అదనపు ప్రీమియం (సాధారణ ప్రీమియం కన్నా ఎక్కువ) చెల్లించి తీసుకోవచ్చు.
 • కొత్త టర్మ్ భరోసా రైడర్: ఈ రైడర్ మరణ ప్రయోజన మొత్తాన్ని పెంచుతుంది మరియు దీనిని కూడా అదనపు ప్రీమియం చెల్లించి పొందవచ్చు. అంతేకాకుండా, ఈ ప్రయోజనాన్ని 35 సంవత్సరాల వరకు లేదా పాలసీదారు వయసు 75 సంవత్సరాలు అయిన పాలసీ సంవత్సరం వరకు ఏ తేదీ ముందు వస్తే దాని ప్రకారం ఈ ప్రయోజనం చెల్లించబడుతుంది.

*గమనిక: ఈ ప్రయోజనాలను ప్రీమియం చెల్లింపు కాలంలో, ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు కానీ, కనీసం 5 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు కాలం మిగిలి ఉండాలి మరియు రైడర్ ప్రయోజనం, సాధారణ భరోసా మొత్తం కన్నా ఎక్కువ ఉండరాదు. 

ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ ఇతర వివరాలు

లోన్ సౌలభ్యం: ఈ పాలసీ, పాలసీదారు డబ్బు అవసరాల కోసం, లోన్ సౌలభ్యాన్ని అందిస్తుంది. ప్రీమియంలను 3 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా చెల్లించి, మీ ప్లాన్ సరెండర్ విలువని పొందినప్పుడు మాత్రమే, సరెండర్ విలువలో 90% వరకు లోన్ పొందవచ్చు.

ఆత్మహత్య నిబంధన: పాలసీ తీసుకున్న ఒక సంవత్సరం లోపు, పాలసీదారు ఆత్మహత్యకు పాల్పడితే, కట్టిన ప్రీమియంల మొత్తంలో 80% లబ్దిదారుకు తిరిగివ్వబడుతుంది. భీమా చేయబడిన వ్యక్తి యొక్క పాలసీ ప్రవేశ వయసు 8 సంవత్సరాల కన్నా తక్కువయి ఉంటే, ఈ నిబంధన వర్తించదు.

పాలసీ రివైవల్: ప్రీమియంలను సరైన సమయంలో, వెసులుబాటు సమయం ముగిసే వరకు కూడా చెల్లించకపోతే, పాలసీ ఆగిపోతుంది. అయితే, ఆ మొదటి చెల్లించని ప్రీమియం కట్టాల్సి ఉండిన తేదీ నుంచి 5 సంవత్సరాల వరకు, అయితే మెచ్యూరిటీ సమయానికి ముందు వరకు మాత్రమే, దానిని రివైవ్ చేసుకునే అవకాశం పాలసీదారుకు ఉంటుంది. అలా రెవైవ్ చేసుకోవడానికి, పాలసీదారు మిగిలి ఉన్న ప్రీమియంలను, ఎల్ఐసీ వారు నిర్ణయించిన స్థిరమైన వడ్డీరేటు ప్రకారం చెల్లించాలి.

ఉచిత పరిశీలన సమయం: పాలసీదారుకు పాలసీ యొక్క ‘నిబంధనలు మరియు షరతులు’ నచ్చకపోతే, పాలసీ మొదలైన పదిహేను రోజుల లోపు, దానిని వెనక్కి ఇచ్చేసే అవకాశం ఉంటుంది. ఎల్ఐసీ ఆ పాలసీని రద్దు చేసి, చెల్లించబడిన ప్రీమియంను, కవరేజీ కాలం యొక్క రిస్క్ ప్రీమియం (సాధారణ పథకం మరియు ఉంటే రైడర్లవి) ను స్టాంప్ డ్యూటీతో సహా మినహాయించి, తిరిగి చెల్లిస్తుంది.

సంక్రమించే తేదీ: 18 సంవత్సరాలు దాటగానే వెంటనే ఆటోమేటిక్ గా సంక్రమణ వర్తిస్తుంది; లేదా ఎల్ఐసీ పాలసీదారు యొక్క సంక్రమణని ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే వర్తిస్తుందని పరిగణించి, అనుమతిస్తే, ఆ విధంగా వర్తిస్తుంది.

ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ నిర్దిష్ట వివరాలు

ఇప్పుడు తెలుగులో న్యూ జీవన్ ఉమంగ్ గురించి అన్ని వివరాలను తెలుసుకోండి

కనీస ప్రవేశ వయసు (పూర్తి అయిన)

90 రోజులు 

ప్రీమియం చెల్లింపు కాలం (PPT)

15, 20, 25 మరియు 30 సంవత్సరాలు 

గరిష్ట ప్రవేశ వయసు (దగ్గరి పుట్టినరోజు) (సంవత్సరాలలో)

15 సంవత్సరాల PPT కి 55,

20 సంవత్సరాల PPT కి 50,

25 సంవత్సరాల PPT కి 45,

30 సంవత్సరాల PPT కి 40,

మెచ్యూరిటీ వయసు

100 సంవత్సరాలు, దగ్గరి పుట్టినరోజుకి

పాలసీ కాలవ్యవథి

100 సంవత్సరాలు, ప్రవేశ వయసు ప్రకారం

కనీస భరోసా మొత్తం

రూ. 2 లక్షలు (రూ. 25,000 గుణిజాలలో)

గరిష్ట భరోసా మొత్తం

పరిమితి లేదు

ప్రీమియం చెల్లించే పద్దతి

వార్షికంగా, అర్ధవార్షికంగా, త్రైమాసికంగా మరియు నెలవారీగా (SSS మరియు NACH మాత్రమే)

పద్దతిని బట్టి రాయితీ (ప్రీమియం చెల్లించే పద్దతి)

వార్షికంగా అయితే 2%,

అర్ధవార్షికంగా అయితే 1%,

త్రైమాసికంగా మరియు నెలవారీగా అయితే ఏమీ ఉండదు (SSS మరియు NACH మాత్రమే)

జీవన్ ఉమంగ్ ప్లాన్ గురించి తెలుసుకోవలసిన విషయాలు

రాయితీ గురించి: టేబుల్లో ఇవ్వబడిన ప్రీమియంపై అందించబడే రాయితీలు [అధిక సాధారణ భరోసా మొత్తం (BSA)]:

 • రూ. 2 లక్షలు - రూ. 4.75 లక్షలు [ఏమీ లేదు]
 • రూ. 5 లక్షలు - రూ. 9.75 లక్షలు [1.25% BSA]
 • రూ. 10 లక్షలు - రూ. 24.75 లక్షలు [1.75% BSA]
 • రూ. 25 లక్షలు మరియు ఆపైన [2% BSA]

పెయిడ్ అప్ విలువ: పాలసీదారు ప్రీమియంలను కనీసం 3 సంవత్సరాల పాటు కూడా చెల్లించకుండా ఉండి, ఆ పాలసీ ఎప్పటికీ రివైవ్ చేయబడకపోతే, ఈ పథకం కింద ఉన్న ప్రయోజనాలన్నీ వెసులుబాటు సమయం తర్వాత రద్దవుతాయి మరియు ఏ చెల్లింపూ చేయబడదు.

కనీసం 3 సంవత్సరాల పాటు ప్రీమియంలు చెల్లించి, ఆపివేయబడిన పాలసీ చెల్లుతుంది కానీ పాలసీ వ్యవథి మొత్తం, పెయిడ్ అప్ పాలసీగానే కొనసాగుతుంది.

దీని కింద, మరణ సమయంలో భరోసా మొత్తాన్ని, ‘పెయిడ్ అప్ భరోసా మొత్తం’ గా, ఈ విధంగా లెక్కగడతారు: [(కట్టిన ప్రీమియంల సంఖ్య/కట్టాల్సిన మొత్తం ప్రీమియంల సంఖ్య) x ‘మరణ భరోసా మొత్తం)]

అలాగే, మెచ్యూరిటీ సమయంలో భరోసా మొత్తాన్ని, ‘మెచ్యూరిటీ పెయిడ్ అప్ భరోసా మొత్తం’ గా, ఈ విధంగా లెక్కగడతారు: [(కట్టిన ప్రీమియంల సంఖ్య/కట్టాల్సిన మొత్తం ప్రీమియంల సంఖ్య) x మెచ్యూరిటీ భరోసా మొత్తం)]

సరెండర్ విలువ: 3 సంవత్సరాలు వరుసగా ప్రీమియంలు కట్టబడి ఉంటేనే, ఆ పాలసీని ఏ సమయంలో అయినా సరెండర్ చేయవచ్చు. పాలసీని సరెండర్ చేసాక, ఎల్ఐసీ, భరోసా సరెండర్ విలువ లేదా ప్రత్యేక సరెండర్ విలువలలో దేని విలువ ఎక్కువ ఉంటే సరెండర్ విలువను చెల్లిస్తుంది.

ప్రత్యేక సరెండర్ విలువను, ఐఆర్డీఏఐ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా) వారి అనుమతితో, ఎల్ఐసీ అప్పుడప్పుడూ మార్చుతూ, నిర్ణయిస్తూ ఉంటుంది.

పాలసీ కాలవ్యవథిలో ఇవ్వబడే భరోసా సరెండర్ విలువ, కట్టిన మొత్తం ప్రీమియంల మొత్తాన్ని, ఈ ప్రీమియంల మొత్తానికి వర్తించే భరోసా సరెండర్ విలువ కారణాంకం చేత గుణించి లెక్కిస్తారు. ఈ భరోసా సరెండర్ విలువ కారణాంకాలు, పాలసీ కాలవ్యవథి మరియు సరెండర్ చేయబడుతున్న పాలసీ సంవత్సరాలను బట్టి, శాతాలుగా నిర్ణయించబడతాయి.

మినహాయింపులు: ఆత్మహత్యల విషయంలో, ఈ పాలసీ చెల్లదు.

 • పాలసీ తీసుకున్న మొదటి సంవత్సరంలోనే, పాలసీదారు ఆత్మహత్యకు పాల్పడితే, అప్పటికి కట్టిన ప్రీమియంల మొత్తంలో 80% తప్ప మరే చెల్లింపులను ఎల్ఐసీ అనుమతించదు, అది కూడా పాలసీ కొనసాగుతున్నప్పుడు మాత్రమే. అయితే, భీమా చేయబడిన వ్యక్తి యొక్క పాలసీ ప్రవేశ వయసు 8 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే, ఈ నిబంధన వర్తించదు.
 • పాలసీ రివైవల్ తేదీ నుండి ఒక సంవత్సరంలోపు, పాలసీదారు ఆత్మహత్యకు పాల్పడితే, మరణం వరకు కట్టిన ప్రీమియంల మొత్తంలో 80% లేదా సరెండర్ విలువలలో ఏది ఎక్కువ మొత్తమైతే అది చెల్లించబడుతుంది. మరే ఇతర చెల్లింపులనూ ఈ పథకం కింద ఎల్ఐసీ అనుమతించదు. అయితే, భీమా చేయబడిన వ్యక్తి యొక్క పాలసీ ప్రవేశ వయసు 8 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే, ఈ నిబంధన వర్తించదు.