ఎల్ఐసీ ఆన్లైన్ లాగిన్ పద్దతి
 • హామీ మనీ బ్యాక్ ప్లాన్
 • అధిక రాబడి పెట్టుబడి ఎంపికలు
 • పన్ను ప్రయోజనాలు
PX step

ప్రీమియం పోల్చండి

1

2

పుట్టినరోజు
ఆదాయం
| లింగ

1

2

ఫోన్ నం.
పేరు
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

ఎల్ఐసీ వారి ఆన్లైన్ సేవలు, పాలసీదారులకు వెబ్ సైట్ ద్వారా అత్యుత్తమ సేవలు అందించేందుకు ఎల్ఐసీ ఆఫ్ ఇండియా వారు వేసిన ఒక ముందడుగు. వారు అందించే ఈ-సర్వీసులను సౌలభ్యంగా ఉపయోగించుకోవడానికి ఎవరైనా ఎల్ఐసీ వెబ్ పోర్టల్ లో సులభంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రతీ వినియోగదారుని అవసరాలను చేరుకోవడానికి, ఎల్ఐసీ వారు అనేక ఆన్లైన్ సౌలభ్యాలను అందుబాటులోకి తెచ్చారు. వాటిలో ఒక ప్రధాన ఫీచర్, మీరు ఆన్లైన్ సేవల కోసం నమోదు చేసుకోగల ‘ఎల్ఐసీ ఆన్లైన్ లాగిన్’ పద్దతి. మీ పాలసీకి సంబంధించి అవసరమైన పూర్తి సమాచారాన్ని పొందటానికి మీరు చేయవలసిందల్లా, ఎల్ఐసీ వెబ్ పోర్టల్ లో లాగిన్ అవ్వడానికి ఒక యూజర్ ఐడీ ని మరియు దానికి ఒక పాస్వర్డ్ ని క్రియోట్ చేసుకోవడమే.

ఇది చాలా సులభమైన మరియు ఎటువంటి ఇబ్బందీ లేని ప్రక్రియ కాబట్టి, ప్రతీ ఎల్ఐసీ పాలసీ ఉన్న వ్యక్తీ తప్పకుండా ఆ సంస్థ అందించే ఎల్ఐసీ ఆన్లైన్ లాగిన్ పద్దతిని ఉపయోగించుకోవాలి.

ఈ ఆన్లైన్ పోర్టల్ మీకు కావలసిన అన్ని సేవలను మీరు ఇంట్లోనే సౌలభ్యంగా కూర్చుని పొందగలిగేలా చేస్తుంది. మీ చేతిలో ఇటువంటి అద్భుతమైన సేవలను పెట్టుకుని, మీరు క్యూలలో నిలబడడం ఎందుకు? ఎల్ఐసీ ఆన్లైన్ లాగిన్ పద్దతి డబ్బు మరియు సమయాన్ని ఆదా చేస్తుంది కూడా. ఇప్పుడు మీరు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఎల్ఐసీ వారి ఆన్లైన్ లాగిన్ పద్దతిని సులభంగా అర్థంచేసుకుని, ప్రాక్టీసు చేయడానికి మీకు సహాయపడే వివరాలను చూద్దాం.

ఎల్ఐసీ ఆన్లైన్ సేవలను ఎందుకు ఉపయోగించుకోవాలి?

ఎల్ఐసీ ఆన్లైన్ పోర్టల్, మీకు అవసరమైన సేవను కేవలం కొన్ని క్లిక్కులతో అందించే లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా వారి ముఖ్యమైన మరియు సహాయక కార్యక్రమం. మీరు ఇంతకుముందు బ్రాంచ్ ఆఫీసుకు వెళ్లి మాత్రమే పొందగల అనేక సేవలను ఇప్పుడు ఆన్లైన్లోనే పొందవచ్చు. ఈ సేవల మూలంగా మీరు మీ పని చేయించుకోవడం కోసం బ్రాంచ్ ఆఫీసుకు వెళ్లనవసరం లేదు, వెళ్లి క్యూలలో నిలబడనవసరం లేదు.

అంతే కాకుండా, మీరు కంపెనీ మరియు పాలసీల గురించి అప్డేట్లు మరియు అనేక ఇతర ప్రయోజనాలు కూడా పొందుతారు. దీనికి మీరు మొదట ఎల్ఐసీ ఆన్లైన్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఎల్ఐసీ ఈ-సర్వీసులను పొందటానికి ఆన్లైన్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి.

ఎల్ఐసీ ఆన్లైన్ పోర్టల్ లోని అకౌంట్ లోకి లాగిన్ అయి, కింద ఇవ్వబడిన ఆన్లైన్ సౌకర్యాలలో దాదాపు అన్నిటినీ మీరు పొందవచ్చు.

 • పాలసీ వివరాలు
 • పాలసీ స్థితి
 • పాలసీ ప్రతిపాదన మరియు సంబంధిత చిత్రాలు
 • ఆన్లైన్ చెల్లింపు
 • ప్రయోజనం యొక్క వివరణ
 • అసైన్మెంట్ మరియు నామినీ స్థితి
 • ఫిర్యాదు నమోదు
 • చెల్లింపు స్థితి
 • లోన్ స్థితి
 • రివైవల్ కొటేషన్లు
 • ప్రీమియం సంబంధిత ప్రశ్నలు
 • పాలసీ నియమాలు మరియు ఇతర ఫీచర్లు

ఎల్ఐసీ ఆన్లైన్ సేవలకు ఎవరు రిజిస్టర్ చేసుకోవచ్చు?

భారతదేశంలో ఉన్న ఎల్ఐసీ పాలసీదారులందరూ పైసా ఖర్చు లేకుండా సులభంగా ఆన్లైన్ సేవల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంకా అదనంగా, జీవిత భాగస్వామి లేదా పిల్లల పేర్లను కూడా బీమా చేయించుకున్న వ్యక్తి తన అకౌంట్ లోనే జత చేసి రిజిస్టర్ చేసుకునే అద్భుతమైన ఫీచర్ని కూడా ఎల్ఐసీ అందిస్తోంది. మీరు వ్యక్తిగత రిజిస్ట్రేషన్ తో పాటుగా మీ జీవిత భాగస్వామి లేదా పిల్లలవి కూడా జత చేసుకోవచ్చు. దీనివలన వారు అదనంగా రిజిస్టర్ చేసుకునే భారం తగ్గుతుంది.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ను కంపెనీ వెబ్ సైటులో సులభంగా చేసుకోవచ్చు : www[dot]licindiia[dot]in

అయితే, వ్యక్తులు వారు తీసుకున్న పాలసీలకు మాత్రమే రిజిస్టర్ చేసుకోగలరు, అంటే వారి అధీనంలో వారి పేరు మీదే లేక వారి మైనర్ పిల్లల పేరుపై ఉన్నవాటికి మాత్రమే. పిల్లలు 18 సంవత్సరాల వయసుకు చేరుకోగానే, వారి పేరుపై ఉన్న ఎల్ఐసీ పాలసీల ఈ-సర్వీసులను పొందటానికి, కొత్త యూజర్ ఐడీలతో వారు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి.

పెళ్ళైన దంపతులు వారి పాలసీలను కలిపి ఒకే అకౌంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. భర్త లేదా భార్య ఇద్దరూ తమ తమ సొంత యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్ లతో ఎల్ఐసీ పోర్టల్ లో లాగిన్ అవ్వవచ్చు.

ఎల్ఐసీ లాగిన్ రిజిస్టర్ చేసుకోవడం - కొత్త యూజర్

కొత్త యూజర్ గా రిజిస్టర్ చేసుకుని, లాగిన్ అయి మీ పాలసీ వివరాలను ఆన్లైన్లో చూసుకోవడానికి క్రమ పద్దతి కింద ఇవ్వబడింది:

   1. మొదట ఎల్ఐసీ వారి అధికారిక వెబ్సైటు (www[dot]licindiia[dot]in) ని తెరిచి అక్కడ ‘ఆన్లైన్ సర్వీసెస్’ లేదా ‘ఈ-సర్వీసెస్’ కింద ఉన్న ‘కస్టమర్ పోర్టల్’ అనే అంశాన్ని ఎంచుకోండి. 
    ఎల్‌ఐసి ఇ-సేవలు 
   2. ఇప్పుడు అక్కడ ఉన్న ‘న్యూ యూజర్’ బటన్ ని క్లిక్ చేయండి.  
     ఎల్ఐసి యూజర్
   3. ఇప్పుడు మీ పాలసీ నంబరు, ప్రీమియం మొత్తం, పుట్టినతేదీ మొదలైన పాలసీ వివరాలను ఇచ్చి రిజిస్టర్ అవడం కోసం ఇవ్వండి. అన్నిటినీ నింపిన తర్వాత ‘ప్రొసీడ్’ బటన్ ని క్లిక్ చేయండి.

    ఎల్ఐసి లాగిన్ వివరాలు 
   4. ఇప్పుడు అక్కడ మీరు ఎల్ఐసీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి, కొత్త ‘యూజర్ నేమ్’ మరియు ‘పాస్వర్డ్’ లను క్రియోట్ చేసుకోవాలి.
   5. ఇక మీరు మీ కొత్త ‘యూజర్ నేమ్’ మరియు ‘పాస్వర్డ్’ లతో లాగిన్ అవ్వవచ్చు. వాటిని ఇచ్చి ‘సబ్మిట్’ బటన్ ని క్లిక్ చేయండి. 
     ఎల్ఐసి పాస్వర్డ్ మర్చిపోయాను 
   6. మీ పాలసీని రిజిస్టర్ చేసుకుని మీకు అవసరమైన వివరాలను పేజీలో ఎడమ వైపు ఉన్న‘ఎన్రోల్ పాలసీస్’ నుంచి పొందవచ్చు. ‘వ్యూ ఎన్రోల్డ్ పాలసీస్’ ని ఎంచుకోండి. 
   7. మీరు రిజిస్టర్ చేసుకున్న పాలసీల స్థితిని తెలుసుకోవడానికి అక్కడ ఇచ్చే ‘నమూనా చిత్రం’ లోని అక్షరాలను ధృవీకరించండి.

ఆన్లైన్లో ప్రీమియం చెల్లింపు కోసం ఎల్ఐసీ లాగిన్ పద్దతి [రిజిస్టర్ చేసుకున్న వారికి]

   1. ఎల్ఐసీ వారి అధికారిక వెబ్సైటు (www[dot]licindiia[dot]in) ని తెరిచి అక్కడ ‘ఆన్లైన్ సర్వీసెస్’ కింద ఉన్న ‘కస్టమర్ పోర్టల్’ అనే అంశాన్ని ఎంచుకోండి.  ఎల్ఐసి ప్రవేశించండి 
   2. మీరు ‘ఎల్ఐసీస్ ఈ-సర్వీసెస్’ పేజీకి వస్తారు. ఇక్కడ మీరు ‘రిజిస్టర్డ్ యూజర్’ బటన్ ని క్లిక్ చేయండి.  ఎల్ఐసి యూజర్ 
   3. మీ రోల్ ని ‘కస్టమర్’ అని ఎంచుకుని, ‘యూజర్ ఐడీ/ఈమెయిల్/మొబైల్,’ ‘పాస్వర్డ్’ మరియు ‘పుట్టినతేదీ’ వంటి వివరాలను నింపండి. 
     ఎల్ఐసి యూజర్పేరు 
   4. పూర్తి వివరాలను పరిశీలించడానికి ‘కస్టమర్ పోర్టల్’ లో ఉన్న ‘సెల్ఫ్ పాలసీస్’ ని ఎంచుకోండి. *గమనిక: ఒకవేళ మీ ప్రీమియం చెల్లింపు గడువు దగ్గరలో ఉంటే, ‘పే ప్రీమియం’ ను ఎంచుకోవడం మర్చిపోకండి. లేకపోతే, ‘ప్రీమియం డ్యూ డేట్’ అని స్క్రీన్ మీద వస్తుంది. 
     ఎల్ఐసి లాగిన్ వివరాలు 
   5. ‘పే ప్రీమియం’ ని ఎంచుకుని అవసరమైన సమాచారాన్ని అందించండి.
   6. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగులలో నుండి మీరు చెల్లించే విధానాన్ని ఎంచుకుని చెల్లింపును పూర్తి చేయండి.

ఎల్ఐసీ వారి మార్గాలు మరియు ప్రీమియం చెల్లింపు విధానాలు

ఎల్ఐసీ వెబ్సైటు చెల్లింపు విధానాలు 

నెట్ బ్యాంకింగ్ 

క్రెడిట్ కార్డు 

డెబిట్ కార్డు 

-

అధికారిక బ్యాంకులు

యాక్సిస్ బ్యాంకు

కార్పొరేషన్ బ్యాంకు

-

-

ఫ్రాంచైజీలు

ఏపీ ఆన్లైన్

ఎంపీ ఆన్లైన్

సువిధా ఇన్ఫోసర్వ్

ఈజీ బిల్ పే

మర్చంట్

ప్రీమియం పాయింట్ ఏజెంట్లు

లైఫ్-ప్లస్ (ఎస్బీఏ)

రిటైర్డ్ ఎల్ఐసీ ఎంప్లాయీ కలెక్షన్

-

 

తెలుగులో ఎల్ఐసీ ఆన్లైన్ ప్రీమియం చెల్లింపులు చేసే ప్రక్రియ యొక్క పైన తెలిపిన వివరాలు మరియు వివరణలు మీకు సహాయ పడ్డాయని ఆశిస్తున్నాము. ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోకుండానే చెల్లింపులు ఎలా చేయాలో తెలుసుకుందాం.

ఆన్లైన్ ప్రీమియం చెల్లింపు కోసం ఎల్ఐసీ లాగిన్ పద్దతి [రిజిస్టర్ చేసుకోని వారికి]

   1. ఎల్ఐసీ వారి అధికారిక వెబ్ సైట్ (www[dot]licindiia[dot]in) ని తెరిచి అక్కడ ‘పే ప్రీమియం ఆన్లైన్’ ని ఎంచుకోండి.
   2. అప్పుడు వచ్చిన తర్వాతి పేజీలో రెండు ఎంపికలు ---‘పే డైరెక్ట్’ మరియు ‘త్రూ కస్టమర్ పోర్టల్’ ఉంటాయి. వాటిలో మీరు ‘పే డైరెక్ట్’ బటన్ ని క్లిక్ చేయండి.
   3. ఇప్పుడు కొత్త ‘యూజర్ నేమ్’ మరియు ‘పాస్వర్డ్’ లు పెట్టుకుని పూర్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
   4. కొత్త ‘యూజర్ నేమ్’ మరియు ‘పాస్వర్డ్’ లతో లాగిన్ అవ్వండి.
   5. మీ పాలసీని రిజిస్టర్ చేసుకుని మీకు అవసరమైన వివరాలను పేజీలో ఎడమ వైపు ఉన్న‘ఎన్రోల్ పాలసీస్’ నుంచి పొందవచ్చు. ‘వ్యూ ఎన్రోల్డ్ పాలసీస్’ ని ఎంచుకోండి మరియు స్థితిని తెలుసుకోవడానికి అక్కడ ఇచ్చే ‘నమూనా చిత్రం’ లోని అక్షరాలను ధృవీకరించండి. 

ఎల్ఐసీ లాగిన్ పద్దతి [పాస్వర్డ్ మర్చిపోయినపుడు]

మనం రోజువారీ జీవితంలో అనేక విషయాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, ఎల్ఐసీ అకౌంట్ ‘యూజర్ ఐడీ’ లేదా ‘పాస్వర్డ్’ లను మర్చిపోవడం సాధారణంగా జరిగే విషయం. అయితే దీనివలన మీరు ఎల్ఐసీ వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వడానికి అంతగా ఇబ్బందులేవీ పడనక్కరలేదు. ఎల్ఐసీ అకౌంట్ ‘యూజర్ ఐడీ’ మరియు ‘పాస్వర్డ్’ లను పొందడం చాలా సులభమైన పద్దతి.

   1. ఎల్ఐసీ వారి అధికారిక వెబ్ సైట్ (www[dot]licindiia[dot]in) ని తెరిచి అక్కడ ‘ఆన్లైన్ సర్వీసెస్’ కింద ఉన్న ‘కస్టమర్ పోర్టల్’ ని ఎంచుకోండి.  ఎల్ఐసి సేవ 
   2. ఇప్పుడు వచ్చిన ‘ఎల్ఐసీస్ ఈ-సర్వీసెస్’ పేజీలో, ‘రిజిస్టర్డ్ యూజర్’ బటన్ ని ఎంచుకోండి.  ఎల్ఐసి యూజర్ 
   3. తర్వాత వచ్చిన లాగిన్ పేజీలో ‘ఫర్గాట్ యూజర్ ఐడీ/పాస్వర్డ్?’ లింకును క్లిక్ చేయండి.  
     ఎల్ఐసి యూజర్పేరు 
   4. ‘‘ఫర్గాట్ పాస్వర్డ్’ ను ఎంచుకుని, మీ ‘యూజర్ ఐడీ’ మరియు ‘పుట్టినతేదీ’ లను ఇవ్వండి 
     పాస్వర్డ్ మర్చిపోయాను 
   5. అక్కడ ఇచ్చే ‘నమూనా చిత్రం’ లోని అక్షరాలను ఉన్నవి ఉన్నట్టుగా నింపి ‘సబ్మిట్’ ను క్లిక్ చేయండి. 
   6. ఇప్పుడు మీ ‘పాస్వర్డ్’ మీరు రిజిస్టర్ చేసిన ఈమెయిల్ ఐడీ మరియు మొబైల్ నంబర్లకు వస్తుంది. దానితో మీరు తిరిగి కొత్త ‘పాస్వర్డ్’ తో లాగిన్ అవ్వవచ్చు.

జీవిత భాగస్వామి/పిల్లల వివరాలను ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం ఎలా?

   1. మీరు రిజిస్టర్ చేసుకున్న ‘యూజర్ ఐడీ’ మరియు ‘పాస్వర్డ్’ లతో ఎల్ఐసీ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.
   2. మీరు జత చేయాలనుకునే దానిని బట్టి, ‘స్పౌస్ పాలసీస్’ లేదా ‘చైల్డ్ పాలసీస్’ లలో ఒకదానిని క్లిక్ చేయండి. 
   3. పాలసీ నంబర్, పుట్టినతేదీ వంటి వివరాలను ఇవ్వండి. 
   4. ‘సబ్మిట్’ ను నొక్కగానే, మీ జీవిత భాగస్వామి లేదా పిల్లల పాలసీ మీ అకౌంట్ లోనే జత చేయబడుతుంది. 
   5. ‘ప్రొఫైల్ మానేజ్మెంట్’ మెనూ నుండి మీరు రిజిస్టర్ చేసిన జీవిత భాగస్వామి/పిల్లల వివరాలను ధృవీకరించుకోండి.

*గమనిక: ‘పాలసీ నంబర్’ మరియు ‘పుట్టినతేదీ’ వివరాలు, మీరు రిజిస్టర్ చేసుకున్న పాలసీ నంబర్ మరియు పుట్టినతేదీ లకు సరిపోవాలి. 

ఎల్ఐసీ లాగిన్ పద్దతి [యూజర్ ఐడీ మర్చిపోయినపుడు]

   1. ఎల్ఐసీ వారి అధికారిక వెబ్ సైట్ (www[dot]licindiia[dot]in) ని తెరిచి అక్కడ ‘ఆన్లైన్ సర్వీసెస్’ కింద ఉన్న ‘కస్టమర్ పోర్టల్’ ని ఎంచుకోండి. ఎల్ఐసి సేవ
   2. ‘కస్టమర్ పోర్టల్’ ని క్లిక్ చేసాక వచ్చిన ‘ఎల్ఐసీస్ ఈ-సర్వీసెస్’ పేజీలో, ‘రిజిస్టర్డ్ యూజర్’ బటన్ ని ఎంచుకోండి. ఎల్ఐసి యూజర్
   3. అప్పుడు వచ్చిన లాగిన్ పేజీలో ‘ఫర్గాట్ యూజర్ ఐడీ/పాస్వర్డ్?’ లింకును క్లిక్ చేయండి.
     ఎల్ఐసి యూజర్పేరు 
   4. ‘‘యూజర్ ఐడీ’ ని ఎంచుకుని, మీ ‘పాలసీ నంబర్,’ ‘ప్రీమియం’ మరియు ‘పుట్టినతేదీ’ లను ఇవ్వండి 
     పాస్వర్డ్ మర్చిపోయాను 
   5. అక్కడ ఇచ్చే ‘నమూనా చిత్రం’ లోని అక్షరాలను ఉన్నవి ఉన్నట్టుగా నింపి ‘సబ్మిట్’ ను క్లిక్ చేయండి. 
   6. ఇప్పుడు మీ ‘యూజర్ ఐడీ’ మీరు రిజిస్టర్ చేసిన ఈమెయిల్ ఐడీ మరియు మొబైల్ నంబర్లకు వస్తుంది. దానితో మీరు తిరిగి కొత్త ‘యూజర్ ఐడీ’ తో లాగిన్ అవ్వవచ్చు. 
     LIC Thank You

**మీరు మీ అకౌంట్ లోకి లాగిన్ అవ్వగానే మీ పాలసీ యొక్క అన్ని వివరాలను మీరు ముందులాగే పొందవచ్చు.

సారాంశం

ఎల్ఐసీ లాగిన్ అందుబాటు, అనేక సేవల కోసం మీరు ఉపయోగించుకోగల ఒక ముఖ్యమైన ఫీచర్. ఈ సమాచారం మీకు సహాయపడిందని, సౌకర్యవంతంగా ఉంటుందని, మరియు ఈ ఎల్ఐసీ లాగిన్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీకు స్పష్టంగా అర్థమైందని మేము ఆశిస్తున్నాము. మీరు ఆన్లైన్లో మీ పాలసీ స్థితిని, బోనస్ సమాచారాన్ని, ప్రీమియం గడువుల క్యాలెండరును, గత చెల్లింపుల సమాచారాన్ని తెలుసుకోవచ్చు మరియు ప్రీమియం చెల్లింపులను క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు లేదా ఏ ఇతర ఆన్లైన్ చెల్లింపు విధానాల ద్వారా అయినా చేయవచ్చు. ఎల్ఐసీ వెబ్ పోర్టల్ లో మీ అకౌంట్ లోకి లాగిన్ అయ్యాక, మీరు పూర్తి సమాచారాన్ని, అలాగే గణాంకాల నిర్దిష్ట వివరాలను మీ అనువుగా ఉండే విధంగా ఆ పేజీలో పొందుతారు. కాబట్టి, ఈ ఆర్టికల్ లో క్రమానుసారంగా ఇవ్వబడిన సూచనలు మరియు వివరాల సహాయంతో, మీ ఇంటి నుంచే మీరు సౌకర్యవంతంగా ఎల్ఐసీ వారి సేవలను సులభంగా పొందగలుగుతారు.