ఎల్ఐసీ ఆన్లైన్ చెల్లింపు
 • హామీ మనీ బ్యాక్ ప్లాన్
 • అధిక రాబడి పెట్టుబడి ఎంపికలు
 • పన్ను ప్రయోజనాలు
PX step

ప్రీమియం పోల్చండి

1

2

పుట్టినరోజు
ఆదాయం
| లింగ

1

2

ఫోన్ నం.
పేరు
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) సెప్టెంబర్ 1, 1956 లో, జీవిత బీమా ప్రాముఖ్యత ను భారతదేశమంతటా వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో స్థాపించబడింది. అప్పటినుంచి, ఇప్పటివరకు, ఎల్ఐసీ అనేక మైలురాళ్లను అధిగమించి అత్యుత్తమ ప్రదర్శనతో జీవిత బీమా వ్యాపారంలో రికార్డులను నెలకొల్పింది. ముందు రోజుల్లో, ప్రీమియం మొత్తాలు ఎల్ఐసీ ఏజెంట్ల ద్వారా లేదా దగ్గర్లో ఉన్న ఎల్ఐసీ బ్రాంచ్ ఆఫీస్ వద్ద కట్టించుకునేవారు.

కానీ పాలసీదారులకు భారాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో, ఎల్ఐసీ ఇండియా ప్రీమియం మొత్తాల చెల్లింపుకు ఈ ఆన్లైన్ చెల్లింపు సేవలను ప్రారంభించింది. అయితే ఇప్పటికీ చాలామంది పాలసీదారులకు ఈ ఎల్ఐసీ ఆన్లైన్ చెల్లింపు గురించి తెలియక, ఎల్ఐసీ ఏజెంట్ల మీదే ఆధారపడుతున్నారు. చెల్లింపు ప్రక్రియను మరింత వేగవంతంగా మరియు స్వతంత్రంగా చేయడానికి, పాలసీదారు అప్పటికే రిజిస్టర్ చేసుకుని ఉన్నా, లేకపోయినా కూడా, కొన్ని నిమిషాలలోనే ప్రీమియంలు చెల్లించగలిగేలా, పాలసీ స్థితిని చూసుకోగలిగేలా, ఎల్ఐసీ ఆన్లైన్ చెల్లింపు సేవలను ఎల్ఐసీ సంస్థ ప్రారంభించింది. అదనంగా, ఒక అకౌంట్ నుంచే ఒక పాలసీ కన్నా ఎక్కువ వాటికి కూడా మీరు చెల్లింపు చేయవచ్చు (అయితే ఎల్ఐసీ దీనిని సిఫారసు చేయదు). ఎల్ఐసీ అందించే పాలసీలకు సులభమైన మరియు సురక్షితమైన ఆన్లైన్ ప్రీమియం చెల్లింపు చేయడానికి ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి.

ఎల్ఐసీ ఆన్లైన్ ప్రీమియం చెల్లింపు విధానాలు

ఎల్ఐసీ వెబ్సైటు 

నెట్ బ్యాంకింగ్ 

క్రెడిట్ కార్డు / డెబిట్ కార్డు 

భీమ్ యూపీఐ

ఆన్లైన్ వాలెట్లు 

అధికారిక బ్యాంకులు

యాక్సిస్ బ్యాంకు

కార్పొరేషన్ బ్యాంకు

-

-

ఫ్రాంచైజీలు

ఏపీ (ఆంధ్ర ప్రదేశ్) ఆన్లైన్

ఎంపీ (మధ్య ప్రదేశ్) ఆన్లైన్

సువిధా ఇన్ఫోసర్వ్

ఈజీ బిల్ పే

అధికారిక మర్చంట్లు

ప్రీమియం పాయింట్ ఏజెంట్లు

లైఫ్-ప్లస్ (ఎస్బీఏ)

రిటైర్డ్ ఎల్ఐసీ ఎంప్లాయీస్ కలెక్షన్

-

ఎల్ఐసీ ఆఫ్ లైన్ ప్రీమియం చెల్లింపు విధానాలు

 • ఆఫ్ లైన్ డబ్బు బిల్లు చెల్లింపు (ఎల్ఐసీ ఆఫీసులలో)
 • చెక్కు ద్వారా చెల్లింపు
 • నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) చెల్లింపు

ప్రీమియం చెల్లింపు పద్దతి [ఎల్ఐసీ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకున్న వారికి]

అప్పటికే రిజిస్టర్ చేసుకుని ఉన్నవారు ఎల్ఐసీ ప్రీమియంను చెల్లించే క్రమం తెలుగులో తెలుసుకోండి

 1. ఎల్ఐసీ వారి అధికారిక వెబ్ సైట్ (www[dot]licindia[dot]in) ని తెరిచి అక్కడ పేజీలో ఎడమ వైపు ఉన్న ‘ఆన్లైన్ సర్వీసెస్’ ని చూడండి. అందులో ‘పే ప్రీమియం ఆన్లైన్’ ని క్లిక్ చేయండి. 
  ఎల్ఐసి ఒక సేవ 
 2. ఇప్పుడు వచ్చిన పేజీలో మీకు రెండు అంశాలు కనిపిస్తాయి,‘పే డైరెక్ట్ (లాగిన్ అవ్వకుండా)’ మరియు ‘త్రూ కస్టమర్ పోర్టల్.’ 
   ఎల్ఐసి యూజర్ 
 3. ‘త్రూ కస్టమర్ పోర్టల్’ ని ఎంచుకోండి, వెంటనే మరొక పేజీలో ఎల్ఐసీ ‘లాగిన్ ఐడీ,’ మరియు ‘పాస్వర్డ్’ అని వస్తాయి.
 4. మీరు ‘యూజర్ ఐడీ’ మరియు ‘పాస్వర్డ్’ వివరాలను నింపి ‘సబ్మిట్’ ను నొక్కండి. 
   ఎల్ఐసి యూజర్పేరు 
 5. మీరు లాగిన్ అవ్వగానే, అక్కడ ఉన్న ‘సెల్ఫ్ పాలసీస్’ ని క్లిక్ చేసి, మీ పాలసీ వివరాలను పొందవచ్చు. 
   ఎల్ఐసి ఖాతా లాగిన్ 
 6. ‘సెల్ఫ్ పాలసీస్’ పేజీ రాగానే, అక్కడ ఉన్న మీ ‘పాలసీ నంబర్’ పై నొక్కి మరింత సమాచారాన్ని పూర్తిగా మరొక పేజీలో మీరు పొందవచ్చు. 
   ఎల్ఐసి విధాన వివరాలు 
 7. పాలసీ వివరాలతో పాటే, ఆన్లైన్ చెల్లింపు కోసం ఉన్న ‘చెక్ & పే’ ఎంపికని కూడా మీరు అక్కడ చూడవచ్చు.
 8. మీరు చెల్లింపు చేయాలనుకుంటున్న పాలసీని ఎంచుకుని, ‘చెక్ & పే’ ని క్లిక్ చేయండి. అప్పుడు మీరు చెల్లింపు చేయాల్సిన పేమెంట్ గేట్ వే కు వస్తారు.
 9. మీరు ‘చెక్ & పే’ ని నొక్కగానే, నెట్ బ్యాంకింగు, క్రెడిట్/డెబిట్ కార్డు, వాలెట్ వంటి మీరు చెల్లింపు చేయగల పలు రకాల విధానాలతో ఉన్న పేజీకి వస్తారు. వాటి నుండి మీరు చెల్లించే విధానాన్ని ఎంచుకుని ముందుకు వెళ్లి ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపును పూర్తి చేయండి.
 10. చెల్లింపు విధానాన్ని మీరు ఎంచుకున్నాక, బ్యాంకుల జాబితా మీకు కనిపిస్తుంది. ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపు ప్రక్రియకు పాలసీదారు వెసులుబాటు పన్ను అలాగే సేవా పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీ బ్యాంకును ఎంచుకుని ‘సబ్మిట్’ ను నొక్కండి.
 11. అన్ని వివరాలను నింపి ‘మేక్ పేమెంట్’ ను క్లిక్ చేయగానే మీ చెల్లింపు ప్రాసెస్ చేయబడుతుంది. మీరు చెల్లింపు రశీదును రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ లో పొందుతారు. మీ చెల్లింపు పూర్తయింది!

ప్రీమియం చెల్లింపు పద్దతి [ఎల్ఐసీ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోని వారికి]

ఇప్పుడు రిజిస్టర్ చేసుకోని వారు ఎల్ఐసీ ప్రీమియంను చెల్లించే క్రమం తెలుసుకోండి

 1. ఎల్ఐసీ వారి వెబ్ సైట్ (www[dot]licindia[dot]in) ని తెరిచి అక్కడ పేజీలో ఎడమ వైపు ‘ఆన్లైన్ సర్వీసెస్’ కోసం చూడండి. 
 2. అందులో ‘పే ప్రీమియం ఆన్లైన్’ ని క్లిక్ చేయండి. అప్పుడు వచ్చిన తర్వాతి పేజీలో ‘పే ప్రీమియం త్రూ ఈ-సర్వీసెస్,’ మరియు ‘ఎల్ఐసీ పే డైరెక్ట్’ అని రెండు ఎంపికలు ఉంటాయి. 
 3. మీరు ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి, ఆన్లైన్ ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపు కోసం ‘ఎల్ఐసీ పే డైరెక్ట్’ బటన్ ని క్లిక్ చేయండి.
 4. ఇప్పుడు వచ్చిన కొత్త పేజీలో పాలసీ నంబర్, పుట్టినతేదీ, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ వంటి అవసరమైన వివరాలను నింపండి.
 5. నింపిన తర్వాత ‘సబ్మిట్’ ను క్లిక్ చేయండి.
 6. తర్వాత మీరు మీ సౌలభ్యం ప్రకారం ఆన్లైన్లో ప్రీమియం చెల్లించగల చెల్లింపు పేజీకి వస్తారు.
 7. అక్కడ మీరు చెల్లింపు పూర్తి చేయగానే, డిజిటల్ సంతకంతో కూడిన ఎల్ఐసీ ఆన్లైన్ ప్రీమియం చెల్లింపు రసీదు మీరు ఇచ్చిన ఇమెయిల్ ఐడీకి పంపబడుతుంది. ఈ రశీదును మీ చెల్లింపుకు ఆధారంగా మీ వద్ద ఉంచుకోవచ్చు.

క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా ఎల్ఐసీ ఆన్లైన్ ప్రీమియం చెల్లింపు

పాలసీదారు నెట్ బ్యాంకింగ్ తో మాత్రమే కాక, తన క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా కూడా ఎల్ఐసీ ప్రీమియం ఆన్లైన్ చెల్లింపు చేయవచ్చు. ఈ క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా ఎల్ఐసీ ప్రీమియం ఆన్లైన్ చెల్లింపు ఐడీబీఐ గేట్ వే ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది. ఈ క్రెడిట్/డెబిట్ కార్డు చెల్లింపులు 3 అంశాలతో మొదలుపెట్టవచ్చు.

 • మీరు ‘ఐడీబీఐ గేట్ వే’ ని ఎంచుకుని క్లిక్ చేసాక, మీరు వివిధ కార్డుల రకాలను వాటి వెసులుబాటు పన్ను మరియు సేవా పన్నులతో సహా కలిగి ఉండే పేజీకి వస్తారు. మీరు చెల్లింపు చేయాలనుకునే కార్డు రకాన్ని ఎంచుకున్నాక, మీరు కట్టాల్సిన చెల్లింపు మొత్తం సేవా పన్నులతో సహా కలిపి మీకు చూపించబడుతుంది. కార్డు రకాన్ని ఎంచుకున్నాక, ‘సబ్మిట్’ ను క్లిక్ చేయండి. 
 • సబ్మిట్ ను క్లిక్ చేసాక వచ్చే పేజీలో మీ చెల్లింపు ప్రక్రియ కోసం, కార్డు నంబర్, కార్డు గడువు తేదీ, సీవీవీ నంబర్(మీ కార్డు వెనక ఉండే మూడు అంకెల సంఖ్య), కార్డు మీద ఉన్న మీ పేరు సరిగ్గా అలాగే, రిజిస్టర్ చేసుకున్న ఇమెయిల్ మరియు ఫోన్ నంబర్ వంటి మీ క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలను ఇవ్వాలి. అక్కడ బాక్సులో చూపబడిన ‘నమూనా చిత్రం’ లోని అక్షరాలను కూడా మీరు ధృవీకరించాలి.
 • అన్ని అవసరమైన వివరాలు నింపిన తర్వాత, ‘పే’ పై క్లిక్ చేయండి. వెంటనే మీ సౌలభ్యం కోసం ఒక చెల్లింపు రసీదు మీ ఇమెయిల్ కు మరియు ఫోన్ నంబరుకు పంపబడుతుంది.

ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపు పైన చెప్పిన బ్యాంకుల ద్వారా చేసేప్పుడు చూసుకోవాల్సిన విషయాలు

 • మీ ప్రీమియం మొత్తాన్ని సులభంగా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా బ్యాంకు బ్రాంచ్ లేదా ఎక్స్టెన్షన్ కౌంటర్లలో చెల్లించండి.
 • మీ చెల్లింపును మీరు క్యాష్ లేదా చెక్కు ద్వారా కేవలం పైన తెలిపిన రెండు బ్యాంకుల ద్వారా మాత్రమే చేయగలరు.
 • ఇంకా మీరు ఈ చెల్లింపు విధానంలో ప్రీమియం చెల్లింపును, యూలిప్ (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్) కాని, ఎసెసెస్ (సాలరీ సేవింగ్స్ స్కీమ్) కాని అమలులో ఉన్న పాలసీలకు మాత్రమే చేయగలరు.
 • పాలసీ గడువు తేదీకి 30 రోజుల ముందుగానే చెల్లింపు చేయండి. అయితే, కొన్ని టర్మ్ బీమా పాలసీలు గడువు తేదీకి 15 రోజుల ముందు మాత్రమే ప్రీమియంను కట్టించుకుంటాయి. అవి:

అన్మోల్ జీవన్-II (టేబుల్ నం. 822)

అమూల్య జీవన్-II (టేబుల్ నం. 823)

 • ఈ ప్రీమియం చెల్లింపు, కొన్ని యూలిప్ లకు మరియు ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ పాలసీలు అనుమతించబడవు. ఆ పాలసీలు కింద ఇవ్వబడ్డాయి:

ఫ్యూచర్ ప్లస్ (టేబుల్ నం. 172)

బీమా ప్లస్ (టేబుల్ నం. 140)

జీవన్ ప్లస్ (టేబుల్ నం. 173)

మార్కెట్ ప్లస్ (టేబుల్ నం. 181)

మనీ ప్లస్ (టేబుల్ నం. 180)

ఫార్చున్ ప్లస్ (టేబుల్ నం. 187)

ప్రాఫిట్ ప్లస్ (టేబుల్ నం. 188)

మార్కెట్ ప్లస్ (టేబుల్ నం. 191)

జీవన్ సాథీ (టేబుల్ నం. 199)

మనీ ప్లస్ (టేబుల్ నం. 193)

హెల్త్ ప్రొటెక్షన్ ప్లస్ (టేబుల్ నం. 902)

హెల్త్ ప్లస్ (టేబుల్ నం. 901)

 • చెల్లింపు ఆలస్యమైన సందర్భంలో, వినియోగదారులు 8% వడ్డీ రేటుతో కలిపి ఆలస్య చెల్లింపు రుసుము కట్టాల్సి రావచ్చు.
 • మీరు తర్వాతి ఆర్థిక సంవత్సర ప్రీమియంల చెల్లింపును ఈ సంవత్సరం చేయలేరు, అంటే మార్చ్ 2021 కట్టాల్సిన ప్రీమియంను, మార్చ్ 2020 లో కట్టడం అనుమతించబడదు.
 • ప్రీమియం చెల్లింపు పూర్తయిన తర్వాత వినియోగదారులు బ్యాంకు నుండి ఒక రశీదును మీ రిజిస్టర్ చేసుకున్న ఇమెయిల్ ఐడీకి లేదా ఫోన్ నంబరుకు పంపబడుతుంది. ఆ రశీదునే అసలు ధ్రువీకరణ చెల్లింపు రసీదుగా భావించాలి. ఇది కాకుండా ఎల్ఐసీ అమలులో ఉన్న పాలసీలకు వేరే ఏ ఇతర రసీదూ ఇవ్వదు. మీరు ముందస్తు ప్రీమియం చెల్లింపులను 6 నెలల ముందుగా చేసుకోవచ్చు.

అదనపు ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపు సౌలభ్యాలు

ఈ రోజుల్లో అందరూ తీరిక లేకుండా ఉంటున్నారు. కాబట్టి అందరి సమయాన్ని మరియు శ్రమను తగ్గించడానికి ఆన్లైన్ సౌకర్యాలను అందించడం ఎంతైనా అవసరం. 

కాబట్టి ఇతర బీమా కంపెనీల లాగానే, ఎల్ఐసీ కూడా వినియోగదారులకు ప్రీమియంలను ఆన్లైన్లో సులభంగా చెల్లించేలా మరియు పాలసీ స్థితిని ఎప్పటికప్పుడు ఎక్కడినుండైనా చూసుకునేలా సదుపాయం కల్పించింది. ఇందులోని అప్డేట్ ఫీచర్ కూడా ఈ సౌకర్యాన్ని మరింత మెరుగ్గా చేస్తుంది. 

అత్యధిక సంఖ్యలో ఉండే వినియోగదారులు, ఇక చెల్లింపులు చేయడానికి లేదా పాలసీలను పునరుద్ధరించుకోవడానికి క్యూలలో నిలబడనవసరం లేదని ఎల్ఐసీ ఇప్పుడు భరోసా ఇస్తోంది. అనేక ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపు ఎంపికలను ఎల్ఐసీ అందిస్తోంది. ఇప్పుడు ప్రజలు ఆన్లైన్ లోనే ప్రీమియం చెల్లింపులు చేయవచ్చు లేదా దగ్గరిలో ఉన్న అధికారిక సెంటర్లకు వెళ్లి కూడా ప్రీమియం డిపాజిట్ చేయవచ్చు.

ప్రీమియం చెల్లింపుల కోసం ఎల్ఐసీ కేవలం ఈ రెండు బ్యాంకులకే అనుమతిచ్చింది:

 • యాక్సిస్ బ్యాంకు 
 • కార్పొరేషన్ బ్యాంకు

ఫ్రాంచైజీలు మరియు ఇతర అధికారిక బ్యాంకుల ద్వారా ఎల్ఐసీ చెల్లింపులు

ఎక్కువమంది వినియోగదారులు ఇంటర్నెట్ లేదా ఆన్లైన్ సేవల గురించి పెద్దగా తెలీకపోవడం చేత ప్రీమియంలను కట్టడానికి ఇబ్బంది పడుతుంటారు. ఆన్లైన్ వెబ్ సైట్స్ ను ఉపయోగించడం కన్నా వారు ఇంకా ఆఫీసుల వద్దే చెల్లింపులు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అటువంటి వారి సౌలభ్యం కోసం వివిధ ప్రైవేటు కంపెనీలు మరియు ప్రభుత్వ సేవాసంస్థల ద్వారా కూడా ప్రీమియం చెల్లింపులకు అనేక ఎంపికలను ఎల్ఐసీ అందిస్తోంది.

మొత్తంగా 4 సేవ సంస్థలు, వినియోగదారులకు ఆఫ్ లైన్ ప్రీమియం చెల్లింపు సేవలను అందించేందుకు ఎల్ఐసీకి అనుబంధంగా పని చేస్తున్నాయి:

 • ఏపీ ఆన్లైన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక పోర్టల్. ఈ కలెక్షన్ సెంటర్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రీమియం చెల్లింపులను మాత్రమే అనుమతిస్తుంది.
 • ఎంపీ ఆన్లైన్: మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారిక పోర్టల్. ఈ ఆఫ్ లైన్ సేవ కేవలం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రీమియం చెల్లింపులను మాత్రమే అనుమతిస్తుంది.
 • సువిధా ఇన్ఫోసర్వ్: ఇది పాలసీదారులకు పలు రకాల చెల్లింపు సేవలను అందించే ఒక ఎస్-కామర్స్, అంటే సోషల్ కామర్స్ యూనిట్.
 • ఈజీ బిల్ లిమిటెడ్: ఇది వినియోగదారులు, తమ దగ్గరిలో ఉన్న సంప్రదాయక మరియు నమ్మకస్తులైన వర్తక దుకాణాల వద్ద చెల్లింపు చేసేలా, నమ్మకమైన మరియు అనువైన చెల్లింపు సేవలను అందిస్తుంది.

అయినాకూడా, ఈ పైన చెప్పిన విధానాల ద్వారా ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపులు చేసే వారు కొన్ని విషయాలను తెలుసుకోవాలి:

 • ఈ విధానాలలో చెల్లింపులు క్యాష్ రూపంలో మాత్రమే తీసుకోబడతాయి.
 • చెల్లింపులు అమలులో ఉన్న పాలసీలకు మాత్రమే తీసుకోబడతాయి. ఈ కలెక్షన్ సెంటర్లు యూలిప్ లు మరియు ఎసెసెస్ కేటగిరీల కింద ఉన్న ప్రత్యేక ఎల్ఐసీ పాలసీల చెల్లింపులను అనుమతించవు. 
 • ఈ ఫ్రాంచైజీలు లేదా అధికారిక బ్యాంకులలో ప్రీమియం చెల్లింపు సేవలు ఉచితం, కాబట్టి, వినియోగదారులు అదనపు రుసుము/కమిషన్/సేవా పన్నును ఎల్ఐసీ ఏజెంట్లకు కట్టనవసరం లేదు.
 • ముందు చెప్పిన విధంగా, మీరు తర్వాతి ఆర్థిక సంవత్సర ప్రీమియంల చెల్లింపును ఈ కలెక్షన్ సెంటర్ల నుంచి కూడా చేయలేరు. ఉదాహరణకు, మార్చ్ 2021 కి కట్టాల్సిన ప్రీమియంను, మీరు మార్చ్ 2020 లో కట్టడం అనుమతించబడదు.
 • ప్రతీ ఆలస్యమైన ప్రీమియం చెల్లింపుకూ ఎల్ఐసీ 8% వడ్డీ రేటును కట్టించుకుంటుంది.
 • చెల్లింపు పూర్తయిన తర్వాత పాలసీదారు కలెక్షన్ సెంటర్ నుండి చెల్లింపుకు ఆధారంగా ఒక రశీదును పొందుతారు. ఈ రశీదును జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే ఇది కాకుండా ఎల్ఐసీ ఇటువంటి చెల్లింపులకు మరే ప్రత్యేక చెల్లింపు రసీదూ ఇవ్వదు.
 • ఈ ఫ్రాంచైజీలు లేదా అధికారిక బ్యాంకుల జాబితాను ఎల్ఐసీ అధికారిక వెబ్సైటులో కూడా మీరు చూడవచ్చు.

ఏజెంట్లు/వ్యాపారుల కలెక్షన్ ద్వారా ఎల్ఐసీ చెల్లింపులు

ఒక స్థాయిలో సౌకర్యాల కోసం ఎల్ఐసీ ఈ అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఇందులో సీనియర్ బిజినెస్ అసోసియేట్లు (SBA), డెవలప్మెంట్ అధికారులు మరియు రిటైరైన ఎల్ఐసీ ఉద్యోగులు చెల్లింపు కలెక్షన్ ఏజెంట్లుగా చేయబడతారు. ఇటువంటి అధికారం ఇవ్వబడిన ఏజెంట్ల ద్వారా చెల్లింపు చేసేప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు:

  • ఈ ఏజెంట్లు యూలిప్ లకు సంబంధించిన ప్రీమియం చెల్లింపులను కూడా సులభంగా స్వీకరించగలరు కానీ ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం చెల్లింపు ఇంకా ఈ పద్దతి క్రింద అనుమతించబడలేదు. ఈ విధంగా చేయబడిన ప్రీమియం చెల్లింపు వెంటనే అప్గ్రేడ్ చేయబడుతుంది.
  • ఇక్కడ మీరు చెల్లింపును క్యాష్ లేదా చెక్కు ద్వారా చేయవచ్చు. అయితే, అవుట్ ఆఫ్ స్టేషన్ చెక్కులను ఇటువంటి కలెక్షన్ ఏజెంట్లు అంగీకరించరని మీరు ముందుగా తెలుసుకోవడం ముఖ్యం.
  • చెల్లింపు పూర్తయిన తర్వాత పాలసీదారు కలెక్షన్ ఏజెంట్ల నుండి చెల్లింపుకు ఆధారంగా ఒక రశీదును పొందుతారు. 
  • ఈ ఏజెంట్ల ద్వారా చెల్లింపు విధానంలో ఎసెసెస్ కేటగిరీ కిందకి వచ్చే పాలసీల ప్రీమియం చెల్లింపులు అనుమతించబడవు.
  • ముందస్తు చెల్లింపును, మీరు అమలులో ఉన్న పాలసీ యొక్క గడువు తేదీకి 30 రోజుల ముందు మాత్రమే ఈ విధానంలో చేయగలరు. అయితే కొన్ని టర్మ్ పథకాలకు ఈ ముందస్తు ప్రీమియం చెల్లింపు గడువు తేదీకి 15 రోజుల ముందు మాత్రమే అనుమతించబడుతుంది.
 • ఈ కేటగిరీ కింద అందుబాటులో ఉన్న టర్మ్ పథకాలు ఇవే:

అన్మోల్ జీవన్-1 (టేబుల్ నం.164)

అన్మోల్ జీవన్ (టేబుల్ నం.153)

అమూల్య జీవన్ (టేబుల్ నం.177)

అమూల్య జీవన్ (టేబుల్ నం.190)

 • ప్రతీ ఆలస్యమైన ప్రీమియం చెల్లింపుకూ 8% (కనీస మొత్తం రూ. 5) వడ్డీ రేటు వద్ద ఆలస్య రుసుము కట్టాల్సి ఉంటుంది.
 • ఈ విధానంలో కూడా మీరు తర్వాతి ఆర్థిక సంవత్సర ప్రీమియంల చెల్లింపును చేయలేరు.
 • ఈ చెల్లింపు సేవలకు కూడా ఏ అదనపు సేవా రుసుమునూ కట్టనవసరం లేదు.

పేటీఎం ద్వారా ఎల్ఐసీ చెల్లింపు

పేటీఎం, ప్రజలలో బాగా ప్రాముఖ్యత సంపాదించుకున్న మొబైల్ చెల్లింపుల యాప్ ఎల్ఐసీ వినియోగదారులు మరియు పాలసీదారులు వెబ్ సైటుకు వెళ్లి అకౌంట్లో లాగిన్ అవడానికి ఇబ్బంది పడకుండా, వారి చెల్లింపులను సులభంగా కొన్ని క్లిక్కులతోనే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయడానికి సహాయపడేలా, ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపు సౌలభ్యాన్ని ప్రవేశపెట్టింది. పేటీఎం ద్వారా ఎల్ఐసీ ప్రీమియం ఎలా చేయాలో ఇప్పుడు చూడండి.

 • మీ పేటీఎం యాప్ శోధనలో ‘ఇన్సూరెన్స్’ అని ఉంచి శోధించండి.
 • మీకు అప్పుడు ‘ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్’ అనే ఎంపిక కనిపిస్తుంది.
 • దానిని క్లిక్ చేసి, అక్కడ వచ్చిన బీమా సంస్థ ఎంపికలలో కిందకి వెళ్లి లేదా శోధనలో ఎల్ఐసీ అని శోధించండి.
 • ‘ఎల్ఐసీ ఆఫ్ ఇండియా’ ను ఎంచుకోండి
 • ‘పాలసీ నంబర్’ ను ఇచ్చి ‘గెట్ ప్రీమియం’ ను నొక్కండి. 
 • మీ పాలసీ యొక్క ప్రీమియం మొత్తాన్ని అది చూపుతుంది. అక్కడ ఉన్న ప్రొసీడ్ బటన్ ను నొక్కి పేమెంట్ గేట్ వే కు వెళ్లి చెల్లింపును నేరుగా పూర్తి చేయండి. 
 • ఈ మొదటి చెల్లింపు ద్వారా మీ పాలసీ వివరాలను యాప్ గుర్తుంచుకుని, మీ తదుపరి ప్రీమియం చెల్లింపులకు, చెల్లింపు ప్రక్రియను మీకు మరింత సులభతరం చేస్తుంది. 
 • చెల్లింపు పూర్తయిన తర్వాత పేటీఎం నుండి ఒక ధ్రువీకరణ సందేశాన్ని పొందుతారు. చెల్లింపు ప్రక్రియలో ఏదైనా తప్పిదం జరిగితే, మీరు చెల్లించడానికి ఉపయోగించిన విధానంలోనే పూర్తి మొత్తం దానంతటదే తిరుగు చెల్లింపు చేయబడుతుంది.

**ఎటువంటి ఇబ్బందులూ లేకుండా, మీ నెలవారీ ప్రీమియంలను ఒకే దెబ్బతో చెల్లించడానికి ఎల్ఐసీ ఆన్లైన్ చెల్లింపు సేవలను లేదా పేటీఎంను నమ్మవచ్చు, ఎంచుకోవచ్చు.

మీకు ఒకవేళ ఏవైనా సందేహాలు ఉంటే

ఎల్ఐసీ కస్టమర్ కేర్ నెంబర్ 022-6827-6827

ఈ విధంగా అందుబాటులో ఉంటుంది:

సోమవారం నుంచి శుక్రవారం దాకా: ఉదయం 08.00 నుండి రాత్రి 08.00 వరకు

శనివారం: ఉదయం 10.00 నుండి సాయంత్రం 06.00 వరకు