ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పథకం
 • హామీ మనీ బ్యాక్ ప్లాన్
 • అధిక రాబడి పెట్టుబడి ఎంపికలు
 • పన్ను ప్రయోజనాలు
PX step

ప్రీమియం పోల్చండి

1

2

పుట్టినరోజు
ఆదాయం
| లింగ

1

2

ఫోన్ నం.
పేరు
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

ఈ ప్రపంచం భవిష్యత్తు ఈనాటి పిల్లల యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. కానీ వారు ఆ లక్ష్యం కోసం సిద్ధంగా లేకపోతే, ఆ స్వప్నం దూరమైపోతుంది. అందుకోసమే, పిల్లల భవిష్యత్తును పూర్తిగా సంరక్షించేలా, కొన్ని ప్రీమియం పాలసీలు వారికి కూడా అందుబాటులో ఉన్నాయి. ఎల్ఐసీ వారి న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పథకం (ప్లాన్ నం: 932) ప్రత్యేకంగా ఎదిగే పిల్లల ప్రయోజనం కోసం పేరెన్నికగన్నది. ఈ పథకాన్ని తల్లిదండ్రులు అలాగే బామ్మ, తాతయ్యలు తమ ప్రియమైన పిల్లల కోసం తీసుకోవడానికి కారణం రెండు ప్రత్యేక అంశాలు- 25 సంవత్సరాల వరకు సంరక్షణ మరియు అప్పుడు మెచ్యూరిటీని ముఖ్యమైన పనులను నెరవేర్చుకోవడం కోసం ఒక పెద్దమొత్తంగా అందించడం.

ఈ పాలసీ తీసుకోవడానికి ఉండాల్సిన అర్హతలు:

ఈ పథకం తీసుకోవడానికి ఉండాల్సిన కింది వయసు పరిమితి, శిశువు పుట్టగానే, మరియు గరిష్ట వయో పరిమితి 12 సంవత్సరాలు. దీని మెచ్యూరిటీ వయసు 25 సంవత్సరాలు.

ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ఫీచర్లు

ఈ పథకంలో కొన్ని నిర్దిష్టమైన ఫీచర్లు ఉన్నాయి:

 • ఈ పథకం ఎదిగే పిల్లల కోసం రూపొందించబడిన నాన్-లింక్డ్ మనీ బ్యాక్ పాలసీ.
 • ప్రతీ పథకం ఒక సారికి ఒక వ్యక్తికే ఉంటుంది. 
 • పాలసీ కాలవ్యవథి, మెచ్యూరిటీ వయసు (25 సంవత్సరాలు)కూ, ప్రవేశ వయసుకూ ఉన్న తేడాని బట్టి ఉంటుంది. ఉదాహరణకు, ప్రవేశ వయసు 8 సంవత్సరాలయితే, పాలసీ కాలవ్యవథి 25 - 8 = 17 సంవత్సరాలు. 
 • మెచ్యూరిటీ ప్రయోజనం, పథకాన్ని తీసుకున్న సమయంలో ఉన్న అసలు భరోసా మొత్తం మరియు దాని సంబంధిత బోనస్ లతో కలిపి ఉంటుంది. 
 • ఈ పథకాలతో ఉన్న వివిధ ఎంపికలను బట్టి, ప్రీమియంలను కట్టవలసి ఉంటుంది. ఇందులో ప్రీమియంలను నెలవారీగా, త్రైమాసికంగా, అర్థ-వార్షికంగా లేదా వార్షికంగా కట్టవచ్చు. 
 • పాలసీదారు ఈ పథకం నుంచి లోన్లను పొందగలిగే ప్రత్యేక ఫీచర్ కూడా ఇందులో ఉంది. 
 • ఆలస్య చెల్లింపులు లేదా వెసులుబాటు సమయం, మీరు ప్రీమియం చెల్లింపు చేసే కాలక్రమాన్నిబట్టి మారుతాయి. నెలవారీ ప్రీమియం చెల్లిస్తున్నట్టయితే, 15 రోజుల వెసులుబాటు సమయం ఉంటుంది. మిగతా కాలక్రమాలకు (త్రైమాసిక, అర్థ-వార్షిక లేదా వార్షిక), 30 రోజులు ఉంటుంది.
 • పథకాన్ని తీసుకున్న 15 రోజుల వరకు, దానిపై తిరిగి ఆలోచించుకుని వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది.
 • కట్టడం ఆపేసిన ప్రీమియంలను అన్నిటినీ కలిపి చెల్లించి, ఆగిపోయిన పాలసీని తిరిగి రివైవ్ చేసుకునే అవకాశం కూడా 2 సంవత్సరాల వరకు ఉంటుంది.
 • ఈ పథకంలో భరోసా మొత్తం కనిష్టంగా రూ. 100,000 నుండి గరిష్టంగా ఎంతైనా పెట్టుకునేలా ఉంటుంది.
 • ఈ పథకం అందించే మూడు నిర్దిష్టమైన ప్రయోజనాలు, మెచ్యూరిటీ ప్రయోజనం, మరణ ప్రయోజనం మరియు సర్వైవల్ ప్రయోజనం.
 • అధిక భరోసా మొత్తాలకు, రిబేటు పొందే అవకాశం రిబేటు విధానాలను బట్టి ఉంటుంది. వార్షిక విధానంలో, టేబుల్ చేయబడిన ప్రీమియంలో 2% మరియు అర్థ-వార్షిక విధానంలో, టేబుల్ చేయబడిన ప్రీమియంలో 1% ఉంటుంది. త్రైమాసిక లేదా నెలవారీ విధానాలకు రిబేట్లు ఉండవు.
 • అన్ని ప్రీమియంలూ మరియు తర్వాతి చెల్లింపులూ మూడు సంవత్సరాల పాటు సక్రమంగా చెల్లించబడితే, అప్పుడు ఈ పథకం పెయిడ్-అప్ విలువను అందిస్తుంది. అప్పుడు ఈ పాలసీని వాయిడ్ ప్లాన్ గా అవకుండా క్రింది పథకాలలో ఒకదానిగా మారుతుంది:
  • “మరణ పెయిడ్-అప్ భరోసా మొత్తం,” పాలసీదారు యొక్క అకాల మరణం సంభవించిన పక్షంలో. అప్పుడు చెల్లించబడే మొత్తం, (చెల్లించిన ప్రీమియంల మొత్తం/ఇంకా చెల్లించాల్సి ఉన్న ప్రీమియంల మొత్తం) x మరణ భరోసా మొత్తం.
  • “మెచ్యూరిటీ పెయిడ్-అప్ భరోసా మొత్తం,” మెచ్యూరిటీ అయిన తర్వాత, (చెల్లించిన ప్రీమియంల మొత్తం/ చెల్లించాల్సిన మొత్తం) x (మెచ్యూరిటీ భరోసా మొత్తం + పాలసీ నియమ నిబంధనల ప్రకారం చెల్లించబడే సర్వైవల్ ప్రయోజనాల మొత్తం) - అప్పటికే చెల్లించబడిన సర్వైవల్ ప్రయోజనాల మొత్తం.
 • మూడు సంవత్సరాల పాటు ప్రీమియంలు సక్రమంగా చెల్లించబడితే, పాలసీని సరెండర్ చేసుకోవచ్చు. అప్పుడు, సరెండర్ విలువ, చెల్లించిన ఏవైనా అదనపు ప్రీమియంలు మరియు ప్రీమియం రైడర్ విలువలు (ఏవైనా ఉంటే) మినహాయించి, అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంల మొత్తం యొక్క పర్సెంటేజ్ విలువ - అప్పటికే ఇవ్వాల్సివున్న మరియు పాలసీదారుకు చెల్లించాల్సిన సర్వైవల్ ప్రయోజనాలు.
 • వినియోగదారు నేరుగా ‘ ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్’ అనే ఎంపికను ఎంచుకోవచ్చు. దీనితో, ఆ వినియోగదారు లేదా ప్రీమియంలను చెల్లించే వ్యక్తి మరణం తర్వాత, అన్ని ప్రీమియంలు మాఫీ చేయబడతాయి.

ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్రయోజనాలు

ఈ పథకానికి మూడు ప్రధాన ప్రయోజనాలు జత చేయబడి ఉన్నాయి:

 • మెచ్యూరిటీ ప్రయోజనం:

ఈ సందర్భంలో, మెచ్యూరిటీ అయినపుడు భరోసా మొత్తం, అన్ని అదనపు బోనస్ లతో కలిపి చెల్లించబడుతుంది.

 • మరణ ప్రయోజనం:

పాలసీదారుకు అకాల మరణం సంభవిస్తే, అప్పుడు చెల్లించాల్సిన మొత్తం, మరణ భరోసా మొత్తం, సంబంధిత అన్ని బోనస్ లతో కలిపి.

 • సర్వైవల్ ప్రయోజనం:

దీని కింద, పాలసీదారు ఒక నిర్దిష్ట వయసుకు వచ్చిన తర్వాత, పాలసీ నుండి ఒక మొత్తాన్ని పొందుతారు. ఇది సాధారణ భరోసా మొత్తంలో 20% ఉంటుంది.

ఈ పాలసీలో మరికొన్ని ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి:

 • కార్పొరేషన్ లాభాలు: దీని విషయంలో, పాలసీదారు ఎల్ఐసీ వారు అందించే లాభాలను ఆర్జించే అవకాశాలలో పాలు పంచుకోవచ్చు మరియు అందులో కూడా బోనస్లు పొందవచ్చు.
 • సరెండర్ మొత్తం: పథకాన్ని తీసుకున్న తేదీ నుంచి సరెండర్ మొత్తం భరోసా ఇవ్వబడుతుంది. కానీ, ఇది మూడు సంవత్సరాల పాటు ప్రీమియంలు మరియు అన్ని చెల్లింపులూ సక్రమంగా ఆలస్యం కాకుండా చెల్లించబడి ఉంటేనే వర్తిస్తుంది. 
 • రిబేట్లు మరియు రాయితీలు: ఎల్ఐసీ అధిక ప్రీమియం ధరలపై, రిబేట్లు లేదా రాయితీలను అందిస్తుంది. ఈ రకంగా పాలసీదారు డబ్బు ఆదా చేసుకోవచ్చు. 

అవసరమైన ముఖ్య డాక్యుమెంట్లు

పాలసీదారు అభ్యర్థన పత్రం లేదా ప్రతిపాదన అభ్యర్థన పత్రాన్ని నింపాలి. 

పాలసీ తీసుకునే వ్యక్తి యొక్క పూర్తి వైద్య వివరాలు అవసరమవుతాయి. 

ప్రస్తుత నివాస చిరునామా ధ్రువీకరణ పత్రంతో పాటుగా, కేవైసీ పత్రాలు కూడా కావాలి. 

కొన్నిసార్లు పాలసీ తీసుకునే వారు ఏవైనా కొన్ని వైద్య పరీక్షలను చేయించుకోవాల్సి రావచ్చు. అది పాలసీ తీసుకునే పిల్లల యొక్క వయసు మరియు ఎంచుకున్న భరోసా మొత్తాలపై ఆధారపడి ఉంటుంది. 

కొన్ని కేసులలో మినహాయింపులు

కింద ఇచ్చిన కొన్ని పరిస్థితులలో పాలసీ వర్తించకపోవచ్చు:

 • పాలసీదారు, రిస్క్ మొదలైన తేదీ నుంచి 12 నెలల లోపు ఆత్మహత్యకు పాల్పడితే, ఎల్ఐసీ, అప్పటివరకు కట్టిన ప్రీమియం మొత్తంలో 80 శాతం నుండి అదనపు ప్రీమియంలు మరియు సేవాపన్నులను మినహాయించి వెనక్కి చెల్లిస్తుంది. పాలసీదారు ప్రవేశ వయసు 8 సంవత్సరాల కన్నా తక్కువయి ఉంటే, ఈ చెల్లింపు కూడా వర్తించదు.
 • పథకాన్ని రివైవ్ చేసిన 12 నెలల లోపు, పాలసీదారు ఆత్మహత్యకు పాల్పడితే, అప్పుడు సంస్థ ఆ మరణించిన తేదీ వరకు కట్టిన ప్రీమియం మొత్తంలో 80% కి అధికంగా మరియు సర్వైవల్ విలువను, అప్పటివరకు కట్టిన అదనపు ప్రీమియంలు మరియు సేవాపన్నులను మినహాయించి వెనక్కి చెల్లిస్తుంది. 

పాలసీ రివైవల్ సమయంలో పాలసీ తీసుకున్న వ్యక్తి వయసు 8 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నప్పుడు, అలాగే పెయిడ్-అప్ విలువను పొందకుండానే పాలసీ ఆగిపోయినపుడు ఈ స్కీము కూడా ఆమోదించబడదు.