ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్
 • హామీ మనీ బ్యాక్ ప్లాన్
 • అధిక రాబడి పెట్టుబడి ఎంపికలు
 • పన్ను ప్రయోజనాలు
PX step

ప్రీమియం పోల్చండి

1

2

పుట్టినరోజు
ఆదాయం
| లింగ

1

2

ఫోన్ నం.
పేరు
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్ (ప్లాన్ నం.915), ఆకర్షణీయమైన పొదుపు మరియు రక్షణల మిశ్రమాన్ని అందించే ఒక పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ పథకం. పాలసీదారు జీవించినంత కాలం,అలాగే మరణానంతరం కూాడా ఆర్థిక రక్షణనిస్తుంది. మెచ్యూరిటీ సమయం తర్వాత పాలసీ దారుడు జీవించి ఉంటే, ఒక పెద్ద మొత్తాన్ని ఈ పాలసీ అందిస్తుంది. 

అత్యవసర సమయాలలో లోన్ సదుపాయాన్ని కూడా ఈ పథకం అందిస్తుంది. అవసర సమయంలో రక్షణనిచ్చే పొదుపుతో కూడిన బీమా పాలసీగా దీనిని చెప్పవచ్చు. బీమా చేయించుకున్న వ్యక్తి మరణించిన పక్షంలో అవసరయ్యే ఆర్థిక సహాయాన్ని అందించడానికే ఈ పథకం ఉంది.

పాలసీదారు జీవించి ఉంటే పాలసీ టర్మ్ ముగిసిన తర్వాత, ఒక పెద్ద మొత్తాన్ని కూడా ఈ పథకం అందిస్తుంది. ఇది ఒక ఎండోమెంట్ తో కూడిన సంపూర్ణ జీవిత బీమా పథకం.

ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ లోని ముఖ్యమైన ఫీచర్లు

 • మెచ్యూరిటీ తర్వాత కూడా పాలసీదారు జీవించి ఉన్నంత కాలం కవరేజీని ఇచ్చే సంపూర్ణ జీవిత బీమా పథకం
 • పాలసీదారుకు అందుబాటులో సాధారణ ప్రీమియం చెల్లింపు పద్దతి 
 • మెచ్యూరిటీ లేదా ముందే అకాల మరణం సంభవించిన సమయంలో, చెల్లింపు ప్రయోజనాలను మెరుగ్గా చేసే సులభ తిరుగు బోనస్ లను అందించడం
 • మెచ్యూరిటీ ప్రయోజనాలు అంటే భరోసా ఇవ్వబడిన మొత్తం + దానిపై వచ్చిన బోనస్, మరియు జీవిత కవరేజీ మరణం వరకు కొనసాగుతుంది 
 • మెచ్యూరిటీ తర్వాత మరణం సంభవించిన పక్షంలో కేవలం భరోసా ఇవ్వబడిన మొత్తం మాత్రమే లభిస్తుంది
 • మెచ్యూరిటీ లోపే మరణం సంభవించిన పక్షంలో, భరోసా ఇవ్వబడిన మొత్తం + దానిపై వచ్చిన బోనస్ లభిస్తుంది
 • పాలసీదారు 70వ పుట్టినరోజు లోపు, ఏదైనా అంగవైకల్యం లేదా ప్రమాదం కారణంగా మరణం సంభవించిన సందర్భాలలో సంబంధిత అదనపు ప్రయోజనాన్ని అందించే అదనపు రైడర్లు
 • మీ ప్లాన్ ఒక సరెండర్ విలువను పొందినట్లైతే, లోన్స్ కూడా పొందవచ్చు
 • ఎక్కువ మొత్తానికి పాలసీ తీసుకున్న వారికి, అలాగే ప్రీమియంలను వార్షికంగా లేదా అర్థ-వార్షికంగా కట్టిన వారికి, ప్రీమియంలలో రాయితీ అనుమతించబడుతుంది. 
 • ఆదాయ పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80సి కింద కట్టిన ప్రీమియం మొత్తానికి మరియు చెల్లింపు మొత్తాలకు అంటే సెక్షన్ 10(10డి) కింద మరణం లేదా మెచ్యూరిటీ ప్రయోజనాలకు ఆదాయ పన్ను మినహాయింపు
 • పాలసీని మార్చుకోవడం కుదరదు.

ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ ప్రయోజనాలు

మరణం సంభవించిన సందర్భంలో ప్రయోజనం

మరణ సమయంలో వచ్చే ప్రయోజనం బీమా చేయించుకున్న వ్యక్తి మరణించిన సంవత్సరంపై ఆధారపడి ఉంటుంది:

 • బీమా చేయించుకున్న వ్యక్తి పాలసీ కాలవ్యవథి లోపే మరణిస్తే, భరోసా ఇవ్వబడిన మొత్తం, మరియు దానిపై సమకూరిన బోనస్ లతో కలిపి చెల్లించబడుతుంది. మరణ సమయంలో లబ్ధిదారునికి ఇవ్వబడే భరోసా మొత్తం క్రింది వీటిలో ఏది ఎక్కువ ఉంటే అదిగా చెప్పబడింది.
 • పాలసీ నిబంధనల ప్రకారం సాధారణ భరోసా మొత్తానికి 125 శాతం మొత్తం లేదా వార్షిక ప్రీమియం కు 10 రెట్లు 
 • మరణించిన రోజుకు కట్టాల్సి ఉన్న ప్రీమియంకు కనీసం 105 శాతం పైన చెప్పబడిన ప్రీమియంలు ఏవైనా సేవా పన్ను, అదనపు ప్రీమియం మరియు రైడర్ ప్రీమియంలను మినహాయించి. 
 • బీమా చేయించుకున్న వ్యక్తి, అప్పటికే మెచ్యూరిటీ ప్రయోజనం మొత్తాన్ని పొంది పథకం కాల వ్యవథి ముగిసిన తర్వాత మరణిస్తే లబ్ధిదారునికి సాధారణ భరోసా మొత్తం చెల్లినచబడుతుంది మరియు పథకం ముగుస్తుంది.

మెచ్యూరిటీ ప్రయోజనం 

ఒకవేళ బీమా చేయించుకున్న వ్యక్తి పాలసీ కాల వ్యవథి పాటు జీవించి ఉంటే, భరోసా ఇవ్వబడిన మొత్తం + దానిపై సమకూరిన బోనస్ (వివిధ సమయాలలో), పాలసీ సమయం ముగిశాక భీమా చేయించుకున్న వ్యక్తికి మెచ్యూరిటీ ప్రయోజనంగా అందించబడుతుంది.

ఉదాహరణకు, మీరు 35 సంవత్సరాలప్పుడు రూ. 25 లక్షలు ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ లో పెట్టుబడి పెడితే, మీరు ఈ విధంగా ప్రతిఫలాలు పొందుతారు:

అంశం

ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్

ప్రతిఫలం రేటు

3.56%

మొత్తం ప్రతిఫలం

రూ.40.66 లక్షలు

ప్రయోజనం అందే సంవత్సరం

25వ సంవత్సరం

రాయితీ

ఎల్ఐసీ తన వినియోగదారులకు రాయితీల రూపంలో అనేక ప్రోత్సాహకాలను ఇవ్వడంలో ప్రసిద్ధి చెందింది. ఈ పథకం కింద ఉండే రాయితీలు:

 • 1.50%-3%, భరోసా మొత్తం రూ.2 లక్షలు మరియు ఎక్కువ ఉన్నప్పుడు
 • 2% వార్షిక పథకానికి
 • 1% అర్థ వార్షిక పథకానికి
 • త్రైమాసిక పథకానికి ఏమీ ఉండదు

లోన్లు

ఎల్ఐసీ లోన్ సదుపాయాన్ని అందిస్తుంది కానీ, 3 సంవత్సరాల పాలసీ కాలం పూర్తయ్యాక మాత్రమే, భీమా చేయించుకున్న వ్యక్తి ఆ పాలసీపై లోన్ తీసుకోగలరు. అయితే, లోన్ మొత్తం యొక్క పరిమితి, పాలసీకి సమకూరిన సరెండర్ విలువపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, మీ పాలసీ ఒక సరెండర్ విలువను పొంది ఉండాలి.

రివైవల్

ప్రీమియం చెల్లించడం ఆపివేసిన 5 సంవత్సరాలలోపు, ఏ సమయంలోనైనా, మిగిలి ఉన్న అన్ని ప్రీమియంలను, సంబంధిత వడ్డీ మరియు ఇతర ఖర్చులతో పాటుగా చెల్లించి, ఈ పాలసీని తిరిగి రివైవ్ చేసుకోవచ్చు. 

సరెండర్ విలువ

ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్, మీరు ఏ సమయంలోనైనా, మీ పాలసీని సరెండర్ చేసి, సరెండర్ విలువని పొందేలా అనుమతిస్తుంది. అయితే, బీమా చేయించుకున్న వ్యక్తి, 3 సంవత్సరాల పాటు పూర్తి ప్రీమియం చెల్లింపులు చేసాక మాత్రమే దీనికి అర్హులవుతారు. 

సరెండర్ చేస్తే, భరోసా సరెండర్ విలువ (GSV) లేదా ప్రత్యేక సరెండర్ విలువ (SSV) లలో దేని విలువ ఎక్కువ ఉంటే అది చెల్లించబడుతుంది. వీటిని ఈ విధంగా లెక్కిస్తారు:

 • భరోసా సరెండర్ విలువ (GSV) = చెల్లించిన మొత్తం ప్రీమియంలలో 30% - మొదటి సంవత్సరం ప్రీమియం
 • సంస్థ తన భవిష్యత్తు పనితీరును బట్టి ఒక నిర్దిష్ట సరెండర్ విలువను ప్రకటిస్తుంది.

ప్రీమియం చెల్లింపు వెసులుబాటు

ఈ పథకం, వినియోగదారులు ప్రీమియంలను, నెలవారీగా, త్రైమాసికంగా, అర్ధవార్షికంగా లేదా వార్షికంగా కూడా చెల్లించే వెసులుబాటు ఇస్తుంది.

అదనపు రైడర్ల ప్రయోజనాలు

 • ఎల్ఐసీ వారి ప్రమాద మరణ ప్రయోజన రైడర్
 • వైకల్య ప్రయోజన రైడర్

ప్రీమియం రాయితీలు

అధిక మొత్తాల పాలసీలకు వార్షిక లేదా అర్థ-వార్షిక ప్రీమియంలకు ఉంటాయి.

ఆదాయపన్ను ప్రయోజనం

ప్రీమియంలు: ఆదాయ పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80సి కింద కట్టిన ప్రీమియం మొత్తానికి ఆదాయ పన్ను మినహాయించబడుతుంది. గరిష్టంగా మినహాయించబడే మొత్తం రూ.1.5 లక్షలు.

పాలసీ చెల్లింపులు: ఆదాయ పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 10(10డి) కింద మరణం లేదా మెచ్యూరిటీ చెల్లింపు మొత్తాలకు ఆదాయ పన్ను మినహాయించబడుతుంది. దీనికి ఎటువంటి గరిష్ట పరిమితి లేదు, చెల్లింపు మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది.

ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ ను తీసుకోవడానికి ఉండాల్సిన అర్హతలు

అంశాలు

కనీసం

గరిష్టం

భరోసా ఇచ్చే మొత్తం

రూ. 1 లక్ష

అపరిమితంగా

పాలసీ వ్యవథి (సంవత్సరాలలో)

15

35

ప్రీమియం చెల్లింపు వ్యవథి (సంవత్సరాలలో)

5

57

పాలసీదారుని ప్రవేశ వయసు (చివరి పుట్టినరోజు)

18 సంవత్సరాలు

50 సంవత్సరాలు

మెచ్యూరిటీ వయసు (చివరి పుట్టినరోజు)

-

75 సంవత్సరాలు

పాలసీ రివైవల్

5 సంవత్సరాల లోపు

లోన్

3 సంవత్సరాల తర్వాత

ప్రీమియం చెల్లింపు పద్దతి

వార్షికంగా, అర్ధవార్షికంగా, త్రైమాసికంగా, నెలవారీగా

సరెండర్ విలువ

3 సంవత్సరాల పూర్తి ప్రీమియం చెల్లింపు తర్వాత

అందుబాటు 

భారతీయులతో పాటు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (NRIs) కూడా భారత చట్టాల ప్రకారం, భారత బీమా సంస్థలలో పాలసీలను తీసుకోవచ్చు.

ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ రైడర్ వివరాలు

ఎల్ఐసీ ప్రమాద మరణ మరియు వైకల్య ప్రయోజన రైడర్:

ఇది అదనపు ప్రీమియం చెల్లింపు ద్వారా మీకు లభించే ఒక ఎంచుకోదగిన రైడర్ ప్రయోజనం. పాలసీ వ్యవథిలో ప్రమాదవశాత్తూ మరణించిన సందర్భంలో, ఈ ప్రమాద ప్రయోజన భరోసా మొత్తాన్ని కూడా పథకం కింద ఉన్న అకాల మరణ ప్రయోజనంతో పాటుగా చెల్లిస్తారు.

ప్రమాదవశాత్తూ ఏదైనా శాశ్వత వైకల్యం (ప్రమాదం జరిగిన 180 రోజుల లోపు) కలిగిన పక్షంలో ఈ ప్రమాద ప్రయోజన భరోసా మొత్తాన్ని నెలవారీ సమాన వాయిదాలలో చెల్లిస్తారు.

 • కనీస ప్రమాద ప్రయోజన భరోసా మొత్తం: రూ. 1 లక్ష
 • గరిష్ట ప్రమాద ప్రయోజన భరోసా మొత్తం: సాధారణ పథకం కింద తీసుకున్న భరోసా మొత్తానికి సమానమైన మొత్తం, అయితే బీమా చేయబడిన వ్యక్తి యొక్క అన్ని వ్యక్తిగత అలాగే గ్రూపు పాలసీలు, వాటిలో భాగంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న ప్రమాద ప్రయోజనాలు, అలాగే కొత్త ప్రతిపాదన కింద ప్రమాద ప్రయోజన భరోసా మొత్తాన్ని కూడా పరిగణించిన తర్వాత వచ్చే పూర్తి మొత్తం గరిష్టంగా రూ. 100 లక్షలకు దాటకూడదు ( ప్రమాద ప్రయోజన భరోసా మొత్తం 5000 గుణిజాలలోఉండాలి).
 • ప్రవేశ సమయంలో కనీస వయసు: 18 సంవత్సరాలు (పూర్తయినవి)
 • ప్రవేశ సమయంలో గరిష్ట వయసు: మీ పాలసీ వ్యవథి కాలంలో ఏ వార్షిక దినం రోజునుంచైనా ఈ కవరేజీని తీసుకోవచ్చు, అయితే బీమా చేసుకున్న వ్యక్తి 70 వ పుట్టినరోజుకు దగ్గరగా ఉన్న వార్షిక దినానికి ముందే అయి ఉండాలి.
 • కవరేజీ ముగిసే గరిష్ట వయసు: 70 సంవత్సరాలు (దగ్గరి పుట్టినరోజు) లేదా పాలసీ వ్యవధి ముగిసే వరకు, ఏది ముందు వస్తే అది.

ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ ఎలా పనిచేస్తుంది?

పాలసీదారు ఒక భరోసా మొత్తాన్ని మరియు పాలసీ కాలాన్ని ఎంచుకోవాలి. బీమా చేయించుకునే వ్యక్తి యొక్క వయసును, భరోసా మొత్తం మరియు పాలసీ వ్యవధులను బట్టి, ఎల్ఐసీ మీ పాలసీ ప్రీమియంను గణిస్తుంది. ఈ పథకం కింద, బీమా చేయించుకున్న వ్యక్తి, పాలసీ వ్యవథి మొత్తం ప్రీమియంలు చెల్లిస్తూ ఉండాలి. 

పథకం వ్యవథి ముగిసే వరకు, బీమా చేయించుకున్న వ్యక్తి జీవించి ఉంటే, వారు మెచ్యూరిటీ ప్రయోజనాలు పొందుతారు. 

మెచ్యూరిటీ ప్రయోజనం = భరోసా మొత్తం + బోనస్ (పాలసీ వ్యవథి కాలంలో సమకూరిన మొత్తం)+ఏదైనా చివరి అదనపు బోనస్ (ప్రకటిస్తే)

ఇప్పుడు పాలసీదారు మరణిస్తే (పాలసీ వ్యవథి తర్వాత అయినా కూడా), లబ్ధిదారు మరణ ప్రయోజనంగా అదనపు భరోసా మొత్తాన్ని పొందుతారు.

ఒకవేళ పాలసీదారు పాలసీ వ్యవథిలోపే మరణిస్తే, మరణ ప్రయోజనం = మరణ భరోసా మొత్తం + సంక్రమించిన బోనస్ (మరణించిన తేదీ వరకు)+ఏదైనా చివరి అదనపు బోనస్ లబ్దిదారుకు అందజేయబడుతుంది.

మరణ భరోసా మొత్తం సాధారణ భరోసా మొత్తానికి 125 శాతం లేదా కట్టిన వార్షిక ప్రీమియంకు 10 రెట్లు, రెండిటిలోఏది అధికమైతే అదిగా, మరణం వరకు కట్టిన అన్ని ప్రీమియంల మొత్తం యొక్క 105 శాతానికి తగ్గకుండా ఉంటుంది.

ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ ప్రీమియం ఉదాహరణలు

ఉదాహరణ 1: వివిధ వయసులు, పాలసీ కాలాలకు, ఒక ఆరోగ్యవంతమైన, పొగాకు అలవాటు లేని పురుషుడి నమూనా వార్షిక ప్రీమియం రేట్ల పట్టిక. భరోసా మొత్తం రూ. 5 లక్షలుగా తీసుకొనబడింది.

పాలసీ వ్యవథి (సంవత్సరాలలో) 

వయసు (సంవత్సరాలలో)

15

25

35

20

రూ. 39,525 

రూ. 22,150

రూ. 14,975

30

రూ. 41,225

రూ. 23,375

రూ. 16,150

40

రూ. 44,100

రూ. 25,700

రూ. 18,550

ఉదాహరణ 2: 25 సంవత్సరాల రోహన్, 2019 లో 25 సంవత్సరాలకు (పాలసీ వ్యవథి), ఒక జీవన్ ఆనంద్ పాలసీని తీసుకున్నాడనుకుంటే, అతని వార్షిక ప్రీమియం రూ. 21, 472 మరియు ప్రీమియంల మొత్తం రూ. 5,36,800 అవుతుంది. 

కేసు I: రోహన్ పాలసీ వ్యవథిని దాటి జీవించిన పక్షంలో, అతనికి అందే ప్రయోజనాలు క్రింది విధంగా ఉంటాయి:

మెచ్యూరిటీ అయ్యే సంవత్సరం 

2044

మెచ్యూరిటీ వయసు 

50 సంవత్సరాలు

భరోసా మొత్తం

రూ. 5 లక్షలు

బోనస్ అదనాలు

రూ. 8 లక్షలు (దాదాపుగా)

చెల్లించబడే మొత్తం

రూ. 13 లక్షలు

కేసు II: రోహన్ పాలసీ వ్యవథి కాలం లోపే మరణించిన పక్షంలో, అతని లబ్ధిదారు, భరోసా మొత్తానికి 125 శాతంతో పాటు, తిరుగు బోనస్లు మరియు చివరి అదనపు బోనస్ల ప్రయోజనాలను పొందుతారు. రోహన్ ఏదైనా ప్రమాదవశాత్తూ మరణిస్తే, అప్పుడు కనీస భరోసా మొత్తానికి సమానమైన ఆ అదనపు ప్రయోజనాలు కూడా ఈ చెల్లింపుకు జతచేయబడతాయి.

క్రింది పట్టిక భరోసా మొత్తం మరియు సంబంధిత ప్రమాద కవరేజీల సుమారైన మొత్తాలను ఉదాహరిస్తుంది.

ప్రీమియం చెల్లింపు సంవత్సరం 

చెల్లించిన మొత్తం ప్రీమియం 

జీవిత కవరేజీ (సుమారుగా)

ప్రమాద కవరేజీ (సుమారుగా)

1వ సంవత్సరం

రూ. 21,472

రూ. 6,10,000

రూ. 11,30,000

5వ సంవత్సరం

రూ. 1,07,360

రూ.7,50,000

రూ.12,60,000

10వ సంవత్సరం

రూ.2,14,720

రూ.9,00,000

రూ.14,00,000

15వ సంవత్సరం

రూ.3,22,080

రూ.10,52,000

రూ.15,50,000

20వ సంవత్సరం

రూ.4,29,440

రూ.12,63,125

రూ.17,70,000

25వ సంవత్సరం

రూ.5,36,800

రూ.15,80,000

రూ.20,00,000

ఆదాయపన్ను పాత్ర

ప్రీమియంలు: ఈ పథకం కింద కట్టే అన్ని ప్రీమియం మొత్తాలకు, ఆదాయ పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80సి కింద ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. దీని కింద ఒక వ్యక్తి గరిష్టంగా పొందే మినహాయింపు మొత్తం రూ.1.5 లక్షలు. ఈ మినహాయింపు పొందడానికి, ప్రీమియం మొత్తాన్ని మీరు ఎంచుకున్న భరోసా మొత్తంలో 10% కి పరిమితం చేయాలి.

మెచ్యూరిటీ చెల్లింపు: ఆదాయ పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 10(10డి) కింద మెచ్యూరిటీ చెల్లింపు మొత్తానికి ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ మినహాయింపు పొందడానికి, భరోసా మొత్తం, ప్రీమియం మొత్తానికి కనీసం పది రెట్లు ఉండాలి.

మరణ సమయంలో చెల్లింపు: ఆదాయ పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 10(10డి) కింద మరణ ప్రయోజనాల చెల్లింపుకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ మరణ సమయంలో చెల్లింపుకు ఎటువంటి గరిష్ట పరిమితి లేదు.

అదనపు వివరాలు: ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్

1) సులభ తిరుగు బోనస్లు 

ఇది ఒక లాభాలతో కూడిన భాగస్యామిక పథకం. బోనస్ ల రూపంలో అవి ఇవ్వబడతాయి. ప్రతీ ఆర్థిక సంవత్సరం చివరిలో, వెయ్యి రూపాయల భరోసా మొత్దానికి, సులభ తిరుగు బోనస్ లు నిర్ణయించబడతాయి. ఒకసారి నిర్ణయించబడిన తర్వాత, అవి ఈ పథకం యొక్క ప్రయోజనాలలో పూర్తి భాగమవుతాయి. బోనస్లు మరియు చివరి (అదనపు) బోనస్, ఎంచుకున్న పాలసీ కాల వ్యవథి మొత్తానికి లేదా ఒకవేళ ముందుగా మరణం సంభవిస్తే ఆ సమయం వరకు జత చేయబడతాయి.

2) వెసులుబాటు సమయం

ప్రీమియంను చెల్లించడానికి ఒక ముప్పై రోజుల వెసులుబాటు సమయం ఇవ్వబడుతుంది. ఆ సమయంలో కూడా పాలసీదారు చెల్లించలేకపోతే, పాలసీ ఆగిపోతుంది. అయితే, ఆ మొదటి చెల్లించని ప్రీమియం కట్టాల్సి ఉండిన తేదీ నుంచి 5 సంవత్సరాల వరకు, దానిని కట్టే అవకాశం పాలసీదారుకు ఉంటుంది. మిగిలి ఉన్న ప్రీమియంలను ఈ నిర్దిష్ట సమయంలోపు కట్టి, ఆగిపోయిన ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పథకాన్ని తిరిగి రివైవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 

3) రద్దు చేసుకోవడం

బీమా చేయించుకున్న వ్యక్తికి, పాలసీ మొదలైన పదిహేను రోజుల వరకు, దానిపై అప్పటికే ఏ చెల్లింపూ పొంది ఉండకపోతే, ఎటువంటి చార్జీ లేకుండానే దానిని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది.

4) సరెండర్ విలువ

పాలసీ మూడు సంవత్సరాల పాటు గడిచిన తర్వాత, సరెండర్ ప్రయోజనాలకు అర్హత పొందుతుంది. అంతేకాకుండా, దీనితో పాలసీదారుకు, ఈ పాలసీపై లోన్ తీసుకునే ప్రయోజనం కూడా సమకూరుతుంది.

ఇలా జరిగితే ఎలా?

 • పాలసీదారు ఒకవేళ, పాలసీ మొదలైన తేదీ నుంచి పన్నెండు నెలల లోపు ఆత్మహత్యకు పాల్పడితే, అప్పటివరకు కట్టిన ప్రీమియం మొత్తంలో 80 శాతం లబ్దిదారుకు వెనక్కివ్వబడుతుంది.
 • పాలసీ పునరుద్ధరణ తర్వాత, పాలసీదారు మరణించినట్లయితే, ఆ మరణించిన తేదీ వరకు కట్టిన ప్రీమియం మొత్తంలో 80% లేదా అది అప్పటివరకు పొందిన సరెండర్ విలువ చెల్లించబడుతుంది.
 • పాలసీ తీసుకోవడానికి ఇచ్చిన వివరాలు, ధృవీకరణ సమయంలో, మోసపూరితమైనవి లేదా నమ్మదగనివి అని రుజువైతే, బీమా చట్టం 1938 లోని సెక్షన్ 45 కింద, ఆ బీమా పాలసీని సరెండర్ చేసే హక్కు సంస్థకు ఉంది. ఒక వ్యక్తి అన్ని అవసరమైన డాక్యుమెంట్లతో సహా పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫారాన్ని ఇస్తేనే ఈ పథకానికి అర్హులవుతారు. ఎల్ఐసీ ఆ పత్రాల చెల్లుబాటును పరిశీలించి, నిర్ధారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, సంబంధిత వ్యక్తికి 15 నుండి 20 రోజుల లోపు ధ్రువీకరణను పంపిస్తుంది.

అవసరమైన డాక్యుమెంట్లు : ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్

ఈ బీమా పథకం కింద బీమా పొందడానికి అవసరమైన డాక్యుమెంట్లు, ఎంచుకున్న పాలసీ భరోసా మొత్తం మరియు దానికి చెల్లించే ప్రీమియంలపై ఆధారపడి ఉంటాయి. దీనికి కావలసిన వాటిలో కొన్ని డాక్యుమెంట్లు కింద ఇవ్వబడ్డాయి:

 • సరైన వివరాలతో పూర్తిగా నింపబడిన అప్లికేషన్/ప్రతిపాదన ఫారం
 • వయసు నిర్ధారణ పత్రం
 • చిరునామా నిర్ధారణ పత్రం
 • ఆరోగ్య వివరాలు
 • ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆదాయపన్ను వివరాలు వంటి KYC పత్రాలు
 • అవసరమైన వైద్య పరీక్షల రిపోర్టులు

ఇప్పుడు తెలుగులో న్యూ జీవన్ ఆనంద్ క్లెయిమ్ ప్రక్రియ గురించి తెలుసుకోండి.

చెల్లింపు ప్రక్రియ

మరణ సమయంలో చెల్లింపు

పాలసీదారు మరణానికి సంబంధించిన చెల్లింపును పొందటానికి,, లబ్దిదారుగా ఎంచుకోబడిన వ్యక్తి, చెల్లింపు అభ్యర్థన పత్రంతో పాటుగా, ఎల్ఐసీ వారు బీమా చేయించుకున్న వ్యక్తి పేరు మీద ఇచ్చిన అసలు పాలసీ పత్రాలను తెచ్చి ఇవ్వాలి. వీటితో పాటుగా, బ్యాంక్ అకౌంట్, వైద్య చికిత్స వివరాలు మరియు మరణ ధ్రువీకరణ పత్రం లాంటి అన్ని ఇతర వివరాలను అందించాలి.

మెచ్యూరిటీ చెల్లింపు

పాలసీ యొక్క మెచ్యూరిటీ చెల్లింపును పొందటానికి, బీమా చేయించుకున్న వ్యక్తి, ఒక విడుదల పత్రాన్ని, దానితో పాటుగా, ఎల్ఐసీ వారు పాలసీదారు పేరు మీద ఇచ్చిన అసలు పాలసీ పత్రాన్ని తెచ్చి ఇవ్వాలి. మెచ్యూరిటీ మొత్తాన్ని NEFT బదిలీ ద్వారా పొందటానికి, పాలసీదారు బ్యాంక్ అకౌంట్ వివరాలను అందించాలి.

సరెండర్ చెల్లింపు

ఒకవేళ పాలసీని సరెండర్ చేయాల్సి వస్తే కూడా, విడుదల పత్రంతో సహా ఎల్ఐసీ వారు జారీ చేసిన ముందటి పత్రాలను, మరియు ఇతర సర్టిఫికేట్లను కూడా అందించాలి. సరెండర్ మొత్తాన్ని NEFT బదిలీ ద్వారా పొందటానికి కూడా, పాలసీదారు బ్యాంక్ అకౌంట్ వివరాలను అందించాలి.