పెన్షన్ పథకాలు
 • సరసమైన ప్రీమియం ధరలు
 • తక్షణ యాన్యుటీ ప్లాన్స్ ఎంపిక
 • కచ్చితమైన పెన్షన్/ ఆదాయం
PX step

అగ్ర శ్రేణి సంస్థల నుంచి ఉచిత కోట్స్

1

2

పుట్టిన తేదీ
ఆదాయం
| లింగ

1

2

ఫోన్ నం.
పేరు
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

పెన్షన్ ప్లాన్స్ ని రిటైర్మెంట్ ప్లాన్స్ అని కూడా పిలుస్తారు. మీరు మీ పదవీ విరమణ అనంతర జీవితాన్ని భద్రపరచుకోవడానికి మీ ప్రస్తుత పొదుపులో కొంత భాగాన్ని ఉపయోగించుకోవచ్చు. కొంతమంది తమ పదవీ విరమణకు తగినంత పొదుపు ఉందని అనుకుంటారు. కానీ పొదుపులు త్వరగా అయిపోతాయనేది వాస్తవం. కాబట్టి ఉత్తమ పెన్షన ప్లాన్ సహాయంతో మీరు మీ పదవీ విరమణ అనంతర జీవితాన్ని సులభంగా కాపాడుకోవచ్చు. తగిన పెన్షన్ ప్రణాళికలు మీ పదవీ విరమణానంతర జీవితాన్ని ఎటువంటి ఉద్రిక్తత లేకుండా ఆస్వాదించడానికి సహాయపడతాయి. అందుకే, రిటైర్మెంట్ సమయంలో మీకు ఆర్థిక రక్షణ కల్పించే పెన్షన్ పాలసీ కలిగి ఉండటం చాలా ముఖ్యం.

ఇల్లు మరియు కారు మాత్రమే కాకుండా, పదవీ విరమణ పెట్టుబడి మీరు సృష్టించే అతి ముఖ్యమైన ఫండ్ కావచ్చు. మీ పదవీ విరమణ తేదీ చాలా దగ్గరగా ఉన్నప్పుడు, పదవీ విరమణ నిధుల సమీకరణ మీకు సమస్యగా మారవచ్చు. రిటైర్మెంట్ జీవితం సాధారణంగా మీ మొత్తం జీవితంలో 1/3 వంతు ఉంటుంది. కాబట్టి దాని కోసం ప్రణాళిక ఏర్పరచుకోవడం చాలా అవసరం. ప్రస్తుతం మీరు పెట్టే చిన్న పెట్టుబడులు కూడా రాబోయే జీవితంలో పెద్ద మార్పును కలిగిస్తాయి. కాబట్టి మీ పదవీ విరమణ కోసంప్రణాళికలు ప్రారంభించడంలో ఆలస్యం చేయవద్దు మరియు మీరు వ్యక్తిగతంగా పరిశోధన చేయడానికి, సంబంధిత వివరాలను తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించడం మంచిది.

పెన్షన్ ప్లాన్ ప్రాథమికంగా ఒక పని చేసే వ్యక్తి లేదా ఉద్యోగి తన జీతం లేదా ఆదాయంలో కొంత భాగాన్ని పదవీ విరమణ ప్రయోజనాలకు బదిలీ చేయవచ్చు. పెన్షన్ ప్లాన్ పదవీ విరమణ సమయంలో పూర్తి భద్రతను అందించే సాధనం. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, పెరుగుతన్న జీవన వ్యయం మరియు సామాజిక భద్రత వ్యవస్థ పెన్షన్ ప్లాన్ ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. పెన్షన్ ప్లాన్ మీ పదవీ విరమణ దశను పూర్తిగా రక్షిస్తుంది.

పెన్షన్ పథకాల రకాలు

ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణ రేటును పరిగణలోనికి తీసుకుంటే పదవీ విరమణ పథకం అనేది చాలా కీలకమైన పెట్టుబడిగా చెప్పవచ్చు. పదవీ విరమణ పథకాలు బీమా సంస్థలు అందించే ప్రయోజనాల పరంగా మారూతూ ఉంటాయి. భారతదేశంలో ప్రస్తుతం డిఫర్డ్ యాన్యూటీ, లైఫ్ యాన్యుటీ, తక్షణ యాన్యూటీ వంటి మరెన్నో పెన్షన్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. డిఫర్డ్ యాన్యుటీ మరియు తక్షణ యాన్యూటీ పథకాలను సాధారణంగా ప్రజలు ఎక్కువుగా ఎంచుకుంటున్నారు.

మరికొన్ని పథకాలను కూడా ఉన్నాయి. ఈ పథకాలు నిధులను డెబిట్ లేదా ఈక్విటీ రూపంలో పెట్టుబడి పెడతాయి. ఈ పథకాల్లో రిటర్న్ లు మార్కెట్ పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి. పెన్షన్ పథకాలను మరిం విభజించవచ్చు, అవి..

డిఫర్డ్ యాన్యుటీ

ఐఏ డిఫర్డ్ పెన్షన్ పథకం పాలసీ వ్యవధిల సాధారణ ఛార్జీలు లేదా సింగిల్ ప్రీమియం ద్వారా కార్పస్ కూడబెట్టుకోవడానికి మిమల్ని అనుమతిస్తుంది. కవరేజీ కాల వ్యవధి ముగిసిన తర్వాత పెన్షన్ పథకం ప్రారంభం అవుతుంది. డిఫర్డ్ పెన్షన్ పథకాలు చాలా ప్రయోజనాలు మరియు పన్ను మినహాయింపు ప్రయోజనాలు అందిస్తున్నాయి. పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే నగదు ఉపసంహరించుకున్నప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డిఫర్డ్ పెన్షన్ పథకాన్ని వన్-టైమ ఫీజు ద్వారా లేదా క్రమబద్ధంగా చెల్లింపులు చేస్తూ కొనుగోలు చేయవచ్చు. తత్ఫలితంగా, పథకం అన్ని రకాల కొనుగోలుదారులకు సరిపోతుంది. పెట్టుబడులను క్రమపద్ధతిలో చేసే వ్యక్తులకు మరియు ఒకేసారి కొంత మొత్తం పెట్టుబడి పెట్టే వ్యక్తులకు ఈ పాలసీ సరిగ్గా సరిపోతుంది.

తక్షణ యాన్యుటీ

యాన్యూటీ పథకం కింద, పెన్షన్ వెంటనే ప్రారంభమవుతుంది.ఒకేసారి పెద్ద మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది మరియు పెట్టుబడి పెట్టిన మొత్తం బట్టి పెన్షన్ వెంటనే ప్రారంభం అవుతుంది. పెట్టుబడి పెట్టడం ద్వారా యాన్యుటీ ఖర్చులను పొందవచ్చు. మీరు విలక్షణమైన యూన్యూటీ చెల్లింపు ఎంపికల నుండి మీ యాన్యుటీని ఎంచుకోవచ్చు. అంతేకాకుండా, మీరు భారతీయ పన్ను చట్టాల ప్రకారం చెల్లించిన ప్రీమియంలపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. పాలసీదదారుడు మరణిస్తే సొమ్ము నామినీకి అందుతుంది.

నిర్థిష్ట యూన్యుటీ 

నిబంధనకు అనుగుణంగా, నిర్దిష్ట కాలానికి యాన్యుటీ చెల్లించబడుతుంది. యాన్యుటీ కాల వ్యవధిని ఎంచుకోవచ్చు మరియు యాన్యుటీ చెల్లింపు వ్యవధిలోపే పాలసీదారుడు మరణిస్తే, అన్ని చెల్లింపులు , యాన్యుటీ లబ్ధిదారునికి చెల్లించబడతాయి.

హామీ యాన్యుటీ

ఈ యాన్యుటీ ఎంపికకు అనుగుణంగా, యాన్యుటీ కాల వ్యవధిలో 5,10, 15 లేదా 20 సంవత్సరాల వంటి క్రమమైన వ్యవధిలో యాన్యుటీ చెల్లించబడుతుంది.

జీవిత యాన్యుటీ

ఈ యాన్యుటీ ప్రత్యామ్నాయానికి అనుగుణంగా , మరణించే వరకు పెన్షన్ యాన్యుటెంట్ కి చెల్లిస్తుంది. ఒక వేళ యాన్యుటెంట్ జీవిత భాగస్వామి ప్రత్యామ్నాయంతో ఎంచుకుంటే యాన్యుటెంట్ మరణించిన తరువాత భాగస్వామకి పెన్షన్ చెల్లించవచ్చు.

నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్ పిఎస్)

నేషనల్ పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఒక వ్యక్తి తనకు అవసరమైన పెన్షన్ మొత్తాన్ని నిర్మించుకోవడానికి ఈ పథకాన్ని సహాయం చేస్తుంది. ఎన్ పిఎస్ పారదర్శకంగా మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇందులో పెన్షన్ విరాళాలు పెన్షన్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టబడతాయి. పదవీ విరమణ సమయంలో మీరు సుమారు 60 శాతం వరకు పరిమాణాన్ని ఉపసంహరించుకోవచ్చు మరియు 40% యాన్యుటీని కొనడానికి ఉపయోగించాలి. మెచ్యూరిటీ మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు.

పెన్షన్ ఫండ్స్

కార్పస్ మొత్తాన్ని నిర్మించడానికి పెన్షన్ ఫండ్స్ ఒక అద్భుతమైన మార్గం. పెన్షన్ ధర పరిధి దీర్ఘకాలిక కోసం ఉద్దేశించబడింది, ఫలితంగా క్రమబద్ధంగా చెల్లింపులు చేస్తాయి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటి(పిఎఫ్ఆర్ డిఎ) 6 సంస్థలను ఫండ్ మేనేజర్లుగా అనుమతించింది.

పెన్షన్ ప్లాన్ యొక్క ఫీచర్లు

హామీ పెన్షన్ / ఆదాయం 

రిటైర్ అయిన తర్వాత లేదా పెట్టుబడి పెట్టిన వెంటనే మీకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ఇది మీరు ఎంత పెట్టుబడి పెట్టారో దానిపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మీరు ఆర్థికంగా స్వతంత్ర జీవితాన్ని గడిపేందుకు ఇది సహాయం చేస్తుంది. పదవీ విరమణ అనంతర రోజుల్లో మీకు నెలవారీ 

అవసరమయ్యే ఆదాయాన్ని సుమారుగా అంచనా వేయడానికి మీరు క్యాలిక్యులేటర్ ను ఉపయోగించువచ్చు.

లిక్విడిటీ

ఒక పెన్షన్ ప్లాన్ ప్రాథమికంగా తక్కువ లిక్విడిటీకి సంబంధించిన ఉత్పత్తి, కానీ పెన్షన్ ఫండ్లను అందించే కొన్ని కంపెనీలు ఉన్నాయి మరియు ఇవి ఏ దశలోనైనా ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తాయి. కాబట్టి నిధుల కొరత విషయంలో ఏ దశలోనైనా ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భాల్లో, బ్యాంక్ రుణాలపై ఆధారపడకుండా లేదా ఇతర వ్యక్తుల నుండి రుణం తీసుకోకుండా అత్యవసర సమయాల్లో మీకు నిధులు సమకూరుతాయి.

వెస్టింగ్ ఏజ్ 

మీరు నెలవారీ పెన్షన్ పొందడం ప్రారంభించే వయసు ఇది. ఉదాహరణకు, చాలా పెన్షన్ ప్రణాళికలు కనీస వెస్టింగ్ 40 లేదా 50 వయసు ఉంచుతాయి. ఇది 70 సంవత్సరాలు వయసు వరకు పెంచుకునే అవకాశం ఉంది. మరి కొన్ని కంపెనీలు కూడా వెస్టింగ్ ను 90 సంవత్సరాల వరకు అనుమతిస్తాయి.

సంచిత వ్యవధి

పెన్షన్ పథకాలలో క్రమం తప్పకుండా లేదా ఒకేసారి ప్రీమియం చెల్లించడానికి అనుమతిస్తుంది. పెట్టుబడి మరియు లాభాల కలుయికగా ఉండే గణనీయమైన కార్పస్ ను నిర్మించడానికి సమయం ఇది. ఉదాహరణకు , మీరు 30 సంవత్సరాల వయసులో పెట్టుబడిని ప్రారంభించి , 60 సంవత్సరాల వయసు వరకు కొనసాగితే సంచిత కాల వ్యవధి 30 సంవత్సరాలు. ఈ కాలానికి పెన్షన్ పథకానికి నిధులు కార్పస్ నుండి వస్తుంది.

చెల్లింపు కాలం

ఈ కాలాన్ని సంచిత కాల వ్యవధితో కలపవద్దు. మీరు పదవీ విరమణ చేసిన తరువాత పెన్షన్ పొందే సమయం ఇది. ఉదాహరణకు, ఒకరు 60 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వయస్సు వరుకు పెన్షన్ అందుకుంటే . చెల్లింపు వ్యవధి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. సంచిత కాల వ్యవధి నుండి చాలా నిధులు వేరుగా ఉంచబడతాయి. అయితే కొన్ని నిధులను సంచిత కాల వ్యవధిలో పూర్తిగా లేదా పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు.

సరెండర్ విలువ

కనీస ప్రీమియం చెల్లించిన తర్వాత కూడా పెన్షన్ ప్లాన్ ను మెచ్యూరిటీకి ముందే అప్పగించడం మంచిది కాదు. దీని వల్ల పెట్టుబడిదారుడు హామీ ఇచ్చిన మొత్తం మరియు జీవిత బీమా కవరేజీతో సహా, పథకం యొక్క ప్రతి ప్రయోజనాన్ని కోల్పోతాడు.

పెన్షన్ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి కారణాలు

పదవీ విరమణ దశ జీవితం యొక్క కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. ఇది ప్రాథమికంగా పని నుంచి విశ్రాంతి వైపు మీ జీవితం మారుతున్న క్రమంలో మీకు భద్రత కల్పిస్తుంది. ఇది ఒక కాలపరిమితి, దీనిలో రిటైర్ అయిన వ్యక్తి అతను/ ఆమె పని రోజులలో ఆస్వాదించలేకపోయిన తన వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించగలరు. "జీవితం పదవీ విరమణతో మొదలవుతుంది"- ఇది పూర్తిగా నిజమైన వ్యాక్యం, అయితే మీ పదవీ విరమణ దశను పూర్తిస్థాయిలో ఆస్వాదించడానికి మీరు ఒకరిపై ఆధారపడాల్సి ఉంటుంది.

మీ వ్యక్తిగత అవసరాలకు ఇతరులపై ఆధారపడటం పూర్తిగా కష్టం. మీరు పదవీ విరమణ దశలో ఇతరులపై ఆధారపడకూడదు అనుకుంటే, ఈ రోజు ముంచే దాని కోసం పెన్షన్ పథకంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలి. మీరు సురక్షితంగా ఉండడానికి ముందుగానే ప్రతి విషయాన్ని ప్లాన్ చేసుకోవాలి.

పదవీ విరమణ పథకంలో పెన్షన్ పథకం కూడా కలిసి ఉంటుంది. పెన్షన్ పథకం లేకుండా పదవీ విరమణ పథకం కలిగి ఉండటం అనేది ఒక అంసపూర్తి పథకమే అవుతుంది. పెన్షన్ పథకం ప్రాథమికంగా మీ పదవీ విరమణ దశను కాపాడడానికి రూపొందించబడింది. సురక్షితమైన పదవీ విరమణ జీవితాన్ని పొందానికి మీరు మీ పొదుపులో కొంత భాగాన్ని పెన్షన్ ప్రణాళికలో ఉంచాలి. దీంతో మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు మరియు ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు.

ఆర్థిక భద్రత

ఆర్థిక భద్రత ఒక వ్యక్తి ఎంత పెట్టుబడి పెట్టాలి మరియు ఎంత సమర్థవంతంగా పెట్టుబడి కొనసాగించాలి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. పెద్ద నగదు నిల్వను కలిగిన కార్పస్ ను నిర్మించడంలో పెట్టుబడులు సహాయపడతాయి. ఇది కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడంలో సహాయపడుతుంది.

అత్యవసర పరిస్థితులకు సిద్ధం

వైద్య అత్యవసర పరిస్థితి ఆర్థిక సంక్షోభానికి కారణం అవుతుంది. ఉహించని వైద్య అత్యవసర పరిస్థితి మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా కూడా ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి సందర్భంలో మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడంలో పెట్టుబడి మీకు సహాయపడుతుంది. మీ ఆర్థిక పరిస్థితిపై చెడు ప్రభావాన్ని చూపగల అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది.

ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది

ఇల్లు, కారు, వివాహం లేదా ఏదైనా వస్తువు కొనుగోలు చేయడానికి సొమ్ము అవసరమైతే పెన్షన్ పథకం నిధులను సమకూరుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ఆర్థిక లక్ష్యాలు నేరవేర్చడ నిజంగా చాలా కష్టం. అయితే మీ లక్ష్యాలను పెట్టుబడి

ఆధారిత పథకాల సాయంతో సులభంగా సాధించవచ్చు.

సంపద సృష్టి

సంపద సృష్టించడానికి మరియు మీ డబ్బు వృద్ధి చెందాలంటే పెట్టుబడి ఎంపికలు అవసరం. పెట్టుబడి పథకాల ద్వారా మీ సంపద పెంచుకోవడానికి అనేక ఆప్షన్లు ఉన్నాయి.

ఫండ్ మెనేజర్ పై పరిశోధన 

ద్రవ్యోల్బణం మీ పొదుపును పూర్తిగా నాశనం చేస్తుంది. ప్రతి సంవత్సర, ధరలు పెరుగుతూనే ఉంటాయి. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా మీ పొదుపును రక్షించడంలో పెట్టుబడులు మీకు సహాయపడతాయి. ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి మంచి మార్గం ద్రవ్యోల్బణ రేటు కంటే ఎక్కువ మంచి రాబడి అందించే ఒక ఎంపికలో మీ డబ్బుని సమర్థవంతంగా పెట్టుబడి పెట్టడమే.

పెన్షన్ ప్లాన్ కొనుగోలు చేసేటప్పుడు తప్పక పరిశీలించాల్సిన అంశాలు

 • వివిధ పాలసీలను లేదా పథకాలను పోల్చడం ద్వారా మీ అవసరానికి తగిన ఉత్తమ పెన్షన్ పథకాన్ని ఎంచుకోవచ్చు. 
 • సదరు పథకం మీ అవసరానికి తగిన కవరేజీని అందిస్తుందో లేదో తనిఖీ చేయడం మంచిది. పాలసీదారుడు మరణిస్తే బీమా మొత్తం నామినికి లభిస్తుంది. ఈ ఫీచర్ అందుబాటులో ఉందో, లేదో చూడాలి. అయితే లబ్ధిదారుడు చెల్లించాల్సిన ప్రీమియంలు మరియు ఖర్చుల నికర మొత్తాన్ని మాత్రమే పొందుతాడు.
 • మీ బీమా సంస్థ అందించే పథకాల సమీక్షలను తనిఖీ చేయండి
 • సాంప్రదాయ పెన్షన్ ప్లాన్ ప్రభుత్వ సెక్యూరిటీలు మరియు బాండ్లలో కొంత ప్రీమియం పెట్టుబడి పెడుతుంది. అందువల్ల ఇవి తక్కువ రాబడిని ఇస్తాయి. కాగా యూలిప్ పెన్షన్ పాలసీలు అధిక పెట్టుబడులను ఇస్తాయి.
 • ఫండ్ మేనేజ్ మెంట్ కేటాయింపు ఛార్జీలు మొదలైన వాటి రూపంలో చేర్చబడిన వివిధ ఛార్జీలను తనిఖీ చేసిన తరువాత మీరు యూలిప్ పెన్షన్ ప్లాన్ లో పెట్టుబడి పెట్టాలి.
 • సెక్షన్ 80సిసి కింద లభించే పన్ను మినహాయింపులు మరియు పన్ను ప్రయోజనాలను తనిఖీ చేయండి.

వృద్దాప్యంలో ఆర్థిక భద్రతను అందించడానికి ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకం, పెన్షన్ యోజన, మరికొన్ని పథకాలను అందిస్తోంది.

పదవీ విరమణను దృష్టిలో పెట్టుకుని వ్యక్తులు పెన్షన్ పథకాల ప్రయోజనాలను అంచనా వేయడం చాలా అవసరం మరియు ఈ పథకాల్లో ప్రారంభదశలోనే పెట్టుబడి పెట్టడం అనేది అత్యవసరం. ప్రారంభదశలోనే మీరు పాలసీ కొనుగోలు చేస్తే పాలసీ మెచ్యూరిటీ సమయంలో ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

భారతదేశంలో అనేక బీమా సంస్థలు, వివిధ రకాల పెన్షన్ ప్లాన్ లను అందిస్తున్నాయి. వీటిలో ఉత్తమ పాలసీలు ఎంచుకోవడానికి మీరు అన్ని బీమా పథకాలను సరిపోల్చాల్సి ఉంటుంది. మెరుగైన స్థిరత్వం యొక్క కోణం నుండి, చాలా మంది ప్రజలు ప్రాథమిక పథకం, పెన్షన్ ప్లాన్, చైల్డ్ ప్లాన్ మరియు మరెన్నో పథకాలను కలిపి మిళితం చేసి యూలిప్ ప్రణాళికల కోసం వెళ్తున్నారు. సరైన పెన్షన్ ప్లాన్ ని, సరైన సమయంలో తీసుకుంటే.. వృద్ధాప్యంలో మీకు మంచి స్నేహితుడి దొరికినట్లే.

టాప్ ప్రభుత్వ పెన్షన్ పథకాలు

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

పిపిఎఫ్( పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) పథకం, 1968 అనేది పన్ను రహిత పొదుపు పథకం. 1968 సంవత్సరంలో భారతదేశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రవేశ పెట్టింది. పిపిఎఫ్ నుంచి మీకు వచ్చిన వడ్డీపై ఎటువంటి పన్ను ఉండదు. అయితే పిపిఎఫ్ పథకంలో మీరు పెట్టుబడిన పెట్టిన డబ్బు పన్ను పరిథిలోకి వస్తుంది. దీనిని ఉత్తమ పెన్షన్ పథకాల్లో ఒకటిగా చెప్పవచ్చు. భారతీయుల్లో పొదుపును ప్రోత్సహించే లక్ష్యంతో మరియు ముఖ్యంగా రిటైర్మెంట్ కార్పస్ ను సృష్టించే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు.

జాతీయ పెన్షన్ పథకం

 జాతీయ పెన్షన్ పథకం (ఎన్ పిఎస్) ప్రాథమికంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన సహకార పథకం. ఇది అన్ని రకాల పెట్టుబడులను అందిస్తుంది. సరైన నిర్ణయం తీసుకోవడంలో వ్యక్తులకు సహాయపడుతుంది. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే పదవీ విరమణానంతర రోజుల్లో మంచి రాబడితో పాటు స్థిరమైన ఆదాయం లభించేలా చేయడం.

ఎన్ పిఎస్ జనవరి 1, 2004 న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు సాయుధ దళాల కోసం ప్రారభించబడింది. అయితే 2009 సంవత్సరం నుండి, 18 మరియు 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి భారతీయుడు పౌరుడు ఎన్ పిఎస్ సౌలభ్యాన్ని పొందేలా ప్రభుత్వం మార్పులు చేసింది. 

ఎన్ పిఎస్ పథకం కింద ప్రతి సభ్యునికి ప్రత్యేక శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్యలు అందించబడతాయి. చందాదారులకు రెండు ఖాతాలు కేటాయించబడతాయి, సభ్యులు ఎప్పుడైనా ఖాతాలను యాక్సెస్ చేయవచ్చు.

అటల్ పెన్షన్ యోజన

అసంఘటిత రంగంలోని కార్మికుల ప్రేరణ కోసం మరియు వారి పదవీ విరమణ కోసం అదా చేయడానికి , భారత ప్రభుత్వం జూన్ 2015 సంవత్సరంలో అటల్ పెన్షన్ యోజన అని పిలవబడే కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ప్రభావంతమైన ప్రణాళికను బడ్జెట్ లో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం 

యూపిఎ ప్రభుత్వ హయంలో స్వవాలంబన్ యోజన- ఎన్ పిఎస్ లైట్ స్థానంలో ఉండేది మరియు దీనిని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ నిర్వహిస్తుండేది. ఈ ప్రభుత్వం యొక్క ప్రయోజనాలు ఏమిటంటే ప్రభుత్వం అందించే స్థిరత్వం, అలాగే ప్రభుత్వం చందాదారులకు కూడా సహకారం అందిస్తుంది.

ఈ పథకం కింద ఒక వ్యక్తి కనీస స్థిర ఫించను కనిష్టంగా నెలకు రూ. 1,000 మరియు గరిష్టంగా రూ. 5,000 లభిస్తుంది. అయితే చందాదారులు ఎంచుకున్న మొత్తం, పథకంలో చేరేటప్పుడు ఎంత వయసు అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ప్రైవేట్ బీమా సంస్థలు అందిస్తున్న టాప్ పెన్షన్ ప్లాన్స్ 

ఎస్బీఐ లైఫ్- యూన్యుటీ ప్లస్

 • ఈ ప్లాన్ ప్రకారం మీరు యాన్యుటీ ఎంపికను ఎంచుకోవచ్చు.
 • 40 సంవత్సరాల వయసు నుండి క్రమబద్ధమైన ఆదాయం లభిస్తుంది.
 • మీకు మరియు మీ కుటుంబానికి జీవితకాలం యాన్యుటీ చెల్లింపు జరుగుతుంది.
 • మీ అవసరాలకు అనుగుణంగా చెల్లింపులలో మార్పులు చేసుకోవచ్చు.
 • రైడర్ లను ఎంపిక చేసుకునే సౌలభ్యం, ఎస్బీఐ లైఫ్- యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ ను ఎంచుకోవచ్చు.
 • మీరు ఈ ఎంపికలను పొందుతారు- సింగిల్ లైఫ్ యాన్యుటీ, బ్యాలెన్స్ క్యాపిటల్ రీఫండ్ తో జీవిత కాల ఆదాయం, 3-5% వార్షిక పెరుగుదలతో
 • జీవితకాల ఆదాయం, 5, 10 లేదా 20 సంవత్సరాలకు జీవిత కాల ఆదాయం.
 • ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.

ఐసిఐసిఐ ప్రు తక్షణ యాన్యుటీ

ఈ బీమా పథకాన్ని ఒకేసారి బీమా మొత్తాన్ని చెల్లించవచ్చు లేదా 5 పే-అవుట్ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. మీకు నెలవారీ, త్రైమాసిక, అర్థ-వార్షిక లేదా వార్షిక చెల్లింపు అనే 4 విధానాలు లభిస్తాయి. చెల్లింపు ఎంపికలు ఈ క్రింది విధంగా ఉంటాయి...

 • జీవిత యాన్యుటీ
 • కొనుగోలు ధర తిరిగి రావడంతో కూడిన జీవిత యాన్యుటీ
 • ఉమ్మడి జీవితం, కొనుగోలు ధర రాబడితో లైఫ్ సర్వైర్ 
 • 5, 10, లేదా 15 సంవత్సరాల యాన్యుటీకి హామీ
 • హెచ్ డిఎఫ్ సి లైఫ్ న్యూ ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్
 • మీకు మరియు మీకు భాగస్వామికి జీవిత కాల ఆదాయం
 • అనేక రకాల యాన్యుటీ ఎంపికల నుండి ఎంచుకోండి
 • కొన్ని యాన్యుటీ ఎంపికలప మరణ ప్రయోజనం
 • పన్ను ప్రయోజనాలు

రిలయన్స్ తక్షణ యాన్యుటీ ప్లాన్ 

ఇది ఒకే ప్రీమియం ప్లాన్, ఈ పథకం ద్వారా మీరు ఈ క్రింది ప్రయోజనాలు పొందవచ్చు.

 • మీ సంపాదనను క్రమబద్ధమైన ఆదాయంగా మార్పవచ్చు.
 • మీ జీవిత కాలం మొత్తం క్రమబ్ధమైన ఆదాయం పొందవచ్చు.
 • మీపై ఆధారపడ్డ వారి కోసం కొంత మొత్తంలో నిధులు కేటాయించే అవకాశం.
 • ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు.
 • బిఎల్ ఎస్ ఐ తక్షణ యాన్యుటీ ప్లాన్
 • మీరు ఈ ప్లాన్ తో క్రింది ప్రయోజనాలు పొందవచ్చు.
 • మీ పదవీ విరమణానంతరం క్రమబద్ధంగా ఆదాయాన్ని పొందవచ్చు.
 • మీరు పే-అవుట్ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకోవచ్చు.
 • ఈ పాలసీని పొందడానికి మీరు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు.
 • ఆదాయపు పన్ను చట్ట, 1961లోని సెక్షన్ 80 సిసి కింద మీరు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.

పెన్షన్ లేదా పదవీ విరమణ పథకాన్ని ఎలా ఎంచుకోవాలి?

మీరు మీ పదవీ విరమణ అనంతరం జీవితాన్ని గురించి ఆలోచించండి. వృద్ధాప్యంలో మీ జీవనం కోసం మీరు ఇతరులపై ఆధారపడాలనుకుంటున్నారా? అలా జరగకూడదంటే మీరు ఈ రోజు నుంచే మీ పదవీ విరమణ కోసం ప్రణాళిక రచించాలి. పెన్షన్ ప్రణాళికలు తప్పనిసరిగా మీ పొదుపును పెట్టుబడి పెట్టడానికి సహాయపడతాయి. తద్వారా ఇది మీ పదవీ విరమణ తర్వాత ఉపయోగించబడుతుంది. భారత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం వివిధ రకాల పెన్షన్ పథకలను అందిస్తుంది. ప్రైవేట్ రంగాలలో అలాంటి నిబంధనలు లేవు. 

మీరు ప్రభుత్వ ఉద్యోగి కాకపోతే, ప్రైవేట్ బీమా సంస్థలు పెన్షన్ ప్రణాళికలు అందింస్తున్నాయి మరియు మీ అవసరాలకు అనుగుణంగా తగిన ప్రణాళిక ఎంచుకోవాలి. policyx.com లో, మీ ప్రస్తుత అవసరాన్ని అర్థం చేసుకుని మరియు మీ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మ్యాక్స్ లైఫ్, హెచ్ డిఎఫ్ సి లైఫ్, బజాజ్ అలియాన్జ్ వంటి ప్రముఖ బ్రాండ్లు అందించే అనేక పెన్షన్ పథకాల సరిపోల్చుకోవచ్చు. 

పెన్షన్ ప్లాన్ 

ప్లాన్ గురించి

ప్రవేశ వయసు

పాలసీ వ్యవధి

బీమా మొత్తం

ఎల్ఐసీ జీవన్ నిధి ప్లాన్

అదనపు బోనస్ అందించే డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్, ఇది బహుళ పెన్షన్ ఎంపికలను అందిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం 6 సంవత్సరం ప్రీమియం చెల్లింపుతో లభించే బోనస్ పై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. • కనిష్టం:20 సంవత్సరాలు

 • గరిష్టం:58 సంవత్సరాలు(రెగ్యులర్ ప్రీమియం) , 60 సంవత్సరాలు(సింగిల్ ప్రీమియం) 
 • కనిష్టం:5 సంవత్సరాలు

 • గరిష్టం:35 సంవత్సరాలు
 • కనిష్టం రూ. 1 లక్ష(రెగ్యులర్ ప్రీమియం), రూ. 1.5 లక్ష(సింగిల్ ప్రీమియం)

ఎస్బీఐ లైఫ్ సరళ్ పెన్షన్ ప్లాన్

2.5% నుంచి 2.75% మధ్య ఖచ్చితమైన హామీ బోనస్ అందించే పథకం, ఇది రైడర్స్ ద్వారా లైఫ్ కవర్ కోసం ఒక ఎంపికను కూడా అందిస్తుంది.

 • కనిష్టం:18 సంవత్సరాలు

 • గరిష్ట:60 సంవత్సరాలు(సింగిల్ ప్రీమియం), 65 సంవత్సరాలు(సింగిల్ ప్రీమియం) 
 • కనిష్టం 5 సంవత్సరాలు(సింగిల్ ప్రీమియం), 10 సంవత్సరాలు (రెగ్యులర్ ప్రీమియం),
 • 10 సంవత్సరాలు( రెగ్యులర్ ప్రీమియం) గరిష్టం 40 సంవత్సరాలు
 • కనిష్టం: రూ. 1 లక్ష

 • గరిష్టం: పరిమితి లేదు

హెచ్ డిఎఫ్ సి లైఫ్- క్లిక్ 2 రిటైర్ ప్లాన్

ఆన్లైన్ పెన్షన్ ప్లాన్, ఇది ఒక వ్యక్తి యొక్క పదవీ విరమణను హామీ ఇచ్చిన వెస్టింగ్ బెనిఫిట్ ద్వారా సురక్షితం చేస్తుంది.

యూనిట్ లింక్డ్ ప్లాన్ కావడం వల్ల ఇది కొన్ని వృద్ధి అవసరాలను తీర్చగల నిధులలో పెట్టుబడి పెడుతుంది.

 • కనిష్టం:18 సంవత్సరాలు

 • గరిష్టం:65 సంవత్సరాలు
 • కనిష్టం:10 సంవత్సరాలు

 • గరిష్టం:35 సంవత్సరాలు

ప్రీమియం పై ఆధారపడి ఉంటుంది.

ఎల్ఐసి జీవన్ అక్ష్య VI ప్లాన్

పదవీ విరమణ తర్వాత ఆర్థిక అవసరాలను తీర్చడంలో సహాయపడే హామీ ప్రయోజనాన్ని అందించే యూనిట్ లింక్డ్ ప్లాన్

 • కనిష్టం:35 సంవత్సరాలు

 • గరిష్టం:85 సంవత్సరాలు

లభ్యత లేదు

ప్రీమియంపై ఆధారపడి ఉంటుంది

ఐసిఐసి ప్రు-ఈజీ రిటైర్మెంట్ ప్లాన్

పదవీ విరమణ తర్వాత ఆర్థిక అసరాలను తీర్చడంలో సహాయపడే ప్రీమియం పై ఆధారపడి ఉంటుంది

 హామీ ప్రయోజనాన్ని అందించే యూనిట్ లింక్డ్ ప్లాన్ 

 • కనిష్టం:35 సంవత్సరాలు

 • గరిష్టం:70 సంవత్సరాలు
 • కనిష్టం:10 సంవత్సరాలు

 • గరిష్టం:30 సంవత్సరాలు

రిలయన్స్ స్మార్ట్ పెన్షన్ ప్లాన్

ఇది నాన్- పార్టిసిపెటింగ్ యూనిట్ లింక్డ్ ప్లాన్ ఒక వ్యక్తి పదవీ విరమణ చేసిన తర్వాత సాధారణ ఆదాయ వనరులను అందిస్తుంది.

లభ్యత లేదు 

 • కనిష్టం:10 సంవత్సరాలు

 • గరిష్టం:30 సంవత్సరాలు

ప్రీమియం పై ఆధారపడి ఉంటుంది

పెన్షన్ పథకాల యొక్క ప్రాముఖ్యత

ఆదాయ వనరు: మీరు పదవీ విరమణ చేసిన తర్వాత, సంపాదించడం ఆగిపోతుంది. ఆ సమయంలో పెన్షన్ ప్లాన్ మీ ఆదాయ వనరుగా ఉంటుంది.

స్వతంత్రత: పదవీ విరమణ తర్వాత మీకు స్థిర ఆదాయం లభించేటప్పుడు మీ మనుగడ కోసం వేరొకరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు.

డివిడెంట్లకు ప్రయోజనం: ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగితే, మీ నామినీ(డిపెండెంట్) మెచ్యూరిటీ మొత్తాన్ని పొందుతారు.

పన్ను ప్రయోజనాలు: ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద రూ. 1,00,000 వరకు పెన్షన్ ఫండ్ కు పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది.

పెన్షన్ పథకంలో మీరు పొందగల రైడర్స్( అదనపు ప్రయోజనాలు)!

మీ అన్ని ముఖ్యమైన అవసరాలకు ప్రాథమిక పెన్షన్ ప్రణాళిక సరిపోదు. మీ ప్రాథమిక రెగ్యులర్ పెన్షన్ ప్లాన్ తో పాటు మీకు అదనపు ప్రయోజనాలు అవసరమైనప్పుడు రైడర్స్ ని ఎంచుకోవచ్చు. ఈ అదనపు ప్రయోజనాలను బీమా సంస్థలు అదనపు ప్రీమియం ఖర్చుతో అందిస్తాయి. 

మీ పెన్షన్ పథకంతో మీరు ఎంచుకోగలిగే రైడర్స్ గురించి కింద వివరించడం జరిగింది...

యాక్సిడెంటల్ డిసేబిలిటీ రైడర్

ఇది తక్కువ ప్రీమియంలో లభించే ప్రభావవంతమైన రైడర్ . మీరు తక్కువ వయసు గలవారు అయితే, మీ ప్రీమియం కూడా తగ్గే అవకాశం ఉంది. ఇతరులతో పోల్చితే యువకులు చనిపోయే అవకాశం చాలా తక్కువ అందువల్ల రిస్క్ తక్కువగా ఉంటుంది.

తీవ్రమైన వ్యాధుల బెనిఫిట్ రైడర్

ఇది తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న లబ్ధిదారునికి సంబంధించినది. ఇది ఉత్తమమైన మరియు ముఖ్యమైన రైడర్ లలో ఒకటి. సాధారణంగా బీమా సంస్థలు పరిమితిని నిర్ణయిస్తాయి.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, పాలసీదారుడు సాధారణ బీమా పాలసీతో పాటు, తీవ్రమైన వ్యాధుల రైడర్ కోసం కూడా క్లైయిమ్ చేస్తే బీమా సంస్థ ఆసుపత్రి ఖర్చులు చెల్లించకుండా కేవలం తీవ్రమైన వ్యాధుల రైడర్ కు మాత్రమే క్లైయిమ్ సెటిల్ చేయవచ్చు. ఇలాంటి సమయంలో హాస్పిటల్ క్యాష్ రైడర్ కోసం ఉద్దేశించబడిన అదనపు ప్రీమియంలు మాఫీ చేయబడతాయి. 

రైడర్ లు ఎల్లప్పుడూ మీ ప్రాథమిక బీమా పాలసీని బలోపేతం చేస్తాయి. మీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మీరు రైడర్ లను ఎంచుకోండి.

మీ పదవీ విరమణ పథకాన్ని ఎలా ఉపయోగించుకోవాలి

ప్రయాణం, వాహనం, డిజిటల్ పరికరాలు వాడటం మన నిత్య జీవితంలో తరుచుగా చేసే పనులు. వీటి కోసం మనం ఖర్చు కూడా పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆదాయం ఉంది, మరి భవిష్యత్తులో వీటికి సంబంధించిన ఖర్చులు ఎలా భరించాలి. ఇందుకోసం మన ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మనం పెన్షన్ పథకాలను ఎంచుకోవచ్చు. చాలా బీమా సంస్థలు పెన్షన్ ప్రణాళికలు అందిస్తున్నాయి. ఈ భవిష్యత్ ను సులభంగా ప్లాన్ చేయడానికి సహాయపడతాయి. ప్రతి ప్రణాళిక నిర్దిష్ట సామర్థ్యాలతో వస్తుంది. మీ అవసరాలకు అనుగుణంగా లేదా వయసు ఆధారంగా పెన్షన్ ప్రణాళికలను ఎంచుకోవచ్చు.

మీ పదవీ విరమణ కోసం ప్రణాళికలు రూపొందించడం రాకెట్ సైన్స్ ఏమి కాదు. మీకు కావాల్సిందల్లా ఒక పథకం మరియు ఆర్థిక సహాయం.

ఈ రోజే పెన్షన్ ప్లాన్ లో పెట్టుబడి పెట్టండి

ముందస్తుగా పెన్షన్ పథకాల్లో ప్రారంభించడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. 25 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీ లేదా పురుషుడు 35 సంవత్సరాల కాల వ్యవధి పెన్షన్ పథకాన్ని తీసుకుంటే వారి కార్పస్ నిధి అనేది, 35 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీ మరియు పురుషుడు 25 సంవత్సరాల కాల వ్యవధికి పెన్షన్ పాన్ల్ తీసుకుంటే వచ్చే కార్పస్ నిధి కంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ప్రతి సంవత్సరం సానుకూల వడ్డీ రేటుతో ఇది ఎక్కువ సొమ్మును అందిస్తుంది.పైన పేర్కొన్న విధంగా 10 కవరేజీ సంవత్సరాల ద్వారా కార్పస్ నిధిలో భారీ వత్యాసం వస్తుంది. కాబట్టి మీ రిటైర్మెంట్ లైఫ్ ని సురక్షితం చేసుకోవడానికి ఈ రోజే పెన్షన్ పథకాన్ని కొనుగోలు చేయండి.

పథకాన్ని చాక్ అవుట్ చేయండి

మీ రిటైర్మెంట్ జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నారో దాని ఆధారంగా పెన్షన్ పథకాన్ని తీసుకోవచ్చు. మీరు హాయిగా జీవించాలన్నా, సంవత్సరంలో ఒకసారి టూర్ కి వెళ్లాలన్నా లేదా మీకు ఇతర కలలున్నా వాటి ఆధారంగా మీ ఆర్థిక ప్రణాళిక రూపొందించండి. అలాగే మీ భాగస్వామి మరియు మీ రోజువారీ ఖర్చులు కూడా ఈ ఆర్థిక ప్రణాళికలో చేర్చాల్సి ఉంటుంది. ఇవి కాకుండా, మీరు అత్యవసర వైద్య పరిస్థితుల కోసం కొంత మొత్తాన్ని కేటాయించాల్సి ఉంటుంది. దీనిని కూడా ఆర్థిక ప్రణాళికలో చేర్చండి.

నిపుణుల సహాయం తీసుకోండి

మీరు మీ పదవీ విరమణ తర్వాత జీవితాన్ని గడపడానికి అవసరమైన ప్రణాళిక వేసుకున్న తర్వాత, మీ అవసరాలకు అనుగుణంగా ఉత్తమ ప్రణాళిక ఎంచుకోవడంలో నిపుణుల సహాయం తీసుకోండి. మీరు పదవీ విరమణానంతర జీవితాన్ని ఎలా గడపాలో అనే దానిపై ప్రణాళిక వేసుకున్నప్పట్టికీ, నిపుణులు మీ ప్రణాళికలను వివిధ పెన్షన్ పథకాలతో సరిపోల్చి మీకు ఉత్తమమైన పెన్షన్ పథకాన్ని సూచిస్తారు. అలాగే వీటిలో ఏమన్నా మర్పులు, చేర్పులు అవసరమైతే మీక తెలియజేస్తారు. మీ అవసరాలను పూర్తిగా నేరవేర్చగల మరియు మీ ప్రస్తుత ఆదాయ పరంగా చవకైన పథకాన్ని ఎంచుకోవాలి.

మీ పెన్షన్ పథకాన్ని తరచుగా అంచనా వేయండి

కేవలం పెన్షన్ పాలసీని కొనడంతో మీ పని పూర్తి కాదు. పెన్షన్ పథకం మీ పెట్టుబడులకు తగిన రాబడి అందింస్తుందా లేదా అనే విషయాన్ని మీరు తరచుగా పరిశీలిస్తూ ఉండాలి మరియు మీరు క్రమబద్ధంగా పునరుద్దరణ చేయడం చాలా అసరం. మీ పెన్షన్ పథకం రాబడిని కాలనుగుణంగా

అంచనా వేయడానికి, మీరు ఒక ఆర్థిక నిపుణుడి సహాయం తీసుకోవచ్చు. మీరు యూలిప్(యూనిట్ లింక్డ్ బీమా పథకం) ఎంచుకున్నప్పుడు, మీ పెట్టుబడులు సరైన రాబడి పొందేలా ఆర్థిక నిపుణుడు చూస్తాడు. ఒక వేళ ఆశించిన రాబడి రాకపోతే అతను ఫండ్ రకాన్ని బదిలీ చేస్తాడు లేదా చిన్న ఫండ్ లలో 2-3 మొత్తంలో చిన్న మొత్తాలుగా పెట్టుబడి పెడతాడు. అదనంగా, అతను మీ పదవీ విరమణ సంవత్సరాల్లో మీ పథకం ఆధారంగా మార్పులను సూచిస్తాడు.

మీ పొదుపును ఖర్చు చేయవద్దు

మీరు భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టిన నగదును ఖర్చు చేయడానికి సంబంధించి పరిమితి పెట్టుకోవడం చాలా అవసరం. కొన్ని పెన్షన్ పథకాలకు రుణం పొందే అవకాశం ఉన్నప్పటికీ, రుణం తీసుకోకపోవడమే మంచిది. మీకు ఒక వేళ అత్యవసర పరిస్థితి ఎదురై ఇతర ప్రత్యామ్నాయాలు లేని సందర్భంలో మాత్రమే ఈ రుణ సౌలభ్యాన్ని వినియోగించుకోండి. మీరు పెన్షన్ బడ్జెట్ ను ఖర్చు చేయనంత వరకు, మీరు భవిష్యత్ అవసరాలు పెద్ద మొత్తాన్ని కూడబెట్టగలుగుతారు. 

సరైన ప్రణాళిక రూపొందించడం ద్వారా మరియు నాణ్యమైన పెన్షన్ పథకాన్ని కొనుగోలు చేయడం ద్వారా, పదవీ విరమణాంతర జీవితాన్ని మీరు హాయిగా గడిపే అవకాశం ఉంది మరియు మీ రోజు వారీ ఖర్చులు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

పెన్షన్ పథకాలు కొనుగోలు చేయడానికి ఉండాల్సిన అర్హతలు

పెన్షన్ ప్రణాళికలు కఠినమైన అర్హత ప్రమాణాలు కలిగి ఉంటాయి. బీమా సంస్థలు పెన్షన్ పథకాల విషయంలో ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారిస్తాయి.

ప్రవేశ వయసు: ఒక వ్యక్తి నిర్దిష్ట వయసు వచ్చిన తర్వాత పెన్షన్ ప్రణాళికలో పెట్టుబడి పెట్టవచ్చు. కొన్ని బీమా సంస్థలు అర్హత వయసును 18 సంవత్సరాలుగా నిర్ణయించగా, మరికొన్ని సంస్థలు 30 సంవత్సరాల వయసు అర్హతగా నిర్ణయించాయి. అదే విధంగా గరిష్ట వయో పరిమితిని దాదాపు అన్ని బీమా సంస్థలు 75 సంవత్సరాలుగా నిర్ణయించాయి. 

వెస్టింగ్ ఏజ్: ఇది పెన్షన్ తిరిగి పొందడం ప్రారంభించే వయసు. ఇది పరిస్థితులపై ఆధారపడి 40 సంవత్సరాల వయసు నుండి ప్రారంభమవుతుంది.

ప్రీమియం: ఒకరికి లభించే పెన్షన్ వారు చెల్లించే ప్రీమియం పై ఆధారపడి ఉంటుంది. దాదాపు అన్ని బీమా సంస్థలకు పెన్షన్ పథకాలకు కనీస ప్రీమియం పరిమితిని కలగి ఉంటాయి.

పెన్షన్ ప్లాన్ రైడర్స్ 

అదనపు రైడర్లను ఎంచుకోవడం ద్వారా రక్షణ స్థాయిని పెంచుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ప్రసిద్ధ రైడర్స్ గురించి క్రింద వివరించడం జరిగింది..

యాక్సిడెంటల్ డెత్/ డిసేబిలిటీ రైడర్: ఇది ప్రమాదం కారణంగా పాలసీ దారుడు మరణించిన సందర్భంలో అదనపు హామీ మొత్తాన్ని ఇస్తుంది. పాలసీ కాల వ్యవధిలో పాలసీదారుడు అంగవైక్యలానికి గురైతే ఆర్థిక సహాయం అందుతుంది.

తీవ్ర అనారోగ్య రైడర్: ఇది తీవ్రమైన అనారోగ్యాల నుండి రక్షణ అందిస్తుంది. రెడర్ కవర్ చేసే అనారోగ్యాల సంఖ్య బీమా సంస్థపై ఆధారపడి ఉంటుంది.

టర్మ్ రైడర్: ఈ రైడర్ ఎంచుకోవడం వలన బీమా చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో నామినీకి మరణ ప్రయోజనం లభిస్తుంది. ఇది సాధారణ బీమా పథకాన్ని , జీవిత బీమా పథకంగా మార్చవచ్చు.

ప్రీమియం మాఫీ రైడర్: ఈ రైడర్ కింద, బీమా చేసిన వ్యక్తి వైకల్యానికి గురై ఆదాయాన్ని కోల్పోవడం జరిగితే, భవిష్యత్తులో ప్రీమియంలు మాఫీ చేయబడతాయి. పాలసీదారుడు బీమా సంస్థ పేర్కొన్న నిర్దిష్ట అనారోగ్యానికి గురైతే, ప్రీమియం మాఫీ రైడర్ వర్తిస్తుంది.

పెన్షన్ పథకాన్న కొనుగోలు చేయాడానికి అవసరమైన పత్రాలు

వయసు ధృవీకరణ- జన్మ ధృవీకరణ పత్రం, 10 లేదా 12 మార్కుల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, ఓటర్ కార్డు మొదలైనవి.

గుర్తింపు ధృవీకరణ- డ్రైవింగ్ లెసెన్స్, పాస్ పోర్ట్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పౌరసత్వాన్ని నిరూపించే ఏదైనా పత్రం.

చిరునామా ధృవీకరణ- విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లెసెన్స్, పాస్ పోర్ట్ శాశ్వత చిరునామా స్పష్టంగా పేర్కొన్నాలి.

వైద్య పరీక్షలు- బీమా చేసిన దీర్ఘకాలిక వ్యాధులు లేవని నిర్ధారించుకోవడానికి కొన్ని బీమా సంస్థలు వైద్య పరీక్షల పత్రాలను కోరే అవకాశముంది.

పార్టిసిపెటింగ్ మరియు నాన్ పార్టిసిపెటింగ్ పెన్షన్ పథకాలు

పార్టిసిపెటింగ్ పెన్షన్ పథకం ఉడ్నెర్ ప్లాన్ ను సూచిస్తుంది. ఇది పాలసీదారుడు పొందే మొత్తానికి అదనంగా బోనస్ అందిస్తుంది. ఇది సంస్థ యొక్క నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. పథకం యొక్క ప్రాథమిక భావన ఏమిటంటే, డబ్బు పెట్టుబడి పెట్టిన ఫండ్ యొక్క లాభాల్లో పాల్గోనడం. ఈ ప్లాన్ లలో ఏదైనా బోనస్ తో హామీ ఇచ్చిన మొత్తాన్ని భర్తీ చేయడానికి బీమా కంపెనీకి విచక్షణ ఉంటుంది.

నాన్ పార్టిసిపెటింగ్ పెన్షన్ పథకం కింద పాలసీదారునికి అన్ని ప్రయోజనాలు లభిస్తాయి, బోనస్ మాత్రం లభించదు. ఇది ఫండ్ చేత సంపాదించబడిన లాభాల్లో పాల్గొనదు.

ఉత్తమ పదవీ విరమణ పథకాలకోసం policyX ని ఎందుకు ఎంచుకోవాలి?

మీరు ఉత్తమ పెన్షన్ ప్లాన్ ఎంచుకునేలా policyX ఆన్లైన్ ఇన్సూరెన్స్ వెబ్ అగ్రిగేటర్ సంస్థ మీకు సహాయం చేస్తుంది. policyX ఐఆర్డీఏఐ చేత గుర్తింపు పొందింది మరియు విశ్వసనీయమైన సంస్థ. ఇక్కడ మీరు ఉచితంగా కోట్స్ సరిపోల్చుకోవచ్చు, వివిధ పథకాల సరిపోల్చి వాటి ధరలను చూడవచ్చు, అలాగే సదరు పథకానికి సంబంధించిన విడీయోలు, వాటి ప్రభావం, క్యాష్ ఫ్లో చార్ట్స్ మొదలైనవి చూడవచ్చు. ఈ సమాచారం మీరు ఉత్తమ పెన్షన్ ప్లాన్ ఎంచుకునేందుకు సహాయం చేస్తుంది.

policyx.com ఐఆర్డీఏఐ రిజస్టర్డ్ సంస్థ మరియు బీమా రంగంలోని అన్ని నిబంధనలను సక్రమంగా పాటిస్తూ, ఉత్తమమైన సేవలు అందిస్తూ విశ్వవనీయమైన సంస్థగా ఉంది. policyX లో ఉచితంగా బీమా పథకాలను సరిపోల్చుకోవచ్చు. సంస్థ అందిస్తున్న సేవలు-

 • ప్రముఖ బీమా సంస్థలు అందిస్తున్న వివిధ బీమా పథకాల కోట్స్ ను వెంటనే పొందే సౌలభ్యం.
 • ఆన్లైన్ దరఖాస్తు పూరించడం ద్వారా మీరు నిమిషాల్లో పాలసీని కొనుగోలు చేయవచ్చు.

కొనుగోలు ప్రక్రియ

 • ఉత్తమ పాలసీని ఎంచుకుని సులభంగా కొనుగోలు చేయవచ్చు.
 • ఈ ప్రక్రియ మీ విలువైన సమయాన్ని మరియు డబ్బును ఆదా చేస్తుంది.
 • మీ ప్రాథమిక వివరాలు ఆన్లైన్ దరఖాస్తులో పూరించి, మీకు తగిన ఉత్తమ పథకాన్ని ఎంచుకోండి.
 • policyx.com ద్వారా అగ్రశ్రేణి బీమా సంస్థలు అందిస్తున్న వివిధ బీమా పథకాలను సరిపోల్చండి.
 • మీ అవసరాలకు తగిన పథకాన్ని ఎంచుకోండి.
 • ప్రపోజల్ ఫాం ను పూర్తి చేయండి.
 • అవసరమైన పత్రాలను ఆన్లైన్ లో అప్ లోడ్ చేయండి, చెల్లింపు చేయండి.