టర్మ్ ఇన్సూరెన్స్
 • అధిక జీవిత బీమా కవర్
 • తక్కువ ప్రీమియం ప్రణాళికలు
 • పన్ను ప్రయోజనాలు
PX step

ప్రీమియం పోల్చండి

1

2

ఫోన్ నం.
పేరు
పుట్టినరోజు

1

2

ఆదాయం
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన జీవిత బీమా పాలసీ. ఇది పాలసీదారు మరణ విషయంలో అతను/ఆమె కుటుంబానికి, నామినీకి ఆర్థిక కవరేజీని అందిస్తుంది. పాలసీదారు మరణం తర్వాత అతను లేదా ఆమె కుటుంబానికి ఆర్థిక రక్షణ అందిస్తుంది. రైడర్స్ సాయంతో(యాడ్-అన్స్) సహాయంతో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కింద వ్యాధులు మరియు వైకల్యానికి సమగ్ర కవరేజీ పొందవచ్చు. మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తును సమగ్రంగా రక్షించడానికి ఇది ఉత్తమమైన మార్గాల్లో ఒకటి.

టర్మ్ ఇన్సూరెన్స్ లో పెట్టుబడులు పెట్టడం ఎందుకు ముఖ్యం?

రోజు వారీ ప్రమాదాలు మరియు వ్యాధుల మీ సుదీర్ఘ జీవితాన్ని దెబ్బతీస్తాయి. దీనిని ఎదుర్కొనేందుకు మీకు టర్మ్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. దురదృష్టవశాత్తు మీరు మరణిస్తే, మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఆర్థిక బ్యాకప్ ఉండాలి. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు మరియు అది కూడా చిన్న వయసులోనే పెట్టుబడి పెట్టాలని పేర్కొంటున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ మీ మరణం తరువాత కూడా మీ కుటుంబానికి స్థిరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. ఇది వారి రోజువారీ ఖర్చులను తీర్చడానికి మరియు వారి ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

ఈ ఉదాహరణ ద్వారా టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి అర్థం చేసుకుందాం..

వరుణ్ మరియు మానిక్ స్నేహితులు. వరుణ్ టర్మ్ ఇన్సూరెన్స్ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నాడు మరియు మానిక్ కు కూడా అదే చేయాలని సూచించాడు. మానిక్ కు ఈ ఆలోచన నచ్చలేదు మరియు వరుణ్ ప్రతిపాదనను తిరస్కరించాడు. 

3 సంవత్సరాల తరువాత వారు రోడ్డు మార్గం ద్వారా జైపూర్ కు వెళ్తున్నప్పుడు ప్రమాదంలో జరిగి అక్కడికక్కడే మరణించారు. రెండు కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయి. అయితే బీమా సహాయం అందడంతో వరుణ్ కుటుంబం కొంత ఉపశమనం పొందింది మరియు వారి ఖర్చుల తీర్చడానికి డబ్బు అందింది. మానిక్ కుటుంబం ఎటువంటి ఆర్థిక రక్షణ లభించలేదు.

ఈ ఉదాహరణ యొక్క ముఖ్య ఉద్దేశం- మానవ జీవితం ఆమూల్యమైనది మరియు ఒకరి మరణం వల్ల కలిగే దుఃఖాన్ని మాటల్లో వర్ణించలేము. ఆర్థిక రక్షణ కలిగి ఉండటం ద్వారా కనీసం ఖర్చులకు సమగ్ర కవరేజీ అందిస్తుంది.

భారతదేశంలో ఉత్తమ ఇన్సూరెన్స్ పథకాలు

సీరియల్ నంబర్

కంపెనీ పేరు

టర్మ్ బీమా పథకాలు

ప్రవేశ వయసు

కనిష్ట బీమా మొత్తం

క్లెయిమ్ సెటిల్‌మెంట్ శాతం 2019- 20*

1

ఐసిఐసిఐ ప్రుడెన్షియల్

ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఐప్రొటెక్ట్ స్మార్ట్ లంప్ సమ్ టర్మ్ ప్లాన్

18-65

ప్రీమియం బట్టి

97.8%

2

మాక్స్ లైఫ్

మాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్

18-60

10/25 లక్షలు

99.22%

3

హెచ్ డి ఎఫ్ సి లైఫ్

హెచ్ డి ఎఫ్ సి క్లిక్ 2 ప్రొటెక్ట్ 3డి ప్లస్ టర్మ్ ప్లాన్

18.25-65

10,000

99.07%

4

ఎల్ఐసి

ఎల్ఐసి టెక్ టర్మ్

18-65

50 లక్షలు

లభ్యత లేదు

 

మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్

మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్

టర్మ్ పాలసీలోని రకాలేమిటి?

లెవల్ టర్మ్ పాలసీ

 ఇది చాలా సరళమైన పథకం. దీని కింద బీమా మొత్తంలో ఎటువంటి మార్పు లేదు మరియు బీమా చేసిన వ్యక్తి చనిపోయిన తరువాత నామినీ ప్రయోజనాలు పొందుతాడు. ఈ రకమైన పథకాలను అనేక బీమా సంస్థలు అందిస్తున్నాయి మరియు భారతదేశం అంతటా అందుబాటులో ఉన్నాయి.

ట్రాప్ (టర్మ్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం) పాలసీ

ట్రాప్ పాలసీ యొక్క ముఖ్యమైన అంశం, మెచ్యూరిటీ ప్రయోజనాలు. పాలసీ కాలపరిమితి ముగిసే సమయానికి, బీమా చేయించుకున్న వ్యక్తి జీవించి ఉన్నప్పుడు, ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

పెరుగుతూ ఉండే టర్మ్ పాలసీ

దీని కింద బీమా సంస్థ ముందే పేర్కొన్న నిర్దిష్ట శాతం ద్వారా ఏటా భరోసా మొత్తం పెరుగుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణ రేటును దృష్టిలో ఉంచుకుని ఈ పథకం ప్రారంభించబడింది.

తరుగుతూ ఉండే టర్మ్ పాలసీ

ఇది పునరుత్పాదకత టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. దీని కింద హామీ ఇచ్చిన మొత్తం ప్రతి సంవత్సరం ముందుగా పేర్కొన్న శాతం తగ్గుతుంది. రుణాన్ని తిరిగి పొందడానికి మరియు అన్ని అప్పులను తీర్చడానికి సాధారణంగా బ్యాంకులు ఈ పథకాన్ని జారీ చేస్తాయి.

కన్వర్టిబుల్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్

ఈ రకమైన ప్లాన్ ను మరోక రకమైన జీవిత బీమా పథకంగా(ప్రామాణిక నుంచి ఎండోమెంట్ లేదా మొత్తం జీవితానికి) మార్చవచ్చు. ఇది ద్వంద్వ ప్రయోజనాలను అందిస్తుంది.

టర్మ్ ప్లాన్ కింద ఏ రైడర్స్ అందుబాటులో ఉన్నాయి?

అదనపు ప్రీమియం చెల్లించేటప్పుడు మీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీతో యాడ్-అన్ పొందడానికి బీమా కంపెనీలు అవకాశాన్ని అందిస్తాయి. అటువంటి రైడర్స్ యొక్క సంక్షిప్త వివరణ కింద ఇవ్వబడింది..

క్రిటికల్ ఇల్నెస్ రైడర్


క్రిటికల్ ఇల్నెస్ రైడర్లు, అనేక ప్రాణాంతక వ్యాధులకు వర్తిస్తాయి. మీరు అలాంటి ఏదైనా అనారోగ్యానికి గురవుతారని అనుకుంటే, ఏ సమయంలో అయినా మీరు దీనిని తీసుకోవచ్చు. తీసుకునే ముందే, దాని కయ్యే అదనపు ఖర్చును కూడా మీరు చూసుకుని నిర్ణయించవచ్చు.

 క్రిటికల్ ఇల్నెస్ రైడర్ వలన ప్రయోజనాలు:

 • 100 కన్నా ఎక్కువ ప్రాణాంతక వ్యాధుల వర్తింపు
 • పూర్తి ఆసుపత్రి ఖర్చుల సహాయం

యాక్సిడెంటల్ డెత్ రైడర్


యాక్సిడెంటల్ డెత్ రైడర్, ఈ రైడర్ తీసుకుంటే యాక్సిడెంటల్ డెత్ కు కవరేజీ లభిస్తుంది. పాలసీదారు యొక్క నామినీకి రైడర్ ప్రయోజనంతో పాటు బీమా కంపెనీ హామీ మొత్తాన్ని అందిస్తుంది.

యాక్సిడెంటల్ డెత్ రైడర్ యొక్క ప్రయోజనాలు

 • అదనపు ఆర్థిక రక్షణను అందిస్తుంది.
 • కొన్ని బీమా పాలసీలు దీన్ని ఇన్ బిల్ట్ ఫీచర్ గా అందిస్తున్నాయి.

నగదు రహిత చికిత్స రైడర్


ఈ రైడర్ తో ఏదైనా అనారోగ్యం శస్త్రచికిత్స సమయంలో మీకు పూర్తి నగదు రహిత చికిత్స లభిస్తుంది.

 నగదు రహిత చికిత్స రైడర్ యొక్క ప్రయోజనాలు

 • నెట్ వర్క్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స
 • ఎక్కువ పెట్టుబడి లేకుండా గొప్ప ప్రయోజనాలు

ప్రీమియం మినహాయింపు రైడర్


ఈ రైడర్ ప్రకారం పాలసీదారు తీవ్ర అనారోగ్యంతో లేదా చనిపోయినట్లయితే భవిష్యత్ ప్రీమియంలు అన్ని మాఫీ చేయబడతాయి.

ప్రీమియం మినహాయింపు రైడర్ యొక్క ప్రయోజనాలు

 • ప్రీమియం చెల్లించాల్సిన ఆర్థిక భారం ఉండదు.
 • హామీ ఇచ్చిన మొత్తంపై ప్రభావం ఉండదు.

టర్మ్ ఇన్సూరెన్స్ ప్రధాన ఫీచర్లు & ప్రయోజనాలు ఏమిటి?

జీవిత కాల కవరేజీ

సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ 65 సంవత్సరాల వరకు కవరేజీని అందిస్తాయి. అయితే కొన్ని జీవిత బీమా కంపెనీలు 100 సంవత్సరాల వయసు వరకు కూడా కవరేజీ అందిస్తాయి. కాబట్టి మీరు చిన్న వయసులోనే టర్మ్ ప్లాన్ కొంటే, మీరు మరియు మీ కుటుంబం దాని ప్రయోజనాలు ఆస్వాదించవచ్చు.

పన్ను ఆదా

టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కలిగే అదనపు ప్రయోజనం పన్ను అదా. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినప్పుడు మీరు ఆదాయపు పన్ను చట్టం, 1961 కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందవచ్చు.

తక్కువ పెట్టుబడితో గరిష్ట లాభం

టర్మ్ ఇన్సూరెన్స్ తో నామమాత్రపు ఖర్చుతో మీరు గరిష్ట లాభాన్ని పొందవచ్చు. ఈ ఖర్చు అనేది నెలకు వందల్లో లేదా వేల వరకు ఉండవచ్చు. కానీ దీనితో పోలిస్తే హామీ మొత్తం లక్షలు మరియు కోట్లలో ఉంటుంది(పాలసీ ఎంపికల అనుకూలీకరణపై ఆధారపడి).

ఫ్రీ లుక్ పిరియడ్

కొన్ని సమయాల్లో మీకు పాలసీ గురించి కచ్చితంగా తెలియకపోచ్చు. మీరు ఇన్సూరెన్స్ తొందర్లో కొన్నప్పుడు ఇది జరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఐఆర్డీఏఐ ఫ్రీ లుక్ పిరియడ్ అనే విధానాన్ని ప్రవేశ పెట్టింది. దీని కింద అన్ని బీమా సంస్థలు మీ నిర్ణయాన్ని మార్చుకోవడానికి 15 రోజుల సమయాన్ని ఇస్తారు. మీరు మీ పాలసీ పట్ల అసంతృప్తిగా ఉంటే, పాలసీని రద్దు చేసుకోవచ్చు.

చెల్లింపు సౌలభ్యం

మీరు ఎల్లప్పుడూ మీ సౌలభ్యం ప్రకారం ప్రీమియం చెల్లింపు మోడ్ ను ఎంచుకోవచ్చు. మీరు నెలవారీ, త్రైమాసిక, అర్థ వార్షిక లేదా ఏటా చెల్లింపు చేయవచ్చు. చాలా మంది నామమాత్రపు ధరతో వచ్చినందున చాలా మంది నెలవారీ ప్రీమియం చెల్లించడానికి ఇష్టపడతారు. చెల్లింపులను ఆన్ లైన్ లో సులభంగా చేయవచ్చు. మీరు డెబిట్/ క్రెడిట్ కార్డు, ఎన్ఈఎఫ్ టి, నెట్ బ్యాంకింగ్, ఐఎంపిఎస్ లేదా వాలెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు.

కొనుగోలు సౌలభ్యం

 మీ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లను కొనుగోలు చేసే రెండు ఛానెల్ లు ఉన్నాయి- ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్. పాలసీని కొనుగోలు చేయడానికి మీరు ఎంచుకున్న ప్రొవైడర్ యొక్క బ్రాంచ్ ఆఫీసును మీరు భౌతికంగా సందర్శించవచ్చు లేదా మీరు చాలా అనుకూలమై ఆన్ లైన్ ఛానెల్- PolicyX.com ద్వారా కొనుగోలు చేయవచ్చు. 

మేము మీ అవసరాలకు అనుగుణంగా అనుకూలీకరించిన పోర్ట్ ఫోలియోను అందిస్తాము. మీ అన్ని ప్రశ్నలతో మీకు సహాయం చేయడానికి మాకు ప్రత్యేక బృందం ఉంది. డాక్యుమెంటేషన్ నుంచి మరే ఇతర సహాయం వరకు వారు మీకు సాధ్యమైనంత ఉత్తమంగా సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.

టర్మ్ ఇన్సూరెన్స్ : చెల్లింపు ఎంపికలు

టర్మ్ ఇన్సూరెన్స్ 4 చెల్లింపు ఎంపికలను అందిస్తుంది. వాటిని కింద వివరించడం జరిగింది..

 • పెద్ద మొత్తం చెల్లింపు
 • నెలవారీ ఆదాయం
 • పెద్ద మొత్తం+ నెలవారీ ఆదాయం
 • పెరుగుతున్న నెలవారీ ఆదాయం

పెద్ద మొత్తంలో చెల్లింపు

ఈ ఎంపిక కింద, హక్కుదారుడి కుటుంబం ఒకేసారి పెద్ద మొత్తాన్ని పొందుతుంది.

నెలవారీ ఆదాయం

ఈ ఎంపికతో హక్కుదారుడు హామీ ఇచ్చిన మొత్తాన్ని నెలలవారీగా పొందడం జరుగుతుంది.

పెద్ద మొత్తం+ నెలవారీ ఆదాయం

ఈ ఎంపిక కింద పాలసీదారుడు మరణించిన వెంటనే లబ్దిదారుడు 50%-70% భరోసా మొత్తాన్ని(ఒకే మొత్తంలో) అందుకుంటాడు మరియు మిగిలిన మొత్తాన్ని నెలవారీ వాయిదాల ద్వారా చెల్లించడం జరుగుతుంది.

పెరుగుతున్న నెలవారీ ఆదాయం

ఈ ఎంపిక కింద, నెల వారీ వాయిదాల పెరుగుదల రూపంలో లబ్ధిదారునికి మొత్తం హామీ లభిస్తుంది. వాయిదాలు ద్రవ్యోల్బణం ఆధారంగా చెల్లించబడతాయి. అలాగే వాయిదాల మొత్తం 10 %- 20 % వరకు పెరుగుతాయి.

టర్మ్ ఇన్సూరెన్స్ ఆన్ లైన్ లో ఎందుకు కొనుగోలు చేయాలి?

టర్మ్ ఇన్సూరెన్స్ ఆన్ లైన్ లో కొనడం వల్ల వినియోగదారుడు చాలా సమయం మరియు శక్తిని ఆదా చేయగలుగుతారు. ఇతర ముఖ్య ప్రయోజనాలు కింద ఇవ్వబడ్డాయి-

ఫాస్ట్ డెలివరీ- మీరు అవసరమైన వివరాలు నమోదు చేసి, చెల్లింపు చేసిన వెంటనే మీరు మెయిల్ ఇన్ బాక్స్ లో పాలసీ పత్రాలను పొందుతారు.

ఆన్ లైన్ లభ్యత- అవును, మీరు పత్రాలు కోసం బీమా సంస్థను కోరాల్సిన అవసరం లేదు. మరియు మీ పాలసీ పత్రాల నకలు కాపీ మీరు పొందడానికి రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. డిజిటలైజేషన్ ద్వారా మీరు మీ పాలసీ వివరాలు మరియు పాలసీ పత్రాలను ఒక బటన్ క్లిక్ తో యాక్సెస్ చేయవచ్చు.

ఉదాహరణకు మీరు PolicyX.com నుంచి టర్మ్ ప్లాన్ కొనట్లయితే, మీరు మీ ఖాతాలోకి లాగి అవ్వడం ద్వారా మీ వివరాలను తనిఖీ చేయవచ్చు.

ఆటోమేటిడ్ ఫలితాలు- పాలసీ వివరాలను పొందడానికి మీరు ఇంటర్నెట్ ను ఎక్కువ బ్రౌజ్ చేయాల్సిన అవసరం లేదు. అనేక పథకాలను, బీమా ప్రొవైడర్లను పోల్చడం నుండి ప్రీమియం లెక్కింపు వరకు ప్రతీది ఒకే వెబ్ పేజీలో జరుగుతుంది.

తక్కువ ప్రీమియం- మొత్తం ప్రక్రియలో మధ్యవర్తులు లేనందున ఆన్ లైన్ టర్మ్ ప్లాన్ ఖర్చు తక్కువగా ఉంటుంది. మధ్యవర్తులకు కార్యాలయ కమిషన్ ఖర్చు మరియు పంపిణీ మార్గాలు వంటి అనేక ఇతర ఓవర్ హెడ్ ఖర్చులు కూడా ఆదా చేయబడతాయి.

రిమైండర్- ప్రతి ఒక్కరికి మంచి జ్ఞాపకశక్తి ఉండదు. అందువల్ల మేము ఆన్-బోర్డ్ లో రిమైండర్ వ్యవస్థను అందిస్తాం. మీరు PolicyX.com వినియోగదారుడు అయితే, పాలసీ రద్దును నివారించడానికి మీ టర్మ్ పాలసీని పునరుద్ధరించడానికి మీకు సాధారణ రిమైండర్ లు లభిస్తాయి.

భారత ప్రభుత్వం అందిస్తున్న టర్మ్ ఇన్సూరెన్స్ పథకాలు

భారత ప్రభుత్వం కొన్ని టర్మ్ ఇన్సూరెన్స్ పథకాలను అందిస్తుంది. ఈ పథకాల ద్వారా పాలసీదారులు తమపై ఆధారపడిన వారిని ఆర్థికంగా కాపాడవచ్చు. వీటి గురించి తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన


ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన జీవిత బీమా పాలసీ, ఈ పథకాన్ని పాలసీదారులు

వార్షికంగా పునరుద్దరించుకోవచ్చు.

ముఖ్యమైన ఫీచర్లు

 • ఈ పాలసీ రూ. 2 లక్షల వరకు జీవిత కవరేజీని అందిస్తుంది.
 • ఈ పథకం కోసం వసూలు చేసే ప్రీమియం సంవత్సరానికి రూ. 330
 • 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులు ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. 
 • ఈ పథకాలకు పన్ను చట్టాల కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు వర్తిస్తాయి.

ఆమ్ ఆద్మీ బీమా యోజన


రెండు సాంఘిక భద్రతా పథకాల విలీనంగా ఆమ్ ఆద్మీ బీమా యోజన ఏర్పడింది. ఈ రెండు పథకాలు జనశ్రీ బీమా యోజన మరియు ఆమ్ ఆద్మీ బీమా యోజన.

ముఖ్యమైన ఫీచర్లు

 • ఈ పథకం యొక్క సభ్యత్వం పొందడానికి, సభ్యుల వయసు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉండాలి.
 • ఈ పథకం కింద వసూలు చేయబడే ప్రారంభ ప్రీమియం రూ. 200, అందులో 50 శాతం ప్రీమియం మొత్తంలో సామాజిక భద్రతా నిధి నుండి సబ్సిడీ ఇవ్వబడుతుంది.
 • ఈ పథకం ప్రమాదవశాత్తు మరణం, వైకల్యం ప్రయోజనాలను మరియు స్కాలర్ షిప్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి?

టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై కొన్ని అంశాలు ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. వీటి జాబితా కింద ఉంది, వాటిని తనిఖీ చేద్దాం..

వయసు- టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాథమిక ఆలోచన ఏమిటంటే ప్రీమియం మొత్తానికి బదులుగా హక్కుదారునికి ఆర్థిక కవరేజీ అందించడం. ఇది పాలసీదారుని వయసుతో నేరుగా ముడిపడి ఉంటుంది. అంటే మీరు టర్మ్ ప్లాన్ ఎంచుకున్న తర్వాత వయసుపై ఆధారపడి ప్రీమియం నిర్ణయించబడుతుంది. ఉదాహరణ సహాయంతో దీనిని అర్థం చేసుకుందాం…

మయాంక్(30 సంవత్సరాలు) రూ. 1కోటి(65 సంవత్సరాల వయసు వరకు) కవరేజీ కలిగిన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారు అనుకుందాం. 

వయసు

మెచ్యూరిటీ వయసు

పాలసీ కాల వ్యవధి

వార్షిక ప్రీమియం

30 సంవత్సరాలు

65 సంవత్సరాలు

35 సంవత్సరాలు

9,363

35 సంవత్సరాలు

70 సంవత్సరాలు

35 సంవత్సరాలు

13,139

40 సంవత్సరాలు

75 సంవత్సరాలు

35 సంవత్సరాలు

19,056

*ఈ ప్రీమియం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ద్వారా అందించబడింది.

పై పట్టిక ప్రకారం మయాంక్ 30 సంవత్సరాల వయసులో టర్మ్ ప్లాన్ కొనాలని భావించడం సురక్షితం, ఎందుకంటే అతను తక్కువ ప్రీమియంను పొందవలసి ఉంటుంది. అతను 35/ 40 సంవత్సరాల వయసులో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను కొనుగోలు చేస్తే అదనపు ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

 • ఆరోగ్య చరిత్ర- పాలసీదారునికి తీవ్రమైన అనారోగ్యం యొక్క కుటుంబ చరిత్ర ఉంటే అప్పుడు బీమా సంస్థ అధిక ప్రీమియం మొత్తాన్ని వసూలు చేస్తుంది.
 • వృత్తి- మీ ప్రీమియం మొత్తాన్ని నిర్ణయించే ముఖ్యమైన కారకాల్లో మీ పని ప్రొఫైల్ కూడా ఒకటి. ఉదాహరణకు అధిక రిస్క్ వర్క్ ప్రొఫైల్( మైనింగ్) లో పాలసీదారు పనిచేస్తున్నట్లయితే, గాయాలకు, అనారోగ్యాలకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి పాలసీకి బీమా సంస్థ అధిక ప్రీమియాన్ని వసూలు చేస్తుంది.
 • జీవన శైలి- మీ జీవన శైలి బీమా ప్రీమియాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు మీరు ధూమపానం, మద్యం తాగేవారు అయితే అధిక ప్రీమియం చెల్లించాలి.

మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విధానం

మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విధానం

PolicyX.com నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఎలా కొనుగోలు చేయాలి?

PolicyX.com నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయడం సులువైన ప్రక్రియ.ఈ కింది దశలను అనుసరించండి.

 • ఈ పేజీ యొక్క కుడి ఎగుల భాగాన స్క్రోల్ అప్ చేయండి మరియు ఆన్లైన్ లో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ సరిపోల్చండి ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • అవసరమైన వివరాలు ఎంటర్ చేసి కొనసాగండి పై క్లిక్ చేయండి.
 • మీ ఆదాయాన్ని, ఊరు పేరు వివరాలను అందించి కొనసాగండి ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • మీ విద్యార్హతలు మరియు వృత్తి వివరాలను సమర్పించండి.
 • వివిధ బీమా సంస్థలు అందించే పథకాలు మీ ముందుకు, వీటిలో మీ అవసరాలకు అనుగుణంగా ఉత్తమ పథకాన్ని ఎంపిక చేసుకోండి. కొనసాగండి ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 • చెల్లింపు చేయండి. మీ రిజిస్ట్రర్డ్ మెయిల్ ఐడీ పాలసీ పత్రాలు పంపబడతాయి.

టర్మ్ ఇన్సూరెన్స్ పథకాన్ని కొనుగోలు చేయడానికి ఏ పత్రాలు అవసరం?

 1. గత 3 నెలల జీతం స్లిప్స్ లేదా గత 3 సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్స్.
 2. ఫారం 16(ఉద్యోగస్థులకు) మరియు ఫారం 16ఎ (స్వయం ఉపాధి లేదా ఫ్రీలాన్సర్లకు).
 3. ఒక పాస్ పోర్ట్ సైజు ఫోటో
 4. ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన గుర్తింపు రుజువులు
 5. సంస్థ కోరిన ఇతర పత్రాలు.

మీరు ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీ కలిగి ఉండాలి?

టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలని మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత, మీ మనస్సులో మెదిలే ప్రశ్న- ఎంత కవరేజీ సరిపోతుంది? నిపుణులు సలహా ప్రకారం టర్మ్ ఇన్సూరెన్స్ మీ వార్షిక ఆదాయానికి 15- 20 రెట్లు ఉండాలి. ఉదాహరణకు మీ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు అయితే, మీ కనీస కవరేజీ ఎంపిక రూ. 75 లక్షలు నుంచి రూ. 1 కోటి మధ్య ఉండాలి.

 టర్మ్ ఇన్సూరెన్స్ పథకం కింద విజయవంతమైన క్లెయిమ్ ఎలా దాఖలు చేయాలి?

పాలసీదారుని మరణం విషయంలో, నామినీ బీమా సంస్థకు తెలియజేయాలి మరియు అవసరమైన పత్రాలను సమర్పించాలి. సందర్భాన్ని బట్టి అవసరమైన పత్రాలు కూడా మారతాయి. వాటి గురించి కింద వివరించడం జరిగింది.

కేస్ 1: సహజ మరణం

 • ఒరిజినల్ మరణ ధృవీకరణ పత్రం
 • బీమా సంస్థ జారీ చేసిన క్లెయిమ్ దరఖాస్తు ఫారం
 • నామినీ పూర్తి చేసిన క్లెయిమ్ దరఖాస్తు
 • బీమా సంస్థ కోరిన ఇతర అవసరమైన పత్రాలు

కేస్ 2: ప్రమాదవశాత్తు మరణం

 • ప్రమాదం యొక్క పోస్ట్ మార్టరం నివేదిక
 • ఎఫ్ఐఆర్ కాపీ
 • ఒరిజినల్ పాలసీ పత్రాలు
 • బీమా సంస్థ మంజూరు చేసిన క్లెయిమ్ ఫారం
 • హాజరైన డాక్టర్ స్టేట్‌మెంట్ లేదా మెడికల్ అటెండెన్స్ సర్టిఫికేట్
 • సంస్థ కోరిన ఇతర పాలసీ పత్రాలు

కేస్3: అనారోగ్య కారణంగా మరణం

 • ఆసుపత్రి డిశ్చార్జి సమ్మరీ
 • వైద్య నివేదికలు
 • బీమా సంస్థ జారీ చేసిన క్లెయిమ్ దరఖాస్తు
 • నామినీ దరఖాస్తు
 • బీమా సంస్థకు అవసరమైన ఇతర పత్రాలు

కేసు 4- బీమాతో పాటు నామినీ కూడా మరణిస్తే

ఇటువంటి సందర్భాల్లో, హక్కుదారు యొక్క చట్టపరమైన వారసుడు, లబ్దిదారుడు అవుతాడు. చట్టబద్ధమైన వారసుడు 18 ఏళ్లు నిండిన తర్వాతే ప్రయోజనాలు పొందగలడు. కాని ఆమె/ అతను సంరక్షకుడు వెంటనే బీమా సంస్థకు తెలియజేయాలి. వయసు ప్రమాణాలు పూర్తిగా బీమా సంస్థ లేదా ఐఆర్డీఏఐ నిబంధనలపై ఆధారపడి ఉండవచ్చు.

కేసు 5- పాలసీదారునికి కంటే ముందు నామినీ మరణించినప్పుడు

ఇతర లబ్ధిదారులను నామినేట్ చేయడం పాలసీదారుని బాధ్యత. ఇది ఆన్ లైన్ లో లేదా కస్టమర్ కేర్ కు తెలియజేయడం ద్వారా చేయవచ్చు.

గమనిక- బీమా ప్రొవైడర్ క్లెయిమ్ అంగీకరించిన తర్వాత అది చెల్లింపును విడుదల చేస్తుంది. క్లెయిమ్ తిరస్కరించబడితే దానికి గల కారణాలు హక్కుదారుకు తెలియజేయబడతాయి.

కరోనా వైరస్ కారణంగా సంభవించే మరణాలకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజీ అందిస్తుందా?

కొన్ని జీవిత బీమా పాలసీలు మరణానికి ఒక నిర్దిష్ట కారణం కోసం మినహాయింపులు కలిగి ఉండగా, కరోనా వైరస్ ఇప్పటికే ఉన్న కొత్త జీవిత బీమా పాలసీలన్నింటిలో ఉంటుంది. ఏదేమైనా జీవిత బీమా యొక్క మార్గదర్శకాలపై శ్రద్ధ వహించడం మంచిది, బీమా సంస్థ క్లెయిమ్ ఆమోదించినట్లయితే దీని ప్రయోజనం చెల్లించబడుతుంది.

మీరు ప్రస్తుతం టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలా?

కొవిడ్-19 సమయంలో టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క కొత్త అనువర్తనాల కోసం బీమా సంస్థలు వైద్య చరిత్ర మరియు వినియోగదారుల ఆరోగ్యం ఆధారంగా పాలసీ ప్రీమియాన్ని లెక్కిస్తాయి. అందువల్ల, కొవిడ్-19 బీమా ప్రీమియంపై మరియు పాలసీ యొక్క ఆమోదం విషయంలో ప్రభావం చూపే అవకాశం ఉంది.

వినియోగదారుడు కొవిడ్-19 గురైతే, సంస్థ పాలసీని తిరస్కరించే లేదా నిలుపుదల చేసే అవకాశం ఉంది. వినియోగదారుడు కొవిడ్-19 కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సంస్థతో పంచుకోవాల్సి ఉంటుంది. క్లెయిమ్ సమయంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

కరోనా వైరస్- టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ను ఎలా దాఖలు చేయాలి?

 • పాలసీదారుని మరణం గురించి బీమా సంస్థకు తెలియజేయాలి.
 • మీరు సంస్థ యొక్క అధికారిక వెబ్ సైట్ లేదా సంస్థ సమీప శాఖ నుంచి క్లెయిమ్ ఫారం పొందవచ్చు.
 •  ఆసుపత్రి నుంచి అన్ని అవసరమైన పత్రాలు సేకరించండి(ఆసుపత్రిలో మరణం సంభవించినట్లయితే)
 • మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి మరణ ధృవీకరణ పత్రాన్ని సేకరించండి.
 •  నామినీ యొక్క క్లెయిమ్ ఫారం, పాలసీదారుని మరణ ధృవీకరణ పత్రం, ఆసుపత్రి పత్రాలు మరియు ఇతర కేవైసీ పత్రాలు సమర్పించండి
 • బ్యాంకు వివరాలు సమర్పించండి.
 • నామినీ అన్ని పత్రాలు సమర్పించిన తర్వాత, సంస్థ పత్రాలను విశ్లేషిస్తుంది అదే విధంగా ప్రాసెస్ చేస్తుంది.
 • క్లెయిమ్ దరఖాస్తు ఆమోదం పొందగానే నామినీ బ్యాంకు ఖాతాలో క్లెయిమ్ మొత్తం చెల్లించబడుతుంది.
 • తిరస్కరణ విషయంలో సంస్థ సందేశం లేదా కాల్, లేఖ ద్వారా తెలియజేస్తుంది.

గమనిక: దావా ప్రక్రియ బీమా సంస్థ నుంచి బీమా సంస్థకు మారుతూ ఉంటుంది. అనేక కంపెనీలు వాట్సాప్ ద్వారా కూడా క్లెయిమ్ ప్రారంభించాయి.ఈ విషయం గురించి మీరు బీమా సంస్థ యొక్క వెబ్ సైటులో తనిఖీ చేయవచ్చు.

కరోనా వైరస్ కారణంగా సంభవించిన మరణానికి సంబంధించి టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అవసరమైన పత్రాలు ఏమిటి?

 • వైద్యుని స్టేట్ మెంట్, పరీక్షల నివేదికలు, అడ్మిషన్ పత్రం మొదలైనవి.
 • బ్యాంకు ఖాతా వివరాలు
 • ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్స్
 • క్లెయిమ్ ఫారం మరియు ఐడీ నిర్థారణ
 • ఒరిజినల్ పాలసీ పత్రాలు
 • సంస్థ కోరిన ఇతర పత్రాలు

టర్మ్ ఇన్సూరెన్స్ కింద కవరేజీ అవ్వని అంశాలు ఏమిటి?

మార్కెట్ లో ప్రతి వస్తువు మాదిరి గానే, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మినహాయింపులతో వస్తుంది. దీనిని గురించి తెలుసుకుందాం. ఈ కింది కారణాల వల్ల మరణానికి కవరేజీ అందించబడదు.

 • డ్రగ్స్ లేదా మద్యం సేవించడం ద్వారా కలిగే మరణం.
 • ముందుగా ఉన్న వ్యాధులకు
 • గర్భం లేదా ప్రసవం సమయంలో ఎదురయ్యే సమస్యలకు
 • చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నప్పుడు కలిగే గాయాలు లేదా మరణానికి
 • ఆత్మహత్య(పాలసీ జారీ చేసిన 1 సంవత్సరం లోపు)
 • యుద్ధం లేదా ప్రమాదకరమైన పనుల్లో పాల్గొనడం వల్ల కలిగే నష్టాలకు కవరేజీ లభించదు.