యూలిప్ ప్లాన్
  • బీమా మొత్తాన్ని 100% వరకు పెంచుకోండి
  • మెచ్యూరిటీ పై పన్ను మినహాయింపు ప్రయోజనాలు
  • అదనపు రక్షణ కోసం రైడర్స్
PX step

అగ్ర శ్రేణి సంస్థల నుంచి ఉచిత కోట్స్

1

2

పుట్టిన తేదీ
ఆదాయం
| లింగ

1

2

ఫోన్ నం.
పేరు
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది పెట్టుబడి మరియు బీమా కవర్ యొక్క పూర్తి ప్యాకేజీ. ఇది సంపద వృద్ధి చేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తుంది. సాధారణంగా యూలిప్స్ పారదర్శకంగా మరియు సరళంగా ఉంటాయి. అది ఒక వ్యక్తి తన అవసరాలకు అనుగుణంగా పథకంలో మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇది మీకు బీమా కవరేజీని అందిస్తుంది మరియు మీ ప్రీమియంలో కొంత భాగాన్ని స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మరెన్నో అర్హత కలిగిన పెట్టుబడి ఎంపికలలో పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

చరిత్ర- వీటిని మొట్టమొదట 1971 సంవత్సరంలో యానిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది. భారత బీమా రంగంలో ఈ పథకాల ప్రాముఖ్యతను గుర్తించింది. అటు తర్వాత నెమ్మదిగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, బజాజ్ లైఫ్& హెడ్ డిఎఫ్ సి వంటి ప్రధాన బీమా సంస్ఖలు భారత వినియోగదారుల కోసం యూలిప్ పథకాలను ప్రవేశపెట్టారు.

ప్రస్తుతం దాదాపు అన్ని బీమా సంస్థలు యూలిప్ పథకాలను అందిస్తున్నాయి.అలాగే వినియోగదారుల అవసరాల మేరకు కొత్త కొత్త ఫీచర్లతో యాలిప్ పథకాలను అందిస్తున్నాయి. మీరు యూలిప్ పథకాలను కొనుగోలు చేసే ముందు, వీటిపై వివరణాత్మక అవగాహన పొందడం మంచిది.

భారతదేశంలో యూలిప్ పథకాల రకాలు

జీవిత బీమా సంస్థలు వివిధ రకాల యూలిప్స్ పథకాలను అందిస్తున్నాయి. ప్రతి ఒక్కరి అవసరాన్ని తీర్చే విధంగా ఈ పథకాలను మూడు వర్గాలుగా విభజించారు. అవి ఈ క్రింది వివరించడం జరిగింది..

1. ప్రయోజనాల ఆధారంగా వర్గీకరణ


పదవీ విరమణ కోసం యూలిప్

ఈ పథకం కింద మీర నిర్దిష్ట మొత్తాన్ని మీరు పనిచేసే సంస్థకు చెల్లింపు జరుపుతారు, ఇది అటు తర్వాత కార్పస్ ఫండ్ గా ఏర్పడుతుంది. మీ పదవీ విరమణ అనంతరం యాన్యుటీ రూపంలో మీరు ఈ మొత్తాన్ని పొందుతారు.

యూలిప్ సంపద సృష్టి

ఇది నిర్దిష్ట కాలానికి మీ సంపదను కూడబెడుతుంది. 20-30 సంవత్సరాల మధ్య వయస్సున వారికి ఈ బీమా పథకం చక్కగ సరిపోతుంది. ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా, మీ ఆర్థిక లక్ష్యాలకు నిధులు సమకూర్చుకునే సౌలభ్యాన్ని పొందుతారు.

పిల్లల విద్య కోసం యూలిప్ 

తల్లిదండ్రులగా మీ పిల్లల భవష్యత్తును మరియు వారి కేరీర్ ను అనుకోని సంఘటనలు నుంచి రక్షించాల్సిన బాధ్యత మీదే. మీ పిల్లల కోసం వారి జీవితంలోని వివిధ దశలలో సహాయపడే యూలిప్ ను ఎంచుకోండి.

ఆరోగ్య ప్రయోజనాల కోసం యూలిప్

అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో ఈ యూలిప్స్ పథకాలు ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి.

2. డెత్ బెనిఫిట్ ద్వారా వర్గీకరణ


టైప్ 1 యూలిప్ ప్లాన్స్ 

ఒక దురదృష్టకర సంఘటన కారణంగా పాలసీదారుడు మరణిస్తే నామీని ఫండ్ విలువను/ హామీ ఇవ్వబడిన మొత్తాన్ని అందుకుంటాడు. పాలసీ ప్రారంభంలో పాలసీదారుడు మరణింటినట్లయితే(మొత్తం హామీ> ఫండ్ విలువ) బీమా సంస్థ ఆ మొత్తాన్న నామినీకి చెల్లిస్తారు.

టైప్ 2 యూలిప్ పథకాలు

ఈ పథకాలలో పాలసీదారుడు దుదదృష్టకర సంఘటనల్లో మరణానికి గురైతే నామినీకి డెత్ బెనిఫిట్ గా మొత్తం హామీ మరియు ఫండ్ విలువ రెండూ లభిస్తాయి.

3. ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి యూలిప్ పథకాలు


క్యాష్ ఫండ్స్

ఇవి సురక్షిత నిధుల వర్గంలోకి వస్తాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీపై మీరు ఎంచుకున్న మొత్తాన్ని పొందుతారు.

ఈక్వీటీ ఫండ్స్

ఈక్విటీ ఫండ్ రిస్కియెస్ట్ యూలిప్ పెట్టుబడి జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. అదేవిధంగా అత్యధిక రాబడిని కూడా అందిస్తుంది. కంపెనీ స్టాక్& ఈక్వీటీలు దాని పెట్టుబడి డొమైన్.

స్థిరవడ్డీ & బాండ్ ఫండ్లు

ఇటువంటి నిధులు సకాలంలో రాబడిని అందిస్తాయి మరియు ఇవి మీడియం రిస్క్ ను కలిగి ఉంటాయి. మీడియం రిస్క్ ను ఎంచుకునే వ్యక్తులను ఇవి సరిగ్గా సరిపోతాయి. వీరు ప్రాంప్ట్ రివార్డులతో ఎన్నుకోవచ్చు. మరో మాటలో చెప్పాలంటే ఈ నిధులు అసురక్షిత మరియు సురక్షితమైన పెట్టుబడుల సంపూర్ణ కలయుక.

యూలిప్ పథకాల యొక్క ప్రయోజనాలు

పారదర్శకత

యూలిప్ పథకాల్లో పెట్టుబడులకు సంబంధించి ఒక మంచి విషయం దీని పారదర్శకత. మీరు ఎలాంటి ఇబ్బందుల లేకుండా వేర్వేరు ఫండ్లలో మీ పెట్టుబడుల గురించి సకాలంలో నవీకరణలను పొందుతారు.

పన్ను ప్రయోజనాలు

ఆదాయపు పన్ను చట్టం 1961, క్రింద మీరు పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను పొందుతారు. రాబడిపై కూడా పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉంటాయి.

క్రమబద్ధమైన పెట్టుబడి ఎంపిక

బీమా కవరేజీతో పాటు, క్రమబద్ధమైన పెట్టు పథకం కూడా మంచిది. ఇది మీ పెట్టుబడిని ఎన్నుకోవడానికి మరియు ప్రతిఫలంగా మంచి ప్రయోజనాలు పొందడానికి మిమల్ని అనుమతిస్తుంది.

మార్కెట్ లింక్డ్ రిటర్న్స్

మార్కెట్ లింక్డ్ ఫండ్స్ ప్రీమియంలో భాగంగా మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ సంపాదించడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. దీని కింద మీరు వివిధ రకాల మార్కెట్ లింక్డ్ ఫండ్స్ లలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఫ్లెక్సిబిలిటి

ఇది మీ రిస్క్ ప్రొఫైల్ ప్రకారం మీ పెట్టుబడి ఎంచుకోవడానికి పూర్తి స్వేచ్ఛను అందిస్తుంది. అలాగే మీరు యూలిప్ ప్లాన్ యొక్క గొడుగు కింద అందించే అనేక ఫండ్ ఎంపికల మధ్య మార్పులు చేసుకోవచ్చు.

పాక్షిక ఉపసంహరణలు

5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని ముగిసిన తరువాత, అత్యవసర పరిస్థితుల్లో మీరు పాక్షికంగా కొంత డబ్బును ఉపసంహరించుకోవచ్చు.

ఎలా పని చేస్తుంది?

మీ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం మీరు చెల్లించే ప్రీమియం సంపదను నిర్మించడానికి ఉపయోగించబడుతుంది మరియు బీమా కవరేజీని అందిస్తుంది. పథకం ప్రారంభ సంవత్సరాల్లో, ప్రీమియం యొక్క మొత్తాన్ని పథకం ఖర్చుల కోసం ఉపయోగిస్తారు. తరువాత ప్రీమియంను రెండు భాగాలుగా విభజించబడుతుంది- పెట్టుబడి మరియు బీమా. 

మీకు నచ్చిన ఫండ్ లో పెట్టుబడిన తర్వాత, ఆ మొత్తానికి యూనిట్లు జారీ చేయబడతాయి. ఇది డెబిట్, ఈక్వీటీ లేదా రెండింటి కలయికగా కావచ్చు. యూనిట్ల కేటాయింపు అసలు ఫండ్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ప్రారంభంలో 2 నుంచి 3 ప్రణాళిక సంవత్సరాల్లో , అధిక ఖర్చులను తగ్గించడం వలన, ఫండ్ విలువ తక్కువగా ఉంటుంది.

అంతేకాకుండా మెర్టాలిటి ఛార్జీలు కూడా నెలవారీ డిడక్ట్ అవుతాయి. ఇది ఒక వ్యక్తికి లైఫ్ కవర్ అందించడానికి హామీ ఇవ్వబడిన మొత్తం మరియు మీరు ఎంచుకున్న ఫండ్ విలువగా మారుతుంది. ఈ నిధుల నిర్వహణ కోసం, ఫండ్ మేనేజ్ మెంట్ ఛార్జీలు వసూలు చేస్తారు.

భారతదేశంలో ఉత్తమ యూలిప్ పథకాలు- 2020

మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలనుకుంటే మార్కెట్ లో మార్కెట్లో పోటీదారులను శాసించే పథకంలో పెట్టుబడి పెట్టాలి. దీని అర్థం, మీరు ప్రణాళిక యొక్క నిర్ణయాత్మక కారకాలపై (మొత్తం హామీ, ప్రీమియం మొత్తం మొదలైనవి) నిశితంగా గమనించాలి. మీరు సులభంగా ఉత్తమ ప్లాన్ ఎంచుకునేలా భారతదేశంలో 2020 వ సంవత్సరంలో 7 అగ్ర యూలిప్ పథకాల జాబితాను ఇవ్వడం జరిగింది. 

యూలిప్ పథకాలు

ప్రవేశ వయసు

కనిష్ట ప్రీమియం

ప్రీమియం కేటాయింపు ఛార్జ్

ఉచిత స్విచ్

బజాజ్ అలియాన్జ్ ఫ్యూచర్ గెయిన్

1-60 సంవత్సరాలు

రూ. 25000 పి.ఎ

0-25 శాతం

అపరమితం

హెచ్ డి ఎఫ్ సి 2 వెల్త్

30- 60 రోజులు

రూ. 3000(త్రైమాసికం)& రూ. 24000(సింగిల్ పే)

నిల్

అపరిమితం

పిఎన్ బి మెట్ లైఫ్ స్మార్ట్ ప్లాటినం

7-70 సంవత్సరాలు

రూ. 30000- 60000

1-5 సంవత్సరాలు- 6%, 6-10 సంవత్సరాలు- 2.5 శాతం, 11 సంవత్సరాలు తర్వాత- నిల్

4

ఎస్బీఐ లైఫ్ వెల్త్ అస్యూరెన్స్

8- 60 సంవత్సరాలు 

రూ. 50000

సింగిల్ ప్రీమియం యొక్క 3 శాతం

2

ఐసిఐసిఐ ప్రు వెల్త్ బిల్డర్ II

0-69 సంవత్సరాలు 

రూ. 2400- 48000 

3 శాతం

లేదు

హెచ్ డిఎఫ్ సి లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్

14-65 సంవత్సరాలు

రూ. 2500- 24000

2 శాతం

అపరిమితం

ఎల్ఐస్ మార్కెట్ ప్లస్-1 గ్రోత్ ఫండ్

18- 65 సంవత్సరాలు 

రూ. 5000- 30000 3.3 శాతం

3.3 శాతం

4

యూలిప్ పథకాలను తీసుకోవడానికి ముందు ఏ అంశాలను పరగణలోనికి తీసుకోవాలి

ఇతర పెట్టుబడుల మాదిరిగానే యూలిప్ ప్రణాళికకు శ్రద్ధ అవసరం మరియు మీరు సంపాదించిన సొమ్ములో కొంత భాగం ప్రీమియంలకు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి పథకం తీసుకున్న తర్వాత మరలా వెనక్కి చూడటం సరికాదు. పథకం తీసుకునే ముందే సరైన పథకం ఎంచుకోవడం అత్యవసరం. ఇందుకోసం మీరు కింద పేర్కొన్న కొన్ని అంశాలను పరిశీలించిన తర్వాత పాలసీని ఎంపిక చేసుకోవచ్చు.

  • పాలసీ యొక్క ప్రవేశం/ నిష్కమ్రణ పై విధించే ఇన్ని ఛార్జీలు
  • గడిచిన 3-4 సంవత్సరాల్లో పథకం పనితీరు పరిశీలించండి. దీని వల్ల మీకు పథకంలోని లోటు, పాట్లు అర్థం అవుతాయి.
  • యూలిప్ ఎలా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి విషయాన్ని మీరు పరిశీలించాలి.
  • వ్యయనిర్మాణం, ప్రీమియం, చెల్లింపులు మొదలైన వాటి ఆధారంగా మార్కెట్ లోని ప్రతి పథకాన్ని అంచనా వేయండి మరియు సరిపోల్చండి.

యూలిప్ vs సాంప్రదాయ పథకాలు vs మ్యూచువల్ ఫండ్స్

కారకాలు

యూలిప్స్ 

సాంప్రదాయ ప్లాన్స్

మ్యూచువల్ ఫండ్స్

టైప్

బీమా మరియు పెట్టుబడి పథకం

బీమా పథకం

పెట్టుబడి పథకం

పెట్టుబడి

పెట్టుబడిదారుని నిర్ణయం మేరకు డబ్బులు హైబ్రిడ్, డెబిట్ మరియు ఈక్విటీ ఫండ్లలలో పెట్టుబడి పెట్టబడతాయి 

పెట్టుబడిదారుని నిర్ణయం ప్రకారం డబ్బు డెబిట్ లేదా ఈక్వీటీ ఫండ్లలలో పెట్టుబడి పెట్టబడుతుంది

పెట్టుబడిదారుని నిర్ణయం మేరకు డబ్బు డెబిట్, ఈక్వీటీ మరియు మార్కెట్ లో పెట్టుబడి పెట్టబడుతుంది

రిస్క్ 

మధ్యస్థం

తక్కువ 

ఎక్కువ

లిక్విడిటీ

5 సంవత్సరాల ఫ్రీ లాక్ పిరియడ్ లో తరువాత 

మెచ్యూరిటీ వరకు

ఫ్రీ లాక్ పిరియడ్ లేదు

యూలిప్ ప్లాన్ కు ఏ రకమైన ఛార్జీలు ఉన్నాయి?

దురదృష్టవ శాత్తు , యూలిప్ పథకాల్లో కొన్ని ఛార్జీలు ఉన్నాయి. భవిష్యత్తులో మీరు ఎటువంటి గందరగోళానికి గురికాకుండా వాటిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మీ రిఫరెన్స్ కోసం 5 టాప్ ఛార్జీల గురించి కింద వివరించడం జరిగింది..

సరెండర్ ఛార్జీలు: యూలిప్ పథకం పత్రాలు పొందినప్పుడు పాక్షిక్షంగా లేదా పూర్తిగా ఈ ఛార్జీలు వసూలు చేయబడతాయి.

ప్రీమియం ఛార్జీలు: యూలిప్ పథకం యొక్క ప్రయోజనాలు పొందడానికి మీరు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు మీ పేమెంట్ సైకిల్ పై ఆధారపడి ఉంటాయి.(నెలవారీ, త్రైమాసిక, అర్థవార్షిక, వార్షిక)

అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు: జీవిత బీమా పాలసీ నిర్వహించడానికి బీమా సంస్థ చెల్లించే ఖర్చులను భర్తీ చేయడానికి ఈ ఛార్జీలు క్రమబద్ధంగా విధించబడతాయి.

ఫండ్ మార్పిడి ఛార్జీలు: ప్రతి యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ వేర్వేరు ఫండ్ ఎంపికలను కలిగి ఉంటుంది. బీమా సంస్థ పెట్టుబడిదారు ఫండ్ మారాలనుకుంటే కొత్త మొత్తం ఛార్జీలు వసూలు చేస్తుంది.

పాక్షిక ఉపసంహరణ ఛార్జీలు: లాక్ -ఇన్ వ్యవథి ముగిసిన తర్వాత, పెట్టుబడిదారులు వారి అవసరాల మేరకు కొద్ది మొత్తంలో పాక్షికంగా డబ్బు వెనక్కి తీసుకోవడానికి బీమా సంస్థ అనుమతిస్తుంది. అయితే దీని కోసం ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.

యూలిప్ ప్లాన్ కొనడానికి ఏ పత్రాలు అవసరం?

ప్రాథమిక పత్రాలతో యూలిప్ పథకాన్ని కొనుగోలు చేయవచ్చు. ప్లాన్ కొనుగోలు చేయడానికి అవసరమైన పత్రాల జాబితా ఈ క్రింది పేర్కొనడం జరిగింది.

వయసు రుజువు:  డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, ఓటర్ గుర్తింపు కార్డు మొదలైనవి.

చిరునామా రుజువు: డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు , పాస్ పోర్ట్, ఓటర్ గుర్తింపు కార్డు మొదలైనవి.

ఆదాయ రుజువు: బ్యాంక్ స్టేట్ మెంట్, శాలరీ స్లిప్ మొదలైనవి.

ఐడి ప్రూఫ్: ఓటర్ గుర్తింపు కార్డు, పాన్ కార్డు మొదలైనవి.

యూలిప్ పథకం కొనుగోలు చేయడంలో policyx.com మీకు ఎలా సహాయపడుతుంది?

మీ అవసరాలకు తగిన విధంగా సరైన యూలిప్ ప్లాన్ ఎంచుకోవడమనేది అంత సులభమైన విషయం కాదు, దీనికోసం లోతైన పరిశోధన, బడ్జెట్ ప్రణాళికలు మరియు ఏజెంట్లతో చర్చలు జరపాల్సి ఉంటుంది. ఇది మీకు తలనొప్పి తెప్పిస్తుంది. ఈ విషయంలో మీకు సరైన పథకాన్ని స్నేహ పూర్వక సలహా అత్యవసరం. policyx.com దీనికోసం ఎల్లప్పడూ సిద్ధంగా ఉంటుంది. మా యూలిప్ క్యాలిక్యులేటర్ సహాయంతో, ప్రీమియంలు మరియు రాబడి తదితర విషయాలతో వివిధ

బీమా సంస్థలు అందిస్తున్న పథకాలను ఛార్టు రూపంలో పొందవచ్చు. ఈ జాబితాలో మీకు నచ్చిన పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు. మీకు దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే, మా నిపుణులు బృందం వాటిని నిమిషాల వ్యవధిలో తీరుస్తుంది. మీ పెట్టుబడులు పెంచడానికి మా వంతు సహాయం అందిస్తాం.