నేషనల్ ఇన్సూరెన్స్ సంస్థ
 • చౌకైన కారు బీమా కొనండి
 • కారు భీమాను ఆన్‌లైన్‌లో పునరుద్ధరించండి
 • మూడవ పార్టీ మరియు యాడ్-ఆన్ కవర్
PX step

కారు బీమా కొటేషన్లను ఆన్లైన్లో పోల్చుకోండి

లేదా

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ చాలా పురాతనమైన మరియు విశ్వసనీయమైన సంస్థ. 20 శతాబ్దం ప్రారంభం నుంచి ఈ సంస్థ వినియోగదారులకు సేవలు అందిస్తూ ఉంది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ 1906 వ సంవత్సరంలో కొల్ కతాలో ప్రారంభించబడింది. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి అనుబంధ సంస్థగా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వెంచర్ గా ప్రారంభించబడింది .

2002 లో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ(జిఐసి) నుంచి వేరుపడి చట్టబద్దమైన స్వతంత్ర అధికార సంస్థగా ఏర్పడింది. భారత దేశ ప్రజలకు సాధారణ బీమా పాలసీలు అందించడంతో పాటు, పెరుగుతున్న డిమాండ్లు, ప్రజల అవసరాల మేరకు వినూత్న పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రధానాంశాలు

నిర్మాణం మరియు విలీనం

5వ తేదీ డిసెంబర్, 1906

జాతీయం చేయబడిన సంవత్సరం

1972

యాజమాన్యం

భారత ప్రభుత్వం

కంపెనీ రకం

పబ్లిక్ సెక్టార్

ప్రధాన కార్యాలయం/ మెయిన్ బ్రాంచ్

కొల్ కతా, పశ్చిమ బెంగాల్, ఇండియా

బీమా ఉత్పత్తుల సంఖ్య

200+

బీమా ఉత్పత్తుల రకం

 • ఆరోగ్య బీమా

 • ప్రమాద బీమా

 • ఆస్తి బీమా

 • ఆటో ఇన్సూరెన్స్

 •  మైరన్ ఇన్సూరెన్స్

 • గ్రామీణ బీమా

మొత్తం శాఖల సంఖ్య

1730+

సేవలు అందించే దేశాలు

భారతదేశం మరియు నేపాల్

క్రిసిల్ రేటింగ్ 

'AAA'

వెబ్ సైట్

nationalinsuranceindia.nic.co.in

నేషనల్ ఇన్సూరెన్స్ సంస్థ పొందిన అవార్డులు

వినియోగదారులకు ప్రపంచ స్థాయి ఉత్పత్తులు మరియు సేవలను అందించడం ఎన్ఐసి యొక్క ప్రధాన లక్ష్యం. ఎన్ఐసి రెండవ అతిపెద్ద జనరల్ ఇన్సూరెన్స్ సంస్థగా ఉంది. ఎన్ఐసి మొత్తం 14902 మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కలిగి ఉంది. అలాగే భారతదేశం అంతటా మరియు నేపాల్ లో కార్యాలయాలు కలిగి ఉంది. మోటర్ వాహన బీమా రంగంలో 2015 సంవత్సరంలో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ మార్కెట్ వాటా గరిష్టంగా ఉంది. 

CIO Award by Green LT Enterprise Award 2013

CIO Award by Green LT Enterprise Award 2013

Certificate of Merit by Financial Inclusion Award 2013

Certificate of Merit by Financial Inclusion Award 2013

Top 100 CISO Awards 2013

Top 100 CISO Awards 2013

Business Leadership Awards 2012 by NDTV Profit

Business Leadership Awards 2012 by NDTV Profit

Digital Inclusion Awards 2012

Digital Inclusion Awards 2012

The Indian Insurance Awards 2013

The Indian Insurance Awards 2013

ఆర్థిక సంవత్సరం 

వృద్ధి

1974

బేస్ ప్రీమియం 50 కోట్లు

2010-2011 

32.33% నుండి INR 60 బిలియన్ల కంటే ఎక్కువ

2012- 2013

INR 90 బిలియన్

2013- 2014

INR 100 బిలియన్

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీని విశ్వసించడానికి 5 కారణాలు

వేగవంతమైన క్లైయిమ్ సర్వీసింగ్

నేషనల్ ఇన్సూరెన్స్ 24*7 లైవ్ చాట్ సపోర్ట్ ద్వారా క్లైయిమ్ ప్రాసెస్, పునరుద్దరణ, ఫిర్యాదుల పరిష్కారం, క్లైయిమ్ స్థితి, చెల్లింపులు వంటి ఉత్తమమైన సేవలను పాలసీదారులకు అందిస్తుంది. క్లైయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి 104% పాలసీదారుడు పట్ల సంస్థ విశ్వసనీయతను రుజువు చేస్తుంది.

బ్రాండ్ పవర్

నేషనల్ ఇన్సూరెన్స్ సంస్థ 1972 సంవత్సరంలో నేషనలైజేషన్ యాక్ట్ క్రింద పలు విదేశీ సంస్థలు మరియు దేశీయ సంస్థల విలీనంతో ఏకీకృత సంస్థ శక్తిగా అవతరించింది. గతంలో, ఎన్ఐసి జిఐసి యొక్క అనుబంధ సంస్థగా ఉండేది.

అవార్డులు మరియు గుర్తింపులు

ఎకనామిక్ టైమ్స్, స్కోచ్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బిఎస్ఎఫ్ఐ వంటి గుర్తింపు పొందిన సంస్థలచే ఎన్ఐసి ఉత్తమ ఆరోగ్య బీమా, ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇయర్, బెస్ట్ ఇన్సూరర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను పొందింది.

బీమా పాలసీ యొక్క వైవిధ్యత

వినియోగదారుల అవసరాల మేరకు సంస్థ వివిధ రకాల ఎంపికలతో బీమా పాలసీలను అందిస్తుంది. నేషనల్ ఇన్సూరెన్స్ సంస్థ 200 రకాల బీమా ఉత్పత్తులను కలిగి ఉంది. వీటిలో ప్రధానంగా ఆరోగ్యం, అగ్ని, గ్రామీణ, మోటర్, ప్రమాదం, ఆస్తి, మెరైన్, దొంగతనం, గృహ, దుకాణదారులకు సంభందించిన పాలసీలు ఉన్నాయి.

వివిధ రంగాలకు బీమా ఉత్పత్తులు

నేషనల్ ఇన్సూరెన్స్ సంస్థ టెలికాం, ఏవియేషన్ , బ్యాంకింగ్, పవర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్, అగ్రోనమీ, అయిల్ & పవర్, హెల్త్ కేర్ మొదలైన అనేక రకాల పరిశ్రమలు/ రంగాల కోసం 200+ బీమా పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

నేషనల్ ఇన్సూరెన్స్ పథకాల రకాలు

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వ్యాపారం/ ప్రొఫెషనల్/ హెల్త్/ వ్యక్తిగత అవసరాల కోసం అనేక రకాల పాలసీలను అందిస్తోంది. వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా సంస్థ బీమా కొత్త ప్రవేశ పెడుతుంది.

1. నేషనల్ ఆరోగ్య బీమా పథకాలు

ఇతర సంస్థల బీమా పథకాల కంటే నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ బీమా పథకాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆరోగ్య బీమా పథకాలు భారతదేశమంతటా ఆదరించబడ్డ మరియు ప్రసిద్ధి చెందాయి. సంస్థ యొక్క 6 ఆరోగ్య బీమా పథకాలు ప్రత్యేకమైన ప్రయోజనాలు అందిస్తాయి. ఆరోగ్య బీమా పథకాల గురించి వివరించడం జరిగింది..

i. నేషనల్ మెడిక్లైయిమ్ ప్లస్ పాలసీ


మీ ఆరోగ్య సంబంధిత ఖర్చులతో పాటు రివార్డులను కూడా సులభంగా అందించే ఉత్తమమైన బీమా పథకం.

అర్హత


కనిష్ట ప్రవేశ వయసు

18 సంవత్సరాల 3 నెలల నుంచి 25 సంవత్సరాలు వరకు(ఆధారపడ్డ పిల్లలకు)

గరిష్ట ప్రవేశ వయసు

65 సంవత్సరాలు

కుటుంబ సభ్యులను చేర్చవచ్చు

స్వీయ , భాగస్వామి, ఆధారపడ్డ లేదా దత్తత తీసుకున్న పిల్లలు, ఆధారపడ్డ తల్లిదండ్రులు

కవరేజీ

ఆసుపత్రి గది అద్దె, బోర్డింగ్, నర్సింగ్ ఖర్చులు, అంబులెన్స్ ఖర్చులు, ప్రసూతి ఖర్చులు, అల్లోపతి చికిత్స, ఆయుర్వేదం, హోమియోపతి, ప్రీ మరియు పోస్ట్ హస్పిటలైజేషన్, అవుట్ పెషేంట్ చికిత్స , కాటార యాక్ట్ శస్త్ర చికిత్సకు ప్రధానంగా కవరేజీ లభిస్తుంది.

ii. నేషనల్ మెడిక్లైయిమ్ పాలసీ


 ఈ ఆరోగ్య బీమా పాలసీ తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా మొత్తాన్ని కొరుకునే అన్ని రకాల వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. అత్యవసర మెడికల్ పరిస్థితుల్లో ఈ పథకం ఆర్థిక రక్షణను అందిస్తుంది.

అర్హత

కనిష్ట ప్రవేశ వయసు

18 సంవత్సరాల 3 నెలల నుంచి 25 సంవత్సరాల వరకు(ఆధారపడ్డ పిల్లలకు)

గరిష్ట ప్రవేశ వయసు

65 సంవత్సరాలు

కుటుంబ సభ్యులను చేర్చవచ్చు

స్వీయ, భాగస్వామి, ఆధారపడ్డ లేదా దత్తత తీసుకున్న పిల్లలు, ఆధారపడ్డ తల్లిదండ్రులు

 

కవరేజీ

ఆసుపత్రి గది అద్దె/ ఐసియూ ఛార్జీలు, మెడికల్ ప్రాక్టీషనర్లు, సర్జన్, అనస్థీషిట్, కన్సల్టెంట్స్, స్పెషలిస్ట్ ఫీజు, అత్యవసర సమయంలో అంబులెన్స్, అవయవ దాత ఖర్చులు, ప్రీ మరియు పోస్ట్ హస్పిటలైజేషన్, నగదు రహిత చికిత్స ,, మెడికల్ టెస్టులు మరియు ఆయుర్వేద చికిత్స కు  ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది.

iii. నేషనల్ పరివార్ మెడిక్లైయిమ్ ప్లస్ పాలసీ


ఈ బీమా పథకం మొత్తం కుటుంబానికి కవరేజీ అందిస్తుంది. పాలసీ పునరుద్దరణ నియమాలను అనుసరించి ఇది జీవిత కాలం కవరేజీ అందిస్తుంది. పాలసీదారుడు తన బడ్జెట్ ఆధారంగా ఒకటి/ రెండు/ మూడు సంవత్సరాల కాల వ్యవధి కలిగిన బీమా పథకాన్ని తీసుకోవచ్చు.

అర్హత

కనిష్ట ప్రవేశ వయసు

18 సంవత్సరాల 3 నెలలు నుంచి 25 సంవత్సరాల వరకు( ఆధారపడ్డ పిల్లలకు)

గరిష్ట ప్రవేశ వయసు

65 సంవత్సరాలు

కుటుంబ సభ్యులను చేర్చుకోవచ్చు

ఆధారపడ్డ పిల్లలు, భాగస్వామి, తోబుట్టువులు, తల్లిదండ్రులు, ఆధారపడ్డ అత్తమామలు

 

కవరేజీ

వైద్య ఖర్చులు, గది అద్దె ఖర్చులు, మందులు, డయాగ్నొస్టిక్ మెటీరియల్, ఎక్సరే, డయాలసిస్, కెమోథెరపీ, రేడియో థెరపీ, డాక్టర్ ఫీజు,సర్జన్ ఫీజు, కన్సల్టెంట్, స్పెషలిస్టుల ఫీజులు, ప్రీ మరియు పోస్ట్ హస్పిటలైజేషన్ ఖర్చులు, నగదు రహిత చికిత్స , వంద్యత్వ చికిత్స , యాంటీ రేబిస్ టీకా, న్యూ బోర్న్ ఖర్చులు, పిల్లల టీకా ఖర్చులు, రోజువారీ ఆసుపత్రి ఖర్చులు, నగదు, మొదలైన వాటికి కవరేజీ అందిస్తుంది.

iv. నేషనల్ పరివార్ మెడిక్లైయిమ్ పాలసీ


నేషనల్ పరివార్ మెడిక్లైయిమ్ పాలసీ వివిధ ఆరోగ్య పరీక్షలు, తీవ్ర అనారోగ్యం మరియు ప్రమాద చికిత్స , ఆసుపత్రికి తరలించడానికి అయ్యే రవాణా ఖర్చులు, ఆసుపత్రి అడ్మిషన్ ఖర్చులు మొదలైన వాటికి అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

అర్హత

కనిష్ట ప్రవేశ వయసు

18 సంవత్సరాల 3 నెలల నుంచి 25 సంవత్సరాల వరకు

గరిష్ట ప్రవేశ వయసు 

65 సంవత్సరాలు

కుటుంబ సభ్యులను చేర్చుకోవచ్చు

స్వీయ, భాగస్వామి మరియు ఆధారపడ్డ పిల్లలకు

 

కవరేజీ

ఆసుపత్రి గది అద్దె, మందులు, డయాగ్నోస్టిక్ మెటిరియల్, ఎక్సరే, డయాలసిస్, కెమోథెరపీ, మెడికల్ ప్రాక్టీషనర్స్ ఫీజు, సర్జన్, కన్సల్టెంట్స్, స్పెషలిస్ట్ ఫీజులు, ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, నగదు రహిత చికిత్స మరియు మధుమేహం, రక్తపోటు చికిత్స కు కవరేజీ అందిస్తుంది.

v. సీనియర్ సిటిజన్స్ కోసం వరిష్ఠ మెడిక్లైయిమ్ పాలసీ


వృద్ధాప్యంలో తలెత్తే పెద్ద లేదా చిన్న వ్యాధులు మరియు ఇతర వైద్య చికిత్స లకు అయ్యే ఖర్చులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఈ బీమా పాలసీ ప్రవేశ పెట్టబడింది.

అర్హత 

కనిష్ట ప్రవేశ వయసు 

60 సంవత్సరాలు

గరిష్ట ప్రవేశ వయసు

80 సంవత్సరాలు

కుటుంబం సభ్యులను చేర్చుకోవచ్చు 

ఆధారపడ్డ పిల్లలు, భాగస్వామి, తల్లిదండ్రులు

 

కవరేజీ

ఇన్- పెషేంట్ హస్పిటలైజేషన్( గది అద్దె, డాక్టర్ ఫీజులు, కన్సల్టేషన్, మందులు, మొదలైనవి), ప్రీ మరియు పోస్ట్ హస్పిటలైజేషన్ ఖర్చులు, నగదు రహిత చికిత్స , కంటి శుక్లం, ప్రోస్టాటిక్ హైపర్ ప్లాసియా, అంబులెన్స్, ఆరోగ్య పరీక్షలు, 8 తీవ్రమైన వ్యాధులకు ఐచ్ఛిక కవరేజీ, గుండె, మెదడు మొదలైన వాటికి సంబంధించి కవరేజీ అందిస్తుంది.

vi. నేషనల్ ఓవర్సీస్ మెడిక్లైయిమ్ బిజినెస్ మరియు హలిడే


నేషనల్ ఓవర్సీస్ మెడిక్లైయిమ్ బిజినెస్ మరియు హలిడే ప్లాన్, బిజినెస్ మీటింగ్ లేదా సెలవులు లేదా కార్పొరేట్ పనులపై విదేశాలకు వెళ్లేవారికి వర్తిస్తుంది. ప్రయాణం చేసే సమయంలో పాలసీదారుడు ఏదైనా వ్యాధికి గురైతే ఈ పాలసీ క్రింద వైద్య చికిత్స అందించబడుతుంది.

అర్హత 

కనిష్ట ప్రవేశ వయసు

విదేశాలకు వెళ్లే ఎవరైనా

గరిష్ట ప్రవేశ వయసు

70 సంవత్సరాలు

కుటుంబ సభ్యులను చేర్చుకోవచ్చు

విద్యార్థులు, వ్యాపారులు, కార్పొరేట్ వ్యక్తులు, ఉద్యోగార్థులు

 

కవరేజీ

అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ఆసుపత్రికి తరలింపు, ఏదైనా అనారోగ్యం లేదా వ్యక్తిగత ప్రమాదం, అంగవైకల్యం. వైద్య సమస్యలే కాకుండా సామాన్లు(బ్యాగేజీ), పాస్ పోర్ట్ లేదా థర్డ్ పార్టీ ఆస్తి/ శరీర భాగాలకు నష్టానికి కవరేజీ అందిస్తుంది.

vii. నేషనల్ ఇన్సూరెన్స్ ఓవర్సీస్ మెడిక్లైయిమ్ ఎంప్లాయిమెంట్ పాలసీ


ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగం కోసం విదేశానికి వెళ్లే దేశీయ విద్యార్థుల/ ఉద్యోగులు సదరు సంస్థ ఆదేశించినట్లయితే ఆరోగ్య బీమాను తీసుకోవాల్సి ఉంటుంది.

అర్హత

 • భారతీయ పౌరుడు బిజినెస్/ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నప్పుడు
 • భారత దేశ సంస్థల్లో.. భారత దేశంలో పనిచేసే విదేశీయుల కోసం మరియు భారతదేశ కరెన్సీలో జీతం అందుకునే వారి కోసం.

కవరేజీ

అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రి తరలింపునకు, అనారోగ్యానికి చికిత్స , ఏదైన మెడికల్ ఎమర్జెన్సీకి ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది.

2. నేషనల్ మోటర్ బీమా పథకాలు

భారత ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారందరికీ మోటర్ బీమాను తప్పనిసరి చేసింది. పర్యవసానంగా, మీరు బీమా తీసుకోకుండా వాహనాన్నినడపలేరు, ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ రెండు రకాల మోటర్ బీమా పాలసీలను అందిస్తుంది. అవి...

i. నేషనల్ ప్రైవేట్ కారు బీమా


ప్రమాదవశాత్తు దెబ్బతినడం, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు, కొండచరియలు విరిగిపడటం మరియు సమ్మెలు, ఉగ్రవాదం, హానికరమైన చర్యల వల్ల కలిగే నష్టాలకు నుంచి బీమా చేసిన వాహనానికి రక్షణ కల్పిస్తుంది. పాలసీదారుని వాహనం ద్వారా థర్డ్ పార్టీ వ్యక్తికి, వాహనానికి లేదా వాహన యజమానికి నష్టం జరిగితే, ఈ నష్టాన్ని బీమా పథకం భర్తీ చేస్తుంది.

ii. నేషనల్ టూ వీలర్ బీమా


నేషనల్ టూ వీలర్ బీమా, ద్విచక్ర వాహనదారులకు విస్తృత ప్రయోజనాలతో కూడిన బీమా పథకాన్ని అందిస్తుంది. కారు బీమా పాలసీ క్రింద పేర్కొన్న అదే ప్రయోజనాలను టూ వీలర్ బీమా పాలసీలోనూ వినియోగదారుడు పొందుతాడు. దొంగతనం, దోపిడి, ప్రకృతి వైపరీత్యాలు, కొండచరియలు విరిగిపడటం, ఉగ్రవాదం, అగ్ని, పిడుగుపాటు మొదలైన వాటి వల్ల మీ స్కూటర్/ మోటర్ బైక్ కి కలిగే నష్టాల నుంచి కవరేజీ అందిస్తుంది. ఈ టూ వీలర్ బీమా యాడ్- ఆన్ కవర్ తో వస్తుంది. ఇంజిన్ ప్రొటెక్ట్, ఎన్ సిబి ప్రొటెక్ట్, ఇన్ వాయిస్ ప్రొటెక్ట్, జీరో తరుగుదల వంటి యాడ్- ఆన్ కవర్లను బీమా పాలసీ అందిస్తుంది. బేస్ ప్రీమియంతో కలిపి అదనపు ప్రీమియం ఇవ్వడం చెల్లించడం ద్వారా ఈ రైడర్స్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

iii. వాణిజ్య వాహన బీమా


మీరు వస్తువులను మరియు ప్రయాణీకులను తరలించే వాణిజ్య వాహనాన్ని కలిగి ఉంటే, ఈ బీమా పాలసీ మీ కోసమే. బీమా చేయబడిన వాహనాల వల్ల థర్డ్ పార్టీ వ్యక్తి మరణం లేదా గాయపడటం, థర్డ్ పార్టీ ఆస్తికి నష్టం సంభవిస్తే పాలసీ కవరేజీ అందిస్తుంది. అదనంగా అగ్ని, పేలుడు, దోపిడి, దొంగతనం, అల్లర్లు మరియు సమ్మెలు, ఉగ్రవాద చర్య, భూకంపం, వరదలు, తుఫాన్లు వల్ల కలిగే నష్టానికి మరియు రోడ్డు రవాణా కు కవరేజీ అందిస్తుంది.

3. నేషనల్ గ్రామీణ బీమా పాలసీ

గ్రామీణ ప్రాంతంలో వ్యాపారం చేసేటప్పుడు, వ్యాపార అభివృద్ధి కోసం కొనుగోలు చేసిన భూమి, స్టాక్, ఇతర పరికరాలకు బీమా కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ నేషనల్ గ్రామీణ బీమా పాలసీ గ్రామీణ ప్రజలను ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని, ప్రతికూల ప్రభావాలను కలిగించే ప్రమాదాలు, అనుకోని ప్రమాదాల నుండి రక్షిస్తుంది. వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్ సాగు చేసే ప్రజలకు ఈ బీమా పథకంలో చేర్చవచ్చు.

i. మంచినీటి చేపల సాగుకు బీమా


ఈ బీమా ప్రత్యేకంగా మంచినీటి చేపల పెంపకం దారుల కోసం రూపొందించబడింది. ప్రమాదాలు, అంటు వ్యాధులు, కాలుష్యం, విషం, థర్డ్ పార్టీ పక్షాల హానికరమైన చర్య, అల్లర్లు/సమ్మె/ వ్యాధుల కారణంగా కలిగే నష్టాల నుంచి పాలసీదారునికి రక్షణ కల్పిస్తుంది.

ii. పౌల్ట్రీ బీమా పథకం


పౌల్ట్రీ వ్యాపారంలో కోళ్లు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. వీటికి బీమా కలిగి ఉండటం అనేది అత్యవసరం. ఈ బీమా పథకం అగ్ని, పిడుగుపాటు, వరద, తుఫాను, భూకంపం, సమ్మె, అల్లర్లు, ఉగ్రవాద చర్య లేదా కోళ్ల మరణానికి కారణమయ్యే అంటు వ్యాధులు వంటి అన్ని నష్టాల నుంచి పాలసీదారునికి కవరేజీ అందిస్తుంది. పౌల్ట్రీ కోళ్లకు ఎలాంటి హాని జరిగినా అందుకు సంబంధించిన నష్టపరిహారాన్ని నేషనల్ ఇన్సూరెన్స్ సంస్థ చెల్లింపు చేస్తుంది.

iii. కిసాన్ అగ్రికల్చర్ పంప్ సెట్


సెంట్రిఫ్యూగల్ పంప్ సెట్లు, ఎలక్ట్రికల్ లేదా డీజిల్ మరియు సబ్మెర్సిబుల్ పంప్ సెట్లు( 25 హెచ్.పి సామర్థ్యం) సాధారణంగా వ్యవసాయ ప్రక్రియలో ఉపయోగిస్తారు. ఈ పంప్ సెట్లకు ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది.

iv. పెడల్ సైకిల్ రిక్షా పాలసీ


ఈ పథకం సైకిల్ రిక్షాలకు కవరేజీ అందిస్తుంది. వివిధ ప్రమాదాలు, అగ్ని, పిడుగుపాటు, దొంగతనం, పేలుడు, దోపిడీ వంటి వాటి వల్ల కలిగే నష్టాలకు ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది. అలాగే, ఈ పాలసీ ద్వారా 1 కంటే ఎక్కువ రిక్షాలకు కవరేజీ అందించవచ్చు. ఒకే పాలసీ క్రింద 3 లేదా 4 రిక్షాలకు బీమా కల్పిస్తే రాయితీలు కూడా లభిస్తాయి.

v. పెడల్ సైకిల్ బీమా


టూ వీలర్ బీమా లానే, ఈ బీమా కూడా థర్డ్ పార్టీ ఆస్తుల, గాయాలు/ మరణం/ నష్టానికి కవరేజీ అందిస్తుంది . అలాగే అగ్ని, దోపిడి, దొంగతనం వల్ల జరిగే టైర్లు, లేదా ఇతర సైకిల్ ఉపకరణాలకు నష్టం జరిగితే వాటికి కూడా కవరేజీ లభిస్తుంది.

vi. ఇంధనం అవసరం లేని వాహనాలకు బీమా


ఇంధనం అవసరం లేకుండా పనిచేసే వాహనాలకు ఈ బీమా ప్రత్యేక కవరేజీ అందిస్తుంది. హ్యాండ్ పుల్లర్ చేత నిర్వహించబడే బండ్లు, టోంగాస్ లేదా రిక్షాలు మొదలైనవి ఈ వర్గం కిందకి వస్తాయి.

vii. జంతువులను తరలించే బండి/ టోంగా


గ్రామీణ ప్రజలు ఉపయోగించే టోంగా బండ్లకు ఎటువంటి ఇంధనం అవసరం లేదు. ఇవి ఇంధనం లేదా సహజవాయవులు అవసరం లేని వాహనాల బీమా పరిధిలోనికి వస్తాయి. ఎద్దులు, గుర్రాలు, గాడిదలు మరియు ఒంటెల సాయంతో నడపబడే టోంగో వంటి వాహనాలకు ఆకస్మికంగా అగ్ని ప్రమాదం , ప్రమాదాలు, అల్లర్లు, సమ్మెలు, రోడ్డు, రైలు మరియు జలమార్గాల ద్వారా నష్టం కలిగితే, ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది.

viii. గ్రూప్ వ్యక్తిగత ప్రమాద బీమా


మున్సిపాలిటీలు, పంచాయితీలు, రిక్షా పుల్లర్స్ యూనియన్ లకు గ్రూప్ వ్యక్తిగత ప్రమాద బీమా వర్తిస్తుంది. ఈ గ్రూప్ లో గరిష్టంగా 50 మంది వరకు ఉండవచ్చు. గ్రూప్ లో ఏదైనా సభ్యునికి ప్రమాదం కారణంగా మరణం లేదా అంగవైకల్యం సంభవిస్తే సంస్థ చెల్లింపు చేస్తుంది.

ix. గిరిజనులకు ప్యాకేజీ బీమా


గిరిజనులు నివసించే ప్రాంతంలో అగ్ని ప్రమాదం, ఇతర ప్రమాదాలు కారణంగా గుడిసెలు లేదా నివాసప్రాంతాలు ధ్వంసమైతే ఈ బీమా నష్టాన్ని పూడ్చడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అలాగే వ్యక్తిగత ప్రమాదానికి కూడా ఈ బీమా కవరేజీ అందిస్తుంది. గాయపడి ఆసుపత్రి పాలైతే హస్పిటలైజేషన్ ఖర్చులను మరియు క్షయ, కుష్ఠు, క్యాన్సర్ వ్యాధికి అయ్యే వైద్య చికిత్స లకు ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది.

x. సెరికల్చర్ ఇన్సూరెన్స్


ఇది గుడ్డు దశ నుండి కొకన్ దశ వరకు పట్టు పురుగులకు ఎలాంటి నష్టం సంభవించినా అందుకు సంబంధించిన కవరేజీ అందిస్తుంది. యూనివోల్టన్/ బివోల్టైన్/ మల్టీవోల్టైన్/ స్వచ్ఛమైన లేదా హైబ్రిడ్ జాతులు వంటి అన్ని రకాల పట్టుపురుగు జాతులకు ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది.

xi. తేనెటీగలకు బీమా


తేనెటీగలకు లేదా తేనెపట్టులకు అగ్ని, వరద, తుఫాను , సుడిగాలి, దొంగతనం, అంటువ్యాధి, పురుగుమందుల కారణంగా ఏదైనా నష్టం జరిగితే ఈ బీమా పథకం పాలసీదారునికి నష్ట పరిహారాన్ని చెల్లిస్తుంది. ఈ బీమా పథకం భారతీయ తేనెటీగల రకానికి మరియు ఇటాలియన్ తేనెటీగల రకానికి రెండింటికి కవరేజీ అందిస్తుంది.

xii. సాల్ట్ వర్క్ ఇన్సూరెన్స్


ఈ బీమా పథకంలో, ఎర్త్ వర్క్/ మట్టి పని, తుఫాను, వరద మరియు అనుబంధ ప్రమాదాలు, సీజనల్ వర్షపాతం వంటి అనిశ్చిత సంఘటనల వల్ల నిల్వ చేయబడిన సాల్ట్ కు నష్టం కలిగితే ఈ బీమా పథకం కింద కవరేజీ లభిస్తుంది.

xiii. విఫలమైన వెల్ ఇన్సూరెన్స్


సివిల్ నిర్మాణాలకు ఏదైనా నష్టం వాటిల్లిన, పీసీ పంపు మరియు ఇతర పరికరాలకు ఏదైనా నష్టం కలిగినా ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది. తవ్విన బావి, బోర్ బావులు, పరికరాలు రవాణా, ఫోడ్ంగ ఎన్ఎల్ కేటింగ్ కోసం కార్మిక ఛార్జీలు, శుభ్రపరచడం మరియు డీవటేరింగ్ ఛార్జీలు మరియు స్పాట్ ఇన్వెస్టిగేషన్ థార్జెస్ కవరేజీ వర్తిస్తాయి, ఇతర ఖర్చులను పాలసీదారునికి సంస్థ చెల్లిస్తుంది.

xiv. లిఫ్ట్ ఇరిగేషన్ బీమా


లిఫ్ట్ ఇరిగేషన్ ప్రక్రియలో ఉపయోగించబడే పరికరాలు, ఇనేక్ట్ వెల్, డెలివరీ చాంబర్స్, జాక్వెల్, పైప్ లైన్లు, కేబుల్స్, పంప్ హౌస్, వాటర్ స్టోరేజీ ట్యాంక్, స్విచ్ గేర్లు, స్టార్టర్స్ వంటి పరికరాలకు ఏదైనా నష్టం కలిగితే బీమా సంస్థ కవరేజీ అందిస్తుంది.

 xv. రైతు ప్యాకేజీ బీమా


ఈ బీమా పథకం కింద స్టాక్, పంటలు, గోదాములు, పంప్ సెట్స్, పౌల్ట్రీ పక్షులు, టాక్టర్లు, అగ్ని, దోపిడి, ప్రమాదాలు, విద్యుత్ విచ్ఛిన్నం మరియు ఇతర ప్రమాదాల వల్ల కలిగే నష్టాలను కవరేజీని అందిస్తుంది. ఈ బీమా చేతివృత్తుల వారు, కుటీర పరిశ్రమ, చిన్న రంగాలు, ఎస్ఎస్ఐ మరియు బయోగ్యాస్ ప్లాంట్లకు కవరేజీ అందిస్తుంది.

xvi. పాల ఉత్పత్తిదారుల కో-ఆపరేటివ్ సొసైటీ/ కలెక్షన్ సెంటర్ కోసం ప్యాకేజీ బీమా


ఈ బీమా పథకం భవనం మరియు అందులోని పరికరాలకు దొంగతనం జరిగితే అందుకు సంబంధించిన కవరేజీ అందిస్తుంది. అలాగే అగ్ని మరియు ఇతర ప్రమాదాలు, యంత్రాలు పాడవ్వడం, పెడల్ సైకిల్, ఎద్దుల బండి , టీవీ మొదలైన వాటికి కవరేజీ అందిస్తుంది.

xvii. జనతా వ్యక్తిగత ప్రమాద కవరేజీ


ఈ కవర్ 10 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల్లోపు వయసు ఉన్న పాలసీదారులకు వర్తిస్తుంది. ప్రమాదంలో మరణం లేదా అంగవైకల్యం సంభవిస్తే ఈ బీమా పథకం ఆర్థిక రక్షణను అందిస్తుంది.

xviii. గ్రామీణ ప్రమాద బీమా


జనతా వ్యక్తిగత ప్రమాద బీమా పథకం లానే, ఈ బీమా పథకం కూడా మరణం లేదా శాశ్వత అంగవైకల్యం వంటి వాటికి కవరేజీని అందిస్తుంది. ప్రతి సంవత్సరం పాలసీదారుడు రూ. 10,000 బీమా కవరేజీని, కేవలం రూ. 5 ప్రీమియంతో పొందవచ్చు.

xix. ఆక్వా కల్చర్(రొయ్యలు) బీమా


వేసవి కాలంలో రొయ్యలు చనిపోవడం, కాలుష్యం, విషం, అల్లర్లు, సమ్మె, భూకంపం, పేలుడు, తుఫాను, ఉగ్రవాద చర్యల కారణంగా ఆక్వా కల్చర్ ప్రభావితమయి నష్టం ఏర్పడితే ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది.

xx. హార్టీకల్చర్/ ప్లాంటేషన్/ ప్లోరికల్చర్ బీమా


అయిల్ పామ్ పోప్లర్, టో ప్లాంటేషన్, రబ్బరు, యూకలిఫ్టస్, యూకలిఫ్టస్(నర్సరీ), కొబ్బరి, టేకువుడ్, బెట్ లైన్, సిట్రస్, చికూ, అరటి, స్ట్రాబెరీ, ద్రాక్ష, మామిడి, ఏలకులు, ఆర్చిడ్, ఆపిల్, గూస్ బెర్రి, గులాబీ, కిసాన్తిమం, జాస్మిన్, గ్లాడియోలస్, మష్రూమ్, వెజిటెబుల్ ప్లాంట్, జట్రోఫా కార్కస్ ప్లాంటేషన్, సేఫ్ట్ ముస్లీ ప్లాంటేషన్ లకు అగ్ని ప్రమాదం, పిడుగుపాటు, తుఫాను, వరద మరియు ఉప్పెన, అల్లర్లు, ఉగ్ర దాడుల కారణంగా ఏదైనా నష్టం సంభవిస్తే ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది.

xxi. ఎంబ్రియో బీమా


ఎంబ్రియో టాన్ఫర్ అయిన వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోయినా లేదా ఏదైనా వ్యాధికి గురైనా, ఎంబ్రియోను దానం చేసిన వ్యక్తికి ఏదైనా హాని కలిగినా ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది.

xxii. బాతు బీమా పథకం


బాతులను భారీ సంఖ్యలో పెంచుతున్న వారికి ఈ బీమా పథకం సరిగ్గా సరిపోతుంది. పెంచుతున్న బాతుల సంఖ్య 50 కంటే ఎక్కువ ఉండాలి. 6 నెలల నుంచి 2 సంవత్సరాల వయసున్న బాతులకు ఈ బీమా పథకం కవరేజీ లభిస్తుంది. ప్రమాదవశాత్తు మరణం లేదా ఏదైనా వ్యాధికి గురైతే కవరేజీ లభిస్తుంది.

xxiii. డాగ్ బీమా


అత్యంత విశ్వసనీయమైన పెంపుడు జంతువులు కుక్కలు. పోలీసు శాఖలో దర్యాప్తు సమయంలో కుక్కలను ఉపయోగిస్తారు. ఏదైనా వ్యాధి సొకినా, ప్రమాదవశాత్తు మరణం, ప్రకృతి వైపరీత్యాలు, దుర్మార్గపు చర్యలు మరియు మూడవ పక్షం విష ప్రయోగం కారణంగా మీ పెంపుడు కుక్కలకు ఏదైనా నష్టం కలిగితే అందుకు సంబంధించిన కవరేజీని ఈ బీమా పథకం అందిస్తుంది.

xxiv. ఒంటె బీమా


ఒంటెల మరణం మరియు ప్రమాదం, వ్యాధి బారిన పడితే ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది. ఈ పాలసీ తీసుకోవాలంటే ఒంటె వయసు 3 నుంచి 12 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి.

xxv. ఏనుగుల బీమా


భారతదేశంలో ఏనుగును మతపరమైన కార్యకలాపాల్లో సమయంలో లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఏనుగు దోపిడి, దొంగతనం లేదా మరణం సంభవిస్తే ఏనుగు యజమానికి నష్టపరిహారం లభిస్తుంది. పాలసీ తీసుకోవాలంటే ఏనుగు వయసు 5 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.

xxvi. పందుల బీమా


స్వదేశీ, క్రాస్ బ్రీడ్, లేదా విదేశీ జాతి పందులకు ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది. ఈ బీమా పథకం పొందాలంటే పందుల వయసు 4 నెలల నుంచి 6 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

xxvii. పశువుల బీమా


పాల ఉత్పత్తుల వ్యాపారం చేసే యజమానులు తమ ఆవులు, గేదెలు, దూడలు/ పశువులు, ఎద్దులకు బీమా చేయడం చాలా ముఖ్యం. వ్యాధులు, శస్త్రచికిత్స ఆపరేషన్లు, అల్లర్లు, సమ్మెల కారణంగా పశు సంపదకు నష్టం వాటిల్లితే బీమా సంస్థ కవరేజీ అందిస్తుంది. పశువులకు ఏదైనా నష్టం లేదా వైకల్యం సంభవించినప్పుడు బీమా చేసిన మొత్తంలో 100% అందిస్తుంది.

xxviii. కుందేలు బీమా


మీ పెంపుడు కుందేలు ప్రమాదవశాత్తు లేదా వ్యాధి సోకి మరణిస్తే ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది. ఈ బీమా పొందాలంటే కుందేలు వయసు 4 నెలల నుంచి 4 సంవత్సరాల మధ్య ఉండాలి.

xxix. గొర్రెలు మరియు మేక బీమా


లాభం కోసం పెంచే గొర్రెలు మరియు మేకలకు ఈ బీమా పథకం అత్యవసరం, ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు మరియు ఇతర ప్రమాదాలు మరియు వ్యాధుల కారణంగా గొర్రెలు, మేకలు చనిపోయే ప్రమాదముంది. ఈ బీమా పథకం ఇలాంటి నష్టాల నుంచి గొర్రెలకు, మేకలకు దీర్ఘకాలిక కవరేజీ అందిస్తుంది.

xxx. దూడ/ పశువుల పెంపకం- బీమా పథకం


32 నెలలు వరకు ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది. ఈ పాలసీ కాల వ్యవధిలో ప్రమాదం అగ్ని మరియు సహజ విపత్తులు, వ్యాధులు, శస్త్రచికిత్స , ఆపరేషన్లు, అల్లర్లు, సమ్మె కారణంగా ఏదైనా నష్టం సంభవిస్తే బీమా పథకం కవరేజీ అందిస్తుంది.

xxxi. గుర్రం/ గాడిద బీమా


వ్యవసాయ సాగుకోసం ఉపయోగించే గుర్రాలు, గాడిదలకు అయ్యే ప్రమాదాలు, వ్యాధులు వల్ల అయ్యే నష్టాలకు ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది. అయితే ఈ పథకంలో రేసు గుర్రాలు కవరేజీ లభించదు. అలాగే బీమా చేయబడిన జంతువుల వయసు 2 నుంచి 10 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

4. నేషనల్ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ

 మీరు ఒక ఆస్తిని కొనుగోలు చేస్తే దానికి భద్రత కల్పించడం అత్యవసరం. ఎందుకంటే ఈ ఆస్తిని సంపాదించడానికి మీరు ఎన్నో త్యాగాలు చేసి ఉండవచ్చు, పగలు రాత్రి ఎంతో శ్రమించి ఉండవచ్చు. ఇలాంటి ఆస్తికి ఏదైనా నష్టం వాటిల్లితే అంతా వృధా అవుతుంది. నేషనల్ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ మీ ఆస్తికి మరియు ఇంటికి అన్ని విధ్వంసాల వల్ల కలిగే నష్టాల నుంచి సమగ్ర బీమా కవరేజీని అందిస్తుంది.

సాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ రిస్క్ పాలసీ(ఎస్ఎఫ్ఎస్ పి)


కొత్త ఇల్లు కొనడం లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడం చాలా మంది కల. అగ్ని ప్రమాదం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు వల్ల కలిగే నష్టాలకు ఈ పాలసీ కవరేజీ అందిస్తుంది.

అర్హత

ఇళ్లు, దుకాణాలు, వాణిజ్య భవనాలు, తయారీ యూనిట్లు, గోదాములు మొదలైన వాటి యజమానాలు ఈ బీమా పథకాన్ని తీసుకోవచ్చు.

కవరేజీ

భూకంపం, ఉగ్రవాదం, అగ్ని ప్రమాదం, రైల్ లేదా రోడ్డు మార్గాల విస్తరణ కారణంగా భవనాలకు కలిగే నష్టం. సర్వేయర్లు మరియు కన్సల్టింగ్ ఇంజనీర్లతో ఫీజు, అద్దె కోల్పోవడం, కోల్డ్ స్టోరెజీలో విద్యుత్ వైఫల్యం లేదా ఉష్ణోగ్రతలో మార్పు వంటి వాటికి కవరేజీ లభిస్తుంది.

5. నేషనల్ మెరైన్ ఇన్సూరెన్స్ పాలసీ

ఈ బీమా పథక సముద్ర వ్యాపారం చేసే యజమానుల కోసం రూపొందించబడింది. ముడి పదార్థాల రవాణా కార్యకలాపాలను నిర్వహించడానికి ఉపయోగించే ఓడలు, కార్గో, టెర్మినల్స్ కు కవరేజీ అందిస్తుంది. ఈ రవాణా సమయంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే వ్యాపారంలో భారీ నష్టం తప్పదు.

ఈ నష్టాల నుంచి పాలసీ ఆర్థిక రక్షణ అందిస్తుంది. నేషనల్ మెరైన్ ఇన్సూరెన్స్ పాలసీ అందించే 6 మెరైన్ బీమా పథకాల గురించి తెలుసుకుందాం...

i. నేషనల్ మెరైన్ బీమా పాలసీ

ఈ బీమా పథకం క్రింద ఎగుమతి మరియు దిగుమతి లకు సమగ్ర కవరేజీ పొందవచ్చు. పాలసీ కాల వ్యవధిలో జరిగే ప్రతి రవాణా విషయాన్ని బీమా సంస్థలకు పాలసీదారుడు తెలియజేయాలి. నగదు డిపాజిట్ ఖాతాలోని నగదు బ్యాలెన్స్ ప్రకారం బీమా సంస్థ కవరేజీ అందిస్తుంది.

ii. మైరన్ ఇన్సూరెన్స్- ఓపెన్ పాలసీ

సముద్ర వ్యాపారం చేసే అంటే ముడి పదార్థాల రవాణా  కార్యకలాపాలు నిర్వహించడానికి ఓడలు, కార్గో టెర్మినల్స్ నిర్వహించే వ్యక్తుల కోసం ఈ బీమా పాలసీ ఉద్దేశించబడింది. ప్రకృతి విపత్తుల కారణంగా ఏదైనా నష్టం కలిగితే ఈ బీమా పాలసీ క్రింద కవరేజీ లభిస్తుంది. నేషనల్ మెరైన్ పాలసీ అందించే 6 బీమా పథకాల గురించి క్రింద వివరించడం జరిగింది..

iii. మెరైన్ ఇన్సూరెన్స్ ఓపెన్ కవర్

ఈ పాలసీలో ఎగుమతి మరియు దిగుమతి కోసం బహుళ పంపకాలు/ సరుకులను బీమా చేసిన మొత్తం క్రింద కవర్ చేయవచ్చు. పాలసీ వ్యవధిలో జరిగే ప్రతి రవాణా వివరాలను హైలెట్ చేయడం పాలసీ దారుని బాధ్యత. నగదు డిపాజిట్ ఖాతాలోని నగదు బ్యాలెన్స్ ప్రకారం బీమా సంస్థ చెల్లింపు చేస్తుంది.

iv. మెరైన్ ఇన్సూరెన్స్ - ఓపెన్ పాలసీ

వివిధ ఉత్పత్తులను క్రమం తప్పకుండా ఎగుమతి మరియు దిగుమతి చేసే వ్యాపారుల కోసం ఈ పాలసీ రూపొందించబడింది. వర్తకుడు క్రమం తప్పకుండా పరిహారం/ రవాణా కు సంబంధించిన నష్టపరిహారాన్ని పాలసీ కాలవ్యవధి అయిన 12 నెలల పాటు క్రమం తప్పకుండా అందుకుంటాడు.

v. మెరైన్ ఇన్సూరెన్స్ - డ్యూటీ ఇన్సూరెన్స్

కార్గో ఇన్సూరెన్స్ కలిపి ఈ బీమా పథకం అందజేయబడుతుంది. ఈ పాలసీ క్రింద సరుకు దిగుమతి చేసుకునే వారికి ల్యాండింగ్ ప్రక్రియలో సరుకుపై పెరిగిన సుంకం ఛార్జీలకు పరిహారం లభిస్తుంది.

vi. మెరైన్ ఇన్సూరెన్స్- స్పెసిఫిక్ పాలసీ

ఒక నిర్దిష్ట సముద్ర ప్రయాణానికి అవసరమైన వస్తువులకు ప్రత్యేక ప్రాముఖ్యతని ఇచ్చే కవర్. కార్గో యొక్క వివరాలు, దాని విలువ, ఓడ/ రవాణా, లోడింగ్ విషయాలను ప్రయాణానికి ముందు పాలసీదారుడు సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ సమాచారం నష్టాల మూల్యాంకన ప్రక్రియలో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి సహాయం చేస్తుంది.

vii. మెరైన్ ఇన్సూరెన్స్ - పెరిగిన విలువ పాలసీ

మార్కెట్ స్థితిలో హెచ్చు తగ్గుల కారణంగా కార్గో ఎన్ఎస్ ల రేటు పెరిగినప్పుడు ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది. సరకు దిగుమతి దారుడు సరుకు యొక్క పెరిగిన విలువకు నిర్దిష్ట పరిమితి వరకు పరిహారాన్ని పొందుతారు.

viii. మెరైన్ ఇన్సూరెన్స్ సేల్స్ టర్నోవర్ పాలసీ

ఎగుమతి/ దిగుమతి / దేశీయ స్టాక్ బదిలీ/ కొనుగోలు / అమ్మకాలకు ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది మరియు కంపెనీల చట్టం 1956 కింద నమోదు చేయబడిన ఉత్పత్తి యూనిట్లకు ఇది కచ్చితంగా సరిపోతుంది. ఈ పాలసీ సరుకు తుది గమ్య స్థానాన్ని చేరే లోపు యుద్ధం, రవాణా దొంగతనం వంటి వాటి వల్ల కలిగే నష్టాలకు మరియు అదనపు నిల్వలకు కూడా కవర్ అందిస్తుంది.

6. నేషనల్ ఇంజనీరింగ్ ఇన్సూరెన్స్ పాలసీ 

భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. పెట్టుబడిదారులు భవనాలు, సిమెంట్ ప్లాంట్, పవర్ ప్లాంట్ లేదా ఆటో మొబైల్ తయారీ యూనిట్‌లను ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు అనుకోని ప్రమాదాల నుంచి(అగ్ని, వరదలు, తుఫాన్లు వంటివి) రక్షణ మరియు భారీ మొత్తం ఫండ్స్ అవసరం.

ప్లాంట్లలలో యంత్రాల సం స్థాపన మరియు పరీక్షల సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. కాబట్టి నష్టం జరగడానికే ముందే భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇందుకోసం 4 బీమా పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

i. ఎరిక్షన్ ఆల్ రిస్క్ ఇన్సూరెన్స్(ఈఎఆర్)


యంత్రం యొక్క ఎరిక్షన్, నిల్వ, అంసెబుల్, నిర్మాణం, పరీక్షల ప్రక్రియలో ఏదైనా ప్రాణ నష్టం జరిగితే ఆ బీమా పథకం కవరేజీ అందిస్తుంది. అగ్ని, పిడుగులు, పేలుడు వరద, భూకంపం, కొండచరియలు విరిగిపడటం, దొంగతనం, అల్లర్లు, సమ్మెలు, సిబ్బంది నిర్లక్ష్యం మొదలైన వాటి వల్ల నష్టం జరిగితే సంస్థ కవరేజీ మొత్తాన్ని చెల్లిస్తుంది.

ii. కాంట్రాక్టర్ యొక్క ప్లాంట్ మరియు మెషినరీ ఇన్సూరెన్స్


ప్లాంట్ అండ్ మెషినరీ కింద అన్ని పరికరాలు, రోలర్లు, డంపర్లు, ఎక్స్కవేటర్లు, ఎర్త్ మూవింగ్, క్రేన్లు, డ్రిల్లింగ్ మిషన్లు మొదలైన నిర్మాణ ప్రదేశంలో ఉపయోగించే పరికరాలకు కవరేజీ లభిస్తుంది.

వివిధ ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదం, ఉగ్ర దాడి, ఉద్దేశపూర్వక డ్యామేజీ, అల్లర్లు కలిగే నష్టాలకు ఈ బీమా కవరేజీ అందిస్తుంది. ఈ కవర్ ప్లాంట్ కు మరియు యంత్రాలకు ఒక సంవత్సరం పాటు ముందస్తు రక్షణ అందిస్తుంది.

iii. కాంట్రాక్టర్ యొక్క అన్ని నష్టాలకు బీమా


నివాస లేదా వాణిజ్య భవనాలు, ఫ్యాక్టరీ షెడ్లు, ఆనకట్టలు, రోడ్లు, వంతెనలు, కాలువలు, నీటి పారుదల ప్రాజెక్టులు మొదలైన వాటి నిర్మాణ సమయంలో నష్టాలు సంభవిస్తూ ఉంటాయి. అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని, దొంగతనం, దోపిడి, ఉగ్రవాదం, నిర్లక్ష్యం కారణంగా నష్టాలకు ఈ బీమా పాలసీ కవరేజీ అందిస్తుంది.

iv. పారిశ్రామిక ప్రమాద బీమా


అగ్ని, వరద, అల్లర్లు, దోపిడి, విద్యుత్/ యాంత్రిక మరియు బాయిలర్ల పేలుడు వంటి నష్టాలు కలిగి ఆస్తి నష్టం సంభవిస్తుంది. దెబ్బతిన పారిశ్రామిక ఆస్తుల మరమ్మతు లేదా పునఃస్థాపనకు అధిక మొత్తంలో నిధులు అవసరం అవుతాయి. ఈ బీమా కింద ఆ ఖర్చులకు కవరేజీ లభిస్తుంది. ఈ బీమా సాయంతో పారిశ్రామిక యజమానులు నష్టాల నుంచి తమను తాను రక్షించుకోగలరు.

v. నేషనల్ మెషినరీ ఇన్సూరెన్స్


ప్లాంట్ మరియు యంత్రాలు సహజంగా లేదా మానవ తప్పిదాలచే ఒక్కోసారి పాడవుతూ ఉంటాయి. ఇవి వ్యాపార ఆదాయాలను దెబ్బతీసి నష్టాన్ని కలిగిస్తాయి. మెషినరీ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అమరిక, దుర్వినియోగం, ఒత్తిడి, పేలుడు, సెంట్రిఫూగ్యల్ ఫోర్స్, అధిక విద్యుత్ పీడనం, ఇన్సులేషన్ వైఫల్యం, షార్ట్ సర్క్యూట్ వల్ల కలిగే నష్టాలకు బీమా కవరేజీ అందిస్తుంది.

టర్బైన్లు, కంప్రెషర్ లు, ఎయిర్ కండీషనర్లు, ట్రాన్స్ ఫార్మర్లు వంటి యంత్ర పరికరాలకు సైతం కవరేజీ అందిస్తుంది.

7. నేషనల్ మిస్సలేనియస్ బీమా

ఆరోగ్య బీమా కాకుండా వ్యక్తిగత ప్రమాదం, గృహ, దుకాణదారుడు, వ్యాపారం, పబ్లిక్ లేదా వాణిజ్య బాధ్యతలు మొదలైన వాటికి రక్షణ కల్పిస్తుంది. వ్యాపారంలో చిన్న చిన్ అంశాలు కూడా దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి బీమా కలిగి ఉండటం అనేది అత్యవసరం.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన


భారత రైతుల కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రవేశ పెట్టిన పథకం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. ప్రమాదకర సంఘటనల వల్ల పంటలకు నష్టం వాటిల్లితే అందుకు సంబంధించిన ఆర్థిక రక్షణను బీమా పథకం కల్పిస్తుంది.

ప్రధాన ప్రయోజనాలు

 • నష్టం జరిగిన సందర్భంలో రైతుకు కచ్చితమైన ఆర్థిక రక్షణ
 • మెరుగైన ఆహార భద్రత, పంట వైవిధ్య కరణ మరియు వ్యవసాయ వృద్ధికి క్రమం తప్పకుండా నిధులు
 • పంటల కోసం ఆర్థిక సంస్థల నుండి రుణాలు తీసుకున్న రైతులకు కవర్. ఈ బీమా రుణాలు తీసుకోని రైతులకు కూడా కవరేజీ లభిస్తుంది.
 • తృణధాన్యాలు, మిల్లెట్, పప్పుధాన్యాలు, నూనెగింజలు, వాణిజ్య, వార్షిక ఉద్యాన వంటి పంటలకు కవరేజీ లభిస్తుంది.

వ్యక్తిగత ప్రమాద బీమా


బీమా కొనుగోలు చేసిన తర్వాత పాలసీదారునికి ప్రమాద మరణానికి మరియు శాశ్వత అంగవైకల్యానికి కవరేజీ లభిస్తుంది. పాలసీదారుడు ప్రమాదంలో కంటిచూపును కొల్పోయినట్లయితే,లేదా రెండు చేతులు/ కాలు కొల్పోయినట్లయితే బీమా చేసిన మొత్తంలో 10 శాతం వరకు పాలసీదారునికి లభిస్తుంది. ఈ బీమా పథకం పొందడానికి పాలసీ దారుడు 5 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

గృహ నిర్మాణ బీమా


ఈ బీమా పథకం పూర్తిగా ఇంటి యజమానులు, ప్లాట్ల అద్దెదారులు, హౌసింగ్ సొసైటీలు, అపార్టుమెంట్లు, బంగ్లాలు, గ్రామీణ/సెమీ అర్బన్ మరియు పట్టణ పరిసరాల్లోని గృహ యజమానుల కోసం రూపొందించబడింది. బిల్డింగ్, విలువైన వస్తువులు(నగలు వంటివి), టెలివిజన్/ విసిఆర్ సామాను, పెడల్ సైకిల్ మొదలైన వాటికి డ్యామెజీ కవరేజీ అందిస్తుంది. అలాగే అగ్ని, దొంగతనం, ఉగ్ర దాడుల ద్వారా జరిగిన నష్టం/ నష్టానికి కవరేజీ అందిస్తుంది.

దుకాణదారుల బీమా


 ఒక చిన్న దుకాణాన్ని కలిగి ఉన్న దుకాణదారుడు వారి ఆస్తి, డబ్బు, స్టాక్ రక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ బీమా కవర్ మీ వ్యాపారాన్ని అగ్ని, ప్రత్యేక నష్టాలు, దోపిడీ, ప్రమాదాలు మొదలైన వాటి నుంచి రక్షణ కల్పిస్తుంది. వ్యాపార సంస్థలో ఏదైనా నిర్లక్ష్యం కారణంగా నష్టం కలిగితే బీమా పాలసీ ఇందుకు సంబంధించిన కవరేజీ కూడా అందిస్తుంది.

డైరెక్టర్లు మరియు ఆఫీసర్స్ ఎబిలిటీ ఇన్సూరెన్స్


అక్షర దోషాలు, తప్పు దోవ పట్టించే మరియు లోపాలతో కూడిన సమాచారం పంపడం వంటివి వ్యాపార సంస్థలో సాధారణంగా జరుగుతూ ఉంటాయి. స్వల్పకాలంలో ఇది సంస్థకి లాభాన్ని కలిగించవచ్చు కానీ దీర్ఘ కాలంలో బ్రాండ్ విలువను తగ్గిస్తుంది. తప్పుదారి పట్టించే అక్షర దోషం , విధిని ఉల్లంఘించడం ద్వారా సంస్థ పేరిట ఉద్యోగులు, అధికారులు చేసిన చట్టపరమైన వాదనల నుంచి డైరెక్టర్ మరియు అతని కంపెనీని రక్షించడానికి ఈ విధానం రూపొందించబడింది.

ఆఫీస్ ప్యాకేజీ విధానం


ఈ జాతీయ బీమా పాలసీ ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, దోపిడీ, పోటీదారుల ఉద్దేశపూర్వక హాని వంటి వివిధ బెదిరింపులకు గురయ్యే ప్రాంతంలో ఏర్పడిన కార్యాలయ సంస్థలకు ఈ బీమా పథకం వర్తిస్తుంది. ఈ సంఘటనలు భవనాలు, గోడల కంచెలు, క్యాంటీన్ శానిటరీ ఫిట్టింగులు, కార్యాలయ యంత్రాలు, ఎలక్ట్రిక్ ఉపకరణాలు, కార్యాలయ పత్రాలు, దుస్తులకు మొదలైన వాటి వల్ల కలిగే నష్టాలకు బీమా పథకం కవరేజీ అందిస్తుంది.

ఉత్పత్తి బాధ్యత


థర్డ్ పార్టీ ఆస్తికి నష్టానికి ఈ బీమా కవరేజీ అందిస్తుంది. పాలసీదారుడు ఉత్పత్తి చేసి మరియు తయారు చేసిన ఉత్పత్తిలో లోపాలు కారణంగా మరణం లేదా గాయపడితే బీమా పాలసీ కవరేజీ అందిస్తుంది.

వ్యాపార్ సురక్షా విధానం


రిటైల్, షాపింగ్ మాల్స్, ఆర్కేడ్లు, షోరూమ్ లు, హైపర్ మార్కెట్లు, జంక్షన్లు మొదలైన వ్యాపారంలో పాలు పంచుకుంటున్న పెద్ద వ్యాపారులకు ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది.

హౌస్ బ్రేకింగ్, దొంగతనం, దోపిడి, అగ్ని మరియు అనుబంధ ప్రమాదాల కారణంగా సంభవించే నష్టాలకు బీమా కవరేజీ అందిస్తుంది. ఉగ్రదాడులు, రవాణా సమయంలో కలిగే నష్టాలకు కూడా కవర్ అందిస్తుంది.

ప్రజా బాధ్యత( పారిశ్రామిక/ పారిశ్రామికేతర నష్టాలు) పాలసీ


ఇది పారిశ్రామిక లేదా పారిశ్రామికేతర వ్యాపారం అయినా చుట్టుపక్కల నివసించే పరిసరాలపై ఎల్లప్పుడూ ప్రభావం చూపుతుంది. ఈ పాలసీ వ్యాపారంలో జరిగే రోజువారీ కార్యకలాపాలు ద్వారా థర్డ్ పార్టీ లేదా అతని ఆస్తికి నష్టం కలిగితే అందుకు బీమా పాలసీ కవరేజీ అందిస్తుంది.

పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ


ఒక ప్రాంతం యొక్క వాతావరణాన్ని ప్రభావితం చేసే ప్రమాదకర పదార్థాల ఉత్పత్తి చేసే వ్యాపారానికి ఈ బీమా పథకం సరిగ్గా సరిపోతుంది. ప్రమాదకర పదార్థం తయారీ ద్వారా థర్డ్ పార్టీ ఆస్తికి లేదా వ్యక్తి కి నష్టం కలిగితే ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది. వ్యాపారాన్ని నిర్వహించే తయారీ దారులు, రవాణా దారులు,గోడౌన్/ గిడ్డంగి యజమానులు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన విధంగా పాలసీని తీసుకోవడం తప్పనిసరి.

వైద్య సంస్థల కోసం వృత్తి పరమైన నిర్లక్ష్యం లోపాలు మరియు మినహాయింపు బీమా విధానం


ప్రజల మెరుగైన ఆరోగ్య కోసం వైద్య సేవలను అందించడంలో పాల్గొన్న వైద్య సంస్థలకు ఈ పాలసీ అందుబాటులో ఉంది.ఈ పాలసీ కింద థర్డ్ పార్టీ వ్యక్తికి చికిత్స సమయంలో లోపాలు, వైద్య నిపుణుల నిర్లక్ష్యం, నర్సుల నిర్లక్ష్యం కారణంగా నష్టం కలిగితే ఈ బీమా పాలసీ థర్డ్ పార్టీకి చెల్లింపు చేస్తుంది.

వైద్యులు మరియు వైద్య నిపుణులకు వృత్తిపరమైన నష్టపరిహారం


ఒక వైద్య నిపుణుడు పెషేంట్ కు చికిత్స అందిస్తున్న సమయంలో ఏదైన పొరపాటు కారణంగా సదరు పెషేంట్ కు నష్టం కలిగితే ఈ బీమా పాలసీ కింద కవరేజీ అందించబడుతుంది. వైద్యులు, స్పెషలిస్టులు, కన్సల్టెంట్స్, సర్జన్లు మాత్రమే ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు.

విశ్వసనీయ బీమా


యజమాని లేదా వ్యవస్థాపకుడు వ్యాపార అభివృద్ధి కోసం నియమించిన ఉద్యోగుల అవిశ్వాసం కారణంగా మోసపోయే ప్రమాదముంది. ఈ బీమా ఉద్యోగులు, క్యాషియర్, అకౌంటెంట్లు, స్టోర్ కీపర్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఉద్యోగి నిర్వహిస్తున్న ఖాతాలు ఫోర్జరీ మరియు అపసంహరణకు గురైతే యజమానికి కవరేజ్ లభిస్తుంది.

మనీ ఇన్సూరెన్స్


ఒక ప్రదేశం నుంచి మరోక ప్రదేశానికి డబ్బు తరలించినప్పుడు డబ్బు పోయే ప్రమాదముంది. ఈ బీమా పాలసీ ఇందుకు సంబంధించిన కవరేజీ అందిస్తుంది. డబ్బు దొంగతనం, దోపిడి లాంటి వ్యాపారంలో భారీ నష్టానికి కారణం అవుతాయి. ఈ బీమా పాలసీని కొనుగోలు చేయడం పొందడం ద్వారా మీరు ఈ నష్టాల నుంచి మీరు రక్షణ పొందవచ్చు.

ఈ బీమా పాలసీ పొందాలంటే సంస్థ కౌంటర్ మరియు అకౌంట్ పుస్తకాలు, గది తాళాలను కలిగి ఉండాలి. అలాగే బీమా పొందాలంటే మరో షరతు ఏంటంటే డబ్బును సెక్యూరిటీ గార్డు పర్యవేక్షణలో ఉంచడం.

దోపిడి నుంచి రక్షణకు బీమా


ఒక భారీ స్టాక్, స్టాక్ -ఇన్- ట్రేడ్, విలువైన వస్తువులు, వస్త్రాలు వంటి స్పష్టమైన కదిలే ఆస్తులకు ఈ బీమా పాలసీ వర్తిస్తుంది. ఈ కవరేజీ అర్హత పొందడానికి, సంస్థ ఆస్తుల ఉన్న ప్రాంగణంలో సిసిటివి మరియు ఇతర భద్రత పరమైన చర్యల చేపట్టాల్సి ఉంటుంది.

క్యారియర్ల యొక్క చట్టపరమైన బాధ్యత


 ఈ బీమా కవరేజ్ వస్తువులు మరియు సరుకును రవాణా ా చేయాల్సిన వాహకాల యొక్క చట్టపరమైన బాధ్యతను తగ్గిస్తుంది. సరుకు రవాణా సమయంలో ఏదైనా నష్టం కలిగితే ఈ బీమా పథకం ఆర్థిక సహాయం అందిస్తుంది. అగ్ని, దోపిడీ, దొంగతనం, అల్లర్లు, సమ్మె, వరద లేదా నీరు వల్ల సరుకులకు నష్టం కలిగితే బీమా కవరేజీ అందిస్తుంది. అలాగే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కలిగే నష్టాలకు కూడా ఈ పాలసీ కవరేజీ అందిస్తుంది.

కమర్షియల్ జనరల్ బాధ్యత


 ఇది రెండు విధానాల ప్రయోజనాన్ని అందిస్తుంది. అవి ప్రజా బాధ్యత మరియు ఉత్పత్తి బాధ్యత. ఈ కవర్ తయారీ సంస్థలు/ పారిశ్రామిక ప్రాంగణాలు, గోదాములు, గిడ్డంగులు, పాఠశాలలు, క్లబులు, రెస్టారెంట్లు, బిపివో, హోటల్లు వంటి తయారీయేతర సంస్థలకు వర్తిస్తుంది. ఉత్పాదక కార్యకలాపాలు కారణంగా థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ఆస్తికి నష్టం కలిగితే ఈ బీమా కవరేజీ అందిస్తుంది.

జాతీయ ఇన్సూరెన్స్ సంస్థ యొక్క క్లైయిమ్ సెటిల్‌మెంట్ విధానం

 • నష్టం/ హస్పిటలైజేషన్ తరువాత సంస్థకు వెంటనే తెలియజేయాలి. పాలసీదారుడు బీమా మంజూరు చేసిన కార్యాలయానికి క్లైయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
 • క్లైయిమ్ నష్టం/ డ్యామేజీకి సంబంధించినది అయితే పాలసీదారుడు సమీప పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.
 • అగ్ని, దోపిడి, దొంగతనం , థర్డ్ పార్టీ నష్టం, ప్రమాదం మొదలైన కారణాల వల్ల నష్టం జరగవచ్చు. యాక్ట్ గాడ్ కింద కాకుండా ఇతర నష్టాలు ఉదాహరణకు వరదలు, భూకంపాలు వల్ల కలిగే నష్టాలకు కూడా క్లైయిమ్ చేసుకోవచ్చు .
 • నేషనల్ ఇన్సూరెన్స్ ఇండియా సంస్థ సమీప శాఖ నుండి సంబంధిత క్లైయిమ్ ఫారమ్ ను సేకరించండి.
 • క్లైయిమ్ ఫారంని నింపేటప్పుడు ఖచ్చితమైన వివరాలు ఇవ్వండి, అపై అవసరమైన పత్రాలను జత చేసి క్లైయిమ్ ఫారమ్ ను సమర్పించండి.
 • పత్రాలు నేరుగా లేదా అధీకృత ఏజెంట్ సహాయంతో సమర్పించవచ్చు. పోలీసుల నివేదికలు, వైద్యుల ప్రిస్కిప్షన్లు, మెడికల్ టెస్టుల నివేదికలు, సర్జన్ జారీచేసిన రశీదులు, ఎఫ్ఐఆర్, ప్రమాదం యొక్క ఫొటోలు, బైక్/ కార్ యొక్క ఆర్ సి వంటి అవసరమైన ఇతర పత్రాలను పాలసీదారుడు సమర్పించాల్సి ఉంటుంది.
 • క్లైయిమ్ నివేదించబడిన బీమా సంస్థ నివేదికను అంచనా వేయడానికి కేస్ మేనేజర్/ లాస్ అడ్మినిస్ట్రేటర్ ను నియమిస్తుంది. నివేదిక తర్వాత తుది నిర్ణయాన్ని తెలుపుతుంది.
 • అటు తర్వాత క్లైయిమ్ సెటిల్ చేయబడుతుంది మరియు పాలసీదారుడు క్లైయిమ్ చేసిన మొత్తాన్ని పొందుతారు.
 • కొన్ని కేసుల్లో , కేసును బట్టి క్లైయిమ్ యొక్క తుది ప్రాసెసింగ్ పెండింగ్ లో ఉన్న పాలసీదారునికి తాత్కాలిక చెల్లింపు జరుగుతుంది.

గమనిక*: పైన అందించిన సమాచారం, దశల వారీగా క్లైయిమ్ విధానాన్ని వివరించడం జరిగింది. ఇది సాధారణ బీమా పథకాలకు జరిగే ప్రక్రియ నిర్దిష్ట బీమా పథకాల విషయంలో క్లైయిమ్ విధానం వేరుగా ఉంటుంది.

నేషనల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ పునరుద్దరణ విధానం

వినియోగదారుల యొక్క సౌలభ్యం కోసం నేషనల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ పునరుద్దరణ ప్రక్రియను సులభతరం చేసింది. వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చులు చెల్లించకుండా, ఇబ్బందులు లేకుండా సులభంగా పాలసీ పునరుద్దరణ చేసుకోవచ్చు.

 • వినియోగదారుడు మొదట నేషనల్ ఇన్సూరెన్స్ వెబ్ సైటును సందర్శించాలి, అక్కడ మెనూబారులో పునరుద్దరణ ఆప్షన్ ఎంచుకోవాలి.
 • మౌస్ పాయింటర్ ను ఆప్షన్ పైకి తరలించి క్లిక్ చేయాలి. అటు తర్వాత పేజీ పునరుద్దరణ విభాగానికి రీడైరెక్ట్ చేయబడుతుంది.
 • పునరుద్దరణ పత్రంలో అవసరమైన వివరాలు- పేరు, పాలసీ నంబర్, ఈ మెయిల్, చిరునామా వంటి వివరాలను సమర్పించండి.
 • పూర్తి వివరాలు నింపిన తరువాత డెబిట్/ క్రెడిట్ కార్డులు లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి అవసరమైన ప్రీమియం మొత్తాన్ని చెల్లించండి.
 • మీ పాలసీ పునరుద్దరించబడింది మరియు పేమెంట్ రశీదు, పాలసీ పునరుద్దరణ పత్రం రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి పంపబడుతుంది.
 • భవిష్యత్తులో పాలసీ క్లైయిమ్ చేయడానికి పాలసీదారుడు చెల్లింపు రశీదును డౌన్ లోడ్ చేసుకోవాలి మరియు ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

నేషనల్ ఆరోగ్య బీమా కోసం అవసరమైన పత్రాలు

 • పూర్తిగా నింపబడిన క్లైయిమ్ దరఖాస్తు.
 • బిల్లులు, చెల్లింపు రశీదులు, మెడికల్ హిస్టరీ పత్రాలు, డిశ్చార్జి సర్టిఫికేట్, ఇతర అవసరమైన పత్రాలు.
 • సరైన ప్రిస్క్రిప్షన్, వైద్యుని చేత గుర్తింపు పొందిన నగదు మోమె.
 • వైద్య నిపుణుడు నిర్దారించిన రోగ నిర్థారణ నివేదికలు, రశీదులు, ప్రిస్క్రిప్షన్లు
 • సర్జన్ సర్టిఫికేట్, శస్త్ర చికిత్స కు సంబంధించిన పత్రాలు, సహా సర్జన్ ఖర్చులకు సంబంధించిన పత్రాలు.
 •  నివాస చికిత్స ఖర్చుల రశీదు( ఇంట్లో చికిత్స తీసుకుంటే)

నేషనల్ మోటరు బీమా క్లైయిమ్ కోసం అవసరమైన పత్రాలు

 • క్లైయిమ్ దరఖాస్తు ఫారం
 • రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫోటో కాపీ
 • ప్రమాదం జరిగిన సమయంలో కారు/ బైక్, వాణిజ్య వాహనాన్ని నడుపుతున్న వాహన యజమాని డ్రైవింగ్ లైసెన్స్
 • మరమ్మతు ఖర్చుల రశీదు
 • వాణిజ్య వాహనాల విషయంలో పర్మిట్ మరియు ఫిట్ నెస్ సర్టిఫికేట్ కాపీ
 • దొంగతనం కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నివేదిక, పోలీసుల తుది దర్యాప్తు నివేదిక.

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ రివ్యూలు

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి వినియోగదారులు ఏమనుకుంటున్నారు? . ప్రస్తుత వినియోగదారుల రివ్యూలు, కొత్తగా పాలసీ కొనుగోలు చేసే వారికి కొంత వరకు సహాయపడతాయి. నేషనల్ ఇన్సూరెన్స్ సంస్థ రివ్యూలను పరిశీలిస్తే.. కంపెనీ సాధారణ మరియు నిర్దిష్ట బీమా సేవలను అందించడంలో నిజమైన ఇమేజ్ మరియు ఎక్సలెన్సు ను ఏర్పాటు చేసుకుంది.

సంస్థ యొక్క క్లైయిమ్ సంతృప్తి నిష్పత్తి 104 శాతంగా ఉంది. ఇది విశ్వసనీయమైన కస్టమర్ల విలువను ప్రతిబింబిస్తుంది మరియు కస్టమర్ల సంతృప్తిని తెలియజేస్తుంది. ఇప్పటి వరకు నేషనల్ ఇన్సూరెన్స్ సంస్థ బిలియన్ల పాలసీలను విక్రయించింది. కంపెనీ అందిస్తున్న సేవలకు సంతృప్తి చెందిన పాలసీదారులు మరలా పునరుద్దరణ కోసం తిరిగి వస్తుంటారు.