న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థ
 • చౌకైన కారు బీమా కొనండి
 • కారు భీమాను ఆన్‌లైన్‌లో పునరుద్ధరించండి
 • మూడవ పార్టీ మరియు యాడ్-ఆన్ కవర్
PX step

కారు బీమా కొటేషన్లను ఆన్లైన్లో పోల్చుకోండి

లేదా

జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల్లో న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థకి ప్రత్యేక స్థానం ఉంది. ఇది ప్రభుత్వ యాజమాన్యంలో నిర్వహించబడుతున్న సంస్థ. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది మరియు ప్రపంచంలోని 28 దేశాల్లో వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తోంది. జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల్లో న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థని పేరుగాంచిన సంస్థగా చెప్పుకోవచ్చు.

జులై 23, 1919 వ సంవత్సరంలో డోరబ్జీ టాటా న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థని స్థాపించారు. 5 సంవత్సరాల పాటు విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహించిన తర్వాత, ఈ సంస్థ జాతీయం చేయబడింది. విశిష్టమైన సేవలు మరియు విస్తృత సేవలు అందిస్తూ భారతదేశ బీమా పరిశ్రమలో న్యూ ఇండియా అస్యూరెన్సు సంస్థ ప్రత్యేక గుర్తింపు పొందింది. మార్చి 2017 సంవత్సరంలో రూ. 22,270 కోట్ల వ్యాపారాన్ని చేసింది. భారతదేశంలో ఈ సంస్థ 1339 మైక్రో ఆఫీసులతో సహా మొత్తం 2452 కార్యాలయాలు కలిగి ఉంది. జూన్ 30, 2017 సంవత్సరానికి సంస్థలో 17702 మంది ఉద్యోగులను మరియు 68389 ఏజెంట్లను పనిచేస్తున్నారు.

న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థ వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తుంది. జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు అందించే అన్ని రకాల బీమా పథకాలను న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థ అందిస్తుంది. ప్రస్తుతం సంస్థ 230 రకాల బీమా ఉత్పత్తులను అందిస్తోంది. ఇది వినియోగదారుల అవసరాల మేరకు సమర్థవంతమైన ప్రణాళికలు అందిస్తుంది. ప్రాథమిక పథకాలతో పాటు, మైక్రో, గ్రామీణ మరియు సామాజిక రంగాలకు సంబంధించిన పథకాలను కూడా అందిస్తోంది. ప్రభుత్వ అనుసంధాన సంస్థ కాబట్టి, ప్రభుత్వ అనుసంధాన పాలసీలను సులభంగా పొందవచ్చు.

న్యూ ఇండియా అస్యూరెన్స్ గణాంకాలు

కంపెనీ 1919 సంవత్సరంలో తన వెంచర్ ని ప్రారంభించింది. ప్రస్తుతం 28 దేశాలలో సంస్థ కార్యాలయాలు కలిగి ఉంది, వీటిలో బ్రాంచ్ ఏజెన్సీ, కార్యాలయాలు, అసోసియేట్ లు మరియు మరెన్నో ఉన్నాయి. సింగపూర్, లోర్డాన్, కెన్యా మరియు సౌదీ అరేబియాలో ఉన్న అనేక విభిన్న సంస్థలలో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ వాటా కలిగి ఉంది. జపాన్ మరియు మారిషస్ లో కూడా సంస్థ వ్యాపారాన్ని కలిగి ఉంది. 

న్యూ ఇండియా అస్యూరెన్స్ అనుబంధ సంస్థలను సైతం కలిగి ఉంది. వాటిలో ఒకటి నైజీరియాలోని లాగోస్ లో ఉంది, దీనిని ప్రెస్టీజ్ అస్యూరెన్స్ పిఎల్ సి అని పిలుస్తారు. మరో అనుబంధ సంస్థ ట్రినిడాడ్& టోబాగోలో ఉంది. సౌదీ అరేబియాకు చెందిన WAFA ఇన్సూరెన్స్ సంస్థలో న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థ వాటాదారుగా ఉంది.

న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థ వాటాను కలిగి ఉన్న ఇతర బీమా సంస్థలు- కెనిండియా అస్యూరెన్స్ కో లిమిటెడ్ నైరోబి, ఇండియా ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ , సింగపూర్ మరియు అసియా రీఇన్సూరెన్స్ ఎంటర్ ప్రైజ్.

న్యూ ఇండియా అస్యూరెన్స్ జపాన్ మినహా మొత్తం ఆఫ్రో- ఆసియా ప్రాంతంలో విస్తృతమైన బీమా నెట్ వర్క్ కలిగి ఉంది.

న్యూ ఇండియా అస్యూరెన్స్- ప్రొడక్ట్స్&సర్వీసెస్ 

ఎన్ఐఏ కో. లిమిటెడ్ సమాజంలోని వివిధ వర్గాల అవసరాలకు అనుగుణంగా అనేక బీమా పథకాలను అందిస్తోంది. సంస్థ అందిస్తున్న, ప్రజాదరణ పొందిన కొన్ని ప్రణాళికలు గురించి తెలుసుకుందాం...

మెడికల్ ఇన్సూరెన్స్

ఆరోగ్య బీమా అనేది చాలా ప్రభావవంతమైన బీమా పథకం. కఠినమైన వైద్య అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి ఈ బీమా పథకం సహాయం చేస్తుంది. అలాగే ఆర్థికంగా రక్షణ కల్పిస్తుంది. ఆరోగ్య బీమా పాలసీలు బీమా చేసిన వారితో పాటు కుటుంబానికి కూడా పూర్తి భద్రత అందిస్తాయి. మీ అవసరాలను మరియు ధరలను దృష్టిలో ఉంచుకుని. మీరు ఆరోగ్య బీమా పథకాన్ని కొనుగోలు చేయవచ్చు. అత్యవసర సమయంలో చికిత్సకు మీ జేబు నుంచి డబ్బు ఖర్చుపెట్టకుండా, నాణ్యమైన చికిత్స అందించడంలో ఈ ఆరోగ్య బీమా మీకు సహాయం చేస్తుంది.

మోటర్ బీమా 

భారత దేశ చట్టాల ప్రకారం వాహనదారులు మోటర్ బీమా కలిగి ఉండటం తప్పనిసరి. బీమా కవరేజీ లేకుండా వాహనాన్ని నడిపితే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. మీ కారు లేదా బైక్ కు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే మోటర్ బీమా ఆర్థిక రక్షణ కల్పిస్తుంది.

న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థ ప్లాన్స్

నెం

న్యూ ఇండియా ప్లాన్స్

1

న్యూ ఇండియా గ్లోబల్ మెడి క్లైయిమ్ పాలసీ

2

న్యూ ఇండియా టాప్ ఆప్ మెడిక్లైయిమ్ న్యూ

3

న్యూ ఇండియా ఆశా కిరణ్ పాలసీ

4

క్యాన్సర్ మెడికల్ ఎక్స్ ప్న్- వ్యక్తిగత

5

జూన్ ఆరోగ్య బీమా పాలసీ

6

సీనియర్ సిటిజన్ మెడిక్లైయిమ్ పాలసీ

7

బిపిఎల్ కుటుంబాల కోసం యూనివర్స్ ల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం

8

ఎపిఎల్ కుటుంబాల కోసం యూనివర్స్ ల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం

9

న్యూ ఇండియా మెడిక్లైయిమ్ 2012 పాలసీ

10

న్యూ ఇండియా మెడిక్లైయిమ్ 2007 పాలసీ

11

న్యూ ఇండియా జనతా మెడిక్లైయిమ్ పాలసీ 

12

ఫ్యామిలీ ఫ్లోటర్ మెడిక్లైయిమ్ పాలసీ

13

రాస్తా అపట్టి కవాచ్ (రోడ్ సేప్టీ ఇన్సూరెన్స్

14

న్యూ ఇండియా గ్రూప్ మెడిక్లైయిమ్ పాలసీ

15

మోటర్ పాలసీ

16

సుహానా సఫర్ 17 ఓవర్సీస్

17

ఓవర్సీస్ మెడిక్లైయిమ్ (ఇఎస్)

18

ఓవర్సీస్ మెడిక్లైయిమ్(బస్& హోల్)

1. న్యూ ఇండియా ఆరోగ్య బీమా పథకాలు


i. న్యూ ఇండియా గ్లోబల్ మెడిక్లైయిమ్ పాలసీ

8 లక్షలు మరియు అంతకంటే ఎక్కువ బీమా మొత్తంలో ఆరోగ్య బీమా పాలసీ ఉన్నవారి కోసం  ఈ బీమా రూపొందించబడింది. బేస్ పాలసీ లభ్యత లేకపోయినా, ఈ బీమా యొక్క క్లైయిమ్ లేదా పునరుద్దరణకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థలో ఆరోగ్య బీమా కలిగి ఉంటే ప్రీమియంలో 5 శాతం తగ్గింపు ఉంటుంది.

 ఫీచర్లు

మెడికల్ రెండవ అభిప్రాయం

 • వరల్డ్ లీడింగ్ మెడికల్ సెంటర్ లో అడ్మిట్ అయిన వారికి మాత్రమే. ఈ బీమా పథకం భారతదేశం బయట మాత్రమే చికిత్సకు కవరేజీ అందిస్తుంది.
 • క్రింది జాబితాలో పేర్కొనబడిన నిర్దిష్ట చికిత్స కోసం
 • చికిత్స ఖర్చుల కోసం కవరేజీ
  1. ప్లాన్ A జీవిత కాల పరిమితి 1 మిలియన్ డాలర్లు, సంవత్సరానికి 0.5 మిలియన్ డాలర్లు
  2. ప్లాన్ B జీవిత కాల పరిమితి 2 మిలియన్ డాలర్లు, సంవత్సరానికి 1 మిలియన్ డాలర్లు

కింది సేవలను కలిగి ఉంటుంది

 • ప్రయాణ వ్యయం సంవత్సరానికి ఒక వ్యక్తికి రూ. 3,000 డాలర్లు వరకు
 • ఒక సహచరుడి ప్రయాణ ఖర్చు కూడా కవర్ చేయబడుతుంది.(పైన పేర్కొన్న పాయింట్(ఎ) పరిమితులు వర్తిస్తాయి.)
 • విమానాశ్రయం పికప్ యొక్క వాస్తవ వ్యయం.
 • రోజు వసతి ఖర్చు 330 USD వరకు, పాలసీ వ్యవధికి గరిష్టంగా 30 రోజులు.
 • అనువాద సహాయం
 • మృత్యు అవశేషాలను స్వదేశానికి రప్పించడం కోసం - బీమా చేసిన వారికి 1500 USD వరకు పరిమితి.
 • అవయవ దాత ప్రయాణానికి, వసతి మరియు ఇతర ఖర్చులు కవర్ చేయబడతాయి.

ii. న్యూ ఇండియా టాప్ అప్ మెడిక్లైయిమ్ న్యూ

న్యూ ఇండియా టాప్ అప్ మెడిక్లైయిమ్ న్యూ, ప్రాథమికంగా హెల్త్ టాప్ అప్ పాలసీ. ఇది ప్రస్తుత ఆరోగ్య బీమా పాలసీకి టాప్ అప్ కవరేజీని అందిస్తుంది. ఈ బీమా పథకం మీరు ప్రాథమిక ఆరోగ్య బీమా నుంచి వైద్య ఖర్చులకు చెల్లింపులు జరిపిన తర్వాత అదనంగా ఇంకా చెల్లించాల్సి వస్తే ఈ బీమా పథకం కింద చెల్లింపులు జరుగుతాయి. ప్రాథమిక ఆరోగ్య బీమా పథకం యొక్క పరిమితి అయిపోయినప్పుడు, ఈ టాప్ అప్ బీమా పథకం ఉనికిలోనికి వస్తుంది.

ఫీచర్లు

 1. కుటుంబ సభ్యులను ఒక పాలసీ కింద కవర్ చేయవచ్చు.
 2. అనుకోని సంఘటనలు
 3. 50 సంవత్సరాల వయసు తర్వాత పాలసీ తీసుకునేవారందరికీ వైద్య పరీక్షలు అవసరం.
 4. ఆసుపత్రిలో చేరడానికి ముందు 30 రోజులు మరియు ఆసుపత్రిలో చేరిన 60 రోజుల తర్వాత సంబంధిత వైద్య ఖర్చులు చెల్లించబడతాయి.
 5. పాలసీ భారతదేశంలో మాత్రమే అందించే చికిత్సకు లేదా సేవలకు వర్తిస్తుంది.

iii. న్యూ ఇండియా ఆశా కిరణ్ పాలసీ

న్యూ ఇండియా ఆశా కిరణ్ పాలసీ, న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థ అందిస్తున్న మరో ప్రభావంతమైన పాలసీ. ఈ సమర్థవంతమైన ఆరోగ్య బీమా పథకం కుటుంబం యొక్క ఆసుపత్రి ఖర్చులు మరియు తల్లిదండ్రులకు వ్యక్తిగత ప్రమాద కవరేజీ అందిస్తుంది. ఇది సమర్థవంతమైన బీమా ప్రణాళిక, మీకు అవసరమైన సమయంలో ఆర్థికంగా మద్దతు ఇస్తుంది.

ఫీచర్లు

బీమా పథకం ఈ క్రింది హస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేస్తుంది..

 1. గది అద్దె/ బోర్డింగ్/ నర్సింగ్ ఖర్చులు మరియు ఇతర ఖర్చులు పాలసీలో పేర్కొన్న విధంగా బీమా చేసిన మొత్తంలో రోజుకు 1 శాతం వరకు లభిస్తుంది. నర్సింగ్ కేర్, ఆర్ఎంఓ ఛార్జీలు, ఫ్లూయిడ్స్, బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్, ఇంజెక్షన్ , అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు లభిస్తాయి.
 2. బీమా మొత్తంలో రోజుకు 2 శాతం వరకు ఐసియూ ఖర్చులకు లభిస్తాయి.
 3. సర్జన్, అనస్థీసిట్, మెడికల్ ప్రాక్టీషనర్, కన్సల్టెంట్స్, స్పెషలిస్టు ఫీజు
 4. రక్తం, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్ ఛార్జీలు, శస్త్ర చికిత్సా ఉపకరణాలు, మందులు, డయాగ్నొస్టిక్ మెటీరియల్స్ మరియు ఎక్స్ రే, డయాలసిస్, కెమోథెరపీ, రేడియోథెరప్పీ కృత్రిమ అవయవాల ఖర్చు, పేస్ మేకర్, సంబంధిత ప్రయోగశాల విశ్లేషణ పరీక్షలు మొదలైన శస్త్రచికిత్సా సమయంలో అమర్చిన ప్రొస్తెటిక్ పరికరాలు మొదలైన ఖర్చులు.
 5. అవయవ మార్పిడికి సంబంధించి దాత కోసం అన్ని హస్పిటలైజేషన్ ఖర్చులు.
 6. కంటి శుక్లం క్లైయిమ్ విషయంలో సంస్థ బీమా మొత్తంలో 10 శాతం లేదా రూ. 50000 ఏది తక్కువ అయితే అది, ఒక్కో కంటికి తెలియజేస్తుంది.

iv. క్యాన్సర్ మెడిక్లైయిమ్ ఎక్స్ప్ - వ్యక్తిగత పాలసీ

బీమా చేసిన సభ్యులను మరియు అతని/ ఆమె జీవిత భాగస్వామిని కవర్ చేస్తుంది. పాలసీ కాల వ్యవధిలో పాలసీదారుడు లేదా జీవిత భాగస్వామి క్యాన్సర్ తో బారిన పడితే బీమా సంస్థ పాలసీ మొత్తాన్ని, రోగ నిర్థారణ ఖర్చు, బయాప్సీ, సర్జరీ, కెమోథెరపీ, రేడియో థెరపీ, హాస్పిటలైజేషన్ మరియు రిహాబిలిటేషన్ ఖర్చులను చెల్లిస్తుంది.

ఫీచర్లు

 1. బీమా పథకం ప్రకారం, బీమా చేసిన సభ్యుడు మరియు అతని జీవిత భాగస్వామికి పాలసీ కవరేజీ అందిస్తుంది. వీరిలో ఏవరైనా క్యాన్సర్ బారిన పడితే పాలసీ కింద జీవిత భాగస్వామికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే ఇతర సభ్యుడు అవసరమైన ఫార్మాలిటీలను పూర్తి చేయడం ద్వారా ఇండియన్ క్యాన్సర్ సొసైటీలో ఉచితంగా తాజా సభ్యత్వం పొందవచ్చు.
 2. బీమా చేసిన సభ్యునికి ఇండియన్ క్యాన్సర్ సొసైటీ అదనపు ప్రయోజనాన్ని అందిస్తుంది మరియు అతని/ ఆమె జీవిత భాగస్వామి ఒక్కసారి మాత్రమే క్యాన్సర్ చెకప్ చేయించుకుంటే సరిపోతుంది. అదనపు ఖర్చు లేకుండా 50 శాతం రాయితీతో తదుపరి చెకప్ చేయించుకోవచ్చు.
 3. అదనపు ప్రీమియం చెల్లింపుపై బీమా చేసిన వ్యక్తి యొక్క బీమా చేసిన వ్యక్తి యొక్క ఇద్దరు ఆధారపడిన పిల్లలను కవర్ చేయడానికి పాలసీని విస్తరించవచ్చు. ప్రతి బిడ్డకు ప్రత్యేక నష్టపరిహారం మంజూరు చేయబడుతుంది.
 4. పాలసీ అల్లోపతి చికిత్సకు మాత్రమే వర్తిస్తుంది.

v. జాన్ ఆరోగ్య బీమా పాలసీ

నిధుల కొరత కారణంగా నాణ్యమైన చికిత్సను పొందలేని తక్కువ ఆదాయ వర్గాల ప్రజలకు మరింత ప్రభావంతమైన చికిత్స అందించేందుకు ఈ బీమా పథకం రూపొందించబడింది. ఈ బీమా పాలసీ ధర కూడా చాల తక్కువ. ఇది పాలసీదారులకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుంది.

ఫీచర్లు

 1. ఈ బీమా పాలసీ సమాజంలోని పేద వర్గాలకు చౌకైన వైద్య బీమాను అందించడానికి రూపొందించబడింది. ప్రీమియం రూ. 10000/- వరకు ఉంటే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 డి కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. పాలసీకి సేవా పన్ను వర్తించదు.
 1. కవరేజీ వ్యక్తిగత మెడిక్లైయిమ్ తరహాలో ఉంటుంది తప్ప సంచిత బోనస్ మరియు మెడికల్ ప్రయోజనాలు చేర్చబడలేదు. పాలసీదారునికి బీమా చేసిన మొత్తం రూ. 5000 వరకు పరిమితం చేయబడింది.
 1. పాలసీ వ్యక్తిగతంగా మరియు కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటుంది. వయోపరిమితి 5 నుంచి 70 సంవత్సరాలు. మూడు నెలలు నుంచి 5 సంవత్సరాలు మధ్య వయసు కల పిల్లలకు కవరేజీ అందించవచ్చు.

vi. సీనియర్ సిటిజన్ మెడిక్లైయిమ్ పాలసీ

సీనియర్ సిటిజన్ మెడిక్లైయిమ్ పాలసీ సీనియర్ సిటిజన్స్ కోసం ఎన్ఐఏ చేత రూపొందించబడిన సమగ్ర ప్రణాళిక. సీనియర్ సిటిజన్ అవసరాలకు తగినట్లుగా ఈ బీమా పథకం రూపొందించబడింది. ఇది ఒక వ్యక్తి యొక్క చివరి రోజుల్లో అవసరమైన కవరేజీని అందిస్తుంది.

ఫీచర్లు

 1. అనారోగ్యం/ గాయం చికిత్స కోసం హాస్పిటలేజేషన్ ఖర్చులు.
 1. ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు వరుసగా 30 మరియు 60 రోజుల వరకు .
 1. అంబులెన్స్ ఛార్జీలు.
 1. ప్రభుత్వ, రిజిస్టర్డ్ ఆయుర్వేద, హోమియోపతి మరియు యూనాని ఆసుపత్రుల్లో చికిత్సకు పరిమిత కవరేజీ లభిస్తుంది.
 1. ముందుగా ఉన్న వ్యాధులకు బీమా తీసుకుని 18 నెలలు కాలం గడిచిన తర్వాత మాత్రమే కవరేజీ లభిస్తుంది.

vii. బిపిఎల్ కుటుంబాల కోసం యూనివర్సల్ ఆరోగ్య బీమా

అనారోగ్య / వ్యాధులు లేదా బీమా చేసిన వ్యక్తికి కలిగే గాయాల కోసం ఆసుపత్రిలో చేరే ఖర్చులకు సులభంగా కవరేజీ అందించే విధంగా ఈ పాలసీ రూపొందించబడింది. ఈ బీమా పథకం అత్యవసర వైద్య పరిస్థితిని పరిష్కరించడంలో సహాయపడుతుంది.

ఫీచర్లు

 1. హస్పిటలైజేషన్ ఖర్చులకు కవరేజీ
 1. సంపాదించే సభ్యునికి వ్యక్తిగత ప్రమాద కవరేజీ 
 1. కుటుంబ పెద్ద లేదా సంపాదించే సభ్యుడికి అంగవైకల్యం సంభవిస్తే అందుకు సంబంధించిన కవరేజీ లభిస్తుంది.

viii. ఎపిఎల్ కుటుంబాలకు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్

ఇది ఒక గ్రూప్ పాలసీ. ఇది గ్రూప్ అసోసియేషన్, ఇనిస్టిట్యూషన్ పేరుతో జారీ చేయబడుతుంది. అతని/ ఆమె అర్హత గల కుటుంబసభ్యులతో సహా సభ్యుల పేర్ల షెడ్యూల్ తో ( బీమా చేసిన వ్యక్తులు) పథకంలో భాగంగా పేర్కొనబడతాయి. ఈ బీమా పథకం విస్తృత కవరేజీతో వస్తుంది.

ఫీచర్లు

 1. 100 కంటే ఎక్కువ కుటుంబాలను కలిగి ఉన్న సమూహాలకు గ్రూప్ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అందుబాటులో ఉంటుంది. అర్హత గల సభ్యులందరినీ ఒకే గ్రూప్ పాలసీ కింద కవర్ చేయాలి. మరో మాటలో చెప్పాలంటే, అర్హత కలిగిన వివిధ వర్గాల వారు వివిధ పాలసీల పరిధిలో ఉండడానికి పాలసీ అనుమతించదు. పేరు లేని సమూహ పాలసీని జారీ చేయడానికి ఈ పాలసీ అనుమతించదు.
 1. పాలసీలో భాగమైన అతను/ ఆమె అర్హత గల కుటుంబ సభ్యులను( బీమా చేసిన వ్యక్తులు) సభ్యుల పేర్ల షెడ్యూల్ తో గ్రూప్ పాలసీ, గ్రూప్ అసోసియేషన్, ఇన్ స్టిట్యూషన్ పేరిట పాలసీ జారీ చేయబడుతుంది.
 1. బీమా చేసిన వ్యక్తికి అనారోగ్యం, వ్యాధుల లేదా గాయాల చికిత్సకు అయిన ఖర్చులను పాలసీ తిరిగి చెల్లిస్తుంది. పాలసీ ప్రకారం ఏదైనా క్లైయిమ్ ఆమోదయోగ్యమైన సందర్భంలో, టిపిఎ ద్వారా సంస్థ ఆసుపత్రి లేదా నర్సింగ్ హోముకు పరిమితులకు లోబడి చెల్లింపులు చేస్తుంది. పాలసీదారుడు భారతదేశంలో ఎక్కడైనా చికిత్స పొందవచ్చు. అయితే చికిత్స ఖర్చులు బీమా పరిథికి లోబడి ఉండాలి.

ix. న్యూ ఇండియా మెడిక్లైయిమ్ 2012 పాలసీ

న్యూ ఇండియా మెడిక్లైయిమ్ 2012 పాలసీ అనేది ఏన్ఐఏ చేత రూపొందించబడిన ప్రభావవంతమైన ఆరోగ్య బీమా పథకం. తక్కువ ధరలో మొత్తం కుటుంబానికి ఈ బీమా పథకం కింద కవరేజీ అందించవచ్చు. ఈ బీమా పథకంతో మీరు అన్ని రకాల అత్యవసర వైద్య పరిస్థితుల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ బీమా పథకం ద్వారా మీరు సమయానికి నాణ్యమైన చికిత్స పొందడం మీకు సులభం అవుతుంది.

x. న్యూ ఇండియా మెడిక్లైయిమ్ 2007 పాలసీ

న్యూ ఇండియా మెడిక్లైయిమ్ 2007 పాలసీ ఎన్ఐఏ చేత రూపొందించబడిన ప్రభావవంతమైన బీమా పథకం. ఇది మొత్తం కుటుంబానికి తక్కువ ధరలో కవరేజీ కల్పించే బీమా పథకం. ఈ బీమా పథకం సహాయంతో మీరు అన్ని రకాల అత్యవసర వైద్య పరిస్థితులను సులభంగా ఎదుర్కోవచ్చు. విస్తృత కవరేజీతో, సమయానికి నాణ్యమైన చికిత్స పొందడం మీకు సులభం అవుతుంది.

xi. న్యూ ఇండియా జనతా మెడిక్లైయిమ్ పాలసీ

న్యూ ఇండియా జనతా మెడిక్లైయిమ్ పాలసీ సమర్థవంతమైన ఆరోగ్య బీమా పథకం. ఏదైనా అత్యవసర వైద్య పరిస్థితుల సమయంలో వైద్య అవసరాలను తీర్చడానికి ఈ పథకం రూపొందించబడింది. ఇది మొత్తం కుటుంబానికి తక్కువ ధరతో కవరేజీ అందిస్తుంది.

xii. ఫ్యామిలీ ఫ్లోటర్ మెడిక్లైయిమ్ పాలసీ

 ఫ్యామిలీ ఫ్లోటర్ మెడిక్లైయిమ్ పాలసీ సమర్థవంతమైన ఆరోగ్య బీమా పథకం. పాలసీదారుని అత్యవసర వైద్య అవసరాలను తీర్చడానికి ఈ పథకం రూపొందించబడింది. మొత్తం కుటుంబానికి తక్కువ ధరలో కవరేజీ అందిస్తుంది. ఇది డబ్బు అదా చేయడంలో చాలా సహాయపడుతుంది.

xiii. రాస్తా అపట్టి కవచ్(రోడ్ సేఫ్టీ ఇన్సూరెన్స్)

ఎన్ఐఏ విస్తృత మరియు సమర్థవంతమైన మోటారు మరియు బైక్ బీమా లను అందిస్తుంది. రాస్తా అపట్టి కవచ్ పాలసీ బీమా చేసుకున్న వారికి విస్తృత ప్రయోజనాలను మరియు పూర్తి కవరేజీని అందిస్తుంది. ఈ పాలసీ నష్టం, దొంగతనం మరియు వివిధ రకాల ప్రమాదాల నుంచి పాలసీదారునికి కవరేజీ అందిస్తుంది.

xiv. న్యూ ఇండియా గ్రూప్ మెడిక్లైయిమ్ పాలసీ

న్యూ ఇండియా గ్రూప్ పాలసీ సమర్థవంతమైన ఆరోగ్య బీమా పాలసీ. ఏదైనా అత్యవసర వైద్య పరిస్థితులను ఎదుర్కోవడానికి పాలసీదారునికి ఇది అవకాశం కల్పిస్తుంది. మొత్తం కుటుంబానికి తక్కువ ధరలో ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది.

2. న్యూ ఇండియా కారు బీమా


i. వాణిజ్య వాహనం

 వాహన యజమానులందరూ బీమా పాలసీ తీసుకోవడం తప్పనిసరి. ప్రమాదవశాత్తు థర్డ్ పార్టీ వ్యక్తి మరణం లేదా ఆస్తి నష్టానికి వాహన యజమాని బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి బీమా పాలసీ కలిగి ఉండటం అనేది అత్యవసరం.

అందుబాటులో ఉన్న కవరేజీ రకాలు

 1. థర్డ్ పార్టీ బాధ్యతను కవర్ చేసే పాలసీ -ఇది థర్డ్ పార్టీ వ్యక్తి మరణం లేదా గాయపడటం, ఆస్తినష్టానికి కవరేజీ అందిస్తుంది. యజమాని- డ్రైవర్ కోసం వ్యక్తిగత ప్రమాద కవరేజీని కూడా ఈ పాలసీ అందిస్తుంది.
 1. ప్యాకేజీ పాలసీ- ఈ బీమా దెబ్బతిన్న/ నష్టపోయిన వాహనానికి కవరేజీ అందిస్తుంది.

ii. ప్రైవేట్ కారు

ప్రభుత్వ రహదారుల పై ప్రయాణించే ప్రతి వాహన యజమాని బీమా పాలసీని కలిగి ఉండటం తప్పనిసరి. థర్డ్ పార్టీ వ్యక్తి మరణం లేదా గాయపడటం, ఆస్తినష్టానికి వాహనదారుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది. బీమా పాలసీ వీటికి కవరేజీ అందిస్తుంది.

iii.మోటర్ పాలసీ

ఎన్ఐఏ ఈ ప్రతిభావంతమైన మోటర్ పాలసీ కింద, మీకు రెండు రకాలైన కవరేజీలను అందిస్తుంది, అవి బాధ్యత మరియు ప్యాకేజీ కవర్. రెండూ పాలసీ విస్తృత కవరేజీ మరియు ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

iv. సుహానా సఫర్

సుహానా సఫర్ అనేది ఎన్ఐఏ చేత రూపొందించబడిన సమర్థవంతమైన మోటర్ బీమా ప్రణాళిక. ఈ బీమా పాలసీ కింద మీరు విస్తృత కవరేజీ ప్రయోజనాలు పొందుతారు మరియు ఈ పాలసీ తక్కువ ధరకే లభిస్తుంది. ఈ బీమా పాలసీ యొక్క అనేక ప్రయోజనాల కారణంగా కొనుగోలు దారుల ఎంపికలో ఇది ముందు వరుసలో ఉంటుంది.

అందుబాటులో ఉన్న కవరేజీ రకాలు

 1. బాధ్యత - థర్డ్ పార్టీ వ్యక్తి మరణం, గాయపడటం, ఆస్తికి నష్టం కలిగితే ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది. యజమాని- డ్రైవర్ కోసం కూడా ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది.
 1. ప్యాకేజీ పాలసీ- దెబ్బతిన్న వాహనానికి ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది.

3. ట్రావెల్ ఇన్సూరెన్స్


i. ఓవర్సీస్ మెడిక్లైయిమ్

 బీమా చేసిన వ్యక్తులు భారతదేశం బయట గాయపడటం లేదా అనారోగ్యం, వ్యాధులకు అయ్యే చికిత్సకు ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది.

అర్హత

 • వయోపరిమితి 6 నెలల నుంచి 70 సంవత్సరాల వరకు.
 • భారతదేశం నుండి బయలుదేరే ముందు పాలసీ తీసుకోవాలి.
 • ఈ పాలసీ తీసుకోవడానికి కొన్ని సందర్భాల్లో మెడికల్ రిపోర్టులు సమర్పించాల్సి ఉంటుంది. 
  • ఓ ట్రిప్ 60 రోజులకు పైగా ఉన్నా
  • యూఎస్/ కెనడా సందర్శించే బీమా చేసిన వ్యక్తి వయసు 60 ఏళ్లు పైబడి ఉంటే
  • యూఎస్/ కెనడా కాకుండా ఇతర దేశాలను సందర్శించే బీమా చేసిన వ్యక్తి వయసు 70 ఏళ్లు పైబడి ఉంటే
  • బీమా చేసినవారు ఏదైనా అనారోగ్యం, వ్యాధితో బాధపడుతున్న వారు
 • ప్రతిపాదన ఫారంతో(1) ఇసిజి ప్రింట్ (2) ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మరియు యూరిన్ షుగర్ సహా

సంస్థకు అవసరమైన ఇతర నివేదికల జతచేయాలి. వీటితో పాటు ఫారం II(B) ను MD అర్హత 

కలిగిన డాక్టర్ చే సంతకం చేయించి జత చేసి పంపాలి.

ii. ఓవర్సీస్ మెడిక్లైయిమ్(బస్సు&హోల్)

ఈ బీమా పథకం కింద పాలసీదారునికి విదేశాల్లో ఏదైనా అత్యవసర వైద్య పరిస్థితి ఎదురైతే అంటే గాయాలు, అనారోగ్యం, వ్యాధుల చికిత్సకు కవరేజీ అందించబడుతుంది.

 1. వయోపరిమితి - 6 సంవత్సరాలు నుంచి 70 సంవత్సరాల వరకు.
 1. భారతదేశం నుంచి బయలుదేరే ముందు పాలసీ తీసుకుని ఉండాలి.
 1. మెడికల్ రిపోర్ట్స్ కొన్ని సందర్భాల్లో అవసరం అవుతాయి.. అవి
 •  ట్రిప్ 60 రోజులకు పైగా ఉన్నప్పుడు
 •  యూఎస్, కెనడా సందర్శించే బీమా చేసిన వ్యక్తి వయసు 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నప్పుడు.
 •  యూఎస్, కెనడా కాకుండా మిగతా దేశాలను సందర్శించే బీమా చేసిన వ్యక్తి వయసు 70 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నప్పుడు.
 •  పాలసీదారుడు ఏదైనా అనారోగ్యం/ వ్యాధితో బాధపడుతున్న సందర్భంలో మెడికల్ రిపోర్టులు సమర్పించాల్సి ఉంటుంది.