ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. భారతదేశంలో ఉన్న ఒక ప్రభుత్వ రంగ బీమా సంస్థ. ఈ సంస్థ సెప్టెంబర్ 12, 1947 న ఓరియంటల్ గవర్నమెంట్ సెక్యూరిటీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. యొక్క పూర్తి స్థాయి ఉప-విభాగంగా, తన మాతృ బీమా సంస్థ యొక్క కార్యకలాపాలను నిర్వహించడానికి స్థాపించబడింది.
1956 లో భారతదేశంలో బీమా రంగ జాతీయీకరణ సమయంలో, ఈ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ లో భాగంగా మారింది. ఎల్ఐసీ మరియు ఈ సంస్థ 1973 వరకు కలిసి పనిచేశాయి. 1973 లో ముందుకు సాగుతూ, ఓరియంటల్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఉప-విభాగంగా మారి, 2003 లో తను మాతృ సంస్థ నుంచి విడిపోయి, పూర్తి స్వతంత్ర సంస్థగా మారే వరకు కొనసాగింది. 2003 లో, భారత ప్రభుత్వం, జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ సంస్థ యొక్క షేర్లన్నిటినీ కొనుగోలు చేసింది.
ఓరియంటల్ ఇన్సూరెన్స్ ప్రధానాంశాలు
సంస్థ పేరు |
ఓరియంటల్ బీమా సంస్థ |
సంస్థ రకం |
పబ్లిక్ |
ప్రధాన కార్యాలయం |
న్యూ ఢిల్లీ |
నెట్ వర్క్ ఆసుపత్రుల సంఖ్య |
4300+ |
ఉద్యోగుల సంఖ్య |
13500 |
ఓరియంటల్ బీమా సంస్థ - ఉత్పత్తులు మరియు సేవలు
ఈ సంస్థ, ఆరోగ్య, వాహన, ప్రయాణ, మొదలైన దాదాపు అన్ని అంశాలలో బీమాను అందిస్తుంది. బీమా యొక్క అన్ని విభాగాలలో ఈ బీమా సంస్థ ప్రత్యేకమైన పథకాలను ముందుకు తెచ్చింది. ఆరోగ్య బీమా, ఆస్తులు, కారు బీమా, అలాగే వ్యవసాయ మరియు గ్రామీణ ఆర్థిక రంగాల కోసం ప్రకృతి వైపరీత్యాల నుంచి సంపూర్ణ రక్షణనందించే గ్రామీణ కవరేజీ విభాగంతో పాటుగా అనేక విభాగాలకు విస్తరించే కవరేజీ పథకాలను ఈ సంస్థ కలిగి ఉంది.
- ఆరోగ్య బీమా: ఆరోగ్య బీమా పెరుగుతున్న వైద్య ఖర్చుల సమస్య నుంచి వ్యక్తులకు కవరేజీ అందిస్తుంది. వైద్య బీమా కవరేజీ కింద, చికిత్సలకయ్యే అత్యధిక ఖర్చులను బీమా సంస్థ చెల్లిస్తుంది. కాబట్టి, ఆసుపత్రులలో అయ్యే భారీ ఖర్చుల గురించి వ్యక్తులు భయపడాల్సిన అవసరం ఉండదు.
- వాహన బీమా: దీని కింద, మీ వాహనాలకు సంపూర్ణ కవరేజీని అందించే అనేక ఉపయోగకరమైన పాలసీలను ఈ సంస్థ అందిస్తుంది. వాహన బీమా మీరు మీ వాహనానికి పూర్తి కవరేజీ మరియు థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీ కూడా పొందేలా సహాయపడుతుంది. ఈ ప్రముఖ విభాగాలు మాత్రమే కాకుండా, ఈ కార్పొరేట్ సంస్థ గ్రామీణ బీమా, పారిశ్రామిక బీమా మరియు వ్యాపార కవరేజీలను కూడా అందిస్తుంది.
1. ఓరియంటల్ ఆరోగ్య బీమా పథకాలు
ఆరోగ్య బీమా విభాగంలో వివిధ ఉత్పత్తులను, వ్యక్తుల, అలాగే కుటుంబ పథకాల ద్వారా అందిస్తుంది. ఈ క్రింద ఇవ్వబడిన అన్ని పథకాలు విస్తృతమైన కవరేజీని అందించేలా రూపొందించబడ్డాయి. మొత్తంగా 8 విభిన్న ఆరోగ్య పథకాలను ఇది కలిగి ఉంది:
i. ఓరియంటల్ ఇన్సూరెన్స్ మెడీక్లెయిమ్ పాలసీ (వ్యక్తిగత)
ఒక మంచి వ్యక్తిగత ఆరోగ్య బీమా పథకం, ఆసుపత్రిలో చేరినప్పుడు లేదా ఇంటి వద్దే వైద్యం పొందే సమయంలో అవసరమైన ఆర్థిక కవరేజీని అందిస్తుంది. ప్రమాదాలు, ఆకస్మిక అనారోగ్యాలు, శస్త్ర చికిత్సల వంటి అత్యవసర వైద్య పరిస్థితులలో మీకు సహాయపడుతుంది.
ఓరియంటల్ ఇన్సూరెన్స్ మెడిక్లెయిమ్ పాలసీ ప్రధాన ఫీచర్లు మరియు ప్రయోజనాలు
అర్హత |
18 నుండి 65 సంవత్సరాల మధ్య వయసున్న వారికి అందుబాటులో ఉంటుంది. అయితే గరిష్ట వయసు 70 సంవత్సరాలు వరకు ఉండవచ్చు, వర్తించే రేట్లపై 10 శాతం అదనపు ప్రీమియంతో |
పాలసీ కాల వ్యవధి |
ఒక సంవత్సరం |
బీమా మొత్తం |
|
ముందుగా ఉన్న వ్యాధులకు కవరేజీ |
పాలసీ అమలులోకి వచ్చిన 48 నెలల తర్వాత |
పాలసీ కొనుగోలుకు ముందు వైద్య పరీక్షలు |
55 ఏళ్లు దాటితే శారీరక పరీక్ష వంటి వైద్య నివేదికలను సమర్పించాలి. అల్ట్రాసోనోగ్రఫీ, ఒత్తిడి పరీక్ష, పూర్తి కంటి పరీక్ష వంటి వైద్య పరీక్షలను బీమా కవరేజీని పొందడానికి చేయించుకోవాల్సి ఉంటుంది. |
ప్రయోజనాలు |
|
ప్రీ హాస్పిటలైజేషన్ ఖర్చులు |
30 రోజుల వరకు |
పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు |
60 రోజుల వరకు |
ii. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కరోనా కవచ్ పాలసీ
పాలసీ కాల వ్యవధిలో కొవిడ్-19 చికిత్సకు ఆర్థిక రక్షణను అందిస్తుంది.
ఓరియంటల్ కరోనా కవచ్ పాలసీ ప్రధాన ఫీచర్లు మరియు ప్రయోజనాలు
అర్హత |
గరిష్ట ప్రవేశ వయసు 65 సంవత్సరాలు |
పాలసీ కాల వ్యవధి(వెయిటింగ్ పిరియడ్ కలుపుకుని) |
మూడున్నర నెలలు ఆరున్నర నెలలు తొమ్మిదిన్నర నెలలు |
బీమా మొత్తం |
కనిష్టం- రూ. 50 వేలు గరిష్టం- రూ. 5 లక్షలు |
వెయిటింగ్ పిరియడ్ |
15 రోజులు |
ప్రయోజనాలు |
|
ప్రీ హాస్పిటలైజేషన్ ఖర్చులు |
15 రోజుల వరకు |
పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు |
30 రోజుల వరకు |
iii. ఓరియంట్ ఇన్సూరెన్స్ కరోనా రక్షక్ పాలసీ
పాలసీదారునికి కొవిడ్-19 నిర్థారణ అయితే, ఒకేసారి పెద్ద మొత్తంలో సొమ్ము అందించబడుతుంది.
ఓరియంటల్ కరోనా రక్షక్ పాలసీ ప్రధాన ఫీచర్లు మరియు ప్రయోజనాలు:
ప్రవేశ వయసు |
18-65 సంవత్సరాలు |
బీమా మొత్తం |
రూ. 50,000- రూ. 2 లక్షలు |
వెయిటింగ్ పిరియడ్ |
15 రోజులు |
పాలసీ కాల వ్యవధి |
3.5, 6.5 మరియు 9.5 నెలలు |
iv. ఓరియంటల్ ఇన్సూరెన్స్ హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ
హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ, భారతదేశంలో నివసించే ఒక పూర్తి కుటుంబం కోసం ఉండే ఒక సంపూర్ణ ఆరోగ్య బీమా పథకం. ఈ సమగ్ర ఆరోగ్య బీమా పథకం, ఒకే బీమా పాలసీ కింద పూర్తి కుటుంబానికి అవసరమయ్యే వైద్య కవరేజీని అందిస్తుంది. మీతో పాటుగా మీ జీవిత భాగస్వామి, మీ పిల్లలు, తల్లిదండ్రులు మరియు అత్తమామలు (భాగస్వామి తల్లిదండ్రులు) మీ కుటుంబం కిందకి వస్తారు.
ఓరియంటల్ ఇన్సూరెన్స్ హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ప్రధాన ఫీచర్లు మరియు ప్రయోజనాలు:
ఫీచర్లు మరియు ప్రయోజనాలు |
సిల్వర్ |
గోల్డ్ |
డైమండ్ |
అర్హత |
18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు ఎవరైనా ఈ విధానాన్ని స్వీయ మరియు లేదా కుటుంబ సభ్యుల కోసం కొనుగోలు చేయవచ్చు. ఈ పథకం కింద జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు, ఆర్థికంగా ఆధారపడిన పెళ్లి కాని తోబుట్టువులు కోసం ఉపయోగించవచ్చు. ప్రతిపాద కుడి వయసు మరియు కుటుంబ సభ్యుల గరిష్ట వయసు 65 సంవత్సరాలు. అయితే కొన్ని నియమాలతో దీనిని 70 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది. |
18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు ఎవరైనా ఈ విధానాన్ని స్వీయ మరియు లేదా కుటుంబ సభ్యుల కోసం కొనుగోలు చేయవచ్చు. ఈ పథకం కింద జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు, ఆర్థికంగా ఆధారపడిన పెళ్లి కాని తోబుట్టువులు కోసం ఉపయోగించవచ్చు. ప్రతిపాద కుడి వయసు మరియు కుటుంబ సభ్యుల గరిష్ట వయసు 65 సంవత్సరాలు. అయితే కొన్ని నియమాలతో దీనిని 70 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది. |
18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు ఎవరైనా ఈ విధానాన్ని స్వీయ మరియు లేదా కుటుంబ సభ్యుల కోసం కొనుగోలు చేయవచ్చు. ఈ పథకం కింద జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు, ఆర్థికంగా ఆధారపడిన పెళ్లి కాని తోబుట్టువులు కోసం ఉపయోగించవచ్చు. ప్రతిపాద కుడి వయసు మరియు కుటుంబ సభ్యుల గరిష్ట వయసు 65 సంవత్సరాలు. అయితే కొన్ని నియమాలతో దీనిని 70 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది. |
పాలసీ కాల వ్యవధి |
1 సంవత్సరం |
1 సంవత్సరం |
1 సంవత్సరం |
పునరుద్దరణ |
జీవితాంతం |
జీవితాంతం |
జీవితాంతం |
బీమా మొత్తం |
1-5 లక్షలు |
6-10 లక్షలు |
12,15,18, 20 లక్షలు |
రోజువారీ ఆసుపత్రి నగదు |
లభ్యత లేదు |
రోజువారీ నగదు ఆసుపత్రిలో చేరిన రోజుకు బీమా చేసిన మొత్తంలో 0.1 శాతం( రూ. 600 నుంచి రూ. 1000) అనారోగ్యానికి గరిష్టంగా 10 రోజుల వరకు పరిహారం అందించబడుతుంది. |
ఆసుపత్రిలో చేరిన రోజుకు 0.1 శాతం మొత్తం బీమా(రూ. 1200 నుంచి రూ. 2000) ఆనారోగ్యానికి 10 రోజుల గరిష్ట పరిహారానికి లోబడి |
బీమా మొత్తం పునఃస్థాపన |
50 శాతం బీమా మొత్తం లేదా 100 శాతం బీమా మొత్తం |
50 శాతం బీమా మొత్తం లేదా బీమా మొత్తం |
లభ్యత లేదు |
నవ జాత శిశువు కవరేజీ |
లభ్యత లేదు |
లభ్యత లేదు |
అందుబాటులో ఉంది |
తప్పని సరి కో-పేమెంట్ |
ప్రతి క్లెయిమ్ లో 10 శాతం |
లభ్యత లేదు |
లభ్యత లేదు |
v. ఓరియంటల్ హెల్త్ ఆఫ్ ప్రివిలైజ్డ్ ఎల్డర్స్ (హోప్)
ఇది వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అత్యంత ప్రభావవంతమైన ఆరోగ్య బీమా పథకం. ఇది 60 సంవత్సరాల వయసు పైబడిన వారికి ఆరోగ్య కవరేజీని అందిస్తుంది.
హోప్ పథకం యొక్క ప్రధాన ఫీచర్లు మరియు ప్రయోజనాలు
అర్హత |
60 సంవత్సరాలు మరియు ఆఫైన వయసున్న భారతీయులకే మాత్రం అందుబాటులో ఉంటుంది |
పాలసీ కాల వ్యవధి |
1 సంవత్సరం |
బీమా మొత్తం |
రూ. 1- 5 లక్షలు |
ప్రయోజనాలు |
|
ప్రీ హాస్పిటలైజేషన్ |
30 రోజుల వరకు |
పోస్ట్ హాస్పిటలైజేషన్ |
60 రోజుల వరకు |
vi. ఓరియంటల్ జన్ ఆరోగ్య బీమా పాలసీ
సమాజంలో ఉన్న పేద వర్గాల ప్రజలకు ఒక వైద్య బీమా కవరేజీని అందించాలనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ పథకం అతి తక్కువ ప్రీమియం ధరలకే ఒక మంచి భరోసా మొత్తాన్ని అందిస్తుంది. అతి తక్కువ ధరలతో, పెద్దలకు రూ.70 మరియు 25 సంవత్సరాల వయసు కన్నా చిన్న వారైన కొడుకు/కూతురుకి రూ. 25 కే ఈ పథకం ఆసుపత్రి లేదా ఇంటి వద్దే వైద్యాన్ని కూడా అందిస్తుంది.
ఓరియంటల్ జన్ ఆరోగ్య బీమా పాలసీ ప్రధాన ఫీచర్లు మరియు ప్రయోజనాలు
అర్హత |
50-70 సంవత్సరాల వయసు ఉన్న పెద్దలు మరియు 3 నెలల నుంచి 5 సంవత్సరాల వయసున్న పిల్లలకు అందుబాటులో ఉంటుంది.(ఈ బీమా పథకం కనీసం ఒక పెరేంట్ అయినా కవరేజీ కలిగి ఉండాలి) |
బీమా మొత్తం |
క సభ్యునికి రూ. 5000 |
ఫ్రీ లుక్ పిరియడ్ |
15 రోజులు |
ప్రయోజనాలు |
|
vii. ఓరియంటల్ ఆరోగ్య సంజీవని పాలసీ
ఈ పథకం ప్రామాణిక ఆరోగ్య బీమా ఉత్పత్తి, నెలవారీగా ఆసుపత్రిలో చేరినప్పుడు ప్రాథమిక వైద్య సదుపాయాల కోసం కవర్ ను అందిస్తుంది.
ఓరియంటల్ ఆరోగ్య సంజీవని పాలసీ ప్రధాన ఫీచర్లు మరియు ప్రయోజనాలు
అర్హత |
18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసున్న వారికి అందుబాటులో ఉంటుంది. |
పాలసీ కాల వ్యవధి |
ఒక సంవత్సరం |
పునరుద్దరణ |
జీవితాంతం |
బీమా మొత్తం |
రూ. 1 -5 లక్షలు |
ముందుగా ఉన్న వ్యాధులకు కవరేజీ |
పాలసీ ప్రారంభమైన 48 నెలల తర్వాత |
ప్రయోజనాలు |
|
ప్రీ-హాస్పిటలైజేషన్ |
30 రోజుల వరకు |
పోస్ట్ హాస్పిటలైజేషన్ |
60 రోజుల వరకు |
viii. గ్రూప్ మెడీక్లెయిమ్ పాలసీ
గ్రూప్ మెడీక్లెయిమ్ - ఇది ఒకే బీమా పథకం కింద అనేక మంది వ్యక్తుల బృందానికి, కుటుంబసభ్యులు కానీ, సహోద్యోగులు కానీ లేదా మరెవరితో అయినా కూడా కలిపి కవరేజీ అందించే ఒక ఆరోగ్య బీమా పథకం. ఈ పథకం మిగతా బీమా పథకాల కన్నా మరింత అందుబాటు ధరకే లభిస్తుంది. ఈ గ్రూప్ మెడీక్లెయిమ్ పాలసీ 50 కన్నా ఎక్కువ వ్యక్తులు ఉండే ఏదైనా సంస్థ/అనుబంధ సంస్థ/బృందం/కార్పొరేట్ సంస్థలకు అందుబాటులో ఉంటుంది. బీమా తీసుకునే ప్రతీ వ్యక్తీ ఒకే గ్రూప్ పాలసీ కింద అందరు సభ్యులనూ (బీమా తీసుకున్న వారిని) కవర్ చేయాల్సి ఉంటుంది.
ఓరియంటల్ గ్రూప్ మెడిక్లెయిమ్ ప్లాన్ ప్రధాన ఫీచర్లు మరియు ప్రయోజనాలు
అర్హత |
గ్రూప్, అసోషియేషన్, ఇన్ స్టిట్యూషన్, కార్పొరేట్ విభాగాలు, 50 మంది కంటే ఎక్కువ సభ్యులు కలిగిన కుటుంబాలకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. |
కనీస బీమా మొత్తం |
రూ. 50,000 |
గ్రూప్ రాయితీ |
101 ఎక్కువ మంది ఉన్న గ్రూప్ సభ్యులకు మరియు మెంబర్స్ కు అందుబాటులో ఉంటుంది.
|
ముందుగా ఉన్న వ్యాధులకు కవరేజీ |
పాలసీ ప్రారంభమై 48 నెలలు గడిచిన తర్వాత |
ప్రయోజనాలు |
|
ప్రీ హాస్పిటలైజేషన్ కవరేజీ |
30 రోజుల వరకు |
పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజీ |
60 రోజుల వరకు |
2. ఓవర్సీస్ మెడీక్లెయిమ్ పాలసీ
ఓవర్సీస్ మెడీక్లెయిమ్ పాలసీ - మీరు ఏదైనా కారణం చేత విదేశీ ప్రయాణం చేస్తూ ఉన్నా లేదా విదేశాలలో ఉన్నా, మీకు మరియు మీ కుటుంబానికి కవరేజీ అందించేందుకు ఈ పథకం ప్రత్యేకంగా రూపొందించబడింది. మీరు మీ విదేశీ యాత్రని ఎటువంటి ఆందోళనలూ లేకుండా ఆనందించేలా ఈ పథకం చూసుకుంటుంది.
i. ఓరియంటల్ హ్యాపీ క్యాష్ పాలసీ
ఇది బీమాతో పాటుగా ఆసుపత్రి ఖర్చు, ప్రయోజనం - మరియు క్యాష్ ప్రయోజనాన్ని కూడా అందించే ఒక శక్తివంతమైన వైద్య బీమా పథకం.
ఓరియంటల్ హ్యాపీ క్యాష్ ఫ్యామిలీ ప్రధాన ఫీచర్లు మరియు ప్రయోజనాలు
అర్హత |
పెద్దలకు 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు పిల్లలకు 3 నెలల నుంచి 25 సంవత్సరాల వరకు |
పాలసీ కాల వ్యవధి |
1 సంవత్సరం |
పునరుద్దరణ |
జీవితాంతం |
వెయిటింగ్ పిరియడ్ |
ముందుగా ఉన్న వ్యాధులకు మినహాయించి ఎటువంటి వెయిటింగ్ పిరియడ్ లేదు |
ప్రయోజనాలు |
|
ii. ఓరియంటల్ ప్రవాసీ భారతీయ బీమా యోజన
ఈ బీమా పథకాన్ని భారత విదేశాంగ శాఖ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా భారతీయ వలసదారుల కోసం రూపొందించడం జరిగింది. ప్రతి సంవత్సరం వేలాదిమంది భారతీయులు ఉపాధి కోసం భారతదేశం నుంచి ఇతర దేశాలకు వలస వెళతారు. కాబట్టి ఇసిఆర్ ఇమిగ్రేషన్ చెక్ అవసరం. విదేశాలకు వెళ్లే వారందరూ, ఎమిగ్రెంట్ యాక్ట్ 1983 ప్రకారం ఈ బీమా పాలసీ కింద ఆసుపత్రి ఖర్చులకు బీమా పొందవచ్చు.
ఓరియంటల్ ప్రవాసీ భారతీయ బీమా యోజన ప్రధాన ఫీచర్లు మరియు ప్రయోజనాలు
అర్హత |
18 నుంచి 60 సంవత్సరాలు |
బీమా మొత్తం |
10 లక్షలు |
పాలసీ కాల వ్యవధి |
1 సంవత్సరం |
పునరుద్దరణ |
జీవితాంతం |
వెయిటింగ్ పిరియడ్ |
మెచ్యూరిటీ కవర్ కోసం 9 నెలలు ముందుగా ఉన్న వ్యాధుల కోసం 48 నెలలు |
ప్రయోజనాలు |
|
3. ఓరియంటల్ వ్యక్తిగత ప్రమాద పాలసీలు
ప్రమాదాలు అనూహ్యమైనవి, ఏదేమైనా సరైన బీమా పథకం ప్రమాదం యొక్క ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక ప్రాతిపదికన. ఓరియంటల్ యాక్సిడెంట్ పాలసీలు, వ్యక్తిగత ప్రమాద పాలసీలు, జనతా పర్సనల్ యాక్సిడెంట్ ప్లాన్ మరియు నాగరిక సువర్షలా ప్లాన్ పాలసీదారునికి మరియు కుటుంబానికి శారీరక గాయాల చికిత్సలో లేదా ప్రమాదం కారణంగా నష్టపోతే పాలసీదారునికి ఆర్థికంగా మద్దతును అందిస్తాయి.
i. ఓరియంటల్ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ
అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మనం ప్రమాదాలకు గురవుతుంటాం. ఈ ప్రమాదాలు మరణం, తీవ్రమైన గాయాలు లేదా వైకల్యానికి కారణం అవుతాయి ఓరియంటల్ వ్యక్తిగత ప్రమాద పాలసీ 12 క్యాలెండర్ నెలల్లో ప్రమాదవశాత్తు గాయం, వైకల్యం లేదా మరణం సంభవించినప్పుడు బీమా చేసిన వారికి పరిహారం అందిస్తుంది.
ఓరియంటల్ వ్యక్తిగత ప్రమాద పాలసీ ప్రధాన ఫీచర్లు మరియు ప్రయోజనాలు
పాలసీ కాల వ్యవధి |
1 సంవత్సరం |
పునరుద్దరణ |
జీవితాంతం |
ఫ్రీ లుక్ పిరియడ్ |
15 రోజులు |
ప్రయోజనాలు |
|
ii. ఓరియంటల్ జనతా పర్సనల్ యాక్సిడెంట్
ఓరియంటల్ జనతా పర్సనల్ యాక్సిడెంట్ ప్లాన్ ప్రమాదవశాత్తు మరణం లేదా వైకల్యం సంభవించిన సందర్భంలో సమగ్ర కవరేజీ అందిస్తుంది.
ఓరియంటల్ జనతా పర్సన్ యాక్సిడెంట్ ప్లాన్ ప్రధాన ఫీచర్లు మరియు ప్రయోజనాలు
అర్హత |
10 నుంచి 80 సంవత్సరాలు |
పాలసీ కాల వ్యవధి |
1 సంవత్సరం |
బీమా మొత్తం |
రూ. 25,000 నుంచి రూ. 5 లక్షలు |
పునరుద్దరణ |
జీవితాంతం |
ప్రీమియం |
రూ. 25,000 బీమా మొత్తానికి రూ. 15 మరియు బీమా చేసిన మొత్తానికి అనుగుణంగా ప్రీమియంలు పెరిగాయి |
iii. ఓరియంటల్ నాగరిక సురక్షా పాలసీ
ఓరియంటల్ నాగరిక్ సురక్షా పాలసీ ప్రమాదవశాత్తు మరణం మరియు వైకల్యం, అవయవాలకు నష్టం కలిగితే కవరేజీ అందిస్తుంది(కుటుంబ ప్యాకేజితో సహా). ఈ పాలసీ వ్యక్తిగతంగా మరియు సమూహ పరంగా కవరేజీని అందిస్తుంది.
ఓరియంటల్ నాగరిక్ సురక్షా పాలసీ ప్రధాన ఫీచర్లు మరియు ప్రయోజనాలు
అర్హత |
|
పాలసీ వ్యవధి |
1 సంవత్సరం |
బీమా మొత్తం |
రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలు |
పునరుద్దరణ |
జీవితాంతం |
ప్రయోజనాలు |
|
IV. ఓరియంటల్ షాప్ కీపర్ ఇన్సూరెన్స్ పాలసీ
ఈ బీమా పాలసీ అగ్ని, దొంగతనం మరియు మరిన్ని ప్రమాదాల వలన కలిగే నష్టాలకు వ్యతిరేకంగా బీమా చేసిన దుకాణదారుల ఆస్తి మరియు ప్రయోజనాల భద్రతను నిర్దారిస్తుంది. దీని కింద ఈ విధంగా పదమూడు విభాగాలు ఉన్నాయి.
సెక్షన్ |
ఇన్సూరెన్స్ రకాలు |
1A |
అగ్ని |
1B |
అగ్ని |
2 |
హౌస్ బ్రేకింగ్ |
3 |
డబ్బు |
4 |
పెడల్ సైకిల్ |
5 |
A.ప్లేట్ గ్లాస్ |
6 |
B.నియాన్ సైన్ |
7 |
సామాన్లు |
8 |
వ్యక్తిగత ప్రమాదం |
9 |
ఫిడిలిటీ గ్యారెంటీ |
10 |
ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్ ఇన్సూరెన్స్ |
11 |
బ్రేక్ డౌన్- ఎలక్ట్రిక్ ఉపకరణాలు |
12 |
A.పబ్లిక్ లయబిలిటీ B.ఎంప్లాయీ లయబిలిటీ |
13 |
బిజినెస్ ఇంటరప్షన్ |
ఓరియంటల్ షాప్ కీపర్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రధాన ఫీచర్లు
అర్హత |
భవనం మరియు విషయాల యొక్క సంచిత విలు రూ. రెండు కోట్ల వరకు ఉన్న పక్కా నిర్మాణం యొక్క ఏదైనా దుకాణం ఈ బీమా పథకం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. |
బీమా మొత్తం |
|
v. ఓరియంటల్ హౌస్ హోల్డర్ ఇన్సూరెన్స్ పాలసీ
మీ స్వంత ఇంటిని కలిగి ఉండటం, మీ జీవితంలో గొప్ప పెట్టుబడులలో ఒకటి . కాబట్టి మీ ఇంటిని ఏదైనా అనూహ్య నష్టం లేదా నష్టానికి వ్యతిరేకంగా రక్షించడం మీ బాధ్యత. ఓరియంటల్ హౌస్ హోల్డర్ ఇన్సూరెన్స్ పాలసీ సహాయంతో , ఏదైనా నష్టం లేదా ప్రమాదానికి వ్యతిరేకంగా మీ ఇంటికి అన్ని విధాల రక్షణ కల్పించవచ్చు. పేరు సూచించినట్లుగా ఈ పాలసీ మీ ఇంటికి అన్ని ప్రమాదాల నుంచి రక్షణ కల్పిస్తుంది. అగ్ని, ఇల్లు కూలిపోవడం మరియు మరెన్నో ప్రమాదాల కారణంగా మీ ఇంటికి కలిగే అన్ని నష్టాలకు ఈ పథకం సమగ్ర కవరేజీ అందిస్తుంది.
సెక్షన్ |
ఇన్సూరెన్స్ రకం |
ప్రీమియం రేటు(ప్రతి వెయికి) |
I |
అగ్ని |
0.30 |
II |
హౌస్- బ్రేకింగ్ |
1.00 0.35 |
III |
అన్ని రిస్క్ లు |
8.00 |
IV |
ప్లేట్ గ్లాస్ |
8.00 |
V |
దేశీయ అప్లయన్స్ అన్ని మరియు టీవీ సెట్ కూడా |
2.00 |
VI |
వ్యక్తిగత కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ |
8.00 |
VII |
పెడల్ సైకిల్ |
10.00 |
VIII |
సామాన్లు |
5.00 |
IX |
వ్యక్తిగత ప్రమాదం |
0.60+మెడికల్ ఖర్చులో 20 శాతం |
X A |
పబ్లిక్ లయబిలిటీ |
0.40 |
XB |
డబ్ల్యూసీ |
8.00 |
ఓరియంటల్ హౌస్ హోల్డ్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రధాన ఫీచర్లు
అర్హత |
పక్కా నిర్మాణం యొక్క ప్రతి నివాసానికి అందుబాటులో ఉంది. |
బీమా మొత్తం |
|
ఆభరణాల కోసం బీమా చేసి మొత్తం మార్కెట్ విలువ 10 శాతం(ఛార్జీలు చేయడం) లేదా కొనుగోలు ఖర్చు అవుతుంది.
vi. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన
ఊహించని సంఘటనల వల్ల పంటల నష్టం లేదా నష్టానికి వ్యతిరేకంగా రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ యోజన రూపొందించబడింది. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించడం మరియు రైతులకు సహాయం అందించే విధంగా భారత వ్యవసాయ రంగానికి రుణాలను అందివ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది.
4. ఓరియంటల్ వాహన బీమా పథకాలు
ఓరియంటల్ మోటార్ ఇన్సూరెన్స్, అన్ని రకాల కారు మరియు టూవీలర్ బీమా అవసరాలను ఒకే దగ్గర అందిస్తుంది. ఓరియంటల్ కార్ ఇన్సూరెన్స్ మీ కారుకు పూర్తి కవరేజీని అందిస్తే, టూ-వీలర్ ఇన్సూరెన్స్ మీ బైక్ యొక్క రక్షణను చూసుకుంటుంది. వినియోగదారుల యొక్క విభిన్న అవసరాలకు సరిపోయేలా, ఈ సంస్థ విస్తృతమైన వాహన బీమా ఉత్పత్తులను అందిస్తోంది. ప్రముఖంగా ఇక్కడ 2 రకాల వాహన బీమా పథకాలు ఉన్నాయి:
- కారు బీమా
- టూవీలర్ బీమా
I. కారు బీమా
మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం ప్రతి వాహనదారుడు అతను/ ఆమె కారును ఇన్సూరెన్స్ చేయడం తప్పనిసరి. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ జీరో తరుగుదల, వ్యక్తిగత వస్తువులకు మరియు బ్రేక్ డౌన్ వంటి వాటికి సమగ్ర కవరేజీ అందిస్తుంది. అదేవిధంగా టివిఎస్ ద్వారా అత్యవసర సమయంలో సేవలు అందిస్తుంది.(గరిష్టంగా రూ. 5000 నుంచి రూ. 10,000 వరకు) ఇంకా మరెన్నో సేవలు అందిస్తుంది.
ఓరియంటల్ ప్రైవేట్ కార్ ప్యాకేజీ పాలసీ ఫీచర్లు
పాలసీ కాల వ్యవధి |
1 సంవత్సరం(ఎంచుకున్న ప్లాన్ రకంపై ఆధారపడి) |
కవరేజీ |
|
మినహాయింపులు
- డ్రైవింగ్ చేసే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ లేనప్పుడు కారు ప్రమాదానికి గురై ఏదైనా నష్టం జరిగితే, నష్టానికి ఎటువంటి కవరేజీ లభించదు.
- మద్యం సేవించి కారు నడపడం వల్ల కలిగే నష్టాలు
- యాంత్రిక లేదా విద్యుత్ విచ్ఛిన్నం కారణంగా కలిగే నష్టాలకు
- యుద్ధం, అల్లర్లు మరియు అణు దాడులు కారణంగా కారుకు జరిగే నష్టాలకు
- తరుగుదల
- భారతదేశం వెలుపల కారుకు జరిగే నష్టాలకు, అయితే నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, మరియు మాల్దీవులులో అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా కవరేజీ పొందవచ్చు.
- వాణిజ్య కార్యకలాపాలకు కారును వినియోగించినప్పుడు కలిగే నష్టాలకు
- రేసింగ్ మరియు కారు అద్దెకు ఇచ్చినప్పుడు, మోటార్ ట్రేడ్ కు సంబంధించిన ఇతర విషయాల్లో కారుకు జరిగే నష్టాలకు ఎటువంటి కవరేజీ లభించదు.
II. టూ వీలర్ వాహనాలకు:
ఓరియంటల్ టూ వీలర్ - అందుబాటు ధరలలో థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీ ప్రయోజనంతో పాటుగా వచ్చే ఒక సంపూర్ణ వాహన బీమా పథకం. ఈ పథకం మీకు, మీ ద్విచక్ర వాహనానికి పూర్తి కవరేజీని అందిస్తుంది.
ఓరియంటల్ ప్యాకేజీ పాలసీ యొక్క ఫీచర్లు
పాలసీ కాల వ్యవధి |
1 సంవత్సరం(ప్లాన్ రకాన్ని బట్టి) |
కవరేజీ |
|
మినహాయింపులు
- చెల్లుబాటు అయ్యే మోటారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా జరిగే నష్టం
- మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ వైఫల్యం
- మద్యం తాగి నడపడం వల్ల జరిగే నష్టం
- తరుగుదల
- యుద్ధం, అల్లర్లు, అణు దాడుల కారణంగా జరిగే నష్టాలు
- టైర్ లు లేదా ట్యూబ్ లకు కలిగే నష్టం.
- భారతదేశం వెలుపల జరిగే నష్టాలకు కవరేజీ లభించదు. అయితే, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవులుల జరిగే నష్టాలకు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా కవరేజీ పొందవచ్చు.
ఓరియంటల్ ప్రొఫెషనల్ ఇన్సూరెన్స్
ఓరియంటల్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రొఫెషనల్స్ కోసం కింది బీమా పాలసీలను అందిస్తుంది. వైద్యులు, న్యాయవాదులు, ఆర్కిటెక్చర్ మరియు ఇతర వృత్తులో పనిచేసేటప్పుడు తలెత్తే ఏవైనా ప్రమాదాలకు వ్యతిరేకంగా కవరేజీ అందించబడుతుంది.
- డైరెక్టర్స్ మరియు ఆఫీసర్స్ కు లయబిలిటీ పాలసీ
- ఛార్టర్ అకౌంటెంట్స్, మేనేజ్ మెంట్ కన్సల్టెంట్స్, లాయర్స్, అడ్వకేట్స్, సొలిసిటర్స్ వృత్తులో ఉన్న వారికి నష్టపరిహార లోపాలకు కవరేజీ లభిస్తుంది.
- కన్సల్టింగ్ ఇంజనీర్స్ మరియు ఆర్చిటెక్టర్స్, ఇంటీరియర్ డెకరేటర్స్ కోసం వృతి పరమైన నష్టపరిహార లోపాలకు కవరేజీ లభిస్తుంది.
- మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ వృత్తిలో నిర్లక్ష్యం లోపాలు మరియు మినహాయింపు బీమా కవరేజీ లభిస్తుంది.
- స్పోర్ట్ ఇన్సూరెన్స్ పాలసీ
- పాలసీ స్టాక్ బ్రోకర్ల నష్టపరిహార బీమా పాలసీ
ఓరియంటల్ బిజినెస్ ఆఫీస్/ ట్రేడ్/ మల్టీ పెర్లీ పాలసీలు
ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ట్రేడింగ్ లేదా బిజినెస్ సెక్టారులో ఈ క్రింది పేర్కొనబడిన పాలసీలను అందిస్తుంది. తద్వారా చిన్న నుంచి మధ్య తరహా వ్యాపారులు లేదా వ్యాపార వేత్తలు వ్యాపారాన్ని విస్తరించడం, ఆదాయాన్ని సంపాదించడం మరియు వ్యాపార కార్యకలాపాలపై దృష్టి సారించవచ్చు. వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఆస్తుల భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- ఎలక్ట్రానిక్ ఉపకరణాల ఇన్సూరెన్స్ పాలసీ
- ఫెర్డిలిటీ గ్యారెంటీ పాలసీ- ఫ్లోటింగ్ గ్రూప్
- ఫెర్డిలిటీ గ్యారెంటీ పాలసీ- వ్యక్తిగత
- మనీ ఇన్సూరెన్స్ పాలసీ
- ఎల్ పీజీ గ్యాస్ డీలర్ల కోసం మల్టీ-పెర్లీ పాలసీ
- నియాన్ సైన్ పాలసీ
- ఆఫీస్ అంబ్రిల్లా పాలసీ
- ప్లేట్ గ్లాస్ ఇన్సూరెన్స్ పాలసీ
- నగదు వ్యాపారం నిర్వహించే వారికి జ్యువెలర్స్ బ్లాక్ ఇన్సూరెన్స్ పాలసీ
- షాప్ కీపర్స్ ఇన్సూరెన్స్ పాలసీ
ఓరియంటల్ ఇంజనీరింగ్/ ఇండస్ట్రీ పాలసీలు
ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంజనీరింగ్/ ఇండస్ట్రీ రంగంలో ఈ కింది బీమా పాలసీలను అందిస్తుంది.
- అడ్వాన్స్ లాస్ ఆఫ్ ప్రాఫిట్
- అన్ని రకాల రిస్క్ ఇన్సూరెన్స్ లు
- కాంట్రాక్టర్ అన్ని రకాల రిస్క్ ఇన్సూరెన్స్ లు
- ఎంప్లాయీ లయబిలిటీ ఇన్సూరెన్స్
- ఇండస్ట్రియల్ అన్ని రకాల రిస్క్ ఇన్సూరెన్స్
- ఇంజనీరింగ్ ఇన్సూరెన్స్
- లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ(పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ కింద, 1961)
- మెషినరీ బ్రేక్ డౌన్ ఇన్సూరెన్స్ పాలసీ
- మెషినరీ ఇన్సూరెన్స్ పాలసీ
- మెషినరీ లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్సూరెన్స్ పాలసీ(అవుట్- పుట్ బేస్)
- సాండర్ట్ ఫైర్ మరియు ప్రత్యేక పెరిల్స్ పాలసీ(మెటిరియల్ డ్యామేజీ)
ఓరియంటల్ అగ్రికల్చర్/ సెరికల్చర్/ పౌల్ట్రీ ఇన్సూరెన్స్
ఓరియంటల్ ఇన్సూరెన్స్ అగ్రికల్చర్, సెరికల్చర్, పౌల్ట్రీ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంది.
- యానిమల్ డ్రైవన్ కార్ట్/ టంగా ఇన్సూరెన్స్
- ఆపిల్ ఇన్సూరెన్స్
- ఆక్వా కల్చర్(రొయ్యలు) ఇన్సూరెన్స్ పాలసీ
- బిట్ల్వైన్ ఇన్సూరెన్స్ పాలసీ
- కొకొనట్ ప్లామ్ ఇన్సూరెన్స్ పాలసీ
- బోరు బావి ఫెయిల్డ్ ఇన్సూరెన్స్
- తేనెటీగల ఇన్సూరెన్స్ పథకం
- హట్ ఇన్సూరెన్స్
- మంచినీటి చేపల సాగుకు ఇన్సూరెన్స్
- కల్హణ్ ఇన్సూరెన్స్ ప్యాకేజీ పాలసీ
- ట్రైబల్స్ కోసం ఇన్సూరెన్స్ ప్యాకేజీ
- ప్లాంటేషన్/ హార్టి కల్చర్ పాలసీ
- చేపల చెరువు కోసం ఇన్సూరెన్స్ పాలసీ( మంచి నీటి చేపల సాగుకు)
- కిసాన్ అగ్రికల్చర్ పంప్ సెట్ ఇన్సూరెన్స్ పాలసీ
- పౌల్ట్రీ ఇన్సూరెన్స్
- రోజ్ ప్లాంటేషన్ ఇన్సూరెన్స్
- సెరికల్చర్ ఇన్సూరెన్స్
ఓరియంటల్ జంతువులు మరియు పక్షులకు జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలు
ఓరియంటలే ఇన్సూరెన్స్ కంపెనీ జంతువులు మరియు పక్షుల పెంపకం సాగు కోసం ఈ కింది బీమా పాలసీలను అందిస్తుంది.
- దూడ, హైపర్స్ కోసం ఇన్సూరెన్స్ పాలసీ
- ఒంటె ఇన్సూరెన్స్
- పశువుల ఇన్సూరెన్స్
- కుక్కలకు ఇన్సూరెన్స్
- బాతుల ఇన్సూరెన్స్ పథకం
- ఏనుగులకు ఇన్సూరెన్స్ పథకం
- ఫీటస్ కి ఇన్సూరెన్స్ పథకం
- గుర్రం, మ్యూల్, పోనీ, గాడిద, పంది కోసం ఇన్సూరెన్స్ పాలసీ
- గొర్రెలు మరియు మేకల కోసం ఇన్సూరెన్స్ పాలసీ
ఓరియంటల్ ఏవియేషన్ పాలసీలు
- ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ కింది పేర్కొన్న బీమా పాలసీలను అందిస్తుంది.
- ఎయిర్ క్రాఫ్ట్ హల్ అండ్ స్పేర్స్ అన్ని రిస్క్ ఏవియేషన్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ
- ఎయిర్ క్రాఫ్ట్ హల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ
- ఏవియేషన్ ఫ్యూయలింగ్, రీ ఫ్యూయలింగ్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ
- ఏవియేషన్ పర్సనల్ యాక్సిడెంట్(క్రూ సభ్యులు)
- లైసెన్స్ లాస్ ఇన్సూరెన్స్
ఓరియంటల్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎలా కొనుగోలు చేయాలి?
పైన పేర్కొన్న ట్లుగా ఓరియంటల్ ఇన్సూరెన్స్ సంస్థ ఆరోగ్య బీమా పాలసీల నుంచి వ్యక్తిగత ప్రమాద పాలసీలు, గృహ నిర్మాణ పాలసీల వరకు బహుళ బీమా ఉత్పత్తులను అందిస్తుంది. అదేవిధంగా ఈ బీమా పథకాలను ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ లో కొనుగోలు చేయవచ్చు. పాలసీని కొనుగోలు చేయడానికి మీరు సంస్థను నేరుగా లేదా దాని రిజిస్టర్డ్ ఇన్సూరెన్స్ సలహాదారులను సంప్రదించవచ్చు. పాలసీ కొనుగోలుకు కింది సాధారణ దశలను అనుసరించాల్సి ఉంటుంది.
స్టెప్ 1- ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క(https://oriental insurane.org.in) హోమ్ పేజీని సందర్శించండి మరియు డ్రాప్ డౌన్ ట్యాబ్ నుంచి ఆన్లైన్ లో కొనుగోలు చేయండి ట్యాబ్ పై నొక్కండి.
స్టెప్ 2- మోటారు బీమా పాలసీ, వ్యక్తిగత ప్రమాద పాలసీ, ఆరోగ్య బీమా పాలసీ వంటి మరిన్ని పథకాల నుంచి మీకు కావాల్సిన పథకాన్ని ఎంచుకోండి.
స్టెప్ 3- మీరు ఎంచుకున్న బీమా పథకం యొక్క వివరాల పేజీకు రీడైరెక్ట్ అవుతుంది. పాలసీని కొనుగోలు చేయడానికి అవసరమైన సమాచారాన్ని పూరించండి. తర్వాత చెల్లింపు పేజీకి రీడైరెక్ట్ చేయబడుతుంది.
స్టెప్4- మీ సౌలభ్యం ప్రకారం ఎన్ఈఎఫ్ టి, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయండి.
స్టెప్ 5- మీరు దరఖాస్తును సమర్పించిన తర్వాత, సంస్థ దానిని ప్రాసెసింగ్ ను ప్రారంభించి , నిర్దిష్ట రోజుల్లో పాలసీని జారీ చేస్తుంది.
గమనిక- మీరు సంస్థ యొక్క బ్రాంచ్ ఆఫీస్ నుంచి కూడా ఓరియంటల్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా కొనుగోలు చేయవచ్చు.(ఒక వేళ పాలసీ ఆన్లైన్ లో అందుబాటులో లేకపోతే)
ఓరియంటల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి మరో ఎంపిక PolicyX.com. ఇది ఐఆర్డీఏఐ చేత ఆమోదించబడిన ఆన్లైన్ ఇన్సూరెన్స్ పోర్టల్. ఇక్కడ మీరు మీ ఉత్తమ పథకాన్ని ఎంచుకోవడానికి వివిధ బీమా పాలసీలను పోల్చవచ్చు. PolicyX.com ద్వారా ఓరియంటల్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడానికి కింది దశలను అనుసరించాల్సి ఉంటుంది.
స్టెప్1- ఈ పేజి చివరికి స్క్రోల్ చేసి ఇప్పుడు కొనండి ట్యాబ్ పై క్లిక్ చేయండి
స్టెప్2- మీకు కావాల్సిన ఓరియంటల్ ప్రణాళికను ఎంచుకోండి.
స్టెప్3- అవసరమైన వివరాలను పూరించండి మరియు చెల్లింపు చేయండి.
స్టెప్ 4- మీ రిజిస్ట్రర్డ్ మెయిల్ ఐడికి పాలసీ పత్రాలు పంపబడతాయి.
ఓరియంటల్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడానికి కింది పత్రాలు అవసరం అవుతాయి.
- కేవైసీ పత్రాలు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి పత్రాలు, రేషన్ కార్డు మరియు పాన్ కార్డు
- మీ గుర్తింపు రుజువు మరియు శాశ్వత చిరునామా రుజువుగా పాస్ పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్
- వయసు ధృవీకరణకు జనన ధృవీకరణ పత్రం లేదా 10 మార్క్ షీట్
- బ్యాంక్ పాస్ బుక్, బ్యాంక్ స్టేట్ మెంట్ లేదా శాలరీ స్లిప్
- వైద్య నివేదికలు(ఆప్షనల్)
- ఇన్సూరెన్స్ సంస్థ కోరిన ఇతర పత్రాలు
ఓరియంటల్ ఇన్సూరెన్స్ సంస్థ యొక్క క్లెయిమ్ విధానం
ఓరియంటల్ ఇన్సూరెన్స్ సంస్థకి క్లెయిమ్ విధానం పాలసీ రకం బట్టి మారుతూ ఉంటుంది. అదే విధంగా జరిగిన సంఘటన బట్టి(అగ్ని, దొంగతనం, ప్రమాదం) కూడా మారుతూ ఉంటుంది. ఓరియంటల్ ఇన్సూరెన్స్ సంస్థ క్లెయిమ్ ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. అవి నగదు రహిత క్లెయిమ్స్ మరియు రీయింబర్స్ మెంట్ క్లెయిమ్స్.
నగదు రహిత క్లెయిమ్స్
పేరు సూచించినట్లుగా బీమా చేసిన వ్యక్తి సంబంధిత ఆసుపత్రికి లేదా నర్సింగ్ హోమ్ కి నగదు చెల్లించకుండా వైద్య చికిత్స పొందవచ్చు. పాలసీ ప్రకారం బీమా సంస్థ అన్ని ఆసుపత్రి ఖర్చులు మరియు ఇతర వైద్య సదుపాయాల ఖర్చును చెల్లిస్తుంది. ఏదేమైనా ఈ సదుపాయాన్ని పొందడానికి పాలసీదారుడు నెట్ వర్క్ ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి ఉంటుంది. నగదు రహిత క్లెయిమ్ దాఖలు చేయడానికి ఈ కింది దశలను అనుసరించాల్సి ఉంటుంది.
స్టెప్ 1- బీమా సంస్థ అందించిన నిర్దేశించిన ముందస్తు అధికార పత్రాన్ని పూరించండి. దీనిని నెట్ వర్క్ ఆసుపత్రిలోని టిపిఎ డెస్క్ వద్ద లేదా సంస్థ యొక్క వెబ్ సైటులో సమర్పించాలి. ఈ పత్రంలో పాలసీదారుని యొక్క ప్రాథమిక వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
స్టెప్ 2- పాలసీ పత్రాలు, ఐడెంటిటీ ప్రూఫ్ కాపీ వంటి మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కు సంబంధించి అన్ని అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి మరియు ఆర్థిక సహాయం పొందడానికి క్లెయిమ్ ఫారంను నింపి దానికి అవసరమైన పత్రాలన్నింటినీ జత చేసి సంస్థకు సమర్పించండి.
స్టెప్ 3- క్లెయిమ్ దరఖాస్తు సమర్పించిన తర్వాత, దరఖాస్తు ఆమోదం కోసం వేచి ఉండండి. బీమా సంస్థ సంబంధిత ఆసుపత్రితో క్లెయిమ్ దరఖాస్తును పరిశీలిస్తుంది.
స్టెప్4- మీ క్లెయిమ్ దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత ఓరియంటల్ ఇన్సూరెన్స్ మీ దరఖాస్తును పరిష్కరిస్తుంది.
రీయింబర్స్ మెంట్ క్లెయిమ్
రీయింబర్స్ మెంట్ క్లెయిమ్ కింద పాలసీదారుడు అన్ని వైద్య ఖర్చులను మొదట చెల్లించాల్సి ఉంటుంది. తరువాత బీమా సంస్థ నుండి అనుమతి లభించిన తర్వాత రీయింబర్స్ మెంట్ మొత్తం చెల్లించబడుతుంది. రీయింబర్స్ మెంట్ క్లెయిమ్ పొందడానికి కింది దశలను అనుసరించండి.
స్టెప్ 1- క్లెయిమ్ మద్దతు కోసం మీ బీమా ఏజెన్సీ సంస్థ మీ పాలసీ కాల వ్యవధిలో తెలియజేయండి
స్టెప్2- మీ పాలసీ క్లెయిమ్ అవసరమైన అన్ని పత్రాలను సమర్పించండి.
స్టెప్3- పాలసీ నిబంధనల ప్రకారం సంస్థ క్లెయిమ్ మేనేజ్ మెంట్ క్లెయిమ్ దరఖాస్తును పరిశీలిస్తుంది. ఇంకా అదనపు పత్రాలు ఏమైనా అవసరం అయితే సంస్థ కోరవచ్చు.
స్టెప్4- క్లెయిమ్ ఆమోదం పొందిన తర్వాత, ఒక వారంలో క్లెయిమ్ సెటిల్మెంట్ పరిష్కరించబడుతుంది.
ఓరియంటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కు అవసరమైన పత్రాలు
యాక్సిడెంటల్ డ్యామేజీ విషయంలో
- పూర్తిగా నింపి సంతకం చేసిన క్లెయిమ్ దరఖాస్తు
- ఇన్సూరెన్స్ పాలసీ రుజువు
- రిజిస్ట్రేషన్ బుక్ కాపీ మరియు పన్ను చెల్లింపు రశీదు
- ప్రమాద సమయంలో వాహనాన్ని డ్రైవ్ చేసిన వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్
- థర్డ్ పార్టీ మరణం లేదా గాయం, ఆస్తి నష్టం విషయంలో పోలీస్ పంచనామా, ఎఫ్ఐఆర్, థర్డ్ పార్టీకి సంబంధించిన ఇతర వివరాలు
- మరమ్మతు బిల్లులు మరియు చెల్లింపు రశీదులు వాహనాన్ని రిపేర్ చేసిన తర్వాత
- సంతకం చేసిన రెవెన్యూ స్టాంప్
దొంగతనం విషయంలో
- పూర్తిగా నింపి, సంతకం చేయబడిన క్లెయిమ్ ఫారం
- పాలసీ పత్రం
- రిజిస్ట్రేషన్ పుస్తకం మరియు పన్ను చెల్లింపు రశీదు.
- ఇన్సూరెన్స్ పాలసీ నెంబర్
- పోలీస్ పంచనామా, ఎఫ్ఐఆర్
- అన్ని కీ లు
- వారెంటీ కార్డు
- సర్వీస్ బుక్ లెట్
- ఫారం 28,29 మరియు 30, పాలసీదారుడిచే సంతకం చేయబడి ఉండాలి.
- సబ్ అర్ గోనేషన్ లెటర్
- ఆర్టీవో కి వాహనం గురించి తెలియజేయాలి మరియు అకనాల్డెజ్ మెంట్ సమర్పించాలి.
- ఒక వేళ పాలసీదారునికి అనుకూలంగా క్లెయిమ్ పరిష్కరించుకోవాల్సి వస్తే, అప్పుడు ఫైనాన్షియర్ ఎన్ వోసి అవసరం అవుతుంది.
- సంతకం చేసిన రెవెన్యూ చేసిన స్టాంప్ సమర్పించాల్సి ఉంటుంది.
ఆరోగ్య బీమా క్లెయిమ్ కు అవసరమైన పత్రాలు
- వ్యాధి కారణంగా ఆసుపత్రిలో చేరినప్పుడు
- పాలసీ యొక్క జిరాక్స్ మరియు ప్రీమియం రశీదుతో పాటు క్లెయిమ్ దరఖాస్తు ఫారం.
- పూర్తిగా నింపి, పాలసీదారుడిచే సంతకం చేయబడిన హాస్పిటలైజేషన్ క్లెయిమ్ పత్రం
- డిశ్చార్జి సమ్మరీ
- ఆసుపత్రి బిల్లులు
- అన్ని ల్యాబ్ టెస్టుల నివేదికలు
- ఇన్ వాయిస్, స్టిక్కర్లు, బార్ కోడ్ లు కాపీలు
- చెల్లించిన రశీదులు
- వైద్యుడి నుంచి సంప్రదింపు లేఖ
ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరినప్పుడు
- పాలసీ పత్రం, ప్రీమియం రశీదు మరియు క్లెయిమ్ దరఖాస్తు
- పూర్తిగా నింపిన క్లెయిమ్ ఫారం
- ఆసుపత్రి డిశ్చార్జి నివేదిక, వైద్య చికిత్స రిపోర్టులు
- మెడికల్ రికవరీ రిపోర్ట్
- అన్ని ఒరిజినల్ రిపోర్టులు(ఎక్స్-రే, సోనో గ్రాఫిక్, ఈజీసీ మొదలైనవి)
- పూర్తి వైద్య నివేదికలు, క్యాష్ మోమెలు, ప్రిస్కిప్షన్లు
- ఆసుపత్రి/ నర్సింగ్, హోమ్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్, గుర్తింపు పొందిన వైద్యులు జారీ చేసిన పత్రాలు
- పోలీస్ పంచనామా, ఇతర నివేదికలు
ప్రమాదవశాత్తు మరణ క్లెయిమ్ విషయంలో
- పాలసీ పత్రాలు, ప్రీమియం రశీదులు, క్లెయిమ్ దరఖాస్తు
- పూర్తిగా నింపిన క్లెయిమ్ ఫారం
- పోస్ట్ మార్టరం రిపోర్ట్
- డెత్ సర్టిఫికేట్
- పోలీస్ పంచనామా, ఎఫ్ఐఆర్ రిపోర్ట్
- వైద్య నివేదికలు మరియు వైద్య ఖర్చుల బిల్లులు
- వయసు ధృవీకరణ