వ్యక్తిగత ప్రమాద బీమా
 • అగ్ర బీమా సంస్థల నుండి ఉత్తమ ప్రణాళికలు
 • పోల్చండి & తక్షణమే కొనండి
 • 80 డి కింద పన్ను ప్రయోజనాలు
PX step

ఆరోగ్య బీమా కొటేషన్లను ఆన్లైన్లో పోల్చుకోండి

1

2

పేరు
కవరేజీ
పుట్టినరోజు (పెద్ద సభ్యుడి)

1

2

ఫోన్ నం.
నగరం

ముందుకు వెళ్తూ మీరు మా షరతులు మరియు ప్రైవసీ పాలసీ లకు ఒప్పుకుంటున్నారు

వ్యక్తిగత ప్రమాద బీమా అనేది ప్రతికూల సమయాల్లో మీకు ఆర్థిక రక్షణను అందించే కవచం లాంటిది. మీరు ప్రమాదానికి గురైనప్పుడు ఈ బీమా పాలసీ అవసరమైన అన్ని వైద్య ఖర్చులకు కవరేజీ అందిస్తుంది. గాయాలు, మరణం, శాశ్వత మరియు తాత్కాలిక అంగవైకల్యం కారణంగా పాలసీదారుడు ఆసుపత్రిలో చేరితే వ్యక్తిగత ప్రమాద బీమా ఆసుపత్రి ఖర్చులకు కవరేజీ అందిస్తుంది.

వ్యక్తిగత ప్రమాద బీమా యొక్క ప్రాముఖ్యత

చికిత్స కంటే నివారణ ఎల్లప్పుడూ మంచిది. భారతదేశంలోని రహదారులపై ఇటీవల అత్యధిక ప్రమాదాలు జరిగినట్లు ఓ అధ్యయనం స్పష్టం చేసింది. కేవలం రోడ్డు ప్రమాదాలు మాత్రమే కాదు, ఇంటి వద్ద లేదా కార్యాలయానికి వెళ్లే సమయంలో ఏ ప్రదేశంలోనైనా ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇదే విషయాన్ని గణాంకాలు మరియు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని రిఫరెన్స్ అంశాలు పరిశీలిద్దాం...

 • భారతదేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి 4 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు.
 • ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం భారతదేశంలో 2018 సంవత్సరంలో 1,49,000 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మరణించారు.
 • ప్రమాదాల కారణంగా మరణించే వారి శాతం గడిచిన మూడు సంవత్సరాల్లో 7.6 శాతం నుంచి 14 శాతానికి పెరిగింది.
 • నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బూర్య ప్రకారం రోడ్డు ప్రమాదాల కారణంగా దేశంలో ప్రతి రోజు సగటును 377 మంది మరణిస్తున్నారు.

ఈ గణాంకాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. రోడ్లపై ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తున్నాయి. చిన్న చిన్న ప్రమాదాలతో బయటపడితే అదృష్టమే, కానీ తీవ్రగాయాలు లేదా ప్రాణాలు కోల్పోవడం వంటివి అధికంగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే ఎలా? ఏదైనా రహదారి ప్రమాదం కారణంగా తలెత్తే అన్ని పరిస్థితులకు ఆర్థిక రక్షణ కవచం కలిగి ఉండటం అవసరం. ఈ ఆర్థిక రక్షణ కవచం మీకు ఉత్తమ మీకు బీమా పథకం ద్వారా లభిస్తుంది.

మనిషి జీవితాన్ని వెలకట్టడమనేది అసాధ్యం. కానీ వ్యక్తిగత ప్రమాద బీమా ద్వారా బీమా సంస్థలు సదరు వ్యక్తికి లేదా అతనిపై ఆధారపడిన వారికి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి.

వ్యక్తిగత ప్రమాద బీమా పథకం ప్రధాన ఫీచర్లు

వ్యక్తిగత ప్రమాద బీమాను మీకు సవివరంగా వివరిచేందుకు మేము ఈ పాలసీని రెండు విభాగాలుగా విభజించాము. వాటి గురించి తెలుసుకుందాం..

ప్రమాదవశాత్తు మరణం

పాలసీదారుడు ప్రమాదంలో మరణించినా లేదా తీవ్రంగా గాయపడినా ఈ బీమా పథకం అతను/ ఆమెపై ఆధారపడిన వ్యక్తికి డబ్బును చెల్లిస్తుంది. అవసరమైన పత్రాలు సమర్పించి బీమా సంస్థకు క్లైయిమ్ చేసుకోవచ్చు.

శాశ్వత పాక్షిక అంగవైకల్యం

రోడ్డు ప్రమాదం కారణంగా పాలసీదారుడు శాశ్వత పాక్షిక అంగవైకల్యానికి గురైతే బీమా పథకం పాలసీ మొత్తంలో కొంత శాతాన్ని చెల్లిస్తుంది. బీమా మొత్తం 100 శాతాన్ని కూడా చెల్లింపు చేయవచ్చు.

తాత్కాలిక అంగవైకల్యం

ఒక పాలసీదారుడు ప్రమాదం కారణంగా కొన్ని శారీరక గాయాలు లేదా తాత్కాలిక అంగవైకల్యానికి గురైతే ఒక నిర్దిష్ట మొత్తం పరిహారంగా చెల్లించబడుతుంది. ఇది రోజు వారీ లేదా వారాంతపు ప్రాతిపదికను చెల్లించడం జరుగుతుంది మరియు పాలసీ నిబంధనల ప్రకారం గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది.

ప్రాథమిక ఫీచర్లు

వ్యక్తిగత ప్రమాద బీమా నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి లేదా సమూహానికి పరిహారాన్ని బీమా సంస్థలు అందిచవచ్చు. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత/ పాక్షిక/ తాత్కాలిక అంగవైకల్యానికి వ్యక్తిగత ప్రమాద బీమా సమగ్ర కవరేజీని అందిస్తుంది.

శాశ్వత అంగవైకల్యం

ఒక దురదృష్టకర సంఘటన కారణంగా శాశ్వత అంగవైకల్యానికి గురైతే బీమా పథకం కింద పరిహారం మరియు ఇతర ప్రయోజనాలు పాలసీదారునికి అందజేయబడతాయి.

వ్యక్తిగత ప్రమాద బీమా యొక్క ప్రయోజనాలు

ఒక వేళ దురదృష్టకర సంఘటనల కారణంగా శారీరకంగా వికలాంగుడైన తర్వాత కూడా మీరు మీ కుటుంబాన్ని సమర్థవంతంగా చూసుకోవచ్చు, వారి అవసరాలను తీర్చవచ్చు మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడపవచ్చు. మీ చేతిలో వ్యక్తిగత ప్రమాద బీమా ఉంటే ఇవన్నీ సాధ్యమే. పాలసీ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి..

హస్పిటల్ క్యాష్ ప్రయోజనం

ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరిన సందర్బంలో, పాలసీదారునికి ఆసుపత్రి ఖర్చులకు కవరేజీ అందిస్తుంది. ఎన్ని రోజులకు చికిత్సకు కవరేజీ అందించాలనే విషయం బీమా నిబంధనలకు లోబడి ఉంటుంది.

మృత్యు అవశేషాలను స్వదేశానికి రప్పించడం

పాలసీదారుడు ప్రమాదంలో మరణిస్తే, మరణించిన ప్రదేశం నుంచి ఆసుపత్రికి లేదా స్మశానానికి లేదా ఇంటికి అవశేషాలు పంపడానికి అయ్యే ఖర్చుకు పాలసీ కవరేజీ అందిస్తుంది.

విద్య ప్రయోజనం

ప్రమాదంలో పాలసీదారుడు మరణించిన సందర్భంలో అతను/ ఆమె పిల్లల విద్యకు అయ్యే ఖర్చులకు పాలసీ కింద కవర్ చేయబడుతాయి. అయితే ఇది నిర్దిష్ట పరిమితికి లోబడి ఉంటుంది.

అంబులెన్స్ ఖర్చులు

గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రి తీసుకువెళ్లడానికి అంబులెన్స్ కు చెల్లించే ఛార్జీలు పాలసీ కింద కవర్ చేయబడతాయి.

విరిగిన ఎముకలు

ప్రమాదవశాత్తు విరిగిన ఎముకలు విరిగితే పాలసీ నిర్దిష్ట మొత్తంలో కవరేజీ అందిస్తుంది.

కాలిన గాయాలు

పాలసీదారుడు ప్రమాదం కారణంగా కాలిన గాయాలను ఎదుర్కొంటే, బీమా పథకం కింద అర్హత ఉన్న మొత్తాన్ని బీమా సంస్థ అందజేస్తుంది.

పన్ను ప్రయోజనాలు

ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 80D కింద వ్యక్తిగత ప్రమాద బీమా కోసం మీరు చెల్లించే ప్రీమియం పై ఎలాంటి పన్ను ప్రయోజనాలు లభించవు. అయితే వ్యక్తిగత ప్రమాద బీమా ఇతర అనేక ప్రయోజనాలు కలిగి ఉంది.

వ్యక్తిగత ప్రమాద బీమా పథకాలు అందించే అదనపు ప్రయోజనాలు

 • కనీస డాక్యుమెంటేషన్ మరియు ఎలాంటి వైద్య నివేదికలు అవసరం లేదు
 • అతి తక్కువ ప్రీమియం ఖర్చుతో అత్యధిక కవర్
 • జాతీయ మరియు అంతర్జాతీయ కవరేజీ
 • వ్యక్తిగత మరియు సమూహ బీమాకు వర్తించే ఎంపికలు
 • అనుకూలీకరణ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి
 • సులభమైన మరియు విశ్వశనీయమైన క్లైయిమ్ ప్రక్రియ
 • 24/7 కస్టమర్లకు మద్దతు
 • చట్టపరమైన మరియు అన్ని ఇతర ఖర్చులకు కవరేజీ
 • పిల్లల విద్యకు కవరేజీ
 • ప్రజా రవాణాలో ప్రయాణించేటప్పుడు ప్రమాదం కారణంగా మరణం సంభవిస్తే నష్టపరిహారం.

వ్యక్తిగత ప్రమాద బీమా రకాలు

బీమా పథకాలు తమ వినియోగదారులకు అనేక రకాలు ఉత్పత్తులను అందిస్తున్నాయి. ప్రజల ప్రాథమిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాలసీలను రెండు వర్గాలుగా విభజించడం జరిగింది.

వ్యక్తిగత ప్రమాద బీమా

అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు ఈ బీమా పథకం సదరు పాలసీదారునికి సమగ్ర కవరేజీ అందిస్తుంది. ప్రమాదం మరణం, శాశ్వత లేదా పాక్షిక/ తాత్కాలిక అంగవైకల్యానికి దారి తీయవచ్చు. దీనిని దృష్టిలో పెట్టుకుని బీమా సంస్థలు వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని రూపొందించాయి.

గ్రూప్ ప్రమాద బీమా

ఈ బీమాను సాధారంణంగా వివిధ సంస్థలు తమ ఉద్యోగుల కోసం కొనుగోలు చేస్తాయి. ఉద్యోగులు ఏదైనా రహదారి, రైలు లేదా విమాన ప్రమాదానికి వ్యతిరేకంగా బీమా కవరేజీ పొందవచ్చు. గ్రూప్ పరిమాణాన్ని బట్టి ప్రీమియంలో రాయితీలను కూడా బీమా సంస్థలు అందిస్తున్నాయి. ఈ బీమా పాలసీలను తక్కువ ధరలో పెద్ద సమూహాల కోసం తీసుకోవచ్చు. ఇది చిన్న సంస్థలకు మరియు వ్యాపారులకు అనువైన బీమా పథకం. అయితే వ్యక్తిగత ప్రమాద బీమాలా సమగ్ర కవరేజీ కాకుండా, గ్రూప్ ప్రమాద బీమా ప్రాథమిక కవరేజీని అందిస్తుంది. ఐఆర్డీఏఐ చేత గుర్తింపు పొందిన గ్రూప్ ప్రమాద బీమా పథకాలు మరణం, శాశ్వత/పాక్షిక/తాత్కాలిక అంగవైకల్యానికి కవరేజీని అందిస్తున్నాయి.

2020 సంవత్సరంలో ఉత్తమ ప్రమాద బీమా పథకాలు

సంస్థ పేరు

పథకం పేరు

ప్రవేశ వయసు

బీమా మొత్తం

పాలసీ కాల వ్యవధి

హెచ్ డిఎఫ్ సి ఎర్గో

ప్రమాద బీమా పథకం

91 రోజులు- 69 సంవత్సరాలు

స్టాండర్డ్ ప్లాన్ రూ. 50 లక్షలు

ప్రీమియం ప్లాన్ రూ. 5 కోట్లు

1 సంవత్సరం

ఎస్ బిఐ జనరల్

వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ

యువత 18 సంవత్సరాలు-65 సంవత్సరాలు

పిల్లలు 3 నెలలు- 23 సంవత్సరాలు

రూ. 1 కోటి

1 సంవత్సరం

ఐసిఐసిఐ లంబార్డ్

పర్సనల్ ప్రొటెక్షన్ ప్లాన్

18 – 80 సంవత్సరాలు

రూ. 25 లక్షలు

1 సంవత్సరం

మ్యాక్స్ బుపా

పర్సనల్ యాక్సిడెంట్ కేర్ బీమా

18 సంవత్సరాలు- 65 సంవత్సరాలు 

రూ. 2 కోట్లు

1- 3 సంవత్సరాలు

ఫూచ్యర్ జనరలీ

వ్యక్తిగత ప్రమాద బీమా

యువత 18- 70 సంవత్సరాలు,

 పిల్లలు 5- 25 సంవత్సరాలు

బీమా చేసిన మొత్తంపై 144 రెట్లు

1 సంవత్సరం

భారతీ ఆక్సా

వ్యక్తిగత ప్రమాద బీమా

18- 65 సంవత్సరాలు

రూ. 30 లక్షలు

రూ. 1 సంవత్సరం

బజాజ్ అలియాన్జ్

పర్సనల్ గార్డ్ 

యువత 18- 65 సంవత్సరాలు,

పిల్లలు 5- 21 సంవత్సరాలు

రూ. 25 లక్షలు 

1 సంవత్సరం

వ్యక్తిగత ప్రమాద బీమా వేటికి కవరేజీ అందిస్తుంది?

వ్యక్తిగత ప్రమాద బీమా క్రింది వాటికి కవరేజీ అందిస్తుంది.

ప్రమాదవశాత్తు వైకల్యం

ప్రమాద బీమా పథకాలు శాశ్వత/ పాక్షిక/ తాత్కాలిక అంగవైకల్యానికి పూర్తి కవరేజీని అందిస్తాయి.

ఉగ్రదాడి

ఉగ్రదాడి కారణంగా మీరు గాయపడినా, మరణించినా లేదా అంగవైకల్యానికి గురైనా బీమా సంస్థల నిబంధనలకు కవరేజీ లభిస్తుంది.

ప్రమాదవశాత్తు శరీర భాగాలు దెబ్బతినడం

ప్రమాదం కారణంగా పాలసీదారుని శరీర భాగాలు దెబ్బతింటే (చేయి, కాలు, కన్ను) బీమా పథకం వైద్య చికిత్సకు కవరేజీ అందిస్తుంది.

రోజువారీ ఆదాయం

పాలసీదారుడు గాయపడి ఆసుపత్రిలో చేరితే రోజువారీ ఆదాయాన్ని కోల్పోతాడు. అయితే బీమా పథకం రోజువారీ ఆదాయాన్ని పాలసీదారునికి అందిస్తుంది. ఇవి పాలసీదారుని వ్యక్తిగత అవసరాలకు మరియు కుటుంబ సభ్యుల ఖర్చులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి.

చేరికలు మరియు మినహాయింపులు

వ్యక్తిగత ప్రమాదబీమా కొనుగోలు చేసే ముందు సదరు వినియోగదారుడు బీమా పథకం యొక్క నిబంధనలు, షరతులు గురించి పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బీమా పథంలో చేరికలు మరియు మినహాయింపులు గురించి క్రింద వివరించడం జరిగింది.

చేరికలు 

మినహాయింపులు

ప్రమాదవశాత్తు మరణం

సహజ మరణం

శాశ్వత/ పాక్షిక అంగవైకల్యం

ఇంతకముందు ఉన్న వ్యాధి మరియు గాయం

ప్రమాదం కారణంగా శరీర భాగాలు దెబ్బతినడం

గర్భం మరియు ప్రసవం

పిల్లల విద్యకు కవరేజీ 

అలోపతిక్ కాకుండా ఇతర వైద్య విధానాలు

జీవిత కాల మద్దతు

మందులు మరియు మత్తు పదార్థాల ప్రభావం

అంబులెన్స్ ఖర్చులు, కాలిన గాయాలు& విరిగిన ఎముకలు

మానసిక రుగ్మతలు, నేరపూరిత చర్యలకు పాల్పడటం, యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం

రోజువారీ ఖర్చులకు ఆదాయం

క్రీడలు, నావికాదళం, వాయు లేదా సైనిక దళం నిర్వహించే సాహస కార్యక్రమాల్లో పాల్గొనడం

వ్యక్తిగత ప్రమాద బీమా అవసరం

వ్యక్తిగత ప్రమాద బీమా మరణం నుంచి చిన్న గాయాల వరకు అన్నింటికి కవరేజీ అందిస్తుంది మరియు అవసరమైన సమయంలో రీయింబర్స్ మెంట్ ప్రయోజనాలను సైతం అందిస్తుంది.

మీరు ఒక వేళ ప్రమాదానికి గురై శాశ్వతంగా వికలాంగులైతే, మీపై ఆధాపపడిన కుటుంబం పరిస్థితి ? మీ వైద్య చికిత్స ఖర్చులు మరియు మందుల ఖర్చులకు డబ్బు ఎలా లభిస్తుంది.?

వ్యక్తిగత ప్రమాద బీమా మరణం, గాయపడటం, తాత్కాలిక లేదా శాశ్వత అంగవైకల్యానికి కవరేజీ అందిస్తుంది. హింసాత్మకమైన ప్రమాదకర లేదా ఏదైనా విదేశీ వస్తువుల వల్ల పాలసీదారునికి హానీ కలిగినా కూడా బీమా కవరేజీ అందిస్తుంది.

రోడ్డు, రైలు మరియు వాయు మార్గాల ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు జరిగే ప్రమాదాలకు, కాలిన గాయాలుకు వంటి వాటికి పథకం కవరేజీ అందిస్తుంది. అలాగే ఏదైనా దురదృష్టకర సంఘటన కారణంగా పాలసీదారునికి ఏమైనా జరిగితే అతని కుటుంబానికి బీమా పథకం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ కారణంగా మీరు లేనప్పుడు కూడా మీ కుటుంబ భవిష్యత్ ను సురక్షితం చేయవచ్చు.

మీరు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరితే వైద్యఖర్చులు సహా అనేక ఇతర అనుబంధ ఖర్చులు చెల్లించాల్సి ఉటుంది. కానీ ఆదాయవనరులు తగినంత ఉండవు. ఇలాంటి సమయంలో వ్యక్తిగత ప్రమాద బీమా పథకం మీకు అండగా నిలుస్తుంది. వైద్య ఖర్చులు సహా అనేక ఇతర ఖర్తులకు బీమా పథకం కవరేజీ అందిస్తుంది.

అనుకోని పరిస్థితుల్లో మీరు ప్రమాదానికి గురైతే వ్యక్తిగత ప్రమాద బీమా మీపై ఆధారపడ్డు మీ కుటుంబానికి సమగ్ర రక్షణను అందిస్తుంది. ఇది వైద్య ఖర్చులు, ఒక వేళ పాలసీదారుడు మరణించినట్లయితే పరిహారం మరియు ప్రమాదం కారణంగా ఆదాయ వనరులు కోల్పోతే రోజువారీ ఆదాయం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. వ్యక్తిగత ప్రమాద బీమా యొక్క పూర్తి ప్రయోజనాలు పొందాలంటే మీరు పథకం యొక్క పూర్తి ప్రయోజనాలను అర్థం చేసుకోవాలి. అన్ని బీమా పథకాలు ఆన్లైన్ లో ఉన్నప్పటికీ గాయం లేదా మరణం సంభవించేటప్పుడు లభించే పరిహారాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. పాలసీ గురించి పూర్తిగా అర్థం చేసుకోకుండా కొనుగోలు చేసినట్లయితే అది మీ అవసరాలను తీర్చలేకపోవచ్చు.

వ్యక్తిగత ప్రమాద బీమా క్లైయిమ్ విధానం

వ్యక్తిగత ప్రమాద బీమా క్లైయిమ్ విధానం అనేది బీమా సంస్థ నుంచి బీమా సంస్థకు మారుతూ ఉంటుంది. అయితే పాలసీ కొనుగోలు చేసే ముందు బీమా సంస్థ యొక్క క్లైయిమ్ విధానాన్ని కూడా పూర్తిగా పరిశీలించాలి. క్లైయిమ్ విధానం గురించి తెలుసుకుందాం..

సంస్థకు తెలియజేయాలి: మొదట మీరు ప్రమాదం జరిగిన తర్వాత నిర్ధిష్ట కాల పరిమితిలో మీ బీమా సంస్థకు తెలియజేయాలి. అలాగే క్రింది పత్రాలు మరియు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

 • కాంటాక్ట్ నెంబర్స్
 • పాలసీ వివరాలు , నంబర్
 • ప్రమాదం జరిగిన సమయం, ప్రదేశం, తేదీ
 • ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు మరియు కాంటాక్ట్ నెంబర్
 • ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై వివరణ
 • ప్రమాద తీవ్రత మరియు కలిగి నష్టం

ప్రమాదం కారణంగా మరణించిన సందర్భంలో క్రింది పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

 • డెత్ సర్టిఫికేట్
 • పోస్ట్ మార్టరం రిపోర్ట్
 • మెడికల్ సర్టిఫికేట్
 • ఔషధ ఖర్చులు

 

PolicyX మీకు ఎలా సహాయపడుతుంది?

ఉత్తమమైన వ్యక్తిగత ప్రమాద బీమా కొనుగోలు చేయడానికి PolicyX మీక సహాయం చేస్తుంది. దీని వల్ల మీరు జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోనే స్థైర్యాని కలిగి ఉంటారు. అలాగే మీపై ఆధారపడిన వారి భవిష్యత్ కూడా సురక్షితంగా ఉంటుంది. నిజాయితీతో కూడిన సమీక్షలు మరియు సిఫారుసులతో పాటు అనేక పాలసీల గురించి సవివరమైన సమాచారాన్ని PolicyX మీకు అందిస్తుంది. మా వెబ్ సైట్ లో లిస్ట్ చేయబడిన అన్ని పాలసీలు ఐఆర్డీఏఐ చేత ఆమోదించబడ్డాయి. అందువల్ల మీకు అవసరమైన సమయంలో అత్యంత చట్టబద్ధమైన మరియు నమ్మకమైన సహాయాన్ని అందిస్తాయి. పాలసీ కొనుగోలు ప్రక్రియలో PolicyX నిపుణుల బృందం మీకు పూర్తి మద్దతు అందిస్తుంది.