ప్రయాణ బీమా
PX step

ఈ రోజుల్లో, ప్రయాణం అనేది మన జీవిన శైలిలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అది ఉద్యోగ నిమిత్తం కావచ్చు, ఏదైనా సాహసయాత్ర లేదా విహారయాత్ర కావచ్చు, మనం తరచుగా రోడ్ల మీద తిరుగుతుంటాం. దీని వలన చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ, మనకి తెలీకుండానే అనేక రకాల ప్రమాదకరమైన అంశాలు దానితో ముడిపడి ఉంటాయి. ఇవి మీ ప్రయాణాన్ని ఇబ్బందికరంగా చేసి, మిమ్మల్ని పూర్తిగా ప్రమాదకరమైన నిస్సహాయ స్థితిలోకి నెట్టవచ్చు. అయితే, మీరు భయపడాల్సిన అవసరం లేదు! మీరు ఒక ప్రయాణ బీమా పాలసీ సహాయంతో మీ ప్రయాణాన్ని సులభంగా సురక్షితంగా మార్చుకోవచ్చు.

ఇది ప్రయాణ సమయంలో (దేశీయ/అంతర్జాతీయ) ఆర్థికపరమైన నష్టానికి (పోయిన లగేజీ, వైద్య ఖర్చులు, విమాన ప్రమాదం మొదలైనవి) కవరేజీ అందించడానికి రూపొందించబడింది. సాధారణంగా, ప్రజలు ఈ విధమైన బీమాకు అంత ప్రాధాన్యత ఇవ్వరు. నిజమే, ఇది కారు/బైక్/ఆరోగ్య బీమా అంత ముఖ్యమైనదిగా అనిపించకపోయినా ఆపద సమయంలో, ఇదే మీ రక్షకునిగా పని చేస్తుంది.

ఉత్తమమైన ప్రయాణ బీమా పథకాలు

ప్రస్తుతం, ప్రపంచం ఎన్నో అవకాశాలను అందిస్తోంది. కాఫీ మెనూ నుంచి ఆటో బ్రోచర్ల వరకు, మీ కోరుకునే ప్రతీ దానిలో మీకు అనేక ప్రత్యామ్నాయాలు మీకు లభిస్తున్నాయి. అలాగే అదృష్టవశాత్తూ, ప్రయాణ బీమాలో కూడా మీకు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మీ సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతదేశంలో 2020 లో ఉన్న 5 ఉత్తమమైన ప్రయాణ బీమా పథకాల జాబితా క్రింద ఇవ్వబడింది.

సంస్థ పేరు

ప్రముఖ ఫీచర్లు

ప్రధాన మినహాయింపులు

రెలిగేర్

ఆసుపత్రిలో చేరిన మరియు చేరకుండా కూడా చేయించుకునే వైద్య కవరేజీ

ప్రయాణ రద్దు కవరేజీ

అత్యవసర ఎవాక్యుయేషన్ సేవ

కవరేజీ ఉండని విషయాలు:

ఎయిడ్స్/హెచ్ఐవీ

స్వీయ హానికారక చర్య/ఆత్మహత్య

మద్యం లేదా మత్తు పదార్థాలు వాడకం కారణంగా అయిన గాయాలు

టాటా ఏఐజీ

పోయిన/ఆలస్యమయిన లగేజీకి కవరేజీ

వార్షిక యాత్రలకు 15 రోజుల ఉచిత పరిశీలనా సమయం

ముందు నుంచి ఉన్న వ్యాధులకు వైద్య కవరేజీ

కవరేజీ ఉండని విషయాలు:

స్వీయ హానికారక చర్య/ఆత్మహత్య

తీవ్రవాద దాడులు లేదా జీవ/రసాయన ఆయుధాల కారణంగా అయిన గాయాలు

గర్భధారణ/ప్రసవం కారణంగా కలిగే హాని

బజాజ్ అలియాన్జ్

పోయిన/ఆలస్యమయిన లగేజీ/ పాసుపోర్టుకి పరిహారం

ఆటోమేటిక్ క్లెయిమ్ చెల్లింపు

ఇంటి దోపీడీ/అగ్నిప్రమాదానికి కవరేజీ

కవరేజీ ఉండని విషయాలు:

లైంగిక సంక్రమణ ద్వారా సంక్రమించే వ్యాధులు

మిలిటరీ/విమాన/రేసులు/ఇతర చర్యల కారణంగా అయిన గాయం/అనారోగ్యం

ముందు నుంచి ఉన్న వ్యాధులు

హెచ్డీఎఫ్సీ ఎర్గో హెల్త్

అత్యవసర నగదు అందుబాటు

దంత సమస్యలతో సహా వైద్య కవరేజీ

వాయిదా వేయబడిన/రద్దు చేయబడిన

విమాన సర్వీసులకు కవరేజీ

కవరేజీ ఉండని విషయాలు:

నేర ఉద్దేశంతో చట్టాన్ని ఉల్లంఘించడం

వైద్య చికిత్స కోసం చేసే ప్రయాణం

స్వీయ హానికారక చర్య/ఆత్మహత్య

రిలయన్స్

నగదురహిత ఆసుపత్రి వైద్యం

త్వరిత క్లెయిమ్ చెల్లింపు

తీవ్రవాద దాడుల కారణంగా అయిన గాయాలకు కవరేజీ

కవరేజీ ఉండని విషయాలు:

ముందు నుంచి ఉన్న వ్యాధులు

చికిత్స అందిస్తున్న వైద్యుని సలహాకి వ్యతిరేకంగా చేసే ప్రయాణాలు

లైంగిక సంక్రమణ ద్వారా సంక్రమించే వ్యాధులు

ప్రయాణ బీమా యొక్క ప్రయోజనాలు

ప్రతి ప్రయాణ బీమా పథకం, పలు ముఖ్యమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. క్రింద మీరు పరిగణనలోకి తీసుకోగల కొన్ని సాధారణ ప్రయోజనాలు ఇవ్వబడ్డాయి.

బ్యాగేజీ సమస్యలు

ఇవి ఇప్పుడు చాలా ఎక్కువయిపోయాయి. బ్యాగేజీ తప్పుగా లేదా ఆలస్యంగా చేర్చబడడం విమాన ప్రయాణాలలో ఒక పెద్ద సమస్యగా మారింది. కానీ, మీకు ఈ బీమా ఉన్నట్లయితే, దానికి మీరు పరిహారాన్నీ పొందవచ్చు.

సమగ్ర కవరేజీ

మీ కుటుంబం అంతటికీ వర్తించేలా ఆర్థిక కవరేజీని అందించే ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ పథకాన్ని మీరు తీసుకోవచ్చు. ఇందులో మీ భార్య/భర్త మరియు ఇద్దరు ఆధారపడిన పిల్లలు (23 సంవత్సరాల లోపు) ఉండవచ్చు.

ఆరోగ్య రక్షణ ప్రయోజనాలు

ప్రయాణంలో ఉన్నప్పుడు (వివిధ పరిస్థితుల కారణంగా) అనేకమంది ప్రజలు అనారోగ్యానికి గురవుతుంటారు. మీకు మరింత ఇబ్బందిని తప్పించడానికి, ఈ బీమా మీ వైద్య ఖర్చుల యొక్క భారాన్ని భరిస్తుంది.

ఇంటి అగ్నిప్రమాదం మరియు దొంగతన ప్రయోజనాలు

మీరు ప్రయాణంలో ఉన్న సమయంలో, ఒకవేళ మీ ఇంటిలో ఏదైనా దొంగతనం లేదా అగ్నిప్రమాదం జరిగినపుడు, ఆ నష్టానికి/హానికి మీకు ఆర్థిక కవరేజీ అందించబడుతుంది.

ప్రయాణ బీమా రకాలు

పలు రకాల అత్యవసర పరిస్థితులకు, ఒకే రకమైన ప్రయాణ బీమా సరిపోదు. అందుకనే సంస్థలు బీమా చేసుకునే వ్యక్తుల విభిన్న అవసరాలకు వర్తించే అనేక రకాల ప్రయాణ బీమా పథకాలను అందిస్తున్నాయి.

ఈ విభిన్న రకాల ప్రయాణ బీమాలను క్రింద చూడండి:

దేశీయ ప్రయాణ బీమా


మీరు భారతదేశంలో ప్రయాణిస్తున్నప్పుడు, మీరు దేశీయ ప్రయాణ బీమాను తీసుకోవాలి. ఇది బ్యాగేజీ పోవడం/దొంగిలించబడడం, ముందస్తు క్యాష్, వైద్య సహాయం, ప్రమాద సమయాలలో ఆర్థిక రక్షణ మొదలైన అన్ని వ్యక్తిగత అత్యవసర పరిస్థితులనూ కవర్ చేస్తుంది. 18 మరియు 65 సంవత్సరాల వయో పరిమితులలో ఉన్న వ్యక్తులు ఈ పథకాన్ని తీసుకోవచ్చు.

అంతర్జాతీయ ప్రయాణ బీమా


అంతర్జాతీయ ప్రయాణ బీమా లేదా విదేశీ బీమా, మీ విదేశీ ప్రయాణ సమయంలో ఏదైనా ఆకస్మిక అత్యవసర పరిస్థితిలో (బ్యాగేజీ పోవడం/దొంగిలించబడడం, వైద్య సహాయం, మొదలైనవి) మీకు ఆర్థిక రక్షణను అందిస్తుంది.

కార్పోరేట్ ప్రయాణ బీమా


కార్పోరేట్ లేదా బిజినెస్ ప్రయాణ బీమా ఏదైనా వ్యాపార సంబంధిత ప్రయాణ సమయంలో సంభవించగల అత్యవసర పరిస్థితిలో సంబంధిత ఉద్యోగులకు అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. పని నిమిత్తం వెళ్లే సందర్భాలలో, కార్పోరేట్ సంస్థలు వారి ఉద్యోగుల సంరక్షణ మరియు భద్రతల కోసం ఈ రకమైన బీమాని వారి ఉద్యోగుల కోసం తీసుకుంటాయి.

విద్యార్ధి ప్రయాణ బీమా


కార్పోరేట్ ప్రయాణ బీమా, ఎవరైనా విద్యార్ధి విదేశంలో చదువు కోసం వెళ్లి ఉంటున్నప్పుడు ఉండే ప్రయాణ సంబంధిత ప్రమాదాల నుంచి సంరక్షణకు సహాయపడడం కోసం అవసరమైన కవరేజీని అందిస్తుంది. ఈ కవరేజీ యొక్క ఖచ్చితమైన విలువ, సంస్థకూ, సంస్థకూ మారుతూ ఉంటుంది. 16 మరియు 35 సంవత్సరాల మధ్య వయసు వారు ఈ పాలసీని పొందవచ్చు. 

వయోవృద్ధుల ప్రయాణ బీమా


ఈ బీమా 61 మరియు 70 సంవత్సరాల మధ్య వయసు ఉండే సీనియర్ సిటిజెన్ల కోసం ఉద్దేశించబడింది. వారి వయసు మరియు ప్రయాణ బడలికలు తోడవగా, పెద్దవారు ప్రయాణాలలో, పలు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. కాబట్టి, బీమా సంస్థలు, దంత సమస్యలు, ఆసుపత్రి వైద్యం, నగదు రహిత చికిత్సలు వంటి ప్రత్యేక అవసరాలతో సహా సాధారణ ప్రయాణ బీమాలలో ఉండే ఇతర ప్రయోజనాలను కూడా కలిగి ఉండే వివిధ మిశ్రమ బీమా పథకాలతో ముందుకు వస్తున్నాయి. 

కుటుంబ ప్రయాణ బీమా


మీరు మీ జీవిత భాగస్వామి మరియు పిల్లలతో కలిసి ప్రయాణం చేస్తున్న సమయంలో, మీకు ఇది ఒక ఉత్తమమైన పథకం. ఇది ఒక వ్యక్తి యొక్క మొత్తం కుటుంబానికి వర్తించే బీమా మరియు ఇది పూర్తి ప్రయాణంలో వారి రక్షణ బాధ్యతను చూసుకుంటుంది. ఇది లగేజీ యొక్క దొంగతనం, అత్యవసర వైద్య పరిస్థితులు, గాయాలు లేదా ప్రమాదాలు, అలాగే ప్రయాణ సమయంలో అదనపు ఖర్చులకు కూడా కవరేజీ అందిస్తుంది. 

వ్యక్తిగత ప్రయాణ బీమా


పేరులో ఉన్న విధంగానే, ఈ బీమా ఒక వ్యక్తి యొక్క ప్రయాణానికి సంబంధించిన యాత్ర రద్దు, ఇంటిలో దొంగతనం, ప్రమాదాలు, వైద్య సహాయం మరియు యాత్ర వాయిదా వంటి విషయాలలో ఆర్థిక భద్రతను అందించడానికి రూపొందించబడింది. 

ఉమ్మడి యాత్రల ప్రయాణ బీమా


వ్యక్తులు, ప్రత్యేకించి తరచుగా ప్రయాణాలు చేసేవారు, ప్రతీ ప్రయాణానికి విడివిడిగా బీమా చేయించుకోవాల్సిన అవసరం లేకుండా, సరైన విధంగా అయితే, ఒక పూర్తి సంవత్సరంలో చేసే అన్ని యాత్రలకు సంపూర్ణ కవరేజీ అందించే ఒక రకమైన ప్రయాణ బీమాగా ఈ ఉమ్మడి యాత్రల ప్రయాణ బీమాను చెప్పుకోవచ్చు. 

యాత్ర ప్రయాణ బీమా


ఇది కేవలం ఒకే యాత్రకు మాత్రమే వర్తించే ప్రయాణ బీమా. ఈ పథకం అత్యవసర ఆరోగ్య పరిస్థితులకు, అలాగే ప్రయాణంలో సంభవించగల ఏవైనా ఆకస్మిక సంఘటనలకు కవరేజీని అందిస్తుంది. చెక్-ఇన్ సమయంలో, లగేజీ నష్టపోయినా కూడా, దానికి ఈ పథకం ఆర్ధిక భద్రతను కల్పిస్తుంది.

ప్రయాణ బీమా తీసుకునే సమయంలో దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు

కారణం మరియు ప్రయాణ సమయం

ఈ బీమా కింద ప్రీమియం మొత్తం, మీ ప్రయాణ సమయంపై నేరుగా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, సుదీర్ఘమైన ప్రయాణాలకు, ఎక్కువ ప్రీమియం ఉండటం మరియు స్వల్పకాలికమైన వాటికి, తక్కువ ఉండడం జరుగుతుంది. అదనంగా మీరు ప్రమాదకరమైన యాత్ర (పూర్తిగా సాహసాలతో కూడిన) కు వెళ్లాలనుకుంటే, ప్రీమియం మొత్తం మరింత ఎక్కువ ఉంటుంది. సాధారణ విహారయాత్ర (కేవలం ఆనందంగా గడపడానికి) అయినప్పుడు, దానికి ప్రీమియంలు తక్కువ ఉంటాయి. 

సంస్థపై భరోసా

మీరు పాలసీ తీసుకునే ముందు, భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా ఉండడానికి, మీరు బీమా సంస్థ గురించి మార్కెట్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవడం ముఖ్యం. మీరు ఏదైనా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకునే ముందు, దాని గురించి వీలైనంతగా తెలుసుకోవడం ఉత్తమమైనది. 

కవరేజీ మరియు ప్రయోజనాలు

మీరు తీసుకోబోయే పాలసీ యొక్క కవరేజీ మరియు ప్రయోజనాల వివరాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. కొన్నిసార్లు సంస్థ భవిష్యత్తు వాటిపైనే ఆధారపడి ఉంటుంది. సంస్థలు వాటినే ప్రధాన ఆకర్షణగా చూపిస్తుంటాయి. కాబట్టి, బీమా పథకాన్ని ఎంచుకునే ముందు, వ్యక్తులు వాటిపైన దృష్టి పెడతారు. మీరు కూడా అలానే చేయాలి. 

భరోసా మొత్తం విలువ

ఇది చాలా సులభం. మీరు ఎంత ఎక్కువ భరోసా మొత్తాన్ని ఎంచుకుంటే, అంత ఎక్కువ ప్రీమియంను కట్టవలసి ఉంటుంది. 

అందుబాటు బడ్జెట్

మీరు బీమాను ఎంచుకునే ముందే మీ బడ్జెట్ ను నిర్ణయించుకోండి. ప్రతీ బీమా సంస్థ తాము వినియోగదారులకు అందించే కవరేజీ యొక్క విలువను చూపుతుంది. అది మీ అంచనాలకు చేరువగా ఉంటే, ఆ బీమాసంస్థను మీరు వెంటనే సంప్రదించవచ్చు. 

క్లెయిమ్ చెల్లింపు శాతం (సీఎస్ఆర్)

మీరు బీమాసంస్థతో పాలసీని ఖరారు చేసుకునే ముందు, ఆ సంస్థ యొక్క సీఎస్ఆర్ ను తప్పనిసరిగా పరిశీలించండి. సీఎస్ఆర్ = (చెల్లింపు చేసిన క్లెయిమ్లు/చెల్లింపు కోరబడిన క్లెయిమ్లు) * 100. సీఎస్ఆర్ ఎంత ఎక్కువ ఉంటే, మీరు మీ క్లెయిమ్ కు చెల్లింపు పొందే అవకాశం అంత ఎక్కువగానూ, మరియు తక్కువ ఉంటే, తక్కువగానూ ఉంటుంది. 

ఆన్లైన్లో సరిపోల్చడం 

మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, మీ అవసరాలకు సరిపోయే ఉత్తమమైన ప్రయాణ బీమాను ఎంచుకోవడానికి ఆన్లైన్లో సరిపోల్చుకోవడం బాగా సహాయపడుతుంది. ఎలా అంటారా? మీరు వివిధ మొత్తాలకు, విభిన్న ఫీచర్లను, ప్రయోజనాలను

ప్రయాణ బీమాను PolicyX.com లోనే ఎందుకు తీసుకోవాలి?

PolicyX.com అనేక బీమా సంస్థల నుంచి, మీ అవసరాలకు సరిపోయే ఉత్తమమైన ప్రయాణ బీమాను ఎంచుకునే అవకాశాన్ని మీకు అందిస్తుంది. అది ఎలా అంటారా? ప్రయాణ బీమా అందించే ప్రముఖ దిగ్గజ సంస్థల నుంచి మీరు నేరుగా ప్రీమియం ధరలు/ఫీచర్లను కోరవచ్చు. వాటి నుంచి, మిమ్మల్ని మరియు మీ బడ్జెట్ ని సంతృప్తి పరిచే పథకాన్ని మీరు ఎంచుకోవచ్చు.

ఇంకా, మీకు సందేహాలేవీ ఉండకుండా, అన్ని విషయాలు మీకు స్పష్టంగా అర్థమయ్యేలా వ్యవహరించే నిపుణులైన సిబ్బందితో కూడిన కస్టమర్ కేర్ కేంద్రం మా వద్ద ఉంది.

ఒప్పుకుంటారా? అద్భుతం! వెంటనే ఈ పేజీ పైన భాగంలో కుడి వైపున ఉన్న ‘కొటేషన్లు పొందండి’ మీద క్లిక్ చేసి, మీ అవసరాల గురించిన సాధారణ వివరాలు అందించి, PolicyX నుంచి కొటేషన్లను పొందండి. ఇది మీకు సరిపోయే అన్ని పథకాలను, వాటి ప్రీమియం ధరలతో సహా, సెకన్లలో మీ ముందుంచుతుంది.

ప్రయాణ బీమా మినహాయింపులు

మీరు ప్రయాణించేటప్పుడు, మీకు లేదా మీ చుట్టూ అనేక సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తూ, బీమా సంస్థలు కొన్ని రకాల అత్యవసర పరిస్థితుల నుంచి భద్రతను కల్పించలేరు. వాటి జాబితా క్రింద ఇవ్వబడింది:-

  • ఏదైనా ప్రదేశంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలు లేదా అంతర్యుద్ధాల కారణంగా అయ్యే ఏవైనా ఖర్చులు
  • ముందు నుంచి ఉన్న ఏదైనా అనారోగ్యాల కారణంగా ఆసుపత్రి పాలవ్వడం
  • 24 గంటల లోపు లగేజీ ఆలస్యం 
  • ఆత్మహత్య లేదా ఆత్మహత్యా ప్రయత్నం వంటి స్వీయ హాని కారణంగా అయ్యే గాయాలు 
  • కాస్మెటిక్ చికిత్సల నుంచి రక్షణ 
  • మద్యం తీసుకోవడం లేదా అధిక మత్తు వాడకం వలన జరిగిన ఏదైనా గాయం/ప్రమాదం

ప్రయాణ బీమా చెల్లింపు పొందే ప్రక్రియ

ప్రజలు ప్రయాణ బీమాను తీసుకునేదే దీని కోసం, అంటే, అత్యవసరంగా అవసరమైన సందర్భంలో చెల్లింపును పొందడానికి. దానికి సంబంధించిన పద్దతి క్రింద ఇవ్వబడింది. సులభంగా చెల్లింపును పొందటానికి ఈ క్రమ పద్దతిని అనుసరించండి. 

  • చెల్లింపు పొందటం కోసం, మీరు వెంటనే ప్రయాణ బీమా సంస్థకు కాల్ చేయండి లేదా ఈ-మెయిల్ రాయండి. మీరు వారి కస్టమర్ కేర్ నంబర్ మరియు ఈ-మెయిల్ లను పాలసీ పత్రం నుండి పొందవచ్చు. 
  • సంబంధిత అవసరమైన పత్రాలను మీరు ఈ-మెయిల్, పోస్ట్ లేదా ఫ్యాక్స్ ద్వారా పంపాలి. 
  • ఈ డాక్యుమెంట్లను అందించిన తర్వాత, బీమా సంస్థ ఆ సమాచారాన్ని ధృవీకరించుకొని, అన్ని నియమాలు సరిగా ఉన్న పక్షంలో, మీ చెల్లింపును ప్రాసెస్ చేస్తుంది. 

గమనిక: చెల్లింపు కోరే సమయంలో ఈ డాక్యుమెంట్లు అవసరమవుతాయి: అన్ని బిల్లులు మరియు రసీదుల అసలు పత్రాలు, పాలసీ పత్రాలు, చెల్లింపు అభ్యర్థన పత్రం, పాసుపోర్టు, గుర్తింపు కార్డు మరియు ఎఫ్ఐఆర్ (దొంగతనం కేసులలో).

మీరు పని మీద వెళ్తున్నా లేక సాహసయాత్రకు వెళ్తున్నా కూడా, మీరు కొంత బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది. మీ మెదడు పూర్తిగా దానిపైనే దృష్టి సారిస్తూ ఉంటుంది. బ్యాగేజీ దొంగిలించబడడం లేదా అత్యవసర వైద్య ఖర్చుల వంటి అదనపు సమస్యలు, మీ ఒత్తిడిని అధికం చేసి, మీరు వెళ్లిన పనిపై దృష్టి సారించనీయకుండా చేస్తాయి. కాబట్టి, ఒక ప్రయాణ బీమాతో ప్రయాణించడం చాలా ఉత్తమం. ఇది మీ ప్రయాణ సంబంధిత అత్యవసర పరిస్థితులలో మీకు సహాయపడి, మీరు మీ పనిపైన దృష్టి సారించడాన్ని సులభతరం చేస్తాయి.