టూ వీలర్ బీమా
 • డ్యామేజ్ నుంచి టూ వీలర్ కి రక్షణ
 • వ్యక్తిగత ప్రమాద కవరేజ్
 • 1,00,000+ హ్యాపీ కస్టమర్స్
PX step

ప్రీమియం పోల్చండి

1

2

టూ వీలర్ పేరు
టూ వీలర్ టైప్
ఆర్టీవో కోడ్
రిజిస్ట్రేషన్ తేదీ
కొనసాగించు

ద్విచక్ర వాహన బీమా, మీ టూ వీలర్ కు లేదా దానిపై ప్రయాణిస్తున్న వారికి ఎదైనా ప్రమాదం, దొంగతనం లేదా ప్రకృతి వైపరీత్యాల వలన అయ్యే నష్టాల నుంచి ఆర్థిక రక్షణ అందిస్తుంది. ఒకవేళ మీరు థర్డ్ పార్టీకి లేదా వారి ఆస్తులకు నష్టాన్ని కలిగిస్తే, దానికి సంబంధించిన బిల్లులకు కూడా ఇది కవరేజీ అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మీకు ఏదైనా అనుకోని సంఘటన జరిగినపుడు మీరు ప్రశాంతంగా ఉండగలిగేలా ద్విచక్ర వాహన బీమా సహాయపడుతుంది.

టూ వీలర్ బీమా తీసుకోవాల్సిన అవసరం ఏమిటి?

1988 లో మోటారు వాహనాల చట్టం మొదటిసారి ద్విచక్ర వాహన బీమాకు ప్రాముఖ్యతనిచ్చింది. ఈ చట్టం ప్రకారం - భారతదేశంలో స్వతంత్రంగా తిరగడానికి, మీ ద్విచక్ర వాహనానికి అలాగే కనీసం ఒక థర్డ్ పార్టీ బీమాను తీసుకోండి. ఒక వేళ మీరు అది లేకుండా నడుపుతూ దొరికితే, అధిక జరిమానాలు చెల్లించడమే కాకుండా, కోర్టుకు సమాధానమివ్వాల్సి ఉంటుందనేది ఈ చట్టం యెక్క సారాంశం. మోటారు వాహనాల చట్టంలోని కొత్తగా చేసిన 2019 సవరణల ప్రకారం, బీమా లేకుండా నడిపినా లేదా గడువు తీరిపోయిన డ్రైవింగ్ లైసెన్స్ చూపించినా ఎక్కువ జరిమానా చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి మీరు కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండాలన్నా, మీ జేబుకు చిల్లు పడకుండా ఉండాలన్నా, ద్విచక్ర వాహన బీమా తీసుకోవడం మంచిది. ఈ టూ వీలర్ బీమా గురించి మరింత తెలుసుకుందాం.

టూ వీలర్ బీమా రకాలు

సంపూర్ణ బీమా

ఈ రకమైన బీమా థర్డ్ పార్టీ సహా మీకు/మీ ద్విచక్ర వాహనానికి అయ్యే నష్టానికి కూడా ఆర్థిక రక్షణను అందిస్తుంది. అలాగే మీ పాలసీ కవరేజీని పెంచుకోవడానికి, కొన్ని అదనపు ఎంపికలను కూడా చేసుకునే సౌకర్యం మీకు ఉంటుంది. 

థర్డ్ పార్టీ బీమా

పేరులో చెబుతున్నట్లుగానే, పాలసీదారు థర్ట్ పార్టీకి లేదా వారి ఆస్తులకు కలిగించిన నష్టానికి అయ్యే ఆర్థిక భారాన్ని ఈ పాలసీ కవర్ చేస్తుంది.

టూ వీలర్ బీమాతో మీరు ఏ యాడ్-ఆన్ లను అదనంగా తీసుకోవచ్చు?

సంపూర్ణ బీమా మీకు పూర్తి ఆర్థిక రక్షణను ఇస్తున్నప్పటికీ, అది కూడా కవర్ చేయని కొన్ని అంశాలు ఉన్నాయి. అందుచేతనే, బీమా సంస్థలు సంపూర్ణ బీమాలో ఉన్న లోటుపాట్లను పూడ్చటానికి కొన్ని అదనపు యాడ్-ఆన్ ల జాబితాను అందిస్తున్నాయి. ఉదాహరణకు మీ కోసం కింద కొన్ని యాడ్-ఆన్ ల గురించి వివరించడం జరిగింది.

ఆక్ససరీస్ కవర్:

ఒకవేళ మీ ద్విచక్ర వాహనం ఖరీదైన ఎలెక్ట్రికల్ లేదా నాన్-ఎలక్ట్రికల్ భాగాలను కలిగి ఉంటే, మీరు వాటికి బీమా తీసుకోవచ్చు. ఈ యాడ్-ఆన్ కవరేజీ అటువంటి విలువైన భాగాలకు అయ్యే నష్టానికి ఆర్థిక రక్షణ అందిస్తుంది.

మెడికల్ కవర్:

ఈ అదనపు కవరేజీ ద్విచక్ర వాహనం ప్రమాదంలో మీరు గాయపడితే అందుకు సంబంధించిన వైద్య చికిత్సలకు అవసరమైన ఆర్థిక సహాయంలో మీకు తోడ్పడుతుంది.

పాసెంజర్ కవర్: 

ద్విచక్ర వాహనం, నడిపేవారితో పాటు, వెనుక కూర్చున్నవారు కూడా, ఏదైనా ప్రమాదం జరిగినపుడు ఒకే రకమైన హానిని ఎదుర్కునే అవకాశం ఉంది. అయితే సాధారణంగా టూ వీలర్ బీమాలు నడిపే వారికి మాత్రమే బీమా కవరేజీని అందిస్తాయి. వెనుక కూర్చున్న పాసెంజరుకు కూడా ఆ కవరేజీని వర్తింప చేయడానికి, ఈ యాడ్-ఆన్ కవర్ ను మీరు తీసుకోవచ్చు. ఒకవేళ దురదృష్టవశాత్తూ వెనుక కూర్చున్నవారు మరణిస్తే లేదా వైకల్యానికి గురైతే, దానికి పరిహారాన్ని కూడా ఈ పథకం అందిస్తుంది.

జీరో/నిల్ డిప్రీసియేషన్ కవర్

దీని కింద, క్లెయిమ్ ను చెల్లించే సమయంలో, బీమా సంస్థ పాలసీదారునికి ద్విచక్ర వాహనం యొక్క పూర్తి విలువను (తరుగుదల చార్జీలతో సహా) అందిస్తుంది.

టూ వీలర్ భీమా

టూ వీలర్ భీమా

టూ వీలర్ బీమా ప్రీమియంను లెక్కించడం

ఒక బీమా పథకానికి కట్టాల్సిన ప్రీమియంను లెక్కించడానికి, బీమా సంస్థలు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. క్రింద వాటి యొక్క జాబితా ఇవ్వబడింది.

ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (ఐడీవీ)

ఒకవేళ మీ ద్విచక్ర వాహనం దొంగిలించబడినా లేక ఏదైనా ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైనా, మీ బీమా సంస్థ మీకు ఐడీవీ అని పిలవబడే ఒక గరిష్ట భరోసా మొత్తాన్ని అందిస్తుంది. మీరు ఈ విలువనే మీ ద్విచక్ర వాహనం యొక్క ప్రస్తుత మార్కెట్ విలువగా చూడవచ్చు. కాబట్టి మీ వాహనానికి తక్కువ ఐడీవీ ఉన్నప్పుడు మీరు తక్కువ ప్రీమియం అలాగే, ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

డిప్రీసియేషన్:

ఏదైనా వాహనాన్ని నిరంతరం వాడటం వల్ల అవి పాతబడటం సాధారణమే.. దీని కారణంగా ఆ వాహనం యెక్క విలువ తరుగుతూ ఉంటుంది. అయితే కొత్త వాహనానికి తరుగుదల మొత్తం ఉండదు. పాతబడే కొద్దీ తరుగుదల మొత్తం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ డిప్రీసియేషన్ (తరుగుదల) పెరిగే కొద్దీ ప్రీమియం కూడా పెరుగుతుంది.

వయసు:

కొత్తవాటితో పోలిస్తే, పాత వాహనాలు చెడిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి ప్రీమియం కూడా ఎక్కువ ఉంటుంది. 

క్యూబిక్ కెపాసిటీ:

ఇది ఇంజన్ యొక్క సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఎక్కువ క్యూబిక్ సామర్థ్యాన్ని కలిగి ఉండే ద్విచక్ర వాహనం ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది కాబట్టి దానికి అధిక ప్రీమియం ఉంటుంది.

యాంటీ-తెఫ్ట్ పరికరాలు

మీ ద్విచక్ర వాహనానికి, దొంగతన నిరోధక(యాంటీ- తెఫ్ట్) పరికరాలను ఏర్పాటు చేయడం ద్వారా లేక ఆటోమొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని కలిగి ఉండడం ద్వారా, మీరు ప్రీమియం పై రాయితీలను పొందవచ్చు.

నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ)

ఇది ఒక పాలసీ సంవత్సరంలో, మీ ద్విచక్ర వాహన పాలసీ నుండి ఎటువంటి క్లెయిమ్ చేసుకొకపోతే మీకు ఈ రాయితీ అందించబడుతుంది. ఎన్సీబీ ప్రీమియం మొత్తం నుంచి తగ్గించబడుతుంది. ఈ తగ్గింపు ద్వారా మీరు కట్టాల్సిన ప్రీమియం తక్కువవుతుంది.

ప్రీమియంపై ఈ అంశాల ప్రభావాన్ని కింద ఇవ్వబడిన కొన్ని ద్విచక్ర వాహనాల ప్రీమియం వివరాల ద్వారా మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు.

రకం

ద్విచక్ర వాహన ధర

ఐడీవీ*

జీరో డిప్రీసియేషన్ (యాడ్-ఆన్)*

ప్రీమియం*

కేటీఎం డ్యూక్ 200 ఏబీఎస్ (199సీసీ)

రూ.1,73,000

రూ.1,28,942

రూ. 709

రూ.6,424

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్

రూ. 1,65,000

రూ. 1,18,560

రూ. 425

రూ. 6,472

యమహా ఆర్15 వీ3 (155సీసీ)

రూ. 1,46,000

రూ. 1, 12,500

రూ. 731

రూ. 7,433

*ఈ విలువలు (2020) సంవత్సరంలో (ఢిల్లీ) నగరానికి సంబంధించి లెక్కించబడినవి.

మీరు మీ టూ వీలర్ యొక్క ప్రీమియంను లెక్కించుకోవడానికి, PolicyX.com నిపుణుల ద్వారా చేయబడిన ప్రీమియం కాలిక్యులేటర్ ను మీరు ఉపయోగించుకోవచ్చు.

టూ వీలర్ బీమాను ఆన్లైన్లో ఎందుకు తీసుకోవాలి?

మీరు ఆఫ్-లైన్లో బీమాను తీసుకుంటే కొన్ని అదనపు ప్రయోజనాలు పొందలేరు. కానీ ఆన్లైన్ లో మీరు టూ వీలర్ బీమా తీసుకుంటే మీకు ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి.వీటి గురించి క్రింద వివరించడం జరిగింది. వాటి గురించి కొంచం తెలుసుకుందాం.

త్వరిత జారీ: ఆన్లైన్లో టూ వీలర్ బీమా పథకాన్ని మీరు కొన్ని నిమిషాలలోనే పొందవచ్చు. ఆన్లైన్ కొనుగోలు అంత వేగంగా ఉంటుంది.

అదనపు ఖర్చులు లేకుండా: ఆన్లైన్ కొనుగోలు ద్వారా బీమా తీసుకునేటప్పుడు మీరు అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. అందుచేతనే ఆఫ్-లైన్ వాటి కన్నా ఆన్లైన్ పథకాలు చౌకగా ఉంటాయి.

తనఖీలు, ఎక్కువ పత్రాలతో పని లేకుండా: ఎటువంటి తనిఖీ లేకుండానే మీరు మీ పాలసీని పునరుద్ధరించుకోవచ్చు(రెన్యువల్). మీరు కేవలం మీ టూ వీలర్ కి సంబంధించిన కొన్ని వివరాలు, అలాగే పాత పాలసీ వివరాలు (ఉంటే) మాత్రమే ఇవ్వవచ్చు.

సులభ చెల్లింపు ప్రక్రియ: మీరు సులభంగా వెబ్సైటు ద్వారా చెల్లింపు అభ్యర్థనను చేయవచ్చు మరియు ఏవైనా సందేహాలు ఉంటే వారి టీంని సంప్రదించవచ్చు.

ఆన్లైన్ సహాయం: PolicyX.com యొక్క టీం మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉంటుంది. అదే విధంగా PolicyX.com ద్వారా మీరు టూ వీలర్ బీమాను సరిపోల్చుకుని అత్యుత్తమ మరియు చౌక బీమాను ఎంచుకోవచ్చు. అలాగే సంస్థ వెబ్ సైట్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. అలాగే పునరుద్ధరణ(రెన్యువల్) కూడా సులభంగా చేసుకోవచ్చు.

ఉత్తమ టూ వీలర్ బీమా సంస్థలు

ఇప్పుడు అనేక బీమారంగ సంస్థలు ద్విచక్ర వాహన బీమాను అందిస్తుండడంతో, మీ అవసరాలకు సరిపోయే బీమా పథకాన్ని ఎంచుకోవడం కొంచెం కష్టంగా ఉండవచ్చు. మీకు అందులో సహాయపడటానికి, వారి చెల్లింపు శాతాల ఆధారంగా మేము ఉత్తమ ద్విచక్ర వాహన బీమా సంస్థల జాబితాను తయారు చేసాము. క్రింది పట్టికలో వాటిని గమనించవచ్చు.

సంస్థ

ఇచ్చిన చెల్లింపు శాతం

నగదురహిత గ్యారేజీలు

నో క్లెయిమ్ బోనస్

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ

127.50%

3200 కు పైగా

ఉంది

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ

120.79%

3100 కు పైగా

ఉంది

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

87%

1500 కు పైగా

ఉంది

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ

112.62%

3100 కు పైగా

ఉంది

భార్తీ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్

75%

5200 కు పైగా

ఉంది

టూ వీలర్ బీమాను తీసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్లు

ద్విచక్ర వాహన బీమా పథకాన్ని తీసుకోవడానికి, మీరు కొన్ని పత్రాలను అందించాల్సి ఉంటుంది. పత్రాల జాబితాను క్రింద ఇవ్వడం జరిగింది.

గుర్తింపు ధ్రువీకరణ: మీరు డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు ధ్రువీకరణ పత్రాన్ని అందించాలి.

చిరునామా ధ్రువీకరణ: మీరు చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందించాల్సి ఉంటుంది. ఇందుకు, అద్దె ఒప్పంద పత్రం, పాసుపోర్టు లేదా ఏవైనా వినియోగ బిల్లులను అందించవచ్చు.

పౌరసత్వ ధ్రువీకరణ: కొన్ని సమయాలలో, మీరు పౌరసత్వ ధ్రువీకరణకు కూడా గుర్తింపు కార్డును చూపవలసి రావచ్చు. పాసుపోర్టు, ఓటరు కార్డు వంటివి ఇందుకు సరిపోతాయి.

PolicyX.com నుంచి టూ వీలర్ బీమాను తీసుకోవడం ఎలా?

మీరు ద్విచక్ర వాహనాన్ని వ్యక్తిగతంగా వాడుతున్న లేక వ్యాపారం కోసం వాడుతున్నా, ఈ అంశాలతో సంబంధం లేకుండా, బీమా మీ టూ వీలర్ కు రక్షణ అందిస్తుంది.

PolicyX.com లో, మెరుగైన బ్రాండ్ల యొక్క టూ వీలర్ పాలసీలను మరియు ఉచిత బీమా కొటేషన్లను మీరు పొందవచ్చు.అలాగే పాలసీలను సరిపోల్చుకుని ఉత్తమ పాలసీ ఎంచుకోవచ్చు. మీ ద్విచక్ర వాహనానికి బీమా తీసుకోవడానికి క్రింది పద్దతిని మీరు అనుసరించండి-

1: PolicyX.com పేజీ పైభాగంలో కుడి వైపున ఉన్న‘టూ వీలర్ బీమా కొటేషన్లను పోల్చుకోండి’ విభాగంపై క్లిక్ చేయండి. 

2: మీ ద్విచక్ర వాహన వివరాలను ఇచ్చి ‘ముందుకు’ పై నొక్కండి. 

3: అవసరమైన ఇతర వివరాలను ఇచ్చి ‘ముందుకు’ పై క్లిక్ చేయండి. 

4: వివిధ ఫీచర్లు, కవరేజీ, ప్రయోజనాలు, సౌకర్యాలు, ప్రీమియం మొదలైన విషయాలలో కొటేషన్లను పోల్చుకోండి. మీ అవసరాలకు సరిపోయే పథకాన్ని ఎంచుకోండి. 

5: ‘కొనండి’ ట్యాబుపై నొక్కి చెల్లింపు చేయండి. 

6: కొనుగోలు పూర్తైంది. మీ ద్విచక్ర వాహనం అత్యుత్తమ బీమా పథకాన్ని పొందింది.

టూ వీలర్ భీమాను పునరుద్ధరించండి

టూ వీలర్ భీమాను పునరుద్ధరించండి

టూ వీలర్ బీమా కొనడానికి PolicyX.com నే ఎందుకు ఎంచుకోవాలి?

ప్రస్తుత కాలంలో ద్విచక్ర వాహన బీమాను అనేక సంస్థలు వినియోగదారులకు అందిస్తున్నాయి. మార్కెట్లో ఉన్న అన్ని టూ వీలర్ బీమాలను పోల్చుకోవడం కష్టం అలాగే ఒక్కోసారి మంచి పాలసీని తీసుకోవడంలోనే విఫలమౌతారు.

అయితే, PolicyX.com లో మీరు పైసా ఖర్చు చేయకుండా వివిధ బీమా పథకాలను మీ అవసరాలకు అనుగుణంగా పోల్చుకుని అత్యుత్తమ బీమాని కొనుగోలు చేయవచ్చు. టూ వీలర్ బీమా కొనుగోలుకు PolicyX.com ను ఒక ఉత్తమమైన జాబితాదారు అనేందుకు క్రింద కొన్ని అంశాలు ఇవ్వబడ్డాయి..

ఉచితంగా పోల్చుకోవడం: భారతదేశంలో అనేక సంస్థలు ద్విచక్ర వాహన బీమా పథకాలను అందిస్తున్నాయి. వాటిలో మీరు ఉత్తమమైనది తీసుకోవాలనుకుంటే, మీరు ప్రతి బీమా పథకం యెక్క వివరాల్లోకి వెళ్లి వాటిని పోల్చుకోవాలి. అక్కడే PolicyX.com మీకు సహాయపడుతుంది. మీరు సులభంగా, ఏ ఇబ్బందీ లేకుండా వివిధ బీమాలను పోల్చుకుని, ఉత్తమమైన దానిని మీకు మీరే ఎంచుకునే సదుపాయాన్ని ఈ వేదిక అందిస్తుంది.

వినియోగదారుల వేదిక: PolicyX.com వినియోగదారులు సులభంగా వెబ్సైటులో చూడగలిగేలా మరియు ఏ ఆలస్యం లేదా అయోమయం లేకుండా అర్థం చేసుకోగలిగేలా యూజర్-ఫ్రెండ్లీ వేదికను కలిగి ఉంది.

అందుబాటు: మీరు ఎక్కడినుంచైనా మా వెబ్సైటును పూర్తిగా వాడుకోవచ్చు. మీకు కేవలం సాధారణ ఇంటర్నెట్ మరియు మొబైల్ ఉంటే చాలు వాటి ద్వారా లాగిన్ అయి వివరాలను సులభంగా పొందవచ్చు.

చేర్పులు మరియు మినహాయింపులు

ఇతర బీమా పథకాల లాగే, టూ వీలర్ బీమా పథకాలకు కూడా చేర్పులూ మరియు మినహాయింపులూ ఉంటాయి. ఈ జాబితా కొంచెం పెద్దగానే ఉంటుంది, అయితే, అన్ని సంస్థలూ సాధారణంగా పేర్కొనే కొన్ని విషయాలను క్రింద ప్రస్తావించాము. ఒకసారి పరిశీలించండి.

కవర్ అయ్యేవి

 • ప్రమాదం, దొంగతనం లేక దాడులు, ధర్నాలు, అగ్ని ప్రమాదం, తీవ్రవాద చర్యల వంటి ఇతర మానవ సంబంధిత సంఘటనల సందర్భాలలో మీ టూ వీలర్ కు అయ్యే నష్టం లేదా హానిని కవర్ ఈ పథకం చేస్తుంది.
 • అగ్ని ప్రమాదం, భూకంపం లేదా వేరేదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల మీ టూ వీలర్ కు అయ్యే నష్టం లేదా హాని
 • థర్డ్ పార్టీకి చేయాల్సి వచ్చే చెల్లింపుల నుంచి థర్డ్ పార్టీ లైబిలిటీ బీమా మిమ్మల్ని (పాలసీదారు) కాపాడుతుంది. 
 • శాశ్వత వైకల్యం లేదా మరణ సందర్భాలలో, వ్యక్తిగత ప్రమాద కవరేజీ వర్తిస్తుంది.

కవర్ కానివి

 • మద్యం మత్తులో లేదా చట్టబద్దమైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా టూ వీలర్ ను నడిపే సమయంలో జరిగే ఏదైనా నష్టం
 • యుద్ధం లేదా న్యూక్లియర్ ప్రమాదాల కారణంగా జరిగిన నష్టం
 • చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాద నష్టం
 • కాలంతో పాటుగా వాహనానికి వచ్చే ఇబ్బందులు మరియు లోపాలకు చేసే మెకానికల్ మరమ్మత్తుల ఖర్చులు ఈ పథకం కింద కవర్ అవ్వవు.

టూ వీలర్ బీమా పథకాన్ని పునరుద్ధరించుకోవడం ఎలా?

PolicyX.com ద్వారా మీరు మీ ఇంటి నుంచే సౌకర్యవంతంగా మీ ద్విచక్ర వాహన బీమాను సులభంగా పునరుద్ధరించుకునే(రెన్యువల్) సౌలభ్యాన్ని మీకు అందిస్తుంది. ఈ పద్దతిని గురించి తెలుసుకోండి.

 • PolicyX.com పేజీ పైభాగంలో ఉన్న‘టూ వీలర్ కొటేషన్లను పోల్చుకోండి’ విభాగానికి వెళ్ళండి. 
 • మీ ద్విచక్ర వాహన వివరాలను ఇచ్చి ‘ముందుకు’ పై నొక్కండి. రెన్యువల్ ట్యాబుపై క్లిక్ చేసి ప్రస్తుత పథకం యొక్క గడువు తేదీ వివరాలను ఇవ్వండి. 
 • అవసరమైన ఇతర వివరాలను ఇచ్చి ‘ముందుకు’ పై క్లిక్ చేయండి. 
 • మీరు పునరుద్ధరించుకోవాలనుకునే పథకాన్ని ఎంచుకోండి.
 • చెల్లింపు చేయండి. 
 • మీరు మీ పాలసీ పత్రాలను మెయిల్ లో పొందుతారు.
 • మీకు ఏవైనా సందేహాలుంటే, మా నిపుణుల బృందాన్ని సంప్రదించండి.

టూ వీలర్ బీమా చెల్లింపును పొందడం ఎలా?

 1. టోల్-ఫ్రీ నంబర్ పై మీ బీమా సంస్థను సంప్రదించి, మీ పాలసీ నంబర్, తేదీ మరియు సంఘటన జరిగిన సమయం వంటి అవసరమైన వివరాలను ఇవ్వండి. ఒకవేళ మీ వాహనం, మరొక వాహనంతో ఢీకొని ఉంటే, ఆ వాహనం యొక్క వివరాలు కూడా రాసి ఉంచుకోండి.
 2. ప్రమాదాలు మరియు దొంగతనాల సందర్భంలో పోలీసులకు తప్పకుండా తెలియజేయాలి. దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎఫ్ఐఆర్ ను నమోదు చేయించి ఒక ఎఫ్ఐఆర్ కాపీని మీ వద్ద ఉంచుకోండి.
 3. సంఘటన ప్రదేశం వద్ద తనిఖీ చేయడానికి మరియు మీ వాహనాన్ని పరిశీలించడానికి బీమా సంస్థ నుంచి అధికారి రావచ్చు. ఒకవేళ ఏ అధికారి రాకపోతే మీరు మీ ద్విచక్ర వాహనానికి మరమ్మత్తు చేయించుకోవచ్చు.
 4. మీరు నెట్వర్క్ గ్యారేజీకి వెళ్ళవచ్చు లేదా ఏదైనా ఇతర రిపేర్ షాపుకు వెళ్ళవచ్చు.
 5. మీరు నెట్వర్క్ గ్యారేజీకి వెళ్ళినట్లయితే, మీ టూ వీలర్ మరమ్మత్తుకు నగదు రహిత చెల్లింపును కోరవచ్చు. అప్పుడు మరమ్మత్తుల చెల్లింపును నేరుగా మీ బీమా సంస్థ గ్యారేజీ సూపర్వైజర్ ని సంప్రదించి చేస్తుంది.
 6. ఒకవేళ మీరు నెట్వర్క్ గ్యారేజీ కాని చోట మరమ్మత్తు చేయిస్తే, చెల్లింపు అభ్యర్థన పత్రంతో పాటుగా అవసరమైన పత్రాలను మీ బీమా సంస్థకు అందించి తిరుగు చెల్లింపును మీరు కోరవచ్చు. అప్పుడు సంస్థ ఆ వివరాలను పరిశీలించి, ధృవీకరించుకొని, తిరుగు చెల్లింపును నేరుగా NEFT ద్వారా మీ బ్యాంకు అకౌంట్లో వేస్తుంది.