యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ
 • చౌకైన కారు బీమా కొనండి
 • కారు భీమాను ఆన్‌లైన్‌లో పునరుద్ధరించండి
 • మూడవ పార్టీ మరియు యాడ్-ఆన్ కవర్
PX step

కారు బీమా కొటేషన్లను ఆన్లైన్లో పోల్చుకోండి

లేదా

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన బీమా సంస్థల్లో ఒకటి. ఇది ఫిబ్రవరి 1, 1938 సంవత్సరంలో స్థాపించబడింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థలో 22 బీమా సంస్థలు విలీనం చేయబడ్డాయి. జాతీయం చేయబడిన తరువాత సంస్థ వృద్ధి వేగంగా జరిగింది. ప్రస్తుతం సంస్థలో 18300 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, దేశం వ్యాప్తంగా సంస్థ 1340 శాఖలను కలిగి ఉంది. ఈ సంస్థ భారతదేశంలో పురాతన మరియు విశ్వసనీయమైన బీమా సంస్థల్లో ఒకటి.

అన్ని రకాల సాధారణ బీమా పథకాలను సంస్థ అందిస్తోంది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. విస్తృత శ్రేణి ఉత్పత్తులను తక్కువ ధరలో వినియోగదారులకు సంస్థ అందిస్తోంది. సుమారు ఒక కోటి మందికి సంస్థ బీమా పాలసీలను అందించింది. కంపెనీ ఆరోగ్య బీమా, ట్రావెల్, మోటార్, బిజినెస్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను అందిస్తోంది. ఈ పాలసీలో వినియోగదారుల అవసరాల మేరకు బహుళ ఎంపికలు చేసుకోవచ్చు. బీమా రంగంలో యునైటెడ్ ఇన్సూరెన్స్ 2 దశాబ్దాల అనుభవాన్ని కలిగి ఉంది. యునైటెడ్ ఇన్సూరెన్స్ ఉత్తమ సేవల ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొంది.

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ వినియోగదారులను సులభంగా తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఇది వ్యక్తిగతంగా అయినా సమూహాలకు అయినా సమర్థవంతమైన సేవలు అందిస్తోంది. అన్ని బీమా పథకాలు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మరియు విస్తృత కవరేజీ అందించే విధంగా రూపొందించబడ్డాయి. క్లైయిమ్ సెటిల్‌మెంట్ పరంగా, సంస్థకు మంచి పేరు ఉంది. ఒఎన్ జిసి లిమిటెడ్, ముంబై ఇంటర్ నేషనల్ ర ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ వంటి ప్రసిద్ధ మరియు పెద్ద సంస్థలకు యునైటెడ్ ఇన్సూరెన్స్ సంస్థ విజయవంతంగా సేవలు అందించింది.

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ (యుఐఐసి) గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యుత్తమ కవరేజీతో బీమా పథకాలను అందించే మొదటి సంస్థగా చెప్పుకోవచ్చు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ మధ్యప్రదేశ్ లో 45 లక్షల మంది మహిళలకు భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో విజయ రాజీ జననీ కళ్యాణ్ యోజన అనే యూనివర్స్ ల్ ఆరోగ్య బీమా పథకాన్ని అందించింది. అలాగే భవిష్యత్తులో సునామీ జన బీమా యోజన అనే పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మొత్తం నాలుగు రాష్ట్రాల్లో సుమారు 4.59 లక్షల కుటుంబాలకు ఈ బీమా పథకం కవరేజీ అందించనుంది. అలాగే నేషనల్ లైవ్ స్టాక్ కోసం వివిధ బీమా పథకాలను అందిస్తోంది. 

యునైటెడ్ ఇన్సూరెన్స్ - ఉత్పత్తులు& సేవలు

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ అన్ని రకాల సాధారణ బీమా పాలసీలను అందిస్తోంది. ఇది ఆరోగ్య బీమా, వాహన బీమా, ట్రావెల్ బీమా , గ్రామీణ బీమా మరియు వ్యాపార బీమాకు సంబంధించిన అన్ని రకాల పాలసీలను అందిస్తుంది. సంస్థ చాలా సంవత్సరాల నుండి బీమా వ్యాపారంలో ఉంది మరియు అన్ని ఉత్పత్తులను వేర్వేరు విభాగాలుగా విభజించింది. సంస్థ విస్తృతమైన, సమర్థవంతమైన మరియు సహాయక ఉత్పత్తులను అందిస్తోంది.

నిపుణులైన సిబ్బంది సహాయంతో, సంస్థ సమర్థవంతమైన మరియు విస్తృతమైన ఉత్పత్తులను అందిస్తోంది. సంస్థ వినియోగదారుల సంతృప్తికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. అందువల్ల ఇది వినియోగదారుల అవసరాలను సులభంగా తీర్చగల సమర్థవంతమైన ఉత్పత్తులను అందించడానికి ప్రయత్నిస్తుంది. 

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ అందించే అన్ని ఉత్పత్తుల జాబితా గురించి క్రింద వివరించడం జరిగింది. ఈ జాబితాను పరిశీలించి మీ అవసరాల మేరకు మీకు అనువైన బీమా పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

1. యునైటెడ్ ఇండియా ఆరోగ్య బీమా


యునైటెడ్ ఇండియా ఆరోగ్య బీమా సంస్థ ప్రసిద్ధ జనరల్ ఇన్సూరెన్స్  సంస్థగా చెప్పుకోవచ్చు. ఇది సుదీర్ఘ కాలంగా మంచి మార్కెట్ ఖ్యాతిని కలిగి ఉంది. సంస్థ సమర్థవంతమైన ఆరోగ్య బీమా పథకాలను అందిస్తోంది. ఈ బీమా పథకాలు విస్తృత కవరేజీని కలిగి ఉండటంతో , మీ అవసరానికి అనుగుణంగా ఉత్తమ పథకాన్ని సులువుగా ఎంచుకోవచ్చు. సంస్థ అందించే బీమా పథకాలు మీ అత్యవసర వైద్య పరిస్థితులను ఎదుర్కునే విధంగా మీకు ఆర్థిక రక్షణ కల్పిస్తాయి.

2. యునైటెడ్ ఇండియా కారు బీమా పథకాలు


యునైటెడ్ ఇండియా సమర్థవంతమైన మరియు విస్తృత కవరేజీని కలిగిన కారు బీమా పథకాలను అందిస్తోంది. కేవలం కారు బీమానే కాకుండా టూ వీలర్ బీమాను కూడా సంస్థ అందిస్తోంది. అలాగే

అన్ని బీమా పథకాలు అందుబాటులో ధరలో లభిస్తాయి. బీమా పథకాలపై ఆకర్షణీయమైన బోనస్ లను కూడా సంస్థ అందిస్తోంది.

 1. మోటర్ కవరేజీ మరియు లయాబెలిటి పాలసీలు
 1. కార్లు, టూ వీలర్ మరియు వాణిజ్య వాహనాలకు కవరేజీ
 1. ఓన్ -డ్యామేజీ ప్యాకేజీ
 1. దోపిడి, ఇల్లు డ్యామెజీ, దొంగతనం కారణంగా వాహనాలకు జరిగే నష్టం
 1. లయాబెలిటి ప్యాకేజీ పాలసీ

3. ట్రావెల్ ఇన్సూరెన్స్


ఇతర విభాగాలాన్నే ట్రావెల్ ఇన్సూరెన్స్ ను కూడా సంస్థ అందిస్తోంది. సింగిల్ ట్రిప్ లేదా

మల్టిపుల్ ట్రిప్ కోసం ఈ బీమా పథకాన్ని ఎంచుకోవచ్చు. అలాగే విదేశాల్లో చదువుకునే

విద్యార్థుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నాయి. అన్ని పథకాలు ఆకర్షణీయమైన మరియు ప్రభావవంతమైన ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.

4. హోమ్ ఇన్సూరెన్స్


ఇల్లు అనేది వ్యక్తి జీవితంలో విలువైన విషయం మరియు ఇంటికి రక్షణ కల్పించడం కూడా అంతే ముఖ్యం. దీనిని దృష్టిలో పెట్టుకుని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ మీ అవసరాలకు అనుగుణంగా అనేక హోమ్ ఇన్సూరెన్స్ పథకాలను అందిస్తుంది.

5. వ్యాపార బీమా


అన్ని రకాల వ్యాపార యజమానులకు సమర్థవంతమైన కవరేజీ అందించే విధంగా ఈ బీమా పథకం రూపొందించడం జరిగింది. మిమ్మల్ని మరియు మీ వ్యాపారాలను అత్యవసర పరిస్థితులు లేదా నష్టాల నుంచి ఈ బీమా పథకం రక్షిస్తుంది. కాబట్టి ఈ బీమా కలిగి ఉండటం అత్యవసరం. పైన పేర్కొన్న ప్రజాదరణ పొందిన బీమా పాలసీలతో పాటు వ్యాపారుల కోసం సంస్థ అనేక ఉత్తమమైన పాలసీలను అందిస్తోంది. దుకాణ దారుడి పాలసీ , మైరెన్ ఇన్సూరెన్స్ , లయాబెలిటి బీమా లాంటి మరెన్నో బీమా పథకాలను అందిస్తోంది. వ్యాపారులు మొదట బీమా పాలసీ కలిగి ఉండవలసిన అవసరాన్ని అర్థం చేసుకోవడం అత్యవసరం. ఈ బీమా పథకాల సాయంతో డబ్బును మరియు విలువైన సమయాన్ని ఆదా చేయవచ్చు.

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థకి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది చాలా సంవత్సరాల నుండి బీమా వ్యాపారంలో ఉంది. ప్రజలకు సంస్థపై ఆపార నమ్మకం ఉంది. అలాగే సంస్థ ఉత్పత్తులను ఎంతో కాలం నుంచి ఎంచుకుంటున్నారు. ఈ సంస్థ గత కొన్నేళ్లుగా అద్భుత వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ కారణంగానే ఎక్కువ మంది వినియోగదారులు ఈ సంస్థ వైపు ఆకర్షితులవుతున్నారు.

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఆన్ లైన్

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స(యుఐఐసి) సంస్థ తన వినియోగదారులకు ఆన్ లైన్ ద్వారా సమర్థవంతమైన పాలసీలను సులువుగా కొనుగోలు చేసే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా మీరు పాలసీ ఫీచర్లు, చేర్పులు మరియు ఎక్స్ క్షన్స్ ను పాలసీదారుడు సులభంగా పోల్చుకోవచ్చు. కాబట్టి సరైన బీమా పథకాన్ని ఎంచుకోవచ్చు. చాలా మంది ఆన్‌లైన్ లో పాలసీ కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇది సమయం మరియు డబ్బు ఆదా చేయడంలో చాలా సహాయపడుతుంది.

 అలాగే ఆన్‌లైన్ ద్వారా పాలసీదారుడు సులభంగా పాలసీని పునరుద్దరణ చేసుకోవచ్చు. ఈ సదుపాయంతో , మీరు కోరుకున్న పాలసీని కొనడానికి లేదా ఇప్పటికే ఉన్న పాలసీని పునరుద్దరించుకోవడానికి కార్యాలయాల వద్ద సుదీర్ఘ క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేదు.

పైన చర్చించినట్లుగా కంపెనీ విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందిస్తోంది. ప్రజలకు అవసరమైన అత్యంత సాధారణ ఉత్పత్తులు మరియు ప్రణాళికలు జాబితా క్రింది వివరించడం జరిగింది. అన్ని ఉత్పత్తులను విభాగాలుగా విభజించడం జరిగింది. తద్వారా ఉత్తమమైనదాన్ని వినియోగదారులు ఎంచుకోవచ్చు.

1. ఫ్యామిలీ మెడికేర్


కుటుంబ సభ్యులందరికీ ఈ పాలసీ కింద కవరేజీ అందించవచ్చు. రూ. ఒక లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు ఎంచుకోవచ్చు. అలాగే రూ. 50,000 నుంచి రూ. 5 లక్షల వరకు, రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలు వరకు బీమా మొత్తాన్ని ఎంచుకోవచ్చు.

ప్రధాన ఫీచర్లు

 1. బీమా మొత్తం కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుంది.
 1. కుటుంబంలో వ్యక్తిగత, భాగస్వామి మరియు ఆధారపడ్డ పిల్లలకు పాలసీ కవరేజీ అందిస్తుంది.
 1. పాలసీ తీసుకునే వ్యక్తి వయసు 18 నుంచి 80 సంవత్సరాల మధ్య ఉండాలి.
 1. హాస్పిటలైజేషన్ ఖర్చులు.
 1. ప్రీ హస్పిటలైజేషన్ ఖర్చులు అంటే ఆసుపత్రిలో చేరే 30 రోజుల ముందు ఖర్చులు మరియు పోస్ట్ హస్పిటలైజేషన్ ఖర్చులు అంటే డిశ్చార్జి అయిన తర్వాత 60 రోజుల వరకు ఆసుపత్రి ఖర్చులను భరిస్తుంది.
 1. 24 గంటలు కన్నా తక్కువ సేపు ఆసుపత్రిలో చేరి ఉంటే నిర్దిష్ట ఖర్చులకు చెల్లించబడతాయి.

2. ఫ్యామీలి మెడికేర్ 2014


ప్రాథమిక కుటుంబ మెడికేర్ ప్రయోజనాలతో పాటు ఇది అనేక అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య బీమా మొత్తాన్ని ఎంచుకోవచ్చు. అలాగే రూ. 50,000 నుంచి రూ. 5 లక్షలు మరియు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఎంపికలు చేసుకోవచ్చు.

ప్రధాన ఫీచర్లు

 1. పాలసీ తీసుకునే వ్యక్తి వయసు 18 నుంచి 80 సంవత్సరాల్లోపు వయసు ఉండాలి.
 1. కుటుంబంలో స్వీయ, భాగస్వామి మరియు ఆధారపడ్డ పిల్లలకు పాలసీ కవరేజీ అందిస్తుంది.
 1. హాస్పిటలైజేషన్ ఖర్చులు.
 1. ప్రీ హాస్పిటలైజేషన్ ఖర్చులు అంటే ఆసుపత్రిలో చేరే 30 రోజులకు ముందు ఖర్చులు మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత 60 రోజుల వరకు అయ్యే ఖర్చులను పాలసీ చెల్లిస్తుంది.
 1. ప్రభుత్వ ఆసుపత్రిలో లేదా ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఆసుపత్రిలో , క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు చేత గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో చికిత్స పొందాలి.

3. బంగారం


ఈ పాలసీ తీసుకోవడానికి ప్రవేశ వయసు 36 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఎటువంటి విరామం లేకుండా పాలసీదారుడు 60 సంవత్సరాల వయసు వరకు పాలసీని పునరుద్దరణ చేసుకుని కవరేజీ పొందవచ్చు.

ప్రధాన ఫీచర్లు

 1. 3 నెలల నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు ఈ పాలసీ కవరేజీ అందిస్తుంది లేదా తల్లిదండ్రులతో కలిపి పాలసీ తీసుకోవచ్చు.
 1. రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు బీమా మొత్తాన్ని ఎంచుకోవచ్చు.
 1. 24 గంటల్లోపు ఆసుపత్రిలో ఉంటే నిర్దిష్ట ఖర్చులకు పాలసీ చెల్లింపు చేస్తుంది.
 1. పాలసీ తీసుకున్న మొదటి 15 రోజుల వరకు ఫ్రీ లుక్ పిరియడ్ ఉంటుంది.
 1. దేశ వ్యాప్తంగా 7000 పైగా నెట్ వర్క్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యాన్ని పొందే సౌకర్యం.

4. వ్యక్తిగత మెడిక్లైయిమ్


ఈ ప్రభావంతమైన ఆరోగ్య బీమా పథకం నిర్దిష్ట వ్యాధులకు, ప్రమాదం లేదా అత్యవసర వైద్య పరిస్థితి నుంచి రక్షణ కల్పిస్తుంది.

ప్రధాన ఫీచర్లు

 1. హాస్పిటలైజేషన్ ఖర్చులు.
 1. 24 గంటలు దాటి ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రి ఖర్చులు చెల్లించబడతాయి.
 1. డొమిసిలియరీ హస్పిటలైజేషన్ ఖర్చులు.
 1. ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు.

5. ప్లాటినం


పాలసీదారుడు అనారోగ్యం, గాయం కారణంగా ఆసుపత్రి చేరితే, ఆసుపత్రి ఖర్చులకు 

ఈ పాలసీ కవరేజీ అందిస్తుంది. ఈ పాలసీ కొన్ని డేకేర్ విధానాలకు కూడా కవరేజీ ఇస్తుంది.

ప్రధాన ఫీచర్లు

 1. పాలసీ ప్రవేశ వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన పాలసీదారుడు ఎటువంటి విరామం లేకుండా పాలసీని పునరుద్దరిస్తే ప్లాటినం బీమా పాలసీ పూర్తి కవరేజీ అందిస్తుంది.
 1. 3 నెలల నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలకు లేదా తల్లిదండ్రులకు లేదా ఇద్దరికి ఒకేసారి కవరేజీ అందించవచ్చు.
 1. రూ. 1 లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు బీమా మొత్తాన్ని ఎంచుకోవచ్చు.
 1. దేశ వ్యాప్తంగా 7000కి పైగా ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సౌకర్యం.
 1. పాలసీ ప్రారంభంలో 15 రోజుల వరకు ఫ్రీ లుక్ పిరియడ్ ఉంటుంది.

6. సీనియర్ సిటిజన్


ఈ బీమా పథకం సీనియర్ సిటిజన్ కోసం రూపొందించబడింది. ఈ బీమా పథకం ఉత్తమ ప్రయోజనాలు మరియు విస్తృత కవరేజీని అందిస్తుంది.

ప్రధాన ఫీచర్లు

 1. ప్రీ హాస్పిటలైజేషన్ ఖర్చులు అంటే ఆసుపత్రిలో 30 రోజుల్లో చేరే ముందు ఖర్చులు మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఆసుపత్రిలో చేరిన తర్వాత 60 రోజులు తర్వాత ఆసుపత్రి ఖర్చులు లేదా బీమా మొత్తంలో 10 శాతం రెండింటిలో ఏది ఎక్కువ అయితే అది చెల్లించబడుతుంది.

2.పాలసీని స్వీయంగా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి వ్యక్తిగత పాలసీ తీసుకుంటే పాలసీ మొత్తంపై 5 శాతం రాయితీ లభిస్తుంది.

 1. దేశ వ్యాప్తంగా 7000 ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సదుపాయం.
 1. ప్రతి మూడు సంవత్సరాలకొకసారి ఉచిత మెడికల్ చెకప్, అయితే క్లైయిమ్ ఫ్రీ సంవత్సరం మరియు ఎటువంటి బ్రేక్ లేకుండా పునరుద్దరణ జరిగితేనే ఈ సదుపాయం లభిస్తుంది.

7. సూపర్ టాప్- అప్


పాలసీ కాల వ్యవధిలో పాలసీదారుడు అనారోగ్యం, గాయపడి ఆసుపత్రి పాలైతే , ఆసుపత్రి

ఖర్చులకు ఈ పాలసీ కవరేజీ అందిస్తుంది. అలాగే కొన్ని డేకేర్ విధానాలకు కూడా ఈ పాలసీ కవరేజీ అందిస్తుంది.

ప్రధాన ఫీచర్లు

 1. స్వీయ, భాగస్వామి మరియు ఆధారపడ్డ పిల్లలకు తీసుకున్న పాలసీకి చెల్లించే ప్రీమియం ఆధారంగా సెక్షన్ 80- డి క్రింద పన్ను ప్రయోజనం లభిస్తుంది.
 1. ప్రతి మూడు సంవత్సరాలకోకసారి ఉచిత మెడికల్ చెకప్ ఉంటుంది. అయితే క్లైయిమ్ ఫ్రీ సంవత్సరం మరియు పాలసీ ప్రీమియంను ఎటువంటి విరామం లేకుండా చెల్లించాలి.
 1. కుటుంబం మొత్తానికి పాలసీ తీసుకుంటే 5 శాతం వరకు రాయితీ లభిస్తుంది.
 1. 24 గంటలు కంటే తక్కువ ఆసుపత్రి చికిత్స అవసరమైన డేకేర్ విధానాలకు పాలసీ కవరేజీ అందిస్తుంది.

8. టాప్ అప్


హాస్పిటలైజేషన్ సందర్భంలో బీమా చేసిన మొత్తం కంటే ఖర్చు ఎక్కువైతే అదనపు ఖర్చులను ఈ పాలసీ కవర్ చేస్తుంది. అలాగే అదనపు రీయింబర్స్ ను కూడా చెల్లిస్తుంది.

ప్రధాన ఫీచర్లు

 1. పాలసీ వ్యక్తిగతంగా మరియు ఫ్లోటర్ విధానంలో అందుబాటులో ఉంటుంది.
 1. వ్యక్తిగత ప్రాతిపదికన - ఒకే బీమా పాలసీ మొత్తం కింద కుటుంబ సభ్యులను మరియు తల్లిదండ్రులకు కవరేజీ అందించవచ్చు. అలాగే కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఒకే పాలసీ క్రింద వివిధ బీమా మొత్తాలను కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా అందించవచ్చు.
 1. గ్రూప్ ప్రాతిపదికన- ఒకే బీమా పాలసీ క్రింద కుటుంబ సభ్యులందరికీ కవరేజీ అందించవచ్చు. తల్లిదండ్రులకు విడిగా బీమా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది.
 1. పాలసీ తీసుకునే వ్యక్తి వయసు 18 నుంచి 80 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే 3 నెలల నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు కవరేజీ తీసుకోవచ్చు. అయితే 18 సంవత్సరాల వయసు దాటి ఉద్యోగం చేస్తున్న లేదా వివాహం అయినా ఈ పాలసీ వర్తించదు.
 1. వివిధ ఆప్షన్లు మరియు బీమా మొత్తాలను ఈ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు.

9. యూని క్రిటికేర్


ఈ పాలసీలో రూ. 1 లక్ష, రూ . 3 లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 10 లక్షలు వివిధ మొత్తాలను ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ ప్రారంభించిన తేదీ నుంచి 90 రోజుల వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది. అలాగే రొగ నిర్థారణ తర్వాత 30 రోజులు సర్వైయల్ పిరియడ్ ఉంటుంది.

ఈ పాలసీ క్రింది పేర్కొన్న తీవ్రమైన వ్యాధులకు కవరేజీ అందిస్తుంది..

 1. తీవ్రమైన క్యాన్సర్
 2. మొదటి గుండె పోటు- పేర్కొన్న తీవ్రత
 3. కొరోనరీ ఆర్టరీ సర్జరీ ఓపెన్ చెస్ట్ క్యాగ్ 
 4. హార్ట్ వాల్వ్ రీప్లేస్ మెంట్ 
 5. నిర్దేశిత తీవ్రత కలిగిన కోమా
 6. కిడ్నీ వైఫల్యం
 7. 7.శాశ్వత లక్షణాలతో కూడిన స్ట్రోక్ 
 8. 8.ప్రధాన అవయవం/ ఎముక మజ్జ మార్పిడి
 9. 9.మల్టిపుల్ స్క్లే రోసిస్ వ్యాధి
 10. శాశ్వత లక్షణాలతో కూడిన మోటార్ న్యూరాన్ వ్యాధి
 11. 12.అవయవాల శాశ్వత పక్షవాతం

10. వర్క్ మెన్ మెడికేర్ పాలసీ


 ఉపాధి సమయంలో కార్మికులు అనారోగ్యం లేదా ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరితే,

ఆసుపత్రి ఖర్చులకు ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది.

ప్రధాన ఫీచర్లు

 1. హాస్పిటలైజేషన్ ఖర్చులు.
 1. ఫ్యాక్టరీ యజమానులు, కాంట్రాక్టర్లు, ఇతర వాణిజ్య సంస్థల కోసం ఈ పాలసీ రూపొందించబడింది, అలాగే ఉపాధి సమయంలో కార్మికులు ప్రమాదానికి గురైతే ఈ బీమా పథకం ఆసుపత్రి ఖర్చులకు పూర్తి కవరేజీ అందిస్తుంది.
 1. రూ.50,000, రూ. 1 లక్ష మరియు రూ. 1.5 లక్షల విలువైన బీమా మొత్తాలను ఎంచుకోవచ్చు.

11. యాక్సిడెంట్ మరియు హాస్పిటలైజేషన్ పాలసీలు


విదేశీ పర్యటనలలో సంభవించే ప్రమాదం లేదా వ్యాధికి అయ్యే వైద్య చికిత్స కోసం అయ్యే ఖర్చులకు కవరేజీ అందిస్తుంది. అలాగే పాలసీదారుడు అనుకోకుండా పాస్ పోర్ట్ కోల్పోతే ఈ బీమా పథకం కవరేజీ అందిస్తుంది.

ఫీచర్లు

 1. వైద్య ఖర్చులు మరియు స్వదేశానికి తిరిగి వచ్చే కవరేజీ.
 1. విమాన ప్రమాదానికి సంబంధించి వ్యక్తిగత ప్రమాద కవరేజీ.
 1. పాస్ పోర్ట్ కోల్పోతే కవరేజీ.

12. ట్రావెల్ పాలసీ


ఈ పాలసీ సామాన్లుకు కవరేజీ అందిస్తుంది, అంటే ప్రయాణ సమయంలో మన వెంట తీసుకువెళ్లే సూట్ కేస్ మరియు ఇతర సామానులకు కవరేజీ అందిస్తుంది. ప్రయాణ సమయంలో సామాన్లు పోయినా లేదా దెబ్బతిన్నా ఈ పాలసీ కవరేజీ అందిస్తుంది.

క్లైయిమ్ రేషియో నిష్పత్తి

భారతదేశంలో అనేక జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు ఉన్నాయి. కాని ప్రభుత్వ రంగ బీమా సంస్థలు వినియోగదారులకు ఎల్లప్పుడూ ఉత్తమ ఎంపికగా ఉంటాయి. ఎందుకంటే ఈ బీమా సంస్థలు అధిక క్లైయిమ్ సెటిల్‌మెంట్ పరంగా ఉత్తమమైన సేవలు అందిస్తాయి. ఇందువల్ల పాలసీదారులు తమ పాలసీ నుండి ప్రయోజనాలను పొందగలరు. మీ అవగాహన కోసం క్రింది క్లైయిమ్ నిష్పత్తి పట్టిక ఇవ్వబడింది.

నెంబర్

బీమా సంస్థ

క్లైయిమ్ నిష్పత్తి(2016-2017)

క్లైయిమ్ నిష్పత్తి(2017-2018)

1.

అపోలో మ్యూనిచ్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ 

54.99

62.46

2.

బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ 

78.50

77.61

3.

భారతి ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ 

76.88

98.50

4.

చోళమండలం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ

40.07

39.96

5.

మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ

48.14

46.29

6.

ఫ్యూచర్ జనరలి ఇన్సూరెన్స్ కంపెనీ 

78.93 

87.42

7.

హెచ్ డి ఎఫ్ సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్

50.76

52.58

8.

ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ 

104.30

90.69

9.

లిబర్చీ వీడియోకాన్ జనరల్ ఇన్సూరెన్స్

74.37

74.58

10.

మాగ్మా హెచ్ డిఐ జనరల్ ఇన్సూరెన్స్

181.20

34.93

11.

మాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ

51.96

50.19

12.

న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థ

102.94 

103.19

13.

నేషనల్ ఇన్సూరెన్స్ సంస్థ

126.98

115.55

14.

ఓరియంటల్ క్యూబీఈ జనరల్ సంస్థ

118.23 

113.86

15.

రహేజా క్యూబిఈ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ

126.70

18.19

16.

రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ 

91.39

106.54